MohanPublications Print Books Online store clik Here Devullu.com

దర్భల పవిత్రత

దర్భల పవిత్రత,darbhalu
దర్భల పవిత్రత

వైదిక కర్మకాండల్లో దర్భకు ప్రశస్తమైన స్థానం ఉంది. కృష్ణయజుర్వేద పరాయతం దర్భల పవిత్రతను ఎన్నోచోట్ల బహు ముఖాలుగా కీర్తించింది. నీటిలో ఉండే ప్రాణశక్తిని దర్భలు పెంచుతాయి. కుశలు, కాశములు (రెల్లుగడ్డి), దూర్వా (గరికె గడ్డి), వ్రీహి (ఎర్రబుడమ ధాన్యపుగడ్డి), యవలు, ఉశీరములు (వట్టివేరు), విశ్వామిత్రములు, బల్బజములు (మొలవగడ్డి), గోధుమ గడ్డి, కుందరములనే గడ్డి, ముంజ గడ్డి, పుండరీకములు అని మొత్తము 12 రకాల దర్భలు ఉన్నాయి.

వీటిలో.. కుశలను బ్రాహ్మీ దర్భలు లేక రజో దర్భలంటారు. విశ్వామిత్రములు విష్ణుసంబంధమైనవి. సాత్విక దర్భలు. రెల్లు గడ్డిని తామస దర్భ లేక రౌద్ర దర్భలంటారు. పేర్లేవైనా ఇవన్నీ దర్భలుగా వ్యవహారంలో ఉన్నాయి. కుశ దర్భను సాధారణంగా కోకోద్దిష్టమునాడు (అంటే అపరకర్మలో 11వ రోజున) పవిత్రంగా వాడాలి. చెడు శబ్దాలు పొరపాటున పలికినా.. చెడు వస్తువులను పొరపాటున తాకినా ఆ పాపాలను అంటనీయని శక్తి కుశలకు ఉంది. విశ్వామిత్రములు విష్ణుదర్భలు, సాత్వికమైనవి గనుక సకల కర్మలయందూ వినియోగిస్తారు. శుభకార్యాలలో సరిసంఖ్యలో.. అశుభ సమయాలల్లో బేసి సంఖ్యలో దర్భలు వాడటం ఆచారం. పవిత్రాన్ని కుడి చేతి ఉంగరపు వ్రేలికి (ఆచమన సమయాన కుడి చెవికి) తప్ప మరెక్కడా ధరించరాదు.

అందునాకుడి చేతి ఉంగరపువ్రేలి మొదటనే (కింది భాగాన) ధరించాలి. ఇతర వేళ్ళకు ధరిస్తే దోషం. తనను ధరించిన వాని ప్రాణశక్తిని దర్భ పెంచుతుందని పెద్దల మాట. గ్రహణాది సమయాల్లో వాతావరణ మార్పుచే ద్రవపదార్థాలలోని (ప్రాణశక్తి) జీవశక్తి ఆవిరై ఆ ద్రవములు అల్పసారములై పోకుండ దర్భలు కాపాడగలవని నమ్మిక. అందుకే అన్నిటిలోనూ ఆ సమయాన దర్భలు వేస్తారు.

- త్రిదండి చినజీయర్‌ స్వామి













No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list