MohanPublications Print Books Online store clik Here Devullu.com
Showing posts with label bhakthi. Show all posts
Showing posts with label bhakthi. Show all posts

తిరుమల ఏడుకొండల పరమార్థం ఏమిటో మీకు తెలుసా? | Tirumala hills | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu

తిరుమల ఏడుకొండల పరమార్థం ఏమిటో మీకు తెలుసా?  | Tirumala hills | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu



తిరుమల ఏడుకొండల 
పరమార్థం ఏమిటో మీకు తెలుసా?

1. వృషాద్రి 2. వృషభాద్రి 3. గరుడాద్రి 4. అంజనాద్రి 5. శేషాద్రి 6. వేంకటాద్రి 7. నారాయణాద్రి.

ఏడు చక్రాలు దాటితే ఆనందానుభూతి కలుగుతుంది. ఆనంద నిలయం ఎక్కడ ఉంటుంది. బ్రహ్మ స్థానంలో ఉంటుంది. అందుకనే ఆయన 7 కొండలు పైన ఉంటాడు. ఈ 7 కొండలు ఎక్కడం కూడా ఒక రహస్యం ఉంటుంది. ఆ 7 కొండలు సాలగ్రామాలే. ఆ 7 కొండలూ మహర్షులే. అక్కడి చెట్లు, పుట్టలు, పక్షులు ఏవైనా మహర్షుల అంశలే. తిరుమలలో పుట్టింది ఏదీ సామాన్యమైనది కాదు.

అంజనాద్రి ర్వ్రుశాద్రిశ్చ శేషాద్రి ర్గరుడాచలః |
తీర్థాద్రిః శ్రీనివాసాద్రి శ్చింతామణిగిరిస్తథా ||
వృషభాద్రి ర్వరాహాద్రిః జ్ణానాద్రిః కనకాచలః |
ఆనందాద్రిశ్చ నీలాద్రి స్సుమేరుశిఖరాచలః ||
వైకుంఠాద్రి: పుష్కరాద్రిః -- ఇతి నామాని వింశతిః

ఈ 20 నామాలు పఠించటంవల్ల సర్వ పాప బంధాలు నుండీ విముక్తులు కాగలరు.

తిరుమల ఏడుకొండల పరమార్థం ఏమిటో మీకు తెలుసా?  | Tirumala hills | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu

1. వృషభాద్రి :- అంటే ఎద్దు : వ్రుశాభానికి ఋగ్వేదంలో ఒక సంకేతం ఉంది. ఎద్దు మీద పరమ శివుడు కూర్చుంటాడు. దానికి 4 కొమ్ములుంటాయి. 3 పాదాలు (భూత, భవిష్యత్, వర్తమాన కాలాలు)
వాక్కు అంటే - శబ్దం
శబ్దం అంటే - వేదం
వేదం అంటే - ప్రమాణము

వేదమే ప్రమాణము. వేదము యొక్క ప్రమాణాన్ని అంగీకరించిన వాడు మొదటి కొండ ఎక్కుతాడు.

2. వృషాద్రి :- అంటే ధర్మం : ధర్మం అంటే - నువ్వు వేదాన్ని అనుసరించి చేయవలసిన పనులు. నీకు భగవంతుడు ఇచ్చిన వాటితో మంచివి వినడం, చూడడం, మంచి వాక్కు మొదలైనవి. దాని వల్ల ఇహంలోను, పరలోకంలోను సుఖాన్ని పొందుతాడు.
అవి చెయ్యడమే వృషాద్రిని ఎక్కడం.

3. గరుడాద్రి :- అంటే పక్షి - ఉపనిషత్తుల జ్ఞానాన్ని పొందడం.
షడ్ - అంటే జీర్ణం కానిది. ఒక్క పరమాత్మ మాత్రమే జీర్ణంకానిది. పరమాత్మ ఒక్కడే ఉంటాడు. మిగిలిన వాటికి 6 వికారాలు ఉంటాయి.
పుట్టినది, ఉన్నది, పెరిగినది, మార్పు చెందినది, తరిగినది, నశించినది.
ఇవ్వన్నీ పుట్టిన వాడికి జరుగుతూనే ఉంటాయి. ఆ ఆరు లేని వాడు భగవానుడు.
భ == ఐశ్వర్య బలము, వీర్య తేజస్సు మరియు అంతా తానే బ్రహ్మాండము అయినవాడు.
అన్ == ఉన్నవాడు, కళ్యాణగుణ సహితుడు, హేయగుణ రహితుడు.
అటువంటి భగవానుణ్ణి జ్ఞానం చేత తెలుసుకోవడమే గరుడాద్రి.

తిరుమల ఏడుకొండల పరమార్థం ఏమిటో మీకు తెలుసా?  | Tirumala hills | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu

4. అంజనాద్రి - అంజనం అంటే కంటికి కాటుక.
ఈ కంటితో చూడవలసినవి మాత్రమే చూసినపుడు. ఈ కంటితో చూసిన దాంట్లో అంతటా బ్రహ్మమే ఉందని తెలుసుకోవడం కంటికి కాటుక. ఇదంతా పరమాత్మ సృష్టియే.
అప్పుడు అంజనాద్రి దాటతాడు.

5. శేషాద్రి :- ప్రపంచం అంతా బ్రహ్మమే అని చూసాడనుకోండి వాడికి రాగద్వేషాలు ఉండవు. వాడికి క్రోధం ఉండదు. వాడికి శత్రుత్వం ఉండదు. భగవద్గీతలో గీతాచార్యుడు చెప్పాడు, తుల్య నిందా స్తుతిర్ మౌని (శ్లోకం చెప్పారు)
తాను కాకుండా ఇంకోటి ఉంది అన్న వాడికి భయం. అంతా బ్రహ్మమే అనుకునేవాడికి భయం ఉండదు. ఎప్పుడూ ఒకేలా ఉండడమే బ్రహ్మం. ఆ స్థితికి ఎక్కితే శేషాద్రిని ఎక్కడం.

తిరుమల ఏడుకొండల పరమార్థం ఏమిటో మీకు తెలుసా?  | Tirumala hills | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu

6. వేంకటాద్రి :- వేం : పాపం, కట : తీసేయడం. కాబట్టి పాపాలు పోతాయి. అంతా బ్రహ్మమే చేయిస్తున్నాడు, అందుకనే మనకి బ్రహ్మం తెలిసినవారు పిచ్చివాళ్ళలా కనవడుతారు. రామ కృష్ణ పరమహంస ఈ పిచ్చి నాకు ఎప్పుడు వస్తుందో అంటూ ఉండేవారు. అందుకే జ్ఞాని, పిచ్చివాడు ఒకలా ఉంటారు.
ఆయనకే అర్పణం అనడం, అటువంటి స్థితిని పొందడం వెంకటాద్రి ఎక్కడం.

7. నారాయణాద్రి :- అంటే తుల్యావస్థని కూడా దాటిపోయి, తానే బ్రహ్మముగా నిలబడిపోతాడు. అటువంటి స్థితిని పొందడం నారాయణాద్రి.

వేంకటాచలంలో ఏడుకొండలు ఎక్కడం వెనకాల ఇంత నిక్షేపాలను ఉంచారు. ఈ కారణాలు తెలుకుకోవడం ఏడు కొండలు ఎక్కడం.

త్రివేణి సంగమేశ్వరాలయం | Triveni Sangameswaralayam | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu


త్రివేణి సంగమేశ్వరాలయం | Triveni Sangameswaralayam | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu

త్రివేణి సంగమేశ్వరాలయం | Triveni Sangameswaralayam 

సాక్షాత్తు దేవాధి దేవతలు, ఋషులు యోగ సాధకులు నడయాడిన నేల ఇది. పరమ శివుడు స్వయంభువుగా అవతరించిన ప్రాంతమిది. ప్రకృత రమణీయతను, భక్తిభావ పరిమళాలను వ్యాప్తి చెందిస్తూ మంజీరా శ్రీ త్రివేణి సంగమేశ్వరుడిగా భక్తుల పూజలందుకుంటున్నాడు. ఈ పవిత్ర పుణ్యక్షేత్ర విశేషాలే ఈవారం దర్శనం. 

