MohanPublications Print Books Online store clik Here Devullu.com
Showing posts with label bhakti. Show all posts
Showing posts with label bhakti. Show all posts

Sri VanaDurga Mahavidya Panchashati Mahamala Mantra Parayanakramaha | Sri Tadepalli Raghava Narayana Sastry | శ్రీ వనదుర్గా మహావిద్యా పంచశతీ మహామాలా -తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి





శ్రీ వనదుర్గా మహావిద్యా 
పంచశతీ మహామాలా 
మంత్ర పారాయణక్రమః
 -తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి

Sri VanaDurga Mahavidya Panchashati Mahamala 
Mantra Parayanakramaha 
Sri Tadepalli Raghava Narayana Sastry



Sri Vanadurga Panchashati Anusthana kramam

శ్రీ వనదుర్గా పంచశతి
అనుష్ఠాన క్రమం

























శని దోష నివారణకు నేరేడు పండ్లు | Shani Dosha | Mohanpublications | Granthanidhi | Bhakthipustakalu


శని దోష నివారణకు నేరేడు పండ్లు | Shani Dosha | Mohanpublications | Granthanidhi | Bhakthipustakalu Lord Shani Lord Sani Shani Shingnapur Shanideva Lord Surya Son Yamagraj Shanidosham shanidosha nivarana


శని దోష నివారణకు 
నేరేడు పండ్లు

చాలా కాలంగా కడుపులో పేరుకుపోయిన మలినాలకు శని కారకుడు కడుపులో పేరుకుపోయిన మలినాలను బయటకు పోవటానికి నేరేడు పండ్లను తినటం మంచిది. పేగుల్లో చుట్టుకుపోయిన వెంట్రుకలకు శని కారకుడు నేరేడు పండ్లు తింటే వెంట్రుకలను కోసేసి బయటికి పంపే శక్తి నేరేడు పళ్ళకు ఉంది. నేరేడు పండ్లు శరీరానికి చలవ చేస్తాయి.


