MohanPublications Print Books Online store clik Here Devullu.com

దుష్కర్మలను నివారించే సుకర్మలు-Karma, Health


జలుబును తగ్గించే నిమ్మ!
గుడ్‌ఫుడ్‌
నిమ్మరసం తాగితే జలుబు చేస్తుందని అనుకుంటారు. కానీ నిమ్మలో విటమిన్‌–సి సమృద్ధిగా ఉంటుంది. అందుకే నిమ్మరసం రోగనిరోధకశక్తిని పెంపొందిస్తుంది. కాబట్టి జలుబు తగ్గుతుంది. నిమ్మలో ఉన్న పోషకాలివి. నిమ్మలో ఉండే విటమిన్‌–సి చాలా శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్‌. నిమ్మను తరచూ వాడేవారికి క్యాన్సర్‌నుంచి స్వాభావికమైన రక్షణ కవచం ఏర్పడుతుంది. నిమ్మలో ఎండార్ఫిన్‌ అనే రసాయనాలు ఎక్కువ. అందుకే నిమ్మ నీరు లేదా నిమ్మ షర్బత్‌ తాగిన తర్వాత ఒక ఫ్రెష్‌ ఫీలింగ్‌ ఉంటుంది.
ఈ ఎండార్ఫిన్‌ రసాయనాల్లో యాంగై్జటీ తగ్గించే గుణం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా తీవ్రమైన ఒత్తిడి లేదా యాంగై్జటీ కలిగినప్పుడు నిమ్మరసం ఒక మంచి ఔషధంగా పనిచేస్తుంది.అర లీటరు నీళ్లలో ఒక నిమ్మపండు రసాన్ని పిండి అందులో చిటికెడంత ఉప్పు, చారెడు పంచదార వేసి తాగితే అది డీ–హైడ్రేషన్‌ ప్రమాదం నుంచి కాపాడుతుంది. నిమ్మలోని వ్యాధి నిరోధకతను కలిగించే పోషకాల వల్ల అది అనేక వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుంది.


దుష్కర్మలను నివారించే సుకర్మలు
ఆత్మీయం
మన కర్మలకు మనమే కర్తలం. కర్మలలో నిష్కామ కర్మ చాలా గొప్పది. అంటే ఇతరులనుంచి ఏమీ ఆశించకుండా చేసేది. నిష్కామ కర్మ ప్రతివారు చేయదగ్గ గొప్ప కర్మనివారిణి. మనం చేసే దానధర్మాలు, పరోపకారం నిష్కామకర్మలు అవుతాయి. ఇవి ఎంత ఎక్కువ చేస్తే, మన పాపం అంతగా తొలగుతుంది. ముల్లుని ముల్లుతోనే తీసినట్లు మనం చేసిన దుష్కర్మని ఫలితాన్నివ్వకుండా నాశనం చేయడానికి నిష్కామకర్మ ఉపయోగిస్తుంది. చాలామంది దైవానికి మొక్కుకుంటారు. దానికన్నా మంచి పద్ధతి ఫలానా నిష్కామకర్మ చేస్తామని మొక్కుకోవడం.
‘మా అమ్మాయి పెళ్లయితే తిరుమల నడచి వస్తాం’ అనే మొక్కు కంటే ‘ఓ బీద కన్య వివాహానికి సహాయం చేస్తా’ అని మొక్కి అలా చేయడం ఎక్కువ ఫలితాన్నిస్తుంది. మనకి ఉన్న అడ్డంకి తొలగడానికి పుణ్యక్షేత్ర సందర్శనతోబాటు దానధర్మాలని చేస్తారు. కుక్కకి పాలు పోస్తే ఉద్యోగం వస్తుందని ఓ జోస్యుడు చెబుతాడు. కోతులకి ఆహారం ఇస్తే ఆరోగ్యం కుదుటపడుతుందని మరో జోస్యంలో చెబుతారు. కారణం వారి చెడుకర్మ ఫలితాన్ని ఆ సుకర్మ నివారించడానికి, ఆ ప్రాణులకు ఈ రూపంలో ఆహారం అందడానికే.