ఎక్కడ ఉంది?: సంగారెడ్డిజిల్లా సదాశివపేట మండలం ఏటిగడ్డల సంఘం గ్రామంలో ఉన్నది. 
ఎలా వెళ్లాలి?: హైదరాబాద్-ముంబై జాతీయ రహదారిలో సదాశివపేట పట్టణం నుంచి 16 కిలోమీటర్ల దూరంలో ఉంది. సింగూరు ప్రాజెక్టుకు వెళ్లేదారికి సమీపంలో ఈ క్షేత్రం కొలువై ఉన్నది. ఇక్కడ ఏటిగడ్డ సంఘం కాలనీ నుంచి కిలోమీటర్ దూరం వెళ్తే త్రివేణి సంగమేశ్వరాలయం చేరుకోవచ్చు. సదాశివ పేట నుంచి బస్సులు, ప్రైవేటు వాహనాల సౌకర్యం ఉన్నది. 

విశిష్టత: మంజీరా నది ఒడ్డున దేవాధి దేవతలు, ఋషులు తపమాచరించి, సాక్షాత్తు పరమశివుడిని సాక్షాత్కారం పొంది, ఈ ప్రాంతంలో లింగ ప్రతిష్ట చేశారట. మంజీరా ఉధృతంగా ప్రవహించే ఏటిగడ్డ సంఘంలో స్నానమాచరిస్తే పాపాలు తొలగిపోతాయంటారు. కోరినవి నెరవేరుతాయనీ భక్తుల నమ్మకం. 

పేరెలా వచ్చింది?: మూడు ఏరుల కలిసిన ఎత్తయిన ప్రాంతం కావడం వల్ల ఏటిగడ్డ సంఘం అనే పేరు వచ్చినట్లు స్థానికులు చెప్తున్నారు. మంజీరా, నారింజ, నీలంగ నదుల కలయికే త్రివేణి సంగమేశ్వరంగా చెబుతున్నారు. 

ప్రాచీనక్షేత్రం: దీనిని తెలంగాణలోని అతి ప్రాచీన దేవాలయాల్లో ఒకటిగా చెప్తున్నారు స్థానికులు. మాలపాడు, బొబ్బిలిగామా, పొట్టిపల్లి, పోచారం, మునిపల్లి, ఆత్మకూర్, బూచిరెడ్డిపల్లె, ఏటిగడ్డ సంఘం గ్రామాల ఇలవేల్పుగా ఈ ఆలయం పూజలందుకుంటున్నది. 

ప్రత్యేకత: కాశీ విశ్వేశ్వరాలయం వెలసిన గంగానది దక్షిణ దిశగా ప్రవహిస్తున్నది. ఏటిగడ్డ సంఘంలో మంజీరానది దక్షిణ దిశగా ప్రవహిస్తున్నది. అందుకే సంగమేశ్వరాలయానికి అంతటి విశిష్టత ఉన్నది. సంగమ కూడలి జలంతో అభిషేకించడం ఈ సంగమేశ్వరాలయం ప్రత్యేకత. 

పూజలు: మహాశివరాత్రితో పాటు శ్రావణ, కార్తీకమాసాలే కాకుండా మామూలు రోజుల్లో భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. రుద్రాభిషేకం, ఎదుర్కోళ్లు, లింగోద్భవం, పల్లకిసేవ, అగ్నిగుండం, సర్వదేవతా పూజలు వంటి కార్యక్రమాలు ఇక్కడ అంగరంగ వైభవంగా జరుగుతాయి. హైదరాబాద్, సంగారెడ్డి, సదాశివపేట, జోగిపేట, జహీరాబాద్, నారాయణఖేడ్, కర్ణాటక రాష్ట్రం బీదర్ నుంచి భక్తులు వచ్చి మంజీరాలో స్నానం చేస్తారు. ఆయురారోగ్య సమస్యలు ఉన్నవారు స్వామివారిని దర్శించుకుంటే పరిష్కారం అవుతాయని భక్తుల నమ్మకం. మానసిక ఆహ్లాదానికి అనువైన క్షేత్రంగానూ దీనికి పేరున్నది.

అతి ప్రాచీనమైంది: 
పరమ శివుడు స్వయంగా వెలసిన సంగమేశ్వరాలయం అతి ప్రాచీనమైంది. మంజీరా దక్షిణ దిశగా ప్రవహిస్తూ పుష్కరస్నానాలకు అనువుగా ఉన్నది. భక్తుల సహకారంతో ఆలయాన్ని అభివృద్ధి చేశాం. దాతలుగానీ, ప్రభుత్వంగానీ సహకారం అందిస్తే మరింత అభివృద్ధి చేయవచ్చు. 
స్వామి శంభు ప్రసాద్, అర్చకుడు

విశిష్టతను కాపాడాలి: 
ప్రకృతి రమణీయత, ఎటు చూసినా ఆహ్లాదకర పరిస్థితులు, పవిత్ర మంజీరా నది ఒడ్డున ఉండటంతో ఈ ఆలయం విశిష్టత సంచరించుకున్నది. దీనిని భక్తులు దక్షిణ కాశిగా భావిస్తుంటారు. ఈ ఆలయ విశిష్టతను కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది.
ఆర్య బాబూరావు, కార్య నిర్వాహకులు

తనదైన త్యాగం | త్యాగనిరతి తనదైన త్యాగం | త్యాగనిరతి|తనదైన త్యాగం | త్యాగనిరతి GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu

తనదైన త్యాగం | త్యాగనిరతి తనదైన త్యాగం | త్యాగనిరతి|తనదైన త్యాగం | త్యాగనిరతి GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu

     చేసేపనేదైనా స్వచ్ఛంగా చేయాలనీ, ఇష్టంగా చేయాలనీ, సాయం అయినా త్యాగం అయినా సంపూర్ణంగా చేస్తేనే అర్థం ఉంటుందనీ చెబుతున్నాయి శాస్ర్తాలు. మనం ఎదుటివారిపై చేసేదానిలో అందుకున్న వారి మాట అటుంచి కనీసం మనకైనా ఆత్మతృప్తి కలుగకపోతే చేసిన దానికి అర్థం ఉంటుందా? మనసు పెట్టి మంచి ఆలోచనలతో చేసే చిన్నపాటి త్యాగం అయినా పరిపూర్ణమై వెలుగొందుతుంది. అదే ఆర్భాటం కోసమో, పుణ్యం అంతా సంపాదించుకోవాలనో, శాస్త్ర విధి కోసమో చేసే మహత్తర త్యాగాలైనా నిరర్థకమైపోతాయి. మన మనసే మనతో ఏకీభవించనప్పుడు ప్రపంచాన్ని సమాధాన పరచాలని ఆరాటపడటం అవివేకం కాక మరేమిటి? నిజమైన, నిర్మలమైన, తనదైన త్యాగమంటే ఏంటో సుస్పష్టంగా నిరూపిస్తుందీ కథ.

తృప్తిపడిన అతిథి మీరంతా చల్లగా ఉండండని దీవిస్తాడు. కానీ ఆకలితో ఆ కుటుంబం ఆనాటి రాత్రే మరణించి పరమపదం చేరుకున్నారు. వారి చేతి నుంచి అతిథికి వడ్డించేటప్పుడు కింద పడిన కొద్దిపాటి ఆహారపు తునకలపైన నేను పొర్లడం మూలంగా నా శరీరం సగం బంగారంగా మారింది. అదీ అసలు త్యాగమంటే. తనదైన త్యాగంతో తృప్తి పడిన కుటుంబం గొప్పతనానికి నిలువెత్తు నిదర్శనం నా ఈ సగం శరీరం. మిగతా నా సగం శరీరాన్ని అటువంటి త్యాగనిరతి ఉన్నచోట బంగారంగా మార్చుకుందామని నేను తిరగని చోటులేదు.

