MohanPublications Print Books Online store clik Here Devullu.com

నాగపంచమి_NagaPanchami




గరుడ పంచమి 

విష్ణుమూర్తికి వాహనమైన వేద స్వరూపుడు గరుత్మంతుడు. ఆయన మాతృభక్తి పరాయణుడు. నిరంతర స్వామి సేవాతత్పరుడు. పక్షిజాతికి అధినాయకుడు. అద్భుత గమనానికి సంకేతమై నిలిచే అపార శక్తిసంపన్నుడు. రుగ్వేదంలోని సుపర్ణ సూక్తం, అష్టాదశ పురాణాల్లోని గరుడ పురాణం ఆయన వైభవాన్ని సమగ్రంగా ఆవిష్కరించాయి.
విష్ణురథుడు, ఖగేశ్వరుడు, వైనతేయుడు, సుపర్ణుడు... ఇలా గరుత్మంతుడికి అనేక పేర్లు. శ్రీహరికి ప్రియమైన సేవకుడిగా మెలిగే ఆయన కాలస్వరూపుడని పురాణాలు వర్ణించాయి. కాలానికి సూచిక గరుడుడు. ఆయన రెండు రెక్కలూ ఉత్తరాయణ, దక్షిణాయనాలకు ప్రతీకలు. శుక్ల, కృష్ణపక్షాలకు; పగలు, రాత్రులకు ఆ రెక్కలు సూచికలు. శాస్త్రవిద్యకు, మోక్షవిద్యకు అవి చిహ్నాలు.
జీవాత్మకు ప్రతినిధి వైనతేయుడు. భక్తిప్రపత్తులతో, అసమాన సేవాదీక్షతో, నిరుపమాన విధేయతతో పరమాత్మను ఆశ్రయిస్తుంది జీవాత్మ. ఆ భగవత్‌ చైతన్యం భక్తుణ్ని సదా వెన్నంటి ఉంటుంది. విష్ణువు వాహనరూపుడై గరుడుడు వర్ధిల్లుతున్నాడంటే, అదీ ఆంతర్యం!
కశ్యప మహర్షికి భార్యలు- వినత, కద్రువ. వారిలో వినత సుతుడు గరుత్మంతుడు. కద్రువ సంతానం సర్పజాతి. ఓ సందర్భంలో వినత, కద్రువల మధ్య పోటీ ఏర్పడింది. ఓడినవారు, గెలిచినవారికి జీవితాంతం దాస్యం చేయాలన్న ఒప్పందం కుదిరింది. ఓడిన వినత, కద్రువకు సేవకురాలిగా మారి సపర్యలు చేయసాగింది. మహా బలవంతుడైన గరుడుడు తన తల్లి దాస్యవిముక్తికి పలు విధాలుగా ప్రయత్నించాడు. నారదుడి సూచనతో స్వర్గలోకానికి వెళ్లాడు. అక్కడ దేవేంద్రుణ్ని ఓడించి, అమృత భాండాన్ని తెచ్చి సవతి తల్లికి ఇవ్వడం ద్వారా మాతృమూర్తికి విముక్తి కలిగించాడన్నది పురాణ గాథ. కన్నతల్లిని బంధవిముక్తం చేసి, ఆమె వాత్సల్యాన్ని గరుడుడు అందుకున్న శుభ తరుణమే- శ్రావణ శుద్ధ పంచమి. ఇదే గరుడ పంచమి. ఆయన జన్మతిథి సైతం ఇదేనంటారు. పంచమినాడు గరుత్మంతుణ్ని, ఆయన సోదరులైన సర్ప దేవతల్ని భక్తులు వ్రతసహితంగా ఆరాధిస్తారు.
గరుడ పంచమినాడు ఆచరించే వ్రతవిధి, ప్రక్రియల సమాహారాన్ని ‘వ్రత రత్నాకరం’, ‘గరుడ పురాణం’ ప్రస్తావించాయి. సోదరులు గల మహిళలు ఈ వ్రతాన్ని తప్పక ఆచరించాలంటారు. చతురస్రాకార పీఠంపై గరుడ రూపాన్ని ముగ్గుతో చిత్రీకరిస్తారు. దానిపై బియ్యం పోసి, తమలపాకును ఉంచి, పిండి లేదా మట్టితో సర్పరూపాన్ని తయారు చేస్తారు. అక్కడే గరుత్మంతుడి చిత్రపటాన్ని ఉంచుతారు. పూజా మండపంలో పసుపుతో చేసిన గౌరీదేవిని సర్పాకృతి వద్ద ప్రతిష్ఠిస్తారు. ఆ దేవిని ‘ఫణి గౌరి’గా వ్యవహరిస్తారు. గణపతితోపాటు ఫణిగౌరి, ఆదిశేషుడు, గరుత్మంత రూపాల్ని షోడశోపచారాలతో పూజిస్తారు. గరుడ పంచమిని ‘నాగ పంచమి’గా పరిగణిస్తారు. నాగుల్ని, గరుత్మంతుణ్ని ఏకీకృతంగా పూజించడం ఈ పర్వదిన విశేషం. బద్ధవిరోధులైన ఇద్దర్ని ఒకేసారి ఆరాధించడమంటే, అందర్నీ సమత్వ భావనతో దర్శించాలని తెలియజేయడమే!
గరుత్మంతుణ్ని ‘గరుడాళ్వార్‌’గా వ్యవహరిస్తారు. మధురకవి ఆళ్వార్‌ గరుడ అంశతో జన్మించాడని వైష్ణవ ఆగమాలు చెబుతాయి. గరుత్మంతుడిపై శ్రీమన్నారాయణుణ్ని దర్శించిన పెరియాళ్వార్‌ మంగళాశాసనాలతో కీర్తించాడు. గరుత్మంతుణ్ని అధిరోహించిన వేంకటేశుడిని తాళ్లపాక అన్నమయ్య సంకీర్తనతో శ్లాఘించాడు. ‘గరుడ గమన రారా, నను నీ కరుణ ఏలుకోరా’ అని వైకుంఠ రాముణ్ని భద్రాచల రామదాసు వేడుకున్నాడు.
విష్ణ్వాలయాల్లో ఉండే ధ్వజస్తంభాన్ని గరుడ స్తంభమని, కంబమని పిలుస్తారు. బ్రహ్మోత్సవాల ఆరంభ సూచకంగా, గరుడ చిత్రాన్ని ఆ ధ్వజంపై ఎగురవేస్తారు. శ్రీహరిని వీపుపై మోస్తూ పరవశించే గరుత్మంతుడి భంగిమ- క్రియాయోగ ఆసనం. నిశ్చల తత్వానికి, ఆత్మ విశ్వాసానికి, అసాధారణ ప్రజ్ఞ పెంపుదలకు యోగశాస్త్రరీత్యా ఇది ఉపకరిస్తుంది. తన మూర్తిమత్వం ద్వారా గరుడుడు ఇవే సుగుణాల్ని ఆవిష్కరించాడు!