ప్రతినెలా ఆమెలో ఆ కోపతాపాలేమిటి
నా భార్య వయసు 32. సహజంగా ఆమెది శాంత స్వభావం. కానీ, అటుఇటుగా నెలకోసారి విపరీతమై కోపతాపాలకు గురవుతుంది. చిన్న చిన్న విషయాలకే గట్టిగా అరవడం, ఒక్కోసారి చిన్న విషయాలకే ఏడ్చేయడం ఇలా చేస్తూ ఉంటుంది. ఓ నాలుగైదు రోజల తర్వాత మళ్లీ మునుపటి సాధారణ స్థితికి వచ్చేస్తుంది. ఇదేమైనా సైకియాట్రి సమస్యా ఏమిటా అనే అనుమానం నాకు అప్పుడప్పుడు కలుగుతోంది. మీ అభిప్రాయమేమిటో చెబితే, ఆ తర్వాత ఏంచేయాలో ఒక నిర్ణయానికి వస్తాం.
-డి. ముకుంద్‌, కడప
మానసిక రుగ్మతలనేవి నిరంతరంగా ఉంటాయే గానీ, నెలకు నాలుగు రోజులే ఉండి, తగ్గిపోవడం ఉండదు. అసలు విషయం ఏమిటంటే, స్త్రీలలో కొంత మంది బహిష్టుకు ముందు విపరీతమైన కోపతాపాలకు గురవుతుంటారు. ఈ స్థితినే వైదిక పరిభాషలో పి.ఎమ్‌.టి (ప్రీ మెన్‌స్ర్టువల్‌ టెన్షన్‌) అంటారు. హార్మోన్‌ల అస్తవ్యస్తత వ ల్ల శారీరకంగా, మానసికంగా వచ్చే మార్పులే ఇందుకు కారణం. ఈ స్థితిలో తలనొప్పి, ఒళ్లునొప్పులు, పొత్తి కడుపు ఉబ్బడం లేదా నొప్పి, మలబద్దకం, వాంతి, వికారం వంటి శారీరక సమస్యలతో పాటు, సడెన్‌గా మూడ్‌ మారడం, టెన్షన్‌ , చిరాకు, మనసు దేని మీదా స్థిరంగా నిలవలేకపోవడం, మీరన్నట్లు.. చిన్న చిన్న విషయాలకే ఆగ్రహానికి గురికావడం, ఏడ్వడం వంటి లక్షణాలు ఉంటాయి. ఈ పి.ఎమ్‌.టి తో బాధపడే స్త్రీలలో సుమారు 10 శాతం మంది ఒక తీవ్రమైన ఉద్విగ్న స్థితిలో ఉంటారు. కుటుంబ సభ్యులందరి మీదా విరుచుపడుతుంటారు. వాళ్ల మూడ్‌ మాటిమాటికీ మారుతూ ఉంటుంది. ఇవన్నీ బహిష్టు మొదలయ్యే దాకానే ఉంటాయి. ఒకసారి మొదలయ్యిందీ అంటే ఆ సమస్యలన్నీ మటుమాయమైపోతాయి. అప్పటి దాకా కుటుంబ సభ్యులంతా సర్దుకుపోవడమే మంచిది. మీరు అనుమానిస్తున్నట్లు ఇదేమీ సైకియాట్రి సమస్య కాదు. అంతగా అవసరమైతే ఒక సారి గైనకాలజిస్టును సంప్రదిస్తే కొంత మేలు జరిగే అవకాశం ఉంది.
- డాక్టర్‌ ఎల్‌. సౌమ్య, గైనకాలజిస్ట్‌