ఒ కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత అధికారం చేతిలోకి తీసుకొని రాజ్యాన్ని సుభిక్షం చేసే క్రమంలో పాండవులు పేదవారందరికీ అవసరమైన వాటినీ, ధనాన్నీ, ఆహారపదార్థాలనూ చాలా భూరిగా త్యాగం చేయడం మొదలుపెట్టారు. ప్రజలంతా వారు చేస్తున్న త్యాగం గురించీ దానధర్మాల గురించి చెప్పుకోసాగారు. ప్రపంచంలో ఇంతటి త్యాగనిరతిని మునుపెన్నడూ చూడనే లేదనీ అబ్బురపడి పోతున్నారు. పాండవుల త్యాగనిరతిని చాటుతున్న వారంతా సంపూర్ణంగా తృప్తిపడినవారే. ఈ తతంగం అంతా ముగిసే సమయానికి అక్కడికి ఒక ముంగీస వచ్చింది. దాని సగం శరీరం బంగారుమయం కాగా మరో సగం మాత్రం మామూలు చర్మంతోనే ఉంది. అది అక్కడికి వచ్చీ రావడంతోనే వారు త్యాగం చేసిన ప్రదేశంలో అటునించి ఇటు, ఇటు నుంచి అటుబొర్లడం మొదలుపెట్టింది. కొన్నిసార్లు అలా చేసిన ముంగీస, మీరందరూ అబద్ధాలు చెబుతున్నారు. ఎందుకంటే ఇదసలు స్వచ్ఛమైన త్యాగం కానేకాదని అంటుంది.

పాండవులంటారు. మాకున్న అత్యంత విలువైన వస్తువులనూ, ధనాన్నీ, బంగారాన్నీ, రత్నాలనూ చాలామంది పేదవారికై త్యాగం చేశాము దాంతో వారంతా ధనవంతులై సంతోషంగా ఉన్నారు. ఇదంతా చాలా గొప్పనైన త్యాగానికి నిదర్శనంగా చేయబడిందని ముంగీస వారితో ఇలా చెప్పుకొచ్చింది.ఒకానొక చిన్న గ్రామంలో ఒక చిన్న కుటుంబం ఉంది. వారు చాలా పేదవారు. పండితునిగా తనకు తెలిసన జ్ఞానాన్ని పంచుతూ, తద్వారా వచ్చే చాలా కొంత ధనంతో ఇంటిని నడిపే వాడా ఇంటిపెద్ద. కష్టతరమైన రోజులు ఎన్నో వారి జీవితాన్ని నింపేసాయి. ఒకనాడు వారికి తినడానికి కేవలం ఒక గోబిపువ్వు మాత్రమే దొరికింది. దాంతో దాన్నే ఆహారంగా వండుకొని నాలుగు భాగాలుగా చేసుకొని తినడానికి సిద్ధపడ్డారు వారంతా. తండ్రి తనవంతు ఆహారాన్ని సరిగ్గా నోట్లో పెట్టుకొనే సమయానికి వారి ఇంటికి అతిథి ఒకరు వస్తాడు. అతను తనవంతు ఆహారాన్ని అతిథికి వడ్డించి సాదరంగా తినమని అంటాడు. అతిథి కూడా పది రోజులుగా పస్తులుండటంతో ఆరాటంతో తండ్రి వంతు ఆహారాన్ని తినేసి అయ్యా మీరు ఇది నాకు పెట్టి నిద్రపోతున్న ఆకలిని పెంచారు.

మరికాస్త పెట్టండని అడుగుతాడు. అతని భార్య తనవంతు దాన్ని కూడా వడ్డించమనీ అంటుంది. భార్యగా, గృహస్థులుగా మన కర్తవ్యం అతిథిని ఆదరించడమనీ చెబుతుంది. దాన్నీ తినేసిన అతిథి ఇంకా ఆకలిగా ఉందనడంతో కొడుకూ, కోడలూ ఒక్కొక్కరిగా తమ వంతు ఆహారాన్నీ అతిథికి వడ్డిస్తారు. తృప్తిపడిన అతిథి మీరంతా చల్లగా ఉండండని దీవిస్తాడు. కానీ ఆకలితో ఆ కుటుంబం ఆనాటి రాత్రే మరణించి పరమపదం చేరుకున్నారు. వారి చేతి నుంచి అతిథికి వడ్డించేటప్పుడు కింద పడిన కొద్దిపాటి ఆహారపు తునకలపైన నేను పొర్లడం మూలంగా నా శరీరం సగం బంగారంగా మారింది. అదీ అసలు త్యాగమంటే. తనదైన త్యాగంతో తృప్తి పడిన కుటుంబం గొప్పతనానికి నిలువెత్తు నిదర్శనం నా ఈ సగం శరీరం. మిగతా నా సగం శరీరాన్ని అటువంటి త్యాగనిరతి ఉన్నచోట బంగారంగా మార్చుకుందామని నేను తిరగని చోటులేదు. కనీసం మీ నుంచైనా అటువంటి త్యాగాన్ని ఆశించిన నేను నిరాశ చెందాను అంటుంది ముంగీస.

త్యాగమనే గొప్ప ఉద్దేశ్యం కుటుంబ వారసత్వంగా మనకు లభించాలి. అది తనదైన స్వచ్ఛమైన త్యాగమై అలరాలాలి. అంతేకానీ, ప్రాయశ్చిత్త మాత్రంగానో, విధి పూర్వకంగానో చేసేది త్యాగమనిపించుకోదు. తనదైన త్యాగానికి మనిషి సిద్ధపడితే అంతకన్నా మహద్భాగ్యం మరొకటుండదు. -ప్రమద్వర



















పితృ భక్తి | Patriotism | పితృ భక్తి పితృ భక్తి | Patriotism | Patriotism GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu


పితృ భక్తి | Patriotism | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu


వారి పితృ భక్తి చిరస్మరణీయం

తండ్రి మాటను నిలబెట్టడం కోసం రాజ్యభోగాలను విడనాడి అడవులకు వెళ్లాడు రాముడు. తండ్రి ఆజ్ఞమేరకు పరశురాముడు తల్లిని గొడ్డలితో నరికి చంపాడు. తండ్రిౖయెన యయాతి మహారాజు సుఖంకోసం యవ్వనాన్నే ధారపోశాడు కుమారుడు పూరువు. తండ్రి చెప్పిన మాట ప్రకారం పాండుపుత్రులు ఐదుగురిని వివాహమాడింది ద్రౌపది. భీష్ముడు తండ్రికోసం వివాహం చేసుకోకుండా ఆజన్మ బ్రహ్మచారిగా మిగిలిపోయాడు.

కేవలం తండ్రికి వచ్చిన స్వప్నాన్నే దైవాజ్ఞగా భావించి, తండ్రిమాటనునెరవేర్చడం కోసం బలి అవ్వడానికి సిద్ధపడ్డాడు ఇస్మాయీల్‌ ప్రవక్త. తండ్రి మాట మేరకు పాపభారాన్ని మోసేందుకు పరలోక భోగాలను వదులుకుని భూలోకం వచ్చిన జీసస్‌ శిలువ మరణం చెందాడు. నచికేతుడు తండ్రి మాటప్రకారం ఏకంగా యమలోకమే వెళ్లాడు. పితృదినోత్సవం సందర్భంగా వీరందరి త్యాగాలను స్మరించుకుందాం. నాన్న మాటను నిలబెడదాం!

