MohanPublications Print Books Online store clik Here Devullu.com
Showing posts with label SANI. Show all posts
Showing posts with label SANI. Show all posts

దోషాలు పోగొట్టే శనీశ్వర క్షేత్రం..._shani


Navagraha shani shanitrayodasi sani bhakti  Bhakthi  Bhakthi_Pustakalu  Bhakti_Pustakalu  BhakthiPustakalu  BhaktiPustakalu MohanPublications Granthanidhi MohanPublicationsBhakti BhakthiMandaram PujaPusthakalu Puranalu Jyothishalu PujaGranthalu Vastulu

దోషాలు పోగొట్టే శనీశ్వర క్షేత్రం...
bhakti  Bhakthi  Bhakthi_Pustakalu  Bhakti_Pustakalu  BhakthiPustakalu  BhaktiPustakalu MohanPublications Granthanidhi MohanPublicationsBhakti BhakthiMandaram PujaPusthakalu Puranalu Jyothishalu PujaGranthalu Vastulu

#దోషాలు_పోగొట్టే_శనీశ్వర_క్షేత్రం...




సాధారణంగా నవగ్రహాలతో పాటు శనీశ్వరుణ్ణీ దర్శనం చేసుకుంటాం. అయితే శనికి మాత్రమే ప్రత్యేకంగా గుడులుండటం అరుదు. అలాంటి ఓ దేవాలయం హైదరాబాద్‌ మహానగరానికి అతి సమీపంలో నెలకొంది. 22 అడుగుల ఎత్తున ఉండే ఇక్కడి శనీశ్వరుడికి తైలాభిషేకం చేస్తే సకల శని దోషాలూ పరిహారమవుతాయట.

హిందూ ధర్మశాస్త్రం ప్రకారం... తొమ్మిది గ్రహాలున్నా... శనీశ్వరుడి స్థానం ప్రత్యేకం. జనం ఆయన్ను తలచుకున్నంతగా మరే గ్రహదేవతనీ తలచుకోరనిగానీ, ఇంకా చెప్పాలంటే అంతలా భయపడరనిగానీ అంటే అది అతిశయోక్తి కాబోదు. అయితే, శనీశ్వరుడు యమధర్మరాజుకి సోదరుడు. సూర్యుడికి కొడుకు. న్యాయబద్ధంగా నిష్పక్షపాతంగా వ్యవహరించడం ఆయన వంశంలోనే ఉందన్న మాట. శనీశ్వరుడు ఈ జన్మకు సంబంధించే కాదు పూర్వజన్మల పాప కర్మలకూ దండనను విధించే క్రతువును నిర్వహించే బాధ్యత కలిగి ఉన్నవాడు. జన్మరీత్యా మనిషికి శనిమహర్దశా కాలాలు నడుస్తున్నప్పుడు వాళ్ల వాళ్ల పాపకర్మలను బట్టి వారిని ఆరోగ్యపరంగా, మానసికంగా దండిస్తూ ఉంటాడు. అయితే శనీశ్వరుణ్ణి శరణువేడటం ద్వారా ఆ బాధల నుంచి ఉపశమనం పొందొచ్చన్నది పురాణ వచనం. మనిషి జీవిత చక్రంతో ముడివడిన ఈ శనిదేవుడికి గుళ్లు మాత్రం తక్కువ సంఖ్యలో ఉంటాయి. వాటిలో ఒకటి రంగారెడ్డి జిల్లా, శంషాబాద్‌ మండలం, మదనపల్లి గ్రామ సమీపంలో పచ్చని పంటపొలాల మధ్య వెలిసిన ఘంటల శనీశ్వర ఆలయం. ఇక్కడ స్వామి 22 అడుగుల ఎత్తుతో భక్తజనానికి దర్శనమిస్తాడు.

భక్తులకు వరం...
జాతక చక్రప్రకారం బుధ, గురు, శుక్ర మహర్దశలు ఎలా వస్తాయో అలాగే శనిమహర్దశా వస్తుంది. అయితే ఆ సమయంలో శనీశ్వరుడి వల్ల కలిగే బాధలు అధికంగా ఉండేవాళ్లు ఆయన్ను శాంతింపజేయడానికి పూజలు చేస్తుంటారు.

