MohanPublications Print Books Online store clik Here Devullu.com

మగవారి కంటే మహిళలే గొప్ప అని నిరూపించే 10 ఫర్ఫెక్ట్ రీజన్స్ ..!!_Leades best



మగవారి కంటే 
మహిళలే గొప్ప అని నిరూపించే 

10 ఫర్ఫెక్ట్ రీజన్స్ ..!!
స్త్రీపురుషులలో ఎవరు గొప్పనే అంశంపై దీర్ఘకాలికంగా చర్చ జరుగుతూనే ఉంది. ఎవరు గొప్పనే అంశం పక్కన పెడితే ఈ సిరీస్ లో భాగంగా మేము సరదాగా సేకరించిన రెండు జాబితాలు మీకు ఆనందాన్నిస్తాయి. ఈ జాబితాను చదివి ఆనందించండి. 1. మరో జీవిని గర్భంలో మోస్తారు నవమాసాలు బిడ్డను గర్భంలో మోసి జన్మనిచ్చే సామర్థ్యం స్త్రీకి కలదు. మరోవైపు, ఒక శిశువుకు జన్మనివ్వడంలో పురుషుల పాత్ర ఉన్నా కూడా స్త్రీ పోషించే పాత్ర అనిర్వచనీయం. ప్రసవ వేదనని కూడా ఎంతో సంతోషంగా భరిస్తూ శిశువుకి జన్మనిస్తుంది స్త్రీ. అందుకే స్త్రీ జన్మ గొప్పదని అంటారు. కడుపులో నున్న శిశువు కదలికల్ని ఆస్వాదిస్తూ శిశువు భూమ్మీదకు రాకముందునుంచే తన బిడ్డతో అనుబంధాన్ని పెంచుకుంటుంది స్త్రీ. పురుషుల కంటే స్త్రీలే గొప్పవారన్న అంశానికి ఇదే బలమైన కారణం.
2. బాధని తట్టుకుంటారు బాధని తట్టుకునే శక్తి స్త్రీలకే కలదు. అందుకే ప్రసవ వేదనని సైతం ఆనందంగా మరల్చుకుంటారు. భరించరాని బాధను సైతం హాయిగా స్వీకరిస్తారు. నవమాసాలు మోసిన బిడ్డను ఎత్తుకుని చూసి తరించాలనే సంతోషం వారికి బాధను తట్టుకునే శక్తిని ప్రసాదిస్తుంది. మరోవైపు, చిన్న జ్వరానికి కూడా పురుషులు డీలా పడిపోయి విశ్రాంతి తీసుకుంటారు.
3. అనేక పనులను ఏక కాలంలో నిర్వహిస్తారు స్త్రీలకి బాధ్యతలెక్కువ. ఆ బాధ్యతలన్నీ సజావుగా నిర్వహిస్తారు. ఒక వైపు ఇంటిల్లిపాదికి వంట చేసుకుంటూ చంటి పిల్లల్ని చూస్తూ మరో వైపు స్మార్ట్ ఫోన్ లోని ఈమెయిల్స్ కి రిప్లై చేస్తూ టీవీ లోని న్యూస్ వింటారు. మరి పురుషులు? సమాధానం దొరికింది కదా!
4. మగవారి కంటే ఫీమేల్ బ్రెయిన్ చాలా షార్ప్ గా ఉంటుంది ఏకకాలంలో ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు, మహిళలు త్వరగా కోలుకోవడం, వారి పనులు వారు చక్క బెట్టుకోవడం చేస్తుంటారు. అయితే పురుషులు ఇతరు మీద డిపెండ్ అవుతారు. అందుకే ఫీమేల్ నర్సులను ఎక్కువగా పురామాయించడం చూస్తుంటారు
