MohanPublications Print Books Online store clik Here Devullu.com

గురు సందేశము-Guru Sandehamu


గురు సందేశము : 
వేదవ్యాసుడు తన రెండు చేతులనూ పైకి ఎత్తి లోకమంతటికీ నమస్కరిస్తూ చెప్పిన మాటల్లో విశిష్టమైనది ఏమిటంటే- 'ఇతరులు మీ పట్ల ఏ విధంగా ప్రవర్తిస్తే మీరు బాధపడతారో మీరు ఇతరుల పట్ల ఆ విధంగా ప్రవర్తించవద్దు.' పరమ ధర్మపథాలన్నింటిలోకీ పరాయణమైన ఈ ఒకే ఒక్క విషయాన్ని త్రికరణశుద్ధిగా పాటించినట్లయితే మన సమాజం కచ్చితంగా శాంతిధామమవుతుంది
వ్యాసుని జన్మ వుత్తాంతము : 
వేదవ్యాసుడు జన్మ వృత్తాంతం అష్టాదశ పురాణాలలొ పెక్కు మార్లు ఎన్నోమార్పులు చేసి చెప్పబడింది. ఈ దిగువ నున్న వృత్తాంతం మహాభారతము ఆది పర్వం తృతీయా ఆశ్వాసము నండి గ్రహించబడింది.
పూర్వకాలములో చేది రాజ్యాన్ని వసువు అనే మహారాజు పరిపాలన చేస్తుండేవాడు, ఒకరోజు వేటకు అడవికి వెళ్ళిన రాజు ఆ అడవి లో మునులు తపస్సు చేయడము చూసి తాను తపస్సు చేయడం ఆరంభించాడు. అప్పుడు ఇంద్రుడు అది గ్రహించి ఆ మహారాజు వద్దకు వెళ్ళి దైవత్వము ప్రసాదిస్తున్నాని చెప్పి ఒక విమానాన్ని ఇచ్చి, భూలోకములో రాజ్యం చేస్తూ, అప్పుడప్పుడు స్వర్గానికి రమ్మని చెబుతాడు. ఇంద్రుడు వేణుదుస్టి అనే అతి పరాక్రమ వంతమైన ఆయుధాన్ని కుడా ప్రసాదిస్తాడు. వసువు నివసిస్తున్న నగరానికి ప్రక్కగా శుక్తిమతి అనే నది ఉన్నది. శుక్తిమతి అనే నది ప్రక్కన ఉన్న కోలహలుడు అనే పర్వతము శుక్తిమతి మీద మోజుపడి ఆ నదిలో పడతాడు. అప్పుడు ఆ నది మార్గములో వెళ్తున్న వసువు తన ఆయుధంతో కోలహలుడిని ప్రక్కన పడెస్తాడు. శుక్తిమతికి మరియు కోలహలుడికి మధ్య జరిగిన సంపర్కము వలన గిరిక అనే కుమార్తె వసుపదుడు అనే కుమారుడు జన్మిస్తారు. శుక్తిమతి వారివురిని వసువు కి కానుక గా ఇస్తుంది. వసువు గిరికని వివాహం చేసుకొంటాడు. వసువు , వసుపదుడు ని సైన్యాధిపతిగా చేస్తాడు. ఒకరోజు వసువు వేటకు వెళ్తాడు అప్పుడు తన భార్య గిరిక గుర్తు రావడం తో రేతస్సు పడుతుంది. ఆ పడిన రేతస్సుని ఒక దొన్నెలో చేర్చి , ఆ దొన్నెని డేగకి ఇచ్చి తన భార్యకి ఇవ్వమంటాడు. ఆ డేగ ఆ దొన్నెను తీసుకొని పోవుతుండగా మరో డేగ చూసి అది ఏదో తినే పదార్థం అని ఆలోచించి, ఆ డేగతో పోట్లాడూతుంది అప్పుడూ ఆ రేతస్సు యమునా నదిలో పడుతుంది. ఆ యమునా నదిలో ఉన్న ఒక చేప ఆ రేతస్సు ని భక్షిస్తుంది ఆ భక్షించడం వల్ల అది అండంతో కూడి పిండం గా మారుతుంది. ఒకరోజు బెస్తవారు చేపలు పట్టు తుండగా ఈ చేప చిక్కుతుంది. ఆ చేపను బెస్తవారు వారి రాజైన దాశరాజు వద్దకు తీసుకొని పోతారు.
