MohanPublications Print Books Online store clik Here Devullu.com
Showing posts with label food. Show all posts
Showing posts with label food. Show all posts

ఆల్‌బుఖరా | Alubukhara | Mohanpublications | Granthanidhi | Bhaktipustakalu

     
ఆల్‌బుఖరా | Alubukhara |  Mohanpublications | Granthanidhi | Bhaktipustakalu

ఆల్‌బుఖరా
అనేక పోషకాల ఆల్‌బుఖరా

      ఆల్‌బుఖరా పేరు వినగానే నోట్లో నీళ్లూరుతాయి. కొంచెం వగరుగా, కొంచెం తియ్యగా ఉండే ఈ పళ్లల్లో సి-విటమిన్‌ పుష్కలంగా ఉంటుంది. జ్వరం వచ్చిన వాళ్లు ఈ పండు తింటే మంచిదంటారు. అయితే పిల్లలూ పెద్దలు అందరూ ఈ సీజనల్‌ పండును ఎంచక్కా తినొచ్చు. ఆల్‌బుఖరాలో ఆరోగ్య గుణాలే కాదు సౌందర్య కారకాలు కూడా ఉన్నాయంటున్నారు పోషక నిపుణులు. అవేమిటంటే...


ఆల్‌బుఖరా | Alubukhara |  Mohanpublications | Granthanidhi | Bhaktipustakalu
ఆస్తమా, ఆర్రైటీస్‌, గుండెపోటు, క్యాన్సర్‌ నివారణకు ఇవి బాగా పనిచేస్తాయి.
ఈ పండులో యాంటాక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
జ్ఞాపకశక్తిని పెంచుతుంది.
ఈ పండులోని సోర్బిటాల్‌, ఇసోటిన్‌ కాంపౌండ్లు జీర్ణశక్తిని క్రమబద్ధీకరించడంతోపాటు మలబద్ధకాన్ని తగ్గిస్తుంది.
ఈ పండులోని సి-విటమిన్‌ వల్ల రోగనిరోధకశక్తి పెరగడమేకాకుండా, ఇన్ఫెక్షన్లు, అల్సర్లు తలెత్తవు. గుండెజబ్బులు రావు.
ఈ పళ్లు రొమ్ము, శ్వాససంబంధమైన క్యాన్సర్లను తగ్గిస్తాయి.
ఇందులోని విటమిన్‌-ఎ దంతక్షయం, నోటి కాన్సర్ల నుంచి రక్షిస్తుంది.
కొలెస్ట్రాల్‌ ప్రమాణాలను ఆరోగ్యకరంగా ఉంచుతాయి. పొటాషియం ఎక్కువగా ఉన్న ఈ పళ్లల్లోని ఫ్లూయిడ్‌ కణాలకు, శరీరానికి ఎంతో అవసరం. అంతేకాదు హార్ట్‌ రేట్‌ను, రక్తపోటును నియంత్రిస్తుంది.
మాక్యులర్‌ డీజీనరేషన్‌ నుంచి పరిరక్షిస్తాయి. రోజుకు మూడుసార్లు ఈ పండు తింటే వయసు పైబడ్డం వల్ల వచ్చే ఈ సమస్య తగ్గుతుంది. ఉదయం తినే సలాడ్స్‌లో ఈ పండు ముక్కలు వేసుకోవచ్చు.
రక్తప్రసరణను క్రమబద్ధీకరిస్తాయి. శరీరంలో ఎర్రరక్తకణాలు ఏర్పడాలంటే ఈ పళ్లు బాగా తినాలి. ఇవి రక్తహీనతను తగ్గిస్తాయి.
శరీరంలోని మలినాలను బయటకు పంపించడంతో అత్యంత సహజంగా శరీర బరువును ఈ పళ్లు తగ్గిస్తాయి.