ముఖ్యంగా షుగరు రోగులకు నేరేడు చాలా ఉపకరిస్తుంది.దీర్ఘకాల వ్యాదులకు కారకుడైన శని జాతకంలో అనుకూలంగా లేని వారికి రోగ నిరోదక శక్తిని తగ్గించి ప్రతి చిన్న రోగాన్ని దీర్ఘకాలంగా అనుభవించేటట్టు చేస్తాడు.దీని నివారణకు నేరేడు పండ్లను తినటం వలన రోగ నిరోదకశక్తి పెరుగుతుంది. వ్యాధి తీవ్రతను తగ్గిస్తుంది. మూత్ర సంబంధ సమస్యల నుండి ఉపశమనాన్ని కలిగిస్తుంది. కానీ గర్భిణీలు ఎటువంటి పరిస్థితులలో తినకూడదు.
దేవునికి నేరేడు పండ్లతో నైవేద్యంగా పెడితే బాగా నీరసం, నిస్సత్తువ తగ్గిపోతుంది. నీరసం, నిస్సత్తువ ఉన్న వారు దేవుడిని నేరేడు పండును దేవునికి నైవేద్యంగా పెట్టి ప్రసాదాన్ని తింటే జబ్బులు దూరమై ఆరోగ్యవంతులుగా తయారవుతారు.
నేరేడు పండును శ్రీ శనైశ్చర స్వామికి నైవేద్యంగా పెట్టి ప్రసాదాన్ని తింటే వెన్నునొప్పి, నడుం నొప్పి, మోకాళ్ల నొప్పులు, నయం అవుతాయి. పూజ చేసిన తర్వాత నేరేడు పండును బ్రాహ్మణునికి దానం చేస్తే రోగ బాధలు కలుగవు.
నేరేడు పండును శనైశ్చర స్వామికి ప్రియమైన నల్ల నవ్వులతో కలిపి దానం చేస్తే శని బాధలు ఉండవు. నేరేడు పండు దేవుని పేరిట పూజించి భిక్షగాళ్లకు దానం చేస్తే దారిద్ర్యం దరిచేరదు.
భోజనంతో పాటు నేరేడు పండును వడ్డిస్తే మీకు ఎప్పుడూ మృష్టాన్న భోజనం లభిస్తుంది. నేరేడు పండును పుణ్యక్షేత్రాల్లో యోగ్య బ్రాహ్మణులకు తాంబూల సమేతంగా దానం చేస్తే భూదానం చేసినంత ఫలితం లభిస్తుంది. నేరేడు పండును రోజుకొకటి చొప్పున తింటే వైద్యుల నుంచి దూరంగా ఉండవచ్చునని పండితులు చెబుతున్నారు.
శనైశ్చర స్వామికి నువ్వులనూనెతో గాని,ఆముదం నూనెతో గాని తెలుపు లేదా నలుపు వత్తులను పడమర దిక్కున ఇనుప గరిటెలో శని దీపాన్ని పెట్టి దానికి నేరేడు పండును నైవేద్యం పెట్టాలి. తరువాత ఈ క్రింది శ్లోకం చదవాలి.
శని బాధా వినాశాయ ఘోర సంతాప హారిణే I
కనకాలయ వాసాయ భూతనాధాయతే నమః II
దారిద్ర్యజాతాన్ రోగాదీన్ బుద్ధిమాంద్యాది సంకటాన్ I
క్షిప్రం నాశయ హే దేవ!శని బాధా వినాశక II
భూత బాధా మహాదుఃఖ మధ్యవర్తిన మీశమాం I
పాలయ త్వం మహాబాహో సర్వదుఃఖ వినాశక II
అవాచ్యాని మహాదుఃఖ న్యమేయాని నిరంతరం I
సంభవంతి దురంతాని తాని నాశయమే ప్రభో II
మాయా మోహన్యానంతాని సర్వాణి కరుణాకర I
దూరి కురు సదాభక్త హృదయానందదాయక II
అనేక జన్మ సంభూతాన్ తాప పాపాన్ గుహేశ్వర I
చూర్ణీకురు కృపాసింధో సింధుజాకాంత నందతే II
ఉన్మాదోధ్భూత సంతాపా గాధకూపాద్మహేశ్వర I
హస్తావలంబం దత్వా మాం రక్షరక్ష శనైశ్చర II
దేహిమే బుద్ధి వైశిష్ట్యం దేహిమే నిత్య యౌవనం I
దేహిమే పరమానందం దేవదేవ జగత్పతే II

ఈ శ్లోకాన్ని ప్రతిరోజు ఉదయాన్నే 19 సార్లు పఠించిన శనిదోషం తొలగిపోవును








బుద్ద నీలకంఠ ఆలయం | Buddha Neelakanta | Mohanpublications | Granthanidhi | Bhakthipustakalu


బుద్ద నీలకంఠ ఆలయం | Buddha Neelakanta | Mohanpublications | Granthanidhi | Bhakthipustakalu Lord Buddha Buddha Buddhudu Lord Vishnu

బుద్ద నీలకంఠ ఆలయం
ఇక్కడ విష్ణుమూర్తే నీలకంఠుడు! 

