MohanPublications Print Books Online store clik Here Devullu.com
Showing posts with label helth. Show all posts
Showing posts with label helth. Show all posts

బరువు తగ్గండీ | Weight Loss Together | Mohanpublications | Granthanidhi | Bhakthipustakalu


బరువు తగ్గండీ | Weight Loss Together | Mohanpublications | Granthanidhi | Bhakthipustakalu Obesity Weight Loss Losing weight couple weight loss made for eachother


బరువు తగ్గండీ

పొద్దున్నే నిద్రలేచి వ్యాయామం చేస్తానంటారు... కానీ చేయరు! కొవ్వుపదార్థాలు మానేస్తాననీ చెబుతారు... కానీ నాన్‌లూ, పిజాలూ, బర్గర్‌లు లాగించేస్తారు. వేళకు నిద్రపొమ్మంటే... కంప్యూటరు ముందునుంచీ కదలరు. కూరల్లో కాస్త ఉప్పు తగ్గిస్తే... ఏంటీ చప్పిడి తిండి అంటూ కోప్పడతారు... ఇలా శ్రీవారి బరువుకు సంబంధించిన కథల గురించి ఎన్నయినా చెప్పేస్తారు చాలామంది మహిళలు. అలా బాధపడటం కన్నా... తన బరువును తగ్గించే ప్రయత్నం ఎందుకు చేయకూడదు. దానివల్ల మనమూ సన్నబడొచ్చు. అదెలా అంటారా... చదవండి మరి.
పెళ్లికి ముందు...ఫిట్‌గా ఉండాలీ, అందంగా కనిపించాలి, పిడికెడు పొట్ట కూడా ఉండకూడదు... అని అమ్మాయిలే కాదు, అబ్బాయిలూ ఆలోచిస్తారు. దానికి సంబంధించి తీసుకునే జాగ్రత్తలూ, పాటించే కొత్తకొత్త నియమాల జాబితా చాంతాండంత ఉంటుంది. తీరా పెళ్లయ్యాక ఉద్యోగం, కుటుంబం, పిల్లలూ, ఆలస్యంగా పడుకోవడం, ఆహార నియమాలు పాటించకపోవడం... అన్నీ కలిపి బరువు పెంచేస్తాయి. అవే క్రమంగా అనారోగ్యాలూ, వైవాహిక జీవితంలో సమస్యలు తెచ్చి... మానసిక కుంగుబాటుకు దారి తీస్తాయి. శ్రీవారి బాగోగులు చూసే ఇల్లాలిగా.. వారి ఆరోగ్యం కూడా స్త్రీ చేతిలోనే ఉంటుంది కాబట్టి ఛలో సన్నబడదాం..’ అంటూ ఆయన్నీ ప్రోత్సహించండి. ముందుగా...
మానసికంగా సిద్ధం చేయండి...
చాలామంది మహిళలు చేసే పొరపాటు ‘మీరు బరువు తగ్గాల్సిందే. అవి తినొద్దూ.. ఇవి తినొద్దూ’ అని ఆర్డర్లు వేసేస్తుంటారు. దీంతో రకరకాల ఒత్తిళ్లలో ఉన్న మగవారు ఈ విషయాన్ని ప్రతికూలంగా తీసుకుంటారు. గట్టిగా దబాయింపుగా చెప్పడాన్ని మాత్రమే వారు పట్టించుకుంటారు గానీ.. అసలు విషయాన్ని పక్కన పెట్టేస్తుంటారు. కొందరు అనుకుంటారు కానీ ఆరంభంలోనే ఆగిపోతారు. ‘తను చెబితే నేను చేయాలా... నాకు తెలియదా ఎప్పుడు ఏం చేయాలో...’ అనే ధోరణిలో తమ ఆరోగ్యాన్నీ, ఫిట్‌నెస్‌ని నిర్లక్ష్యం చేసేవారూ ఉంటారు. కాబట్టి భర్త బరువు తగ్గాలి అనుకుంటే.. ముందు మానసికంగా సిద్ధం చేయాలి. పెళ్లికి ముందు ఫొటోలు చూపించి.. ‘మళ్లీ మనం ఇలా ఎప్పుడవుదాం..’ అని అడిగి చూడండి. కలిసి వ్యాయామం చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టడం, చిలిపి సవాళ్లు విసరడం.. వంటివి శ్రీవారిని తప్పకుండా ఆ దిశగా ప్రేరేపిస్తాయి. భార్యాభర్తలు కలిసి వ్యాయామం చేయడం వల్ల ఎన్నో లాభాలున్నాయి. ఒకరినొకరు స్ఫూర్తి పొందుతూ ముందుకు సాగొచ్చు. పార్టనర్‌ యోగా, పార్టనర్‌ ఏరోబిక్స్‌, పార్టనర్‌ ఎక్సర్‌సైజెస్‌, పార్టనర్‌ ఫిట్‌నెస్‌... ఇలా రకరకాలుగా ప్రయత్నించొచ్చు. ఇంటికి దగ్గరలోని పార్కుకో, మైదానానికో ఇద్దరూ కలిసి ఉదయం నడకకు వెళ్లొచ్చు. తాడాట ఆడొచ్చు. గోడ కుర్చీలు వేయొచ్చు. స్క్వాట్స్‌ను ప్రయత్నించొచ్చు. ట్రైనర్‌ను పెట్టుకుని ఇద్దరూ కలిసీ వ్యాయామాలు చేయొచ్చు అంటున్నారు ఫిట్‌నెస్‌ నిపుణురాలు మణిపవిత్ర.