- డాక్టర్‌ కావూరి రాజేశ్‌పటేల్‌



నాగపంచమి

శ్రావణ మాసంలో మొదట వచ్చే పంచమిని నాగపంచమి లేదా గరుడ పంచమిగా వ్యవహరిస్తారు. శ్రీమహావిష్ణువు శయనించేది ఆదిశేషువుపైన అన్న విషయం తెలిసిందే. యావత్‌ భారాన్ని మోస్తున్న ఆదిశేషువును ఏదైన వరం కోరుకోమంటాడు విష్ణుమూర్తి. ప్రతి మాసం శుక్ల పంచమి నాడు లేదా ప్రతి ఏడాది శ్రావణ శుక్ల, మార్గశిర పంచమి నాడు నాగులను మానవులు పూజించాలని ఆదిశేషువు కోరుకున్నాడు. దీంతో ఆ వరాన్ని విష్ణుమూర్తి ఇవ్వడంతో శ్రావణశుక్ల పంచమి పర్వదినాన్ని నాగపంచమిగా జరుపుకొంటూ నాగులకు పూజలు చేయడం సంప్రదాయంగా మారింది.


కశ్యపప్రజాపతి సతీమణుల్లోని వినత, కద్రువలు అక్కాచెల్లెళ్లు. ఒక రోజు దూరంగా వున్న ఒక తెల్లటి అశ్వాన్ని చూసిన కద్రువ దాని తోక నల్లగా వుందని చెప్పింది. అయితే వినత దాని తోక తెల్లగానే వుందని పేర్కొంది. దీంతో వారు పందెం వేసుకున్నారు. ఎవరైతే పందెంలో ఓడిపోతే గెలిచిన వారి దగ్గర దాసిగా పనిచేయాలని పందెం పెట్టుకున్నారు. ఇంతలో రాత్రి కావడంతో పొద్దున వద్దామని వెళ్లిపోయారు. ఆ రాత్రి కద్రువ తన సర్పకుమారులందరిని పిలిచి ఎవరైనా అశ్వం తోకకు చుట్టుకోవాలని కోరింది. అయితే నాగులు అలా పాపం చేయడం తగదని హితవు పలికాయి. దీంతో కోపించిన ఆమె భవిష్యత్తులో జరిగే సర్పయాగంలో నాగులు పడి జాతి అంతమవుతుందని శాపం పెడుతుంది. దీంతో భీతిల్లిన కుమారుల్లో ఒకరైన కర్కోటకుడు అశ్వం తోకను చుట్టుకుంటాడు. అనంతరం అశ్వాన్ని చూసిన వినత తాను ఓడిపోయినట్టు గ్రహించి దాసిగా వుండిపోయింది. ఆమె కుమారుడైన గరుత్మంతుడు తల్లికి శాపవిముక్తి కలిగించాడు.


