MohanPublications Print Books Online store clik Here Devullu.com
Showing posts with label tips. Show all posts
Showing posts with label tips. Show all posts

బరువు తగ్గండీ | Weight Loss Together | Mohanpublications | Granthanidhi | Bhakthipustakalu


బరువు తగ్గండీ | Weight Loss Together | Mohanpublications | Granthanidhi | Bhakthipustakalu Obesity Weight Loss Losing weight couple weight loss made for eachother


బరువు తగ్గండీ

పొద్దున్నే నిద్రలేచి వ్యాయామం చేస్తానంటారు... కానీ చేయరు! కొవ్వుపదార్థాలు మానేస్తాననీ చెబుతారు... కానీ నాన్‌లూ, పిజాలూ, బర్గర్‌లు లాగించేస్తారు. వేళకు నిద్రపొమ్మంటే... కంప్యూటరు ముందునుంచీ కదలరు. కూరల్లో కాస్త ఉప్పు తగ్గిస్తే... ఏంటీ చప్పిడి తిండి అంటూ కోప్పడతారు... ఇలా శ్రీవారి బరువుకు సంబంధించిన కథల గురించి ఎన్నయినా చెప్పేస్తారు చాలామంది మహిళలు. అలా బాధపడటం కన్నా... తన బరువును తగ్గించే ప్రయత్నం ఎందుకు చేయకూడదు. దానివల్ల మనమూ సన్నబడొచ్చు. అదెలా అంటారా... చదవండి మరి.
పెళ్లికి ముందు...ఫిట్‌గా ఉండాలీ, అందంగా కనిపించాలి, పిడికెడు పొట్ట కూడా ఉండకూడదు... అని అమ్మాయిలే కాదు, అబ్బాయిలూ ఆలోచిస్తారు. దానికి సంబంధించి తీసుకునే జాగ్రత్తలూ, పాటించే కొత్తకొత్త నియమాల జాబితా చాంతాండంత ఉంటుంది. తీరా పెళ్లయ్యాక ఉద్యోగం, కుటుంబం, పిల్లలూ, ఆలస్యంగా పడుకోవడం, ఆహార నియమాలు పాటించకపోవడం... అన్నీ కలిపి బరువు పెంచేస్తాయి. అవే క్రమంగా అనారోగ్యాలూ, వైవాహిక జీవితంలో సమస్యలు తెచ్చి... మానసిక కుంగుబాటుకు దారి తీస్తాయి. శ్రీవారి బాగోగులు చూసే ఇల్లాలిగా.. వారి ఆరోగ్యం కూడా స్త్రీ చేతిలోనే ఉంటుంది కాబట్టి ఛలో సన్నబడదాం..’ అంటూ ఆయన్నీ ప్రోత్సహించండి. ముందుగా...
మానసికంగా సిద్ధం చేయండి...
చాలామంది మహిళలు చేసే పొరపాటు ‘మీరు బరువు తగ్గాల్సిందే. అవి తినొద్దూ.. ఇవి తినొద్దూ’ అని ఆర్డర్లు వేసేస్తుంటారు. దీంతో రకరకాల ఒత్తిళ్లలో ఉన్న మగవారు ఈ విషయాన్ని ప్రతికూలంగా తీసుకుంటారు. గట్టిగా దబాయింపుగా చెప్పడాన్ని మాత్రమే వారు పట్టించుకుంటారు గానీ.. అసలు విషయాన్ని పక్కన పెట్టేస్తుంటారు. కొందరు అనుకుంటారు కానీ ఆరంభంలోనే ఆగిపోతారు. ‘తను చెబితే నేను చేయాలా... నాకు తెలియదా ఎప్పుడు ఏం చేయాలో...’ అనే ధోరణిలో తమ ఆరోగ్యాన్నీ, ఫిట్‌నెస్‌ని నిర్లక్ష్యం చేసేవారూ ఉంటారు. కాబట్టి భర్త బరువు తగ్గాలి అనుకుంటే.. ముందు మానసికంగా సిద్ధం చేయాలి. పెళ్లికి ముందు ఫొటోలు చూపించి.. ‘మళ్లీ మనం ఇలా ఎప్పుడవుదాం..’ అని అడిగి చూడండి. కలిసి వ్యాయామం చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టడం, చిలిపి సవాళ్లు విసరడం.. వంటివి శ్రీవారిని తప్పకుండా ఆ దిశగా ప్రేరేపిస్తాయి. భార్యాభర్తలు కలిసి వ్యాయామం చేయడం వల్ల ఎన్నో లాభాలున్నాయి. ఒకరినొకరు స్ఫూర్తి పొందుతూ ముందుకు సాగొచ్చు. పార్టనర్‌ యోగా, పార్టనర్‌ ఏరోబిక్స్‌, పార్టనర్‌ ఎక్సర్‌సైజెస్‌, పార్టనర్‌ ఫిట్‌నెస్‌... ఇలా రకరకాలుగా ప్రయత్నించొచ్చు. ఇంటికి దగ్గరలోని పార్కుకో, మైదానానికో ఇద్దరూ కలిసి ఉదయం నడకకు వెళ్లొచ్చు. తాడాట ఆడొచ్చు. గోడ కుర్చీలు వేయొచ్చు. స్క్వాట్స్‌ను ప్రయత్నించొచ్చు. ట్రైనర్‌ను పెట్టుకుని ఇద్దరూ కలిసీ వ్యాయామాలు చేయొచ్చు అంటున్నారు ఫిట్‌నెస్‌ నిపుణురాలు మణిపవిత్ర.



అప్పుడేం చేయాలంటే..
* మీరు కావచ్చు, ఆయన కావచ్చు... అప్పటివరకూ జీవనశైలిలో చేసిన పొరపాట్లన్నీ ఓ జాబితాగా రాసుకోవాలి. ఇక మీదట చేయాల్సిన నియమాలను మరో కాగితంపై రాయాలి. చేయకూడనివి రెడ్‌ మార్కర్‌తో కొట్టేసి చేయాల్సినవి గ్రీన్‌ మార్కర్‌తో టిక్‌ చేయాలి. ఆ జాబితాను ప్రతిరోజూ ఇద్దరూ చూసేలా ఒక చోట అంటించుకోవాలి. అలా చూడటం వల్ల మెదడులో చేయాలన్న స్ఫూర్తి పెరుగుతుంది.
* నిపుణుల్ని సంప్రదించి బరువు తగ్గడానికి ఎలాంటి నియమాలు పాటించాలన్నదీ ఓ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. ఆహార నియమాలూ, చేయాల్సిన వ్యాయామ ప్రక్రియ గురించి రాసుకోవాలి. ఎలా చేయాలన్నది మాట్లాడుకోవాలి. ఒక్కరి నిర్ణయమం మీదే వెళ్లడం సరికాదు.
* ఇద్దరూ కలిసి ఒకే సమయానికి నిద్రపోవడం, మేల్కొనడం అలవాటు చేసుకోవాలి. కలిసి వ్యాయామ సాధన చేయడం, అల్పాహారం తీసుకోవడం మొదలుపెట్టాలి. వీలుంటే మిగతా సమయాల్లోనూ కలిసి తినడానికి ప్రాధాన్యమివ్వాలి.
* రోజూ ఒకే రకమైన వ్యాయామ సాధనలు కాకుండా ఒక రోజు నడకా, మరోరోజు జాగింగ్‌.. ఇలా రోజూ వ్యాయామ సాధనలో కొత్తదనం ఉండేలా ప్రణాళిక వేయాలి. ఈ రోజుల్లో ఇద్దరూ కలిసి చేసే యోగాసనాలు ఉన్నాయి. అలా ఇద్దరూ కలిసి చేయడం వల్ల ఫలితాలు చాలా త్వరగా ఉంటాయని చెబుతున్నారు యోగా నిపుణులు.
* ఒక వేళ మీ శ్రీవారు బద్ధకించినా గట్టిగా అరవడం, విసురుగా మాట్లాడటం, కోప్పడటం సరికాదు. నియమాలు పాటించడంలో వెనకబడినా, ఒకరోజు బద్ధకించినా తేలిగ్గానే తీసుకోవాలి తప్ప సహనం కోల్పోకూడదు.
సరదా సరదాగా..
వ్యాయామం, బరువు తగ్గడం, డైటింగ్‌ వంటి మాటలు మనసులోంచి తీస్తే చాలా మంచిది. ఇద్దరూ కలిసి వ్యక్తిగత సమయం కేటాయించుకుంటున్నాం అని భావిస్తే చాలా బాగుంటుంది. భార్యాభర్తలిద్దరూ కలిసి సరదాగా ఈత తరగతులకు వెళ్లడం, సైక్లింగ్‌ చేయడం, టెన్నిస్‌, బ్యాడ్మింటన్‌, టేబుల్‌ టెన్నిస్‌ వంటివి ఆడొచ్చు. చిన్నారుల్లా మారి.. ఎంత హడావుడిగా ఉన్నా.. రోజులో ఎంతో కొంత సమయం ఇలా గడపడం వల్ల ఆరోగ్యపరంగా ఎంత మేలు జరుగుతుందో.. మానసికంగానూ అంతే ప్రయోజనం ఉంటుంది. పైగా ఇద్దరి మధ్యా అనుబంధం అంతకుముందు కంటే మెరుగ్గా ఉంటుంది. దాంతోపాటు కొత్త జంటలా మారిపోయి.. ఏరోబిక్స్‌, జుంబా, సల్సా వంటి నృత్య రీత్యుల్ని నేర్చుకోవడం మొదలు పెట్టొచ్చు. వీటన్నింటి వల్ల కెలొరీలు అధిక మొత్తంలో ఖర్చు అవుతాయి. నిద్రలేమి సమస్యలూ దూరమవుతాయి.


వంటింట్లో చేయాల్సిన మార్పులు...

* బరువు తగ్గడానికి పూర్తిగా పొట్ట మాడ్చుకోవాల్సిన అవసరంలేదు. మాంసకృత్తులూ, పిండిపదార్థాలు శరీరానికి అందాలి. పిండిపదార్థాలు అంటే అన్నం, బ్రెడ్‌ నుంచి అందేవి కాకుండా సంక్లిష్ట పిండిపదార్థాలు ఎంచుకునేలా చూసుకోవాలి. అంటే బ్రౌన్‌రైస్‌, తృణధాన్యాలూ, ఓట్స్‌ వంటి వాటితో చేసిన పదార్థాలు అన్నమాట. వీటిని కూడా మితంగా తీసుకోవాలి. వీటిల్లో పీచు ఉండటమే కాదు... అరగడానికీ ఎక్కువ సమయం పడుతుంది.
* మాంసాహారం దూరంగా పెట్టాల్సిన పనిలేదు. మీ వారికి ఎక్కువగా తినే అలవాటు ఉంటే పూర్తిగా మానేయమనకుండా ఆ పరిమాణం తగ్గిస్తూ రావాలి. బదులుగా మీల్‌మేకర్‌, స్కిన్‌లెస్‌ చికెన్‌ ఎంచుకోవచ్చు. అంతేకానీ అలవాటు లేని బ్రకోలీ, లెట్యూస్‌ వంటివి శ్రీవారికి వడ్డించేయడం సరికాదు.
* తీపి పదార్థాలు బరువు పెరగడానికి కారణమవుతాయి. అందుకే మిఠాయిలను మాత్రం ఎంత తగ్గిస్తే అంత మంచిది. బదులుగా తేనె, తాజా పండ్లూ, ఖర్జూరాలూ, ఎండు ద్రాక్ష వంటివి ఇవ్వొచ్చు. వీటితో చేసిన స్వీట్లు కూడా ఆరోగ్యానికి మంచిదే.
* రెస్టారంట్లూ, రోడ్డువారల ఆహారాన్ని పూర్తిగా దూరం పెట్టేయడం మంచిది. మంచి నీళ్లు ఎక్కువగా తాగాలి. పండ్ల రసాలకు బదులు పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. కీరదోస, క్యారెట్‌, బీట్రూట్‌, టోఫూతో సలాడ్లు చేయడం మంచిది. నూనె, ఉప్పూ ఎంత తక్కువ తీసుకుంటే అంత త్వరగా ఫలితం ఉంటుంది.
* అల్పాహారం తప్పనిసరిగా తీసుకోవాలి. రాజ్మా, పెసలూ, బఠాణీ, సెనగలూ, గుడ్లూ, సోయా, పల్లీలూ... ఇవన్నీ మనం తీసుకునే భోజనంలో తప్పకుండా ఉండేలా చూసుకోవాలి. వీటిలోని మాంసకృత్తులు శరీరానికి శక్తిని అందిస్తాయి.
* కాఫీ, టీలు తాగినా చక్కెర్లకు దూరంగా ఉండాలి. వాటితోపాటు ఉదయం, సాయంత్రం గ్రీన్‌ టీ తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. దీనిలోని యాంటీఆక్సిడెంట్లు బరువు తగ్గడంలోనే కాదు.. శరీరంలోని విషవ్యర్థాలను బయటకు పంపడంలోనూ కీలక పాత్ర పోషిస్తాయి అంటున్నారు పోషకాహార నిపుణురాలు డాక్టర్‌ లతాశశి.