అప్పుడేం చేయాలంటే..
* మీరు కావచ్చు, ఆయన కావచ్చు... అప్పటివరకూ జీవనశైలిలో చేసిన పొరపాట్లన్నీ ఓ జాబితాగా రాసుకోవాలి. ఇక మీదట చేయాల్సిన నియమాలను మరో కాగితంపై రాయాలి. చేయకూడనివి రెడ్‌ మార్కర్‌తో కొట్టేసి చేయాల్సినవి గ్రీన్‌ మార్కర్‌తో టిక్‌ చేయాలి. ఆ జాబితాను ప్రతిరోజూ ఇద్దరూ చూసేలా ఒక చోట అంటించుకోవాలి. అలా చూడటం వల్ల మెదడులో చేయాలన్న స్ఫూర్తి పెరుగుతుంది.
* నిపుణుల్ని సంప్రదించి బరువు తగ్గడానికి ఎలాంటి నియమాలు పాటించాలన్నదీ ఓ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. ఆహార నియమాలూ, చేయాల్సిన వ్యాయామ ప్రక్రియ గురించి రాసుకోవాలి. ఎలా చేయాలన్నది మాట్లాడుకోవాలి. ఒక్కరి నిర్ణయమం మీదే వెళ్లడం సరికాదు.
* ఇద్దరూ కలిసి ఒకే సమయానికి నిద్రపోవడం, మేల్కొనడం అలవాటు చేసుకోవాలి. కలిసి వ్యాయామ సాధన చేయడం, అల్పాహారం తీసుకోవడం మొదలుపెట్టాలి. వీలుంటే మిగతా సమయాల్లోనూ కలిసి తినడానికి ప్రాధాన్యమివ్వాలి.
* రోజూ ఒకే రకమైన వ్యాయామ సాధనలు కాకుండా ఒక రోజు నడకా, మరోరోజు జాగింగ్‌.. ఇలా రోజూ వ్యాయామ సాధనలో కొత్తదనం ఉండేలా ప్రణాళిక వేయాలి. ఈ రోజుల్లో ఇద్దరూ కలిసి చేసే యోగాసనాలు ఉన్నాయి. అలా ఇద్దరూ కలిసి చేయడం వల్ల ఫలితాలు చాలా త్వరగా ఉంటాయని చెబుతున్నారు యోగా నిపుణులు.
* ఒక వేళ మీ శ్రీవారు బద్ధకించినా గట్టిగా అరవడం, విసురుగా మాట్లాడటం, కోప్పడటం సరికాదు. నియమాలు పాటించడంలో వెనకబడినా, ఒకరోజు బద్ధకించినా తేలిగ్గానే తీసుకోవాలి తప్ప సహనం కోల్పోకూడదు.
సరదా సరదాగా..
వ్యాయామం, బరువు తగ్గడం, డైటింగ్‌ వంటి మాటలు మనసులోంచి తీస్తే చాలా మంచిది. ఇద్దరూ కలిసి వ్యక్తిగత సమయం కేటాయించుకుంటున్నాం అని భావిస్తే చాలా బాగుంటుంది. భార్యాభర్తలిద్దరూ కలిసి సరదాగా ఈత తరగతులకు వెళ్లడం, సైక్లింగ్‌ చేయడం, టెన్నిస్‌, బ్యాడ్మింటన్‌, టేబుల్‌ టెన్నిస్‌ వంటివి ఆడొచ్చు. చిన్నారుల్లా మారి.. ఎంత హడావుడిగా ఉన్నా.. రోజులో ఎంతో కొంత సమయం ఇలా గడపడం వల్ల ఆరోగ్యపరంగా ఎంత మేలు జరుగుతుందో.. మానసికంగానూ అంతే ప్రయోజనం ఉంటుంది. పైగా ఇద్దరి మధ్యా అనుబంధం అంతకుముందు కంటే మెరుగ్గా ఉంటుంది. దాంతోపాటు కొత్త జంటలా మారిపోయి.. ఏరోబిక్స్‌, జుంబా, సల్సా వంటి నృత్య రీత్యుల్ని నేర్చుకోవడం మొదలు పెట్టొచ్చు. వీటన్నింటి వల్ల కెలొరీలు అధిక మొత్తంలో ఖర్చు అవుతాయి. నిద్రలేమి సమస్యలూ దూరమవుతాయి.