తరువాత ద్వాపర యుగంలో పరిక్షిత్తు మహారాజును తక్షకుడు కాటు వేయడంతో మరణిస్తాడు. తండ్రి మరణానికి నాగులే కారణమన్న ఆగ్రహంతో జనమజేయుడు సర్పయాగం నిర్వహిస్తాడు. ఈ యాగంలో లక్షలాది సర్పాలు పడి మృతిచెందాయి. వాసుకి సోదరి మాతా మానసదేవి తన కుమారుడైన అస్తీకున్ని యాగప్రదేశానికి పంపడంతో అతను యాగాన్ని నిలిపివేయమని జనమేజయుడిని ప్రార్థిస్తాడు. దీంతో యాగం నిలిచిపోతుంది. శ్రావణ శుక్ల పంచమి నాడు నాగజాతిని సంరక్షించిన దినం కావడంతో ఆ రోజును నాగపంచమిగా జరుపుకొంటారు. ఆ రోజున సమీపంలోని పుట్టలకు వెళ్లి పాలు పోసి పూజలు నిర్వహిస్తారు.


అక్కాచెల్లెళ్ల బిడ్డలైన గరుత్మంతునికి, నాగులకు మధ్య వున్న ఘర్షణను నివారించేందుకు విష్ణుమూర్తి ఇరువర్గాల మధ్య సంధి కుదర్చుతాడు. ఈ ఒప్పందం శ్రావణమాసం శుక్లపంచమినాడు జరిగింది. అందుకే గరుడ పంచమి అని కూడా వ్యవహరిస్తారు.


++++++++++++++++++++
నాగ పంచమి వ్రత కధ

ఏటా శ్రావణమాసం శుద్ధ పంచమి రోజును నాగ పంచమి అంటారు. బ్రహ్మదేవుడు, ఆదిశేషువును అనుగ్రహించిన రోజు అన్నమాట.''నాగులచవితి'' మాదిరిగానే ''నాగ పంచమి'' నాడు నాగ దేవతను పూజించి, పుట్టలో పాలు పోస్తారు. నాగ పంచమి రోజున నాగ దేవతను పూజించిన వారికి, సంవత్సరం పొడుగునా ఏ సమస్యలూ లేకుండా, అన్నీ సవ్యంగా నెరవేరుతాయి. అంతా అనుకూలంగా ఉంటుంది.

చలి చీమ నుండి ... చతుర్ముఖ బ్రహ్మ వరకు , రాయి - రప్ప , చెట్టు -చేమ , వాగు-వరద , నీరు -నిప్పు , అన్నిటా అందరిలోనూ దైవత్వాన్ని దర్శించే విశిష్టమైన సంస్కృతి హిందువులది . హిందువుల దృష్టిలో పాము కుడా పరమాత్మ స్వరూపమే . వేయి పడగల ఆదిశేషుడు విష్ణుమూర్తికి పాన్పు . వాసుకి పరమేశ్వరుడి కన్టాభరణమ్ . వినాయకుడు నాగ యజ్ఞోప వీతుడు.

నాగ జాతి జనము :

కశ్యప ప్రజాపతికి , కద్రువ దంపతులకు .. అనంతుడు ,తక్షకుడు , వాసుకి , ననినాగుడు , శంఖుడు , కర్కోటకుడు , ఉగ్రకుడు పిందారకుడు , హహుషుడు , ఐరావతుడు మొదలగు వారు జన్మించి కనబడిన వారినల్లా కాటు వేస్తూ భయభ్రాంతులను చేయసాగారు .

దాంతో సకల దేవతలు బ్రహ్మను వేడుకోగా ఆయన కోపించి తల్లి శాపానికి గురై వారంతా నశిస్తారని శపించాడు . అప్పుడు వాసుకి మొదలైన నాగులంతా విధాత ముందు వినమ్రులై " మమ్మల్ని మీరే సృష్టించి మాకీ విధంగా శాపమివ్వడం న్యాయమా " అని వేడుకున్నారు .

"విషయుక్తంగా పుట్టినంత మాత్రాన అందర్నీ కాటువేసి ప్రాణికోటిని నశింప జేయడం తప్పు కదా ' నిష్కారణంగా ఏ ప్రాణినీ హింసించరాదు . గరుడ మంత్రం చదివే వారిని , ఔషధమని సమేతులను తప్పించుకు తిరగండి .దేవతా విహంగ గణాలకు , జ్ఞాతులైన మీరు మీమీ స్థాన గౌరవాలను నిలిపుకోండి . వాయుభాక్షకులై సాదుజీవులు గా మారండి . మీ నాగులంతా ఆతలా వితల పాతాళ లలో నివాసం చేయండి" అని బ్రహ్మ శాసించగా వారంతా ఆయన ఆజ్ఞను శిరసావహించారు .