ఈ పళ్లల్లో యాంటాక్సిడెంట్లతోపాటు పీచుపదార్థాలు కూడా ఎక్కువగా ఉంటాయి.
ఈ పండులోని సిట్రిక్‌ యాసిడ్‌ అలసటను, నొప్పులను తగ్గిస్తుంది. కాలేయం బాగా పనిచేసేట్టు చేస్తుంది.
ఈ పండులో గ్లైసెమిక్‌ పరిమాణం చాలా తక్కువగా ఉంటుంది. అందుకే మధుమేహ వ్యాధిగ్రస్థులకు ఇది ఎంతో మంచిది. శరీరంలోని బ్లడ్‌షుగర్‌ పరిమాణాన్ని తగ్గించి డయాబెటి్‌స-2ను నియంత్రిస్తుంది.
ఈ పండులోని కరిగిపోయే పీచు వల్ల కొలెస్ట్రాల్‌ తగ్గుతుంది.
ఇన్ఫెక్షన్ల వల్ల తరచూ వచ్చే జ్వరాన్ని, జలుబును నివారిస్తుంది.
ఆల్‌బుఖరా పళ్లు తినడం వల్ల ఎముకలు పటిష్టమవుతాయి. ముఖ్యంగా పోస్ట్‌ మెనోపాజల్‌ స్టేజిలో ఉన్న మహిళలు తింటే ఎముకలు దృఢంగా ఉంటాయి.
కండరాల స్వేచ్ఛా కదలికలకు మెగ్నీషియం చాలా అవసరం. ఇది ఈ పండులో పుష్కలంగా ఉంది. అంతేకాదు నరాల బాధలను తగ్గిస్తుంది.
ఈ పళ్లల్లో ఫోలిక్‌ యాసిడ్‌, కాల్షియం ఎక్కువ ప్రమాణాల్లో ఉన్నాయి. ఇవి ఫోలేట్స్‌ను ఇస్తాయి. ఈ ఫోలేట్స్‌ గర్భిణీలకు, కడుపులోని శిశువుకు ఎంతో అవసరం.
ఈ పళ్లు శరీరాన్ని డిటాక్సిఫై చేస్తాయి.
ఆల్‌బుఖరా పళ్లు తినడం వల్ల చర్మం పట్టులా తయారవుతుంది.
ఈ పళ్లు బాగా తినడం వల్ల వయసు కనపడదు. చర్మం బిగువును కోల్పోదు. చర్మంపై ముడతలు ఏర్పడవు.
ఈ పళ్లల్లో ఉన్న అధిక మోతాదులోని యాంటాక్సిడెంట్లు, యాంటి ఇన్ఫ్లమేటరీ గుణాలు జీవక్రియ, రక్త ప్రసరణలు బాగా జరిగేట్టు చూస్తాయి. ఫలితంగా చర్మం ఎలాస్టిసిటీ పెరుగుతుంది. యాక్నే, ముడతలు వంటివి చర్మం మీద ఏర్పడవు. చర్మంపై మచ్చలను తగ్గిస్తాయి కూడా.
వీటిని తినడం వల్ల చర్మం కాంతివంతంగా తయారవుతుంది.
గాయాలను వేగంగా తగ్గిస్తాయి.
ఈ సీజనల్‌ పండు తినడం వల్ల వెంట్రుకలు వేగంగా పెరుగుతాయి.
చుండ్రును పోగొడుతుంది. జుట్టు దట్టంగా పెరిగేట్టు చేస్తుంది. అంతేకాదు రకరకాల శిరోజాల సమస్యలను కూడా ఈ పళ్లు నివారిస్తాయి.
జుట్టు నల్లదనాన్ని ఈ పళ్లు పరిరక్షిస్తాయి.

బంగాళాదుంప | ఆలూ | Potato | Mohanpublications | Granthanidhi | Bhaktipustakalu


బంగాళాదుంప | ఆలూ | Potato | బంగాళాదుంప | ఆలూ | Potato |  Mohanpublications | Granthanidhi | Bhaktipustakalu Mohanpublications | Granthanidhi | Bhaktipustakalu