విష్ణుమూర్తిని తలచినంతనే శేషతల్పం మీద శయనించిన అనంత పద్మనాభుడి సమ్మోహన రూపం మన కనులముందు సాక్షాత్కరిస్తుంది. కానీ, స్వామి యోగ నిద్ర భంగిమలో, నింగివైపు చూస్తున్నట్లుగా విగ్రహం ఉండే క్షేత్రం నేపాల్‌లోని ఖాట్మండు లోయలోని బుద్ధనీలకంఠ ఆలయం. అయిదు అడుగుల విష్ణుమూర్తి విగ్రహం నీటిమీద తేలుతూ ఉండటం ఈ ఆలయానికున్న మరో ప్రత్యేకత. 
బుద్ధనీలకంఠ ఆలయం... ఈ పేరు వినగానే ఇదేదో బుద్ధుడి ఆలయం అనుకోకండి. ఇది మూడుమూర్తులా ఆ నారాయణమూర్తి క్షేత్రమే. బుద్ధనీలకంఠ అంటే పురాతన నీలి రంగు విగ్రహం అని అర్థం. నేపాల్‌ రాజధాని ఖాట్మండు లోయలో ఉందీ క్షేత్రం. స్వామి పేరుమీదుగానే బుద్ధనీలకంఠ అనే ఊరిపేరు కూడా స్థిరపడిపోయింది. ఈ ఆలయాన్ని నారాయణంతన్‌ అని కూడా పిలుస్తుంటారు. ఇక్కడ ఆది శేషువు మీద యోగ నిద్రలో ఉన్న విష్ణుమూర్తి విగ్రహం భక్తులకు దర్శనమిస్తుంది. సాధారణంగా వైష్ణవాలయాల్లో విష్ణుమూర్తి రూపాలు శయన మూర్తిగా ఒక పక్కకు తిరిగి పడుకుని ఉన్నట్లు ఉంటాయి. కానీ, ఇక్కడ మాత్రం వెల్లకిలా పడుకొని నింగివైపు చూస్తున్నట్టుగా ఉండే బుద్ధనీలకంఠుడి విగ్రహం కనిపిస్తుంది. ఈ ఆలయానికి ఉన్న మరో విశిష్టత ఏమిటంటే, సుమారు అయిదు అడుగుల పొడవున్న ఈ భారీ రాతి విగ్రహం నీటిమీద తేలుతూ ఉండటమే. ఈ కారణంగానే భక్తులనే కాకుండా పర్యటకులనూ ఎక్కువగా ఆకర్షిస్తోందీ బుద్ధనీలకంఠ క్షేత్రం. 
స్థలపురాణం 
ఈ భారీ రాతి విగ్రహం వందల సంవత్సరాల నుంచీ నీటిలో తేలుతూ ఉందని ఈ ఆలయం మీద జరిగిన అనేక అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. ఈ విగ్రహ నిర్మాణానికి సంబంధించి రెండు కథలు ప్రచారంలో ఉన్నాయి. మొదటిదాని ప్రకారం... ఒక రైతు తన భార్యతో కలిసి పొలం దున్నుతుండగా, ఒక చోటుకు రాగానే నాగలి ఆగిపోయింది. అక్కడ భూమిలో నాగలి దిగిన ప్రదేశం నుంచి రక్తం బయటకు రావడం కనిపించింది. రక్తం వస్తున్న ప్రాంతంలో భూమిని తవ్వగా, భారీ విగ్రహం బయట పడింది. ఆ తర్వాత గ్రామస్థుల సహాయంతో ఈ విగ్రహాన్ని ఇప్పుడున్న ప్రదేశంలో ప్రతిష్ఠించి పూజించడం ప్రారంభించారు. మరో కథనం ప్రకారం... ఏడో శతాబ్దంలో నేపాల్‌ ప్రాంతాన్ని గుప్త రాజు విష్ణుగుప్తుడు పాలించేవాడు. ఇతడికి సామంత రాజూ, ఖాట్మండు లోయను పాలిస్తున్న లిచ్చవి వంశీయుడైన భీమార్జున దేవుడు ఈ విగ్రహాన్ని తయారు చేయించి, ఇక్కడ ప్రతిష్ఠించాడని స్థానికులు చెబుతారు. 
హరిబోధిని... 