దాంతో దెవత లంతా నాగులను ప్రశంసించారు . భూలోక వాసులంతా ప్రార్ధనలు చేశారు నాగులకు . దివ్య ప్రభావ సంపన్నమయిన నాగజాతికి కృతజ్ఞతాపూర్వకం గా నాగుల జన్మదినమైన నాగపంచమి రోజున వారిని పూజచేయడం మొదలు పెట్టారు. పుట్టలో ఆవుపాలు , వడపప్పు , చలిమిడి , అరటిపండ్లు , కోడి గ్రుడ్లు జారవిడిచి నైవేద్యం గా సమర్పిస్తారు .

పార్వతీ దేవికి పరమేశ్వరుడు చెప్పినట్లు గా పురాణాలులో చెప్పడం జరిగినది .
ఓ పార్వతీ దేవి... శ్రావణ మాస శుక్ల పంచమినాడు నాగారాధన చేయడం అత్యంత శ్రేష్టమైనది. ఈ నాగపంచమినాడు ద్వారానికి ఇరువైపులా సర్ప చిత్రాలను గోమయంతో రాసి పూజ చేయడం ఎంతో శుభప్రదం. చతుర్థి రోజున ఉపవాస వ్రతాన్ని ఆచరించి పంచమి రోజున బంగారం వెండి, కర్రతోగానీ, లేదా మట్టితోగానీ వారి వారి తాహతుని అనుసరించి ఐదు పడగల పామును చేయించాలి. లేదంటే పసుపు, చందనంతోగానీ ఏడు తలల పాము చిత్ర పటములు గీచి ఆ రూపాలకు జాజి, సంపెంగ, గన్నేరు ఇత్యాది పుష్పాలతో పూజించాలి. పాయసము, పాలు నివేదన చేయాలని పరమేశ్వరుడు వివరించాడని పురాణాలు చెబుతున్నాయి.

శ్రావణమాసం, శుక్లపక్షంలోని పంచమి తిథి నాడు నాగపంచమి పండుగ వస్తుందని శాస్త్ర వచనం.అందుచేత శ్రావణమాసం న వచ్చే నాగపంచమి రోజున నాగదేవతను పూజించాలి. నాగచతుర్థి రోజున (నాగపంచమికి ముందురోజు) ఉపవాస వ్రతాన్ని ప్రారంభించాలి. గరుడ పంచమిగా పిలువబడే నాగపంచమి రోజున సూర్యోదయానికి ముందేలేచి శుచిగా స్నానమాచరించి, ఇంటిని శుభ్రం చేసుకోవాలి.

ఇంటి గడప, పూజగదిని పసుపు, కుంకుమలు, పుష్పాలతో అలంకరించుకోవాలి. నాగదేవత ప్రతిమకు నేతితోనూ, పాలతోనూ అభిషేకం చేయించి పెరుగును నైవేద్యంగా పెట్టాలి. పూజ అయ్యాక బ్రాహ్మణుడికి తాంబూలం, పానకం, వడపప్పులతో సహా ఈ నాగప్రతిమను దానంగా ఇవ్వాలి. నాగపంచమి రోజంతా ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేయాలి. ఈ విధంగా చేసిన వారికి నాగరాజులు అనుగ్రహిస్తారని పురాణాలు చెబుతున్నాయి. అంతేగాకుండా పాపాల నుంచి విముక్తి లభించడం, సర్ప భయం తొలగిపోవడం వంటివి జరుగుతాయి.

నాగ పంచమి వ్రత కథ

పూర్వము ధనవంతురాలైన ఒక గృహిణి వుడేది ... ప్రతిరోజూ సర్పాలు అనేకం వచ్చి తనను కాటు వేస్తున్నట్లు గా ఆమెకు కలలు వస్తున్నవి దానితో ఆమె భయకంపితురాలైంది . ఒక రోజున వారి కులగురువు వారి ఇంటికి వచ్చి ఆమె దీన గాధను విన్నారు . విని "అమ్మా " నువ్వు గతజన్మలో పుట్టలో పాలు పోసేవారిని చూసి ఎగతాళి చేశావు , అందువలన నీకు ఈ జన్మలో ఈ జాడ్యము సంక్రమించినది అని చెప్పి నివారణకోసం నాగపంచమి నోము నోయమని , పాముల భయం తొలగి పోతుందని చెప్పెను . ఆమె అట్లాగే నోచి ఆ స్వప్నాల భయం నుండి విముక్తురాలైనది . నాగపంచమి వ్రత కధల్లో ఇది ఒకటి .
ఈ కధ వెనుక ఒక సామాజిక మైన హితవు ఉన్నది .. ఇతరులకు ఎవ్వరికీ ఇబ్బంది కలగని విధంగా ఎవరైనా తన కుటుంబ ఆచారాన్ని తానూ పాతిస్తున్నట్లయితే వారిని పరిహసించకూడదు .. ఎవరి విశ్వాసము వారిది.

