MohanPublications Print Books Online store clik Here Devullu.com
Showing posts with label siva. Show all posts
Showing posts with label siva. Show all posts

పల్లికొండేశ్వరాలయం



SundayMagazine Sunday Magazine Eenadu Paper Bhakthi Pustakalu BhakthiPustakalu BhaktiPustakalu Bhakti Pustakalu



SundayMagazine Sunday Magazine Eenadu Paper Bhakthi Pustakalu BhakthiPustakalu BhaktiPustakalu Bhakti Pustakalu

 శయన శివుణ్ణి చూశారా?

  
SundayMagazine Sunday Magazine Eenadu Paper Bhakthi Pustakalu BhakthiPustakalu BhaktiPustakalu Bhakti Pustakalu

    బోళా శంకరుడిని తలచినంతనే మదిలో లింగరూపమే సాక్షాత్కరిస్తుంది. కశ్మీరు నుంచి కన్యాకుమారి వరకూ ఏ శివాలయానికి వెళ్లినా ఆ రూపమే దర్శనమిస్తుంది. పరమశివుడు భూలోకంలో లింగరూపంలోనే పూజలందుకుంటాడని పురాణ కథనం. కానీ, అందుకు అతీతంగా విగ్రహ రూపంలో కొలువైన శివుణ్ణి దర్శించుకోవాలంటే మాత్రం చిత్తూరు జిల్లాలోని సురుటుపల్లికి వెళ్లాల్సిందే.

     చుట్టూ పచ్చదనాన్ని ఇనుమడింపచేసే కొండలూ, పక్కనే సెలయేటి గలగలలను వినిపించే అరుణానదీ తీరం... ఇలా ఈ క్షేత్రంలో అణువణువూ ప్రకృతి ఒడిలో సేదతీరిన అనుభూతిని కలిగిస్తుంది. భక్తులపాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతున్న ఇక్కడి పళ్లికొండేశ్వరస్వామి ఆలయాన్ని విజయనగర సామ్రాజ్యానికి చెందిన హరిహర బుక్కరాయలు క్రీ.శ1344-77 మధ్యకాలంలో నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు తెలియజేస్తున్నాయి.

ఎలా వచ్చిందంటే... 
దుర్వాస మహాముని శాపం వల్ల ఇంద్రలోకంలోని దేవతలందరూ అమరత్వాన్ని కోల్పోయి, ముసలివాళ్లు అవుతారు. అప్పుడు ఇంద్రుడు మహావిష్ణువును శరణు కోరగా సముద్రగర్భంలోని అమృతాన్ని సేవిస్తే మీకు తిరిగి అమరత్వం సిద్ధిస్తుందని చెబుతాడు. దాంతో దేవతలు రాక్షసులతో ఒక ఒప్పందం కుదుర్చుకుని, మంథర పర్వతాన్ని కవ్వంగా, వాసుకి (పాము)ని తాడుగా చేసుకొని క్షీరసాగర మథనాన్ని చేపడతారు. ఈ క్రమంలో వాసుకి నొప్పిని భరించలేక హాలం అనే విషాన్ని విడుదలచేస్తుంది. అదే సమయంలో క్షీరసాగరం నుంచి హాలా అనే విషం బయటికి వస్తుంది. సమస్తలోకాలనూ దహించడానికి సిద్ధమైన ఆ కాలకూట విషాల బారి నుంచి రక్షించమని సురాసురులు శివుణ్ణి ప్రార్థిస్తారు. వారికి అభయమిచ్చిన పరమశివుడు విషాన్ని తానే మింగుతాడు. మహా శక్తిమంతుడైన శివుడుసైతం భయంకరమైన విష ప్రభావానికిలోనై పళ్లికొండేశ్వరస్వామి క్షేత్రంలోనే పార్వతీ దేవి ఒడిలో కాసేపు విశ్రమించాడట. శివుడు శయనించిన క్షేత్రం కాబట్టి దీనికి శివ శయన క్షేత్రం అనే పేరు వచ్చిందనే కథనం ప్రచారంలో ఉంది.

SundayMagazine Sunday Magazine Eenadu Paper Bhakthi Pustakalu BhakthiPustakalu BhaktiPustakalu Bhakti PustakaluSundayMagazine Sunday Magazine Eenadu Paper Bhakthi Pustakalu BhakthiPustakalu BhaktiPustakalu Bhakti Pustakalu




దివ్య రూపం 
సర్వమంగళ సమేత శ్రీపళ్లికొండేశ్వరస్వామి విగ్రహం 12 అడుగుల పొడవు ఉంటుంది. ఈ ఆలయంలో దేవతలూ, రుషులూ చుట్టూ నిలబడి ప్రార్థిస్తుండగా పార్వతీ దేవి ఒడిలో శయనిస్తున్నట్టు ఉండే స్వామివారి దివ్యరూపం భక్తులకు దర్శనమిస్తుంది. సురుళ్‌ అంటే దేవతలని అర్థం. విష ప్రభావానికిలోనైన స్వామివారు తిరిగి లేచేవరకూ బ్రహ్మ, మహావిష్ణువు మొదలైన దేవతలందరూ వచ్చి ఈ క్షేత్రంలోనే ఉన్నారట. అందుకే ఈ ప్రాంతానికి సురుటుపల్లి అనే పేరు వచ్చిందని స్థానికులు చెబుతారు. ఈ ఆలయంలోని శివుడి విగ్రహానికి అభిషేకానికి బదులు తమిళనాడు నుంచి తెచ్చిన చందన తైలాన్ని ప్రతి పదిహేను రోజులకోసారి పూస్తారు.

మరగదాంబిక... 
ఆలయంలోకి వెళ్లగానే ముందుగా మరగదాంబికా అమ్మవారు దర్శనమిస్తారు. శివుడు మింగిన విషం శరీరంలోకి వెళ్లకుండా భువనేశ్వరీ దేవి ఆయన కంఠాన్ని గట్టిగా పట్టుకుంటుంది. విషాన్ని ఆపి, జీవితాన్ని అమృతమయం చేసినందువల్లే ఆ తల్లి అముదాంబికై (మరగదాంబికా) అయ్యింది. అందుకే ఈ క్షేత్రంలో ముందుగా అమ్మవారినీ, ఆ తర్వాత స్వామివారినీ దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. వాల్మీకి మహర్షి తపస్సుకు మెచ్చిన శివుడు ఇక్కడ స్వయంభూగా వెలిశాడనీ, అందుకే ఇక్కడ కొలువైన దేవదేవుడిని వాల్మికేశ్వర స్వామిగా కూడా అర్చిస్తారనీ పండితులు చెబుతున్నారు.

సతీ సమేతంగా... 
దక్షిణామూర్తి గౌరీదేవితో కలిసి ఉండటం ఇక్కడి మరో ప్రత్యేకత. శివుడి 64 అవతారాల్లో దక్షిణామూర్తి అవతారం ఒకటి. ప్రతి ఆలయంలో మర్రిచెట్టు కింద కూర్చొని ఉండే స్వామివారు ఇక్కడ నందిపై ఆశీనుడై దర్శనమిస్తాడు. గౌరీ సమేత దక్షిణామూర్తిని దర్శించడం వల్ల వివాహం కానివారికి వివాహం అవుతుందనీ, సంతానంలేని వారికి సంతానం లభిస్తుందనీ భక్తుల విశ్వాసం.

ప్రదోషవేళ ప్రత్యేకం 
హాలాహలాన్ని సేవించిన శివుడు శయనించిన సమయంలో స్వామి నిర్వహించాల్సిన క్రతువులను నందీశ్వరుడు నెరవేరుస్తాడు. కోరిన వారికి వరాలిచ్చి భక్తులకు రక్షణగా నిలుస్తాడు. త్రయోదశి నాటి సాయంకాలం శివుడు కళ్లు తెరిచేటప్పటికి అందరూ నందిని పొగడటం చూసి, మహదానంద భరితుడై, ‘నందీ, నీకు ఏ వరం కావాలో కోరుకో’ అని అంటాడు. ‘రోజూ మీకు పూజ జరిగిన తర్వాత మీరు భుజించిన భోజన శేషాన్ని నేను భుజిస్తాను. కానీ త్రయోదశినాడు మాత్రం మొదటి పూజ నాకే చేయాల’ని కోరుకుంటాడు. ఇది జరిగింది శనిత్రయోదశినాడు కావడంతో అప్పటి నుంచీ శనిత్రయోదశి రోజున ప్రదోష కాలంలో మొదటి పూజను నందీశ్వరుడికే నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో నందికి నమస్కరించి, ఆయన చెవిలో మన కోర్కెలను విన్నవిస్తే అవి తప్పక నెరవేరతాయని భక్తుల నమ్మకం.



ఇలా చేరుకోవచ్చు... 
ఈ క్షేత్రానికి వెళ్లాలనుకునే వారు చిత్తూరు జిల్లా కేంద్రం లేదా తిరుపతి నుంచి పుత్తూరు చేరుకోవాలి. అక్కడి నుంచి చెన్నైకి వెళ్లే మార్గంలో 21 కిలోమీటర్లు ప్రయాణించి పళ్లికొండేశ్వరుడిని దర్శించుకోవచ్చు. పుత్తూరు నుంచి ప్రతి పావుగంటకూ ఒక ఆర్టీసీ బస్సు అందుబాటులో ఉంటుంది.







----------------------------------------
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా నందు గల 'సత్యవేడు'కు దగ్గరలో గల క్షేత్రం ఇది. అరుణానదీ తీరంలో గల ఈ క్షేత్రంలోని ఆలయం పేరు 'పల్లికొండేశ్వరాలయం'. శివశైవ క్షేత్రంగా ఇది ప్రసిద్ధి చెందినది. ఈ క్షేత్రంలో గరళం త్రాగిన శివుడు పరుండి యుంటే బయట ఏకాంతంగా నంది ఉంటుంది. స్వయంభూ శివలింగంతో పాటు స్వయంభూ గణపతి విగ్రహం కలదు. స్కాంద పురాణ శివరహస్య ఖండంలో శివుడు హాలాహలం మ్రింగి విశ్రమించి నందున 'కాలకూటానన'క్షేత్రంగా ఇది వర్ణించబడింది. నిదురించే శివుని చుట్టూ బ్రహ్మాది దేవతలు అందరూ ఉన్నారు.

మాంపాహి మహేశ్వరా..!_manpahi maheswaraa..!

మాంపాహి మహేశ్వరా..! Maanpahi maheswaraa..! sivaratri jagarana mahasivaratri bhaktipustakalu


మాంపాహి మహేశ్వరా..!
Maanpahi maheswaraa..!

శివుని పేర్లు...!

    వేదాలు, పురాణాలు మరియు ఉపనిషత్తులలో శివునికి అనేక పేర్లతో స్మరిస్తుంటారు. వాటిలో కొన్ని పేర్లు మీకోసం...