విష్ణుమూర్తి ఆలయాల్లో లేదా వైష్ణవ సంప్రదాయంలో ఏకాదశి రోజును పవిత్రమైనదిగా భావిస్తారు. శివుడికి అత్యంత ప్రీతికరమైన మాసంగా కార్తిక మాసాన్ని చెబుతారు పండితులు. ఈ రెండింటినీ కలగలుపుతూ బుద్ధనీలకంఠ ఆలయంలో కార్తిక మాసంలో ప్రత్యేక పూజలు చేస్తారు. ఎందుకంటే శివుడు హాలాహలాన్ని కంఠంలో దాచుకున్నప్పుడు ఆ వేడి తాళలేక ఈ ప్రాంతానికి వచ్చాడనీ ఇక్కడి కొలనులో నీళ్లు సేవించగానే మంట తగ్గి, కొంతసేపు సేదతీరాడనీ భక్తుల విశ్వాసం. దానికి గుర్తుగానే ఈ ఆలయంలో కార్తిక మాసం మొత్తం ఉత్సవాలు నిర్వహిస్తారు. ఆ నెలరోజులూ ఈ ప్రాంతం పండగ వాతావరణాన్ని సంతరించుకుంటుంది. కార్తిక శుద్ధ ఏకాదశి రోజున హరిబోధిని మేళాను నిర్వహిస్తారు. ఈ పండగ ముఖ్య ఉద్దేశం నిద్రపోతున్న మహావిష్ణువును మేల్కొల్పడం. ఈ మేళాలో పాల్గొనడానికి ప్రపంచం నలుమూలల నుంచీ లక్షలాది మంది భక్తులు ఇక్కడికి చేరుకుంటారు. మేళతాళాలతో భజనలతో ఆ రోజు ఈ ప్రాంతమంతా విష్ణునామస్మరణతో మారుమోగిపోతూ ఉంటుంది. బుద్ధనీలకంఠ ఆలయంతోపాటు పశుపతినాథ్‌ ఆలయం, స్వయంభూనాథ్‌ స్తూపం, మహాదేవ్‌ టెంపుల్‌, జానకీ మందిర్‌, వాల్మీకి ఆశ్రమాలు కూడా నేపాల్‌లో ప్రసిద్ధ హిందూ క్షేత్రాలుగా వెలుగొందుతున్నాయి. 
ఇలా వెళ్లాలి... 
బుద్ధనీలకంఠ ఆలయాన్ని చేరుకోవడానికి రోడ్డు, రైలు మార్గాలతోపాటు విమాన సదుపాయాలూ ఉన్నాయి. భారతదేశం నుంచి నేపాల్‌ చేరుకోవడానికి వివిధ రోడ్డు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. అక్కడి నుంచి నేపాల్‌ పర్యటక శాఖ ఆలయానికి ప్రత్యేక బస్సులు
నడుపుతోంది. రైలుమార్గం ద్వారా... ఖాట్మండు స్టేషన్‌లో దిగి అక్కడి నుంచి రోడ్డుమార్గంలో ప్రయాణించి ఈ ఆలయానికి చేరుకోవచ్చు.

బుద్ద నీలకంఠ ఆలయం | Buddha Neelakanta | Mohanpublications | Granthanidhi | Bhakthipustakalu Lord Buddha Buddha Buddhudu Lord Vishnu










నందవరం చౌడేశ్వరి మాత ఇక్కడ చీరకొంగే ముడుపు | Nandavaram | Mohanpublications | Granthanidhi | Bhakthipustakalu


నందవరం చౌడేశ్వరి మాత ఇక్కడ చీరకొంగే ముడుపు | Nandavaram | Mohanpublications | Granthanidhi | Bhakthipustakalu Saree Chamundeswari Matha Lord Chamundeswari Chamundi Chowdeswari Lord Parvathi Visalakshi


ఇక్కడ చీరకొంగే ముడుపు!


సృష్టికి మూలం శక్తి. ఆ శక్తిని ఎవరు ఆరాధించినా స్త్రీ మూర్తిగానే కొలుస్తారు. జగదాంబగా పేరుపొందిన ఆదిపరాశక్తి వివిధ నామాలతో పూజలందుకుంటోంది. వాటిలో చాముండి, చాముండేశ్వరి, చౌడేశ్వరి పేర్లు ప్రసిద్ధి చెందినవి. పార్వతీదేవి చౌడేశ్వరిగా పూజలందుకుంటున్న క్షేత్రం నందవరం. ఈ క్షేత్రంలో కొలువుదీరిన చౌడేశ్వరి మాత దర్శనం ఐశ్వర్య కారకంగా భావిస్తారు భక్తులు.

