MohanPublications Print Books Online store clik Here Devullu.com

సాధన అంటే ఇలా ఉండాలి!- Tiruvalluvar, Eternal life, తిరువళ్లువార్‌, నిత్యజీవితం




హార్మోన్ల పనితీరుకు సోయా!
మనలో కోపం, దుఃఖం, ద్వేషం వంటి ఉద్వేగాలు నెలసరిలో చాలా తీవ్రంగా ఉంటాయి. హార్మోన్ల్ల ప్రభావమే ఇందుకు కారణం. ముఖ్యంగా ప్రొజస్టరాన్‌, ఈస్ట్రోజన్‌ వంటివాటి పాత్ర కీలకంగా ఉంటుంది. మరి అవి సమతూకంలో ఉండాలంటే.. 
* ఒత్తిడి చాలామటుకు మనలోని హార్మోన్లని ప్రభావితం చేస్తుంది. అందుకే దాన్ని తగ్గించుకునేందుకు రోజూ కప్పు గ్రీన్‌టీ తాగండి. ఒత్తిడి తగ్గి హార్మోన్ల తీరు బాగుంటుంది. 
* ఒమెగా3, ఒమెగా 6 ఫ్యాటీ ఆమ్లాలు హార్మోన్ల సమతుల్యత కోల్పోకుండా చేస్తాయి. ఇవి అందాలంటే వేరుసెనగ నూనె, సన్‌ఫ్లవర్‌ నూనెలని ఆహారంలో చేర్చుకోవాలి. 
* సోయా పాలు తాగడం, ఆ గింజలు ఎక్కువగా తీసుకునేవారిలో హార్మోన్ల పనితీరు బాగుంటుంది. పైగా వాటివల్ల మెనోపాజ్‌ దశలో ఎదురయ్యే సమస్యలు అదుపులో ఉంటాయని అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి వాటిని ఎక్కువగా తీసుకోవడం మంచిది.

జిడ్డు వదిలించే తేనె
ముఖమంతా జిడ్డు... దానికితోడు మొటిమల సమస్య చాలామందిని ఇబ్బంది పెడుతుంది. ఇలాంటప్పుడు ఈ పూతలు ప్రయత్నించి చూడండి. 
* గుప్పెడు తాజా పుదీనా ఆకులని మెత్తగా నూరి, రెండు చెంచాల తేనె కలపాలి. దీన్ని ముఖానికి పట్టించి ఆరిన తరవాత కడిగేసుకోవాలి. ఇలా వారానికోసారి చేస్తుంటే మొటిమల సమస్య తగ్గడమే కాదు, జిడ్డు కూడా వదులుతుంది. 
* కాసిని గులాబీనీటిలో కొద్దిగా నిమ్మరసం కలిపి.. ముఖానికి రాసుకోవాలి. పది నిమిషాలయ్యాక చన్నీళ్లతో కడిగేసి ఆపైతేనెతో పూత వేసుకోవాలి. Œర్వాత కడిగేస్తే సరిపోతుంది. నిమ్మరసం ముఖంలోని జిడ్డునీ, యాక్నెని తొలగిస్తే తేనె ముఖానికి కావాల్సిన తేమను అందిస్తుంది. 
* ముందుగా కీరదోసని సన్నగా తరుముకుని దానిని మిక్సీలో వేసి రసాన్ని వడకట్టి పెట్టుకోవాలి. కీరదోస ముద్దని ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి. ఆరిన తర్వాత ఇందాక మనం తీసిపెట్టుకున్న రసాన్ని కొద్దికొద్దిగా చిలకరించడంకానీ దూదితో అద్దడం కానీ చేస్తే చక్కని ఫలితం ఉంటుంది. ఇలా వారానికి కనీసం రెండు సార్లు చేయాలి. 
* గుడ్డులోని తెల్లసొనని బాగా గిలకొట్టి దానిని యాక్నె ఉన్న చోట కాస్త దట్టంగా ప్యాక్‌లా వేసుకోవాలి. జిడ్డు చర్మం ఉన్నవారు తెల్లసొనకి నిమ్మరసం కూడా కలిపి వేసుకుంటే తక్షణ ఫలితం ఉంటుంది. 
* కొద్దిగా ఓట్‌మీల్‌తో చేసిన జావ తీసుకుని దానికి మెత్తగా రెండు చెంచాల ఉల్లిపాయ ముద్దను కలుపుకోవాలి. అవసరం అనుకుంటే మిక్సీలో మెత్తగా చేసుకుని దీనికి కొద్దిగా తేనె కలిపి ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి. ఇరవైనిమిషాల తర్వాత కడిగేస్తే సరిపోతుంది.