ఆలూ... ఎంతో మేలు

బంగాళాదుంప వేపుడు ఎదురుగా కనిపిస్తే... పక్కన ఎన్ని కూరలున్నా సరే చెయ్యి చటుక్కున దానిమీదికే వెళ్తుంది. ఇక, ఆలూ సమోసా వాసన తగిలితే చాలు, డైట్‌లూ ఉపవాసాలూ హుష్‌కాకీ అయినట్లే. అంతేనా ఆలూకుర్మా, ఆలూ మసాలా దోసె, ఫ్రెంచ్‌ ఫ్రైస్‌, చిప్స్‌... చెప్పుకుంటూపోతే ఆలుగడ్డ రుచుల చిట్టా చాంతాడంత. రుచులే కాదండోయ్‌, ఈ దుంపలోని పోషకాలూ లెక్కకుమిక్కిలి. అందుకే, వరి, గోధుమలు, మొక్కజొన్నల తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఆకలి తీర్చుతున్నవి ఆలుగడ్డలే.కొన్ని వందల ఏళ్ల కిందట... పంట సాగులో ఇప్పుడున్న మెలకువలు లేవు. దాంతో ఎక్కడికక్కడే పేదరికం తాండవించేది. జనం ఆకలితో అలమటించేవారు. అలాంటి పరిస్థితుల్లో కూడా దక్షిణ అమెరికాలోని పెరూ ప్రాంతంలో నివసించే ఇన్‌కా ఇండియన్‌ తెగవాసులకు ఆహారానికి కొరత ఉండేది కాదు. రాజ్యం సుభిక్షంగా ఉండేది. ఆ రహస్యం ఏంటో తెలుసుకోవాలి, వారి దగ్గరున్న సంపదను కొల్లగొట్టుకోవాలనే ఉద్దేశంతో స్పెయిన్‌ రాజు పెరూ మీద దండెత్తి తన వశం చేసుకున్నాడు. అప్పుడు వారికి దొరికినవే ఆలుగడ్డలు. అవును, ఇన్‌కా ఇండియన్స్‌ సంపద అదే. ఒక్క ఎకరం పొలంలో ఆలుగడ్డలు సాగుచేస్తే ఏడాది పాటు పదిమంది ఉన్న కుటుంబం ఆకలి తీరుతుంది. అంతేకాదు, పేరుకది కూరగాయే అయినా బియ్యం, గోధుమలు, మొక్కజొన్నలు, ఓట్స్‌లాంటి వాటిలో ఉండే దాదాపు అన్ని పోషకాలూ దాన్లో ఉంటాయి. వేరు వేరు కూరగాయలూ పండ్లలో ఉండే విటమిన్లూ ప్రొటీన్లు కూడా ఆలుగడ్డ సొంతం. పోషకాల లెక్కల గురించి తెలియకపోవచ్చుకానీ ఆ దుంపలు ఆకలి తీరుస్తాయనీ ఆరోగ్యంగా ఉంచుతాయనీ తెలుసుకున్న ఇన్‌కా ఇండియన్లు తరతరాలుగా వాటిమీద ఆధారపడుతూ వచ్చారు. ప్రత్యేక పద్ధతుల్లో వాటిలోని నీటిని తొలగించి దీర్ఘకాలం నిల్వ ఉండేలా చేసేవారు. దాంతో కరవు సమయాల్లోనూ వారికి ఆహార కొరత ఉండేది కాదు. అయితే, పెరూలోనూ దాని పక్కనే ఉన్న బొలీవియాలోనూ క్రీస్తుపూర్వం ఎనిమిదివేల సంవత్సరాల నుంచే బంగాళాదుంపల్ని పండిస్తున్నా మిగిలిన ప్రపంచానికి వాటి గురించి తెలీదు. స్పెయిన్‌ యుద్ధం తర్వాతే 16వ శతాబ్దంలో ఐరోపాకి అవి పరిచయం అయ్యాయి. ఆ తర్వాత మిగిలిన దేశాలకూ పాకింది ఆలుగడ్డ. ప్రస్తుతం ఆలుగడ్డల ఉత్పత్తిలో మనదేశం ప్రపంచంలోనే రెండోస్థానంలో ఉంది. ఇది చాలదూ బంగాళాదుంప భారతీయుల జీవితాల్లో ఎంత భాగం అయిపోయిందో అర్థం చేసుకోవడానికి.రంగూ రుచీ రూపం 