ఫైనాపిల్ | Pineapple | Mohanpublications | Granthanidhi | Bhakthipustakalu


ఫైనాపిల్ | Pineapple | Mohanpublications | Granthanidhi | Bhakthipustakalu pineapple health health tips cancer pineapple fruit


ఫైనాపిల్


పైనాపిల్ తింటే.. ఏ పిల్ అవసరం లేదంటారు. అనాస ఆరోగ్యాలకు ఆవాసమని పేరు.. ఆరోగ్యాన్ని మెరుగుపరిచే, అందాన్ని పెంచే.. ఔషధ గని! కప్పు ముక్కలతో క్యాన్సర్‌కే చెక్ పెట్టొచ్చు.. జ్యూస్ జుర్రుకుంటే ఏ అనారోగ్యాలూ దరిచేరవు. అన్ని ఫైన్ విషయాలు ఉన్న పైనాపిల్‌కి కూడా ఓ రోజుంది.. ఈ నెల 27న ప్రత్యేకంగా పైనాపిల్ డేని జరుపుతున్నారు.ఈ సందర్భంగా పైనాపిల్‌పై ప్రత్యేకంగా ఈ జంటకమ్మ.

ముళ్లతో కాస్త వికారంగా కనిపించినా.. ఔషధాలు మాత్రం మెండు. భారతదేశంలో ఈశాన్య రాష్ట్రంలో పైనాపిల్‌ని ఎక్కువ పండిస్తారు. ప్రకృతి ప్రసాదించిన అమూల్యఫలం ఇది. దీన్ని అమెరికన్ ఆదివాసులు దేవతాఫలంగా భావిస్తారు. క్రీ.శ.1548 సంవత్సరంలో భారతదేశంలోకి ప్రవేశించింది. అప్పటి నుంచి దీని సాగు దేశీయంగా మొదలయింది. 1 మీటరు నుంచి 1.5 మీటర్ల ఎత్తు వరకు ఇది పెరుగుతుంది. కొంచెం పరిపక్వతకు వచ్చిన తర్వాత పువ్వు వస్తుంది. ఈ పువ్వు సుమారు 15 సెం.మీ.లు ఉంటుంది. పువ్వు 12 నుంచి 20 నెలల తర్వాత పండుగా ఏర్పడుతుంది. వర్షాకాలంలో విరివిగా దొరికే పండ్లలో పైనాపిల్ ఒకటి.
100గ్రా. పైనాపిల్‌లో ఉండే పోషకాలు.. నీరు : 87.8 గ్రా.
ప్రొటీన్ : 0.4 గ్రా.
కొవ్వు : 0.1 గ్రా.
పిండి పదార్థాలు : 10.8 గ్రా.
క్యాల్షియం : 20 మి.గ్రా.
పాస్ఫరస్ : 9 గ్రా.
ఐరన్ : 2.4 గ్రా.
సోడియం : 34.7 గ్రా.
పొటాషియం : 37 గ్రా.
మాంగనీస్ : 0.56 గ్రా.
కెరోటిన్ : 18 మైక్రో గ్రా.
శక్తి : 46 కిలోక్యాలరీలు
మీకు తెలుసా?- క్రీ.శ.1398లో పైనాపిల్ అనే పేరును అన్నట్లుగా రికార్డులు ఉన్నాయి.
- అమెరికాలో దీన్ని కనుగొన్నారు. యూరోపియన్లు దీనికి పైనాపిల్ అని పేరు పెట్టారట.
- పైనాపిల్ చెట్టు జీవిత కాలం 50 సంవత్సరాలు. కేవలం పైనాపిల్ పై భాగాన్ని కట్ చేసి దాన్ని పాతిపెడితే పైనాపిల్ చెట్టు వస్తుంది.
- ప్రపంచంలోనే అతి పెద్ద పైనాపిల్‌ని 2011లో ఆస్ట్రేలియాకి చెందిన క్రిస్టిన్ మెక్‌కొల్లమ్ పండించాడు. దీని ఎత్తు 32 సెం.మీ.లు బరువు 8.28 కేజీలు.
- 75 శాతం పైనాపిల్‌లో యూరోప్‌లో అమ్ముడుపోతాయి.
n హవాయిలో రికార్డు స్థాయిలో ఈ పంట పండిస్తున్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా కొన్ని వందల ఎకరాల్లో పైనాపిల్ సాగు చేస్తున్నారు.
- పైనాపిల్‌ని ఇసుకతో కలిపి మొండి మరకలు ఉన్నచోట రుద్దితే మరకలు మాయమవుతాయి.
- ఆస్ట్రేలియన్ యాసలో ముగింపు పలుకడానికి లేదా చెడు ఒప్పందాలు ఏర్పరుచుకోవడానికి ఒక పదం ఉద్భవించింది. 1930లో బ్రిటన్‌లో బీయింగ్ ఆన్ ద పైనాపిల్ అనే పదం ఒక ప్రెస్‌గా మారింది.
- ప్రపంచం మొత్తం మీద 1/3 పైనాపిల్ పండ్లు హవాయిలో ఉత్పత్తి అవుతాయి.
- ఫ్రూట్‌సలాడ్స్, డ్రింక్స్‌లాగే కాదు.. పైనాపిల్‌తో వైన్‌ని కూడా తయారుచేస్తారు.
ఆరోగ్యం మహాభాగ్యం.. రోజూ ఓ కప్పు పైనాపిల్ ముక్కలు తీసుకుంటే క్యాన్సర్, గుండె జబ్బులు దరిచేరకుండా ఉంటాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. రోజు మొత్తానికి అవసరమైన
విటమిన్ సి ఈ పైనాపిల్ ద్వారా పొందవచ్చు.

- పైనాపిల్‌లో బ్రొమిలైన్ అనే ప్రొటియోలిటిక్ ఎంజైమ్ ఉంటుంది. తీసుకున్న ఆహారాన్ని ప్రొటీన్లుగా జీర్ణం చేయడమే దీని పని. అందుకే అజీర్తికి ఇది మంచి మందు.
- కీళ్లనొప్పులు పైనాపిల్ తింటే తగ్గుముఖం పడుతాయి. కారణం.. ఇందులో బ్రొమిలైన్‌కి యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు మెండు. అయితే దీన్ని ఉదయం భోజనం తర్వాత తింటే మంచిది.
- పైనాపిల్‌లోని ఎంజైమ్ రుమటాయిడ్ ఆర్థ్రరైటిస్ కారణంగా దెబ్బతిన్న కణజాలాన్ని త్వరితగతిన బాగు చేస్తుంది. మధుమేహం కారణంగా ఏర్పడే పుండ్లని, ఇతరత్రా గాయాల్ని కూడా ఇది త్వరగా తగ్గిస్తుంది. ఈ రసం తెగిన గాయాలపై వేస్తే రక్తస్రావం తగ్గుతుంది.
- ఇందులో సమృద్ధిగా పొటాషియం ఉండడం వల్ల కొన్ని మూత్రపిండాల వ్యాధుల్లో మూత్ర ప్రక్రియ సరిగా లేని వారికి చక్కటి ఫలితాలను ఇస్తుంది. ఇది కడుపులోని పురుగుల్ని చంపేస్తుంది.
- పైనాపిల్‌ను రోజూ రెండు ముక్కల చొప్పున తింటే బెస్ట్. ఇది రక్తం గడ్డకట్టడాన్ని అడ్డుకుంటుంది. అంటే.. రక్తనాళాల్లోంచి గడ్డల్ని తొలిగించి ప్రసారాన్ని మెరుగుపరుస్తుంది. హీమోఫీలియాతో బాధ పడేవాళ్లు మాత్రం వీటిని తినకపోవడమే మంచిది.
- గొంతునొప్పి, బ్రాంకైటిస్ వంటి శ్వాసకోశ వ్యాధుల్ని పైనాపిల్ తగ్గిస్తుంది. ఈ రసాన్ని గొంతులో పోసుకొని పుక్కిలిస్తే గొంతునొప్పి, టాన్సిల్స్ నివారణ అవుతాయి.
- వృద్ధాప్యంలో వచ్చే కంటి సమస్యలకు పైనాపిల్‌ను మించిన ఔషధం లేదు. ఇందులోని విటమిన్ - సి బ్యాక్టీరియాతో పోరాడి చిగుళ్ల సమస్యను నివారిస్తుంది.
- ఎముకలకు ఇది బలం. పెరిగే పిల్లలకూ, వృద్ధులకూ ఇది చాలా మంచిది. జ్వరం, దగ్గు, జలుబు వచ్చినప్పుడు ఈ పైనాపిల్ జ్యూస్ తీసుకోవడం మంచిది.
- ఇందులోని పీచుపదార్థం మలబద్దకానికి, ఆడవాళ్లకైతే రుతుక్రమ సమస్యలకు మంచి మందుగా పనిచేస్తుంది.
- పైనాపిల్ డిప్రెషన్, మతిమరుపును తగ్గిస్తుంది. జాండిస్, కాలేయ వ్యాధులున్న వారు ప్రతిరోజూ ఈ జ్యూస్ తాగితే మంచిది.
అందమే ఆనందం.. పైనాపిల్ ముఖానికి ఐప్లె చేసే ముందు మొదట చేతి మీద లేదా చెవి వెనుక భాగంలో కాస్త రుద్ది టెస్ట్ చేయాలి. చర్మం మంట, దురద, ఎర్రగా మారడం లాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుంటే ముఖానికి రాసుకోవచ్చు.
-చర్మకాంతిని పొందాలంటే పైనాపిల్ జ్యూస్ సహాయపడుతుంది. ఇందులోని బ్రొమైలిన్ ఎంజైమ్ మొటిమలను నివారించడంతో పాటు చర్మ సమస్యలను కూడా నివారిస్తుంది. చర్మం ఎలాసిటిని పెంచుతుంది. కొల్లాజెన్ ఉత్పత్తి పెంచడం వల్ల ముఖంలో ముడుతలు, మచ్చలు లేకుండా స్కిన్‌టోన్ పెరుగుతుంది.
-ప్రతిరోజూ ఒక గ్లాసు పైనాపిల్ జ్యూస్ తాగడం వల్ల ఫెయిర్ అండ్ క్లియర్ స్కిన్ పొందవచ్చు. ఈ జ్యూస్‌ని నీళ్లలో కలిపి ముఖానికి పట్టించి డ్రై అయిన తర్వాత శుభ్రం చేసుకోవడం వల్ల చర్మకాంతి మరింత పెరుగుతుంది.
-పైనాపిల్లోని విటమిన్ సి, అమైనో యాసిడ్స్ చర్మంలో కొలెజెన్‌ను ఎక్కువగా ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. చర్మాన్ని బిగువుగా, పటుత్వాన్ని కోల్పోకుండా చేస్తాయి. అలాగే చర్మం మీది మృతకణాలను తొలిగించడంలో ఈ జ్యూస్ బాగా పనిచేస్తుంది.
-పైనాపిల్ ైస్లెస్ తీసుకొని చర్మం మీద నేరుగా మర్దన చేయాలి. ఆరిన తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. దీనివల్ల మొటిమలు తగ్గుముఖం పట్టడమే కాదు.. వాటివల్ల మచ్చలు కూడా క్రమంగా చర్మఛాయలో కలిసిపోతాయి.
-పైనాపిల్‌లో, నిమ్మరసం మిక్స్ చేసి ముఖానికి రాయాలి. ఇందులో విటమిన్ సి, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు అధిక మొత్తంలో ఉంటాయి. ఇవి శరీరంలో వ్యాధినిరోధక శక్తిని పెంచడమే కాకుండా, చర్మం నవయవ్వనంతో నిగనిగలాడేలా చేస్తాయి. చర్మం యంగ్‌గా కనబడడానికి సహాయపడుతుంది.
గులాబీ పైనాపిల్పండ్ల ఉత్పత్తిలో శాస్త్రీయంగా ఎన్నో రకాల మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సంప్రదాయ ఉత్పత్తికి భిన్నంగా ద్రాక్షలో గింజలు లేకుండా.. పండ్ల పరిమాణాన్ని పెంచుతూ వినూత్న రీతిలో ఉత్పత్తి చేస్తున్నారు. పైనాపిల్ పైన ముదురు గోధుమ రంగు పొలుసులతో.. లోపల పసుపు రంగులో ఉంటుందని అందరికీ తెలుసు. అయితే ఈ పండును గులాబీ రండులోకి మార్చడానికి డెల్ మౌంటే అనే ప్రముఖ ఆహార ఉత్పత్తి సంస్థ 2005 నుంచి ప్రయత్నాలు చేస్తున్నది. 2016 డిసెంబర్‌లోనే ఈ పండు ఉత్పత్తికి యూ.ఎస్.ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అనుమతినిచ్చింది. టమాట.. పుచ్చకాయ వంటి ఎరుపు, గులాబీ రంగులుండే పండ్లలో లైకోపీన్ అనే వర్ణకారకం ఉంటుంది. అది పైనాపిల్‌లోనూ ఉంటుంది. కానీ కొన్ని ఎంజైమ్స్ గులాబీ వర్ణకారకాన్ని పసుపు రంగులోకి మార్చేస్తాయి. అలాంటి ఎంజైమ్స్‌ను నియంత్రించి ఈ గులాబీ రంగు పైనాపిల్ పండ్లను ఉత్పత్తి చేస్తున్నారు. త్వరలో ఇవి మార్కెట్‌లోకి అందుబాటులోకి రానున్నాయి.
-సౌమ్య పలుస