మన సంస్కృతిలో పాములు పూజింపబడుతున్నాయి. అలాగే యోగాలో కూడా ఇవి ఎంతో ముఖ్యమైన భూమిక పోషిస్తున్నాయి.. ఒక విధంగా చూస్తే, పాము ‘కుండలినికి’ సంకేతం. స్వభావం, కదలిక, నిశ్చలత్వం వంటి విషయాల్లో కుండలినికి పాములతో ఉండే పోలిక వల్ల, పామును కుండలినికి సంకేతంగా చూస్తారు. ఇంకో అంశం ఏమిటంటే పాము జీవ పరిణామక్రమంలో చాలా ముఖ్యమయిన మలుపు. జీవపరిణామ క్రమంలో ‘శరీరం పరంగా కోతి ప్రముఖ స్థానంలో ఉంటుంది, అలాగే ‘శక్తి’ పరంగా పాము విశిష్ట స్థానంలో ఉంటుంది. మరో అంశం ఏమిటంటే పాములు కొన్ని రకాల శక్తులకు ఎంతో స్పందిస్తాయి. ఎక్కడ ధ్యానానికి అనుకూలంగా ఉంటుందో లేక యజ్ఞయాగాదులు నిర్వహింప బడుతుంటాయో అక్కడికి పాములు ఆకర్షింపబడతాయి. అలాగే పాములు గురించి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి.

స్వభావం, కదలిక, నిశ్చలత్వం వంటి విషయాల్లో కుండలినికి పాములతో ఉండే పోలిక వల్ల, పామును కుండలినికి సంకేతంగా చూస్తారు. అందుకే ఈ సంస్కృతిలో మీరు పాముని చంపడం నిషిద్ధం. భారతదేశంలో ఒక పాముని చంపినా, ఒక పాము మృతదేహాన్ని చూసినా దానికి అంతిమ సంస్కారం చేయడం ఆనవాయితీ. జీవపరంగా మనిషికి పాముకి ఎంతో దగ్గర సంబంధం ఉండటం వల్ల, ఈ సంస్కృతిలో పాము కూడా మనిషిలాగే ఎప్పుడూ సరైన అంతిమ సంస్కారాన్ని పొందుతూ ఉంది. అందువల్ల ఒక పాముని చంపడం అంటే అది హత్యతో సమానమే.

నాకు తెలిసినంత వరకూ పాము లేని గుడి అంటూ ఉండదు. ప్రతి గుడిలో ఎక్కడో ఒక చోట ఒక చిన్న పాము విగ్రహమైనా ఉంటుంది. అన్ని ప్రాచీన దేవాలయాల్లో పాములన్నాయి. క్రొత్తగా, షాపింగు కాంప్లెక్సులలా కట్టిన కొన్ని దేవాలయాల్లో పాములు ఉండకపోవచ్చు. కాని మీరు ఏ పురాతన దేవాలయాన్ని సందర్శించినా అక్కడ పాముల కోసం ప్రత్యేకంగా ఓ స్థానం ఉంటుంది. ఎందుకంటే అది జీవ పరిణామక్రమంలో చాలా ముఖ్యమయిన మలుపు. అంతేకాకుండా, ఎన్నో విధాలుగా జీవ ప్రేరేపణకు కారణం అదే.



కాలసర్ప యోగం ఉన్నవారు, ప్రత్యేకంగా నాగ పంచమి రోజున నాగ దేవతకు విశేష పూజలు నిర్వహిస్తారు. కాలసర్ప యోగం ఉన్నవారికి అనేక కష్టాలు ఎదురౌతాయి. శారీరక అనారోగ్యం కలుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో ఇబ్బందులు ఎదురౌతాయి. సవ్యంగా జరగాల్సిన పని కూడా ఆగిపోతుంది. ఊహించని అవరోధాలు వస్తుంటాయి. ఏదో రూపంలో మానసిక అశాంతి కలుగుతుంది. అలాంటప్పుడు, నాగ పంచమి నాడు పుట్టలో పాలు పోసి, కాలసర్ప దోష శాంతి చేయించుకోవాలి. దాంతో దోష నివారణ జరిగి, సుఖసంతోషాలు అనుభూతికి వస్తాయి

************************

నాగపంచమి గురించి 10 విశేషాలు

     శ్రావణమాసంలోని శుక్లపక్ష పంచమి తిథి సందర్భంగా నాగులను పూజించడం ఆచరంగా వస్తోంది. మన సంప్రదాయాలలో ప్రతి పండుగకీ ఉన్నన్ని విశేషాలూ ఈ నాగపంచమికి కూడా ఉన్నాయి. అవి...