నిద్రలేమికి గుడ్‌బై
నిద్రలేమికి మానసిక కారణాలే ప్రథమ కారణం. వృత్తిపరమైన లేదా జీవిత పరమైన వివిధ సమస్యలను, నిద్రా సమయానికి వదిలేయగలగాలి. ఒకవేళ నిద్రావేళకు కూడా ఆ సమస్యలు వెంటాడుతూనే ఉంటే, మంచం మీద అటూ ఇటూ దొర్లడమే తప్ప నిద్రపట్టదు. అవన్నీ మానసికమైనవి. అయితే నిద్రలేమి సమస్యకు గల శారీర క కారణాలు కూడా తక్కువేమీ కాదు. ఈ తరహా సమస్యలకు నిద్రమాత్రలు గానీ, కడుపులోకి తీసుకునే మాత్రల అవసరం గానీ లేకుండా బాహ్యమైన లేపనాలతోనే ఈ నిద్రలేమిని చాలా వరకు దూరంగా ఉంచవచ్చు.
నువ్వుల నూనె 5 తులాలు, కర్పూరం రెండు తులాలు తీసుకోవాలి. ముందు నూనెను ఇనుప గంటెలో పోసి బాగా వేడిచేసి అందులో కర్పూరం వేసి కలపాలి. చల్లారిన తర్వాత ఈ తైలాన్ని అరికాళ్లకు మర్ధన చేస్తే హాయిగా నిద్రపడుతుంది.
తలనొప్పి కారణంగా నిద్రపట్టకపోతే, ఆవాల పిండిని చిన్న వస్త్రానికి పట్టించి, తలనొప్పి ఉన్నచోట పట్టీవేస్తే చక్కగా నిద్రపడుతుంది.
జాజికాయను నేతితో అరగదీసి, కనురెప్పల పైన పూస్తే కొద్ది నిమిషాల్లోనే నిద్రపడుతుంది.
మరే పదార్థంతోనూ పనిలేకుండా గరుకుతనం లేని అరిచేతులతో అరికాళ్లను మృదువుగా మర్థన చేసినా మంచి నిద్రపడుతుంది.