జడివానలో జాగ్రత్త! | Rainy Season | Mohanpublications | Granthanidhi | Bhakthipustakalu



జడివానలో జాగ్రత్త! | Rainy Season | Mohanpublications | Granthanidhi | Bhakthipustakalu Rain Fever Cold and cough Cough Cold Throat infection Immunity


జడివానలో జాగ్రత్త!
ఎండాకాలం ఎటో ఎగిరిపోయింది. నాలుగు చినుకులు పడితే చాలు. .కొంత మందిలో దడ మొదలవుతుంది. ఎందుకంటే, ఏ క్షణాన దగ్గు, జలుబు, జ్వరం, తలనొప్పి, ఒంటినొప్పులు చుట్టుముడతాయోనన్న దిగులు.. భయం వాళ్లను వెంటాడుతూ ఉంటాయి. అలా అని ఈ వాతావరణ మార్పులు అందరినీ అలా ఏమీ వేధించవు. చాలామంది, మిగతా రుతువుల్లోలాగే హాయిగానే ఉండిపోతారు. కొందరు మాత్రం ముక్కుతూ మూల్గుతూ ఉంటారు. ఎందుకిలా అంటే ఈ అనారోగ్యాలన్నింటికీ అసలు మూలం వ్యాధినిరోధక శక్తి లోపాలే అంటున్నారు వైద్యనిపుణులు ఆ వివరాల్లోకి వెళితే..

వర్షాకాలంలో జలుబు, దగ్గు, జ్వరం, ఒంటినొప్పులు, గొంతునొప్పి ఇలా ఒకదానికి ఒకటి తోడై ఒక్కోసారి కదలకుండా చేస్తాయి. నిలువెల్లా నీరసం, నిస్పత్తువ ఆవరించడంతో వృత్తిపరమైన ఉద్యోగ వ్యాపారాలకు ఎగనామం పెట్టడం తప్ప మార్గం కనిపించదు. అప్పటిదాకా అణగిమణగి పడి ఉన్న వైరస్‌, బ్యాక్టీరియాలు ఈ రుతువులో జూలు దులపడమే ఇందుకు కారణం. చాలా మందిలో పరిసరాల పరిశుభ్రత పట్ల ఉండే అత్యంత సహజమైన నిర్లక్ష్యం దీనికి తోడవుతుంది. వర్షం కురిసి కాసేట్లో వెలిసిపోవచ్చు. కానీ, పరిసరాలన్నీ నీరు నిలిచిపోతుంది. అలా నిలిచిపోయిన నీళ్లల్లో ఎక్కడెక్కడినుంచో కొట్టుకు వచ్చిన మలినాలన్నీ ఉంటాయి. మలేరియా, కలరా కార కమయ్యే దోమలె న్నో పుట్టడానికి ఒక అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఇదే సమయంలో అనేకమైన వైరస్‌, బ్యాక్టీరియాలు పుంజుకుంటాయి. ఏమైనా కలరా, మలేరియా, డెంగ్యూ, స్వైన్‌ఫ్లూ వంటి సమస్యలు ఈ రుతువులో ఊపందుకుంటాయి. మొత్తంగా చూస్తే, బ్యాక్టీరియా, వైరస్‌ ఇన్‌ఫెక్షన్ల బారిన పడే వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది.

 
కలుషితమైన నీటిలో...

గమనించకపోవడం వల్ల గానీ, అవసరమైన జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల గానీ, ఈ రోజుల్లో కలుషితమైన ఆహార పానీయాలు అతిగా మన శరీరంలోకి చేరిపోతాయి. ఇవి పలురకాల జబ్బులకు కారణమవుతూ ఉంటాయి, ప్రత్యేకించి కలుషిత ఆహార పానీయాలతో జీర్ణవ్యవస్థ పనితనం తగ్గిపోతుంది. తిన్నదేదీ ఒంటికి పట్టదు. ఫలితంగా శరీరం రోజురోజూకూ బలహీనపడుతుంది. దీనివ ల్ల శరీరం చాలా సులువుగా బ్యాక్టీరియా, వైరస్‌ ఇన్‌ఫెక్షన్ల బారిన పడుతుంది. ఇదే సమయంలో పలురకాల శ్వాసకోశ సంబంధ వ్యాధులు మొదలవుతాయి అంతకు ముందే న్యుమోనియా, ఆస్తమా, సీ.ఓ.పీ.డి (క్రానిక్‌ ఆబ్‌స్ట్రక్టివ్‌ పల్మనరీ డిసీజ్‌) వంటి సమస్యలు ఉన్నవారు, పొగతాగే అలవాటు ఉన్నవారు, లేదా ఎక్కువగా పొగలో పనిచేసేవారు, పరిశ్రమల్లో పనిచేసేవారిలో శ్వాసకోశాల పనితనం తగ్గిపోతుంది. ఈ కాలంలో కొత్తగా న్యుమోనియా బారిన పడే వారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. శరీరంలో వైరస్‌ లోడ్‌ బాగా పెరిగిపోవడం వల్ల జలుబు, దగ్గు, గొంతు సమస్యలతో పాటు, సైనసైటిస్‌ బాధలు కూడా ఎక్కువవుతాయి.

ఇమ్యూనిటీని పెంచుకోవడం ఎలా?


బాహ్య కారణాలతో పాటు శరీర కణజాలంలో వ్యర్థ, విషపదార్థాలు పేరుకుపోవడం వ్యాధినిరోధక శక్తిని తగ్గించే ఒక పెద్ద కారణం. మనం తీసుకునే ఆహార పానీయాల్లోని వ్యర్థపదార్థాలు పూర్తి స్థాయిలో విసర్జింపబడనప్పుడు కూడా కణజాలంలో వ్యర్థపదార్థాలు పేరుకుపోతాయి. దీనివల్ల శరీర ధాతువ్యవస్థ సక్రమంగా పనిచేయదు. ఎంత మంచి ఆహారం తీసుకున్నా ఒంటికి పట్టదు. దీనివ ల్ల కణజాలం క్రమక్రమంగా క్షీణించడం మొదలవుతుంది. దీనికి తోడు అప్పటిదాకా ఉన్న ఎండల వల్ల శరీరంలోని బలం, జీవరసాలన్నీ ఆవిరైపోయి ఉంటాయి. ఫలితంగా శరీరం బలహీనపడి ఉంటుంది. దీనికి తోడు హఠాత్తుగా మారిన వాతావరణానికి తట్టుకోలేక శరీరం తట్టుకోలేకపోతుంది. ఆ తట్టుకునేందుకు జరిగే అంతర్ఘత ఘర్షణ వల్ల కూడా వ్యాధినిరోధక శక్తి తగ్గిపోతుంది. దీనికి తోడు జీర్ణశక్తి తగ్గిపోతుంది. వ్యర్థపదార్థాలను శరీరంలోంచి తొలగించడానికి పంచకర్మ చికిత్సలు అవసరమవుతాయి. జీర్ణశక్తిని పెంచుకోవడం కోసమైతే...




శొంఠి, మిర్యాలు, పిప్పళ్ల మిశ్రమమైన త్రికటు చూర్ణం అరచెంచా మోతాదులో రోజుకు ఒక పూట వేసుకోవాలి. ఇది మామూలుగానే అనిపించినా జీర్ణశక్తిని పెంచడంలో బాగా ఉపకరిస్తుంది. దీనికి తోడు అగ్నితుండి వటి మాత్రలను రోజుకొకటి చొప్పున 15 రోజల పాటు భోజనం తర్వాత వేసుకోవాలి. అలాగే చిత్రకాదివటి మాత్రలను ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి చొప్పున వేసుకోవాలి. లేదా నాలుగు వంతుల కరక్కాయ పొడిలో రెండు వంతుల సైంధవ లవణం కలిపి అరచెంచా ఉదయం, అరచెంచా సాయంత్రం భోజనం తర్వాత తీసుకోవాలి. లేదా పంచకోలాసవం ద్రావణాన్ని ఉదయం రెండు చెంచాలు, సాయంత్రం రెండు చెంచాలు తీసుకోవాలి. ఇది కూడా జీర్ణశక్తిని బాగా పెంచుతుంది.