వంటింట్లో చేయాల్సిన మార్పులు...

* బరువు తగ్గడానికి పూర్తిగా పొట్ట మాడ్చుకోవాల్సిన అవసరంలేదు. మాంసకృత్తులూ, పిండిపదార్థాలు శరీరానికి అందాలి. పిండిపదార్థాలు అంటే అన్నం, బ్రెడ్‌ నుంచి అందేవి కాకుండా సంక్లిష్ట పిండిపదార్థాలు ఎంచుకునేలా చూసుకోవాలి. అంటే బ్రౌన్‌రైస్‌, తృణధాన్యాలూ, ఓట్స్‌ వంటి వాటితో చేసిన పదార్థాలు అన్నమాట. వీటిని కూడా మితంగా తీసుకోవాలి. వీటిల్లో పీచు ఉండటమే కాదు... అరగడానికీ ఎక్కువ సమయం పడుతుంది.
* మాంసాహారం దూరంగా పెట్టాల్సిన పనిలేదు. మీ వారికి ఎక్కువగా తినే అలవాటు ఉంటే పూర్తిగా మానేయమనకుండా ఆ పరిమాణం తగ్గిస్తూ రావాలి. బదులుగా మీల్‌మేకర్‌, స్కిన్‌లెస్‌ చికెన్‌ ఎంచుకోవచ్చు. అంతేకానీ అలవాటు లేని బ్రకోలీ, లెట్యూస్‌ వంటివి శ్రీవారికి వడ్డించేయడం సరికాదు.
* తీపి పదార్థాలు బరువు పెరగడానికి కారణమవుతాయి. అందుకే మిఠాయిలను మాత్రం ఎంత తగ్గిస్తే అంత మంచిది. బదులుగా తేనె, తాజా పండ్లూ, ఖర్జూరాలూ, ఎండు ద్రాక్ష వంటివి ఇవ్వొచ్చు. వీటితో చేసిన స్వీట్లు కూడా ఆరోగ్యానికి మంచిదే.
* రెస్టారంట్లూ, రోడ్డువారల ఆహారాన్ని పూర్తిగా దూరం పెట్టేయడం మంచిది. మంచి నీళ్లు ఎక్కువగా తాగాలి. పండ్ల రసాలకు బదులు పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. కీరదోస, క్యారెట్‌, బీట్రూట్‌, టోఫూతో సలాడ్లు చేయడం మంచిది. నూనె, ఉప్పూ ఎంత తక్కువ తీసుకుంటే అంత త్వరగా ఫలితం ఉంటుంది.
* అల్పాహారం తప్పనిసరిగా తీసుకోవాలి. రాజ్మా, పెసలూ, బఠాణీ, సెనగలూ, గుడ్లూ, సోయా, పల్లీలూ... ఇవన్నీ మనం తీసుకునే భోజనంలో తప్పకుండా ఉండేలా చూసుకోవాలి. వీటిలోని మాంసకృత్తులు శరీరానికి శక్తిని అందిస్తాయి.
* కాఫీ, టీలు తాగినా చక్కెర్లకు దూరంగా ఉండాలి. వాటితోపాటు ఉదయం, సాయంత్రం గ్రీన్‌ టీ తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. దీనిలోని యాంటీఆక్సిడెంట్లు బరువు తగ్గడంలోనే కాదు.. శరీరంలోని విషవ్యర్థాలను బయటకు పంపడంలోనూ కీలక పాత్ర పోషిస్తాయి అంటున్నారు పోషకాహార నిపుణురాలు డాక్టర్‌ లతాశశి.

