అనేక పోషకాల ఆల్‌బుఖరా
ఆల్‌బుఖరా పేరు వినగానే నోట్లో నీళ్లూరుతాయి. కొంచెం వగరుగా, కొంచెం తియ్యగా ఉండే ఈ పళ్లల్లో సి-విటమిన్ పుష్కలంగా ఉంటుంది. జ్వరం వచ్చిన వాళ్లు ఈ పండు తింటే మంచిదంటారు. అయితే పిల్లలూ పెద్దలు అందరూ ఈ సీజనల్ పండును ఎంచక్కా తినొచ్చు. ఆల్‌బుఖరాలో ఆరోగ్య గుణాలే కాదు సౌందర్య కారకాలు కూడా ఉన్నాయంటున్నారు పోషక నిపుణులు. అవేమిటంటే...
ఆస్తమా, ఆర్రైటీస్, గుండెపోటు, క్యాన్సర్ నివారణకు ఇవి బాగా పనిచేస్తాయి.
ఈ పండులో యాంటాక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
జ్ఞాపకశక్తిని పెంచుతుంది.
ఈ పండులోని సోర్బిటాల్, ఇసోటిన్ కాంపౌండ్లు జీర్ణశక్తిని క్రమబద్ధీకరించడంతోపాటు మలబద్ధకాన్ని తగ్గిస్తుంది.
ఈ పండులోని సి-విటమిన్ వల్ల రోగనిరోధకశక్తి పెరగడమేకాకుండా, ఇన్ఫెక్షన్లు, అల్సర్లు తలెత్తవు. గుండెజబ్బులు రావు.
ఈ పళ్లు రొమ్ము, శ్వాససంబంధమైన క్యాన్సర్లను తగ్గిస్తాయి.
ఇందులోని విటమిన్-ఎ దంతక్షయం, నోటి కాన్సర్ల నుంచి రక్షిస్తుంది.
కొలెస్ట్రాల్ ప్రమాణాలను ఆరోగ్యకరంగా ఉంచుతాయి. పొటాషియం ఎక్కువగా ఉన్న ఈ పళ్లల్లోని ఫ్లూయిడ్ కణాలకు, శరీరానికి ఎంతో అవసరం. అంతేకాదు హార్ట్ రేట్‌ను, రక్తపోటును నియంత్రిస్తుంది.
మాక్యులర్ డీజీనరేషన్ నుంచి పరిరక్షిస్తాయి. రోజుకు మూడుసార్లు ఈ పండు తింటే వయసు పైబడ్డం వల్ల వచ్చే ఈ సమస్య తగ్గుతుంది. ఉదయం తినే సలాడ్స్‌లో ఈ పండు ముక్కలు వేసుకోవచ్చు.
రక్తప్రసరణను క్రమబద్ధీకరిస్తాయి. శరీరంలో ఎర్రరక్తకణాలు ఏర్పడాలంటే ఈ పళ్లు బాగా తినాలి. ఇవి రక్తహీనతను తగ్గిస్తాయి.
శరీరంలోని మలినాలను బయటకు పంపించడంతో అత్యంత సహజంగా శరీర బరువును ఈ పళ్లు తగ్గిస్తాయి.
ఈ పళ్లల్లో యాంటాక్సిడెంట్లతోపాటు పీచుపదార్థాలు కూడా ఎక్కువగా ఉంటాయి.
ఈ పండులోని సిట్రిక్ యాసిడ్ అలసటను, నొప్పులను తగ్గిస్తుంది. కాలేయం బాగా పనిచేసేట్టు చేస్తుంది.
ఈ పండులో గ్లైసెమిక్ పరిమాణం చాలా తక్కువగా ఉంటుంది. అందుకే మధుమేహ వ్యాధిగ్రస్థులకు ఇది ఎంతో మంచిది. శరీరంలోని బ్లడ్‌షుగర్ పరిమాణాన్ని తగ్గించి డయాబెటి్‌స-2ను నియంత్రిస్తుంది.
ఈ పండులోని కరిగిపోయే పీచు వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది.
ఇన్ఫెక్షన్ల వల్ల తరచూ వచ్చే జ్వరాన్ని, జలుబును నివారిస్తుంది.
ఆల్‌బుఖరా పళ్లు తినడం వల్ల ఎముకలు పటిష్టమవుతాయి. ముఖ్యంగా పోస్ట్ మెనోపాజల్ స్టేజిలో ఉన్న మహిళలు తింటే ఎముకలు దృఢంగా ఉంటాయి.
కండరాల స్వేచ్ఛా కదలికలకు మెగ్నీషియం చాలా అవసరం. ఇది ఈ పండులో పుష్కలంగా ఉంది. అంతేకాదు నరాల బాధలను తగ్గిస్తుంది.
ఈ పళ్లల్లో ఫోలిక్ యాసిడ్, కాల్షియం ఎక్కువ ప్రమాణాల్లో ఉన్నాయి. ఇవి ఫోలేట్స్‌ను ఇస్తాయి. ఈ ఫోలేట్స్ గర్భిణీలకు, కడుపులోని శిశువుకు ఎంతో అవసరం.
ఈ పళ్లు శరీరాన్ని డిటాక్సిఫై చేస్తాయి.
ఆల్‌బుఖరా పళ్లు తినడం వల్ల చర్మం పట్టులా తయారవుతుంది.
ఈ పళ్లు బాగా తినడం వల్ల వయసు కనపడదు. చర్మం బిగువును కోల్పోదు. చర్మంపై ముడతలు ఏర్పడవు.
ఈ పళ్లల్లో ఉన్న అధిక మోతాదులోని యాంటాక్సిడెంట్లు, యాంటి ఇన్ఫ్లమేటరీ గుణాలు జీవక్రియ, రక్త ప్రసరణలు బాగా జరిగేట్టు చూస్తాయి. ఫలితంగా చర్మం ఎలాస్టిసిటీ పెరుగుతుంది. యాక్నే, ముడతలు వంటివి చర్మం మీద ఏర్పడవు. చర్మంపై మచ్చలను తగ్గిస్తాయి కూడా.
వీటిని తినడం వల్ల చర్మం కాంతివంతంగా తయారవుతుంది.
గాయాలను వేగంగా తగ్గిస్తాయి.
ఈ సీజనల్ పండు తినడం వల్ల వెంట్రుకలు వేగంగా పెరుగుతాయి.
చుండ్రును పోగొడుతుంది. జుట్టు దట్టంగా పెరిగేట్టు చేస్తుంది. అంతేకాదు రకరకాల శిరోజాల సమస్యలను కూడా ఈ పళ్లు నివారిస్తాయి.
జుట్టు నల్లదనాన్ని ఈ పళ్లు పరిరక్షిస్తాయి.
Hey there,
ReplyDeleteNice blog
check out our blogs
buy instagram followers india through paytm