హర-హర మహదేవ, రుద్రుడు, శివుడు, అంగీరాగురు, అంతకుడు, అండధరుడు, అంబరీషుడు, అకంప, అక్షతవీర్యుడు, అక్షమాలి, అఘోర, అచలేశ్వరుడు, అజాతారి, అజ్ఞేయ, అతీంద్రియుడు, అత్రి, అనఘ, అనిరుద్ధ్, అనేకాలోచనడు, అపానిధి, అభిరాముడు, అభీరు, అభదన్, అమృతేశ్వర్, అమోఘ, అరిదమ్, అరిష్టనేమి, అర్ధేశ్వర్, అర్థనారీశ్వరుడు, అర్హత్, అష్టమూర్తి, అస్థమాలి, ఆత్రేయ, ఆశుతోష్, 

ఇంద్రభూషణుడు, ఇందుశేఖరుడు, ఇకంగ, ఈశాన్, ఈశ్వరుడు, ఉన్నమత్తవేషుడు, ఉమాకాంతుడు, ఉమానాథ్, ఉమేష్, ఉమాపతి, ఉరగభూషణ్, ఊర్ధ్వరేతా, ఋతుధ్వజ, ఏకనయన్, ఎకపాద్, ఎకలింగ, ఎకాక్ష, కపాలపాణి, 

కమండలధర, కళాధర్, కల్పవృక్ష, కామరిపు, కామారి, కామేశ్వర్, కాలకంఠ, కాలభైరవ, కాశీనాథ్, కృత్తివాసా, కేదారనాథ్, కైలాశనాథ్, క్రతుధ్వసీ, క్షమాచార్, గంగాధర, గణనాథ, గణేశ్వర, గరళధర, గిరిజాపతి, గిరీష్, గోనర్ద్, చంద్రేశ్వర్, చంద్రమౌళి, చీరవాసా, జగదీశ్, జటాధర, జటాశంకర్, జమదగ్ని, జ్యోతిర్మయ్, 

తరస్వీ, తారకేశ్వర్, తీవ్రానంద్, త్రిచక్షు, త్రిధామా, త్రిపురారి, త్రియంబక్, త్రిలోకేశ్, త్రయంబక్, దక్షారి, నందికేశ్వర్, నందీశ్వర్, నటరాజ్, నటేశ్వర్, నాగభూషణ్, నిరంజన్, నీలకంఠ, నీరజ, 

పరమేశ్వర్, పూర్ణేశ్వర్, పినాకపాణి, పింగలాక్ష్, పురందర్, పశుపతినాథ్, ప్రథమేశ్వర్, ప్రభాకర్, ప్రళయంకర్, భోలేనాథ్, బైజనాథ్, భగాలీ, భద్ర, భస్మశాయీ, భాలచంద్ర్, భువనేశ్, భూతనాథ్, భూతమహేశ్వర్, 

మంగలేశ్, మహాకాంత్, మహాకాల్, మహాదేవ్, మహారుద్ర్, మహార్ణవ్, మహాలింగ్, మహేశ్, మహేశ్వర్, మృత్యుంజయ, యజంత్, యోగేశ్వర్, లోహితాశ్వ్, విధేశ్, విశ్వనాథ్, విశ్వేశ్వర్, విషకంఠ్, విషపాయీ, వృషకేతు, వైద్యనాథ్, 

శశాంక్, శేఖర్, శశిధర్, శారంగపాణి, శివశంభు, సతీష్, సర్వలోకేశ్వర్, సర్వేశ్వర్, సహస్రభుజ్, సాంబ, సారంగ, సిద్ధనాథ్, సిద్ధీశ్వర్, సుదర్శన్, సురర్షభ్, సురేశ్, హరిశర్, హిరణ్య, హుత్ సోమ్, స్రుత్వా మొదలైనవి. #మాంపాహి_మహేశ్వరా..!






శ్రీ గణేశ కృత శ్లోకాత్మక రుద్రాధ్యాయ పారాయణ_Rudraadyayam


Rudraadyayam

శ్రీ గణేశ కృత శ్లోకాత్మక
 రుద్రాధ్యాయ పారాయణ


       

శివానుగ్రహ సిద్ధికోసం రుద్రనమక మంత్రాలను వినియోగించడం సంప్రదాయం. అభిషేకానికీ, జపానికీ, అర్చనకీ ఈ దివ్యమంత్రాలు ఉపయోగించి ఇష్టిసిద్ధి, అనిష్ట పరిహారం పొందుతారని శాస్త్రోక్తి. ఎందరికో అనుభవం కూడా. అంతేకాక - ఆత్మవిద్యకి సంబంధించిన ఉపనిషత్ భాగంగా ’రుద్రోపనిషత్’ పేరున దీనిని వ్యవహరిస్తారు. ఇది కైవల్య ప్రాప్తి హేతువని యజ్ఞవల్క్యాది మహర్షులు వేదభాగాలలో వివరించారు.

ఆగమాలు, పురాణేతిహాసాలు, ప్రత్యేకించి దీని ప్రశస్తిని పేర్కొన్నాయి. అయితే వేదభాగమై అపౌరుషేయమైన ఈ రుద్ర పఠనానికి, పారాయణకీ, నియమాలు, నిబంధనలు ఉన్నాయి. స్వరం రానివారు, నియమపాలన కుదరని వారు తదితరులు దీనిని పారాయణ చేయడం కూడదని శాస్త్రనియమం.

కానీ ఈ రుద్రమంత్రాల వల్ల లభించే సిద్ధి, కైవల్యం వంటి అద్భుత ఫలాలను అందరికీ అందజేయాలని సంకల్పించుకున్న ఋషులు ఆ రుద్రనమకాన్ని శ్లోక రూపంగా మలచి పురాేతిహాసాల ద్వారా, తంత్రశాస్త్ర గ్రంథాలద్వారా అందజేశారు.

మంత్రాలను శ్లోకంగా మలచాలంటే ఋష్యత్వం కలిగిన వారికే సాధ్యం. అందుకే వేదాలను వ్యాసం చేసి ప్రసాదించిన భగవాన్ వేదవ్యాసులవారు మహాభారతం, సూతసంహిత, శివరహస్యం - వంటి గ్రంథాలద్వారా వివిధ వివిధాలుగా ’శతరుద్రీయ’ శ్లోకాలను అందజేశారు.

విష్ణుసహస్ర, శివసహస్ర, లలితా సహస్ర నామ స్తోత్రాలవలె ఈ నమక స్తోత్రాన్ని - స్నానాది శుచి నియమాలు పాటిస్తూ పారాయణ చేస్తే చాలు పరిపూర్ణ ఫలం లభిస్తుమ్ది. అందులో సందేహం లేదు. దీనిని పారాయణ స్తోత్రంగా పఠించవచ్చు. అభిషేకానికి వినియోగించుకోవచ్చు, స్వరనియమం లేదు. ఉచ్ఛారణలో జాగ్రత్త వహించాలి. శ్రద్ధావిశ్వాసాలున్న ఆస్తికులందూ దీని పఠనానికి అర్హులే.

పైగా - ఇది సాక్షాత్తు డుంఠి వినాయకుడు కాశీ విశ్వనాథుని దర్శించి చేసిన స్తోత్రంగా శివరహస్యం పేర్కొన్నది.

ఇంతటి మహిమాన్వితమైన స్తోత్రాన్ని సర్వజన సౌలభ్యంకోసం ప్రచురిస్తున్నాం.


ధ్యానమ్:

ఆపాతాళ నభస్స్థలాంత భువన బ్రహ్మాండ మావిస్ఫుర

జ్జ్యోతిఃస్ఫాటిక లింగ మౌళివిలసత్ పూర్ణేందు వాంతామృతైః!

అస్తోకాప్లుత మేకమీశ మనిశం రుద్రానువాకాన్ జపన్

ధ్యాయేదీప్సిత సిద్ధయే ధ్రువ పదం విప్రోభిషించేచ్ఛివమ్!!

బ్రహ్మాండ వ్యాప్తదేహా భసిత హిమరుచా భాసమానా భుజన్గైః

కంఠే కాలాః కపర్దా కలిత శశికలాశ్చండ కోదండ హస్తాః

త్ర్యక్షా రుద్రాక్షమాలా స్సులలితవపుష శ్శాంభవామూర్తి భేదా

రుద్రాశ్శ్రీరుద్రసూక్త ప్రకటిత విభవా నః ప్రయచ్ఛంతు సౌఖ్యమ్!!

ఇత్యుక్త్వా సత్వరం సాంబం స్మృత్వా శంకరపాదుకే

ధ్యాత్వా యయౌ గణాధీశః శివసన్నిధి మాదరాత్!

తతః ప్రణమ్య బహుధా కృతాంజలి పుటః ప్రభుః

శంభుం స్తోతుం మతిం చక్రే సర్వాభీష్ట ప్రదాయకమ్!!


గణేశ ఉవాచ:

నమస్తే దేవ దేవాయ నమస్తే రుద్ర మన్యవే!

నమస్తే చంద్రచూడాయా ప్యుతోత ఇషవే నమః!!1!!

నమస్తే పార్వతీ కాంతా యైక రూపాయ ధన్వనే!

నమస్తే భగవన్ శంభో బాహుభ్యాముత తే నమః!!2!!

ఇషుః శివతమా యా తే తయా మృడయ రుద్రమామ్!

శివం ధనుర్యద్బభూవ తేనాపి మృడయాధునా!!3!!

శరవ్యా యా శివతమా తయాపి మృడయ ప్రభో!

యా తే రుద్రశివా నిత్యం సర్వంగలసాధనమ్!!4!!

తయాభిచాకశీహి త్వం తనువా మా ముమాపతే!

ఘోరయా తనువాచాపి రుద్రాద్యాపాపకాశినీ!!5!!

యా తయా మృడయ స్వామిన్ సదా శంతమయా ప్రభో!

గిరిశంత మహారుద్ర హస్తే యా మిషు మస్తవే!!6!!

బిభర్షి తాం గిరిత్రాద్య శివాం కురు శివాపతే!

శివేన వచసా రుద్ర నిత్యం వాచా వదామసి!!7!!

త్వద్భక్తి పరిపూతాంగం మహింసీః పురుషం జగత్!

యచ్చ శర్వ జగత్సర్వ మయక్ష్మం సుమనా అసత్!!8!!

యథాతథావమాం రుద్ర తదన్యధాపి మే ప్రభో!

రుద్ర త్వమ్ ప్రథమో దైవ్యో భిషక్ పాపవినాశకః!!9!!

అధివక్తా ధ్యవోచ న్మాం భావలింగార్చకం ముదా!

అహీన్ సర్వాన్ యాతు ధాన్యః సర్వా అప్యద్య జంభయన్!!10!!

అసౌ తామ్రోరుణో బభ్రుః నీలగ్రీవ స్సుమంగళః!

విలోహితో స్త్వయం శంభో త్వదధిష్ఠాన ఏవహి!!11!!

నమో నమస్తే భగవన్ నీలగ్రీవ మీఢుషే!

సహస్రాక్షాయ శుద్ధాయ సచ్చిదానంద మూర్తయే!!12!!

ఉభయోగార్త్ని యోర్జ్యా యా ధన్వన స్తాం ప్రముంచతామ్!

సంప్రాప్య ధనురన్యేషాం భయాయ ప్రభవిష్యతి!!13!!

అస్మద్భయ వినాశార్థ మధునాభయద ప్రభో!

యాశ్చతే హస్త ఇషవః పరాతా భగవో వాప!!14!!

అవతత్య ధనుశ్చత్వం సహస్రాక్ష శతేషుధే!

ముఖానిశీర్య శల్యానాం శివోనః సుమనా భవ!!15!!

విజ్యం ధనురిదం భూయాత్ విశల్యో బాణవానపి!

అనేశన్నిషవశ్చాపి హ్యాభురస్తు నిషంగధిః!!16!!

కపర్దినో మహేశస్య యది నాభుర్నిషంగధిః!

ఇషవో పి సమర్థాశ్చేత్ సామర్థ్యాతు భయం భవేత్!!17!!

యాతే హేతిర్ధనుర్హస్తే మీఢుష్టమ బభూవ యా!

తయాస్మాన్ విశ్వతస్తేన పాలయ త్వ మయక్ష్మయా!!18!!

అనాతతాయాయుధాయనమస్తే ధృష్ణవే నమః!

బాహుభ్యాం ధన్వనే శంభో నమో భూయో నమో నమః!!19!!

పరితే ధన్వనో హేతిః విశ్వతోస్మాన్ వృణక్తు నః!

ఇషుధిస్తవ యా తావదస్మదారే నిధేహి తమ్!!20!!

హిరణ్య బాహవే తుభ్యం సేనాన్యే తే నమోనమః!

దిశాంచ పతయే తుభ్యం పశూనాం పతయే నమః!!21!!

త్విషీమతే నమస్తుభ్యం నమస్సస్పింజరాయతే!

నమః పథీనాం పతయే బభ్లుశాయ నమోనమః!!22!!

నమో వివ్యాధినేన్నానాం పతయే ప్రభవే నమః!

నమస్తే హరికేశాయ రుద్రాయ స్తూపవీతినే!!23!!

పుష్టానాం పతయే తుభ్యం జగతాం పతయే నమః!

సంసార హేతి రూపాయ రుద్రాయాప్యాతతాయినే!!24!!

క్షేత్రాణాం పతయే తుభ్యం సూతాయ సుకృతాత్మనే!

అహన్త్యాయ నమస్తుభ్యం వనానాం పతయే నమః!!25!!

రోహితాయ స్థపతయే మంత్రిణే వానిజాయచ!

కక్షాణాం పతయే తుభ్యం నమస్తుభ్యం భువంతయే!!26!!

తద్వారి వస్కృతాయాస్తు మహాదేవాయ తే నమః!

ఓషధీనాం చ పతయే నమస్తుభ్యం మహాత్మనే!!27!!

ఉచ్చైర్ఘోషాయ ధీరాయ ధీరాన్ క్రందయతే నమః!28!!

పత్తీనాం పతయే తుభ్యం కృత్స్నవీతాయ తే నమః!

ధావతే ధవలాయాపి సత్త్వనాం పతయే నమః!!29!!

అవ్యాధినీనాం పతయే కకుభాయ నిషంగిణే!