వాజశ్రవమనే యజ్ఞం చేసిన వాజశ్రవుడు సర్వసంపదలనూ దానం చేశాడు. ఇక దానం చేయడానికి ఏమీ మిగలక పోవడంతో నచికేతుడు ‘‘తండ్రీ! నన్నెవరికి దానం ఇస్తావు?’’ అని పదే పదే అడుగుతుండడంతో చిరాకుతో ‘నిన్ను యముడికి దానం చేశాను ఫో’’అంటాడు. ఆ మాటకు కట్టుబబడ్డ నచికేతు యమలోకం వెళ్లాడు. ఆ సమయానికి యముడు అక్కడ లేకపోయేసరికి మూడురోజుల పాటు వేచి ఉన్నాడు.

యముడు రాగానే జరిగినదంతా తెలుసుకుని ముక్కుపచ్చలారని ఆ బాలుని పట్టుదలకు ముచ్చట పడి మూడు వరాలు కోరుకోమన్నాడు. మొదటి రెండూ లౌకికమైనవే కోరుకున్నప్పటికీ మూడవది మాత్రం జనన మరణ రహస్యాలను వివరించమని పట్టుబట్టడంతో కాదనలేక యముడు ఆ బాలునికి బ్రహ్మజ్ఞానోపదేశం చేశాడు. జరిగింది తెలుసుకుని తండ్రి అమితాశ్చర్యానందాలకు లోనై, దానిని గ్రంథస్థం చేయమని ఆదేశిస్తాడు. తండ్రి చెప్పిన మాటలను తు.చ తప్పకుండా ఆచరిస్తాడు నచికేతుడు. అదే అనంతరకాలంలో కఠోపనిషత్తుగా, నచికేతోపనిషత్తుగా పేరుగాంచింది.

పరశురాముడు: జమదగ్ని, రేణుకల కుమారుడు పరశురాముడు. జమదగ్నికి ఒకసారి భార్యమీద అపరిమితమైన కోపంవచ్చి, కుమారులను ఒక్కొక్కరుగా పిలిచి తల్లిని వధించమని ఆజ్ఞాపిస్తాడు. ప్రతి ఒక్కరూ అందుకు నిరాకరిస్తారు. దాంతో వారిని తన తపోమహిమతో భస్మీపటలం చేస్తాడు.

చివరిగా పరశురాముని వంతు వస్తుంది. పరశురాముడు పితృవాక్పాలన కోసం గొడ్డలి తీసుకుని తల్లిని వధిస్తాడు. జమదగ్ని మిక్కిలి సంతోషించి వరం కోరుకోమంటాడు. అప్పుడు పరశురాముడు తల్లిని, అన్నలను బతికించమని, కోపాన్ని విడనాడమని కోరడంతో జమదగ్ని పరశురాముని పితృభక్తిని, తెలివితేటలను మెచ్చుకుని, వారందరినీ బతికిస్తాడు.

శ్రవణ కుమారుడు: ఇతడు ఒక మునిబాలుడు. తల్లిదండ్రులు పుట్టుగుడ్డివారు. వయోభారంతో నడవలేని పరిస్థితులలో ఉన్నవారిని శ్రవణకుమారుడు తాను ఎక్కడికి వెళ్లినా కావడిలో కూర్చోబెట్టుకుని మోస్తూ తీసుకు వెళ్లేవాడు. ఓ రోజు తండ్రికి బాగా దాహం కావడంతో సొరకాయ బుర్ర తీసుకుని సమీపంలోని కొలనులోకి వెళ్లి, నీళ్లు ముంచుతుండగా, బుడబుడమని శబ్దం వస్తుంది.

అదేసమయంలో వేటకై వచ్చిన దశరథుడు ఆ శబ్దం విని ఏనుగు స్నానం చేస్తోందనుకుని శబ్దం వచ్చిన దిక్కుగా బాణం వదులుతాడు. ఆ బాణం దెబ్బతగిలిన శ్రవణకుమారుడు విలవిలలాడుతూ మరణిస్తాడు. ఆఖరి కోరికగా దశరథునితో దాహంతో అలమటించి పోతున్న నా తల్లిదండ్రులకు నీళ్లిచ్చి వారి దప్పిక తీర్చవలసిందిగా కోరి కన్నుమూస్తాడు. ఆ విధంగా ఆఖరి క్షణాల వరకు తల్లిదండ్రులకోసమే గడిపి పితౄణం తీర్చుకున్నాడు శ్రవణకుమారుడు.

ద్రౌపది: యజ్ఞకుండం నుంచి ఉద్భవించి, ఐదుగురు పురుషులను వివాహమాడి, స్వతంత్ర భావాలు కలిగి పతివ్రతగా ప్రసిద్ధి చెందింది ద్రౌపది. మత్స్యయంత్రాన్ని పడగొట్టిన వారికి తన కుమార్తెనిచ్చి వివాహం చేస్తానని ద్రౌపదీ స్వయంవరం ప్రకటించాడు తండ్రి ద్రుపదుడు. అర్జునుడు మత్స్యయంత్రాన్ని పడగొట్టాడు.

ప్రకటన ప్రకారం ద్రౌపది అర్జునుని వివాహమాడితే సరిపోతుంది. కాని ద్రుపదుడు పాండవులయిదుగురినీ వివాహం చేసుకోమని ఆజ్ఞాపించాడు. తండ్రిమాటను జవదాటలేదు, అయిదుగురిని ఎందుకు వివాహం చేసుకోవాలని ప్రశ్నించలేదు ద్రౌపది. తండ్రి ఏది నిశ్చయించినా అది తన మంచికేనని మనసులో అనుకుంది. పాండవులను వివాహం చేసుకుని పంచభర్తృక అయ్యింది. కన్నతండ్రి ఋణం ఆ విధంగా తీర్చుకుంది ద్రౌపది.

రాముడు: పితృవాక్పాలనకు మారుపేరు శ్రీరామచంద్రుడు. తండ్రి మాట కోసం సర్వసౌఖ్యాలను విడిచి నార వస్త్రాలతో అడవులకు వెళ్లిన ఆదర్శమూర్తి. దశర థుని పెద్ద కుమారునిగా జన్మించిన రామునికి యుక్తవయసు రాగానే యువరాజ పట్టాభిషేకం నిర్ణయించాడు దశరథుడు. ఆ విషయాన్ని ముద్దుల భార్య కైకకు చెప్పడం కోసం ఆమె మందిరానికి వెళ్లాడు.

అప్పటికే మంధరమాటలతో విషంతో నిండిపోయిన కైక తన దగ్గరకు వచ్చిన దశరథుని – రాముడు పద్నాలుగేళ్లు వనవాసం చేయాలని, భరతునికి పట్టాభిషేకం చేయాలని కోరింది. ఆడినమాట తప్పని దశరథుడు కైక వరాలను నెరవేర్చవలసి వచ్చింది. తండ్రి మాటను నిలబెట్టడం కోసం రాముడు అడవులకి వెళ్లి పితృవాక్పాలనకు మారుపేరుగా, ఆదర్శపురుషునిగా, చరిత్రలో చిరస్థాయిగానిలబడిపోయాడు. అందరికీ ఆరాధ్యుడయ్యాడు.

పూరువు: తండ్రి వార్థక్యాన్ని తాను తీసుకుని, తన యవ్వనాన్ని తండ్రికి ధారపోసిన తనయుడు పూరువు. ఈయన యయాతి, శర్మిష్ఠల మానసపుత్రుడు. యయాతి చక్రవర్తినహుషుడి కుమారుడు. పాండవుల పూర్వికులలో ఒకడు. సర్వ శాస్త్రాలను చదివి అనేక పుణ్యకార్యక్రమాలు చేపడుతూ, పితృదేవతలను పూజిస్తూ, యయాతి ప్రజలను జనరంజకంగా పరిపాలిస్తున్నాడు.