నీలాంజన సమాభాసం
రవిపుత్రం యమాగ్రజం
ఛాయా మార్తాండ సంభూతం
తమ్‌ నమామి శనీశ్వరం
అంటూ ఆయన్ను స్తుతిస్తారు. శనీశ్వర మంత్రాన్ని చదవడం వల్ల ఆయన శాంతిస్తాడట. అలాగే నువ్వుల నూనెతో అభిషేకం చేయడమూ శుభఫలితాన్నిస్తుందట. శనీశ్వరుడికి ఆగమశాస్త్ర బద్ధంగా ఆలయాన్ని నిర్మించేందుకు ఎక్కువ మంది ముందుకు రారు. నిర్మాణంలో ఏవైనా లోపాలు చోటు చేసుకొంటే శనీశ్వరుడి ఆగ్రహానికి గురికావలసి వస్తుందేమోనన్నదే కారణమై ఉండొచ్చు. అందుకే శని ఆలయాలు అతి తక్కువ చోట్ల కనిపిస్తాయి. కోయ దొర స్వామి శంకర్‌రాజుముఖియా హైదరాబాద్‌ సమీపంలో మూడు ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన శనీశ్వర ఆలయంలో దాదాపు 22 అడుగుల ఎత్తుతో విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. సాక్షాత్తు శనీశ్వరుడే భూలోకానికి వచ్చినట్లు తీర్చిదిద్దిన ఈ విగ్రహం కాళ్ల కింద జ్యేష్ఠాదేవి ఉంటుంది. భారతి నర్సింహస్వామి, స్వరూపానందస్వామి చేతుల మీదుగా ఆలయ ప్రతిష్ఠాపనగావించారు. ఆలయ ప్రాంగణంలో పార్వతీ పరమేశ్వరులనూ కొలువుదీర్చారు. విగ్రహం ఎత్తైనది కావడంతో తైలాభిషేకం చేయాలంటే పై అంతస్తుకు వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి వృద్ధులూ, వికలాంగులను దృష్టిలో ఉంచుకుని లిఫ్ట్‌ సదుపాయాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అష్టదిక్పాలకులూ ఈ గుళ్లొ కొలువయ్యారు. ఈ ఆలయంలోని స్వామిని స్త్రీలు కూడా ముట్టుకోవచ్చు.



వైభవంగా త్రయోదశి
శనివారం నాడు త్రయోదశి తిథి వచ్చినప్పుడు పండగగా జరిపే శని త్రయోదశి శనీశ్వరుడికి ప్రీతిపాత్రం. ఏల్నాటి శని, అర్ధాష్టమశని, అష్టమశని కాలాలు నడుస్తున్నవాళ్లు ఆ రోజు స్వామికి తైలాభిషేకం చేసి అర్చిస్తే దోషాల నుంచి ఉపశమనాన్ని పొందుతారట. అందుకే ఏటా వచ్చే శనిత్రయోదశి రోజుల్లో ఇక్కడికి జనం పెద్ద సంఖ్యలో హాజరవుతారు. ఆలయానికి రెండు కిలోమీటర్ల దూరంలో త్రిదండి చినజీయర్‌ స్వామి ఆధ్వర్యంలో నిర్మితమవుతున్న సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం ఉంది. రామానుజాచార్యుల వెయ్యేళ్ల పండగ సందర్భంగా 45 ఎకరాల ప్రాంగణంలో 216 అడుగుల ఎత్తున్న రామానుజుల లోహవిగ్రహం ఇక్కడ రూపుదిద్దుకుంటోంది. 108 సుప్రసిద్ధ వైష్ణవ దివ్య క్షేత్రాలూ, వైదిక ధర్మాలనూ పరిచయం చేసే ప్రదర్శన శాల కూడా ఇక్కడ ఏర్పాటవుతోంది. రూ. వెయ్యి కోట్లతో శ్రీకారం చుట్టిన ఈ స్ఫూర్తి కేంద్రం పనులు తుది దశకు చేరుకున్నాయి. ఇక, శనీశ్వర ఆలయానికి ఎదురుగా ఉన్న చారిత్రక దర్గాను నిత్యం వందల సంఖ్యలో భక్తులు దర్శించుకుంటారు.

