MohanPublications Print Books Online store clik Here Devullu.com

మనస్సుకు కారకుడు చంద్రుడు_Chandrudu


మనస్సుకు కారకుడు చంద్రుడు
      చంద్రుడు జ్యోతిష శాస్త్రంలో మనస్సుకు కారకుడు. చంద్రుడు స్త్రీ గ్రహం, వైశ్య జాతి, శ్వేత వర్ణం, పరిమాణం పొట్టి, వయస్సు డెబ్బై సంవత్సరాలను సూచించును. దిక్కు వాయవ్యం, తత్వం జల తత్వం, ప్రకృతి వాత, శ్లేష్మములు. ఋతువులలో వర్ష ఋతువును, లోహములలో వెండిని, రత్నములలో ముత్యమును సూచించును. చంద్రుడు చతుర్ధ భావంలో దిక్బలం కలిగి ఉంటాడు. గ్రహములలో చంద్రుడు ఏడవ వాడు. సత్వగుణ సంపన్నుడైన చంద్రుడు కృష్ణ పక్ష దశమి నుండి శుక్ల పక్ష పంచమి వరకు పూర్ణ చంద్రుడు. శుక్ల పంచమి నుండి అమావాస్య వరకు క్షీణ చంద్రుడు, అమావాస్య నుండి కృష్ణ పక్ష దశమి వరకు మధ్యమ చంద్రుడు అని శాస్త్రం చెప్తుంది. చంద్రుడు రోహిణి, హస్త, శ్రవణం నక్షత్రాలకు అధిపతి. శరీరావయవములలో మగవారి ఏడమ కన్ను, స్త్రీల కుడి కన్ను శరీర మధ్య భాగమును సూచించును. చంద్రుడు కర్కాటక రాశికి ఆధిపత్యం వహిస్తాడు. చంద్రుడు వృషభంలో మూడు డిగ్రీలలో పరమోచ్ఛ స్థితిలో ఉంటాడు. వృషభంలో మూడు నుండి ఇరవై ఏడు డిగ్రీల వరకు మూల త్రికోణంలో ఉంటాడు. వృశ్చికంలో మూడు డిగ్రీల వరకు పరమ నీచ స్థితిలో ఉంటాడు. బుధుడు, సూర్యుడు మిత్రులు. చంద్రుడికి శత్రువులు లేరు 
చంద్రుని ప్రభావం
చంద్ర ప్రభావిత వ్యక్తులు శ్లేష్మమ వ్యాధి పీడితులుగా ఉంటారు. వీరు కొంత సమయం ఉత్సాహంతోనూ మరి కొంత సమయం నిరుత్సాహంగానూ ఉంటారు. కొంత కాలం ధైర్యము మరి కొంత కాలం భయం కలిగి ఉంటారు. కొంత కాలం ధనవంతులుగా మరి కొంతకాలం ధనహీనులుగా ఉంటారు. స్థూలంగా మానసిక స్థితి, సందలు అస్థిరంగా ఉంటాయి. అభిప్రాయాలూ తరచూమార్చుకుంటారు. మిత్రులనూ తరచూ మార్చుకుంటారు. భోజన ప్రియులుగా ఉంటారు. ఆ కారణంగా యుక్త వయసు దాటే సమయానికి పొట్ట పెద్దది అయ్యే అవకాశం ఎక్కువ. స్వతంత్రించి ఏకార్యం చెయ్య లేరు. నీటి పారుదల, జల విద్యుత్, ప్రజా ప్రాతినిధ్యం, బియ్యము, వస్త్రములకు సంబంధించిన వృత్తులలో రాణిస్తారు. పాండు రోగం, క్షయ, మధుమేహం, శ్వాశకోశ వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువ
చంద్రుని కారకత్వాలు
చంద్రుడు తల్లికి, జలరాంతాలు, జలం, పూలు, సముద్రం, నదులు, ముఖము, ఉదరం, మహిళా సంఘాలకు, స్త్రీ సంక్షేమ సంఘాలకు చందుడు కాకత్వం వహిస్తాడు. వృత్తి సంబంధంగా నౌకా వ్యాపారం, ఓడ రేవులు, వంతెనలు, ఆనకట్టలు, చేపల పెంపకం, వెండి, మత్యములకు కారకత్వం వహిస్తాడు. వ్యాధులలో రక్త హీనత, అతి మూత్రం, గర్భ సంబంధిత వ్యాధులు, వరబీజము, బేదులు, మానసిక వ్యాధులు, ఉదర సంబంధిత వ్యాధులు, కేన్సర్(రాచ పుండు) మొదలైన వాటికి కారకుడు, ఆహార సంబంధంగా చెరకు, తేనె, పాలు, పెరుగు, భోజనము, గోధుమలు, జొన్నలు, రొట్టెలు, గోధుమలు, చేపలు, పంచదార, అరటి పండు, నెయ్యి, దోసకాయలు, తమలపాకులు, గుమ్మడి, క్యాబేజీ, కర్బూజా ఫలం, కుక్కగొడుగులు, ఆవులు, గుడ్లు తాబేలు, గుడ్లగూబ, బాతు, గబ్బిలం, పిల్లి, నీటి గుర్రం, సొర చేపల వంటి ప్రాణులకు