స్తేనానాం పతయే తుభ్యం దివ్యేషు ధిమతే నమః!!30!!

తస్కరాణాం చ పతయే వంచతే పరివంచతే!

స్తాయూనాం పతయే తుభ్యం నమస్తేస్తు నిచేరవే!!31!!

నమః పరిచరాయాపి మహారుద్రాయతే నమః!

అరణ్యానాం చ పతయే ముష్ణతాం పతయే నమః!!32!!

ఉష్ణీషిణే నమస్తుభ్యం నమో గిరిచరాయతే!

కులుంచానాం చ పతయే నమస్తుభ్యం భవాయ చ!!33!!

నమో రుద్రాయ శర్వాయ తుభ్యం పశుపతయే నమః!

నమ ఉగ్రాయ భీమాయ నమశ్చాగ్రేవధాయచ!!34!!

నమో దూరేవధాయాపి నమో హంత్రే నమోనమః!

హనీయసే నమస్తుభ్యం నీలగ్రీవాయ తే నమః!!35!!

నమస్తే శితికంఠాయ నమస్తేస్తు కపర్దినే!

నమస్తే వ్యుప్తకేశాయ సహస్రాక్షాయ మీఢుషే!!36!!

గిరిశాయ నమస్తేస్తు శిపివిష్టాయ తే నమః!

నమస్తే శంభవే తుభ్యం మయోభవ నమోస్తుతే!!37!!

మయస్కర నమస్తుభ్యం శంకరాయ నమోనమః!

నమశ్శివాయ శర్వాయ నమశ్శివతరాయ చ!!38!!

నమస్తీర్థ్యాయ కూల్యాయ నమః పార్యాయతే నమః!

ఆవార్యాయ నమస్తేస్తు నమః ప్రతరణాయచ!!39!!

నమ ఉత్తరణాయాపి హరాతార్యాయ తే నమః!

ఆలాద్యాయ నమస్తేస్తు భక్తానాం వరదాయ చ!!40!

నమశ్శష్ప్యాయ ఫేన్యాయ సికత్యాయ నమోనమః!

ప్రవాహ్యాయ నమస్తేస్తు హ్రస్వాయాస్తు నమోనమః!!41!!

వామనాయ నమస్తేస్తు బృహతేచ నమోనమః!

వర్షీయసే నమస్తేస్తు నమో వృద్ధాయతే నమః!!42!!

సంవృధ్వనే నమస్తుభ్య మగ్రియాయ నమోనమః!

ప్రథమాయ నమస్తుభ్య మాశవే చాజిరాయ చ!!43!!

శీఘ్రిమాయ నమస్తేస్తు శీభ్యాయ చ నమోనమః!

నమ ఊర్మ్యాయ శర్వాయాప్యవస్వన్యాయతే నమః!!44!!

స్రోతస్యాయ నమస్తుభ్యం ద్వీప్యాయచ నమోనమః!

జ్యేష్ఠాయ చ నమస్తుభ్యం కనిష్ఠాయ నమోనమః!!45!!

పూర్వజాయ నమస్తుభ్యం నమోస్త్వవరజాయచ!

మధ్యమాయ నమస్తుభ్యమపగల్భాయ తే నమః!!46!!

జఘన్యాయ నమస్తుభ్యం బుధ్నియాయ నమోనమః!

సోభ్యాయ ప్రతిసర్యాయ యామ్యాయచ నమోనమః!!47!!

క్షేమ్యాయ చ నమస్తుభ్యం యామ్యాయ చ నమోనమః!

ఉర్వర్యాయ నమస్తుభ్యం ఖల్యాయ చ నమోనమః!!48!!

శ్లోక్యాయ చావసాన్యాయావస్వన్యాయ చ తే నమః!

నమో వన్యాయ కక్ష్యాయ మౌన్జ్యాయ చ నమోనమః!!49!!

శ్రవాయ చ నమస్తుభ్యం ప్రతిశ్రవ నమోనమః!

ఆశుషేణాయ శూరాయ నమోస్త్వాశు రథాయ చ!!50!!

వరూథినే పర్మిణే చ బిల్మినే చ నమోనమః!

శ్రుతాయ శ్రుత సేనాయ నమః కవచినే నమః!!51!!

దుందుభ్యాయ నమస్తుభ్య మాహనన్యాయతే నమః!

ప్రహితాయ నమస్తుభ్యం ధృష్ణవే ప్రమృశాయ చ!!52!!

పారాయ పారవిందాయ నమస్తీక్ణేషవే నమః!

సుధన్వనే నమస్తుభ్యం స్వాయుధాయ నమోనమః!!53!!

నమః స్రుత్యాయ పథ్యాయ నమః కాట్యాయ తే నమః!

నమో నీప్యాయ సోద్యాయ సరస్యాయ చ తే నమః!!54!

నమో నాద్యాయ భవ్యాయ వైశంతాయ నమోనమః!

అవట్యాయ నమస్తుభ్యం నమః కూప్యాయ తే నమః!!55!!

అవర్ష్యాయ చ వర్ష్యాయ మేఘ్యాయ చ నమోనమః!

విద్యుత్యాయ నమస్తుభ్యమీథ్రియాయ నమోనమః!!56!!

ఆతప్యాయ నమస్తుభ్యం వాత్యాయచ నమోనమః!

రేష్మియాయ నమస్తుభ్యం వాస్తవ్యాయ చ తే నమః!!57!!

వాస్తుపాయ నమస్తుభ్యం నమస్సోమాయతే నమః!

నమో రుద్రాయ తామ్రాయాప్యరుణాయ చ తే నమః!!58!!

నమ ఉగ్రాయ భీమాయ నమశ్శంగాయ తే నమః!

నమస్తీర్థ్యాయ కూల్యాయ సికత్యాయ నమోనమః!!59!!

ప్రవాహ్యాయ నమస్తుభ్యమిరిణ్యాయ నమోనమః!

నమస్తే చంద్రచూడాయ ప్రపధ్యాయ నమోనమః!!6౦!!

కింశిలాయ నమస్తేస్తు క్షయణాయ చ తే నమః!

కపర్దినే నమస్తేస్తు నమస్తేస్తు పులస్తయే!!61!!

నమో గోష్ఠ్యాయ గృహ్యాయ గ్రహాణాం పతయే నమః!

సమస్తల్ప్యాయ గేహ్యాయ గుహావాసాయ తే నమః!!62!!

కాట్యాయ గహ్వరేష్ఠాయ హ్రదయ్యాయ చ తే నమః!

నివేష్ప్యాయ నమస్తుభ్యం పాగ్oసవ్యాయ తే నమః!!63!!

రజస్యాయ నమస్తుభ్యం పరాత్పర తరాయ చ!

నమస్తే హరికేశాయ శుష్క్యాయ చ నమోనమః!!64!!

హరిత్యాయ నమస్తుభ్యం హరిద్వర్ణాయ తే నమః!

నమ ఉర్మ్యాయ సూర్మ్యాయ పర్ణ్యాయ చ నమోనమః!!65!!

నమోపగుర మాణాయ పర్ణశద్యాయ తే నమః!

అభిఘ్నతే చాఖ్ఖిదతే నమః ప్రఖ్ఖిదతే నమః!!66!!

విశ్వరూపాయ విశ్వాయ విశ్వాధారాయతే నమః!

త్ర్యంబకాయ చ రుద్రాయ గిరిజాపతయే నమః!!67!!

మణికోటీర కోటిస్థ కాన్తిదీప్తాయ తే నమః!

వేదవేదాంత వేద్యాయ వృషారూఢాయ తే నమః!!68!!

అవిజ్ఞేయ స్వరూపాయ సుందరాయ నమోనమః!

ఉమాకాంత నమస్తేస్తు నమస్తే సర్వసాక్షిణే!!69!!

హిరణ్య బాహవే తుభ్యం హిరణ్యాభరణాయ చ!

నమో హిరణ్య రూపాయ రూపాతీతాయ తే నమః!!70!!

హిరణ్యపతయే తుభ్యమంబికాపతయే నమః!

ఉమాయాః పతయే తుభ్యం నమః పాప ప్రణాశక!!71!!

మీఢుష్టమాయ దుర్గాయ కద్రుద్రాయ ప్రచేతసే!

తవ్యసే బిల్వపూజ్యాయ నమః కళ్యాణ రూపిణే!!72!!

అపార కళ్యాణ గుణార్ణవాయ 

శ్రీ నీలకంఠాయ నిరంజనాయ!

కాలంతకాయాపి నమో నమస్తే 

దిక్కాల రూపాయ నమో నమస్తే!!!73!!

వేదాంత బృంద స్తుత సద్గుణాయ

గుణ ప్రవీణాయ గుణాశ్రయాయ!

శ్రీ విశ్వనాథాయ నమో నమస్తే 

కాశీ నివాసాయ నమో నమస్తే!!74!!

అమేయ సౌందర్య సుధానిధాన సమృద్ధి రూపాయ నమోనమస్తే!

ధరాధరాకార నమోనమస్తే ధారా స్వరూపాయ నమో నమస్తే!!75!!

నీహార శైలాత్మజ హృద్విహార ప్రకాశ హార ప్రవిభాసి వీర!

వీరేశ్వరాపార దయానిధాన పాహి ప్రభో పాహి నమోనమస్తే!!76!!


వ్యాస ఉవాచ:

ఏవం స్తుత్వా మహాదేవం ప్రణిపత్య పునఃపునః!

కృతాంజలి పుటస్తస్థౌ పార్శ్వే డుంఠివినాయకః!!

త మాలోక్య సుతం ప్రాప్తం వేదం వేదాంగపారగం!

స్నేహాశ్రుధారా సంవీతం ప్రాహ డుంఠిం సదాశివః!!

ఇతి శ్రీ శివ రహస్యే హరాఖ్యే తృతీయాంశే పూర్వార్ధే

గణేశ కృత రుద్రాధ్యాయ స్తుతిః నామ దశమోధ్యాయః

అనేనా శ్రీ గణేశ కృత శ్లోకాత్మక రుద్రాధ్యాయ పారాయణేన

శ్రీ విశ్వేశ్వర స్సుప్రీత స్సుప్రసన్నో వరదో భవతు!!

అభిషేక ఫలం_AbhisekaFalam


Shiva అభిషేక ఫలం_AbhisekaFalam

    శివుడు అభిషేక ప్రియుడని అందరికీ తెలిసిందే.
 సాధారణంగా క్షీరాభిషేకం, 
పంచామృత అభిషేకం లాంటివి మాత్రమే వింటుంటాం. ఇంకా చాలా రకాల పదార్థాలతో అభిషేకం చేయొచ్చు. 
ఒక్కో పదార్థంతో చేసే అభిషేకానికి 
ఒక్కోరకమైన పుణ్యఫలం దక్కుతుంది. అవేంటంటే... 