దాశరాజు ఆ చేపని చీల్చి చూడగా ఆ చేపలొ ఒక మగ శిశువు మరియు మరో ఆడ శిశువు ఉంటారు. బ్రహ్మ శాపం వల్ల ఒక అద్రిక అనే అప్సరస చేప క్రింద మారి యమునా నదిలో ఉంది. చేపని చీల్చిన వేంటనే అ చేప అక్కడ నుండి అంతర్థానమై పోయింది. ఆ మగ బిడ్డ పెద్దవాడై ఆ రాజ్యానికి రాజయ్యాడు. ఆ బాలిక మత్స్యగంధి పేరుతో పెద్దదయ్యింది. మత్స్యగంధి తండ్రి లేనప్పుడు యమునా నది పై నావ నడుపుతుండేది. ఇలా జరుగుతుండగా ఒక రోజు వశిష్ట మహర్షి మనమడు, శక్తి మహర్షి కుమారుడాయిన పరాశరుడు ఆ నది స్నానానికి అక్కడ కు వస్తాడు. 
పరాశరుడు జ్యోతిష్యాస్త్రము లో ఆరితేరినవాడు . ప్రతిరోజు వార , తిది , నక్షత్రాలను తం అరచేతిలోనే చూడగల మహిమాన్వితుడు . ఆ రోజు దినచర్య ప్రకారము జ్యోతిష ఫలితాలను నెమరువేయు చుండగా " మరో గంటలో దివ్యమైన ముహూర్తము న జన్మించిన వారు బ్రహ్మ సమానులని " గ్రహించి ఆ విధముగా అలోచించి ఆ పుట్టుకకు గల నియమ నిబంధనలు దివ్యదృష్టితో చూడగా ... ఆ ని్యమాలు ఇలా ఉనాయిట :-> 
దంపతులకు శాస్త్రోక్తము గా పెళ్ళి జరగాలి ,
బ్రాహ్మణ పురోహితునిచే పెండ్లి జరుపబడాలి ,
వదువు కన్య అయి ఉండాలి ,
వరుడు అస్కలిత బ్రహ్మచారి అయి ఉండాలి ,
లంక లో పెండ్లి జరగాలి ,
పిండోత్పత్తి ' ఆ దివ్య మూర్తాన జరిగి ఉండాలి ,
ఇన్ని నియమాల లో పుట్టే శిశువు బ్రహ్మ జ్ఞానము కలిగి , బ్రహ్మసమానుడై ఉంటాడని అలోచిస్తూ నదీతీరాన నడుస్తూ ఉన్న ఆ పరశరునికి ... తనే ఆ బిడ్డను ఎందుకు కనకూడదని అలోచన కలిగి చుట్టు చూడగా ......అక్కడ కనిపించిన మత్స్యగంధిని చూసి మోహించే రతి సుఖాన్ని ఇవ్వమంటాడు, ఆ రతి వెనక ఉన్న జన్మరహస్యాన్ని వివరిస్తాడు . అప్పుడు మత్స్యగంధి తన శరీరం అంతా చేపల వాసనతో ఉంటుందని, కన్యత్వం చెడిన తాను తన తండ్రికి ఏవిధంగా మొగము చూపగలని ప్రశ్నిస్తుంది. అప్పుడు పరాశరుడు మత్స్యగంధి వసువు వీర్యానికి అద్రిక నే అప్సరసకి జన్మించినది ... అని జన్మ వృత్తాంతం చెబుతాడు. చేపల వాసన పోయేటట్లుగా ఒక యోజన దూరము వరకు సుగంధం వెదజల్లేటట్లు వరాన్ని ఇస్తాడు. అప్పటి నుండి యోజన గంధిగా పేరు పొందింది. అప్పటి రతి గరపడానికి సంకోచిస్తున్న మత్స్యగంధి తో పరాశరుడు ఆమె కన్యత్వం చెడకుండా ఉండే వరాన్ని ఇస్తాడు. పగటి పూట రతి సలపడం అనే విషయం వ్యక్తపరిస్తే , అక్కడా ఉన్న ప్రదేశాన్ని మేఘాలతో కప్పేస్తాడు. నదిలో లంక ఉండనే ఉన్నది , బ్రాహ్మణునికై బ్రహ్మదేవుని రమ్మని కోరగా ... తన శక్తి స్వరూపాలతో పుట్టె బిడ్డకు (తన డిటో) తాను సహకరించే ప్రశ్నేలేదని ఖరాకండిగా చెప్పడం తో , నారదముని సహయము తో వివాహం జరిపించి ఆ మహత్తర కార్యానికి నాందిపలికేరు .ఆ విధంగా రతి జరపగా ఒక తేజోవంతుడైన శిశువు జన్మిస్తాడు. ఆ శిశువు పుట్టిన వెంటనే తల్లికి తండ్రికి నమస్కరించి తపస్సుకి వెళ్ళి పోతాడు. తల్లికి ఎప్పుడైన మననం చేసుకొంటే ప్రత్యక్షమయ్యే వరాన్ని ఇస్తాడు.