భక్తి ఉంటేనే విలువ
పూర్వం ఒక గ్రామంలో విష్ణు భక్తుడు ఒకడు ఉండేవాడు. నిరంతరం హరి నామస్మరణ చేస్తూ.. ధార్మిక జీవనం సాగించేవాడు. ఎంత పేదరికంలో ఉన్నా.. భగవానుడిపై ఆపారమైన నమ్మకం కలిగి ఉండేవాడు. అతడి భక్తికి మెచ్చి ఒకనాడు మహావిష్ణువు ప్రత్యక్షమయ్యాడు. స్వామి దివ్య మంగళ స్వరూపం చూసి.. తన్మయంతో స్తోత్రాలు చేశాడు భక్తుడు. స్వామికి ఏదైనా నివేదించాలని అనుకున్నాడు. ఇల్లంతా వెతకగా.. ఒక అరటి పండు కనిపించింది. దానిని స్వామికి నివేదించాడు. అరటిపండు ఒలిచి.. పండు పడవేసి... భక్తి పారవశ్యంలో.. తొక్కను స్వామి నోటికి అందించాడు. భక్త వత్సలుడైన విష్ణుమూర్తి తొక్కను స్వీకరించి అంతర్ధానమయ్యాడు. తర్వాత తన తప్పును తెలుసుకుని భక్తుడు ఎంతో చింతించాడు. స్వామి పట్ల అపరాధం చేశానని కుమిలిపోయాడు. మళ్లీ స్వామి తనకు ప్రత్యక్షమైనప్పుడు ఇలాంటి తప్పు జరకుండా చూసుకోవాలని నిశ్చయించుకున్నాడు.
కష్టపడి పని చేయడం మొదలుపెట్టాడు. డబ్బులు సంపాదించి.. ప్రతి రోజూ ఒక డజను అరటిపళ్లు స్వామి విగ్రహానికి నివేదిస్తూ వచ్చాడు. ఎన్ని రోజులైనా విష్ణుమూర్తి ప్రత్యక్షం కాలేదు. బాధతో.. ‘తండ్రి! అపరాధి అయిన ఈ భక్తుడిని కరుణించి దర్శనం ఇవ్వమ’ని వేడుకున్నాడు. విష్ణుమూర్తి మళ్లీ ప్రత్యక్షమయ్యాడు. సంతోషంతో స్వామికి అరటి పళ్లు నివేదించాడు. గతంలో చేసిన పొరపాటు గుర్తు తెచ్చుకుని తొక్క పడవేసి.. పండు స్వామికి అందించాడు. కానీ, విష్ణుమూర్తి పండు తినడానికి ఇష్టపడలేదు. ఎంత బతిమాలినా ఫలితం లేదు. భక్తుడు ఆవేదనతో.. ‘నా భక్తిలో ఏదైనా లోపం ఉందా స్వామి! గతంలో తొక్క పెట్టినా తిన్నారు కదా! ఇప్పుడు ఇలా కినుక వహించారేమిటి?’ అని ప్రశ్నించాడు.
విష్ణుమూర్తి చిన్నగా నవ్వి.. ‘నాయనా! ఇంతకు ముందు వచ్చినప్పుడు నీ మనస్సు నాపై లగ్నం చేసి.. తొక్క నివేదించినా స్వీకరించాను. ఇప్పుడు నీ మనసు అరటి పండుపై లగ్నమై ఉంది. వస్తువు మంచిదైనా.. భక్తి రసహీనం కావడం వల్ల అది విషతుల్యంగా మారింది. అందుకే పండు స్వీకరించలేకపోతున్నాను’ అని సమాధానమిచ్చాడు. స్వామి మాటలకు భక్తుడికి జ్ఞానోదయం అయింది. భక్తి కలిగినపుడే కదా దేనికైనా విలువ అనుకుని.. నిండు మనసుతో స్వామిని ప్రసన్నం చేసుకున్నాడు.
బొప్పాయి గొప్ప ఔషధాగారం
రసాలూ, కషాయాలే కాదు సహజ సిద్ధమైన పండ్లు కూడా ఎంతో శక్తివంతమైన ఔషధంగా పనిచేస్తాయి. ప్రత్యేకించి బొప్పాయి పండు ఇంట్లో ఉంటే ఇంటిల్లిపాదికీ గృహవైద్యంగా పనిచేస్తుంది. ఎలా అంటే, బొప్పాయిలో యాంటీ ఆక్సిడెంట్లు, బీటా కెరోటిన్‌లు భారీగా ఉంటాయి. ఇవి వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి. ప్రొటీన్లను జీర్ణం చేసే ‘పపాయిన్‌’ అనే ఎంజైమ్‌ బొప్పాయిలో సమృద్ధిగా ఉంటుంది. అందువల్ల భోజనం తర్వాత నాలుగు బొప్పాయి ముక్కలు తింటే అది కడుపులో ఏ విధమైన అసౌకర్యం కలగకుండా చూస్తుంది. ఇది మాంసాన్ని కూడా త్వరగా అరిగేలా చేస్తుంది. అందుకే ఆంగ్లేయులు బొప్పాయిలోని ప్రధాన అంశమైన పపాయిన్‌ (పపాయా) అన్న పేరుతోనే పిలుస్తారు.
బొప్పాయిలో ఎ, బి, సి, ఇ విటమిన్లతో పాటు ఖనిజాలు, ప్లేవనాయిడ్స్‌ వంటి మరెన్నో పోషకాలు ఉంటాయి. కొలెస్ట్రాల్‌ను తగ్గించడం ద్వారా ఇది గుండె జబ్బులను నివారిస్తుంది. ఇది నరాల బలహీనతలను తగ్గించే మంచి టానిక్‌ కూడా.
క్యాల్షియం పాస్పరస్‌, ఐరన్‌, మెగ్నీషియం, సోడియం, పొటాషియం, గంధకం, క్లోరిన్‌ వంటి పోషకాలు తగు మోతాదులో ఉండడం వల్ల బొప్పాయి పలు శారీరక రుగ్మతలకు అడ్డుకట్ట వేయగలుగుతుంది.
కంటి చూపుకు మేలు చేసే విటమిన్‌ ఎ, ఇ లు కూడా ఉంటాయి.

