MohanPublications Print Books Online store clik Here Devullu.com

శ్రీ వరాల వేంకటేశ్వరస్వామి దేవాలయం-Sri Varala Venkateswara Swamy Devalayam



శ్రీ వరాల వేంకటేశ్వరస్వామి దేవాలయం 
(బుల్లి తిరుపతి)

  ప.గో.జిల్లా అత్తిలి ( Near:Bhimavaram) మండలంలో బుల్లితిరుపతిగా పేరుపొందిన ఈడూరు గ్రామంలో వేంచేసియున్న శ్రీ వరాలవేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో ది. 4-07-2017-మంగళవారం రోజున తొలిఏకాదశి సందర్భంగా ఉదయం 7.00 గం.ల నుండి స్వామివారికి 200 లీటర్ల ఆవుపాలతో, 7 లీటర్ల ఆవుపెరుగు, 7 కేజీల ఆవునెయ్యి, 7 కేజీల పట్టుతేనె, 7కేజీల పంచదార, 7కేజీల పసుపు, 7కేజీల కుంకుమ, 7 రకాల ఫలరసాలతో 7 కేజీల చందనం, జవ్వాజి, పునుగు, కస్తూరి, వట్టివేళ్ళు, బంగారురజను, వెండిరజను, వివిధ రకాల సుగంధపరిమళ ద్రవ్యాలతో సంపూర్ణ గోక్షీర సహిత మహాభిషేకం అశేష భక్తజన గోవింద నామస్మరణ కోలాహలంతో అత్యంత రమణీయంగా సుందరవదనంగా అంగరంగ వైభవంగా నిర్వహించబడుతుంది. కావున యావన్మంది భక్తులు విచ్చేసి స్వామి వారికి జరిగే మహాభిషేకం కనులారా వీక్షించి తరించమని విజ్ఞప్తి చేసుకుంటూ... శ్రీవారి అనేకానేక మంగాళాశీస్సులు... సర్వేజనాః సుఖినోభవంతు.

ఈడూరు శ్రీ వరాల వేంకటేశ్వర స్వామి దేవాలయం "బుల్లి తిరుపతి "గా ప్రసిద్ధిగాంచింది. శ్రీ భూ నీలా సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి వారి కోరిన కోర్కెలు తీర్చే ఇలవేల్పుగా కొలుస్తూ కోరిన వరాలు ఇచ్చే దేవునిగా "శ్రీ వరాలవేంకటేశ్వరుని"గా ప్రసిద్ధి చెందారు. మనసులో కోరిక తలచుకొని 11 ప్రదక్షిణలు చేసి ఆ కోరిక నెరవేరిన తరువాత 108 ప్రదక్షిణలు చేసి వారి మొక్కును చెల్లించుకోవడం ఇక్కడ ప్రజల ఆనవాయితీగా మారింది.

ప్రతీ శనివారం విశేష అలంకారాలు, విశేష పూజలు, అభిషేకాలు నిర్వహిస్తారు.ప్రతీ నెలా వచ్చే శ్రవణా నక్షత్రం రోజున స్వామి వారికి కల్యాణం జరుపుతారు.ఈ కల్యాణం జరిపించుకున్న భక్తుల కోరికలు నెరవేరుతాయని పిల్లలు లేనివారికి సంతాన భాగ్యం కలుగుతుంది, ఉద్యోగం లేనివారికి ఉద్యోగం, చదువు, ఆరోగ్యం, మొదలైన కోరికలు నెరవేరుతాయనిప్రసిద్ధిగాంచింది.ప్రతీ శనివారం దాతల సహకారంతో అన్నదానం జరుగుతోంది.