- సర్పారాధన అనేది భారతీయులకే ప్రత్యేకమైన ఒక ఆచారం. ఇతర దేశాలలో ఇలాంటి ఆరాధన ఉన్నప్పటికీ వాటన్నింటకీ మాతృక మన దేశమే అని భావించేవారు లేకపోలేదు.




- వేదాలలోనూ, గుహ్య సూత్రాలలోనూ సర్పాలను ఆరాధించడం గురించి అనేక మంత్రాలు, వివరణలు ఉన్నాయి. కాలం మారుతున్న కొద్దీ సర్పాలను ఆరాధించే పద్ధతులు మారినప్పటికీ ఇప్పటికీ నాగపంచమిని భారతదేశంలోని నలుమూలలా వేర్వేరు రీతులలో, వేర్వేరు పేర్లతో జరుపుకుంటూనే ఉన్నారు.

- సర్పాలు మనకంటే ఉన్నతమైన జాతికి చెందినవనీ, ఇప్పటికీ నాగలోకం పేరుతో ఒక గ్రహం ఉన్నదనీ ఒక నమ్మకం. ఆ లోకంలో నివసించే జీవులు ఆధ్యాత్మికంగా చాలా ఉన్నతస్థాయిలో ఉన్నయని అంటారు. దీనికి సంబంధించిన ఆసక్తికరమైన విశేషాలు శ్రీ ఎం రాసిన ‘Apprenticed to a Himalayan Master’ అనే పుస్తకంలో కనిపిస్తాయి.

- నాగలోకం ఉన్నదో లేదోకానీ, నాగపాము స్వరూపం మన కుండలిని పోలి ఉండటం మాత్రం ఆశ్చర్యకరమైన విషయమే! మనలోని సహస్రార చక్రం వరకూ ఇడపిండళి నాడులు చుట్టుకుని ఉన్న కుండలిని.... సరిగ్గా పడగ విప్పిన నాగుపాములాగానే తోస్తుంది.

- స్థితికారకుడైన విష్ణువుకి జన్మమాసమైన ఈ శ్రావణమాసంలోనే, ఆధ్మాత్మక ఉన్నతిని ప్రసాదించే నాగారాధనను కూడా ఏర్పరచడం యాదృచ్ఛికం ఏమీ కాదు. మనిషి కేవలం బతికేయడం కాదు, ఆధ్యాత్మికంగా మరింత ఎత్తుకి ఎదగాలని నాగపంచమి సూచిస్తోంది.

- కేవలం ఆధ్మాత్మిక ఉన్నతినే కాదు, సంసార బాధలని కూడా నాగపూజ ఈడేరుస్తందని నమ్మకం. కుజ, రాహుదోషాలు ఉన్నవారు; వినికిడి సంబంధమైన సమస్యలు ఉన్నవారు; సంతానం లేనివారు... నాగపూజను చేస్తే తప్పకుండా ఫలితం ఉంటుందని ఓ ప్రగాఢ విశ్వాసం.

- నాగపంచమి రోజున నాగపాము ప్రతిమను చేసి లేదా బొమ్మను చిత్రించి ఆ ప్రతిరూపాన్ని ధూపదీపనైవేద్యాలతో పూజించడం సంప్రదాయం. అలా కాకుండా వాటి పుట్టలో పాలు, గుడ్లు, పసుపు వేయడం కూడా చూస్తున్నదే! అయితే ఇలా పుట్టని నింపేయడం వల్ల పాములను పూజించడం మాట అటుంచి, వాటిని మరింత ఇబ్బంది పెట్టినవారమవుతాం అన్నది పర్యావరణవేత్తల ఆందోళన.

- నాగపంచమి వచ్చే నాటికి పొలం పనులు ఉధృతంగా సాగుతూ ఉంటాయి. ఈ కాలంలోనే రైతులకు ఎలుకలు బెడద కూడా మొదలవుతుంది. అనాదిగా ఇలాంటి జీవుల నుంచి పొలాను రక్షిస్తూ వస్తోంది ఆ పాములే. అందుకని వాటికి కృతజ్ఞతగా ఒక్క రోజైనా వాటిని పూజించుకోవడంలో తప్పులేదుగా!

- నాగపంచమి రోజున భూమిని దున్నడం, గోతులు తవ్వడం, పలుగూ పారలతో నేలని పెళ్లగించడం, మొక్కలు పీకడం, ఆరుబయట మంటలు వేయడం.... ఇవన్నీ కూడా నిషిద్ధమని చెప్పారు పెద్దలు. ఈ పైన సూచించిన చర్యల వల్ల ఒకోసారి పాముల ప్రాణాలకు నష్టం అని వేరే చెప్పనవరసం లేదు. అంటే కనీసం ఈ ఒక్క రోజైన పాముని చంపడం అనే చర్య నుంచి దూరంగా ఉండేందుకు, అందుకు దారి తీసే పనులను చేయవద్దని పెద్దలు చెప్పారన్నమాట.