వ్యాధి నిరోధక శక్తి పెరగడానికి, ఉసిరికాయ రసం గానీ, పొడిగానీ, బాగా తోడ్పడతాయి. రోజూ ఉదయాన్నే గోరు వెచ్చని నీళ్లల్లో ఒక చెంచా తేనె కలిపి తాగితే ఎంతో మేలు కలుగుతుంది. వీటికి తోడు

గుడూచి (తిప్పతీగె) మాత్రలు రోజు ఒకటి చొప్పున వేసుకోవాలి.

రోజూ నాలుగు తులసి ఆకులు నమిలి తినేస్తే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.

- డాక్టర్‌ డి. ప్రశాంత్‌ కుమార్‌, శక్తి ఆయుర్వేదిక్‌ క్లినిక్‌, హైదరాబాద్‌

వివిధ వ్యాధులు

కలుషిత వాతావరణం ఉన్న చోట, సహజంగానే ఎలుకల సంచారం కూడా ఎక్కువగా ఉంటుంది. ఎలుకల మూత్రం కలిసిన నీరు శరీరంలోకి వెళ్లడం వల్ల లెప్టోస్పైరోసిస్‌ అనే వ్యాధి రావచ్చు. ఈ మూత్రంలోని వైరస్‌ వల్ల జ్వరం రావడంతో పాటు, శరీరమంతా వణికిపోవడం, తలనొప్పి, కండరాల నొప్పి వంటివి వస్తాయి. ఈ వైరస్‌ కాలేయాన్ని దెబ్బ తీయడంతో పాటు జాండిస్‌ రావడానికి కూడా కారణం కావచ్చు. దీనికి తోడు కిడ్నీలు దెబ్బతినవచ్చు. మరికొందరిలో ప్లేట్‌లెట్‌లు పడిపోయే ప్రమాదం కూడా ఏర్పడుతుంది.

డెంగ్యూ ఫీవర్‌లో తీవ్రమైన జ్వరం, రక్తపోటు పడిపోవడం, ప్లేట్‌లెట్లు తగ్గిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఆ లక్షణాలు కనిపించిన మరుక్షణమే ఆ వ్యక్తిని ఆసుపత్రికి తరలించాలి.

కలరా సోకితే బియ్యం కడిగిన నీళ్లలా రోజుకు 20 దాకా విరేచనాలు అవుతూనే ఉంటాయి. కడుపు నొప్పి కూడా ఉంటుంది. దీనికి తోడు సోడియం, లవ ణాలు త గ్గిపోతాయి. రక్తపోటు పడిపోతుంది.


 
ఆహారం


పరిశుభ్రమైన ఆహారంతో పాటు, కాచి చల్లార్చి వడబోసిన నీళ్లను మాత్రమే తాగాలి. కూరగాయలకు అధిక ప్రాధాన్యమివ్వాలి. చ పాతీ, బ్రెడ ్లకన్నా, సులభంగా జీర్ణమయ్యే వేడి అన్నమే ఎంతో మేలు. తరచూ ఫ్రూట్స్‌ తీసుకోవాలి. డయేరియా ఉంటే పెరుగు అన్నం, మజ్జిగ, ఓ.ఆర్‌.ఎస్‌ ఇలా ఏవైనా ద్రవపదార్థాలే ఇవ్వాలి.

హెపటైటిస్‌ ఏ, ఇ. లివర్‌ దుష్ప్రబావానికి గురైనప్పుడు తలెత్తే సమస్యలే హెపటైటిస్‌ ఏ.ఇ. వీటికి కూడా కలుషితమైన ఆహార పానీయాలే కారణం. ఈ వైరస్‌ సోకిన వారిలో డయేరియాయే ప్రధాన లక్షణంగా కనిపిస్తుంది. ఈ సమస్యను నిర్లక్ష్యం చేసినా కాలేయం దెబ్బ తినే ప్రమాదం ఉంది. హెపటైటిస్‌ బి, సి ల మూలాలు వేరు. ఇవి రక్తం ఎక్కించడం ద్వారా గానీ, ఇంజెక్లన్ల ద్వారా గానీ, లైంగిక సంబంధాల వల్ల వచ్చే అవకాశం ఉంది. అయితే హెపటైటిస్‌- బి కి మాత్రమే టీకాలు ఉన్నాయి. హెపటైటిస్‌ ఏ, ఇ లకు తప్ప, హెపటైటిస్‌ బి, సి లకు వాతావరణాలకూ సంబంధం లేదు. చాలా సార్లు ఇవన్నీ వర్షాకాలంలో వచ్చే మామూలు సమస్యలే అనుకుంటూ కొందరు నిర్లక్ష్యంగా ఉండిపోతారు. ఆ ధోరణి విడనాడితేనే ఈ సమస్యల్ని అధిగమించడం సాధ్యమవుతుంది!


 
నిర్లక్ష్యం చేస్తే...

కలరా, మలేరియా, డెంగ్యూ, స్వైన్‌ఫ్లూ, వంటి ఏ వ్యాధి సోకినా వెంటనే వైద్య చికిత్సలు ప్రారంభించాలి. నిర్లక్ష్యంగా ఉండిపోతే లివర్‌ గానీ, కి డ్నీలు గానీ దె బ్బతినవచ్చు. జీవక్రియలన్నీ స్తబ్ధంగా ఉండిపోయి ఒక్కోసారి ప్రాణాపాయం కూడా ఏర్పడవచ్చు. గుండె మీద ఒత్తిడి పెరిగి గుండెపోటుకు కారణమై అది కూడా ప్రాణాపాయానికి దారి తీయవచ్చు.

నివారణ మార్గాలు
కొన్ని జాగ్రత్తల ద్వారా మలేరియా, డెంగ్యూ ఈ రెండు వ్యాధుల నుంచి సులువుగానే తమను తాము కాపాడుకోవచ్చు. ఆ విధానం మరేదో కాదు పరిసరాలను పరిశభ్రంగా ఉంచుకోవడమే! కలుషిత వాతావరణం, కలుషిత ఆహార పానీయాల ప్రభావం ఉండనే ఉంటుంది. అయితే బాలబాలికలు, వృద్ధులు, దీర్ఘకాలంగా మధుమేహం ఉన్నవాళ్లు, అవయవ మార్పిడి చేయించుకున్నవాళ్లు, ఈ పరిస్థితుల్లో మరింత తొందరగా వ్యాధిగ్రస్థమయ్యే అవకాశం ఉంది. వీరితో పాటు ఆస్తమా గానీ, సీ.ఓ.పీ.డీ గానీ, ఇతర ఊపిరి తిత్తుల వ్యాధులు ఉన్నవాళ్లు, కిడ్నీ సమస్యలు ఉన్నవాళ్లు కూడా తొందరగా వైరస్‌, బ్యాక్టీరియాల బారిన పడే ప్రమాదం ఉంది.



 
ఇలాంటి వాళ్లు, నిమోకోకల్‌, ఇన్‌ఫ్లూయెంజా, స్వైన్‌ఫ్లూ టీకాలు వేయించుకోవడం ఎంతో శ్రేయస్కరం, ఈ టీకాలు తీసుకున్నా ఆహార పానీయాల, పరిసరాల పరిశుభ్రత విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిందే! ఒకవేళ ఏదైనా వ్యాధి సోకిన అనుమానం కలిగితే ఏ మాత్రం జాప్యం చేయకుండా, రక్తపరీక్షలు చేయించుకుని నిజంగానే వ్యాధి ఉన్నట్లు తేలితే వెంటనే చికిత్సలు తీసుకోవాలి. వర్షాకాలంలో వచ్చే ఈ వ్యాధుల్లో ఏది సోకినా ఎంత తొందరగా వైద్య చికిత్సలు చేపడితే అంత మేలు కలుగుతుంది.




- డాక్టర్‌ ఏ. వి. రావు
ఫిజిషియన్‌ (ఇంటర్నల్‌ మెడిసిన్‌)
నోవా క్లినిక్‌, దిల్‌షుక్‌నగర్‌, హైదరాబాద్‌

బంగారం కొనుగోలులో జాగ్రత్తలు | Gold Buying Tips | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu


బంగారం కొనుగోలులో జాగ్రత్తలు | Gold Buying Tips | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu Gold Gold Ornaments Indian Bridal Gold Ornaments Gold Purchasing Tips Gold Purchase Care Gold Buying Tips Publications in Rajahmundry, Books Publisher in Rajahmundry, Popular Publisher in Rajahmundry, BhaktiPustakalu, Makarandam, Bhakthi Pustakalu, JYOTHISA,VASTU,MANTRA, TANTRA,YANTRA,RASIPALITALU, BHAKTI,LEELA,BHAKTHI SONGS, BHAKTHI,LAGNA,PURANA,NOMULU, VRATHAMULU,POOJALU,  KALABHAIRAVAGURU, SAHASRANAMAMULU,KAVACHAMULU, ASHTORAPUJA,KALASAPUJALU, KUJA DOSHA,DASAMAHAVIDYA, SADHANALU,MOHAN PUBLICATIONS, RAJAHMUNDRY BOOK STORE, BOOKS,DEVOTIONAL BOOKS, KALABHAIRAVA GURU,KALABHAIRAVA, RAJAMAHENDRAVARAM,GODAVARI,GOWTHAMI, FORTGATE,KOTAGUMMAM,GODAVARI RAILWAY STATION, PRINT BOOKS,E BOOKS,PDF BOOKS, FREE PDF BOOKS,BHAKTHI MANDARAM,GRANTHANIDHI, GRANDANIDI,GRANDHANIDHI, BHAKTHI PUSTHAKALU, BHAKTI PUSTHAKALU, BHAKTHI


బంగారం కొనుగోలులో జాగ్రత్తలు

మన వంటిపై ఉన్న ఆభరణాల్లో ఉన్న బంగారం ఎంత...? షాపులో విక్రయిస్తున్న ఆభరణాల్లో ఉన్న స్వచ్ఛమైన బంగారం పాళ్లు ఎంత..? అసలు బంగారం విలువ ఎంత... మనం పెడుతున్నది ఎంత..? ఎన్ని క్యారట్లు ఉందన్న విషయం ఎలా తెలుస్తుంది...? బంగారం పట్ల మక్కువ ఉన్నవారు ఇవన్నీ తెలుసుకోవాల్సినవే. 

బంగారం స్వచ్ఛతను క్యారట్ల రూపంలో చెబుతారు. 99.9 శాతం స్వచ్ఛత ఉంటే అది 24 క్యారట్ల బంగారం అని అర్థం. ఇది చాలా సాఫ్ట్ గా ఉంటుంది. కనుక 24 క్యారట్ల స్వచ్ఛతతో ఆభరణాలను తయారు చేయరు. ధరించే ఆభరణాలు గట్టిగా, మన్నికగా ఉండాలి. అందుకే స్వచ్ఛమైన బంగారాన్ని గట్టి చేయడం కోసం రాగి, వెండి, కాడ్మియం, జింక్ వంటి ఇతర లోహాలను కలుపుతారు. ఈ ఇతర లోహాలు ఎంత శాతం కలిశాయన్న దాని ఆధారంగా బంగారం స్వచ్ఛత 22 క్యారట్లు, 18 క్యారట్లు, 14 క్యారట్లు అంతకంటే తక్కువ క్యారట్లకు తగ్గిపోతుంది.