మధుమేహాన్ని హరించే చెక్క
గుడ్‌ఫుడ్‌
దాల్చిన చెక్క వంటల్లో రుచిని పెంచడానికి మాత్రమే కాక, ఆరోగ్యాన్ని కుదుట పరచడానికి కూడా దోహదం చేస్తుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయులను క్రమబద్ధీకరిస్తుంది. కాబట్టి డయాబెటిస్‌ (టైప్‌ 2 డయాబెటిస్‌) వ్యాధిగ్రస్థులు దీనిని వారానికి కనీసం రెండుసార్లయినా తీసుకుంటే మంచిది. దాల్చిన చెక్క పొడిని రోజుకు అర టీ స్పూన్‌ తీసుకుంటే గుండెకు హాని చేసే (ఎల్‌డిఎల్‌)కొలెస్ట్రాల్‌ స్థాయులను తగ్గిస్తుంది. ల్యుకేమియా, లింఫోమా (క్యాన్సర్‌) వంటి క్యాన్సర్‌ కారక కణాల వృద్ధిని నిరోధించడంలో దాల్చిన చెక్క సమర్థంగా పనిచేస్తుందని అమెరికాలోని మేరీల్యాండ్‌లోని వ్యవసాయ శాఖ పరిశోధకులు నిర్ధారించారు.
రోజూ ఉదయం పరగడుపున అర టీ స్పూన్‌ దాల్చిన చెక్క పొడిని ఒక టేబుల్‌ స్పూన్‌ తేనెతో కలిపి వారం పాటు తీసుకుంటే ఆర్థరైటిస్‌ సమస్య తగ్గుతుంది. ఒక నెల రోజులు క్రమం తప్పకుండా తీసుకుంటే పూర్తిగా నయమవుతుంది.ఇది ఆరోగ్యదాయని మాత్రమే కాదు, ఆహారపదార్థాలను బ్యాక్టీరియా బారిన పడకుండా కాపాడే సహజసిద్ధమైన ప్రిజర్వేటివ్‌ కూడా. రోజూ ఒక కప్పు నీటిలో దాల్చిన చెక్క పొడి చిటికెడు వేసి మరిగించి కొద్దిగా తాగవచ్చు. రుచికి కొద్దిగా తేనె కలుపుకోవచ్చు.
తవ్విన కొద్దీ ఫలితం
ఒక గ్రామంలో ఒక రైతు ఉండేవాడు. అతడికి ఎకరం ద్రాక్ష తోట ఉంది. దానిని సాగు చేస్తూ.. జీవనం సాగించేవాడు. ఒకానొక రోజున ఆ గ్రామంలో తీవ్ర విభేదాలు చెలరేగాయి. గ్రామస్థులందరూ రెండు వర్గాలుగా విడిపోయి కలహించుకున్నారు. ఒక వర్గానికి చెందిన ఆస్తులు మరో వర్గం వారు ధ్వంసం చేశారు. విషయం తెలిసి పోలీసులు అందరినీ ఖైదు చేశారు. జైలుకు వెళ్లిన వారిలో ఈ రైతు కూడా ఉన్నాడు. అతడికి రెండేళ్ల జైలు శిక్ష పడింది. చేసిన తప్పుకు పశ్చాత్తాపపడుతూ రైతు జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు.
ఆరు నెలలు గడిచాయి. రైతు జైలులో ఉండటంతో అతని కుటుంబ పరిస్థితి దయానీయంగా తయారైంది. పట్టించుకునే వారు లేక.. తోటంతా కలుపు పెరిగిపోయింది. ఎప్పటికప్పుడు తవ్వకపోవడంతో వదులుగా ఉండాల్సిన నేల కఠినంగా మారింది. ఫలితంగా ద్రాక్ష తీగలు వాడిపోయాయి. ఇదే విషయాన్ని ఉత్తరం ద్వారా రైతుకు తెలియజేసింది అతడి భార్య. ఆ ఉత్తరానికి రైతు ప్రత్యుత్తరం రాస్తూ.. ‘నువ్వేమీ బాధపడకు. ఇప్పుడు తోటను తవ్వే పని పెట్టుకోకు. మన తోటలో ఒక ప్రదేశంలో బంగారం దాచి ఉంచాను. నేను విడుదలైన తర్వాత దాని సంగతి చూసుకుందాం’ అని వివరించాడు. ఉత్తరాన్ని జైలు అధికారులకు ఇచ్చి పోస్టు చేయమన్నాడు!
ఖైదీల ఉత్తరాలు మొదట జైలు అధికారులు పరిశీలించి.. ఆ తర్వాత పోస్టు చేసేవారు. రైతు ఉత్తరం కూడా అధికారులు చదివారు. అతడి పొలంలో బంగారం ఉందన్న విషయం పోలీసులకు తెలిసింది. ఆ బంగారాన్ని రైతు ఎక్కడో దొంగతనం చేసి.. తన పొలంలో దాచాడని భావించారు. వెంటనే పది మంది పోలీసులు గునపాలు, పారలతో రైతు ద్రాక్ష తోటకు వెళ్లారు. కలుపంతా తీసేశారు. తోటంతా తవ్వారు. కఠినంగా ఉన్న భూమి వదులైంది. పొలంలో బంగారం దొరక్కపోవడంతో.. ఉస్సూరుమంటూ పోలీసులు వెనక్కి వెళ్లిపోయారు. నాలుగు రోజుల తర్వాత వర్షాలు కురిశాయి. ద్రాక్ష తోట ఏపుగా పెరిగింది. అంతకు ముందు ఏడాది కంటే ఎక్కువ దిగుబడి వచ్చింది. రైతు కుటుంబానికి మంచి ఆదాయం లభించింది. పొలమును గానీ, తోటను గానీ ఎంత చక్కగా దుక్కి దున్నితే.. దిగుబడి అంత చక్కగా ఉంటుంది. అదేవిధంగా మన హృదయ క్షేత్రమును ఎంత లోతుగా చదివితే.. అంత మేలు కలుగుతుంది. మనసులోని దుస్సంస్కారాలు, కల్మషం, దురభ్యాసాలు మొదలైన కలుపు మొక్కలను ఊడబెరికి.. సుక్షేత్రంగా మలుచుకోగలిగితే.. జ్ఞాన బీజం చక్కగా మొలకెత్తి మోక్షరూపంలో ఫలితం కలుగుతుంది.