ఆవు పెరుగు - ఆరోగ్యం
ఆవు నెయ్యి - ఐశ్వర్యం
చక్కెర - దుఃఖ నాశనం
తేనె - తేజస్సు పెరుగుతుంది.
చెరుకు రసం - ధనవృద్ధి
కొబ్బరి నీళ్లు - సంపదలు పెరుగుతాయి.
విభూతి - పాపనాశనం
పనీరు - పుత్ర లాభం
పుష్పోదకం - భూలాభం
బిల్వజలం - భోగభాగ్యాలు
నువ్వుల నూనె - అపమృత్యు దోషాల నివారణ
సువర్ణోదకం - పేదరిక నివారణ
ద్రాక్షరసం - పనులు నెరవేరుతాయి. ధనలాభం.
ఖర్జూర జలం - సుఖ జీవనం, శత్రుహాని
నేరేడు పండ్ల రసం - కార్య జయం, వైరాగ్యం
కస్తూరీ జలం - శత్రుభయాలు తొలగిపోతాయి. చక్రవర్తిత్వం
సుగంధ జలం - పుత్ర లాభం
గరిక నీరు (దూర్వోదకం) - పోయిన సొమ్ము లభిస్తుంది. 
రుద్రాక్ష జలం - ఐశ్వర్యం
అన్నం - రాజ్యం, ఆయుర్దాయం, సుఖ జీవనం, మోక్షం
పసుపు నీరు - సౌభాగ్యాలు, సకల మంగళాలు
మామిడి పండ్ల రసం - దీర్ఘవ్యాధి నివారణ

గురువు సదాశివుడు_gurusadasiva

గురువు సదాశివుడు_gurusadasiva

గురువు సదాశివుడు


సాధనలో అనేక వైక్లబ్యాలుంటాయి. ‘నేను మంచి మార్గంలో వెడుతున్నా’ అనుకుంటూ శిష్యుడు దారితప్పి ధర్మానుష్ఠానంలో వైక్లబ్యాన్ని పొందుతాడు. వెళ్ళరాని మార్గంలో వెళ్ళిపోతుంటాడు. ధర్మం అత్యంత ప్రధానం.  పరమ సున్నితమైన విషయమది. అంత సున్నితమైన ధర్మాన్ని ఆచరింపచేయడంలో గురువు దిద్దుతుంటాడు శిష్యుణ్ణి.గురువుగారితో బాగా అంటకాగి తిరగడం అలవాటయింది. గురుబోధలు వింటూ తన సంసారాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాడు. గురువుగారికి అనుమానమొచ్చింది. పిలిచి – ’ఏమిరా, నేను గృహస్థాశ్రమంలో లేనా! నా భార్యాబిడ్డల్ని చూడ్డం లేదా ! ధర్మం ధర్మమే. గృహస్థుగా ఉండగా నీ మొదటి కర్తవ్యం వారి బాగోగులను చూడడం.’’ అని హెచ్చరించి దిద్దుతాడు.
’కర్తవ్యం’ అని ఒక మాట ఉంది. గురువు గొప్పదనమంతా కర్తవ్యనిష్ఠలో ఉంది. గురువు ఒకసారి చెప్తాడు.. వినలేదు, రెండుసార్లు, మూడుసార్లు చెప్తాడు.. వినలేదు. తను బతికున్నంత వరకు చెపుతుంటాడు తప్ప ‘నీ ఖర్మ’ అనడు. అది కర్తవ్యం. అంటే చేయవలసిన పని తాను చేయడం. ఫలితం–ఈశ్వరానుగ్రహం. కొడుకును కన్న తరువాత వాడికి విద్యాబుద్ధులు నేర్పించడం, వాడికి సరైన ఆదర్శంగా నిలబడడం, వాడు మంచి మార్గంలో ప్రయాణించేటట్టుగా తాను జీవించడం గృహస్థు ధర్మం. కొడుకు అలాగే ఉంటే సంతోషం. అలా ఉండకపోతే? బెంగపెట్టేసుకుని గృహస్థు అనుష్ఠానం మానేయకూడదు. తన అనుష్ఠానం తాను చేసి వెళ్ళిపోవాలి. అది కర్తవ్యం.
ఈశ్వరునిపట్ల నమ్మకం వేరు, ఆశ్రమధర్మం వేరు. ఆశ్రమధర్మాన్ని ఆశ్రమ ధర్మంగానే పట్టుకోవాలి, నీవు పండేవరకు. నీ కర్తవ్యం పూర్తయ్యేవరకు నీవలాగే పట్టుకోవాలి.
శిష్యుని పొరబాట్లను గురువు దిద్దుతాడు. ఉత్థానపతనాలలో జారిపోకుండా శిష్యుణ్ణి కాపాడుకుంటాడు. గురువు ఒక్కొక్కసారి తీవ్రస్వరంతో మాట్లాడతాడు. కోపాన్ని ఆయుధంగా తీసుకుని చక్కబెడతాడు. ఒక్కొక్కసారి ప్రశాంతవదనంతో మాట్లాడతాడు. ఏది ఎలా మాట్లాడినా లక్ష్యం ఒక్కటే. శిష్యుణ్ణి కాపాడుకోవాలి. ధర్మంనుంచి జారిపోకుండా చూసుకోవాలి. అలా చూసుకునే ప్రక్రియలో గురువు మహేశ్వర స్వరూపంతో నిలబడతాడు. అలా గురువు బ్రహ్మగా, విష్ణువుగా, మహేశ్వరుడిగా తన కర్తవ్యాన్ని పాలిస్తాడు. వెరసి గురువు పరబ్రహ్మ.
Tags: 
guru
student

కాలభైరవం_KalabhairavaGuuru

దేవరాజ సేవ్యమానం... 

కాలభైరవం

    ‘కాలుడు’ అంటే యముడు. యముని పేరు వింటేనే లోకమంతా భయపడుతుంది. అలాంటి మృత్యుదేవతను సైతం భయపెట్టగల మహిమాన్వితుడు శ్రీ కాలభైరవుడు. సంసార బాధలతో సతమతమయ్యేవారు, అనారోగ్యాల బారిన పడ్డవారు, క్షుద్రశక్తుల విజృంభణతో నలిగిపోతున్న వారు శ్రీ కాలభైరవస్వామిని వేడుకుంటే సకల బాధలను హరింపజేసి భక్తులను రక్షిస్తాడని నమ్మకం.
తిరుమలలో ఏవిధంగా అయితే ముందుగా వరాహస్వామిని సందర్శించుకున్న తర్వాతే వేంకటేశ్వరుని పూజిస్తారో, కాశీనగరంలో కూడా అదేవిధంగా క్షేత్ర పాలకుడైన కాలభైరవుని సేవించకుండా చేసిన కాశీయాత్ర నిష్ఫలమని సాక్షాత్తూ శివుడే కాలభైరవుడికి వరమిచ్చినట్లు పురాణోక్తి. మార్గశిర శుద్ధ అష్టమి కాలభైరవాష్టమి. ఈ సందర్భంగా కాలభైరవుడి విగ్రహం లేదా చిత్రపటానికి షోడశోపచార పూజలు చేసి, మినప గారెలను, కల్లును (మిరియాల పొడి వేయని బెల్లం పానకం కల్లుతో సమానమని శాస్త్రోక్తి) నివేదిస్తే కాలభైరవుడు ప్రసన్నుడై, గ్రహదోషాలను రూపుమాపుతాడని, కోరిన వరాలనిస్తాడని ప్రతీతి. కాలభైరవుడి పటం లభించకపోతే శివలింగం ముందు కూర్చుని, కాలభైరవ అష్టకం పఠించవచ్చు. (10-12-2017 కాలాష్టమి)

శ్రీ స్వయంభూలింగేశ్వరుడు - దుద్దెడ_LINGESWAR-diddada



శ్రీ స్వయంభూలింగేశ్వరుడు - దుద్దెడ





భారత దేశంలో వున్న అనేక ఆలయాలలో భగవంతుని మూర్తులు ప్రతిష్టించబడ్డాయి. అయితే కొన్ని పుణ్య క్షేత్రలలో భగవంతుడు అర్చా రూపంలో స్వయంగా వెలిస్తే తర్వాత ఆలయాలు నిర్మింపబడి, అభివృధ్ధి చెయ్యబడ్డాయి. అలాంటి క్షేత్రాలను స్వయంభూ క్షేత్రాలంటారు. సదా శివుడు అలా స్వయంభువుగా లింగ రూపంలో వెలిసిన క్షేత్రమే సిద్దిపేట జిల్లా, కొండపాక మండలం, దుద్దెడ గ్రామంలో వున్న శ్రీ స్వయం భూ లింగేశ్వరుడు. ఈ ఆలయంలో శివుడు క్రీ.శ. 10 వ శతాబ్దం పూర్వమే స్వయంభువుగా వ్యక్తమయ్యాడంటారు. ఈ స్వామిని పూజిస్తే ఎంతటి మొండి జబ్బులైనా తగ్గుతాయని భక్తుల విశ్వాసం.

ఆలయ నిర్మాణం:
క్షేత్ర పురాణం ప్రకారం, ఈ ఆలయ నిర్మాణం 9 – 12 శతాబ్దాల మధ్య ఈ ప్రాంతాన్ని పాలించిన కళ్యాణి చాళుక్యుల కాలంలోదిట. ఈ ఆలయంలో కనిపిస్తున్న సప్త మాతృకల విగ్రహాలున్న పట్టి దీనికి నిదర్శనం. తర్వాత కాకతీయుల కాలంలో ఆలయ ప్రాకారం వగైరా నిర్మాణాలు జరిగాయి. ప్రవేశ ద్వారంపై ఇంకో మండపం నిర్మించటం కాకతీయుల శైలి. ఇక్కడ ప్రవేశ ద్వారం రెండు మండపాలుగా వుంటుంది.





ఆలయం ప్రహరీ గోడ మొత్తం మట్టి వగైరాలు వాడకుండా పెద్ద పెద్ద బండ రాళ్ళతో పేర్చారు. దేవాలయ నిర్మాణమంతా ఆగమశాస్త్రానుసారం జరిగింది. గర్భాలయం ముందు 16 ఏక శిలా స్తంభాలతో నిర్మించబడ్డ కళ్యాణ మండపం వున్నది. దీనికీ, గర్భాలయానికీ మధ్య నందీశ్వరుడున్న మండపం. గర్భ గుడిపైన గోపురం 36 అడుగుల ఎత్తున మట్టితో కట్టబడింది.

శాసనాలు:
ఈ ఆలయ ప్రాంగణంలో ఒక శాసనం వున్నది. ఈ శాసనం ద్వారా తెలుస్తున్న వివరాలు … ఈ శాసనం క్రీ.శ. 1296 లో చేసినది. కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడి సామంత రాజు నాచిరెడ్డి .. ఆయన కుమారుడైన మాధవరెడ్డి చేశాడు. ఆయన పానుగల్లునుంచి దుద్దెడ వరకు పాలించేవాడు. అప్పట్లో దుద్దెడ గ్రామంలో పెద్ద సంత జరిగేదట. దానిలో స్ధానిక సంస్ధలు వసూలు చేసే సుంకాలలో 80 మాడలు స్వయంభూదేవుని నిత్య పూజలు, ఉత్సవాలు మొదలగువాటికి ఇచ్చేవారు. … అంటే ఈ దేవాలయం ఆ శాసనానికన్నా ముందునుంచే వున్నదనేకాదు, ఆ కాలంలో ఈ ప్రాంతం వైభవోపేతంగా విలసిల్లిదని కూడా తెలుస్తోందికదా.





అమ్మవారు:
అమ్మవారు భవాని. చతుర్భుజాలతో, ఏక శిలతో చెక్కబడిన సోమసూత్రంపై, దక్షిణాభి ముఖంగా వుండటం ఇక్కడి అమ్మవారి ప్రత్యేకత. మన దేశంలో దక్షిణాభిముఖంగావున్న అమ్మవారి ఆలయాలు తక్కువ. దక్షిణ దిక్కు యమ స్ధానం. క్షుద్ర శక్తుల నిలయం. ఆ దిక్కు చూస్తున్న అమ్మ దుష్టు శక్తుల ప్రభావంనుండి తన భక్తులను కాపాడుతుందని నమ్మకం. రాత్రి వేళల్లో ఈ ఆలయంలో మువ్వల శబ్దం విన్నామనే భక్తులున్నారు.

ఉపాలయాలు:
ఒక దానిలో భద్రకాళీ సమేత వీరభద్రస్వామి వున్నాడు. ఈయన ఆలయానికి ముందే సప్త మాతృకల విగ్రహాలు వున్నాయి.





విశేషం:
పూజారిగారు చెప్పినదాని ప్రకారం తెల్లవారుఝామున 3, 4 గం. ల ప్రాంతంలో ఒక యోగి ఈ వీరభద్రస్వామి ఆలయంనుంచి సర్ప రూపంలో వచ్చి స్వామిని సేవించి వెళ్తారుట. యోగులు, ఋషులు రాత్రివేళ ఇక్కడికొచ్చి స్వామిని సేవిస్తారనటానికి నిదర్శనంగా రాత్రి వేళల్లో ఓంకారనాదాలు విన్నామని చెప్పిన భక్తులు వున్నారు. అలాగే ఒక స్త్రీ రాత్రివేళల్లో ఆలయంలో తిరుగుతున్నట్లు మువ్వల శబ్దం విన్నామనేవారు కొందరు.

అక్షయ జలనిధీశుడు:
ఇక్కడి ఇంకొక విశేష లింగం అక్షయ జలనిధీశుడు. ఈ లింగం పానువట్టం మీదనుంచి తియ్యటానికి వస్తుంది. లింగం కింద చిన్న గుంట లాగా వుంది. అందులో ఎప్పుడూ నీరు వుంటుంది. ఆ ప్రాంతంలోని కర్షక భక్తులు కొందరికి ఈ నీరు తమ పంటలపై చల్లితే చీడ పట్టకుండా వుంటుందని నమ్మకం.





ఆవరణలో వున్న సంతాన నాగేంద్రుని సేవిస్తే సంతానం కలుగుతుందంటారు. నాగుల పంచమి, నాగుల చవితి రోజుల్లో భక్తులు ఎక్కువ సంఖ్యలో హాజరయ్యి ఈ స్వామికి విశేష పూజలు జరుపుతారు. దేవాలయంలో కనిపించే ఇంకో విగ్రహం పార్శ్వనాధుడిది. ఈయన జైనుల ఆరాధ్య దైవం.