24 క్యారట్లు అంటే 99.9 శాతం స్వచ్ఛత అని చెప్పుకున్నాం కదా. 22 క్యారట్లు అంటే 91.6 శాతమే ఉన్నట్టు. 8.4 శాతం ఇతర లోహాలు కలిశాయని అర్థం. అదే 18 క్యారట్లు అయితే అందులో ఉన్న బంగారం స్వచ్ఛత 75 శాతం. 14 క్యాటర్లలో బంగారం 58.5శాతం మాత్రమే. 12 క్యారట్లలో 50 శాతం మాత్రమే బంగారం ఉంటుంది. 10 క్యారట్లలో 41.7 శాతానికి మించి బంగారం ఉండదు. 



స్వచ్ఛతకు నిదర్శనం హాల్ మార్క్

బంగారు ఆభరణాల్లో స్వచ్ఛతను బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) ధ్రువీకరిస్తుంది. ఈ ధ్రువీకరణ హాల్ మార్క్ రూపంలో ఉంటుంది. కొనే సమయంలో ఆభరణాలపై ఈ గుర్తు ఉందేమో చూసుకోవాలి. భారతీయ ప్రమాణాల సంస్థ నగలను పరీక్షించిన అనంతరం హాల్ మార్క్ ను వర్తకులకు జారీ చేస్తుంది. కనుక ఈ మార్క్ ఉన్న ఆభరణాలను నాణ్యమైనవిగా పరిగణించవచ్చు. హాల్ మార్క్ లో బీఐఎస్ స్టాండర్డ్ మార్క్ ఉంటుంది. తర్వాత బంగారం స్వచ్ఛతను తెలియజేసే నంబర్ ఉంటుంది. 99.9 స్వచ్ఛత ఉంటే దాన్ని 999గా పేర్కొంటారు. అలాగే, 23 క్యారట్లకు 958, 22 క్యారట్లు అయితే 916 నంబర్, 21 క్యారట్లకు 875, 18 క్యాటర్లకు 750, 17 క్యారట్లకు 708, 14 క్యారట్లకు 585 నంబర్ సూచిస్తారు.

ఈ నంబర్ తర్వాత హాల్ మార్క్ వేసిన సెంటర్ మార్క్ కూడా ఉంటుంది. తయారైన సంవత్సరం ఇంగ్లిష్ అక్షరం కోడ్ రూపంలో ఉంటుంది. ఎలా అంటే 2000 సంవత్సరానికి A కేటాయించారు. ఇక అక్కడి నుంచి ఒక్కో సంవత్సరానికి వరుసలో ఇంగ్లిష్ అక్షరాలను కేటాయిస్తుంటారు. చివరిలో బీఐఎస్ ధ్రువీకరించిన ఆభరణాల తయారీదారుల గుర్తు ఉంటుంది. నిజానికి మన దేశంలోనే 22 క్యారట్ల బంగారం ఎక్కువగా వినియోస్తున్నది. ఇతర దేశాల్లో 14 క్యారట్ల నుంచి 18 క్యారట్ల మధ్యనున్న ఆభరణాలే ఎక్కువగా వాడుతుంటారు. 

భూతద్దం సాయంతో ఆభరణంపై ఉన్న హాల్ మార్క్ వివరాలను పరిశీలించవచ్చు. అనుమానం ఉంటే హాల్ మార్క్ టెస్టింగ్ సెంటర్ కు వెళ్లి పరీక్షించుకోవచ్చు. హాల్ మార్క్ బంగారు ఆభరణాలకే కాదు, వెండి ఆభరణాలకు కూడా వినియోగిస్తుంటారు. అయితే, వాస్తవంలో హాల్ మార్క్ వెండి ఆభరణాల విక్రయం చాలా తక్కువగానే ఉంది. కొనుగోలు దారుల్లో అంతగా అవగాహన లేకపోవడంతో వెండిలో మోసాలు కొనసాగుతూనే ఉన్నాయి. బీఐఎస్ లైసెన్స్ పొందిన ఆభరణాల వర్తకుల వివరాలనుhttp://www.bis.org.in/ లింక్ నుంచి తెలుసుకోవచ్చు.

ధర, ఎన్నో రకాల చార్జీలు

బంగారం ధర క్యారట్లు, బరువును బట్టి మారిపోతుంటుంది. ఆభరణాల తయారీ సమయంలో బంగారం కొంత వృధా అవుతుందని చెప్పి వేస్టేజీ చార్జీలను బంగారం వర్తకులు రాబడుతుంటారు. ఆభరణాలను బట్టి ఈ వృధా చార్జీలు ఆధారపడి ఉంటాయి. ఆభరణాలు అన్నీ ఒకేలా ఉండవు. కొన్ని అధిక డిజైన్లతో ఉంటాయి. కొన్ని సాధారణంగా ఉంటాయి. ఈ డిజైన్, వాటి తయారీకి పట్టే సమయాన్ని బట్టి మేకింగ్ చార్జీలు వేస్తుంటారు. రాష్ట్ర ప్రభుత్వం నిబంధనల మేరకు వ్యాట్ చార్జీ కూడా ఉంటుంది. బంగారం కొనుగోలుపై ఇన్ని రకాల చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. వాస్తవంలో చూస్తే ఈ చార్జీలు అన్ని షాపుల్లో ఒకే విధంగా ఉండవు. తయారీ చార్జీలు, వృధా, ఇతర చార్జీలు కూడా షాపును బట్టి మారిపోతుంటాయి.

తులం (10 గ్రాములు) బంగారు నెక్లెస్ కొంటున్నారు. షాపు నిర్వాహకుడు తులం 30వేల రూపాయలు అని చెప్పాడనుకోండి. అప్పుడు... తులం బంగారం ధర రూ.30వేలు అవుతుంది. దీనిపై 12 శాతం వృధా చార్జీ అనుకుంటే రూ.3600 అవుతుంది. తయారీ చార్జీలు గ్రాముకు 50 చొప్పున రూ.500. ఈ మొత్తం రూ.34,100. దీనిపై GST 3 శాతం రూ.1023. ఇప్పుడు మొత్తం రూ.35,123.

బేరమాడితే ఈ చార్జీల్లో తగ్గింపు లభిస్తుంది. తులం బంగారం మార్కెట్ ధరపై కొంత తగ్గింపు ఇవ్వవచ్చు. అలాగే, తయారీ, వృధా చార్జీలు కూడా తగ్గుతాయి. కొనే సమయంలో కచ్చితంగా బిల్లు తీసుకోవాలి. ఎస్టిమేషన్ పేపరుపై రాతలు చెల్లవు. తిరిగి అవసరం అనుకుంటే కొన్న ఆభరణాలను వెనక్కి తీసకుంటారేమో ముందే తెలుసుకోవాలి. తీసుకునే సదుపాయం ఉన్నచోట కొనుగోలు చేయడం మంచిది. రాళ్లు పొదిగిన ఆభరణాల్లో మొత్తం తూకం నుంచి రాళ్ల బరువు తీసేశారో లేదా పరిశీలించాలి. మోసం చేస్తున్నట్టు గుర్తిస్తే 1860 425 3333 నంబర్ కు కాల్ చేసి తెలియజేయవచ్చు. 

ఇదో మోసం

పూర్వం రోజుల్లో బంగారు ఆభరణాలను చేతితో తయారు చేసేవారు. దాంతో కొంత బంగారం వృధా అవుతుందని చెప్పి ఆ చార్జీలను వినియోగదారుల నుంచి రాబట్టేవారు. కానీ, నేడు చాలా వరకు ఆభరణాలు మెషిన్లపై తయారవుతున్నాయి. ఏ మాత్రం వృధా ఉండదు. అయినా ఈ పేరుతో కస్టమర్ల నుంచి వసూళ్లు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ చార్జీలు కూడా షాపులను బట్టి, ఆభరణాలను బట్టి 10 నుంచి 18 శాతంగా ఉంటున్నాయి. కొన్ని షాపుల్లో 24 శాతం వరకు కూడా వసూలు చేస్తున్నారు. అందుకే బంగారం వర్తకుల ఆర్జన అధిక స్థాయిలో ఉంటుంది.



క్యారట్ మీటర్లు

క్యారట్ మీటర్లు అని ఉంటాయి. బంగారంలో బంగారం ఎంత, ఇతర లోహాలు ఎంత కలిశాయన్నది ఎక్స్ రే కిరణాల సాయంతో ఈ మెషిన్ చెప్పేస్తుంది. కానీ ఈ మెషిన్ కచ్చితంగా చెప్పలేదని బీఐఎస్ అంటోంది. హైదరాబాదు గాంధీ నగర్ ప్రాంతంలోను, గోల్కొండ క్రాస్ రోడ్స్ లోను తూనికలు కొలతల శాఖ ఎక్స్ రే ఫ్లోరోసెంట్ మెషిన్ ఏర్పాటు చేసింది. ఇక్కడ ఎవరైనా సరే తమ ఆభరణాల స్వచ్ఛత గురించి తెలుసుకోవచ్చు. 30 నిమిషాల్లోనే పరీక్ష పూర్తవుతుంది. 

కేడీఎం అర్థమే వేరయా

కేడీఎం బంగారం అని వినే ఉంటారు. అంటే ఆభరణం తయారీలో క్యాడ్మియంతో సోల్డరింగ్ చేస్తారు. కేడీఎం బంగారం ఆభరణాలు 916 స్వచ్ఛత గలవి. క్యాడ్మియం వల్ల ఆరోగ్యానికి హానికరమని భావించిన చాలా దేశాలు దీని వాడకాన్ని నిషేధించాయి. క్యాడ్మియం కరిగే సమయంలో వచ్చే పొగను పీలిస్తే తీవ్ర అనారోగ్యాలు తలెత్తుతాయి. కేడీఎం ఆభరణాలు ఆరోగ్యానికి హానికరమని తెలియజేయాలంటూ చాలా దేశాల్లో నిబంధన ఉంది. కానీ, దురదృష్టకరం ఏమిటంటే మన దగ్గర కేడీఎం అంటే అదేదో నాణ్యమైన ఉత్పాదనకు మారుపేరుగా మార్చేసి విక్రయిస్తున్నారు. 

వన్ గ్రామ్ గోల్డ్

వన్ గ్రామ్ గోల్డ్ పేరుతో ఆభరణాల విక్రయం కూడా జరుగుతోంది. ఈ ఆభరణాలు బంగారంతో చేసినవి కావు. వెండి, రాగితో చేసిన ఆభరణాలకు బంగారం పూత పూస్తారు. అందుకే వీటిని వన్ గ్రామ్ గోల్డ్ గా పేర్కొంటారు. ఇమిటేషన్ జ్యుయెలరీ కంటే వన్ గ్రామ్ గోల్డ్ ఆభరణాలు ఎక్కువ కాలం రంగు పోకుండా ఉంటాయి. అంతేకానీ, ఈ ఆభరణాల్లో ఒక గ్రాము బంగారాన్ని వినియోగిస్తారని కాదు.

caratకు karatకు మధ్య తేడా ఉంది

బంగారంలో స్వచ్ఛతను తెలియజేసేది karat. carat అంటే స్వచ్ఛతకు నిదర్శనం కాదు. వజ్రాలు, రత్నాల్లో బరువు పరిమాణాన్ని సూచించేదని తెలుసుకోవాలి. ఒక carat అంటే 200 మిల్లీ గ్రాములకు సమానం. గ్రాములో 20 శాతం. ఐదు caratలు ఉన్న వజ్రం అయితే దాని బరువు ఒక గ్రాముగా ఉంటుంది. 

బంగారం స్వచ్ఛతను ఎలా తెలుసుకునేది?