. 5. త్వరగా కోలుకుంటారు స్త్రీపురుషులు ఇరువురూ ఒకేసారి యాక్సిడెంట్ కి గురయ్యారని అనుకుందాం. పురుషుడు కోలుకుని కళ్ళు తెరిచి చూసే లోగా స్త్రీ త్వరగా కోలుకుని తన రోజువారి పనులను చేయడంలో లీనమైపోవడం కూడా జరిగిపోతుంది. ఎందుకంటే, స్త్రీ మెదడులో త్వరగా స్వస్థత చేకూర్చే లక్షణం ఉందట. స్త్రీల న్యూరాన్స్ ఇంటెర్లింకై ఉండడం వల్ల ఇది సాధ్యం. పురుషుల మెదడు ఈ విధంగా ఉండదు.
6. కమ్యూనికేషన్ నిపుణులు స్త్రీలు ఎవరితోనైనా, ఎప్పుడైనా మాట్లాడతారు. వివిధ సందర్భాలలో వివిధ వ్యక్తులతో ఎలా మాట్లాడాలో స్త్రీలకు తెలిసినట్టుగా పురుషులకు తెలియదు. బస్ డ్రైవర్లతో, తమ పిల్లల టీచర్లతో, సేల్స్ పెర్సన్తో, బస్ లో తమ పక్కన కూర్చున్న వ్యక్తులతో ఇలా అందరితో మాట్లాడి స్త్రీలు చాలా సులభంగా కలిసిపోతారు. మానవ జీవితానికి పురోగతి కమ్యూనికేషన్ తోనే సాధ్యమయింది. స్త్రీలను చక్కటి కమ్యూనికేషన్ నిపుణులుగా పేర్కొనవచ్చు.
7. బాధ్యతలు చక్కగా నిర్వహిస్తారు పురుషులకి ఏ పనైనా ఆసక్తిగా అనిపించకపొతే వెంటనే ఆ పనినుంచి తప్పించుకుంటారు. స్త్రీలు మాత్రం తమ ఆసక్తితో సంబంధం లేకుండా తాము చేయవలసిన పనులని చక్కగా నిర్వహిస్తారు. అంట్లు తోమడం జోలికి పురుషులు సాధారణంగా వెళ్ళరు. ఎంత పెద్ద ఉద్యోగం చేస్తున్నా స్త్రీలు ఇంటిని చక్కదిద్దే పనులు చేయడంలో ఆసక్తిని తెచ్చుకుని మరీ తమ పనులను పూర్తి చేస్తారు.
8. వివరాలు గుర్తుంచుకుంటారు షాపింగ్ లో కొనవలసిన వస్తువుల జాబితా, చేయవలసిన పనులు, పుట్టినరోజు తేదీలతో సహా అవసరమైన విషయాలన్నీ స్త్రీలు చక్కగా గుర్తుంచుకుంటారు. తమ ప్రియమైన వారికి ఇష్టమైన ఆహార పదార్థాలు వివరాలతో పాటు వారి ఇష్టాఇష్టాలను గుర్తుపెట్టుకుని వారిని ఆశ్చర్యపరుస్తారు. పురుషులకి ఇలా గుర్తుపెట్టుకోవడం సాధ్యం కాదనే చెప్పుకోవాలి.
9. ఎక్కువ కాలం జీవిస్తారు మానసికంగా పురుషులకంటే స్త్రీలే బలమైన వారు. అందువల్లే స్త్రీల సగటు జీవితకాలం పురుషుల జీవితకాలం కంటే ఒక ఏడాది ఎక్కువని అంటారు. ఇదిలా ఉంటే, స్త్రీలు గొప్ప నిర్ణయకర్తలనడంలో సందేహం లేదు. ఆహారం , బాధ్యతలు, ఆరోగ్యం విషయంలో స్త్రీలు తీసుకునే శ్రద్ధ చెప్పుకోదగినది.
10. మనస్తత్వ నిపుణులు స్త్రీలు గొప్ప మనస్తత్వ నిపుణులు కూడా. పిల్లలు ఎందుకు ఏడుస్తున్నారో తల్లిగా అర్థం చేసుకుంటారు. తమ స్నేహితురాలి బాధను యిట్టె పసిగట్టేస్తారు. తన భర్త నడవడికని యిట్టె అంచనా వేస్తారు. స్త్రీలకు అంతర్ దృష్టి ఎక్కువ. కాబట్టి స్త్రీలను గొప్ప మనస్తత్వ నిపుణులుగా భావించడంలో అతిశయోక్తి లేదేమో కదా.

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list