ఇలా వెళ్లాలి...
హైదరాబాద్‌ - బెంగళూరు జాతీయ రహదారికి అతి సమీపంలో ఉందీ ఆలయం. హైదరాబాద్‌ నుంచి ఇక్కడికి 25కి.మీ. దూరం ఉంటుంది. హైదరాబాద్‌, శంషాబాద్‌ల నుంచి షాద్‌నగర్‌ వెళ్లే బస్సుల ద్వారా ఆలయాన్ని చేరుకోవచ్చు.
- మైలారం వెంకటేష్‌, న్యూస్‌టుడే, శంషాబాద్‌
చిత్రాలు:బషీర్‌













శని_త్రయోదశి_Shani_trayodasi

శనిత్రయోదశి SANITRAYODASI SANIBHAGAVAN

శని త్రయోదశి

చాలామంది శని పేరు వింటేనే అరిష్టం అని, ఆయన విగ్రహాన్ని తాకితే ఆ దోషం ఎక్కడ తమకు అంటుకుంటుందో అని భయపడుతుంటారు. అయితే అవన్నీ అపప్రథలు మాత్రమే. వాస్తవానికి శని న్యాయాధికారి వంటి వాడు. ఆయన అకారణంగా ఎవరినీ బాధించడు. మానవుల పాపకర్మలను అనుసరించి గోచార రీత్యా ఆయా వ్యక్తులను ప్రేరేపించి వారితో ఆయా కర్మల ఫలితాలను అనుభవించేలా చేస్తాడు. అంతేకాదు, ఆయన చాలా సత్యదేవుడు. దానధర్మాలతో సత్యం, అహింసలను ఆచరిస్తూ, పవిత్రంగా జీవించేవారికి ఎటువంటి ఆపద వాటిల్లకుండా కాపాడుతూ వారికి సకల శుభాలను కలుగ చేస్తాడు. వైరాగ్యం కలిగించి భగవంతుని స్మరించమని గురువై బోధిస్తాడు. భయంతో కాకుండా, భక్తితో ఆయనను వేడుకుంటే సర్వశుభాలు కలిగి, ఐశ్వర్యం సిద్ధిస్తుంది.


శనిదోష పరిహారానికి...
శని త్రయోదశి రోజున తిల, తైలాభిషేకాలు చేయించి దానాలు ఇవ్వాలి. శనికి ప్రీతికరమైంది, శని దోష శాంతిని చేసేది అయ్యప్పదీక్ష.
భైరవ స్తోత్రం చేసినా, ఆంజనేయుని అర్చించినా, వేంకటేశ్వరుని ఆరాధించినా శనిదేవుని ప్రసన్నం చేసుకోవచ్చు.
శనివారం- త్రయోదశి తిథి శనీశ్వరుని తైలాభిషేకానికి శ్రేష్ఠమైనది. శని బాధలు పడేవారు జమ్మిచెట్టుకు లేదా రావిచెట్టుకు ప్రదక్షిణలు చేస్తారు. అలాగే నల్లని వస్త్రం, నల్ల నువ్వులు, నల్లని వస్తువులు, గాజులు, నల్ల ద్రాక్ష మొదలైనవి జమ్మిచెట్టు వద్ద వదిలి వెళితే కష్టాలన్నీ తొలగి శుభాలు కలుగుతాయని, ఆదివారం నాడు గో పూజ చేస్తే శనిదోషం పరిహారం కాగలదని విశ్వాసం. కాకులకు, నల్లచీమలకు, నల్ల కుక్కలకు ఆహారం పెట్టడం వల్ల కూడా శనిబాధల నుంచి ఉపశమనం కలుగుతుంది. అలాగే వృద్ధులకు, వికలాంగులకు సేవ చేయడం వల్ల కూడా శని బాధల నుంచి గట్టెక్కవచ్చునని శాస్త్రం.
(ఫిబ్రవరి 6 శని త్రయోదశి)
- డి.వి.ఆర్
టాగ్లు: శని, , శని త్రయోదశి, Saturn, , Shani Trayodasi