వీటిలో కూడా చక్కెర ఉంటుంది!
స్వీట్స్‌లోనేకాదు స్వీట్‌గా ఉండని వాటిలో కూడా చక్కెర దాగి ఉంటుంది. వాటిని కనిపెట్టి దూరంగా ఉండగలిగితే ఒబెసిటి దరి చేరదు. అవేంటంటే..
టొమాటో సాస్‌: దీన్లో మిగతా ఇంగ్రీడియెంట్స్‌ కంటే చక్కెరే ఎక్కువ. రెడీ టు సర్వ్‌ కోవలో కొచ్చే టొమాటో సాస్‌లో పులుపును విరగ్గొట్టడానికి ఎక్కువ పరిమాణంలో చక్కెర కలుపుతారు.
సలాడ్‌ డ్రెస్సింగ్స్‌: సలాడ్స్‌ ప్రిపరేషన్‌లో వాడే రెడ్యూ్‌సడ్‌ ఫ్యాట్‌ డ్రెస్సింగ్స్‌లో చక్కెర శాతం ఎక్కువ. ఒక టేబుల్‌ స్పూను డ్రెస్సింగ్‌లో 3 గ్రాముల చక్కెర ఉంటుంది.
బేక్‌డ్‌ బీన్స్‌: బీన్స్‌ను నేరుగా కొని వాడాలి. ఒక కప్పు రెడీమేడ్‌ బేక్‌డ్‌ బీన్స్‌లో 20 గ్రాములు చక్కెర ఉంటుంది.
సిరీల్స్‌: పిల్లల కోసం తయారయ్యే సుగర్‌ కోటెడ్‌ సిరీల్స్‌ వాడకపోయినా రెడీమేడ్‌ సిరీల్స్‌ అన్నిట్లో చక్కెర దాగుంటుంది. ఇలాంటి ఫైబర్‌రిచ్‌ సిరీల్స్‌ ఒక్కో సర్వింగ్‌లో 10-15 గ్రాములు చక్కెర ఉంటుంది.
గ్రనోలా బార్స్‌: ఇవి హెల్దీగానే కనిపిస్తాయి. కానీ వీటి మీద ఉండే చాక్లెట్‌, ఇతర కోటింగ్స్‌ ద్వారా అదనంగా ఒక్కో బార్‌లో 20 గ్రాముల చక్కెర ఉంటుంది.
ఈ ద్రాక్ష.. పాపులర్‌ ఫుడ్‌!
తాజాగా ఓ ఫుడ్‌ ట్రెండ్‌ సోషల్‌ వెబ్‌సైట్స్‌లో హల్చల్‌ చేస్తోంది. ముఖ్యంగా చికాగోలో ఈ ట్రెండ్‌ దుమ్మురేపుతోంది. చికాగోలో ఉండే ఒకాయన ద్రాక్షను పాపులర్‌ చేశాడు. అదెలా అనుకుంటున్నారా.. విత్తనంలేని ద్రాక్షపండు పైభాగంలో పాకంపట్టిన గింజలను అతికించాడు. దీన్ని ‘టాఫీగ్రేప్స్‌’ అని పిలిచాడు. మనం టైంపా్‌సకు పల్లీలు తిన్నట్లు టాఫీ గ్రేప్స్‌ను చికాగోలో తింటున్నారట. దీంతో వాఫర్స్‌లాగా ప్లాస్టిక్‌ గ్లాసులు, డబ్బాల్లో టాఫీగ్రే్‌ప్స్‌ను దుకాణాల్లో అమ్ముతున్నారు. బిస్కెట్స్‌ ప్యాకెట్స్‌లాగా ప్యాకింగ్‌ చేసి వీటిని రెస్టారెంట్స్‌లో విక్రయిస్తున్నారు. మొత్తానికి టాఫీ గ్రేప్స్‌ను చూసి ఇతరదేశాల్లోనూ కొందరు పాకశాస్త్రంలో ప్రావీణ్యం ఉండే వారు తయారు చేసుకుంటున్నారు. ఏదైనా రొటీన్‌ఫుడ్‌ కంటే కొత్తగా ప్రయత్నిస్తే.. అది సక్సెస్‌ అయితే మాత్రం టాఫీ గ్రేప్స్‌లా వైరల్‌ ఫుడ్‌ కావటం ఖాయం.