- పాము అనగానే ఆదిశేషుడు తప్పక గుర్తుకు వస్తాడు. భూభారాన్ని వహించే ఆ విష్ణుమూర్తి భారాన్ని మోస్తున్నవాడే ఆదిశేషుడు. అలాంటి ఆదిశేషుని సేవలకు మెచ్చిన శ్రీమహావిష్ణువు ఏదన్నా వరాన్ని కోరుకొమ్మని అడుగగా నాగపంచమి రోజున తమ జాతివారిని లోకులు పూజించుకోవాలని కోరుకున్నాడట శేషుడు. అప్పటి నుంచీ శ్రావణశుక్ల పంచమి ‘నాగపంచమి’ పర్వదినంగా మారింది.

++++++++++++++++++++++++++++++

నాగపంచమి ,Naagapanchami

   చలి చీమ నుండి ... చతుర్ముఖ బ్రహ్మ వరకు , రాయి - రప్ప , చెట్టు -చేమ , వాగు-వరద , నీరు -నిప్పు , అన్నిటా అందరిలోనూ దైవత్వాన్ని దర్శించే విశిష్టమైన సంస్కుతి హిందువులది . మంచో , చెడో ... విపరీత ధోరణి ఇది . హిడువుల దృష్టిలో పాము కుడా పరమాత్మ స్వరూపమే . వేయి పడగల ఆదిశేషుడు విష్ణుమూర్తి కి పానువు . వాసుకి పమేస్వరుడి కన్టాభరణమ్ . వినాయకుడు నాగ యజ్ఞోప వీతుడు . ఈ విధం గా బ్రాహ్మణులూ , ఋషులు , మునులు ... మానవజాతిని నమ్మించి సన్మార్గములో పయనించేటట్లు చేసారు .

నాగ జాతి జనము : 
కశ్యప ప్రజాపతికి , కద్రువ దంపతులకు .. అనంతుడు ,తక్షకుడు , వాసుకి , ననినాగుడు , శంఖుడు , కర్కోటకుడు , ఉగ్రకుడు పిందారకుడు , హహుషుడు , ఐరావతుడు మొదలగు వారు జన్మించి కనబడిన వారినల్లా కాతువేస్తూ భయభ్రాంతులను చేయసాగారు .

దాంతో సకల దేవతలు అంటా బ్రహ్మను వేడుకోగా ఆయన కోపించి తల్లి శాపానికి గురై వారంతా నశిస్తారని శపించాడు . అప్పుడు వాసుకి మొదలైన నాగులంతా విధాత ముందు వినమ్రులై " మమ్మల్ని మీరే సృస్తించి మాకీ విధంగా శాపమివ్వడం న్యాయమా " అని వేడుకున్నారు .

"విషయుక్తం గా పుట్టినంత మాత్రాన అందర్నీ కాటువేసి ప్రాణికోటిని నశింప జేయడం తప్పు కదా ' నిష్కారణం గా ఏ ప్రాణినీ హిమ్సించరాడు . గరుడ మంత్రం చదివే వారిని , ఔషధ మని సమేతులను తప్పించుకు తిరగండి .దేవతా విహంగ గణాలకు , జ్ఞాతులైన మీరు మీమీ స్థాన గౌరవాలను నిలిపుకోండి . వాయుభాక్షకులై సాదుజీవులు గా మారండి . మీ నాగులంతా ఆటలా వితల పాతాళ లలో నివాసం చేయండి" అని బ్రహ్మ శాసించగా వారంతా ఆయన ఆజ్ఞను శిరసావహించారు .

దాంతో డేవాగానామంతా నాగులను ప్రశంసించారు . భూలోక వాసులంతా ప్రార్ధనలు చేశారు నాగులకు . దివ్య ప్రభావ సంపన్నమయిన నాగజాతికి కృతజ్ఞతాపూర్వకం గా నాగుల జన్మదినమైన నాగపంచమి రోజున వారిని పూజచేయడం మొదలు పెట్టారు .

వైదిక కాలం నుండి కార్తీక మాసం ఐదవ రోజు పంచమి ఉత్సవాలు జరుపుకునే సంప్రదాయం దేశమంతా ఉంది . పుట్టలో ఆవుపాలు , వడపప్పు , చలిమిడి , అరటిపండ్లు , కోడి గ్రుడ్లు జారవిడిచి నైవేద్యం గా సమర్పిస్తారు .