శని త్రయోదశి

త్రయోదశి శనివారం నాడు వస్తే ఆ రోజును శని త్రయోదశిగా వ్యవహరిస్తారు. శనివారం శ్రీమహావిష్ణువుకు ప్రీతిపాత్రమైన రోజు. అలాగే త్రయోదశి పరమేశ్వరునికి ఇష్టమైన దినం.
అందుకనే త్రయోదశి శనివారం నాడు వస్తే శివ కేశవులకు అత్యంత ప్రీతిపాత్రమైన దినమని పెద్దలు పేర్కొంటారు. శని జన్మించిన తిధి కూడా త్రయోదశి అందుకనే శని త్రయోదశికి అంతటి విశిష్టత ఏర్పడింది. ఈ రోజున శనికి ప్రత్యేకమైన పూజలు చేస్తే శని దోషాలైన ఏలినాటి శని, అష్టమశని ... తదితర దోషాల నుంచి విముక్తి లభిస్తుంది.
శనివారం నాడు శ్రీమహాలక్ష్మీ, నారాయణుడు అశ్వత్థవృక్షంపై వుంటారని పురాణాలు పేర్కొంటున్నాయి. అందుకనే ఆ రోజున అశ్వత్థవృక్ష సందర్శన, ప్రదక్షిణ చేయాలి. శని త్రయోదశి రోజున సూర్యోదయానికి ముందే స్నానం చేసి నువ్వుల నూనెతో శనికి అభిషేకం చేయాలి. కాకికి నైవేద్యం పెట్టాలి. నల్లనువ్వులు, నువ్వుల నూనె, నల్లని వస్త్రంలో వుంచి దానం చేయాలి. శని బాధలు తీరేందుకు ఇలా స్తోత్రం చేయాలి.
‘‘ నీలాంజన సమాభాసం.. రవిపుత్రం యమాగ్రజమ్‌..
ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరమ్‌’’
ఈ శ్లోకాన్ని పఠిస్తే మంచిది.

శని త్రయోదశి కథ

ఎల్లకాలం పరిస్థితులన్నీ అనుకూలంగా ఉంటే జీవితంలో మజా ఏముంటుంది? మధ్యమధ్యలో కష్టాలు వస్తుంటేనే, జీవితపు విలువ తెలిసొస్తుంది. ఎప్పుడూ సత్కారాలే ఉంటే మదానికి హద్దేముంటుంది! అప్పుడప్పుడూ అవమానం ఎదురుపడితే, అహంకారం దిగిపోతుంది. అలా మనిషికి అప్పుడప్పుడూ మొట్టికాయలు వేస్తూ, అతని నడవడిని సరిదిద్దే దైవమే శనీశ్వరుడు. జీవులు ప్రాణాలతో ఉన్నప్పుడు వారి పాపాలకు తగిన ప్రాయశ్చిత్తాన్ని కలిగించేవాడు.


సూర్యభగవానునికీ, ఆయన సతి ఛాయాదేవికి కలిగిన సంతానమే శనిదేవుడు. అందుకే ఆయనను సూర్యపుత్రడు అనీ, ఛాయాసుతుడు అనీ పిలుస్తారు. ఈ శని గ్రహం ఒకో రాశిలోనూ దాదాపు రెండున్న సంవత్సరాల పాటు సంచరిస్తూ 12 రాశులనీ చుట్టుముట్టడానికి దాదాపు 30 సంవత్సరాలు పడుతుంది. ఇంత నిదానంగా సంచరిస్తాడు కాబట్టి ఈయనకు మందగమనుడు అన్న పేరు కూడా ఉంది. రాశిచక్రంలో ఆయన ఉండే స్థానాన్ని బట్టి ఫలితాలు కూడా వేర్వేరు విధాలుగా ఉంటాయి.

అందుకే జాతకరీత్యా శని ప్రభావం అధికంగా ఉన్నప్పుడు, వీలయినంత తక్కువ శ్రమతో ఆ ప్రభావాన్ని కలిగించమంటూ భక్తులు శనీశ్వరుని వేడుకుంటారు. అందుకోసం శనీశ్వరుడు కొలువై ఉన్న మందపల్లి, సింగనాపూర్‌ వంటి క్షేత్రాలని కానీ; నవగ్రహాలు ఉండే గుడిని కానీ దర్శిస్తారు. ఇక త్రయోదశి తిథి నాడు వచ్చే శనివారం నాడు ఆయనను కొలుచుకుంటే మరింత త్వరగా కరుణిస్తాడన్న నమ్మకమూ ఉంది. ఇంతకీ ఈ శనిత్రయోదశికి ఎందుకింత విశిష్టత అంటే...
శనివారం ఇటు శని భగవానునికీ, అటు విష్ణుమూర్తికీ ప్రీతిపాత్రమైన రోజు. ఇక త్రయోదశి శివునికి ఇష్టమైన తిథి. అలా



స్థితి, లయకారులిద్దరికీ ఇష్టమైన రోజుగా శనిత్రయోదశి స్థిరపడింది. ఈ శని త్రయోదశి ప్రాముఖ్యతని మరింతగా వివరించేలా ఒక గాథ కూడా ప్రచారంలో ఉంది. ఒకానొక సందర్భంలో కైలాసాన్ని చేరుకున్న నారదుడు, శివుని ముందు శని భగవానుని గురించి పొగడటం మొదలుపెట్టాడట. ఎంతటివారైనా ఆ శని ప్రభావం నుంచి తప్పించుకోలేరంటూ చెప్పసాగాడు. ఆ మాటలను విన్న శివునికి ఒళ్లు మండిపోయింది.