* ఆభరణం అంచులను జాగ్రత్తగా పరిశీలించాలి. రంగు పోయి ఉంటే తెలుస్తుంది. అక్కడ బంగారు వర్ణం కాకుండా ఇతర వర్ణం కనిపిస్తుంటే అది కచ్చితంగా బంగారు పూత పూసిన ఆభరణంగా అర్థం చేసుకోవాలి. 

* పళ్ల మధ్యలో పెట్టి మోస్తరు బలంతో ఆభరణాన్ని నొక్కి చూడండి. స్వచ్ఛమైన బంగారమా... బంగారు పూతదా అన్నది సులభంగా తెలిసిపోతుంది.

* బంగారంలో ఇనుము కలిసి ఉంటే అయస్కాంతంతో గుర్తించవచ్చు. ఆభరణం అయస్కాంతానికి అతుక్కుంటే ఇనుము కలిసినట్టే అర్థం.

* షైనింగ్ లేని సిరామిక్ ప్లేట్ పై బంగారు ఆభరణాన్ని రుద్దితే నల్లటి చారలు పడ్డాయనుకోండి. అది స్వచ్ఛమైనది కాదని అర్థం. బంగారు రంగు గీతలు పడితే స్వచ్ఛమైందని తెలుసుకోవాలి.

* అనుమానం ఉంటే కొనుగోలుకు ముందే షాపు దగ్గరే నైట్రిక్ యాసిడ్ తో టెస్ట్ చేయాలని కోరండి. ఆభరణంపై ఓ చుక్క నైట్రిక్ యాసిడ్ వేసిన వెంటనే రసాయనిక చర్య ప్రారంభం అవుతుంది. ఆకుపచ్చ రంగులో కనిపిస్తే బేస్ మెటల్ లేదా బంగారం పూత వేసిందని తెలుసుకోవాలి. బంగారు వర్ణంలోనే రియాక్షన్ కనిపిస్తే బంగారం పూత వేసిన ఇత్తడి అని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. పాల రంగులో కనిపిస్తే బంగారం పూత వేసిన వెండి ఆభరణంగా గుర్తించాలి. ఎటువంటి రియాక్షన్ లేకపోతే దాన్ని అసలైన బంగారు ఆభరణంగా అర్థం చేసుకోవాలి.



బంగారంలోనూ రకాలు

బంగారు ఆభరణం తయారీలో నికెల్, మాంగనీస్ లేదా పల్లాడియం వంటి లోహాలను కలిపితే అప్పుడు అది బంగారు వర్ణంలోనే కొంచెం తెల్లని ఛాయతో ఉంటుంది. రాగి ఎక్కువగా కలిపితే ఎరుపు, గులాబీల చాయలో కనిపిస్తుంది. రోజ్ గోల్డ్ అంటే అందులో 25 శాతం రాగి కలిపినట్టు అర్థం చేసుకోవాలి. అప్పుడు ఆ బంగారం 18 క్యారట్లు మాత్రమేనని అర్థం చేసుకోవాలి. వెండి, మాంగనీసు, రాగిని ఉపయోగించినట్టయితే బూడిద రంగు చాయలో ఉంటుంది. కేవలం వెండిని మాత్రమే కలిపితే గ్రీనిష్ లో కనిపిస్తుంది. పరిశీలించి చూస్తే తప్పించి బంగారానికి ఉన్న ప్రత్యేకత వల్ల ఇవన్నీ స్వచ్ఛమైన బంగారు ఆభరణాలుగానే కనిపిస్తాయి. అమెరికాలో పల్లాడియం లేదా వెండి కలిపిన వైట్ గోల్డ్ ఆభరణాలను పెళ్లిళ్ల సమయంలో ధరిస్తుంటారు. 

టిప్స్

మీ దగ్గరున్న పాత బంగారాన్ని ఎక్సేంజ్ చేసుకుంటున్నా, విక్రయిస్తున్నా నష్టపోకూడదు. 22క్యారట్ల ఆభరణాలు అయితే పూర్తి ధర చెల్లించాల్సిందే. ఇందులో వేస్టేజీ ఏమీ ఉండదు. అయినా కొందరు షాపువారు పాత ఆభరణాలు కరిగించేందుకు చార్జీలు, హ్యాండ్లింగ్ చార్జీలు అంటూ వసూలు చేస్తుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ చెల్లించాల్సిన పని లేదు. మరో షాపుకు వెళ్లి మార్చుకోండి.

మీ దగ్గర అమ్మేవి లేదా ఎక్సేంజ్ చేసుకునేవి ఒకటికి మించి ఉంటే అన్నీ కలిపి కాకుండా ఒక్కో దాన్ని విడిగా తూకం వేయించండి. కొనే ప్రతీ ఆభరణానికి పూర్తి వివరాలతో బిల్లు తీసుకోవాలి. ఎందుకంటే చోరీకి గురైనా, ఇతర అవసరాల్లో ఈ బిల్లే ఆధారం. పేరున్న బ్రాండెడ్ స్టోర్లలో అయితే హాల్ మార్క్ ఆభరణాలు లభించడమే కాదు, అవసరమైతే వాటిని తిరిగి అదే స్టోర్లలో ఎక్సేంజ్ చేసుకోవచ్చు. పైగా మోసపూరిత యత్నానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి. 



వెండి

వెండి లోహం కూడా పూర్తి స్వచ్ఛత గలది సాఫ్ట్ గానే ఉంటుంది. అందుకే వెండి ఆభరణాలను సైతం ఇతర లోహాలను కలిపే చేస్తుంటారు. రాగి, జింక్, నికెల్ ఎక్కువ శాతం ఉపయోగిస్తుంటారు. అందుకే గాలి, నీరుకి ఎక్స్ పోజ్ కావడం వల్ల వెండి ఆభరణాలు నల్లగా మారుతుంటాయి. బంగారు ఆభరణాల వలే వెండి ఆభరణాలకు సైతం హాల్ మార్క్ గుర్తింపు ఉంటుంది. వెండిలో స్వచ్ఛతను శాతాల్లో చూపిస్తారు. వెండి నాణేలు, బార్లు 999 శాతం స్వచ్ఛమైన వెండిని కలిగి ఉంటాయి. అదే స్టెర్లింగ్ సిల్వర్ అంటే, 92.5 శాతం వెండి, 7.5శాతం ఇతర లోహాలు ఉన్నట్టు. వెండిలో స్వచ్ఛతకు గుర్తులుగా 999.9, 999.5, 999, 990, 970, 925, 900, 835, 800 నంబర్లను పేర్కొంటారు. వెండి వస్తువా? కాదా? అన్న అనుమానం కలిగితే కొంచెం బ్లీచింగ్ వేసి చూడండి. వెంటనే అక్కడున్న మడ్డిని పొగొట్టి నల్లగా అయితే అప్పుడు అది వెండి వస్తువే అవుతుంది.

రాష్ట్ర చిహ్నాలు | State icons | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktibooks

రాష్ట్ర చిహ్నాలు | State icons | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktibooks

రాష్ట్ర చిహ్నాలు | State icons | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktibooks

రాష్ట్ర చిహ్నాలు | State icons | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktibooks

     ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వృక్షంగా వేప చెట్టును ప్రభుత్వం గుర్తించింది. దీనితో పాటు మరికొన్ని ముఖ్యమైన రాష్ట్ర చిహ్నాలను బుధవారం ఖరారు చేసింది. ఈ మేరకు అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి జి.అనంతరాము ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర విభజన తర్వాత మొదటిసారిగా ప్రభుత్వం ఈ చిహ్నాలను ఖరారు చేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.



పండుగ ఓణీ_Fashion Tips MohanPublications GRANTHANIDHI BHAKTIPUSTAKALU



Publications in Rajahmundry, Books Publisher in Rajahmundry, Popular Publisher in Rajahmundry, BhaktiPustakalu, Makarandam, Bhakthi Pustakalu, JYOTHISA,VASTU,MANTRA, TANTRA,YANTRA,RASIPALITALU, BHAKTI,LEELA,BHAKTHI SONGS, BHAKTHI,LAGNA,PURANA,NOMULU, VRATHAMULU,POOJALU,  KALABHAIRAVAGURU, SAHASRANAMAMULU,KAVACHAMULU, ASHTORAPUJA,KALASAPUJALU, KUJA DOSHA,DASAMAHAVIDYA, SADHANALU,MOHAN PUBLICATIONS, RAJAHMUNDRY BOOK STORE, BOOKS,DEVOTIONAL BOOKS, KALABHAIRAVA GURU,KALABHAIRAVA, RAJAMAHENDRAVARAM,GODAVARI,GOWTHAMI, FORTGATE,KOTAGUMMAM,GODAVARI RAILWAY STATION, PRINT BOOKS,E BOOKS,PDF BOOKS, FREE PDF BOOKS,BHAKTHI MANDARAM,GRANTHANIDHI, GRANDANIDI,GRANDHANIDHI, BHAKTHI PUSTHAKALU, BHAKTI PUSTHAKALU, BHAKTHI



పండుగ ఓణీ

Publications in Rajahmundry, Books Publisher in Rajahmundry, Popular Publisher in Rajahmundry, BhaktiPustakalu, Makarandam, Bhakthi Pustakalu, JYOTHISA,VASTU,MANTRA, TANTRA,YANTRA,RASIPALITALU, BHAKTI,LEELA,BHAKTHI SONGS, BHAKTHI,LAGNA,PURANA,NOMULU, VRATHAMULU,POOJALU,  KALABHAIRAVAGURU, SAHASRANAMAMULU,KAVACHAMULU, ASHTORAPUJA,KALASAPUJALU, KUJA DOSHA,DASAMAHAVIDYA, SADHANALU,MOHAN PUBLICATIONS, RAJAHMUNDRY BOOK STORE, BOOKS,DEVOTIONAL BOOKS, KALABHAIRAVA GURU,KALABHAIRAVA, RAJAMAHENDRAVARAM,GODAVARI,GOWTHAMI, FORTGATE,KOTAGUMMAM,GODAVARI RAILWAY STATION, PRINT BOOKS,E BOOKS,PDF BOOKS, FREE PDF BOOKS,BHAKTHI MANDARAM,GRANTHANIDHI, GRANDANIDI,GRANDHANIDHI, BHAKTHI PUSTHAKALU, BHAKTI PUSTHAKALU, BHAKTHI


సిల్క్‌ దారాలను చుట్టి, పూసలు గుచ్చి, తీగలు అల్లి .. ఇలా అందమైన ఆభరణాలను రూపొందించుకోవచ్చు. పండుగకు స్వర్ణాభరణాలు ఎలాగూ ఉంటాయి. తేలికగా, అత్యంత ఆకర్షణీయంగా, సంప్రదాయ దుస్తులకు మ్యాచ్‌ అయ్యేలా దారాల ఆభరణాలు ఉంటే.. పండుగ కళ కొత్తగా శోభిళ్లుతుంది. దారాలతో రూపొందించిన ఆభరణాల డిజైన్స్‌లో కొన్ని మోడల్స్‌..

తయారీకి కావల్సినవి
రంగుల సిల్క్‌ దారాలు, సన్నని ప్లాస్టిక్‌ ట్యూ (గాజులు, హారాల తయారీకి)/ టూల్స్, గ్లూ, టూల్స్‌ కట్టర్, పూసలు, బీడ్‌ క్యాప్స్, జుంకా బేస్, చెయిన్స్‌.... వంటివి ముందుగా సిద్ధం చేసుకోవాలి. (ఈ కిట్‌ మార్కెట్‌లోనూ, ఆన్‌లైన్‌లోనూ లభిస్తుంది). ఎక్కువ మొత్తంలో, నచ్చిన డిజైన్లను రూపొందించుకోవడానికి ఈ కిట్స్‌ ఉపయోగపడతాయి. నేరుగా సిల్క్‌ థ్రెడ్‌ ఆభరణాలు కొనుగోలు చేయాలంటే రూ.100 నుంచి వేలల్లో లభిస్తున్నాయి.