ఆలూ అనగానే మట్టి రంగులో కొంచెం గుండ్రంగా, కోడిగుడ్డు ఆకారంలో ఉన్నవే గుర్తొస్తాయి మనకి. కానీ ఈ కూరగాయలో ఉన్నన్ని రంగులూ రూపాలూ దేన్లోనూ లేవు. పెరూ చుట్టుపక్కల ఇప్పటికీ నాలుగువేల రకాల ఆలుగడ్డలు దొరుకుతాయి. అయితే, ప్రపంచం మొత్తమ్మీదా ఓ వందరకాలే ఎక్కువ ప్రాచుర్యం పొందాయి. పైన ఎరుపూ లోపల గోధుమ వర్ణంలో ఉండే రోజ్‌ రెడ్‌, లోపలా బయట కూడా వంకాయ రంగులో కనిపించే పర్పుల్‌ పెరూవియన్‌, దుంప అంతా ఎరుపు రంగుండే ఆల్‌ రెడ్‌ పొటాటో, బంగరు వర్ణంలో కనిపించే కింగ్‌ ఎడ్వర్డ్‌, ముదురు ఎరుపు రంగులో ఉండే హైల్యాండ్‌ బర్గండీ, వేరు వేరు రంగుల్లో మచ్చలతో కనిపించే బ్లూ బెల్లే, జెస్టర్‌... లాంటి పేర్లతో ఎన్నో వర్ణాలూ రుచులూ ఉన్నాయి వీటిలో. ఇక, వేరు వేరు రూపాల్లో ఉండే దుంపల గురించి చెప్పాలంటే పెద్ద ముత్యాలంత ఉండే పెరల్‌ పొటాటో, వాటికన్నా కొంచె పెద్దగా ఉండే బేబీ పొటాటో, ఈత కాయలను తలపించేలా చిన్నగా ఉండే టైనీటైనీ పొటాటో, అరటి పండ్లలా పొడవుగా ఉండే రష్యన్‌ బనానా, ఫింగర్‌లింగ్‌ దుంపలూ... ఇలా చాలానే ఉన్నాయి. ఇవీ పలు రంగుల్లో ఉంటాయి.ఎన్నో ప్రత్యేకతలు 

ప్రపంచంలో ఏ మూలకి వెళ్లినా కనిపించే కూరగాయ బంగాళాదుంపే. 
* ఆలూలో ఇరవై శాతం పిండి పదార్థాలుంటే మిగిలిన ఎనభైశాతం నీరే ఉంటుంది. 
* ప్రపంచంలో ఆలుగడ్డల్ని అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశం చైనా. 
* వరి, గోధుమ, మొక్కజొన్నల తర్వాత భూమ్మీద ఎక్కువగా పండించే పంట ఆలుగడ్డలే. 
* విటమిన్‌ సీ లోపం వల్ల వచ్చే స్కర్వీ వ్యాధి బాగా ప్రబలిన 1890 సమయంలో కొన్నిచోట్ల బంగారాన్ని మారకంగా ఇచ్చి బంగాళాదుంపను కొనేవారట మరి. ఆలూలో విటమిన్‌ సీ పుష్కలంగా ఉంటుంది. 
* ఇంగ్లండ్‌లో పండిన దాదాపు ఎనిమిదిన్నర కిలోల దుంప ఇప్పటివరకూ పండినవాటిలో అతిపెద్ద ఆలుగడ్డగా గిన్నిస్‌ రికార్డుల్లోకి ఎక్కింది. 
* నూనెలో వేయించి చేసే ఆలూ చిప్స్‌ ఎక్కువ తినడం ఆరోగ్యానికి మంచిది కాదని వైద్యులు చెబుతున్నా ప్రపంచవ్యాప్తంగా ఇవి బాగా ప్రాచుర్యం పొందిన స్నాక్స్‌గా పేరుపొందాయి. ఏటా వంద కోట్లకు పైగా ఆలూ చిప్స్‌ ప్యాకెట్లు అమ్ముడవుతున్నాయి. 
* 1995లో నాసా సంస్థ, యూనివర్సిటీ ఆఫ్‌ విస్‌కాన్‌సిన్‌తో కలిసి అంతరిక్షంలో ఆలుగడ్డల్ని పండించే టెక్నాలజీని సృష్టించింది. దీనివల్ల భవిష్యత్తులో వ్యోమగాములు అంతరిక్షంలోనే ఆలూని పండించుకుని తినొచ్చన్నమాట. 
* చాలామంది ఆలుగడ్డలకు మొలకలు వచ్చినా కూడా వండేస్తుంటారు. కానీ ఆ మొలకలు విషపూరితమైన ఆల్కలాయిడ్లను ఉత్పత్తి చేస్తాయి. వాటిని తినడం ఆరోగ్యానికి మంచిదికాదు. 
* 1800 ప్రాంతంలో ఐర్లండ్‌ వాసులకు ఆలుగడ్డలే ప్రధాన ఆహార వనరుగా ఉండేవి. కానీ విధివశాత్తూ 1845 సమయంలో స్థానిక బంగాళాదుంప పంటలన్నీ ఒకరకం తెగులువ్యాధితో నాశనమయ్యాయి. దాంతో స్థానికంగా సుమారు పదిహేను లక్షలమంది ఆకలితో చనిపోయారు. ఐర్లండ్‌లో ఇప్పటికీ ప్రధాన ఆహారం ఆలూనే. అక్కడ ఒక్కో మనిషి సగటున ఏడాదికి 120 కిలోల ఆలుగడ్డల్ని తింటాడట. 
* ఆలుగడ్డల్ని వంటల్లోనే కాదు, వస్త్ర, కాగితం పరిశ్రమల్లో జిగురుకోసం కూడా వాడతారు. చాలాచోట్ల వీటిని పశువులకు మేతగానూ వేస్తారు.