అయితే ఒకసారి అనుకోకుండా మామగారైన శుక్రాచార్యుని శాపం కారణంగా యయాతి వయసు మీరక ముందే ముసలివాడైపోతాడు. అయినప్పటికీ ఐహిక సుఖాలపై మమకారం వీడక, భౌతికమైన కోరికలతో బాధపడుతుంటాడు. భోగలాలసత్వం ఇంకా ఎక్కువగా ఉండటంతో కుమారులలో ఎవరైనా తన ముసలితనాన్ని తీసుకుని యవ్వనాన్ని ప్రసాదించమని అర్థిస్తాడు. ఇద్దరు కుమారులు అంగీకరించరు.

శర్మిష్ఠ కుమారుడైన పూరువు మాత్రమే తండ్రి కోరికను మన్నించి తన యవ్వనాన్ని ఇవ్వడానికి అంగీకరిస్తాడు. యయాతి పూరుని యవ్వనాన్ని స్వీకరించి, మరికొంతకాలం సుఖాలను అనుభవించి, పూరుని రాజ్యాభిషిక్తుణ్నిచేశాడు. తండ్రి ఆనందం కోసం పూరుడు చేసిన త్యాగం చరిత్రలో చిరస్థాయిగా నిలబడిపోయింది.

భీష్ముడు: తండ్రికోసం తాను వివాహం చేసుకోకుండా ఆజన్మ బ్రహ్మచారిగా ఉండిపోతానని భీషణ ప్రతిన చేసి, కురుపాండవులను కన్నతండ్రిలా పెంచి, విద్యాబుద్ధులు నేర్పి జీవితాన్ని త్యాగం చేసిన వాడు దేవవ్రతుడు. శంతనుడికి, గంగాదేవికి పుట్టినవాడు దేవవ్రతుడు. ఓ సాయంసంధ్యలో శంతనుడు యమునా తీరాన విహరిస్తూ సుందరాకారంలో ఉన్న ఒక స్త్రీని చూసి ఆమె లావణ్యానికి ఆకర్షితుడయ్యాడు. ఆమె పేరు సత్యవతి. ఆమె పడవ నడిపే దాసరాజ కుమార్తె. ఆమెను శంతనునికి ఇవ్వడానికి దాసరాజు ఒక షరతు విధించాడు. అదేమంటే సత్యవతికి కలగబోయే కుమారునికే రాజ్యాభిషేకం చేయాలని.

పెద్దకుమారుని విడిచి అన్యులకు రాజ్యాభిషేకం చేయడం శంతనునికి మనస్కరించలేదు, అదే సమయంలో సత్యవతి మీద వ్యామోహమూ తగ్గలేదు. తండ్రి విచారానికి ఉన్న కారణం తెలుసుకున్న భీష్ముడు దాసరాజుఇంటికి వెళ్లి, సత్యవతికి కలగబోయే కుమారునికే రాజ్యాభిషేకం చేస్తామని మాట ఇచ్చాడు. దాసరాజుకు ఇంకా నమ్మకం కలిగించడం కోసం తాను బ్రహ్మచారిగా ఉండిపోతానని భీష్మ ప్రతిజ్ఞ చేశాడు. నాటి నుంచి భీష్ముడయ్యాడు. సర్వసుఖాలు, రాజ్యభోగాలు అనుభవించే అర్హత ఉండి కూడా భీష్ముడు తండ్రి కోసం చేసిన త్యాగం చిరస్మరణీయం.

– భాస్కర్, జయంతి

తలనీలాలు సమర్పించే దర్గా! | jahangir peer dargah | Mohanpublications | Granthanidhi | Bhaktipustakalu


తలనీలాలు సమర్పించే దర్గా! | jahangir peer dargah | Mohanpublications | Granthanidhi | Bhaktipustakalu

తలనీలాలు సమర్పించే దర్గా!
 Jahangir Peer Dargah


     సాధారణంగా ఏ గుడికో, ఉత్సవానికో వెళ్లినప్పుడు దేవుడికి తలనీలాలు సమర్పించడం ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయితీ. కానీ, ఒక దర్గాలో తలనీలాలు ఇస్తారని ఎప్పుడైనా విన్నారా..! ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న జహంగీర్‌పీర్‌ (జేపీ) దర్గా విశిష్టత ఇది. వందల ఏళ్ల చరిత్ర ఉన్న ఈ దర్గాను కేవలం ముస్లింలే కాకుండా అధిక సంఖ్యలో హిందువులూ దర్శించుకోవడం విశేషం.హైదరాబాద్‌ అనగానే చార్మినార్‌ ఎలా గుర్తుకువస్తుందో దాని పక్కనే ఉన్న చారిత్రక మక్కా మసీదు కూడా అలానే జ్ఞప్తికి వస్తుంది. అయితే, మక్కా మసీదు తర్వాత తెలంగాణ రాష్ట్రంలో అంతే చారిత్రక నేపథ్యం ఉన్న మరో ప్రదేశం జహంగీర్‌ పీర్‌ దర్గా. దీని ఏర్పాటు వెనక వేర్వేరు కథనాలు ప్రచారంలో ఉన్నా... సుమారు ఏడు వందల ఏళ్ల కిందట జరిగిన ఘటనను ప్రముఖంగా చెబుతుంటారు వక్ఫ్‌బోర్డు అధికారులూ, చరిత్రకారులూ. బాగ్దాద్‌కు చెందిన హజ్రత్‌ సయ్యద్‌ షా జహంగీర్‌ పీర్‌ బాబా, హజ్రత్‌ సయ్యద్‌ షా బుర్హనుద్దీన్‌ అవులియా బాబా సోదరులు మహ్మద్‌ ప్రవక్త బోధనలు మానవాళికి వివరించేందుకు ఆయన ప్రతినిధులుగా దిల్లీకి వచ్చారు. వీరిద్దరూ ప్రవక్త వంశస్థులని భక్తుల నమ్మకం. దిల్లీ నుంచి అజ్‌మేర్‌, ఔరంగాబాద్‌ మీదుగా గుల్బర్గా... అక్కడి నుంచి కొత్తూరు ప్రాంతానికి వస్తారు ఆ బాబా సోదరులు. అప్పట్లో ఈ ప్రాంతమంతా దట్టమైన అటవీ ప్రాంతంగా ఉండేదట. వీరు ఇక్కడే ఓ మర్రిచెట్టు కింద ఉంటూ జీవసమాధి అయ్యారు. తర్వాత కొన్నాళ్లకు గొర్రెల మందను మేపుతూ వచ్చిన ఒక కాపరి దారి తప్పిపోతాడు. ఎంత వెతికినా వాటి ఆచూకీ దొరకక పోవడంతో ఒక మర్రిచెట్టు కింద బాధపడుతూ కూర్చుంటాడు. అప్పుడు బాబాలు ప్రత్యక్షమై, అక్కడికి దగ్గర్లోనే గొర్రెలు ఉన్నాయని చెబుతారు. గొర్రెల మందను తోలుకుని తిరిగి చెట్టు కిందకు వచ్చేసరికి బాబాలకు బదులు రెండు సమాధులు దర్శనమిస్తాయి. వారే తనకు ప్రత్యక్షమై గొర్రెల జాడ తెలిపారని భావించిన ఆ కాపరి అప్పటి నుంచీ వాళ్లను పూజించడం మొదలుపెట్టాడట. ఆ తర్వాత కులమతాలకు అతీతంగా స్థానికులు కూడా ఈ బాబాసమాధులను కొలవడం ప్రారంభించారు.సంతానం కోసం... 

