MohanPublications Print Books Online store clik Here Devullu.com
Showing posts with label Dharmasastra. Show all posts
Showing posts with label Dharmasastra. Show all posts

ఆవు పాలకీ, గేదె పాలకీ తేడా_CowMilk


 
ఆవు పాలకీ, 
గేదె పాలకీ తేడా తెలుసా?
ప్రాచీన భారతీయ సంప్రదాయం… గోవుకు అడుగడుగునా ప్రాధాన్యతనిచ్చింది..! మనిషికన్నా తక్కువస్థాయిలో ఉన్న సమస్త ప్రాణుల ప్రతినిధి గోవుని గాంధీజీ అంటారు. ఆయుర్వేద వైద్యశాస్త్రంలో గో ఉత్పత్తులకు అధిక ప్రాధాన్యం ఇచ్చింది. ఆవు పాలలో ఔషధ గుణాలు ఉన్నాయి. ఆయుర్వేద మందుల్లో పంచగవ్యాలను వాడుతారు. 


ఆవుపాలు పసుపుపచ్చగా వుంటాయి. గేదె పాలు తెల్లగా ఉంటాయి. అందువల్ల వీటిని బంగారం, వెండి అంటారు. ఆవు మూపురంలో స్వర్ణనాడి ఉంటుంది. అందుకే ఈ ఆవుపాలలో స్వభావసిద్ధంగానే బంగారపు తత్వం ఇమిడి ఉంది. ఈ తత్వం మానవులకు అత్యంత మేలు కూర్చే అంశం. 


ఆవు దూడ పుట్టిన మూడు రోజులకే గంతులేస్తుంది. అదే గేదె దూడ 30 రోజుల వరకు మత్తుగా పడి ఉంటుంది. ఈ కారణంగానే ఆవు పాలు తో శరీరంలో ఉషారు..స్పూర్ఫ్తి వస్తుందని చెప్పవచ్చు. అదే గేదె పాలవల్ల అలసత్వం వస్తుంది. 500 పశువుల మధ్యలో విడిచిపెట్టిన ఆవు దూడ తన తల్లి వద్దకు అవలీలగా చేరుకుంటుంది. అదే గేదె దూడ 10-15 గేదెల మధ్యలోనైనా తన తల్లిని గుర్తించలేదు. దీన్ని బట్టి మనం ఆవుపాలు బుద్దిబలం పెంచుతాయని అర్థం చేసుకొనవచ్చు. ఆవులకు గాని, వాటి దూడలకు గాని మనం ఏదైనా పేరు పెట్టి పిలిస్తే వెంటనే అవి ప్రతిస్పందించి పిలుస్తున్నవారి వద్దకు వస్తాయి. గేదెలకు, వాటి దూడలకు ఈ జ్ఞానం శున్యం. ఆవులు ఎక్కడ విడిచిన పెట్టిన సమయానికి మళ్లీ అవి తమ స్వస్థలానికి చేరుకొంటాయి. గేదెలకు స్థలము, సమయము, గుంపు అన్న గుర్తింపు ఉండదు. 


భారతీయ గోవు తీవ్రమైన ఎండను కూడా సహిస్తుంది. అందుకే దీని పాలు రోగరహితము, ఆరోగ్యప్రదము, పౌష్టికమైనవిగా ఉంటాయి. కాని గేదెలు , విదేశీ జాతి జెర్సీ..ఇతర సంకరజాతి ఆవులు ఎండవేడిమిని సహించలేవు. ఆవు పాలు గుండె జబ్బు రోగులకు ప్రత్యేకించి ఉపయోగపడతాయి. గేదె పాలలోని క్రొవ్వు పదార్థం రక్తనాడుల్లో చేరి క్రమంగా హృద్రోగానికి కారణం అవుతాయి. ఆవు పాలలోని పసుపచ్చని పదార్థం కళ్ళలోని జ్యోతిని వృద్ధి పరుస్తుంది. కళ్ళకలక వస్తే పాలలో తడిసిన గుడ్డుపట్టి కడితే నయం అవుతుంది. అభివృద్ధి చెందిన చాలా దేశాల్లో ఆవులను పెద్దసంఖ్యలో పెంచుతున్నారు. ఆయా దేశాల్లో గేదెలు ఎక్కువగా జంతు ప్రదర్శనశాలలోనే కనిపిస్తాయి. చరక సంహిత ప్రకారం జీవన శక్తి అందించే ద్రవ్యాలలో ఆవు పాలు అన్నిటికంటే శ్రేష్ఠమైనవని తెలుస్తుంది. ధన్వంతరి నిఘంటువు ప్రకారం ఆవుపాలలో రసాయనము, పథ్యము, బలవర్ధకము, హృదయానికి హితం చేకూర్చేది. మేధస్సును పెంచేది. ఆయుర్యృద్ధి, పుంసత్వం కలిగించేవి. ఇంకా వాత-పిత్త-కఫాలను రూపుమాపే గుణాలు ఆవుపాలలో ఉన్నాయి. 