గురుకృపతోనే సాధ్యం!


జీవితానికి దిశానిర్దేశం చేసే గురువుకు కృతజ్ఞత తెలిపే రోజే గురు పూర్ణిమ. వ్యాస మహర్షి జన్మించిన తిథినే వ్యాసపౌర్ణమిగా, గురు పౌర్ణమిగా జరుపుకోవడం సంప్రదాయంగా వస్తోంది. వేదాలను విభజించి, పురాణాలను అందించి గురుపరంపరను మనకు ప్రసాదించిన దార్శనికుడు వ్యాసుడు. అటువంటి వ్యాసభగవానుడిని స్మరించుకుంటూ మన గురువులను పూజించుకుందాం. అజ్ఞాన అంధకారాన్ని రూపుమాపే తేజస్సు గురువు. శిష్యుడి ఆధ్యాత్మిక ప్రగతి కోసం జ్ఞానయోగం, ధ్యానయోగం, భక్తి యోగం, శక్తిపాత యోగం మొదలైన యోగ మార్గాలను ఉపదేశిస్తాడు. వాటిని సాధన చేసే విధానం కూడా అనుగ్రహిస్తాడు. అందుకే గురు కృప లేనిదే ఈశ్వర ప్రాప్తి సాధ్యం కాదని గుర్తుంచుకోవాలి. ‘జ్ఞానదానం చేసే సద్గురువులకు సరిపడే ఉపమానం ముల్లోకాలలో లేదు’ అన్న శంకరాచార్యుల మాటను బట్టి గురువు ఔన్నత్యం ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు. గురువు నుంచి జ్ఞానం పొందుతున్న శిష్యుడిలో కొన్ని సద్గుణాలు ఉండాలి. అవేంటంటే..
గురువు అడిగిన/ ఆక్షేపించిన చిన్న పనిని కూడా ‘నాకు చెయ్యడం కాలేదు’ అని ఎవరికి అనిపిస్తుందో అతనే నిజమైన శిష్యుడు.
తరువాతి అంచెలో పైన చెప్పిన భావన తీవ్రమవుతుంది. గురువు చెప్పిన పనిని ఎలా సాధించాలా అని ఉపాయం గురించి ఆలోచిస్తాడు.
ఆలోచనలో ఉదయించిన ఉపాయాన్ని వెంటనే ఆచరణలో పెడతాడు.
‘నేను గురు సేవలో ఏ లోపం చేయడం లేదు కదా! నేనేమీ తప్పు చేయడం లేదు కదా!’ అనే చింతన ఉంటుంది.
ఎల్లప్పుడూ తత్పరత, జిజ్ఞాస, గురువు పట్ల కృతజ్ఞత, శరణాగతభావం కలిగి ఉన్నవాడు మాత్రమే గురువు ఆక్షేపిత కార్యాన్ని గుర్తించి చేయగలడు.
గుణాలన్నీ పూరకంగా ఉంటాయి. ఒక గుణం పెంచడానికి మరో గుణం సహాయపడుతుంది. గొలుసులోని ఒక కొక్కి ఇంకొక కొక్కిని పట్టుకున్నట్టు, ప్రతి కొక్కికీ తనదైన ప్రాముఖ్యం ఉన్నట్టు అన్ని గుణాలూ కూడా మహత్వ పూర్ణమైనవే. ఈ గుణాలను గుర్తించి వాటిని సానబెట్టేవాడు గురువు. ఆయన దగ్గర ఎంత సత్యనిష్ఠ కలిగి ఉంటామో.. అంతగా మనలో సద్గుణాలు పరిఢవిల్లుతాయి.


No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list