స్వామి వారి లీలలు

శ్రీ వారు ఒక భక్తుని స్వప్నంలో రథములో కూర్చుని ఊరేగినట్లుగా సాక్షాత్కరించారు.ఆ క్షణం నుండి ఏ విధంగానైనా రథం చేయించాలని దృఢమైన సంకల్పం కలిగి స్వామీ అనుగ్రహంతో సంవత్సరకాలంలో భక్తుల సహాయ సహకారాలతో వినూత్న రీతిలో రథ నిర్మాణం జరిగి శ్రీ వారి రథోత్సవం జరుగుతోంది.

ఒకభక్తురాలి స్వప్నంలో పాదుకలు ప్రతిష్ఠించమని ఆజ్ఞాపించారు. శ్రీవారి ఆదేశానుసారం ఆ భక్తురాలు యధా శక్తిగా శ్రీ వారికి ఇత్తడి పాదుకలను ధ్వజస్తంభం దగ్గర ప్రతిష్ఠించడం జరిగింది.

తాడేపల్లిగూడెంలో నివసించే శ్రీ వారి భక్తుడు ఒకరు లండన్ లో ఉద్యోగ ప్రయత్నం కొరకు వెళ్ళడం జరిగింది. అక్కడ ఉద్యోగం వచ్చినట్లే వచ్చి చేజారిపోతోంది. ఒక్క సారి మన వరాల వేంకటేశ్వరుడు జ్ఞాపకం వచ్చి అక్కడనుంచి అర్చకులకు ఫోన్ చేసి జరిగిన సంగతి చెప్పి స్వామివారికి అర్చన చేయమనగా అర్చన చేసిన తరువాత వారం రోజులకు ఫలితం కనపడినది . తరువాత అతని ఆనందానికి అవధులు లేవు.

ఈడూరు గ్రామంలో ఒక భక్తురాలు తమ కుమార్తెకు ముందు ఆడపిల్ల తరువాత కాన్పుకి మగపిల్లవాడిని ఇమ్మని స్వామి వారిని వేడుకొంది. ఒక రోజు స్వామీ ఆ భక్తురాలు కలలో కనబడి నీ బిడ్డకు తప్పక మగ శిశువు ప్రసాదించెదను. నీవు నాకిష్టమైన నల్ల ద్రాక్ష తులాభారం వెయ్యమని అడిగెను. ఆ ప్రకారం మగ శిశువుకి జన్మనిచ్చింది. తరువాత ఆమె నల్లద్రాక్ష పళ్ళు మ్రొక్కు తీర్చుకుంది.

వేల్పూరు గ్రామంలోని ఒక భక్తురాలు భీమవరం బస్సు మీద వెళ్ళు చూ నా గృహం విషయమై ఇబ్బందులు పడుతున్నాను నా చిక్కులు అన్నీ తీరిపోతే నీకు 108 ప్రదక్షిణాలు చేస్తా అని బస్సులోనే వేడుకొంది. రెండు రోజులలో అన్ని సమస్యలు పరిష్కారమైనాయి. ఆమె స్వామి చూపిన నిదర్శనం గురించి అందరికీ చెప్పి తన్మయత్వంలో మునిగి తేలింది.

మోగల్లు గ్రామంలో ఒక బ్రాహ్మణ భక్తుడు తన గ్రహానికి సంబధించిన కాగితాలు గురించి మరియు తన కుమారుడు అమెరికా ప్రయాణం ఎంత ప్రయత్నించినా ఫలితం రావడం లేదు. వరాల వేంకటేశ్వర స్వామీ గురించి అందరూ చెబుతున్నారు నేను కూడా స్వామిని దర్శించుకుంటే పని ముందుకు వెళ్తుందేమో అని ఒక్కసారి వచ్చి స్వామిని దర్శించుకున్నారు. తన పని సునాయాసంగా ఎదరికి వెళ్ళింది. తన ఆనందానికి అవధులు లేవు. మన స్వామీ గురించి తనకు చూపిన లీల గురించి అందరికి చెప్పి, అందరూ స్వామిని దర్శించుకోమని సలహా ఇస్తున్నారు.

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list