దర్గాకు తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక నుంచి ప్రతి గురు, ఆదివారాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. సంతానం కోసం ఇక్కడ మొక్కుకుంటే పిల్లలు కలుగుతారని ప్రతీతి. భక్తులు తమ కోర్కెలు నెరవేరిన తర్వాత కుటుంబ సమేతంగా వచ్చి కుందూరు చేసి మొక్కులు తీర్చుకుంటారు. చిన్నపిల్లల తలనీలాలు తప్పక సమర్పిస్తారు. ఆనవాయితీ ప్రకారం ఇక్కడ క్షురకులుగా ఆడవాళ్లే ఉండటం విశేషం. ప్రతి రోజూ ఉదయం ఆరు గంటలకు ఫజర్‌ నమాజ్‌తో దర్గాలో ప్రార్థనలు ప్రారంభమవుతాయి. రాత్రి తొమ్మిది గంటలకు జరిగే ఇషా నమాజ్‌తో ముగుస్తాయి. బాబాలకు కుందూరుతోపాటు గోధుమ రొట్టెలను ప్రత్యేకంగా నైవేద్యంగా పెడుతుంటారు. హిందూ దేవాలయాల్లో మాదిరిగానే లడ్డూని కూడా ప్రసాదంగా ఇస్తారు. ఈ దర్గాకు ఉన్న చారిత్రక నేపథ్యం దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం ఏడో తరగతిలోని సాంఘిక శాస్త్రంలో ఓ పాఠ్యాంశంగా దీన్ని చేర్చింది.ఉర్సు ఉత్సవాలు 

ఏటా ఉర్సు ఉత్సవాలను ఇక్కడ అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. సంక్రాంతి తర్వాత వచ్చే గురువారం నుంచీ ఉర్సు ఉత్సవాలు మొదలవుతాయి. ఇవి మూడు రోజులపాటు కొనసాగుతాయి. మొదటి రోజున గంధం ఉత్సవం జరుగుతుంది. ఇందులో భక్తులు పెద్ద మొత్తంలో ఊరేగింపుగా తీసుకువచ్చిన గంధాన్ని బాబాల సమాధులకు అలంకరిస్తారు. మరుసటి రోజు దర్గాలోని అణువణువునూ కొవ్వొత్తుల వెలుగుతో నింపేస్తారు. మూడోదీ ఎంతో కీలకమైందీ కవ్వాలీ ఉత్సవం. ఈ కార్యక్రమంలో దేశంలోని నలుమూలల నుంచీ వచ్చిన భక్తులు ఇరవై నాలుగు గంటలపాటు భజనలు చేస్తారు. దీంతో ఉత్సవాలు ముగుస్తాయి. ఉర్సు ఉత్సవాల్లో ముస్లింలతోపాటు పెద్ద సంఖ్యలో హిందువులు కూడా పాల్గొంటారు.ఎలా వెళ్లాలి..! 
హైదరాబాద్‌కు 45 కిలోమీటర్ల దూరంలో జహంగీర్‌పీర్‌ దర్గా ఉంది. ఇక్కడ ప్రతి గురువారం, ఆదివారం భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. దీంతో హైదరాబాద్‌లోని చార్మినార్‌, అఫ్జల్‌గంజ్‌, సీబీఎస్‌ నుంచి ఆర్టీసీ ప్రత్యేకంగా బస్సులు నడుపుతోంది.
- అమరేంద్ర యార్లగడ్డ, ఈనాడు, హైదరాబాద్‌ 











పంచ శౌచాలు | PanchaSowchalu | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktibooks


పంచ శౌచాలు | PanchaSowchalu | makarandam antaryami eenadu GRANTHANIDHI | MOHANPUBLICATIONS |  MAKARANDAM ANTARYAMI bhaktibooks

తనువు శుభ్రం మనసు భద్రం


శుచి, శుభ్రత భౌతిక ప్రయోజనాల కోసమేనా?అది కేవలం శారీరక సంబంధమైన విషయమా? నిజానికి శుభ్రత ఒక ధర్మం. అది ఆడంబరం కాదు. ఆచారం అంతకన్నా కాదు. అదో అనంతమైన విజ్ఞానం. మనిషి నడతను తీర్చిదిద్దే సంస్కారం.శుభ్రత బాహ్యం, ఆంతరంగికం అని రెండు రకాలుగా ఉంటుంది. నిత్యం చేసే స్నానం బాహ్యశౌచాన్ని కలిగిస్తుంది. మనసులో ఉండే అజ్ఞానాన్ని సాధన ద్వారా దూరం చేసుకోవడం ఆంతరంగిక శౌచం అవుతుంది. బాహ్యశౌచం కన్నా మానసిక శౌచం చాలా అవసరం. మనస్సు స్వచ్ఛంగా (శుచిగా) లేకపోతే, బాహ్యశౌచం ఏవిధమైన ఫలితాన్ని ఇవ్వదు.


- జగద్గురు ఆది శంకరాచార్య

పంచ శౌచాలు 

శాస్త్రగ్రంథాలు శౌచం (శుభ్రత) ఐదు రకాలుగా ఉంటుందని చెబుతున్నాయి. 
మనశ్శౌచం 
మనసులో రాగద్వేషాలకు తావు లేకుండా ఉండడం 
కర్మశౌచం 
కపటం లేకుండా, ధర్మాన్ని పాటిస్తూ నిత్యవిధులను నిష్కామంగా చేస్తూ జీవించడం 

కులశౌచం 

నీచమైన పనులకు దిగజారకుండా, సదాచారాన్ని పాటిస్తూ స్థిరంగా ఉండడం 

శరీరశౌచం 

స్నానం తదితర క్రియల ద్వారా శరీరాన్ని శుభ్రంగా ఉంచడం 

వాక్‌శౌచం 

అనుక్షణం సత్యాన్ని మాత్రమే పలకడం 


పరిశుభ్రమైన మనస్సు, శరీరం అద్భుతాలను చేస్తాయి. ఆ విషయాన్ని గుర్తించిన సనాతన భారతీయ సంప్రదాయం శౌచం లేదా శుభ్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ వచ్చింది. అసూయ, ఆందోళన, అనుమానం, అసహనం, ఈర్ష్య, ద్వేషం, కోపం మొదలైన అవగుణాలు లేని మనస్సు ఎంతో స్వచ్ఛంగా, నిర్మలంగా ఉంటుంది. దీన్నే మానసిక శౌచం అంటారు. స్వచ్ఛమైన మనస్సుతో చేసే పూజ, ధ్యానం, తపం ఎంత చిన్నవైనా అనంతమైన ప్రభావాన్ని కలిగిస్తాయి. అందుకే మహాయోగి వేమన ‘చిత్తశుద్ధి లేని శివపూజలేలరా?’ అంటారు. అలాగే మలినాలేవీ శరీరానికి అంటకుండా ఉండేలా స్నానాది విధులు చెయ్యటాన్ని బాహ్య శౌచం అంటారు. ఈ భౌతికమైన శుభ్రత మానసిక ఉన్నతికి పునాదిగా నిలుస్తుంది. శారీరకంగా, ఆంతరంగికంగా.. పరిశుభ్రత మనిషికి ఏకాగ్రతనిస్తుంది..లక్ష్యసాధన వైపు నడిపిస్తుంది 


అపవిత్రః పవిత్రోవా సర్వావస్థాంగతోపి వా 
యస్మరేత్పుండరీకాక్షం సబాహ్యాభ్యంతశ్శుచిః 


నిత్యవిధుల్లో పూజా కార్యక్రమాలన్నీ ఈ శ్లోక పఠనంతోనే ప్రారంభమవుతాయి. భగవంతుడి అనుగ్రహం పొందాలంటే బాహ్య, అంతరంగ శౌచాలు తప్పనిసరి... పుండరీకాక్షుడి స్మరణం వల్ల శుచిత్వం వస్తుందని చెబుతుందీ శ్లోకం. 


