MohanPublications Print Books Online store clik Here Devullu.com

శనివారం "శ్రీ వేంకటేశ్వరస్వామివారిని" పూజ_saturday venkateswara swamy puja




శనివారం
 "శ్రీ వేంకటేశ్వరస్వామివారిని  

పూజ చెయ్యడంలోవిశేషం "మార్కండేయ పురాణంలో" ఇలా ఉన్నది.
" కలౌ కుమార రూపేణ షణ్ముఖౌ భగవాన్ హరిః దృశ్య తైక ముఖేనైవ వేంకటాచలనాయకః”
సౌభాగ్యదాయకం విష్ణుం వేంకటేశం సమర్చయః శనివారే” అనిన్నీ,
సుబ్రహ్మణ్య కుమారాభ్యాం విష్ణ్వాభ్యాం వేంకటాచలే
శేష శైషీ కలా బ్రాహ్మీ సర్వచైతన్య రూపిణీ
శ్రీ వేంకటేశ్వర రూపేణ కలౌ ప్రత్యక్ష దర్శనం
సర్వాదాం సి శనేర్వారే భక్తేష్టార్ద ప్రదాయినీ
ఇదం కలియుగే ముఖ్యం సత్యం సత్యం న సంశయః "
ఆరు ముఖాలు కలిగిన - "కుమారస్వామి" కలియుగంలో ఏకముఖుడై భగవంతుడైన – "వెంకటేశ్వర స్వామిగా" అనుగ్రహిస్తూ ఉన్నాడు.
"పురాణాలలో" ఏయే వారాలలో ఏ దేవుని పూజిస్తే ఫలితం వచ్చునో చెప్పబడినవి...... దానిలో భాగంగా
ఆదివారం- సూర్యుని
సోమవారం-శివుని
మంగళవారం-సుబ్రమణ్యం స్వామి, ఆంజనేయ స్వామి
బుధవారం-ఆయ్యప్ప స్వామి
గురువారం-శ్రీ రాముడు, దత్తత్రేయుడు
శుక్రవారం-దుర్గా, లక్ష్మీ, గౌరీ
శనివారం-వెంకటేశ్వర స్వామి
అని చెప్పబడినవి.
కావున! "వెంకటేశ్వర స్వామి" భక్తులు శనివారం వారనియమం, ఏకభుక్తం చేయుట వలన కోరికలు నెరవేరునని శాస్త్ర వచనం.
" కలౌ వేంకటనాయకః "అనగా..? కలియుగంలో
అత్యంత శక్తివంతమైన దైవం "వెంకటేశ్వర స్వామి"
కావున ప్రతీ భక్తుడూ శనివార నియమం పాటించి "శ్రీనివాసుని" ఆరాధించాలి.
ఓం నమో వెంకటేశాయ....
ఓం నమో నారాయణయ.....

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list