‘శని ప్రభావం ఎవరి మీద ఉన్నా లేకున్నా, నా మీద మాత్రం పనిచేయదు’ అంటూ హుంకరించాడు. నారదుడు యథాప్రకారం ఆ మాటలను శనిదేవుని వద్దకు మోసుకువెళ్లాడు.‘నా ప్రభావం నుంచి తప్పించుకోవడం ఎవరి తరమూ కాదు. ఇది సృష్టి ధర్మం,’ అంటూ కోపగించిన శనిభగవానుడు, శివుని ఫలానా సమయంలో పట్టిపీడించి తీరతానంటూ శపథం చేశాడు.శని శపథం గురించి విన్న శివునికి ఏం చేయాలో పాలుపోలేదు. ఆ శని మాట నెరవేరితే, తన ప్రతిష్టకే భంగం కదా అనుకున్నాడు. అందుకే శని చెప్పిన సమయానికి అతని కంటపడకుండా ఉండేందుకు భూలోకంలోని ఒక చెట్టు తొర్రలో దాక్కొన్నాడు.

మర్నాడు కైలాసంలో ఉన్న శివుని చెంతకి శనిభగవానుడు చేరుకున్నాడు. వినమ్రంగా తన ఎదుట నిలచిన శనిని చూసి ‘నన్ను పట్టి పీడిస్తానన్న నీ శపథం ఏమైంది’ అంటూ పరిహసించాడు పరమేశ్వరుడు. దానికి శని ‘ప్రభూ! ఈ ముల్లోకాలకూ లయకారుడవైన నువ్వు పోయి పోయి ఆ చెట్టు తొర్రలో దాక్కొన్నావే! అది నా ప్రభావం కాదా. దీన్ని శని పట్టడం అనరా?’ అన్నాడు చిరునవ్వుతో.

శనిదేవుని మాటలు శివునికి విషయం అర్థమైంది. ‘ఈ రోజు నుంచి శనిత్రయోదశి నాడు ఎవరైతే నిన్ను అర్చిస్తారో... వారు నీ అనుగ్రహంతో పాటుగా, నా అభయానికి కూడా పాత్రులవుతారు. ఇక నుంచి నువ్వు శనీశ్వరుడు అన్న పేరుతో కూడా వెలుగొందుతావు’ అంటూ శనిని ఆశీర్వదించాడు పరమశివుడు. అప్పటి నుంచి త్రయోదశినాడు వచ్చే శనివారం రోజున, భక్తులు నువ్వుల నూనెతో శనీశ్వరుని అభిషేకించి, తమని చూసీచూడనట్లుగా సాగిపొమ్మని వేడుకుంటున్నారు.

(శని నుంచి తప్పించుకునేందుకు శివుడు దాక్కొన్న స్థలం ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ‘మందపల్లి’ అని ఓ నమ్మకం.)


శని త్రయోదశి, Satrun

శని త్రయోదశి, 
Satrun 
శనిత్రయోదశి SANITRAYODASI SANIBHAGAVAN

+++++శని త్రయోదశి ++++++


ఈ రోజున శని భగవానునికి చేసే పూజా పునస్కారాలు దానధర్మాలు మామూలు సమయంలో చేసే వాటికంటే అధిక శుభఫలితాలనిస్తాయి, అలాగే ఈ సమయంలో చేసే పాపాలు కూడా అధిక చెడు ఫలితాలనిస్తాయి. శని త్రయోదశి ప్రదోష సమయాన శివుడికి అభిషేకం చేయడం చాల విశేషంగా లాభిస్తుంది. ఈ సమయంలో శివుడికి చేసే పూజలు అత్యంత ఫలితాలనిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి.