బలం, ఆయుష్షు, ఆరోగ్యం, సంతోషం, ఆరోగ్యవంతమైన మనస్సు... ఇవన్నీ శుభ్రత వల్లనే లభిస్తాయని శాస్త్రాలు ఘంటాపథంగా చెబుతున్నాయి. శుభ్రత లేని చోట పరమాత్మ ఉండడు. స్నానం చేసి, పరిశుభ్రమైన వస్త్రాలు ధరించి ప్రార్థన లేదా ధ్యానం ప్రారంభించాలి. ఇది ఆధ్యాత్మిక సాధనలో తొలిమెట్టు. శాస్త్ర గ్రంథాలు కూడా ‘శుచిత్వం మాతృరూపేణ’ అంటాయి. శుచిత్వం మనకు తల్లివంటిది. తల్లి ఏవిధంగా బిడ్డకు సదా రక్షగా ఉంటుందో, శౌచం కూడా అలాగే, మనల్ని రక్షిస్తుందని భావం. 


వేదాలు, ఉపనిషత్తులు కూడా ఈ అంశానికి ఎంతో ప్రాధాన్యతనిచ్చాయి. రుగ్వేదంలో అనేక చోట్ల శుభ్రతను గురించి ప్రస్తావన వస్తుంది. స్కందోపనిషత్తు ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండడమే శుచిత్వమని చెబుతుంది. ఎప్పుడైతే ఇంద్రియ నిగ్రహం కలిగిఉంటామో, అప్పుడు మనస్సు ధర్మమార్గాన్ని విడిచిపెట్టదు. భగవద్గీతలో చెప్పిన ఆంతరంగిక శౌచం ఇదే. 


శ్రీకృష్ణభగవానుడు భగవద్గీతలో అనేక చోట్ల శుచిగా ఉండాల్సిన అవసరం గురించి చెబుతాడు. క్షేత్రక్షేత్రజ్ఞ విభాగయోగంలో ‘శుచిత్వమే జ్ఞానం’ అని వివరిస్తాడు.. శుభ్రత అది దేవతల లక్షణాల్లో ఒకటని అంటాడు. ఇదే విషయాన్ని రూఢి పరుస్తూ దైవాసుర సంపద్విభాగయోగంలో శుచిగా ఉండని వారికి రాక్షస ప్రవృత్తి ఉంటుందని చెబుతారు. శారీరకంగా శుభ్రంగా ఉండకపోవడం వల్ల మంచి ఆలోచనలు చేయలేరు. మంచి ఆలోచనలు చేసే మనసు ధర్మాన్ని విడిచిపెట్టదు. అంతిమంగా మనిషి భగవంతుడి అనుగ్రహాన్ని పొందుతాడు. నిజానికి శుభ్రత శారీరక తపస్సులో ఒక భాగం.స్వామి వివేకానంద ‘ఎ సౌండ్‌ మైండ్‌ ఇన్‌ ఎ సౌండ్‌ బాడీ’ - ఆరోగ్యవంతమైన శరీరంలో ఆరోగ్యవంతమైన మనస్సు ఉంటుందని చెప్పారు. శ్రీనాథమహాకవి కూడా తన చాటువుల్లో ఓ చోట ‘అంగడి యూర లేదు వరి యన్నము లేదు శుచిత్వ మేమి లేదు....’ అంటూ వాపోతాడు. ఇక మరెప్పుడూ అలాంటి ప్రదేశాలకు రానంటాడు. శుభ్రత లేనిచోట పెద్దలు, పండితులు ఉండరు అనటానికి శ్రీనాథుడి వృత్తాంతమే ఉదాహరణ.ఆంగ్లంలో ‘క్లీన్లీనెస్‌ ఈజ్‌ నెక్ట్స్‌టు గాడ్‌’ - దైవం తర్వాత రెండో స్థానం పరిశుభ్రతదే అనే సామెత ఉంది. హైందవ సంప్రదాయాలతో పాటు పాశ్చాత్య సంప్రదాయంలోనూ శుభ్రతకు దైవంతో సమానమైన ప్రాధాన్యత ఉందనే విషయం ఈ సామెత ద్వారా తెలుస్తుంది. 

శుచిత్వం మనకు జీవనవిధానం కావాలి. పరమాత్మ దర్శనానికి సోపానం కావాలి. 

‘శ్రీసూక్తం’లో లక్ష్మీదేవి నివాస స్థానాలేమిటో వివరించే మంత్రాలు ఉన్నాయి. వీటిలోని 16వ మంత్రం... యః శుచిః ప్రయతో భూత్వా జుహుయాదాజ్యమన్వహం శ్రియః పంచదశశ్చంచ శ్రీకామస్సతతం జపేత్‌లక్ష్మీదేవి అనుగ్రహం కావాలంటే శుభ్రత పాటిస్తూ, ఆ దేవి 15 మంత్రాలను నిత్యం పారాయణం చెయ్యాలని భావం. ఎక్కడ శుచిత్వం ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుందని ఈ మంత్రం ద్వారా తెలుస్తోంది. లక్ష్మి అంటే లౌకిక వ్యవహారాల్లో ఉపయోగించే ధనం మాత్రమే కాదు. ఆరోగ్యం కూడా ధనమే. అందుకే మన పెద్దలు ‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అన్నారు. శుభ్రత, శాంతి ఉన్న చోట అనారోగ్యం దరిచేరదు. అంతకుమించిన భాగ్యం మరొకటి ఉంటుందా?

శుభ్రత ప్రాధాన్యాన్ని వివరించే పలు పురాణ కథలూ ఉన్నాయి. కశ్యప ప్రజాపతికి దితి, అదితి ఇద్దరు భార్యలు. దితి కుమారులు దైత్యులు - అంటే రాక్షసులు. అదితి కుమారులు ఆదిత్యులు - అంటే దేవతలు. వారిద్దరి వైరం గురించి తెలిసిందే. దేవతల చేతిలో రాక్షసులు చనిపోవడాన్ని చూసి తట్టుకోలేని దితి, ఇంద్రుడి సంహరించే శక్తి కలిగిన కుమారుడు తనకు జన్మించాలని భర్త అయిన కశ్యపుడిని కోరుతుంది. ఆయన ‘సరే’ అని వరమిస్తాడు. కానీ, ప్రసవం అయ్యేవరకు శుభ్రతను అన్నివేళలా పాటించితీరాలని, లేకపోతే గర్భం భిన్నమవుతుందని నియమం పెడతాడు. దితి అంగీకరిస్తుంది. శుభముహూర్తంలో దితి గర్భం దాలుస్తుంది. విషయం తెలుసుకున్న ఇంద్రుడు పినతల్లి అయిన దితి దగ్గరకు వచ్చి మంచి మాటలు చెప్పి, ఆమెకు సేవ చేసే అవకాశం ఇవ్వమని అడుగుతాడు. ఆమె అంగీకరిస్తుంది. ఒకరోజు సాయం సంధ్యా సమయంలో పొరపాటున దితి కాళ్లు చేతులు కడుక్కోకుండానే పడకగదిలోకి వెళ్లి నిద్రలోకి జారుకుంటుంది. దితికి నియమభంగం కాగానే, ఇంద్రుడు అణురూపంలో ఆమె గర్భంలోకి ప్రవేశించి, శిశువును నరకడం ప్రారంభిస్తాడు. వెంటనే దితికి మెలకువ వస్తుంది. తన బిడ్డను వధించవద్దని, తన బిడ్డ దేవతలకు అనుకూలంగా ఉంటాడని ఇంద్రుడిని వేడుకుంటుంది. అతడు అంగీకరించి, బయటకు వచ్చి, తన వల్ల ముక్కలైన శిశువు మరణించకుండా, ఎన్ని ముక్కలైందో అందరు పుత్రులు పుడతారని చెబుతాడు. అలా ఏర్పడ్డ శిశువులే దేవతాగణాల్లో ఒకటైన ‘మరుద్గణం’. ఈ వృత్తాంతం జరిగనప్పటి నుంచి ‘సంధ్యాసమయంలో తప్పనిసరిగా శుచిగా ఉండాలని, నిద్రించకూడదనే’ ఆచారం వాడుకలోకి వచ్చింది. 