పిల్లల్లో ఎందుకా ఎలర్జీ? 
మీ పిల్లలు యాంగ్జయిటీతో బాధపడుతున్నారా... ఈ సమస్యకు గురవడానికి ఫుడ్‌ఎలర్జీ కూడా కారణమా... ఇటీవల చేసిన ఒక స్టడీలో ఫుడ్‌ ఎలర్జీలున్న పిల్లల్లో యాంగ్జయిటీ సమస్య అధికంగా ఉంటోందని పరిశోధకులు తేల్చారు.

ఏ వయసు పిల్లల్లో: పరిశోధకులు 4-12 సంవత్సరాల పిల్లల్లో పరీక్షలు నిర్వహించారు. వీరిలో ఫుడ్‌ఎలర్జీ లేని పిల్లలు ఉన్నారు. ఫుడ్‌ ఎలర్జీతో బాధపడుతున్న పిల్లలూ ఉన్నారు. వీళ్ళల్లో ఫుడ్‌ఎలర్జీ ఉన్న పిల్లలు 57శాతం మంది యాంగ్జయిటీతో బాధపడుతున్నారు.. ఫుడ్‌ ఎలర్జీ లేని పిల్లల్లో 48 శాతం మందే ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. ఫుడ్‌ఎలర్జీతో బాధపడుతున్న, ఫుడ్‌ ఎలర్జీ లేని పిల్లల్లో దగ్గరగా 48 శాతం మంది కుంగుబాటుతో బాధపడుతున్నారని కూడా తేలింది.

దేనితో సంబంధం: సోషల్‌ యాంగ్జయిటీతో ఎలర్జీకి లింకు ఎక్కువ. సోషల్‌ యాంగ్జయిటీ కొందరు పిల్లల్ని ఎక్కువ బాధిస్తుంటుంది. అంతేకాదు సమాజ తిరస్కారానికి, అవమానానికి గురవుతామేమోనన్న ఫీలింగ్స్‌ వల్ల కూడా పిల్లల్లో ఫుడ్‌ ఎలర్జీ తలెత్తుతుంది. అందుకే.... ఫుడ్‌ఎలర్జీ డయాగ్నసిస్ కు, సోషల్‌ యాంగ్జయిటీకి మధ్య లింకు ఉంది. ఫుడ్‌ ఎలర్జీ తగ్గుతున్న కొద్దీ పిల్లల్లో యాంగ్జయిటీ సమస్య కూడా తగ్గుతుంది.








No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list