MohanPublications Print Books Online store clik Here Devullu.com

నగలు కొత్తగా మెరవాలంటే?


      ఆడవాళ్లకు చీరలు, నగలంటే మక్కువ ఎక్కువ. అందుకే వాటిని ఎంతో ప్రీతిగా చూసుకుంటారు. బట్టలనంటే అలమరలో పెడతారు. కానీ నగల విషయం అలా కాదు. విలువైన ఆభరణాల మెరుపులు పోకుండా ఏ నగలను ఎలా జాగ్రత్త చేయాలో చదవండి.. 


బంగారు నగలు.. 


- బంగారం మెరుపు ఎక్కువ కాలం ఉంటుంది. వారానికి రెండుసార్లు తక్కువ డిటర్జెంట్, గోరువెచ్చని నీళ్లు, మెత్తని గుడ్డతో బంగారు నగలను శుభ్రం చేయాలి.
- క్లోరిన్ తగిలితే బంగారం బలహీనపడుతుంది. కాబట్టి వాటికి దూరంగా ఉంచాలి. నగలన్నీ ఒకేచోట కాకుండా వేరువేరుగా భద్రపరిస్తే చిక్కులు పడకుండా ఉంటాయి.
- రాళ్లు పొదిగిన బంగారు నగలను ఆల్కహాల్ కలిపిన ద్రవాలతో ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు. దీనివల్ల రాళ్లను అంటించడానికి పెట్టిన జిగురు పలుచన అవుతుంది. రాళ్లు ఊడిపోయే ప్రమాదం
ఉంటుందన్నమాట.

వజ్రాల నగలు.. 


- నగల దుకాణంలో దొరికే క్లీనింగ్ సొల్యూషన్ మాత్రమే వాడాలి. లేదా అమ్మోనియా కలిపిన నీళ్లను కూడా వాడవచ్చు. వీటి మీద ప్రయోగాలు మాత్రం చేయవద్దు.
- మెత్తని బ్రష్‌తో రుద్ది, మెత్తని వస్త్రంతో మాత్రమే శుభ్రం చేయాలి.
- వజ్రాలు పొదిగిన ఉంగరాలు ధరించి వంట పనులు చేయకూడదు. పదార్థాల వల్ల వజ్రాలు మెరుపు కోల్పోతాయి.


ముత్యాల నగలు.. 


- ముత్యాలను ధరించేటప్పుడు, భద్రపరిచేటప్పుడు జాగ్రత్త వహించండి. మెత్తని బట్టతో మాత్రమే ముత్యాలను శుభ్రం చేయాలి. డబ్బాలో మెత్తటి బట్ట వేసి గాలి చొరబడకుండా మూత పెట్టేయాలి.
- పర్‌ఫ్యూమ్, మేకప్, హెయిర్ స్ప్రేల వల్ల ముత్యాల రంగు మారుతుంది. కాబట్టి వాటిని మొత్తం రెడీ అయ్యాకే ధరించండి.
- ముత్యాల నగలు శుభ్రం చేయడానికి బేకింగ్ సోడా, బ్లీచ్‌లను ఉపయోగించ కూడదు.
- ఈ నగలను ప్లాస్టిక్ సంచుల్లో భద్రపరచకూడదు.

వెండి నగలు


- పాస్ఫేట్, డిటర్జెంట్ కలిపిన నీళ్లతో వెండి నగలను శుభ్రం చేయాలి. తర్వాత గోరువెచ్చని నీటితో కడిగి శుభ్రమైన గుడ్డతో తుడవాలి.
N కుంకుడు రసంలో కూడా కాసేపు నానబెట్టి ఆ తర్వాత శుభ్రం చేసినా కొత్తవాటిలా మెరిసిపోతాయి.
- కాగితంలో, కార్డ్‌బోర్డ్, కలపతో చేసిన డబ్బాల్లో వెండి నగలను ఉంచకూడదు.
- పూర్తిగా తడి ఆరాకే వెండి వస్తువులను దాచిపెడితే భద్రంగా ఉంటాయి.

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list