కారకత్వం వహిస్తాడు., తిమింగలం మొదలైన ప్రాణులకు కారకత్వం వహిస్తాడు. గుడ్లు, క్కర్పూరం, నికెల్, జర్మన్ సిల్వర్ లాంటి వస్తువులకు కారకత్వం వహిస్తాడు. సంగీతం, నాటం, కవిత్వం లాంటి లలిత కళలకు కారకత్వం వహిస్తాడు. మనస్తత్వ శాస్త్ర పఠనం,వ్యవసాయం, విద్యా సంబంధిత వృత్తులు, జల వనరులవంటి వృత్తులకు కారకత్వం వహిస్తాడు. మూలికలు, స్త్రీలు, జీర్ణ వ్యవస్థ, జున్ను చంద్రుడు కారకత్వం వహించే ఇతరములు.
పురాణ కథనం అనుసరించి చంద్రుడు గౌరవర్ణం కలిగిన వాడు. శ్వేత వస్త్ర ధారణ చేయువాడు. శ్వేత వర్ణ ఆభరణములతో అలంకరించబడిన వాడు. రెండు భుజములతో, శిరస్సున బంగారు కిరీటము ధరించి మెడలో ముత్యాల మాలను ధరించి ఒక చేత గధ, ఒకచేత వరద ముద్రతో దర్శనం ఇస్తాడు. దశాశ్వములను పూన్చిన రధమును అధిరోహించి సంచరిస్తాడు.
చంద్రుడు రాశులు
చంద్రుడు కర్కాటకంలో స్వక్షేత్రంలోనూ వృషభంలో మూడు డిగ్రీల వద్ద ఉచ్ఛ స్థితిలోనూ, వృశ్చికంలోని మూడు డిగ్రీల వద్ద నీచస్థితిలోనూ ఉంటాడు. చంద్రుడికి శత్రువులు లేరు అలాగే శత్రు క్షేత్రం లేదు. చంద్రుడికి మిధునం, కన్య, సింహములు మిత్ర క్షేత్రములు. వృషభం త్రికోణ స్థానం. శుక్ర, శనులు సములు. కుంభం, మకరం, తులా రాశులు సమ రాశులు.
ద్వాదశస్థానములు చంద్రుడు
లగ్నంలో చంద్రుడు ఉన్న జాతకుడు దృఢశరీరము కలిగిన వాడు, చిరంజీవి, నిర్భయుడు, ధనవంతుడు ఔతాడు. క్షీణచంద్రుడు ఉన్నప్పుడు ఫలితాలు తారుమారుగా ఉంటాయి.
చంద్రుడు ద్వితీయంలో ఉన్న వాడు ధనవంతుడు, విద్యావంతుడు, మృదుభాషి, అంగలోపం కలవాడుగా ఉంటాడు.
తృతీయ స్థానంలో చంద్రుడు కలిగి ఉన్న జాతకుడు సోదరులు కలవాడు, బలవంతుడు, శౌర్యవంతుడు, స్త్రీలను ఆకర్షించు వాడు ఔతాడు. బహుకష్టములను పొందుతాడు.
చతుర్ధస్థానమున ఉన్న జాతకుడు సుఖజీవి, భోగముల యందు ఆసక్తుడు, మిత్రులు కలవాడు, వాహనములు కలవాడు, కీర్తివంతుడు ఔతాడు.
పంచమ స్థానమున చంద్రుడు ఉన్న జాతకుడు మేధాసంపద, సుపుత్రులు కలవాడు, ఠీవి కలవాడు, మంత్రిపదవి అలంకరించు వాడు ఔతాడు.
షష్టమ స్థానమున చంద్రుడు ఉన్న జాతకుడు అల్పజీవి, అమాయకుడు, ఉదరశూల (కడుపు నొప్పి)కలిగిన వాడు, దీనుడు ఔతాడు.
సప్తమ స్థానమున చంద్రుడు ఉన్న జాతకుడు సౌమ్యవంతుడు, అందమైన యువతుల హృదయమున స్థానము కలిగిన వాడు, సుందరుడు అయి సుంర కళత్రము కలిగి ఉంటాడు.
అష్టమ స్థానమున చంద్రుడు కలిగిన జాతకుడు రోగపీడితుడు, అల్పాయుష్మంతుడు ఔతాడు. క్షీణ చంద్రుడు అయిన ఫలితములలో మార్పులు ఉంటాయి.
నవమ భావమున చంద్రుడు ఉన్న జాతకుడు అభివృద్ధి, పవిత్రుడు, పుత్ర సంతానం కలిగిన వాడు, విజయము, కార్యం ఆరంభించగానే శుభఫలితములను కలిగి ఉంటాడు. వీశాలహృదయము సహాయగుణము కలిగి ఉంటాడు.
దశమస్థానమున చంద్రుడు ఉన్న జాతకుడు ఔషధ సంబంధిత వృత్తి వ్యాపారాలు కలిగిన వాడు ఔతాడు.
ఏకాశ స్థానమున చంద్రుడు ఉన్న జాతకుడు విశాలహృదయం , చిరంజివి, ధనవంతుడు ఔతాడు.
ద్వాదశ స్థానమున చంద్రుడు ఉన్న జాతకుడు ద్వేషము కలవాడు, దుఃఖములు, క్లేశం, అవమానం, నిరుత్సాహం పొందుతూ ఉంటాడు




No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list