పార్వతీ దేవికి పరమేశ్వరుడు చెప్పినట్లు గా పురాణాలులో చెప్పడం జరిగినది .
ఓ పార్వతీ దేవి... శ్రావణ మాస శుక్ల పంచమినాడు నాగారాధన చేయడం అత్యంత శ్రేష్టమైనది. ఈ నాగపంచమినాడు ద్వారానికి ఇరువైపులా సర్వ చిత్రాలను గోమయంతో రాసి పూజ చేయడం ఎంతో శుభప్రదం. చతుర్థి రోజున ఉపవాస వ్రతాన్ని ఆచరించి పంచమి రోజున బంగారం వెండి, కర్రతోగానీ, లేదా మట్టితోగానీ వారి వారి తాహతుని అనుసరించి ఐదు పడగల పామును చేయించాలి. లేదంటే పసుపు, చందనంతోగానీ ఏడు తలల పాము చిత్ర పటములు గీచి ఆ రూపాలకు జాజి, సంపెంగ, గన్నేరు ఇత్యాది పుష్పాలతో పూజించాలి. పాయసము, పాలు నివేదన చేయాలని పరమేశ్వరుడు వివరించాడని పురాణాలు చెబుతున్నాయి.

శ్రావణమాసం, శుక్లపక్షంలోని పంచమి తిథి నాడు నాగపంచమి పండుగ వస్తుందని శాస్త్ర వచనం. ఇదేవిధంగా కార్తీక మాసంలో వచ్చే శుక్లపంచమినాడు జరుపుకునే నాగ పంచమి కూడా ఈ సంప్రదాయానికి చెందినదేనని పండితులు అంటున్నారు.

అందుచేత శ్రావణమాసం న వచ్చే నాగపంచమి రోజున నాగదేవతను పూజించాలి. నాగచతుర్థి రోజున (నాగపంచమికి ముందురోజు) ఉపవాస వ్రతాన్ని ప్రారంభించాలి. గరుడ పంచమిగా పిలువబడే నాగపంచమి రోజున సూర్యోదయానికి ముందేలేచి శుచిగా స్నానమాచరించి, ఇంటిని శుభ్రం చేసుకోవాలి.

ఇంటి గడప, పూజగదిని పసుపు, కుంకుమలు, పుష్పాలతో అలంకరించుకోవాలి. నాగదేవత ప్రతిమకు నేతితోనూ, పాలతోనూ అభిషేకం చేయించి పెరుగును నైవేద్యంగా పెట్టాలి. పూజ అయ్యాక బ్రాహ్మణుడికి తాంబూలం, పానకం, వడపప్పులతో సహా ఈ నాగప్రతిమను దానంగా ఇవ్వాలి. నాగపంచమి రోజంతా ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేయాలి. ఈ విధంగా చేసిన వారికి నాగరాజులు అనుగ్రహిస్తారని పురాణాలు చెబుతున్నాయి. అంతేగాకుండా పాపాల నుంచి విముక్తి లభించడం, సర్ప భయం తొలగిపోవడం వంటివి జరుగుతాయి.
నాగ పంచమి వ్రత కద :
పూర్వము ధనవంతురాలైన ఒక గృహిణి వుడేది ... ప్రతిరోజూ సర్పాలు అనేకం వచ్చి తనను కాటు వేస్తున్నట్లు గా ఆమెకు కలలు వస్తుదేవి , దానితో ఆమె భయకంపితురాలైంది . ఒక రోజున వారి కులగురువు వారి ఇంటికి వచ్చి ఆమె దీన గాధను విన్నారు . విని "అమ్మా " నువ్వు గతజన్మలో పుట్టలో పాలు పోసేవారిని చూసి ఎగతాళి చేశావు , అందువలన నీకు ఈ జన్మలో ఈ జాడ్యము సంక్రమించినది అని చెప్పి నివారణకోసం నాగపంచమి నోము నోయమని , పాముల భయం తొలగి పోతుందని చెప్పెను . ఆమె అట్లాగే నోచి ఆ స్వప్నాల భయం నుండి విముక్తురాలైనది . నాగపంచమి వ్రత కధల్లో ఇది ఒకటి .

ఈ కధ వెనుక ఒక సామాజిక మైన హితవు ఉన్నది .. ఇతరులకు ఎవ్వరికీ ఇబ్బంది కలగని విధంగా ఎవరైనా తన కుటుంబ ఆచారాన్ని తానూ పాతిస్తున్నట్లయితే వారిని పరిహసించకూడదు .. ఎవరి విస్వాశము వారిది . ఈ నాగపూజా వెనుక యోగాపరమైన అంతరార్ధము కుడా ఉన్నది .. మన వెన్నెముక కు అడుగుభాగము లో మూలాధార చక్రమున్నది . ఆ చక్రం లో కుండలినీ శక్తి ఇమిదివున్నది .. అదే నాగదేవత , ధ్యానం to ఆ కూడలిని కదిలించి సహస్రారం దాకా తీసుకొని వెళ్లి నట్లయితే మానవుడు మహానీయుదవుతాడు .. అదీ నాగశక్తి .
మూలము : రచన కర్త : డా .పోలేపెద్ది రాధాకృష్ణ మూర్తి .

#నాగపంచమి  #Naagapanchami

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list