పరమాచార్య స్వామి
అష్టోత్తర శతనామావళి
|
శ్రీచంద్రశేఖర యతీంద్ర సరస్వతీనాం
శాంతంతరంగకలితాఖిల భావుకానాం
కాంచీపురీస్థిత మహోన్నత కామకోటి
పీఠీం (దేవీం) ఉపాశ్రిత వతాం చరణాంఉపాసే.
శ్రీచంద్రశేఖరేంద్రాన్మమదాచార్యాయ నమః
శ్రీచంద్రమౌళి పాదాబ్జ మధుపాయ నమః
ఆచార్యపాదాధిష్టానాభిషిక్తాయ నమః
సర్వజ్ఞాచార్య భగవత్స్వరూపయ నమః
అష్టాంగయోగ నిష్టాది గరిష్ఠాయ నమః
సనకాది మహాయోగి సదృశాయ నమః
మహాదేవేంద్ర హస్తాబ్జ సంజాతాయ నమః
మహాయోగీంద్ర సంవేద్య మహత్వాయ నమః
కామకోటి మహాపీఠాధీశ్వరాయ నమః
కలిదోష నివృత్త్యేక కారణాయ నమః ||10
శ్రీ శంకర పదామ్భోజ చిన్తనాయ నమః
భారతీకృత జిహ్వాగ్ర నర్తనాయ నమః
కరుణారస కల్లోల కటాక్షాయ నమః
కాన్తి నిర్జిత సూర్యేందు కమ్రాభాయ నమః
అమన్దానంద కృన్మంద గమనాయ నమః
అద్వైతానంద భరిత చిద్రూపాయ నమః
కటితట లసచ్చారు కాషాయాయ నమః
కటాక్షమాత్ర మోక్షేచ్ఛా జనకాయ నమః
బాహుదండ లసద్దండ భానురాయ నమః
ఫాలభాగ లసద్భూతి భూషితాయ నమః ||20
దరహాస స్ఫుర ద్దివ్య ముఖాబ్జాయ నమః
సుధామధు సౌహార్ద భాషణాయ నమః
తపనీయ తిరస్కారి శరీరాయ నమః
తపఃప్రభా విరాజత్వక్తాదృశాయ నమః
సంగీతానంద సందోహ సర్వస్వాయ నమః
సంసారాంబుధి నిర్మగ్న తారకాయ నమః
మస్తకోల్లాసి రుద్రాక్ష మకుటాయ నమః
సాక్షాత్పర శివామోఘ దర్శనాయ నమః
చక్షుర్గత మహాతేజోత్యుజ్వలాయ నమః
సాక్షాత్కృత జగన్మాతృ స్వరూపాయ నమః ||30
క్వచిద్బాల జనాత్యస్త సులభాయ నమః
క్వచిన్మహా జనాత్యంత దుష్పాపృపాయ నమః
గోబ్రాహ్మణ హితాసక్త మానసాయ నమః
గురుమండల సంభావ్య విదేహాయ నమః
భావనామాత్ర సంతుష్ట హృదయాయ నమః
భావ్యాది భావ్య దివ్యశ్రీ పదాబ్జాయ నమః
వ్యక్తావ్యక్త తరానేక చిత్కళాయ నమః
రక్తశుక్ల ప్రభామిశ్ర పాదుకాయ నమః
భక్తమానస రాజీవ భవనాయ నమః
భక్తలోచన రాజీవ భాస్కరాయ నమః ||40
భక్త కామలతా కల్పపాదపాయ నమః
భుక్తి ముక్తి ప్రదానేక శక్తిదాయ నమః
శరణాగత దీనార్త రక్షకాయ నమః
శమాది షట్క సంపత్ప్రదాయకాయ నమః
సర్వదా సర్వధా లోక సౌఖ్యదాయ నమః
సదా నవనవాకాంక్ష్య దర్శనాయ నమః
సర్వ హృత్పద్మ సంచార నిపుణాయ నమః
సర్వేంగిత పరిజ్ఞాన సమర్థాయ నమః
స్వప్నదర్శన భక్తేష్ట సిద్ధిదాయ నమః
సర్వ వస్తు విభావ్యాత్మ సద్రూపాయ నమః ||50
దీనభక్తావనైకాంత దీక్షితాయ నమః
జ్ఞానయోగ బలైశ్వర్య మానితాయ నమః
భావమాధుర్య కలిత భావాఢ్యాయ నమః