కోనేరు:
ఇక్కడవున్న కోనేరుకి మూడు సొరంగ మార్గాలు వున్నాయని..ఒకటి దేవాలయంలోకి వస్తుందని, అందుకే పూర్వం అప్పుడప్పుడు దేవాలయంలోకి నీరు వచ్చేదని పెద్దలు చెప్పేవారని, ఒక మార్గం కాశీ వెళ్తుందని, ఇంకొకటి ఎటు వెళ్తుందోకూడా తెలియదని అన్నారు.

ఉత్సవాలు:
శ్రావణ మాసం, శరన్నవరాత్రులు, మహా శివరాత్రి మొదలగు పరవడి రోజులలో ఇక్కడ వైభవంగా ఉత్సవాలు జరుగుతాయి. పుష్య బహుళ దశమినుంచి ద్వాదశి వరకు జాతర జరుగుతుంది. ఇందులో పుష్య బహుళ దశమి రోజు శకటోత్సవం జరుగుతుంది. దీనిలో బళ్ళని రకరకాలుగా అలంకరించి మేళ తాళాలతో ఆలయం చుట్టూ మూడు ప్రదక్షిణలు చేస్తారు. ఇది ఇక్కడి ఆనవాయితీ. ఇక్కడ జరిగే రధోత్సవంలో గ్రామంలోని అన్ని కులాలవారూ పాలుపంచుకుంటారు.

సందర్శన వేళలు:
ఉదయం 5 గం. ల నుంచి 11 గం. ల దాకా
సాయంత్రం 4 గం. ల నుంచి 8 గం. ల దాకా.

ఇతర ఆలయాలు:
ఈ ఆలయానికి ఎదురుగా శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయం, రహదారికి ఎడమవైపు శ్రీ పెద్దమ్మ ఆలయాలు వున్నాయి.

మార్గము:
హైదరాబాదు - సిద్దిపేట మార్గంలో హైదరాబాదునుంచి 70 కి.మీ. లు వెళ్ళాక దుద్దెడ గ్రామం బోర్డు కనబడ్డాక కుడి పక్కకి తిరగాలి. సిద్దిపేట నుంచి 12 కి.మీ. ల దూరంలో వుంది.



పి.యస్.యమ్. లక్ష్మి
(తెలుగులో అత్యధిక యాత్రా వ్యాసాలు వ్రాసిన మహిళ)

తోడు-నీడ_Toduneda

తోడు-నీడ Toduneda ardanareswara,sivaparvati


వివాహం అంటే- ప్రకృతి, పురుషుడి సంగమం. ఆ వివాహమే ఆదర్శ దాంపత్యానికి మూలం. పార్వతీ పరమేశ్వరులు ఆది దంపతులు. వారి అర్ధనారీశ్వర తత్వం లోకమంతటికీ అనుసరణీయం. ప్రకృతిలో పరతత్వం ఉంది. అదే రీతిలో ఆ కల్యాణ దంపతుల జీవన ప్రభ అంతటా ప్రసరించింది. పురుష ప్రయత్నానికి స్త్రీశక్తి జోడు కావాలన్న దివ్యోపదేశాన్ని ప్రపంచానికి అందజేసింది.

స్త్రీపురుష సంగమమే సంసార సాగరం. దాన్ని దాటడానికి వారు పరతత్వం అనే నావ సహాయాన్ని పొందాలి. లోకంలో ఏ జీవీ ఒంటరిగా బతకలేదు. ఏకాకిగా మనుగడ సాగించలేదు. తనకు తోడు కావాలని, ఓ నీడపట్టున ఉండాలని ప్రతి ప్రాణీ కోరుకుంటుంది. ముఖ్యంగా మనిషికి తోడు, నీడ అత్యవసరాలు. అవి లేకుంటే ‘ఈ జీవితం ఇక అనవసరం’ అనిపించే స్థితి వస్తుంది. అందుకే ‘మానవుడు సంఘజీవి’ అంటారు.

నాటి మానవుడు ప్రపంచాన్ని ఆశ్చర్యంగా చూశాడు. ‘అ’ అనే శబ్దాన్ని తన నోట పలికించాడు. ఆ ఫలితాన్ని గమనించి ‘ఉ’ అంటూ తల వూపాడు. అప్పటికీ అతడికి సృష్టిమూలం అంతుపట్టలేదు. ‘మ్‌’ అంటూ, తెరచిన నోటిని వెంటనే మూసుకున్నాడు. అప్పుడు వెలువడిన అకార ఉకార మకార శబ్దతరంగాలే ఓంకార రూప సాగరమయ్యాయి. అద్భుత శక్తి ఈ జగత్‌ చక్రానికి మూలకారణం అనే ఆలోచన మనిషిలో అంకురించింది. ఆ శక్తికి లోబడి జీవించాలని అనిపించింది.

మనిషి ఎంతో ఎత్తుకు ఎదగగల అవకాశాన్ని దివ్యశక్తి అనుగ్రహించింది. అతడి ప్రయత్నానికి దైవానుగ్రహం దోహదపడింది. అతణ్ని అదే ముందుకు నడిపించింది. ఏకత్వంలో అనేకత్వం, అనేకంలో ఏకత్వం చూడగల శక్తి మానవుడికి పెరిగింది. అందువల్ల అతడు ఆధ్యాత్మిక శిఖరం అధిరోహించగల శక్తిసంపన్నుడయ్యాడు.

వియోగం వల్ల విషాదం తప్పదు. విభజన కారణంగా, భక్తి విరక్తి వైపు మొగ్గు చూపక మానదు. విషాదంలో మునిగిన అర్జునుడికి భగవానుడు అండగా నిలిచాడు. పద్దెనిమిది యోగాల్నీ ప్రవచించి, ఆ నరుడి ద్వారా నరజాతి సమస్తానికీ మార్గదర్శనం చేయించాడు. ఎవరి యోగ్యతకు తగిన యోగ మార్గాన్ని వారు ఆశ్రయించే వెసులుబాటు అనుగ్రహించాడు. జ్ఞానులు, భక్తులు, ఇతర కర్మజీవులు వారి వారి దారుల్లో దివ్యత్వంతో సాగడమే- భగవానుడి కోరిక. కర్మ ద్వారా క్రమ ముక్తి పొందగల అవకాశం కర్మయోగులకు దండిగా ఉంది. అందుకే గీతోపదేశానికి ‘యోగ ప్రస్థానం’ అనే పేరు సార్థక నామధేయంగా మారింది.

వియోగం వల్ల విషాదం, విభజన వల్ల విభక్తి కలుగుతాయి. అప్పుడు నరుడు ఏం చేయాలో, చేయకూడదో కృష్ణపరమాత్మ స్పష్టపరిచాడు. చిరునవ్వును గుర్తుచేసుకోవాలని అర్జునుడికి బోధించాడు. అన్నింటినీ సోదాహరణంగా ప్రదర్శించాడు. గీతలో రెండో అధ్యాయం- సాంఖ్య యోగం. ఆకలి గలవాడికి అన్నం పెట్టాలి గాని, దాని గురించి అతడికి వర్ణించడం వల్ల ప్రయోజనం లేదు. అలా గీతాచార్యుడు అనడంలో కర్మయోగ ప్రస్తావన మెండుగా కనిపిస్తుంది. మూడోది కర్మయోగం. నాలుగోది జ్ఞాన, కర్మ, సన్యాస యోగం. జ్ఞానానికి, సన్యాసానికి సేతుబంధం కర్మ. దాని గురించి మొదటి శ్లోకం వివరిస్తుంది. కర్మల్ని వీడటం అంత తేలిక కాదు. మానవుడు కర్తృత్వ భావన వదలాలి. అందుకే ఆరో శ్లోకం ‘యోగ యుక్తో మునీ బ్రహ్మ’ అంటూ వంతపాడటం మరో విశేషం. ఆరోది ఆత్మ సంయమన అధ్యాయం. కర్మఫలం ఆశించకుండా కర్తవ్యం ఆచరించాలని అది చెబుతుంది.

ఆ ఆరు అధ్యాయాల విపులీకరణలే మిగతా పన్నెండు అధ్యాయాల్నీ అద్దంలో చూపుతున్నాయి. ఏ పని చేయడానికైనా ముందు దైవారాధన అనూచానంగా వస్తున్న ఆచారం. ఫలితాన్ని స్వామికి సమర్పించాలి. అనంతరం చేయాల్సిన పనిని మనసా వాచా కర్మణా సాంగోపాంగంగా చేయాలని చెప్పడమే కర్మయోగ ప్రస్థానం! దైవానుగ్రహం వల్ల మనిషి ఆలోచన సరైన దోవలో సాగుతుంది. పని నుంచి తగినంత ఫలితమిస్తుంది. అలాంటి కర్మజీవికి ఆ దైవమే తోడు, నీడ!       - ఉప్పు రాఘవేంద్రరావు

శివ దర్శనం_Shiva darshan

శివ దర్శనం Shivadarshan SIVALAYAM

శివ దర్శనం
Shiva darshan


శివాలయంలోకి అడుగుపెట్టగానే పరమేశ్వరునికంటే ముందుగా నందినే దర్శించుకుంటాం. నంది పరమేశ్వరునికి ద్వారపాలకుడు. కాబట్టే ఆయనకి అంత ప్రాముఖ్యత?

పరమేశ్వరుడికి అనుంగు భక్తుడు నందీశ్వరుడు. అందుకనే ఆ లయకారకుడు నందిని తన వాహనంగా చేసుకున్నాడు. ప్రతి శివాలయంలోనూ శివలింగానికి ఎదురుగా నంది విగ్రహం వుంటుంది. విగ్రహ రూపంలో ఉండే భగవంతుని స్వరూపాన్ని మనస్సు వెంటనే గ్రహించగలదు. కానీ, లింగరూపంలో ఉన్న పరమశివుడిని చూస్తూ స్వామి నిజరూపాన్ని దర్శించడానికి దృష్టిని మనస్సుపై కేంద్రీకృతం చేయాలి.

నంది పృష్టభాగాన్ని నిమురుతూ, శృంగాల మధ్య నుంచి స్వామిని దర్శించుకోవడం వలన నంది అనుగ్రహం కూడా కలిగి మంచి ఫలితాలు కలుగుతాయి. అంతేకాకుండా నంది చెవులలో కోరికలు చెప్పే విధానంలో కూడా ఒక పద్ధతి ఉంది. కుడిచేతిని నందీశ్వరుని చెవికి అడ్డంగా పెట్టి, నెమ్మదిగా గోత్రం, పేరు, కోరిక చెప్పడం మంచిది. తర్వాత శివాలయంలో ఇచ్చిన పుష్పాన్ని నంది వద్ద పెట్టాలి.

శంభుడు త్రినేత్రుడు. ఆయన త్రినేత్రం తెరిస్తే సకల చరాచర జగత్తు తల్లడిల్లుతుంది. అందుకే నేరుగా శివుని ముందుకు వెళ్లకూడదని పెద్దలు చెబుతారు. నంది కొమ్ముల మధ్య నుంచి శివుణ్ణి దర్శించిన వారికి కైలాస ప్రాప్తి కలుగుతుందని శివ పురాణం చెబుతోంది.






శివయ్య తోడుగా నవనందులు_Navanandulu


శివయ్య తోడుగా నవనందులు navanandulu

శివయ్య తోడుగా నవనందులు!

ప్రమథ గణాల్లో ముఖ్యుడు నందీశ్వరుడు. ఆయన పేరుమీదుగా వెలిసిన మహానంది ఆలయం తెలుగురాష్ట్రాల్లో సుప్రసిద్ధం. ఆ ఆలయానికి చుట్టుపక్కల మరో ఎనిమిది శివాలయాలున్నాయి. మహానందితో కలిపి నవనందులుగా పిలిచే ఈ ఆలయాలను ఒకేరోజు దర్శించుకోవడం మహాపుణ్యదాయకం.