ఫైనాపిల్ | Pineapple | Mohanpublications | Granthanidhi | Bhakthipustakalu


ఫైనాపిల్ | Pineapple | Mohanpublications | Granthanidhi | Bhakthipustakalu pineapple health health tips cancer pineapple fruit


ఫైనాపిల్


పైనాపిల్ తింటే.. ఏ పిల్ అవసరం లేదంటారు. అనాస ఆరోగ్యాలకు ఆవాసమని పేరు.. ఆరోగ్యాన్ని మెరుగుపరిచే, అందాన్ని పెంచే.. ఔషధ గని! కప్పు ముక్కలతో క్యాన్సర్‌కే చెక్ పెట్టొచ్చు.. జ్యూస్ జుర్రుకుంటే ఏ అనారోగ్యాలూ దరిచేరవు. అన్ని ఫైన్ విషయాలు ఉన్న పైనాపిల్‌కి కూడా ఓ రోజుంది.. ఈ నెల 27న ప్రత్యేకంగా పైనాపిల్ డేని జరుపుతున్నారు.ఈ సందర్భంగా పైనాపిల్‌పై ప్రత్యేకంగా ఈ జంటకమ్మ.

ముళ్లతో కాస్త వికారంగా కనిపించినా.. ఔషధాలు మాత్రం మెండు. భారతదేశంలో ఈశాన్య రాష్ట్రంలో పైనాపిల్‌ని ఎక్కువ పండిస్తారు. ప్రకృతి ప్రసాదించిన అమూల్యఫలం ఇది. దీన్ని అమెరికన్ ఆదివాసులు దేవతాఫలంగా భావిస్తారు. క్రీ.శ.1548 సంవత్సరంలో భారతదేశంలోకి ప్రవేశించింది. అప్పటి నుంచి దీని సాగు దేశీయంగా మొదలయింది. 1 మీటరు నుంచి 1.5 మీటర్ల ఎత్తు వరకు ఇది పెరుగుతుంది. కొంచెం పరిపక్వతకు వచ్చిన తర్వాత పువ్వు వస్తుంది. ఈ పువ్వు సుమారు 15 సెం.మీ.లు ఉంటుంది. పువ్వు 12 నుంచి 20 నెలల తర్వాత పండుగా ఏర్పడుతుంది. వర్షాకాలంలో విరివిగా దొరికే పండ్లలో పైనాపిల్ ఒకటి.
100గ్రా. పైనాపిల్‌లో ఉండే పోషకాలు.. నీరు : 87.8 గ్రా.
ప్రొటీన్ : 0.4 గ్రా.
కొవ్వు : 0.1 గ్రా.
పిండి పదార్థాలు : 10.8 గ్రా.
క్యాల్షియం : 20 మి.గ్రా.
పాస్ఫరస్ : 9 గ్రా.
ఐరన్ : 2.4 గ్రా.
సోడియం : 34.7 గ్రా.
పొటాషియం : 37 గ్రా.
మాంగనీస్ : 0.56 గ్రా.
కెరోటిన్ : 18 మైక్రో గ్రా.
శక్తి : 46 కిలోక్యాలరీలు
మీకు తెలుసా?- క్రీ.శ.1398లో పైనాపిల్ అనే పేరును అన్నట్లుగా రికార్డులు ఉన్నాయి.
- అమెరికాలో దీన్ని కనుగొన్నారు. యూరోపియన్లు దీనికి పైనాపిల్ అని పేరు పెట్టారట.
- పైనాపిల్ చెట్టు జీవిత కాలం 50 సంవత్సరాలు. కేవలం పైనాపిల్ పై భాగాన్ని కట్ చేసి దాన్ని పాతిపెడితే పైనాపిల్ చెట్టు వస్తుంది.
- ప్రపంచంలోనే అతి పెద్ద పైనాపిల్‌ని 2011లో ఆస్ట్రేలియాకి చెందిన క్రిస్టిన్ మెక్‌కొల్లమ్ పండించాడు. దీని ఎత్తు 32 సెం.మీ.లు బరువు 8.28 కేజీలు.
- 75 శాతం పైనాపిల్‌లో యూరోప్‌లో అమ్ముడుపోతాయి.
n హవాయిలో రికార్డు స్థాయిలో ఈ పంట పండిస్తున్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా కొన్ని వందల ఎకరాల్లో పైనాపిల్ సాగు చేస్తున్నారు.
- పైనాపిల్‌ని ఇసుకతో కలిపి మొండి మరకలు ఉన్నచోట రుద్దితే మరకలు మాయమవుతాయి.
- ఆస్ట్రేలియన్ యాసలో ముగింపు పలుకడానికి లేదా చెడు ఒప్పందాలు ఏర్పరుచుకోవడానికి ఒక పదం ఉద్భవించింది. 1930లో బ్రిటన్‌లో బీయింగ్ ఆన్ ద పైనాపిల్ అనే పదం ఒక ప్రెస్‌గా మారింది.
- ప్రపంచం మొత్తం మీద 1/3 పైనాపిల్ పండ్లు హవాయిలో ఉత్పత్తి అవుతాయి.
- ఫ్రూట్‌సలాడ్స్, డ్రింక్స్‌లాగే కాదు.. పైనాపిల్‌తో వైన్‌ని కూడా తయారుచేస్తారు.
ఆరోగ్యం మహాభాగ్యం.. రోజూ ఓ కప్పు పైనాపిల్ ముక్కలు తీసుకుంటే క్యాన్సర్, గుండె జబ్బులు దరిచేరకుండా ఉంటాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. రోజు మొత్తానికి అవసరమైన
విటమిన్ సి ఈ పైనాపిల్ ద్వారా పొందవచ్చు.