సర్వభూత గణామేయ సౌహార్దాయ నమః
మూకీభూతానేక లోకవాక్ప్ర దాయకాయ నమః
శీతలీకృత హృత్తాప సంసేవ్యాయ నమః
భోగమోక్ష ప్రదానేక యోగజ్ఞాయ నమః
శ్రీఘ్రసిద్ధికరానేక శిక్షణాయ నమః
అమానిత్వాది ముఖ్యార్థ సిద్ధిదాయ నమః
అఖండైక రసానంద ప్రబోధాయ నమః
నిత్యా నిత్య వివేక ప్రదాయకాయ నమః ||60
ప్రత్యగేక రసాఖండ చిత్సుఖాయ నమః
ఇహాముత్రార్థ వైరాగ్య సిద్ధిదాయ నమః
మహామోహ నివృత్యర్థ మంత్రదాయ నమః
క్షేత్ర క్షేత్రజ్ఞ ప్రత్యేక దృష్టిదాయ నమః
క్షయవృద్ధి విహీనాత్మ సౌఖ్యదాయ నమః
తులాజ్ఞాన విహీనాత్మ తృప్తిదాయ నమః
మూలాజ్ఞాన విహీనాత్మ ముక్తిదాయ నమః
భ్రాంతి మోఘోచ్ఛాటన ప్రభంజనాయ నమః
శాంతి వృష్టి ప్రదామోఘ జలదాయ నమః
ఏక కాలకృతానేక దర్శనాయ నమః ||70
ఏకాంత భక్త సంవేద్య స్వభావాయ నమః
శ్రీ చక్ర రధ నిర్మాణ సుప్రదాయ నమః
శ్రీ కళ్యాణ తరామేయ సుశ్లోకాయ నమః
ఆశ్రితాశ్రయణియత్వ ప్రాపకాయ నమః
అఖిలాండేశ్వరీ కర్ణ భూషాధాత్రే నమః
సశిష్యగణయాత్రా విధాయకాయ నమః
సాధుసంఘ సుతామేయ చరణాయ నమః
అవిభిన్నాత్మైక్య విజ్ఞానబోధకాయ నమః
భిన్న భిన్న మతైశ్చాభి పూజితాయ నమః ||80
తత్వవిద్విపాక సద్బోధ దాయకాయ నమః
తత్తద్భాషా ప్రకటిత స్వబోధాయ నమః
సర్వత్ర సాధితానేక సత్కార్యాయ నమః
చిత్ర చిత్ర ప్రభావాతి ప్రసిద్ధాయ నమః
లోకానుగ్రహ కృత్కర్మ నిష్ఠితాయ నమః
లోకోద్ధరణ కృద్భూరి నియమాయ నమః
సర్వవేదాంత సిద్ధాంత సమ్మతాయ నమః
కర్మబ్రహ్మాత్మ యోగాది మర్మజ్ఞాయ నమః
వర్ణాశ్రమ సదాచార రక్షకాయ నమః
ధర్మార్థ కామ మోక్ష ప్రదాయకాయ నమః ||90
వేద వాక్య ప్రమాణాది పారీణాయ నమః
పాదమూల సతానేక పండితాయ నమః
వేదశాస్త్రార్థ సద్గోష్ఠిలోలుపాయ నమః
వేదశాస్త్ర పురాణాది విచారాయ నమః
వేద వేదాంగ తత్వ ప్రబోధకాయ నమః
వేదమార్గ ప్రమాణత్వఖ్యాపకాయ నమః
నిర్ణిద్ర తేజోవిరాజిత నిద్రాఢ్యాయ నమః
నిరంతర మహానంద సంపూర్ణాయ నమః
స్వభావ మధురోదార గాంభీర్యాయ నమః
సహజానంద సంపూర్ణ సాగరాయ నమః ||100
నాదబిందు కళాతీత వైభవాయ నమః
వాది భేద విహీనాత్మ బోధనాయ నమః
ద్వాదశాంత మహాపీఠ నిషణ్ణాయ నమః
దేశకాలాపరిచ్ఛిన్న దృగ్రూపాయ నమః
నిర్మాణ శాంతి మహిత నైశ్చల్యాయ నమః
నిర్లక్ష్య లక్ష్య సంలక్ష్య నిర్లేపాయ నమః
శ్రీ షోడశాంత కమల సుస్థితాయ నమః
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565