జాతక రీత్యా శని బాగాలేని వారు, శని దశ అంతర్దశలు జరుగుతున్నవారు. ఏలిననాటి శని, అష్టమ శని, అర్దాష్టమ శని వలన ఎవరైతే పీడింప బడుతున్నారో అటువంటివారు ఈ రోజు శని పరిహారాలు అంటే నువ్వుల నూనెతో శనికి అభిషేకం చేయడం, ఉపవాసం ఉండడం, రావి చెట్టుకి ప్రదక్షిణాలు చేసి ఆవ నూనెతో దీపం పెట్టడం, నువ్వుల నూనెలో ముఖం చూసుకొని ఆ నూనెని దానం చేయడం. నల్ల కాకికి అన్నం పెట్టడం, నల్ల కుక్కకి అన్నం పెట్టడం, నల్లని గొడుగు, నల్లని వస్త్రాలు, తోలు వస్తువులు, నవధాన్యాలు, ఇనుము దానం చేయడం మంచిది. ఈ విధంగా శనిని పూజించి ఆరాధిస్తే బద్ధకం, చెడు ఆలోచనలు, రోగాలు, అపమృత్యు దోషం, దారిద్య్రం తొలగుతాయి. వృత్తిపరమైన సమస్యలు, వివాహంలో ఆటంకాలు, శత్రు భయం, కోర్టు సమస్యలలో ఉన్న వారి సమస్యలు కూడా తొలగుతాయి.

విశ్వాన్ని గ్రహాలు ప్రభావితం చేస్తున్నా... శనీశ్వరుడి ప్రభావం చాలా తీవ్రమైనదని చెప్పవచ్చు. మానవులకు ఎదురయ్యే కష్టసుఖాలకు, వారి వారి కర్మల అనుసారంగా ఫలితంగా ప్రసాదించేది శనిదేవతనే! సాధారణంగా శనిదేవతపై అనేకమందిలో చాలా రకాలైన అపోహలున్నాయి. శనీశ్వరుడి పేరు చెప్పగానే ఉలిక్కిపడతాం. నామాన్ని ఉచ్ఛరించడానికి సైతం వెనకాడతాం. ఆయనకు ఆగ్రహం కలిగే పనుల్ని చేయరాదని తీర్మానించుకుంటాం. శనీశ్వరుడిని ఆహ్వానించినట్టవుతుందని తైల పదార్థాలు వేటినీ చేతులతో అందుకోం. ఆయన దృష్టి మనపైకి సోకరాదని పదే పదే కోరుకుంటాం. కొన్ని ప్రాంతాలవారైతే శనివారంనాడు తిలా సంబంధిత వస్తువులేవీ కొనరు, తినరు. అంత భయం ఆయనంటే. శనీశ్వరుడు కేవలం క్రూరత్వానికి, పీడించడానికి మాత్రమే ఉద్దేశించబడలేదు.


గ్రహరూపంలో ఉండే భగవంతుడు:

సృష్టి, స్థితి, లయ కారకులు త్రిమూర్తులు. మనం చేసిన కర్మల ఫలితాలనివ్వడానికి భగవంతుడే గ్రహాల రూపంలో అవతరించాడు. ఒక్కో గ్రహానికి ఒక్కో దేవత మూల పురుషుడు. సూర్యుడు, చంద్రుడు, మార్స్‌, మెర్క్యురీ, బృహస్పతి, వీనస్‌, శని గ్రహాలకు వరుసగా శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, నరసింహస్వామి, బుద్ధుడు, వామనుడు, పరశురాముడు, కూర్మావతార విష్ణువు, వరాహస్వామి, మత్స్యావతార స్వామి ఆవహించి ఉన్నారు. అందువల్ల గ్రహాలు దైవాంశసంభూతులని అర్థంచేసుకోవాలి. గ్రహకూటములు రాజ్యాలను కూల్చడానికే కాక మొత్తం ప్రపంచం ఉనికికే మూలం.


పూర్వజన్మ కర్మ ఫలం:

ఓ వ్యక్తి పూర్వ జన్మలో చేసిన కర్మల ఫలితాలనే ఈ జన్మలో అనుభవిస్తాడు. అందుకే ప్రతి వ్యక్తీ తన మహర్దశ, అంతర్దశలను తెలుసుకోవలసిన అవసరం ఉంది. జీవితంలో ఎదురయ్యే చేదు అనుభవాలనుంచి తప్పించుకోవడానికి ఇది చాలా అవసరం. శని మంచి దృష్ట్టితో ఉంటే జీవితం నందనవనమవుతుంది. అదే శనిదేవుడు వక్రదృష్టి పడిందంటే అంతే సంగతులు. ఆయన అనుగ్రహముంటే రాజ్యాలేలే చక్రవర్తులవుతారు. ఆయన గనుక పట్టుకు న్నాడంటే అమీరులయినా బికారులవడం ఖాయం. అయితే, ఇక్కడ గుర్తుంచుకోవలసిన అంశం. చెడు కార్యాల్లో నిమగ్నమైనవారినే శనీశ్వరుడు పీడిస్తాడు.


