వేడి తగలకుండా వ్యాయామం..
వ్యాయామం వల్ల మేలెంతో చెప్పక్కర్లేదు. కానీ వేసవి వస్తే చాలామంది వ్యాయామం విషయంలో తటపటాయిస్తుంటారు. అధికవేడి వల్ల చెమట ఎక్కువగా బయటకుపోయి.. నీరసం రావడం, చిరాగ్గా అనిపించడం ఓ కారణం. ఆ సమస్య రాకుండా ఇలా చేయండి..
* ఆరుబయట చేసే పరుగూ, వేగవంతమైన నడక కంటే నీడపట్టున చేసే వ్యాయామాలకి ప్రాధాన్యం ఇవ్వండి. తప్పనిసరైతే ఉదయం ఎనిమిదిలోపు, సాయంత్రం ఆరుతర్వాతే నడకవంటి వ్యాయమాలు చేయండి. అప్పుడే ఎండ వేడి నుంచి తప్పించుకోగలుగుతారు. ముఖచర్మం ఆరోగ్యం కోసం కచ్చితంగా సన్‌స్క్రీన్‌లోషన్ రాసుకోండి.
* వ్యాయామం కోసం ఎంచుకునే దుస్తులు శరీరానికి తగిన గాలినందించేలా ఉండాలి. చెమటని ఇట్టే పీల్చుకునేవై ఉండాలి. టీ షర్ట్‌లు, ట్యాంక్ టాప్‌లు, షార్ట్‌ల వంటివి చక్కగా సరిపోతాయి ఈ కాలానికి.
* వ్యాయామం చేసేప్పుడు కచ్చితంగా నీళ్ల సీసా దగ్గర పెట్టుకోండి. అలసట అనిపించినప్పుడు గటగటా తాగేయకుండా కొద్దికొద్దిగా చప్పరించండి చాలు.
* నీళ్లు మరీ అధికంగా తాగితే.. ఎక్కుసార్లు మూత్రం పోవడం వల్ల శరీరంలో సోడియం నిల్వలు తగ్గిపోతుంటాయి. కాబట్టి నీళ్లకి ప్రత్యామ్నాయంగా పళ్లరసాలు, కొబ్బరినీళ్లు, ఎలక్ట్రోలైట్ సాల్ట్ వంటివి తీసుకోండి. శరీరం తాజాగా ఉంటుంది.

No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565