Publications in Rajahmundry, Books Publisher in Rajahmundry, Popular Publisher in Rajahmundry, BhaktiPustakalu, Makarandam, Bhakthi Pustakalu, JYOTHISA,VASTU,MANTRA, TANTRA,YANTRA,RASIPALITALU, BHAKTI,LEELA,BHAKTHI SONGS, BHAKTHI,LAGNA,PURANA,NOMULU, VRATHAMULU,POOJALU,  KALABHAIRAVAGURU, SAHASRANAMAMULU,KAVACHAMULU, ASHTORAPUJA,KALASAPUJALU, KUJA DOSHA,DASAMAHAVIDYA, SADHANALU,MOHAN PUBLICATIONS, RAJAHMUNDRY BOOK STORE, BOOKS,DEVOTIONAL BOOKS, KALABHAIRAVA GURU,KALABHAIRAVA, RAJAMAHENDRAVARAM,GODAVARI,GOWTHAMI, FORTGATE,KOTAGUMMAM,GODAVARI RAILWAY STATION, PRINT BOOKS,E BOOKS,PDF BOOKS, FREE PDF BOOKS,BHAKTHI MANDARAM,GRANTHANIDHI, GRANDANIDI,GRANDHANIDHI, BHAKTHI PUSTHAKALU, BHAKTI PUSTHAKALU, BHAKTHI



ఓణీ చుడితేనే తెలుగింటి పండుగకు కళ ఓణీ రెపరెపలాడితేనే పెళ్లింట సందడికి సంబరం ఆధునిక డ్రెస్సులు ఎన్ని మెరిసినా సంప్రదాయ లంగా ఓణీయే సంక్రాంతికి ముచ్చటైన రంగవల్లిక.

నేటి రోజుల్లో అమ్మాయిలతో పాటు అమ్మలు కూడా లంగా ఓణీ ధరించి మురిసిపోతున్నారు. హాఫ్‌ శారీ అనబడే లంగా ఓణీలో ఎన్నో డిజైన్స్‌ వచ్చాయి. వాటిలో..
► పట్టు ఎప్పుడూ అగ్రశ్రేణిలో ఉంటుంది. దీంట్లోనూ కంజీవరం, బెనారస్‌లు ముందుండగా మనవైన పోచంపల్లి ఇక్కత్, ధర్మవరం, ఉప్పాడ, నారాయణ్‌పేట.. పట్టు లంగాలు అమ్మాయిలను బుట్టబొమ్మలుగా చూపుతున్నాయి.
► డిజైనర్‌ లెహెంగా కావాలనుకుంటే మాత్రం నెటెడ్‌ ఫ్యాబ్రిక్‌ నేటికీ ముందున్నది. చూడముచ్చటైన రంగుల హంగుల వల్ల నెటెడ్‌ లెహెంగాలను డిజైనర్లు తీరొక్కవిధంగా తీర్చిదిద్దుతున్నారు. నెటెడ్‌ ఫ్యాబ్రిక్‌ మీద ఎంబ్రాయిడరీ సొబగులు, లేసుల జతలు అల్లిబిల్లిగా చేరి అందంగా రూపుకడుతున్నాయి.

కంచిపట్టు ఫ్యాబ్రిక్‌ లంగా ఓణీకి మంచి అందం తెస్తుంది. శరీరాకృతికి తగ్గట్టు బ్లౌజ్‌కి పొడవు లేదా బుట్ట లేదా పొట్టి చేతులు పెట్టించుకోవాలి. సన్నని అంచు ఉన్న ప్లెయిన్‌ ఓణీ వేసుకుంటే ముచ్చటగా కనిపిస్తారు.

ఫ్యాషన్‌
కంచిపట్టు లాగానే బెనారస్‌ ఫ్యాబ్రిక్‌తో లెహంగాలు రూపొందించుకోవచ్చు. అదే రంగు ప్లెయిన్‌ బ్లౌజ్‌ తీసుకొని, పూర్తి కాంట్రాస్ట్‌ ఓణీ జత చేసుకుంటే లుక్‌ సూపర్బ్‌గా ఉంటుంది.
ఈ లెహెంగాకి ఆంధ్రాలో తయారైన పుట్టపాక శారీని ఎంచుకున్నాను. ప్లెయిన్‌ బ్లౌజ్‌ డిజైన్‌ చేసి, కలంకారీ దుపట్టా జత చేశాను. నగలు హెవీగా ఉండేలా ప్లాన్‌ చేయడంతో ఒక డిఫరెంట్‌ స్టైల్‌ వచ్చింది.

సాదా సీదా – డిజైనర్‌ బ్లౌజ్‌
► ప్లెయిన్‌ని ఇష్టపడేవారు పట్టు పావడాను అదే కాంబినేషన్‌లో ఉన్న పట్టు బ్లౌజ్‌ కుట్టేసి ఆ రెండింటినీ కూర్చుతున్నట్టు ప్లెయిన్‌ ఓణీని వేసుకుంటే పండుగ కళ రెట్టింపు అవుతుంది.
► డిజైనర్‌ బ్లౌజ్‌లలో కలర్‌ కాంబినేషన్స్‌తో పాటు ఎంబ్రాయిడరీ, మగ్గం వర్క్, ప్యాచ్‌ వర్క్, మిర్రర్‌ వర్క్‌.. వంటివి ప్రాచుర్యంలో ఉన్నాయి. ఇవి డిజైనర్‌ లెహెంగాలకే కాకుండా పట్టు లంగాలకు కూడా బాగా నప్పుతాయి.

ప్లెయిన్‌ ఫ్యాబ్రిక్‌ అదీ పట్టు, రా సిల్క్, నెటెడ్‌.. ఏదైనా తీసుకుంటే పెద్ద పెద్ద అంచులు జత చేయడానికి మార్కెట్‌లో విడిగా డిజైన్‌ చేసిన బార్డర్‌లు లభిస్తున్నాయి. కుచ్చులు కూర్చాక, బార్డర్‌ని జత చేస్తే చాలు చూడముచ్చటైన లెహెంగా రెడీ అవుతుంది.

పండుగకు నప్పే రంగులు
► పసుపు, పచ్చ, ఎరుపు రంగుల కాంబినేషన్‌తో రూపుదిద్దుకున్న లంగా ఓణీలు, చీరలు పండుగ కళను రెట్టింపు చేస్తాయి.
► వీటి మీదకు టెంపుల్‌ జువెల్రీ లేదంటే పాతకాలం నాటి యాంటిక్‌ జువెల్రీ బాగా నప్పుతాయి.
► పొడవాటి జడలు, పువ్వులతో అలంకరణ జడలు లంగాఓణీ కళకు జీవం పోస్తాయి.

నెట్‌ ఫ్యాబ్రిక్‌ వాడినప్పుడు ఆలోవర్‌ డిజైన్‌ తీసుకోవాలి. బ్లౌజ్‌ ఎంబ్రాయిడరీ హెవీగా ఉండాలి. వీటిలో ఫ్లోరల్‌ లేదా ప్రింటెడ్‌ ఫ్యాబ్రిక్‌ తీసుకున్నప్పుడు లెహెంగా ప్రింట్‌లో బాగా కనిపించే రంగు బ్లౌజ్‌ డిజైన్‌ చేయించుకోవాలి. రెండింటికీ నప్పేలా ఓణీని సెట్‌ చేసుకోవాలి. లెహెంగా మీద ఎంబ్రాయిడరీ వర్క్‌ హెవీగా ఉంటే బ్లౌజ్‌ని ప్లెయిన్‌గా స్టైలిష్‌గా డిజైన్‌ చేయించుకోవాలి. రాసిల్క్, వెల్వెట్‌ లెహెంగాల మీదా ఎంబ్రాయిడరీ గ్రాండ్‌గా తీర్చిదిద్దవచ్చు.

Publications in Rajahmundry, Books Publisher in Rajahmundry, Popular Publisher in Rajahmundry, BhaktiPustakalu, Makarandam, Bhakthi Pustakalu, JYOTHISA,VASTU,MANTRA, TANTRA,YANTRA,RASIPALITALU, BHAKTI,LEELA,BHAKTHI SONGS, BHAKTHI,LAGNA,PURANA,NOMULU, VRATHAMULU,POOJALU,  KALABHAIRAVAGURU, SAHASRANAMAMULU,KAVACHAMULU, ASHTORAPUJA,KALASAPUJALU, KUJA DOSHA,DASAMAHAVIDYA, SADHANALU,MOHAN PUBLICATIONS, RAJAHMUNDRY BOOK STORE, BOOKS,DEVOTIONAL BOOKS, KALABHAIRAVA GURU,KALABHAIRAVA, RAJAMAHENDRAVARAM,GODAVARI,GOWTHAMI, FORTGATE,KOTAGUMMAM,GODAVARI RAILWAY STATION, PRINT BOOKS,E BOOKS,PDF BOOKS, FREE PDF BOOKS,BHAKTHI MANDARAM,GRANTHANIDHI, GRANDANIDI,GRANDHANIDHI, BHAKTHI PUSTHAKALU, BHAKTI PUSTHAKALU, BHAKTHI


Publications in Rajahmundry, Books Publisher in Rajahmundry, Popular Publisher in Rajahmundry, BhaktiPustakalu, Makarandam, Bhakthi Pustakalu, JYOTHISA,VASTU,MANTRA, TANTRA,YANTRA,RASIPALITALU, BHAKTI,LEELA,BHAKTHI SONGS, BHAKTHI,LAGNA,PURANA,NOMULU, VRATHAMULU,POOJALU,  KALABHAIRAVAGURU, SAHASRANAMAMULU,KAVACHAMULU, ASHTORAPUJA,KALASAPUJALU, KUJA DOSHA,DASAMAHAVIDYA, SADHANALU,MOHAN PUBLICATIONS, RAJAHMUNDRY BOOK STORE, BOOKS,DEVOTIONAL BOOKS, KALABHAIRAVA GURU,KALABHAIRAVA, RAJAMAHENDRAVARAM,GODAVARI,GOWTHAMI, FORTGATE,KOTAGUMMAM,GODAVARI RAILWAY STATION, PRINT BOOKS,E BOOKS,PDF BOOKS, FREE PDF BOOKS,BHAKTHI MANDARAM,GRANTHANIDHI, GRANDANIDI,GRANDHANIDHI, BHAKTHI PUSTHAKALU, BHAKTI PUSTHAKALU, BHAKTHI



Publications in Rajahmundry, Books Publisher in Rajahmundry, Popular Publisher in Rajahmundry, BhaktiPustakalu, Makarandam, Bhakthi Pustakalu, JYOTHISA,VASTU,MANTRA, TANTRA,YANTRA,RASIPALITALU, BHAKTI,LEELA,BHAKTHI SONGS, BHAKTHI,LAGNA,PURANA,NOMULU, VRATHAMULU,POOJALU,  KALABHAIRAVAGURU, SAHASRANAMAMULU,KAVACHAMULU, ASHTORAPUJA,KALASAPUJALU, KUJA DOSHA,DASAMAHAVIDYA, SADHANALU,MOHAN PUBLICATIONS, RAJAHMUNDRY BOOK STORE, BOOKS,DEVOTIONAL BOOKS, KALABHAIRAVA GURU,KALABHAIRAVA, RAJAMAHENDRAVARAM,GODAVARI,GOWTHAMI, FORTGATE,KOTAGUMMAM,GODAVARI RAILWAY STATION, PRINT BOOKS,E BOOKS,PDF BOOKS, FREE PDF BOOKS,BHAKTHI MANDARAM,GRANTHANIDHI, GRANDANIDI,GRANDHANIDHI, BHAKTHI PUSTHAKALU, BHAKTI PUSTHAKALU, BHAKTHI




