MohanPublications Print Books Online store clik Here Devullu.com

సాయిబాబా_saibaba




సాయి వాక్కు వేదవాక్కు. సాయి పలుకులు వేదసూక్తులే అంటారు సాయి భక్తులు. ‘శ్రీగురువ్ఞ నోట్లోని అక్షరాలు (మహాకావ్యాలు) కొద్దిగానే వ్ఞన్నా, వాటి పరిమాణం ఎంతో వ్ఞంటుంది అంటారు శ్రీజ్ఞానేశ్వరులు. ఇక్కడ సాయి తెల్పిన రెండేరెండు పదాలు ముఖ్యాతిముఖ్యమయినాయి. ఒకటి శ్రద్ధ, వేరొకటి సబూరీ. గురుమార్గాన్ని అవలంభించదలచిన వారు గమనించి పాటించవలసినవి శ్రద్దాసబూరీలేనని సాయిబాబా రాధాబాయి దేశముఖ్‌, హేమాడ్‌పంత్‌లకు తెలిపారు. శ్రద్ధసంస్కృతపదము, సబూరీ అరబిక్‌ పదము. శ్రద్దపదము బుగ్వేదములో వస్తుంది. సాయివాక్కు వేదవాక్కు, సాయి పలుకులు వేదసూక్తులు. మానవ్ఞడు శ్రద్ధారూపంతో ఉంటాడు. పని అలానే ఉంటుంది.
తామసిక, రాజసిక, సాత్త్విక శ్రద్దామయుడే మానవ్ఞడు. అటువంటి శ్రద్ధకు అనుగుణంగానే జీవితం నడుస్తుంది. భౌతిక జీవితాన్ని నడిపే వ్యక్తికి ఆ జీవితంపైననే శ్రద్ద వ్ఞంటుంది. దానికి తగిన ఆలోచనలు, ప్రవర్తనలు ఉంటాయి. అయితే వారికి మోక్షానికి మార్గం లేదా అంటే ఉన్నది అన్నదే జవాబు. అందులోను అంటే ఆధ్యాత్మిక మార్గంలోను శ్రద్ద మరలవస్తుంది. తాను ఆధ్యాత్మికం వైపు నడవాలనే సంకల్పమే శ్రద్ధ అవ్ఞతుంది. శ్రద్దను వహించాలి. అంతేకాదు తాను చూపే శ్రద్ధను బట్టే శ్రద్ధ ఆవహిస్తుంది. నచికేతుడికి శ్రద్ధ ఆవహించినట్లు. సత్యగుణ సంపన్నుడు నచికేతుడు. తండ్రి చేస్తున్న యజ్ఞాన్ని చూస్తున్నాడు. తండ్రి ఇచ్చేదానాలను కూడా చూస్తున్నాడు. అతడిని శ్రద్ద ఆవహించింది అంటుంది కఠోపనిషత్తు. తండ్రి తప్పు చేస్తున్నాడని గ్రహించాడు. ప్రత్యక్షంగా తప్పు చేస్తున్నావ్ఞ అని పలకకుండా పరోక్షంగా తండ్రి చేసిన తప్పును ఎత్తి చూపాడు నచికేతుని తండ్రి. అంటే తండ్రి చేసే తప్పును చూసీచూడకుండాపోలేదు. ధర్మబద్దంగా ప్రవర్తించటం, ఆలోచించటం, పలకటం శ్రద్ద.
అంటే ఎవరైనా ఉన్నతమైన లక్ష్యాన్ని చేరటానికి శ్రద్ధ అత్యవసరం. సకల ప్రయత్నాలకు శ్రద్ధ అవసరం అంటాడు ఆదిశకంరులు. ఏ కార్యాన్నయినా కొందరు ఆరంబించరు. ఆరంభించిన కార్యాన్ని కొనసాగించరు మరికొందరు. ఎందుకంటే వారి అప్పుడు కలిగే విఘ్నములను చూచి బెంబేలు పడి పని మానుకుంటారు. ఇక శ్రద్ధ గల ఉత్తములు కార్యాన్ని సాధిస్తారు. ప్రతి పనిలోను ఆచితూచి వేసే మొదటి అడుగు మాత్రమే కాదు, చివరికంటా గమ్యాన్ని చేర్చేది శ్రద్ధ.
– యం.పి.సాయినాధ్‌




No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list