ఆరోగ్యం 
అన్నంలో ఉండే శక్తీ, నిమ్మకాయలోని సీ విటమిన్‌, అరటి పండులో దాగున్న పొటాషియం, యాపిల్‌లోని పీచుపదార్థాలూ మరెన్నో పోషకాలు ఒక్క ఆలుగడ్డలోనే లభిస్తాయి. ఇది గ్లుటెన్‌ ఫ్రీ మాత్రమే కాదు, తక్కువ పెట్టుబడీ శ్రమతో పండించగలిగిన పంట కూడా. అందుకే, పేద దేశాలు బంగాళాదుంపల్ని బాగా వినియోగించేలా ఐక్యరాజ్యసమితి కృషిచేస్తోంది. దీన్లోభాగంగానే 2008 సంవత్సరాన్ని ఆలుగడ్డ నామ సంవత్సరంగా ప్రకటించింది. ఇక, ఆరోగ్యానికి ఈ దుంప చేసే మేలు గురించి చెప్పాలంటే బోలెడు. ఇది వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. దీన్లో ఉండే కెరోటినాయిడ్లు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. రకరకాల క్యాన్సర్లు రాకుండా అడ్డుకుంటాయి. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచే విటమిన్‌ సీ, బీ కాంప్లెక్స్‌, ఖనిజలవణాలూ ఆలూలో పుష్కలంగా ఉంటాయి. వృద్ధాప్య లక్షణాలు రాకుండానూ ఇది నివారిస్తుంది. రక్తపోటుని అదుపులో ఉంచడంతోపాటు, నిద్రలేమి సమస్యల్నీ దూరం చేస్తుంది. అల్సర్లకూ అరుగుదలకూ కంటి ఆరోగ్యానికీ బంగాళాదుంప మంచి మందు. ఇది మెదడుని చురుకుగా కూడా ఉంచుతుంది. మంచిది మంచిది అన్నారు కదా అని ఆలూ చిప్స్‌ని తెగ తినేస్తాం అంటే కుదరదు. ఆలుగడ్డల్ని ఉడికించి చేసిన వంటకాలే ఆరోగ్యానికి మంచివి. అంతేకాదు, అతి అనర్థం అన్నది దీనికీ వర్తిస్తుంది. ఏమైనా, ఆలూకి చాలా సీనుంది కదూ...
బంగాళాదుంప | ఆలూ | Potatoబంగాళాదుంప | ఆలూ | Potato |  Mohanpublications | Granthanidhi | Bhaktipustakalu |  Mohanpublications | Granthanidhi | Bhaktipustakalu

బంగాళాదుంప | ఆలూ | Potato |  Mohanpublications | Granthanidhi | Bhaktipustakalu




కుండ బిర్యానీ| Pot Biryani | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu

కుండ బిర్యానీ| Pot Biryani  | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu


ఆయ్‌.. మా కుండ బిర్యానీ రుసి సూత్తారాండీ!