తెల్ల ఆవుపాలు వాతాన్ని నల్ల కపిల ఆవు పాలు పిత్తాన్ని , ఎరుపు రంగు ఆవుపాలు కఫాన్ని హరించివేస్తాయి. కపిల గోవు ఈ దృష్టిలో ఎంతో ఉపయోగకరమైనది. ఆవుపాలు సర్వరోగ నివారిణి మాత్రమే కాదు. అవి వృద్ధాప్యాన్ని కూడా దూరంగా ఉంచుతాయి. గ్రామాల్లో ఆవు పాలు తాగే 80 ఏళ్ల వృద్ధులు చాలా మంది కళ్ళద్దాలు ఎరుగరు. ఎందుకంటే వారు చిన్నతనం నుంచి ఆవు పాలు మాత్రమే తాగుతూ వస్తున్నారు. ఈ విషయం నాడెప్ కాకా అనే పెద్దయాన స్వయంగా చెప్పారు. 





మన దేశీయ ఆవులకు సరియైన మేత, పాలను వృద్ధి చేసే విధానమను శ్రద్ధగా పాటించాల్సిన అవసరం ఉంది. గుజరాత్ లోని గీర్ జాతి ఆవులను ఈ విధంగా శ్రద్ధతో పోషించడంతో…అవి 25 నుంచి 50 లీటర్ల వరకు ప్రతి రోజు పాలు ఇవ్వడం జరుగుతోంది. ఇతర అన్ని పశువుల పాలకంటే ఆవుపాలు అత్యంత శ్రేష్ఠమైనవి. శరీరానికి పుట్టిని కలిగిస్తాయి. బుద్ధి బలము, రసరక్తాది ధాతువులన్నింటిని పోషిస్తాయి. ఆవు పాలు, పెరుగు, నెయ్యితో అనేక వ్యాధులను నయం చేయవచ్చును.! ఇది ఆయుర్వేద వైద్యులే కాదు…ఆధునిక వైద్యుల మాట కూడా…! ఆవు యొక్క రంగును బట్టి..ఈతలను బట్టి , మేతలను బట్టి ఆవు పాలలో ప్రత్యేక గుణాలు కలిగి ఉంటాయని వైద్యశాస్ర్తం చెబుతోంది.

దర్భల పవిత్రత

దర్భల పవిత్రత,darbhalu
దర్భల పవిత్రత

వైదిక కర్మకాండల్లో దర్భకు ప్రశస్తమైన స్థానం ఉంది. కృష్ణయజుర్వేద పరాయతం దర్భల పవిత్రతను ఎన్నోచోట్ల బహు ముఖాలుగా కీర్తించింది. నీటిలో ఉండే ప్రాణశక్తిని దర్భలు పెంచుతాయి. కుశలు, కాశములు (రెల్లుగడ్డి), దూర్వా (గరికె గడ్డి), వ్రీహి (ఎర్రబుడమ ధాన్యపుగడ్డి), యవలు, ఉశీరములు (వట్టివేరు), విశ్వామిత్రములు, బల్బజములు (మొలవగడ్డి), గోధుమ గడ్డి, కుందరములనే గడ్డి, ముంజ గడ్డి, పుండరీకములు అని మొత్తము 12 రకాల దర్భలు ఉన్నాయి.

వీటిలో.. కుశలను బ్రాహ్మీ దర్భలు లేక రజో దర్భలంటారు. విశ్వామిత్రములు విష్ణుసంబంధమైనవి. సాత్విక దర్భలు. రెల్లు గడ్డిని తామస దర్భ లేక రౌద్ర దర్భలంటారు. పేర్లేవైనా ఇవన్నీ దర్భలుగా వ్యవహారంలో ఉన్నాయి. కుశ దర్భను సాధారణంగా కోకోద్దిష్టమునాడు (అంటే అపరకర్మలో 11వ రోజున) పవిత్రంగా వాడాలి. చెడు శబ్దాలు పొరపాటున పలికినా.. చెడు వస్తువులను పొరపాటున తాకినా ఆ పాపాలను అంటనీయని శక్తి కుశలకు ఉంది. విశ్వామిత్రములు విష్ణుదర్భలు, సాత్వికమైనవి గనుక సకల కర్మలయందూ వినియోగిస్తారు. శుభకార్యాలలో సరిసంఖ్యలో.. అశుభ సమయాలల్లో బేసి సంఖ్యలో దర్భలు వాడటం ఆచారం. పవిత్రాన్ని కుడి చేతి ఉంగరపు వ్రేలికి (ఆచమన సమయాన కుడి చెవికి) తప్ప మరెక్కడా ధరించరాదు.

అందునాకుడి చేతి ఉంగరపువ్రేలి మొదటనే (కింది భాగాన) ధరించాలి. ఇతర వేళ్ళకు ధరిస్తే దోషం. తనను ధరించిన వాని ప్రాణశక్తిని దర్భ పెంచుతుందని పెద్దల మాట. గ్రహణాది సమయాల్లో వాతావరణ మార్పుచే ద్రవపదార్థాలలోని (ప్రాణశక్తి) జీవశక్తి ఆవిరై ఆ ద్రవములు అల్పసారములై పోకుండ దర్భలు కాపాడగలవని నమ్మిక. అందుకే అన్నిటిలోనూ ఆ సమయాన దర్భలు వేస్తారు.

- త్రిదండి చినజీయర్‌ స్వామి













mohan publications price list