- పైనాపిల్‌లో బ్రొమిలైన్ అనే ప్రొటియోలిటిక్ ఎంజైమ్ ఉంటుంది. తీసుకున్న ఆహారాన్ని ప్రొటీన్లుగా జీర్ణం చేయడమే దీని పని. అందుకే అజీర్తికి ఇది మంచి మందు.
- కీళ్లనొప్పులు పైనాపిల్ తింటే తగ్గుముఖం పడుతాయి. కారణం.. ఇందులో బ్రొమిలైన్‌కి యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు మెండు. అయితే దీన్ని ఉదయం భోజనం తర్వాత తింటే మంచిది.
- పైనాపిల్‌లోని ఎంజైమ్ రుమటాయిడ్ ఆర్థ్రరైటిస్ కారణంగా దెబ్బతిన్న కణజాలాన్ని త్వరితగతిన బాగు చేస్తుంది. మధుమేహం కారణంగా ఏర్పడే పుండ్లని, ఇతరత్రా గాయాల్ని కూడా ఇది త్వరగా తగ్గిస్తుంది. ఈ రసం తెగిన గాయాలపై వేస్తే రక్తస్రావం తగ్గుతుంది.
- ఇందులో సమృద్ధిగా పొటాషియం ఉండడం వల్ల కొన్ని మూత్రపిండాల వ్యాధుల్లో మూత్ర ప్రక్రియ సరిగా లేని వారికి చక్కటి ఫలితాలను ఇస్తుంది. ఇది కడుపులోని పురుగుల్ని చంపేస్తుంది.
- పైనాపిల్‌ను రోజూ రెండు ముక్కల చొప్పున తింటే బెస్ట్. ఇది రక్తం గడ్డకట్టడాన్ని అడ్డుకుంటుంది. అంటే.. రక్తనాళాల్లోంచి గడ్డల్ని తొలిగించి ప్రసారాన్ని మెరుగుపరుస్తుంది. హీమోఫీలియాతో బాధ పడేవాళ్లు మాత్రం వీటిని తినకపోవడమే మంచిది.
- గొంతునొప్పి, బ్రాంకైటిస్ వంటి శ్వాసకోశ వ్యాధుల్ని పైనాపిల్ తగ్గిస్తుంది. ఈ రసాన్ని గొంతులో పోసుకొని పుక్కిలిస్తే గొంతునొప్పి, టాన్సిల్స్ నివారణ అవుతాయి.
- వృద్ధాప్యంలో వచ్చే కంటి సమస్యలకు పైనాపిల్‌ను మించిన ఔషధం లేదు. ఇందులోని విటమిన్ - సి బ్యాక్టీరియాతో పోరాడి చిగుళ్ల సమస్యను నివారిస్తుంది.
- ఎముకలకు ఇది బలం. పెరిగే పిల్లలకూ, వృద్ధులకూ ఇది చాలా మంచిది. జ్వరం, దగ్గు, జలుబు వచ్చినప్పుడు ఈ పైనాపిల్ జ్యూస్ తీసుకోవడం మంచిది.
- ఇందులోని పీచుపదార్థం మలబద్దకానికి, ఆడవాళ్లకైతే రుతుక్రమ సమస్యలకు మంచి మందుగా పనిచేస్తుంది.
- పైనాపిల్ డిప్రెషన్, మతిమరుపును తగ్గిస్తుంది. జాండిస్, కాలేయ వ్యాధులున్న వారు ప్రతిరోజూ ఈ జ్యూస్ తాగితే మంచిది.
అందమే ఆనందం.. పైనాపిల్ ముఖానికి ఐప్లె చేసే ముందు మొదట చేతి మీద లేదా చెవి వెనుక భాగంలో కాస్త రుద్ది టెస్ట్ చేయాలి. చర్మం మంట, దురద, ఎర్రగా మారడం లాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుంటే ముఖానికి రాసుకోవచ్చు.