కుండబిర్యానీలు చాలా చోట్ల దొరుకుతున్నా... రావులపాలెం కుండబిర్యానీ రుచి ప్రత్యేకం. ప్రత్యేకమైన మసాలాలతో కుండల్లో వండే ఈ బిర్యానీ తెలుగు ప్రాంతాలతో పాటు తమిళనాడు, కర్నాటక ప్రాంతాలకు వేడివేడి పార్శిల్‌గా చేరిపోతుందంటే నమ్ముతారా?...కుండ బిర్యానీ| Pot Biryani  | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakaluఘుమఘుమలాడే బాస్మతీ రైస్‌, ఘాటెక్కించే మసాలాదినుసుల పేరుచెప్పగానే హైదరాబాద్‌ బిర్యానీనే చటుక్కున గుర్తొకొస్తుంది. కానీ హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నైలో కూడా రావులపాలెం కుండ బిర్యానీకి ఫ్యాన్స్‌ ఉన్నారని అంటున్నారు భాస్కరా హోటల్‌ నిర్వాహకులు. ‘‘ఆయ్‌! మా దగ్గర్లోని అమలాపురం, లొల్ల లాకులూ, ఆత్రేయపురం ప్రాంతాల్లో సూటింగ్‌లు ఎక్కువ జరుగాతయ్‌ కదండీ! అక్కడకి వచ్చే యాట్టర్లందరూ మా కుండబిర్యానీ రుసి చూడకుండా ఎల్లరండి బాబూ’’ అంటూ గర్వంగా చెబుతారు. కోనసీమ ముఖద్వారంగా పేరుపొందిన రావులపాలెం హైవేకు దగ్గరగా ఉండటంతో.. భోజనప్రియులైన ప్రయాణికులను ఆకర్షించడం కోసం ఈ కుండబీర్యానీ తయారు చేయించడం మొదలుపెట్టారు భాస్కరా హోటల్‌ నిర్వహకులు. 2005లో కుండబిర్యానికి తయారీ మొదలైంది. మొదట్లో పదికుండలతో మొదలుపెట్టిన ఈ వంటకం ఇప్పుడు వేలల్లో ఫ్యాన్స్‌ని సంపాదించుకుంది. రావులపాలెం, ఆ చుట్టుపక్కల ప్రాంతాలకే ఈ రుచి పరిమితం కాకుడా ఇతర జిల్లాలకూ వ్యాపించింది. రాత్రికి రాత్రి కుండబిర్యానీని చక్కగా ప్యాక్‌ చేసి బస్సుకి ఇచ్చేస్తే తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ఉదయాన్నే తీసుకుంటున్నారు.కుండ బిర్యానీ| Pot Biryani  | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakaluకుండల్లోనే వండుతారు... 
కుమ్మరి దగ్గర కావలసిన పరిమాణాల్లో కుండల్ని తయారు చేయించుకుంటారు. చికెన్‌ని ఓ మోస్తరు పరిమాణంలో ముక్కలు చేసుకుంటారు. ఈ ముక్కల్లోనే మటన్‌, చికెన్‌ మసాలాలతోపాటు భాస్కరా హోటల్‌ వాళ్లు ప్రత్యేకంగా తయారుచేసిన బిర్యానీ మసాలా, పాలు, పెరుగు, ఉప్పు, పసుపు, కారం వంటివన్నీ ముక్కలకు పట్టించి ఐదారుగంటలు అలానే పక్కన పెట్టి ఉంచుతారు. కుండలో అడుగున ఈ మసాలాను వేసి రోల్‌కాస్టర్‌పై కుండను ఉంచి ఉడికించి... ఆపై బాస్మతి బియ్యం దానిలో కలిపి మూతపెట్టేస్తారు. పైన బొగ్గుల వేడిని ఉంచుతారు. కింద సన్నని మంట, పైన వేడికి మసాలా మొత్తం రైస్‌కి పడుతుంది. చివరిగా వెన్న, రోజ్‌వాటర్‌ వేసి వేయించిన ఉల్లిపాయలతో అలంకరించి అల్యూమినియం ఫాయిల్‌ చుట్టేసి మరోసారి మంటపై వేడిచేసి వడ్డిస్తారు. ప్రత్యేక సందర్భాలు ఉంటే ముందస్తు బుకింగ్‌లు కూడా చేసుకోవాల్సి ఉంటుంది.
- స్వాతి కొరపాటి

mohan publications price list