PetrolBunk

petrol Social Service Voluntary Service Serviceability Helping People Helping Hand to Needpeople Eenadu Epaper Eenadu Sunday Sunday Magazine Bhakthi Pustakalu BhakthiPustakalu Bhakti Pustakalu BhaktiPustakalu

    ప్రస్తుతం వాహనం ఓ నిత్యావసర వస్తువుగా మారింది. కాలానుగుణంగా జనాభా ఎలా వృద్ధి చెందుతుందో, వాహన వినియోగం అదేరీతిలో పెరుగుతోంది. ఇంటి నుంచి కాలు బయట పెట్టాలంటే వాహనం తీయాల్సిందే. ప్రధానంగా వాహనాల వినియోగానికి పెట్రోల్‌, డీజిల్‌ కీలకం. జిల్లా వ్యాప్తంగా 262 పెట్రోల్‌ బంకులు నడుస్తున్నాయి. ప్రతి నెలా దాదాపు 90 లక్షల లీటర్ల పెట్రోలు, కోటి 80 లక్షల లీటర్ల డీజిల్‌ వినియోగమవుతున్నట్లు పౌరసరఫరాల శాఖ గణాంకాలు తెలుపుతున్నాయి. అయితే పెట్రోల్‌ బంకుల వద్ద ఆపరేటర్లు చేసే మోసాలు అనేకం. దీనిపై ఎన్ని ఫిర్యాదులు వెళ్లినా అధికారుల చర్యలు నామమాత్రమే. ఆ బంకుల్లో మోసాలు షరా మామూలే. అంతిమంగా వినియోగదారులే నష్టపోతున్నారు. వాటిని వాహనదారులు ఎలా ఎదుర్కొవాలనే దానిపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం.

నాజిల్‌ను పదే పదే ప్రెస్‌ చేస్తే.. మోసమే
బంక్‌లో ఇంధనం నింపే సమయంలో కొందరు వర్కర్లు ఫ్యూయల్‌ నాజిల్‌ ప్రెస్‌ చేస్తుంటారు. రీడింగ్‌పై దృష్టి పెట్టే వాహన చోదకులు నాజిల్‌ను గమనించరు. పంప్‌ పట్టుకునే చోట ఆన్‌ ఆఫ్‌ బటన్‌(నాజిల్‌) ఉంటుంది. దీనిని మారుస్తుండడం ద్వారా కొంత మిగుల్చుకుంటారు. బటన్‌ పూర్తిగా నొక్కి పట్టుకోవాలని కోరండి. లేదంటే పూర్తిస్థాయిలో పెట్రోల్‌ రాదు. ఆటో, నాలుగు చక్రాల వాహనాల డ్రైవర్లు వాహనం దిగకుండా ఇంధనం పోయిస్తే బంక్‌ వర్కర్లు ఎక్కువ మొత్తంలో మోసం చేసే అవకాశం ఉంటుంది.


దృష్టి మరల్చొద్దు
పెట్రోల్‌, డీజిల్‌ కొట్టించే ముందు రీడింగ్‌ సున్నా నుంచి ఫ్యూయల్‌ నింపుతారు. అయితే మన ముందు మాత్రం రీడింగ్‌ సున్నా చేస్తారు కానీ ఆయిల్‌ కొట్టగానే మనల్ని నెమ్మదిగా మాటల్లో పెట్టి రీడింగ్‌ మార్చడం లేదా ఇంధనం తక్కువగా కొట్టడం చేస్తారు. దీంతో రావాల్సిన ఫ్యూయల్‌ రాదు. ఈ నేపథ్యంలో ఇంధనం నింపే సమయంలో రీడింగ్‌ను చూడాలి. మీటర్‌ రీడింగ్‌(000) నుంచి కొడుతున్నారా లేదా నిశితంగా గమనించాలి.


కల్తీపై కన్నేయండి
నాఫ్తాతో పెట్రోల్‌ను కల్తీ చేయడం ద్వారా లాభాలను మిగిల్చుకుంటారు. పెట్రోల్‌లో కిరోసిన్‌, ఇతరత్రా వాటిల్లో కూడా కలుపుతుంటారు. బండి మధ్యలో తరచూ ఆగిపోతుంటే అది పెట్రోల్‌ కల్తీ ప్రభావం అని గుర్తించాలి. అలానే సైలెన్సర్‌ కండిషన్‌ బాగోలేకుంటే అది పెట్రోలు కల్తీ ప్రభావం అని గుర్తించాలి. ఎక్కువగా పొగ వస్తుంటే ఇంధనంలో కల్తీ జరిగినట్లు గమనించాలి.


అనంతలో వెలుగుచూసిన కల్తీ పెట్రోలు
అనంతపురం నగరంలోని గణేష్‌ భారత్‌ పెట్రోల్‌ బంక్‌లో గత నెల మొదటి వారంలో కల్తీ పెట్రోలు బయటపడింది. ఫిబ్రవరి మొదటి వారంలో ఓ ద్విచక్రవాహనదారుడు ఆ బాంకులో పెట్రోలు పోయించుకున్నాడు. ఆ బంకులో పెట్రోలు పోయించిన తర్వాత సగం దూరం వెళ్లగానే వాహనం ఆగిపోయింది. దీంతో అనుమానం వచ్చిన సదరు ద్విచక్ర వాహనదారుడు మెకానిక్‌ వద్ద చూపించాడు. పెట్రోలులో కల్తీ ఉండటంతోనే వాహనం ఆగిపోయిందని మెకానిక్‌ చెప్పాడు. దీంతో సంబంధిత అధికారులకు వాహనదారుడు ఫిర్యాదు చేశాడు. దీంతో సివిల్‌సప్లై, రెవెన్యూ అధికారులు పెట్రోలు బంకులో తఖీలు చేపట్టి పెట్రోలు కల్తీ అయినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ క్రమంలో పెట్రోలు బంక్‌ను సీజ్‌ చేశారు. ఆ పెట్రోలు శాంపిల్స్‌ను పరీక్ష నిమిత్తం హైదరాబాద్‌లోని రెడ్‌ హిల్స్‌ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపారు. పెట్రోలులో కలిపిన ఎథనాల్‌ నీరుగా మారిందని సేల్స్‌ ఆఫీసర్‌ చెప్పుకొచ్చారు. ఎథనాల్‌ కలిపినందున అందులో కొద్దిగా నీరు కలిసినా అది నీరుగా మారుతుందని పేర్కొంటున్నారు. కాగా ఫోరెన్సిక్‌ లాబ్‌ నివేదికలు వచ్చిన తర్వాత ఆ మేరకు తగు చర్యలు తీసుకుంటామని సంబంధిత అధికారులు స్పష్టం చేస్తున్నారు.


అందుబాటులో లేని ఇంధన పరీక్ష కిట్లు
ఇంధనంలో కల్తీ జరుగుతున్నట్లు వాహనదారులు గమనించినా ఏమీ పాలుపోని స్థితి నెలకొంటుంది. పెట్రోల్‌ బంక్‌ల వద్ద ఉండాల్సిన ఇంధన పరీక్ష కిట్లు కానరావడం లేదు. అసలు ఈ కిట్లు పెట్రోల్‌ బంకుల వద్ద ఉంటాయని చాలామందికి తెలియదు. తహసీల్దార్‌ స్థాయి అధికారులు పెట్రోలు బంకుల వద్ద ఇంధన పరీక్ష జరపొచ్చు. కానీ తమకేమీ పట్టనట్లు వారు వ్యవహరిస్తుండడంతో వాహనదారులు నష్టపోతున్నారు.


ఆయుష్షు కోల్పోతున్న వాహనాలు
ఇంధనంలో కల్తీ పెరిగితే నిత్యం వాహనాలు మొరాయిస్తుంటాయి. వాటి ఆ యుష్షు పరిమాణం తగ్గుపోతుంది. ఇంధనం కల్తీ వల్లే వాహనాలు పాడవుతున్నా ఫిర్యాదు చేయలేని స్థితిలో చాలామంది వాహన యజమానులు ఉన్నారు.


జాగ్రత్తలు పాటిస్తే మేలు

చమురు కంపెనీ ఆధ్వర్యంలో నడిచే పెట్రోల్‌ బంక్‌లపై ఉద్యోగుల పర్యవేక్షణ ఎక్కువగా ఉంటుంది. వీటిల్లో మోసాలకు ఆస్కారం తక్కువ. ఒక వేళ మోసం చేసినా ఫిర్యాదు చేస్తే చర్యలు వేగంగా ఉంటాయి. ఇలా ఆన్‌లైన్‌ చేసిన బంకుల్లో పెట్రోలు కొట్టించుకోవడం మంచిది.
ఆధునిక పంపింగ్‌ మెషిన్లు ఉన్న బంకుల్లో ఇంధనం నింపడం మంచిది. ప్రొడక్టు డిస్పెన్సర్‌ ఎంపీడీ పంపుల్లో మోసాలకు అవకాశం తక్కువ.
పెట్రోల్‌ను నిదానంగా పోయమని కోరండి. వేగవంతంగా పోస్తే తక్కువ పెట్రోల్‌ వచ్చేలా లోపల సెట్‌ చేస్తారు. అందుబాటులో ఉన్న బంకుల్లో ఒక్కోదానిలో ఒక్కోసారి నిర్ణీత పరిమాణంలోనే ఇంధనం కొట్టిస్తూ మైలేజ్‌ చెక్‌ చేసుకోవాలి. నిర్దిష్టమైన మైలేజ్‌ కంటే తక్కువ వస్తే మోసం జరిగినట్లే. ఇంజిన్‌ పనితీరులో మార్పు కనిపిస్తే కల్తీ జరిగినట్లే.
ట్యాంక్‌ మూతను ముందుగా తీయవద్దు. మీటర్‌ 000 చేసిన తరువాత ట్యాంక్‌ మూత ఓపెన్‌ చేయండి. 

రూ.50, రూ.100, రూ.150, రూ.200 ఈ డినామినేషనల్‌లో పెట్రోల్‌, డీజిల్‌ పోయించుకోకుండా ఉంటే మంచిది. ఎందుకంటే ఎక్కువశాతం మంది చిల్లర సమస్య లేకుండా ఇంత మొత్తాల్లోనే పోయించుకుంటారు. ఈ నేపథ్యంలో బంకుల్లో సిబ్బంది తక్కువ వచ్చేలా సెట్‌ చేసి ఉండొచ్చు. అందుకే లీటర్లలో కొట్టించుకోండి. లేదా రూ.111, రూ.222, రూ.333 తరహా మొత్తాల్లో పెట్రోల్‌ కొట్టించుకోవడం ఉత్తమం. ఆ నగదుకు సరిపడా చిల్లర దగ్గర ఉంచుకోండి.

      సాధ్యమైనంత వరకు రాత్రి వేళల్లోనే పెట్రోల్‌ కొట్టించుకోవాలి. దీనివల్ల లిక్విడ్‌ రూపంలో పెట్రోల్‌ ఆవిరయ్యే అవకాశం ఉండదు.





mohan publications price list