ఫలితం అనుభవించాల్సిందే:

ఎంత దైవాంశసం భూతులైనా వారి వారి కర్మలననుసరించి ఫలితాలను అనుభవించి తీరాలి. చెడుకార్యాలకు పాల్పడినవారిని శనిదేవుడు తప్పనిసరిగా శిక్ష విధిస్తాడు. పురాణాల ప్రకారం సూర్యభగవానుడు కర్మలకు సాక్షి అయితే, శనిదేవుడు వాటి ఫలితాలను నిర్దేశిస్తాడు. ఆయా ఫలితాలను మాతృగర్భంనుంచి వెలువడిన మరుక్షణం నుంచీ అనుభవించడం మొదలవుతుంది. మంచి కార్యాలు చేసినవారికి శనిదేవుడు చల్లగా చూసి అద్భుతమైన జీవితం ప్రసాదిస్తాడు. ఇది అర్థం చేసుకోనివారు శని భగవానుని క్రూరాత్మునిగా భావిస్తారు. ఇది కేవలం మూర్ఖత్వం. శని దేవుడికి భయపడడం అవివేకం. ఆయన మానవ కర్మలకు ఫలితాలనిచ్చే దైవం. అలుపు సొలుపూ లేకుండా బిజీగా ఉండే లైఫ్‌లో కొంచెం సమయాన్ని సత్కార్యాలకు కేటాయించాలి. నిజాయితీగా జీవించాలి.


భయపెట్టే దేవుడు కాదు:

భగవంతుడు శనిదేవుణ్ణి జీవరాసుల కర్మల ఫలితాలను ఇచ్చే వర్రపదాయినిగా బాధ్యతలు అప్పగించాడు. ఆయన తన బాధ్యతలను నిజాయితీగా, ఖచ్చితత్వంతో సమవర్తిగా నిర్వహిస్తాడు. ఇందులో ఎటువంటి పక్షపాతబుద్ధి లేదు. దీనికోసం ఆయనను పూజించాలే కానీ, భయపడకూడదు. ప్రకృతి నియమాలను అనుసరించి ఏ జీవి అయినా తన వంశపారంపర్య లక్షణాలను వదులుకోడు. శని భగవానుడు మహర్షి కశ్యపునకు మనవడు. కశ్యపాత్మజుడైన సూర్యభగవానుడికి కుమారుడు. ఈ చుట్టరికమే ఆయనను మిగతా దేవతలకన్నా ప్రత్యేకమైనవాడిగా చేసింది. శనిదేవుడు మంచి మార్గంలో నచిచే మానవులకు సేవకుడిలా, ముక్తిధామానికి కొనిపోయే మార్గదర్శిలా కూడా పనిచేస్తాడు. శనిదేవుని బంధుగణమంతా గొప్ప అధిదేవతలు. సూర్యునికి కుమారుడు, విష్ణువు అంశ అయిన శనీశ్వరుడికి సంధ్య, ఛాయలు మాతృమూర్తులు. మను సౌవర్ణి, యమధర్మరాజులు సోదరులు. యమున, భద్ర నదులు సోదరీమణులు. వీరందరిలోని దైవాంశలు కలిగిన శనిదేవుని అనుగ్రహం పొందడానికి ఎన్నో మార్గాలున్నాయి.


ఓర్పు, సహనం ముఖ్యం:

మంచికన్నా చెడు రాజ్యమేలే కలియుగంలో శని అనుగ్రహం సంపాదిం చాలంటే, ఓర్పు సహనం ఉండాలి. అవినీతి, అపసవ్య మార్గాలలో పనులు సాధించుకోవాల నుకునేవారు, ధనార్జన చేసేవారు తొలుత విజయం పొందగలిగినా చివరకు దక్కించుకునేది అశాంతినే! తాత్కాలిక విజయాలు సాధించినవారు శనిమహరాజు కోర్టులో తప్పక శిక్షించబడతారు. ఆయన కోర్టులో లంచాలకు, రికమెండేషన్లకు తావులేదు. మానవులు తాము చేసిన ప్రతి దుష్కర్మకు జవాబు చెప్పి తీరాల్సిందే! అక్కడ ఏ దేవుడూ శనీశ్వరుడి బారినుంచి తప్పించలేరు. ఆయన ఒక్కసారి తీర్పు ప్రకటిస్తే దానికి తిరుగులేదు. త్రిమూర్తులలో ఎవరూ దానిని సరిచేయలేరు. కనీసం అడ్డుకోలేరు. ఆయన ముందు మంచిపనులు, ప్రార్థనలు, భక్తియుతులనే పిటిషన్లు తప్ప ఏవీ పనిచేయవు. శనిభగవానుడి తీర్పు సుప్రీంకోర్టు తీర్పేనని గుర్తుంచుకోవాలి. శనిదేవుడు చెడ్డవారిని, తప్పులు చేసినవారిని పట్టి పీడించడంద్వారా వారిలో పశ్చాత్తాపాన్ని కలుగజేస్తాడు. మోక్షం దిశగా వారి ఆలోచనలను పురిగొల్పుతాడు. గర్వంతో విర్రవీగేవారిని నేలకు దించుతాడు. స్వర్ణకారుడు పుటం వేసి బంగారాన్ని కాల్చి నగలను తయారు చేసినట్లుగా...శనీశ్వరుడు మానవుల్లోని మాలిన్యాన్ని కడిగేస్తాడు.


శని దండనాధికారి:

జ్యోతిష్య శాస్తర్రీత్యా శని శనివారానికి అధిపతి. ఏ వ్యక్తికైనా పూర్వజన్మ సుకృత, దుష్కృత ఫలితాలను ప్రదానం చేసే అధికారం శనిది. ఆధ్యాత్మిక జ్యోతిష్యంలో శనిని పూర్వజన్మలోని సంచిత కర్మలకు అధిష్టాతగా చెప్పబడింది. శని దశల్లో వ్యక్తికి పూర్వజన్మలోని దుష్కర్మలకు సైతం దండన లభిస్తుంది. బౌతిక దృష్టిలో శని క్రూరుడుగా కనపడినా వాస్తవానికి అగ్ని పరీక్షకు గురి చేసి వ్యక్తిని సత్కర్మల వైపు మళ్ళిస్తాడు.. ఈశ్వర శాసనంలో శని దండనాధికారి. శని మనం చేసిన దుష్కర్మాలకే దండన విధిస్తాడు నిష్పక్షపాతంగా ఉన్న న్యాయాధిపతిలా శని దండన విధిస్తాడు.


శనికి ప్రీతిపాత్రమైన రోజు:

శనివారానికి స్థితి కారకుడైన శ్రీమన్నారాయణుడు అధిపతి, త్రయోదశికి అధిపతి కామదేవుడు. అంటే శివుడు. అలా శివకేశవుల క్రియలకు శని అధిపతి అయ్యాడు. అందుకే శనిత్రయోదశి శనికి ఇష్టమైన రోజు. త్రయోదశి తిథి శివుడికి ఎంతో ప్రీతికరమైనది. క్షీరసాగర మదనం జరిగి అమృ తం ఉద్భవించిన తరువాత, హాలాహలాన్ని దిగ మింగి తన కంఠంలో దాచుకొని లోకాలను కాపాడిన శివుడికి కృతఙ్ఞతలు చెప్పడానికి దేవతలందరూ ఆయన వద్దకు వెళ్లారు. అది ఈ త్రయోదశి తిథి నాడే అని పురాణాల ద్వారా తెలుస్తోంది. ఆ సమయంలో శివుడు, మన గణాల ప్రకారం 2 గంటల 24 నిమిషాల పాటు ఆనంద తాండవం చేసాడట. ఆ శివ తాండవాన్ని దేవతలందరూ పరవశించి చూస్తూ ఆనందించారని చెప్పబడింది. ఆ తాండవం చేసిన సమయమే ప్రదోషం. ప్రదోషమంటే మునిమాపు వేళ దోషం అంటే రాత్రి అని అర్ధం చంద్రున్ని దోషాకరుడు అని అంటారు, రాత్రికి కారణమయ్యేవాడనే అర్ధం ప్రదోషమంటే దోష ప్రారంభకాలం అంటే రాత్రి ప్రారంభ సమయం.







mohan publications price list