MohanPublications Print Books Online store clik Here Devullu.com

కుండ బిర్యానీ| Pot Biryani | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu

కుండ బిర్యానీ| Pot Biryani  | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu


ఆయ్‌.. మా కుండ బిర్యానీ రుసి సూత్తారాండీ!

కుండబిర్యానీలు చాలా చోట్ల దొరుకుతున్నా... రావులపాలెం కుండబిర్యానీ రుచి ప్రత్యేకం. ప్రత్యేకమైన మసాలాలతో కుండల్లో వండే ఈ బిర్యానీ తెలుగు ప్రాంతాలతో పాటు తమిళనాడు, కర్నాటక ప్రాంతాలకు వేడివేడి పార్శిల్‌గా చేరిపోతుందంటే నమ్ముతారా?...కుండ బిర్యానీ| Pot Biryani  | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakaluఘుమఘుమలాడే బాస్మతీ రైస్‌, ఘాటెక్కించే మసాలాదినుసుల పేరుచెప్పగానే హైదరాబాద్‌ బిర్యానీనే చటుక్కున గుర్తొకొస్తుంది. కానీ హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నైలో కూడా రావులపాలెం కుండ బిర్యానీకి ఫ్యాన్స్‌ ఉన్నారని అంటున్నారు భాస్కరా హోటల్‌ నిర్వాహకులు. ‘‘ఆయ్‌! మా దగ్గర్లోని అమలాపురం, లొల్ల లాకులూ, ఆత్రేయపురం ప్రాంతాల్లో సూటింగ్‌లు ఎక్కువ జరుగాతయ్‌ కదండీ! అక్కడకి వచ్చే యాట్టర్లందరూ మా కుండబిర్యానీ రుసి చూడకుండా ఎల్లరండి బాబూ’’ అంటూ గర్వంగా చెబుతారు. కోనసీమ ముఖద్వారంగా పేరుపొందిన రావులపాలెం హైవేకు దగ్గరగా ఉండటంతో.. భోజనప్రియులైన ప్రయాణికులను ఆకర్షించడం కోసం ఈ కుండబీర్యానీ తయారు చేయించడం మొదలుపెట్టారు భాస్కరా హోటల్‌ నిర్వహకులు. 2005లో కుండబిర్యానికి తయారీ మొదలైంది. మొదట్లో పదికుండలతో మొదలుపెట్టిన ఈ వంటకం ఇప్పుడు వేలల్లో ఫ్యాన్స్‌ని సంపాదించుకుంది. రావులపాలెం, ఆ చుట్టుపక్కల ప్రాంతాలకే ఈ రుచి పరిమితం కాకుడా ఇతర జిల్లాలకూ వ్యాపించింది. రాత్రికి రాత్రి కుండబిర్యానీని చక్కగా ప్యాక్‌ చేసి బస్సుకి ఇచ్చేస్తే తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ఉదయాన్నే తీసుకుంటున్నారు.కుండ బిర్యానీ| Pot Biryani  | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakaluకుండల్లోనే వండుతారు... 
కుమ్మరి దగ్గర కావలసిన పరిమాణాల్లో కుండల్ని తయారు చేయించుకుంటారు. చికెన్‌ని ఓ మోస్తరు పరిమాణంలో ముక్కలు చేసుకుంటారు. ఈ ముక్కల్లోనే మటన్‌, చికెన్‌ మసాలాలతోపాటు భాస్కరా హోటల్‌ వాళ్లు ప్రత్యేకంగా తయారుచేసిన బిర్యానీ మసాలా, పాలు, పెరుగు, ఉప్పు, పసుపు, కారం వంటివన్నీ ముక్కలకు పట్టించి ఐదారుగంటలు అలానే పక్కన పెట్టి ఉంచుతారు. కుండలో అడుగున ఈ మసాలాను వేసి రోల్‌కాస్టర్‌పై కుండను ఉంచి ఉడికించి... ఆపై బాస్మతి బియ్యం దానిలో కలిపి మూతపెట్టేస్తారు. పైన బొగ్గుల వేడిని ఉంచుతారు. కింద సన్నని మంట, పైన వేడికి మసాలా మొత్తం రైస్‌కి పడుతుంది. చివరిగా వెన్న, రోజ్‌వాటర్‌ వేసి వేయించిన ఉల్లిపాయలతో అలంకరించి అల్యూమినియం ఫాయిల్‌ చుట్టేసి మరోసారి మంటపై వేడిచేసి వడ్డిస్తారు. ప్రత్యేక సందర్భాలు ఉంటే ముందస్తు బుకింగ్‌లు కూడా చేసుకోవాల్సి ఉంటుంది.
- స్వాతి కొరపాటి

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list