విభూతి రాస్తే సంబరపడిపోయే వాడూ, చెంబెడు నీళ్లు పోస్తేనే వరాలిచ్చేసేవాడూ పరమశివుడు తప్ప మరే దేవుడూ మనకు కనిపించడు. మామూలు భక్తుల సంగతే అలా ఉంటే అత్యంత ప్రియమైన నందీశ్వరుడు ఆయన్ను అర్చించాడంటే దిగిరాకుండా ఉంటాడా. అలా పరమేశ్వరుడు నంది కోసం నేలకు దిగివచ్చిన పుణ్యక్షేత్రం కర్నూలు జిల్లా నంద్యాల పట్టణానికి సమీపంలోని మహానంది. ఆ భక్తుడి పేరు మీదనే ఇక్కడ కామేశ్వరీ సమేతుడై మహానందీశ్వరుడిగా వెలిశాడు శివయ్య. ఆలయం చుట్టుపక్కల కొలువుదీరిన నవనంది క్షేత్రాల్లో ఇది విశిష్టమైనది. కార్తిక సోమవారం, పౌర్ణమి దినాల్లో ఈ నవనందుల దర్శనం సకలపాపనాశనంగా చెబుతారు.

ఇదీ కథ... 
ఆలయ స్థలపురాణం ప్రకారం... పూర్వం శిలాదుడు అనే పరమశివభక్తుడైన మహర్షి ఉండేవాడు. ఆయన సంతానం కోసం ఘోర తపస్సు చేసి శివసాక్షాత్కారం పొందాడు. తనకు జగత్ప్రసిద్ధులూ, అపర శివభక్తులైన ఇద్దరు కుమారుల్ని ఇమ్మని కోరాడు మహర్షి. అలా ఆయనకు పర్వతుడు, మహానందుడు అనే కుమారులు జన్మించారు. పర్వతుడు ఈశ్వర తపస్సు చేసి, శ్రీశైల పర్వతంగా మారాడు. నంది స్వరూపుడైన మహానందుడు వేల సంవత్సరాలు శివుడికోసం తపస్సు చేసి, సాక్షాత్కారం పొంది ఆయన పాదాల ఎదురుగా స్థిరనివాసం ఉండే వరాన్నిమ్మని కోరుకున్నాడు. అలా మహానంది ఆలయంలో అమ్మవారితో కలిసి వెలిశాడు పరమేశ్వరుడు. తర్వాత, కలియుగంలో నంద్యాలను పరిపాలించిన నంద మహారాజుకు సంబంధించిన ఆలమందలోని ఒక ఆవు సాయంత్రం పాలు ఇచ్చేది కాదట. అది గమనించిన కాపరి పాలు ఏమవుతున్నాయా అని తెలుసుకునేందుకు ఆవును వెంబడించాడు. ఆ ఆవు ఒక పుట్టమీద నిలబడటం, పాలధార పుట్టలోకి పడటం గమనించి, ఈ విషయాన్ని రాజుకు చేరవేశాడు. తరువాతి రోజు ఆవును వెంబడించిన రాజు పుట్ట లోపలినుంచి వస్తున్న దివ్యతేజస్సు ఎవరిదో చూద్దామని ఆవు దగ్గరగా వెళ్లడంతో అది బెదిరి పరిగెట్టబోతూ పుట్టను తొక్కింది. తర్వాత ఆ తేజస్సు అదృశ్యమైందట. దీనికి చింతిస్తూ ఇంటిదారి పట్టిన రాజుకి ఆ రాత్రి కలలో శివుడు కనిపించి పుట్టలో ఉన్నది తానేననీ, అక్కడి శివలింగాన్ని బయటకు తీసి పూజించమనీ చెప్పాడు. ఈ లింగాన్ని ఉపాసించిన తన భక్తుడు నందీశ్వరుడి పేరుమీదుగా ఈ ప్రాంతం మహానందిగా విరాజిల్లుతుందనీ, ముల్లోకాల్లో ఖ్యాతిగాంచిన తీర్థాలన్నీ ఇక్కడే కొలువై ఉన్నాయనీ పలికాడు. వివిధ సమయాల్లో తనను ప్రార్థించిన భక్తుల కోసం ఈ చుట్టుపక్కలేే మరో ఎనిమిది చోట్ల వెలిసినట్టు తెలిపి అక్కడా అర్చనలు ఏర్పాటు చేయమని ఆదేశించాడట. స్కంద పురాణంలోని శ్రీశైల ఖండంలో ఈ ఆలయ విశేషాలు దర్శనమిస్తాయి. మహానందిలోని శివలింగాన్ని ఆవు తొక్కినదానికి గుర్తుగా శివలింగం మీద గిట్టల అచ్చులు కనిపిస్తాయి. అందుకే ఇక్కడి శివుడ్ని గోపాదలింగేశ్వరుడిగానూ పిలుస్తారు. మహానందిలో రుద్ర, విష్ణు, బ్రహ్మ గుండాలుగా పిలిచే మూడు పుష్కరిణులు ఉంటాయి. గుడి అడుగుభాగం నుంచి నిరంతరం నీరు వీటిలోకి ప్రవహిస్తూ ఉంటుంది. ఈ గుండాల నుంచి పారే నీరు చుట్టుపక్కల ఉన్న సుమారు రెండువేల ఎకరాల్లోని పంటలకు సాగునీరుగా ఉపయోగపడుతోంది. ఇక్కడి నీరు స్ఫటికమంత స్వచ్ఛంగా కనిపిస్తూ ఉంటుంది. గుండాల అడుగుభాగాన్నీ అందులోని చేపల్నీ కూడా భక్తులు స్పష్టంగా చూడొచ్చు. ఇందులోని నీరు చలికాలంలో వెచ్చగానూ, ఎండాకాలంలో చల్లగానూ ఉంటుంది. కరవొచ్చినా, వరదలొచ్చినా ఈ పుష్కరిణుల్లోని నీటి మట్టంలో హెచ్చుతగ్గులుండకపోవడం మరో విశేషం. వీటిలో స్నానం చేయడం వల్ల జన్మజన్మల పాపాలూ నశించి, ఆరోగ్యం సంప్రాప్తిస్తుందన్నది పురాణోక్తి.

క్షేత్ర ప్రదక్షిణ 
మహానంది క్షేత్రానికి చుట్టూ 16 కిలోమీటర్ల దూరంలో నవనందులు వెలిశాయి. ఈ ఒక్క క్షేత్రంలోనే వినాయకనంది, గరుడనంది ఆలయాలు కొలువుదీరాయి. నంద్యాలపట్టణంలో ప్రథమనంది, నాగనంది, సోమనంది ఆలయాలూ, బండిఆత్మకూరు మండలంలోని కడమలకాల్వలో శివనంది, నల్లమల అడవిలో విష్ణునంది గుళ్లున్నాయి. మహానందికి 8 కిలోమీటర్ల దూరంలోని తమడపల్లె గ్రామానికి దగ్గర్లో సూర్యనంది క్షేత్రం ఉంది. ఉదయపు వేళ ఇక్కడి శివలింగం మీద సూర్యుడి కిరణాలు పడతాయి. ఈ ఆలయాల పేర్ల వెనుక ఆయాచోట్ల శివుడి కోసం తపస్సు చేసిన వాళ్ల కథలున్నాయి. అంటే నాగనందిలో నాగేశ్వరుడూ, సోమనందిలో చంద్రుడూ.. ఇలా శివుడికోసం తపస్సు చేసిన భక్తుల పేర్లమీదుగానే ఈ ఆలయాలు ప్రసిద్ధిపొందాయి. ఈ క్షేత్రాలను దర్శిస్తే భూ ప్రదక్షిణ ఫలితం దక్కుతుందన్నది పురాణోక్తి. కార్తికమాసంలోని సోమవారం, పౌర్ణమి రోజుల్లో భక్తులు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయంలోపు కాలినడకన నవనందీశ్వరులనూ దర్శనం చేసుకోవడం ఆనవాయితీ. అలా వెళ్లే వారు నంద్యాలలోని భ్రమరాంబామల్లికార్జునస్వామి ఆలయంలోని సాక్షిగణపతిని దర్శించుకొని ఈ యాత్రను ప్రారంభిస్తారు.

నంద్యాల నుంచి 19కిలోమీటర్లు బస్సులో ప్రయాణించి మహానందికి చేరొచ్చు. గుంటూరు-గుంతకల్లు మార్గంలోని గాజులపల్లె రైల్వేస్టేషన్‌లో దిగితే క్షేత్రానికి ఆరు కిలోమీటర్ల దూరం ఉంటుంది.                            - గద్వాల రామకృష్ణుడు, మహానంది, న్యూస్‌టుడే

navanandulu



నటరాజస్వామి ఆనందతాండవ క్షేత్రం చిదంబరం_ChidambaramNatarajSwamy

నటరాజస్వామి ఆనందతాండవ క్షేత్రం  చిదంబరం_ChidambaramNatarajSwamy
నటరాజస్వామి
ఆనందతాండవ క్షేత్రం 
చిదంబరం

పరమశివుడు నటరాజస్వామిగా ఆనంద తాండవం చేసిన మహాపుణ్యక్షేత్రం చిదంబరం. తమిళనాడులోని చిదంబరం పంచభూత క్షేత్రాల్లో ఒకటిగా యుగయుగాల నుంచి ప్రసిద్ధిపొందింది. పంచభూతాల్లో ఒకటైన ఆకాశతత్వానికి నిదర్శనంగా నిలుస్తోంది. 50 ఎకరాలుగా పైగా ఉన్న సువిశాల స్థలంలో విస్తరించివున్న ఈ క్షేత్రంలో శివ, కేశవ మందిరాలు ఉండటం విశేషం. వైష్ణవులకు శ్రీరంగం ఎంత పవిత్రమో.. శైవులకు చిదంబరం అంత పవిత్రమైన మహాక్షేత్రమని పురాణ గ్రంథాలు పేర్కొంటున్నాయి. పంచభూత ఆలయాల్లోని శ్రీకాళహస్తి, కంచి, చిదంబరం ఒకే అక్షాంశంపై నిర్మితమై ఉండటం విశేషం.

నటరాజస్వామి..
ఇక్కడ ఈశ్వరుడు నటరాజస్వామిగా దర్శనమిస్తాడు. నాట్యభంగిమలో ఉన్న స్వామి పాదం కింద అజ్ఞానం రాక్షసుడి రూపంలో ఉంటుంది.చేతిలో నిప్పు దుష్టశక్తులను నాశనం చేస్తుందని అర్థం. అలాగే మరో హస్తం సర్వజగత్తును పరిరక్షించేవాడని సూచిస్తుంది. ఢమరుకం జీవం పుట్టుకను సూచిస్తుంది. పరమశివుడు చిద్విలాస నాట్యాన్ని వీక్షించాలని ఆదిశేషువు ఆశిస్తాడు. అంత మహావిష్ణువు యోగ స్వరూపుడైన పతంజలి రూపాన్ని ప్రసాదించి భూమిపైకి పొమ్మని ఆజ్ఞాపించినట్టు పురాణాలు పేర్కొంటున్నాయి.

స్థల పురాణం
‘చిత్‌’ అంటే మనస్సు. అంబరం అంటే ఆకాశం అని అర్థం. ఎన్నో యుగాలకు ముందు పరమేశ్వరుడు ఇక్కడి తిలై వనాల్లో విహరించేవాడు. శివుడు భిక్షువు రూపంలో తిరుగుతుంటే మోహిని అవతారంలోని విష్ణుమూర్తి ఆయనను అనుసరిస్తాడు. పార్వతీనాథుని ప్రకాశవంతమైన తేజస్సుకు మునుల సతీమణులు ఆశ్చర్యానికి లోనవుతారు. దీంతో ఆగ్రహించిన మునులు సర్పాలను వదులుతారు. లయకారకుడైన శివుడు వాటిని మెడకు, నడుముకు కట్టుకుంటాడు. ఈ సంఘటనతో మరింత ఆగ్రహించిన మునులు ఒక రాక్షసుడిని పంపుతారు. శివుడు ఆ రాక్షసుడి వీపు మీద కాలు మోపి కదలకుండా చేస్తాడు. అనంతరం ఆనందతాండవం చేస్తాడు. దీంతో భగవంతుని నిజ స్వరూపాన్ని గ్రహించిన మునులు ఆయనను శరణు వేడుకుంటారు.

చిదంబర రహస్యమంటే..
ఈ క్షేత్రంలో స్వామి విగ్రహ, ఆకార రహిత ఆకాశ, స్ఫటిక లింగ రూపాల్లో ఉంటారు. అయితే, విగ్రహాన్ని మాత్రమే చూడగలం గానీ ఇతర రూపాలను చూడలేము. చిత్‌సభానాయక మండపంలోని స్వామివారు ఆకాశ రూపంలో కంటికి కనిపించకుండా ఉంటారు. పురోహితులు మందిరంలోని తెరను తొలగించి హారతిని ఇస్తారు. భగవంతుడు ఆదియును అంతమును లేనివాడు అనేందుకు ఇంతకన్నా నిదర్శనం ఉండబోదు. మన అజ్ఞానాన్ని తొలగించుకొని భగవంతున్ని సన్నిధిని వీక్షించడంతో దివ్యానుభూతి కలుగుతుంది.