మనసులోని పిరికితనాన్ని పోగొట్టి ధైర్యసాహసాలిచ్చే వీర చౌడేశ్వరీదేవిగా ఇక్కడ విశాలాక్షిని ఆరాధిస్తారు. తనను కొలిచే భక్తుల కోసం కదిలి వచ్చిన అమ్మవారు ఇక్కడ సువర్ణ మూర్తిగా స్వయంభువుగా వెలిసిందని స్థలపురాణం తెలియజేస్తోంది. ఆ ఆలయమే కర్నూలు జిల్లాలోని నందవరంలో ఉన్న చౌడేశ్వరీ క్షేత్రం. సాక్షాత్తూ ఆ అమ్మలగన్న అమ్మే ఇక్కడ చౌడేశ్వరిగా భక్తుల పాలిట కొంగుబంగారంగా విరాజిల్లుతోంది.


ఇదీ కథ 
పూర్వం చంద్రవంశానికి చెందిన నంద భూపాలుడు ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన పాలనలో ప్రజలు సుఖ సంతోషాలతో జీవించేవాళ్లు. నంద భూపాలుడు దత్తాత్రేయుడి ఉపాసకుడు. ఆయన భక్తికి మెచ్చిన దత్తాత్రేయుడు రోజూ కాశీ వెళ్లి గంగా స్నానం చేయాలనే రాజు కోర్కెను మన్నించి పావుకోళ్లను ప్రసాదిస్తాడు. అయితే ఆ విషయం ఎవరికీ చెప్పకుండా వాటిని ధరించి మనోవేగంతో కాశీచేరి గంగా స్నానం చేసి విశ్వనాథుడినీ, విశాలాక్షినీ దర్శించుకుని తిరిగి తెల్లవారేసరికి తన రాజ్యం చేరుకునేవాడు. ఇలా కొంతకాలం గడిచాక, నంద భూపాలుడి భార్య శశిరేఖ తన భర్త రోజూ వేకువనే ఎక్కడికో వెళ్లి వస్తుండటం గమనించి భర్తను అడుగుతుంది. తప్పనిసరి పరిస్థితుల్లో శశిరేఖకు విషయం చెబుతాడు రాజు. ఆవిడ తనని కూడా కాశీ తీసుకువెళ్లమని కోరుతుంది. రాణి మాటను కాదనలేని నందభూపాలుడు ఆమెతో కలిసి కాశీ చేరుకుంటాడు. తిరిగి వచ్చే సమయానికి పావుకోళ్లు పనిచేయవు. తన రాజ్యానికి సత్వరం చేరుకోకపోతే రాజ్యం అల్లకల్లోలమవుతుందనే భయంతో సమీపంలోని ఆలయం దగ్గరున్న బ్రాహ్మణుల దగ్గరకు వెళ్లి జరిగింది చెప్పి సాయమడుగుతాడు. వాళ్లు తమ తపోశక్తితో రాజుకు తిరిగి వెళ్లే మార్గాన్ని చూపిస్తారు. ప్రత్యుపకారంగా వారికే సహాయం కావల్సి వచ్చినా తప్పక చేస్తాననీ, నిస్సంకోచంగా ఏదైనా అడగవచ్చనీ చెబుతాడు. అందుకు ఆ బ్రాహ్మణులు అవసరమైనప్పుడు అడుగుతామని అంటారు. కొంతకాలం తర్వాత కాశీ చుట్టుపక్కల ప్రాంతాల్లో కరవు రాగా, నందభూపాలుడిని సహాయం అడిగేందుకు కొందరు బ్రాహ్మణులు నందవరం బయలుదేరుతారు. రాజ్యానికి చేరుకున్న వారు రాజుకి తామెందుకు వచ్చారో తెలియజేస్తారు. అప్పుడు రాజు తానిచ్చిన వాగ్దానానికి రుజువేంటని అడుగుతాడు. అందుకా బ్రాహ్మణులు విశాలాక్షి అమ్మవారే అందుకు సాక్ష్యమనీ, ఆమెచేతే ఆ విషయాన్ని రుజువు చేస్తామనీ చెబుతారు. బ్రాహ్మణులు కాశీ చేరుకుని విశాలాక్షిని నందవరం రమ్మని వేడగా ‘నేను మీతో వస్తాను కానీ ఒక్క షరతు. గమ్యం చేరేవరకూ ఎవ్వరూ వెనక్కి తిరిగి చూడకూడదు’ అని చెబుతుంది. అలా కొంత దూరం వెళ్లేసరికి వెనక నుంచి ఎలాంటి అలికిడీ వినిపించకపోవడంతో అనుమానం వచ్చిన ఒక బ్రాహ్మణుడు వెనక్కి తిరుగుతాడు. దీంతో అమ్మవారు అక్కడే శిలా రూపంలోకి మారిపోతుంది. విషయం తెలుసుకున్న రాజు అక్కడికి చేరుకుని, అమ్మవారికి ఆలయాన్ని నిర్మించాడనే కథ ప్రచారంలో ఉంది.