-చర్మకాంతిని పొందాలంటే పైనాపిల్ జ్యూస్ సహాయపడుతుంది. ఇందులోని బ్రొమైలిన్ ఎంజైమ్ మొటిమలను నివారించడంతో పాటు చర్మ సమస్యలను కూడా నివారిస్తుంది. చర్మం ఎలాసిటిని పెంచుతుంది. కొల్లాజెన్ ఉత్పత్తి పెంచడం వల్ల ముఖంలో ముడుతలు, మచ్చలు లేకుండా స్కిన్‌టోన్ పెరుగుతుంది.
-ప్రతిరోజూ ఒక గ్లాసు పైనాపిల్ జ్యూస్ తాగడం వల్ల ఫెయిర్ అండ్ క్లియర్ స్కిన్ పొందవచ్చు. ఈ జ్యూస్‌ని నీళ్లలో కలిపి ముఖానికి పట్టించి డ్రై అయిన తర్వాత శుభ్రం చేసుకోవడం వల్ల చర్మకాంతి మరింత పెరుగుతుంది.
-పైనాపిల్లోని విటమిన్ సి, అమైనో యాసిడ్స్ చర్మంలో కొలెజెన్‌ను ఎక్కువగా ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. చర్మాన్ని బిగువుగా, పటుత్వాన్ని కోల్పోకుండా చేస్తాయి. అలాగే చర్మం మీది మృతకణాలను తొలిగించడంలో ఈ జ్యూస్ బాగా పనిచేస్తుంది.
-పైనాపిల్ ైస్లెస్ తీసుకొని చర్మం మీద నేరుగా మర్దన చేయాలి. ఆరిన తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. దీనివల్ల మొటిమలు తగ్గుముఖం పట్టడమే కాదు.. వాటివల్ల మచ్చలు కూడా క్రమంగా చర్మఛాయలో కలిసిపోతాయి.
-పైనాపిల్‌లో, నిమ్మరసం మిక్స్ చేసి ముఖానికి రాయాలి. ఇందులో విటమిన్ సి, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు అధిక మొత్తంలో ఉంటాయి. ఇవి శరీరంలో వ్యాధినిరోధక శక్తిని పెంచడమే కాకుండా, చర్మం నవయవ్వనంతో నిగనిగలాడేలా చేస్తాయి. చర్మం యంగ్‌గా కనబడడానికి సహాయపడుతుంది.
గులాబీ పైనాపిల్పండ్ల ఉత్పత్తిలో శాస్త్రీయంగా ఎన్నో రకాల మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సంప్రదాయ ఉత్పత్తికి భిన్నంగా ద్రాక్షలో గింజలు లేకుండా.. పండ్ల పరిమాణాన్ని పెంచుతూ వినూత్న రీతిలో ఉత్పత్తి చేస్తున్నారు. పైనాపిల్ పైన ముదురు గోధుమ రంగు పొలుసులతో.. లోపల పసుపు రంగులో ఉంటుందని అందరికీ తెలుసు. అయితే ఈ పండును గులాబీ రండులోకి మార్చడానికి డెల్ మౌంటే అనే ప్రముఖ ఆహార ఉత్పత్తి సంస్థ 2005 నుంచి ప్రయత్నాలు చేస్తున్నది. 2016 డిసెంబర్‌లోనే ఈ పండు ఉత్పత్తికి యూ.ఎస్.ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అనుమతినిచ్చింది. టమాట.. పుచ్చకాయ వంటి ఎరుపు, గులాబీ రంగులుండే పండ్లలో లైకోపీన్ అనే వర్ణకారకం ఉంటుంది. అది పైనాపిల్‌లోనూ ఉంటుంది. కానీ కొన్ని ఎంజైమ్స్ గులాబీ వర్ణకారకాన్ని పసుపు రంగులోకి మార్చేస్తాయి. అలాంటి ఎంజైమ్స్‌ను నియంత్రించి ఈ గులాబీ రంగు పైనాపిల్ పండ్లను ఉత్పత్తి చేస్తున్నారు. త్వరలో ఇవి మార్కెట్‌లోకి అందుబాటులోకి రానున్నాయి.
-సౌమ్య పలుస