గోవిందరాజస్వామి సన్నిధి
ఆలయ ప్రాంగణంలోనే శ్రీ గోవిందరాజస్వామి మందిరం ఉంది. శివ,కేశవ మందిరాలు ఒకే ప్రాంగణంలో ఉండటం అరుదైన విశేషం. హరి, హరులకు ఎలాంటి భేదాలు లేవని ఈ క్షేత్రం నిరూపిస్తోంది. 108 దివ్యదేశాల్లో ఒకటిగా గోవిందరాజస్వామి ఆలయాన్ని పేర్కొంటారు. కులశేఖర ఆళ్వారు తన రచనల్లో ఈ ఆలయాన్ని ప్రస్తావించారు.

మానవదేహానికి ప్రతీక..
ఆలయం మానవ దేహానికి ప్రతీకగా ఉంటుందని పెద్దలు చెబుతారు. నమఃశివాయ మంత్రంలో 21,600 బంగారు పలకలను వినియోగించారు. ఒక మనిషి ప్రతిరోజూ తీసుకునే శ్వాస ప్రక్రియతో ఈ సంఖ్య సరిపోతుంది. అలాగే చిత్‌సభ (పొన్నాంబళం)లో 72 వేల మేకులు వాడారు. ఇది మన దేహంలోని నరాల సంఖ్య అని చెప్పవచ్చు. ఇలా అనేక విశేషాల సమాహారంతో కూడిన చిదంబర క్షేత్ర సందర్శన మనకు మంచి ఆధ్యాత్మిక ఆనందాన్ని కలిగిస్తుంది.
ఎలా చేరుకోవాలంటే.. 

* తమిళనాడులోని కడలూర్‌ జిల్లాలో చిదంబరం ఉంది.
* చెన్నై ఎగ్మూర్‌- తంజావూర్‌ రైలు మార్గంలో చిదంబరం చేరుకోవచ్చు.
* పుదుచ్చేరి విమానాశ్రయంలో దిగి ప్రైవేటు వాహనాల ద్వారా చిదంబరం వెళ్లొచ్చు.
* దేశంలోని పలు నగరాల నుంచి రోడ్డు మార్గం ద్వారా ఈ క్షేత్రానికి చేరుకునే సదుపాయముంది.

కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి_Kotappakonda Sri Tri Koteswara Swamy

Sri Tri Koteswara Swamy Kotappakonda  Sri Tri Koteswara Swamy కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి


కోటప్పకొండ
త్రికోటేశ్వర స్వామి

పరమేశ్వరుడు జ్ఞానోపదేశం ఇచ్చిన పవిత్ర పుణ్యక్షేత్రమే కోటప్పకొండ. సృష్టికర్త బ్రహ్మదేవునికే జ్ఞానోపదేశం ఇచ్చిన ప్రదేశంగా యుగయుగాల నుంచి ఖ్యాతిచెందింది. ‘చేదుకో కోటయ్య.. మమ్మాదుకోవయ్యా...’ అంటూ యల్లమంద కోటయ్యగా ప్రజల పూజలందుకొనే త్రికోటేశ్వరస్వామి వారి దేవాలయం గుంటూరు జిల్లా నరసరావు పేట సమీపంలోని కోటప్పకొండ గ్రామంలో ఉంది. మహాశివరాత్రి పర్వదినాల్లో అత్యంత రద్దీగా భక్తజనంతో నిండిపోతుంది.
దేవాలయ చరిత్ర
దీనికి కచ్చితమైన ఆధారాలేమి లేకపోయినప్పటికీ శాసనాల ఆధారంగా ఈ ఆలయాన్ని క్రీ.శ 1172లో నిర్మించినట్లు చరిత్ర చెబుతుంది. ఈ ప్రాంతాన్ని పాలించిన రాజులలో ఒకరైన విజయనగర చక్రవర్తి శ్రీ కృష్ణదేవరాయలు భూరి విరాళాలు ఇచ్చారని శాసనాలు తెలుపుతున్నాయి. కోటప్ప కొండ ఎత్తు 1587 అడుగులు. త్రికోటేశ్వర స్వామి ఆలయం 600 అడుగుల ఎత్తులో ఉంది. ఈ కొండను ఏ కోణం నుంచి చూసిన మూడు శిఖరాలు కనబడుతుంటాయి. అందుకే దీనికి త్రికూటాచలమనే పేరు వచ్చింది. ఈ మూడు శిఖరాలను బ్రహ్మ, విష్ణు, రుద్ర రూపాలుగా భావిస్తారు.
పురాణ కథనం
శివుడు దక్ష యజ్ఞాన్ని భగ్నం చేసిన తరువాత బాలదక్షిణామూర్తి అవతారంలో బాలునిగా మారి కైలాసంలో కఠిన తపస్సును ఆచరిస్తూంటాడు. ఆ సమయంలో బ్రహ్మ దేవతలందరితోను కలిసి దక్షిణామూర్తిని సందరిస్తాడు. స్వామి వారిని మాకు జ్ఞానబోధ చేయమని వేడుకుంటారు. అప్పుడు పరమేశ్వరుడు త్రికూటాచలానికి వస్తే జ్ఞానాన్ని ఇస్తానని చెప్తాడు. అప్పుడు బ్రహ్మతో పాటు ఇతర దేవతలందరు కూడా త్రికూటాచలానికి వస్తారు అప్పుడు శివుడు త్రికూట కొండపైనే వెలసి వారందరికి జ్ఞానోపదేశాన్ని బోధిస్తాడు. ఆ ప్రదేశంలో ఉన్న గుడికే పాత కోటప్పగుడి అని పేరు. ఆలయం లోపలి లింగం కేవలం ఒక్క అడుగు మాత్రమే ఉంటుంది. గుడి ఉన్న శిఖరాన్ని రుద్ర శిఖరమని, పక్కన ఉన్న శిఖరాన్ని విష్ణు శిఖరమని అంటారు.
దక్ష యజ్ఞం సమయంలో హవిస్సును స్వీకరించిన పాపం పోవడానికి విష్ణువు ఈ శిఖరం పై తపస్సు ఆచరిస్తాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై త్రిశూలంతో నేల మీద పొడుస్తాడు. అలా పొడిచినప్పుడు ఏర్పడ్డ రంధ్రాల నుంచి వచ్చిన జలాన్ని స్వీకరించి స్నానమాచరిస్తే సకల పాపాలు తొలుగుతాయని చెప్తాడు. విష్ణువు శివుడు చెప్పిన విధంగా చేసి తన పాపాలను పోగొట్టుకుంటాడు. ఆ విధంగా ఇక్కడ వెలసిన శివున్ని పాపవినాశనేశ్వరుడనే పేరుంది.
రుద్ర శిఖరానికి నైరుతి భాగంలో ఉన్న శిఖరానికి బ్రహ్మ శిఖరమని పేరు. రుద్రవిష్ణు శిఖరాలపై స్వయంభువుగా లింగాలు వెలిశాయి. కానీ బ్రహ్మ శిఖరం పై ఏమి లేకపోవడంతో బాధపడిన బ్రహ్మ శివుని కోసం తపస్సు చేసి లింగావిర్భవం అయ్యేటట్లు చేస్తాడు.
ఈ ప్రదేశానికి తూర్పున మునిమంద/ ఎల్లమంద అనే పేర్లు గల చిన్న పల్లెటూరు ఉంది. ముందుగా బ్రహ్మదిదేవతలంతా ఈ ప్రదేశంలో ఉన్నారని అందుకే ఈ ప్రాంతానికి ఆ పేరు వచ్చిందని ప్రశస్తి. బ్రహ్మ శిఖరం మీద ఉన్న లింగానికే కొత్త కోటప్పకొండ అని పేరు.
మహాభక్తురాలు.. ఆనందవల్లి..
స్థలపురాణం ప్రకారం శివభక్తుడైన సాలంకయ్యకు శివఅనుగ్రహంతో ఐశ్వర్యం లభిస్తుంది. పరమేశ్వరుడు కొన్ని రోజుల పాటు జంగమదేవర రూపంలో అతని ఇంటికి వచ్చేవాడు. కొన్నాళ్లకు కనిపించలేదు. దీంతో సాలంకయ్య నిరాశ చెందాడు. ఆ సమయంలోనే ఒక దంపతులకు ఆనందవల్లి అనే పాప జన్మించింది. పెరిగేకొద్ది శివునిపై భక్తి పెంచుకొని శైవగీతాలు ఆలపించేది. కొంతకాలం అనంతరం తపస్సు చేయడంతో స్వామి ప్రత్యక్షమయ్యారు. ఆనందవల్లి ప్రతిరోజూ రుద్రాచలానికి వచ్చి శివలింగానికి పూజలు నిర్వహించేది. ఈ సంగతి తెలుసుకున్న సాలంకయ్య తనకు కూడా శివదర్శనం ఇప్పించాలని కోరాడు. అయితే ఆమె అంగీకరించక శివుని ఆరాధనలో కొనసాగింది. ఒక రోజు అభిషేకం కోసం జలం తీసుకువెళుతుండగా నీటి కొరకు ఒక కాకి బిందె మీద వాలింది. దీంతో ఆగ్రహించి కాకులు ఇక్కడకు రాకూడదని శాపం పెట్టింది. ఇప్పటికీ కాకులు ఈ క్షేత్రంలో రాకపోవడం విశేషం. ఆమె భక్తికి మెచ్చిన పరమేశ్వరుడు ఆమెను కుటుంబజీవితం కొనసాగించమని బ్రహ్మచారిణిగా ఉన్న ఆమెను గర్భవతిగా మారుస్తాడు. అయినా ఆమె శివారాధన చేయడం మానలేదు. ఆమె భక్తికి మెచ్చిన ఈశ్వరుడు ప్రత్యక్షమై తానే ఆమె వెంట వచ్చి పూజలు స్వీకరిస్తానని అయితే ఇంటికి వెళ్లే సమయంలో తిరిగి చూడకుండా వెళ్లాలని ఆజ్ఞాపిస్తాడు. ఆనందవల్లి కొండ మెట్లు దిగుతూ ఒక చోట కుతూహలం కొద్దీ వెనక్కు తిరిగి చూడటంతో స్వామి వెంటనే అక్కడ వున్న గుహాలో లింగరూపం ధరించాడు. ఆనందవల్లికి కుమారుడు జన్మించాడు. తాను వెనక్కు తిరిగిచూడటంపై వల్లి బాధపడింది. మరణానికి సిద్ధం కావడంతో పరమేశ్వరుడు ప్రత్యక్షమవుతాడు. ఆ సమయంలో బాలుడు కూడా అదృశ్యమవుతాడు. ఇదంతా శివమాయ అని ఆనందవల్లి గ్రహిస్తుంది. అనంతరం శివునిలో ఆమె ఐక్యమైంది.
ప్రభలు..
మహాశివరాత్రి సందర్భంగా ప్రభల ప్రదర్శన అత్యంత వైభవంగా సాగుతోంది. జంగమయ్య చిత్రాలతో చిన్న ప్రభల నుంచి భారీ ఎత్తున ప్రభలను వూరేగింపుగా తీసుకువస్తారు. కొన్ని ప్రభలు యాభై అడుగుల కంటే ఎక్కువ ఎత్తు ఉండటం విశేషం. గతంలో ఎడ్లబండ్లలో తీసుకువచ్చేవారు. ప్రస్తుతం ట్రాక్టర్లను ఎక్కువగా వినియోగిస్తున్నారు.
దర్శన వేళలు
ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు, మళ్లీ మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ఉంటుంది. స్వామివారికి అర్చన, ఉచిత దర్శనం సమయంలో తీసుకుంటే రూ.5 టికెట్‌ తీసుకోవాల్సి ఉంటుంది. ఇది కాకుండా ప్రత్యేక దర్శనం రూ.75, అష్టోత్రం రూ.100, అభిషేకం దంపతులకు మాత్రమే రూ.200, పంచ హారతి ఒక్కొక్కరికి రూ.100, పిల్లలకు అన్నప్రాసన చేయిస్తే రూ.150, అక్షరాభ్యాసం చేయిస్తే రూ.150 వీటితో పాటు వాహన పూజలు చేయించుకోవచ్చు. నవగ్రహ పూజ, శనిత్రయోదశి సందర్భాల్లో రూ.200 చెల్లించి పూజలు చేయించుకోవాలి. శాంతి యాదశాల పూజకు రూ.1116లు, మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం (ఒకే కుటుంబానికి) రూ.1116లు చెల్లించాల్సి ఉంటుంది. మూలవిరాట్‌ అభిషేకం పర్వదినాల్లో అయితే రూ.400 చెల్లించాలి. ఇవి కాకుండా ప్రత్యేక స్కీములు ద్వారా కూడా స్వామివారికి పూజలు నిర్వహిస్తారు. జీవితకాల అభిషేకం (పదేళ్లు) రూ.2116లు, జీవిత కాల అష్టోత్రం (10 ఏళ్లు) రూ.1116లు, నిత్య గోత్రనామ పథకం ఏడాదికి రూ.1116లు చెల్లించాలి. కొండ వద్ద వసతిగృహాలు ఉన్నాయి. ఆనందవల్లి అతిథిగృహంలో గదికి రూ.250 చెల్లించాలి. తోట వారి అతిథిగృహంలో అయితే రూ.300, నంది అతిథిగృహంలో రూ.750 చొప్పున రుసుములు చెల్లించాల్సి ఉంది.
పర్యాటక క్షేత్రం
కోటప్పకొండ పర్యావరణ పర్యాటక క్షేత్రంగానూ అభివృద్ధి చెందుతోంది. సభాపతి డాక్టర్‌ కోడెల శివప్రసాదరావు పర్యాటక క్షేత్ర అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే భక్తుల కోసం బోట్‌ షికారు, టాయ్‌ ట్రైన్‌, బోట్‌ షికారు కోసం కాళింది మడుగు, పిల్లలు ఆడుకోవడానికి వీలుగా ఆట వస్తువులతో ఏర్పాటు చేసిన పిల్లల రాజ్యం, అక్వేరియం ప్రత్యేకంగా ఆకర్షణలుగా నిలుస్తున్నాయి. త్వరలో తీగమార్గం రాబోతోంది. కార్తీక మాసం అనగానే సహజంగానే వనభోజనాలు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుంటారు. అనేక పట్టణాల నుంచి, పిల్లల నుంచి పాఠశాలల విద్యార్థులను కార్తీక మాసంలో ఇక్కడ క్షేత్రానికి తీసుకువచ్చి అన్ని చూపించి భోజనాలు ఆయా పాఠశాలల యాజమాన్యాలే ఏర్పాటు చేస్తున్నాయి. ఇవికాకుండా కొండ కింద అన్ని సామాజిక వర్గాలకు అన్నదాన సత్రాలు ఉన్నాయి. ఇక్కడ ఈ సత్రాలకో ప్రత్యేకత ఉంది. గతంలో అయితే పండుగల సమయంలోనే ఉచిత భోజనం ఉంది. ఇప్పుడు భక్తులు ముందుగా వచ్చి చెబితే నిత్యం భోజన ఏర్పాట్లు చేస్తున్నారు.
రాకపోకలకు మార్గాలు 
విజయవాడ, గుంటూరు వైపు నుంచి వచ్చే యాత్రికులు చిలకలూరిపేట మీదుగా, నరసరావుపేట మీదుగా కూడా కోటప్పకొండకు చేరుకోవచ్చు. సత్తెనపల్లి, పెదకూరపాడు ప్రాంతాల భక్తులు నరసరావుపేట మీదుగానే కోటప్పకొండకు చేరవచ్చు. మాచర్ల, గురజాల, కారంపూడి యాత్రికులు కూడా నరసరావుపేట మీదుగా కోటప్పకొండకు వెళ్లే మార్గం ఉంది. ప్రకాశం జిల్లాలోని మార్కాపురం, దర్శి, కురిచేడు, త్రిపురాంతంకం, యర్రగొండపాలెం తదితర ప్రాంతాల భక్తులు వినుకొండ మీదుగా నరసరావుపేట వచ్చే మార్గంలో పెట్లూరివారిపాలెం మీదుగా కోటప్పకొండకు చేరవచ్చు.Sri Tri Koteswara Swamy Kotappakonda  Sri Tri Koteswara Swamy కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి



తెలంగాణ శ్రీశైలం... ఓదెల_odelaMallanna

తెలంగాణ శ్రీశైలం... ఓదెల_odela

తెలంగాణ శ్రీశైలం...
 ఓదెల మల్లికార్జున స్వామి దేవాలయం
అక్కడ కొలువైన శివయ్య భక్తవత్సలుడు. తనకు గాయం చేసిన భక్తుడికి సైతం మోక్షాన్ని ప్రసాదించడమే కాకుండా అతడి పేరును పక్కన చేర్చుకుని ఓదెల మల్లన్నగా పూజలందుకుంటున్నాడు. శ్రీశైలం మాదిరిగానే లింగరూపం, పానపట్టం ఉండటంతో తెలంగాణ శ్రీశైలంగా విరాజిల్లుతున్న శైవక్షేత్రమే పెద్దపల్లి జిల్లాలోని ఓదెల మల్లికార్జున స్వామి దేవాలయం.
దిక్కులనే అంబరాలుగా కలిగిన ఆ దేవదేవుడు భ్రమరాంబ సహిత మల్లికార్జునుడిగా వెలుగొందుతున్న క్షేత్రం ఓదెల. పురాతన శైవ క్షేత్రాల్లో ఈ ఆలయం ఒకటి. ఇక్కడ మల్లికార్జునుడు స్వయంభూగా వెలిశాడనీ, ఆర్తిగా మల్లన్నా అని పిలిస్తేచాలు నేనున్నానంటూ అభయమిస్తాడనీ భక్తుల నమ్మకం. అందుకే, ఓదెల మల్లన్నను దర్శించుకోవడానికి దేశం నలుమూలల నుంచీ పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడ బారులుతీరుతారు.
స్థలపురాణం 
పూర్వం ఓదెల ప్రాంతమంతా దండకారణ్యంగా ఉండేదనీ, అక్కడే వెలసిన శివలింగాన్ని పంకజ మహాముని పూజించేవాడనీ ఆలయ స్తంభంపై చెక్కిన మునీశ్వరుడి రూపం, పేర్లూ తెలియజేస్తున్నాయి. కాలక్రమేణా ఈ శివలింగంపై పుట్ట పెరిగి, లింగం పూర్తిగా కనుమరుగైపోయింది. అదే స్థలంలో చింతకుంట ఓదెలు అనే రైతు వ్యవసాయం కోసం పుట్టను దున్నుతుండగా నాగలి పుట్టలోపలున్న లింగాన్ని బలంగా తాకింది. అంతే, భయంకరంగా ఓంకార నాదం చేస్తున్న అశరీరవాణి ‘ఓదెలా! ఇకపై ఈ వంశం నశించుగాక’ అని శపించింది. జరిగిన పొరపాటును గ్రహించిన ఓదెలు వెంటనే స్వామివారికి నమస్కరించి, తాను తెలియక చేశాననీ, తనని మన్నించమనీ ప్రాధేయపడ్డాడు. అతడి నిజాయతీనీ, పశ్చాత్తాప బుద్ధినీ మెచ్చిన శంకరుడు ఓదెలకు శాశ్వత మోక్షాన్ని ప్రసాదించడమే కాకుండా ఓదెల మల్లికార్జున స్వామిగా ఈ ప్రాంతంలోనే కొలువై భక్తుల కష్టాలను తీరుస్తానని అభయమిచ్చాడు. అప్పటి నుంచీ ఈ ఆలయం ఓదెల మల్లికార్జున స్వామి దేవాలయంగా విరాజిల్లుతోంది. ఇప్పటికీ ఇక్కడున్న శివలింగానికి నాగలి కర్ర చేసిన గాయాన్ని పోలిన మచ్చ కనిపించడం విశేషం.
కాకతీయుల కాలంలో ఈ ఆలయ పునర్నిర్మాణం జరిగిందని ఇక్కడి శాసనాలు తెలియజేస్తున్నాయి. స్వామి వారికి ఉత్తరంగా భ్రమరాంబ అమ్మవారినీ, క్షేత్రపాలకుడిగా వీరభద్రస్వామినీ ప్రతిష్ఠించారు. వీరశైవ ఆగమశాస్త్ర ప్రకారం శ్రీశైల పండితారాధ్య పీఠానికి సంబంధించిన అర్చకులతోనే స్వామి వారికి నిత్యకైంకర్యాలు జరుపుతున్నారు. ఆలయానికి పశ్చిమ దిశలో వీరశైవ మఠం కూడా ఉంది.
అపరభక్తులైన కొండవీటి వంశంలో మల్లన్న ఖండేశ్వరుడిగా అవతరించాడు. బలిజ వంశానికి చెందిన మెడలాదేవి, యాదవ కులానికి చెందిన కేతమ్మలనే కన్యలు ఖండేశ్వరస్వామిని భక్తితో సేవించి ఆయనలో లీనమయ్యారు. ఇందుకు తార్కాణంగానే ఆలయానికి ఈశాన్యదిశలో ఖండేశ్వర స్వామి, మేడలాదేవి, కేతమ్మల విగ్రహాలు ప్రతిష్ఠించారనీ పండితులు చెబుతున్నారు.
సీతారాములు నడయాడిన ప్రదేశం 
ఈ ఆలయంలో మరో విశేషమూ ఉంది. శ్రీరామచంద్రుడు వనవాసం చేస్తున్న సమయంలో రామగిరి ఖిల్లా నుంచి ఇల్లంతకుంటకు వెళ్లే మార్గంలో మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్నట్లు పురాణాలు పేర్కొంటున్నాయి. అందుకు ప్రతీకగా స్వామివారికి దక్షిణ దిశగా శ్రీ సీతారామచంద్రస్వామి విగ్రహాలను ఏర్పాటుచేశారని భక్తుల విశ్వాసం. ఆలయానికి తూర్పు దిశగా బంగారు పోచమ్మ, వాయవ్య దిశగా మదన పోచమ్మ ఆలయాలూ ఉన్నాయి.
ఆరాధనలూ అభిషేకాలూ 
ఫిబ్రవరి నెలలో నిర్వహించే బ్రహ్మోత్సవాల సందర్భంగా మల్లికార్జున స్వామి- భ్రమరాంబ దేవిల కల్యాణ మహోత్సవం అత్యంత రమణీయంగా జరుగుతుంది. కార్తీక, శ్రావణ మాసాల్లో జరిపే ప్రత్యేక పూజలూ, మహా శివరాత్రి సందర్భంగా నిర్వహించే మహారుద్రాభిషేకాలూ విశిష్టతను సంతరించుకుంటాయి. ఈ పూజల్లో పాల్గొనడానికి దేశం నలుమూలల నుంచీ పెద్దసంఖ్యలో భక్తులు ఇక్కడికి చేరుకుంటారు. ఒగ్గు పూజారులు వేసే పెద్ద పట్నాలు, అగ్నిగుండాల ప్రదక్షిణ, దక్షయాగాది కార్యక్రమాలను ప్రత్యేకంగా నిర్వహిస్తారు. స్వామివారికి తెల్లవారుజాము నుంచే మేలుకొలుపు సేవ, సుప్రభాత సేవలు ప్రారంభమవుతాయి. మంగళవాద్యాల నడుమ నిత్యాభిషేకాలూ, అన్నపూజలూ, మహా నివేదనలూ ఘనంగా నిర్వహిస్తారు. సాయంత్రం ఆరు గంటల తర్వాత జరిగే ప్రదోషకాల పూజలూ, హారతీ, ద్వార బంధన కార్యక్రమాలు విశిష్టమైనవి. పట్నాలు, బోనాల మొక్కులు సమర్పించే భక్తులతో ఈ ఆలయంలో ఎప్పుడూ పండగవాతావరణం నెలకొంటుంది.
ఇలా వెళ్లాలి... 
కరీంనగర్‌ జిల్లా కేంద్రానికి 40 కిలోమీటర్ల దూరంలో మల్లికార్జున స్వామి క్షేత్రం ఉంది. రైలూ రోడ్డు మార్గాల ద్వారా ప్రయాణించి ఈ ఆలయానికి చేరుకోవచ్చు. కరీంనగర్‌ బస్సు డిపో నుంచి పెద్దపల్లి చేరుకునే ప్రతి బస్సూ ఓదెల మీదుగానే వెళ్తుంది. వరంగల్‌ జిల్లా నుంచి 60 కిలోమీటర్లు రోడ్డు మార్గం ద్వారా ప్రయాణించి ఇక్కడకు చేరుకోవచ్చు.- ఎం.గణేశ్‌ కుమార్‌,  పెద్దపల్లి 


mohan publications price list