MohanPublications Print Books Online store clik Here Devullu.com

అర్ధరాత్రి ఆకలేస్తే? MohanPublications GRANTHANIDHI BHAKTIPUSTAKALU

                        అర్ధరాత్రి ఆకలేస్తే?








 దువుల వేళ ప్రాజెక్టు రిపోర్టులూ, ఉద్యోగమన్నాక ప్రత్యేక అసైన్‌మెంట్లూ, అవి రెండూలేకపోతే ఏదో ఒక మంచి సినిమా.. కారణం ఏదైనాకానీ మనం అర్ధరాత్రిపూట మేల్కొని ఉండటం తప్పడంలేదు. అలాంటప్పుడు ఆకలేస్తే ఏదో ఒకటి తినడం మామూలే. కానీ ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఆహారం ఎంచుకోవాలంటున్నారు నిపుణులు. జీర్ణశక్తి అత్యంత తక్కువగా ఉండే సమయం అది. కాబట్టి కెలొరీలూ, నూనెలూ, కొవ్వులూ తక్కువుండే ఆహారాన్ని ఎంచుకోవాలి. మచ్చుకివి చూడండి..


పెరుగు: ప్రొటీన్లు పుష్కలంగా లభిస్తాయిందులో. జీర్ణశక్తికి దోహదపడే ప్రొ-బయోటిక్స్‌ కూడా పుష్కలంగా ఉంటాయికాబట్టి ఏ సమస్యా ఉండదు. కెలొరీల సమస్యేలేదు. చల్లదనం వల్ల కాస్త చురుగ్గానూ అనిపిస్తుంది.



కీరా.. క్యారెట్‌: తొంభై ఆరుశాతం నీరు ఉంటుంది ఇందులో. ఆకలి అదుపులో ఉండి కడుపునిండిన భావన కలుగుతుంది. పైగా శరీరంలోని నీటిశాతం తగ్గదు. అర్ధరాత్రి మేల్కొని ఉండటం వల్ల కళ్లు ఎర్రబారడం, వేడిచేయడం వంటి సమస్యల్ని తగ్గించొచ్చు. సన్నగా తరిగిన క్యారెట్లు కూడా ఇదే ఫలితాన్నిస్తాయి.



గుడ్లు: ఉడకబెట్టుకుని తినేయడం.. మంచిది. పోషకాలు పుష్కలంగా అందుతాయి. అప్పటికప్పుడే ఆకలి తీరుతుంది. చక్కగా ఆమ్లెట్‌ వేసుకోవచ్చు.. కానీ నూనె కాస్తంత చూసి వాడాలి.


పాప్‌కార్న్‌: ఉప్పు శాతం ఎక్కువగా ఉండే బంగాళాదుంప చిప్స్‌ కన్నా పాప్‌కార్న్‌కి ప్రాధాన్యం ఇవ్వండి. వాటిని ఇంట్లోనే తయారుచేసుకుని.. కొద్దిగా ఉప్పు చల్లుకుంటే చాలు. కెలొరీల సమస్య ఉండదు. తేలిగ్గా అరుగుతాయి.







No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list