వరాలిచ్చే కలిచెట్టు 
అమ్మవారి ఆలయ పరిధిలోని కలిచెట్టుకు విశేష ప్రాముఖ్యం ఉంది. సంతానం ప్రసాదించే చెట్టుగా ఈ చెట్టును పూజిస్తారు భక్తులు. సంతానం లేనివారు చీర కొంగును చించి చెట్టుకొమ్మకు కడితే సంతానం కలుగుతుందని వీరి విశ్వాసం. చౌడేశ్వరి అమ్మవారు కాశీ నుంచి నందవరం వచ్చినప్పుడు ఈ చెట్టు విశాలాక్షి చీర కొంగుకు తగులుకుని వచ్చిందని చెబుతారు. చౌడేశ్వరిని అర్చించిన తర్వాత ఈ వృక్షాన్ని కూడా తప్పక అర్చించడం అనేది పూర్వం నుంచీ వస్తున్న ఆనవాయితీ. ఆలయంలో నిత్యం అన్నదానం జరుగుతుంది. ఇక్కడ దత్తుడు ఇచ్చిన పాదుకలు ఇప్పటికీ దర్శనమిస్తాయి. రోజూ చౌడేశ్వరీదేవికి కుంకుమార్చనలు జరుగుతాయి. ఆషాఢ బహుళ అమావాస్య రోజున అమ్మవారి జన్మదిన వేడుకలను వైభవోపేతంగా నిర్వహిస్తారు. దసరా నవరాత్రి ఉత్సవాలతోపాటు ఉగాది వేడుకలను కూడా ఇక్కడ పెద్ద ఎత్తున జరుపుతారు.

ఇలా చేరుకోవచ్చు... 
కర్నూలు పట్టణానికి సుమారు డెబ్భై రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న చౌడేశ్వరి ఆలయాన్ని చేరుకోవడానికి రైలు, రోడ్డు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. బనగానపల్లి, నంద్యాల వెళ్లే బస్సులో ప్రయాణించి అమ్మవారిని దర్శించుకోవచ్చు. రైలు మార్గంలో అయితే బనగానపల్లి, నంద్యాల, పాణ్యం రైల్వే స్టేషన్లలో దిగి, అక్కడి నుంచి రోడ్డుమార్గంలో క్షేత్రానికి వెళ్లొచ్చు.
- వెంకట నారాయణ, కర్నూలు డెస్క్‌ 
ఫొటోలు: నగేష్‌

mohan publications price list