సాధన అంటే ఇలా ఉండాలి!
ఆత్మీయం
దక్షిణదేశంలో ‘తిరువళ్లువార్‌’ అనే పేరును విననివారు అరుదు. అతడు మహాభక్తుడు, జ్ఞాని. నేత నేసి తన సంసారాన్ని నిర్వహించేవాడు. వారంలో ఒకనాడు పూర్తిగా భగవంతుని సేవకు వినియోగించేవాడు. ఆయన భార్య వాసుకి. కాపురానికి వచ్చినప్పటినుంచి అన్నం వడ్డించేటప్పుడు భర్త ఆదేశానుసారం విస్తరి దగ్గర ఒక దొన్నెనిండా నీరు, ఒక సూది ఉంచుతూ ఉండేది. అయితే భర్త ఆ దొన్నె నీటినిగాని, సూదినిగాని ఎన్నడూ ఉపయోగించలేదు. వాసుకి అంత్యకాలం సమీపించింది. ఆ సమయంలో వాసుకి ‘నాకొక సందేహం ఉంది తీరుస్తారా?’ అనడిగింది భర్తను. సరేనన్నాడు తిరువళ్లువార్‌. ‘‘మీరు భోజనం చేసేటప్పుడు విస్తరి పక్కన దొన్నెలో నీరు, సూది ఉంచమనేవారు. కాని మీరెప్పుడూ దొన్నెలో నీరుగాని, సూదిగాని ఉపయోగించటం నేను చూడలేదు. వాటిని మీ విస్తరి పక్కన పెట్టమనటంలో మీ ఉద్దేశ్యం ఏమిటన్నదే నా సందేహం. దీనినే తీర్చవలసింది’’ అని అడిగింది.
తిరువళ్లువార్‌ చిరునవ్వుతో ఇలా అన్నాడు. ‘‘అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నాన్ని కింద పడేయరాదు. వ్యర్థం చేయరాదు. నీవు వడ్డించేటప్పుడు పొరపాటున మెతుకు కిందపడితే దానిని సూదితో తీసి, నీటిలో శుద్ధి చేసి ఆకులో వేసుకోవాలని నా ఉద్దేశ్యం. నీవు ఏనాడూ పొరపాటున కూడా ఒక్క మెతుకైనా కిందపడేయలేదు, అందుకే సూదిని, నీటిని ఉపయోగించే అవసరం రాలేదు’’అన్నాడు. వాసుకి సందేహం తీరి, భర్త ఒడిలో ప్రాణం వదిలింది. తిరువళ్లువార్‌ అన్నాన్ని బ్రహ్మగా భావించాడు. అతని భార్య అన్నాన్ని బ్రహ్మభావంతో, కిందపడకుండా జాగ్రత్తగా వడ్డించింది. ఒకనాడు కాదు, జీవితాంతం చేసింది. ఈ యోగం ప్రతి ఒక్కరు నిత్యజీవితంలో చేస్తే ఇంతకంటే సాధన వేరొకటి లేదు.

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list