బుద్ధభగవానుడు ‘బాహ్య పరిశుభ్రతతో పాటు మనసులోని క్లేశాలు తొలగించుకుని, మనోశుభ్రతను కూడా పాటించాలని’ బోధించేవాడు. ఇందుకోసం ‘విమల కీర్తి నిర్దేశక సూత్రాల’ను ప్రతిపాదించాడు. మనసుకు అంటిన మాలిన్యాలు (రాగద్వేషాలు మొదలైనవి) పోగొట్టుకోవటానికి ప్రతి ఒక్కరూ ‘షట్‌ పారమితులు’, ‘పంచశీల’ పాటించాలని బౌద్ధధర్మం చెబుతోంది. ఈ ప్రక్రియలో ఉపాసకుడు ఆచరించాల్సిన ‘ద్వాదశ నీవరణాలను’ కూడా బౌద్ధం వివరిస్తుంది. ప్రత్యేకించి ‘శౌచవ్రతాని’కి బౌద్ధం ఎనలేని ప్రాధాన్యత ఇస్తుంది.


‘హృదయ శుద్ధి గలవారు ధన్యులు. వారు దేవుని చూచెదరు’ (మత్తయి 5:8) అంటూ ప్రభువు నిష్కల్మషమైన మనస్సుకు ప్రాధాన్యతనిచ్చారు.. మనిషి మనసులో కలిగే ఆలోచనే అతని నడవడికను నిర్దేశిస్తుంది. మనోశుద్ధితో కూడిన బాహ్యశుద్ధి మాత్రమే దేవుడి వద్దకు దారి చూపిస్తుందని క్రైస్తవ ధర్మం కూడా శుచిత్వానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చింది. 

- డా. కప్పగంతు రామకృష్ణ
పంచ శౌచాలు | PanchaSowchalu | makarandam antaryami eenadu GRANTHANIDHI | MOHANPUBLICATIONS |  MAKARANDAM ANTARYAMI bhaktibooks


అధికమాసం జ్యేష్ఠ మాసం | Adikamasam | అధికమాసం జ్యేష్ఠ మాసం | Adikamasam | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu

అధికమాసం జ్యేష్ఠ మాసం | Adikamasam |  GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu
















అధిక ఫలితాల అద్భుత కాలం

విళంబి నామ సంవత్సరం ప్రత్యేమైనది. ఈ ఏడాది అధిక మాసం రావడమే అందుకు కారణం. జ్యేష్ఠ మాసం అధికంగా వచ్చింది. అధిక మాసం.. నిజమాసం కన్నా ముందుగా వస్తుంది. ‘అధికస్య అధికం ఫలం’ అంటారు. అంటే అధికమాసంలో చేసే ఆధ్యాత్మిక సాధన, దానధర్మాలు మంచి ఫలితాన్నిస్తాయంటారు.అధికమాసం ప్రస్తావన మహాభారతంలో కనిపిస్తుంది. విరాటపర్వంలో భీష్ముడి నోట అధికమాసాన్ని గురించి వివరించారు వ్యాస మహర్షి. ఉత్తరగోగ్రహణం సందర్భంగా అర్జునుడు.. బృహన్నల రూపంలో కురుసేనలను సమీపించాడు. అర్జునుడిని గుర్తించిన కౌరవులు.. అజ్ఞాతవాసం భంగమైందనీ, పాండవులు మళ్లీ అరణ్య, అజ్ఞాతవాసాలు చేయాలని వాదించారు. అప్పుడు భీష్ముడు కల్పించుకొని.. అధికమాసాలతో లెక్కిస్తే పాండవుల అజ్ఞాతవాస సమయం ముగిసిందనీ చెబుతూ అధికమాసాలు ఎలా గుర్తించవచ్చునో కూడా తెలియజేశాడు. అమావాస్య, అమావాస్య గడువు మధ్య రవి సంక్రమణ జరగకపోతే (సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశికి మారడం) ఆ మాసాన్ని అధికమాసంగా పరిగణించాలని వివరించాడు. 

బ్రహ్మకు ప్రీతిపాత్రం: ఒక్కోమాసం ఒక్కో దేవతకు ప్రీతిపాత్రమైనదని పెద్దలు చెబుతారు. వైశాఖం, మార్గశిరం విష్ణుమూర్తికి, కార్తీకం శివుడికి ప్రీతికరమని పేర్కొంటారు. జ్యేష్ఠమాసం బ్రహ్మదేవుడికి ఇష్టమైనదిగా చెబుతారు. ఈ మాసానికి పురుషోత్తమ మాసం అని పేరు. కలియుగంలో బ్రహ్మకు అర్చనలు చేయకూడదు కదా! కానీ, ఈ మాసంలో ఇంటిలోని పూజామందిరంలో పూజలు చేయవచ్చు. బియ్యపుపిండితో గానీ, గోధుమ పిండితో గానీ బ్రహ్మదేవుని మూర్తిని సిద్ధం చేసుకొని..షోడశోపచార పూజలు చేయాలి. ఇలా అర్చించిన వారికి సకల శుభాలు కలుగుతాయని విశ్వసిస్తారు. 

గంగలో స్నానం: జ్యేష్ఠ మాసంలో కొన్ని వ్రతాలు, నోములు ఆచరించాలని పలు గ్రంథాలు సూచించాయి. ఈ మాసంలో నదీస్నానం విశేష ఫలితం ఇస్తుందని పేర్కొన్నాయి. వారణాసిలోని గంగానదిలో స్నానం చేస్తే పుణ్యప్రదమని వ్రత రత్నాకరం చెబుతోంది. ఇది సాధ్యం కాని పక్షంలో ఏదైనా నదిలో, తటాకంలో పుణ్యస్నానం ఆచరించవచ్చు. 
ముహూర్తాల్లేవ్‌:పంచాంగ గణనను అనుసరించి సుమారు రెండున్నరేళ్లకు ఒకసారి అధికమాసం వస్తుంది. అధిక మాసంలో వివాహాది శుభకార్యాలు కూడదని ధర్మశాస్త్ర గ్రంథాలు పేర్కొన్నాయి. విళంబి నామ సంవత్సరంలో జ్యేష్ఠం అధికంగా వచ్చింది. అందుకే పంచాంగకర్తలు అధిక జ్యేష్ఠమాసంలో శుభముహూర్తాలు ప్రకటించలేదు. నిజ జ్యేష్ఠ మాసంలో యధావిధిగా ముహూర్తాలు పేర్కొన్నారు. 

దాహం తీర్చాలి: అధికమాసంలో దానానికి అంత్యంత ప్రాధాన్యం ఉంది. జ్యేష్ఠమాసంతో గ్రీష్మ రుతువు ప్రారంభమవుతుంది. వేసవి తాపం హెచ్చుతుంది. కనుక ఈ మాసంలో దాహార్తులకు నీరు అందించడం ద్వారా త్రిమూర్తులకు పూజలు చేసిన ఫలితం లభిస్తుందని పెద్దల మాట. సాధారణంగా జ్యేష్ఠమాసంలో నీటితో ఉన్న కుండను దానమిచ్చే సంప్రదాయం ఒకప్పుడు ఉండేది. ధర్మం తెలిసిన పెద్దలు చలివేంద్రాలు నిర్వహించడం దానికి కొనసాగింపే!
- మల్లాప్రగఢ శ్రీమన్నారాయణమూర్తి

mohan publications price list