తక్షణ వైద్యంతో ప్రాణాలు సేఫ్‌! | Emergency Service | Mohanpublications | Granthahnidhi | Bhakthipustakalu


తక్షణ వైద్యంతో ప్రాణాలు సేఫ్‌! | Emergency Service | Mohanpublications | Granthahnidhi | Bhakthipustakalu Accident Hospital Emergency Medical Service Medical Service Road Accidents Accident Injuries


తక్షణ వైద్యంతో ప్రాణాలు సేఫ్‌!


మానవ తప్పిదాలతో ప్రమాదాలు జరగడం సహజమే! అయితే ప్రాణాపాయాల్ని నివారించడం పూర్తిగా మన చేతుల్లోనే ఉంటుంది. బాధితులకు సత్వర చికిత్స అందించగలిగితే విలువైన ప్రాణాల్ని కాపాడుకోగలుగుతాం! అందుకోసం అవసరమైన అవగాహన అందరం ఏర్పరుచుకోవాలి!

రోడ్డు ప్రమాదాల్లో తలకు తీవ్రగాయాలపాలై (ట్రమాటిక్‌ బ్రెయిన్‌ ఇంజురీ) మరణిస్తున్న వారి సంఖ్య మిగతా దేశాలతో పోలిస్తే మన దేశంలోనే ఎక్కువ. దేశవ్యాప్తంగా ఏటా 20 లక్షల మందికి రకరకాల రోడ్డు ప్రమాదాల్లో తలకు తీవ్రగాయాలై మరణిస్తున్నారు. వీటిలో 35ు (ఏటా రెండు లక్షలు) మరణాలు ప్రమాదం జరిగిన కొద్ది సమయంలోగా సంభవిస్తున్నవే! ఇది నాణానికి ఓ పార్శ్వం మాత్రమే! అవే ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోకపోయినా, అంగ వైకల్యం పొంది బ్రతుకు వెళ్లదీస్తున్నవారూ ఉన్నారు. అయితే రోడ్డు ప్రమాదాల్లో చిక్కుకుని గాయపడేవారిలో అత్యధికులు 20 నుంచి 40 ఏళ్లలోపు వారే! ప్రమాదాల ఫలితంగా అంగవైకల్యం పొందడం వల్ల వృత్తి, ఉద్యోగ నైపుణ్యం దెబ్బతిని, భృతి కోల్పోయి వారి కుటుంబాలు వీధులపాలవుతున్నాయి. ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే రోడ్డు ప్రమాదాల బాధితులకు తక్షణ వైద్యం అందించగలగాలి.

తలకు గాయమైతే?
రోడ్డు ప్రమాదాల్లో ప్రధానంగా గాయపడేది తలే! అయితే కొన్ని సందర్భాల్లో తల పగలకుండా అంతర్గత రక్తస్రావం జరగొచ్చు, లేదా చిన్న గాయం ఏర్పడి, తక్కువ రక్తస్రావం కనిపించవచ్చు. ఇలాంటి దెబ్బలు తగిలినప్పుడు వాటి ప్రభావం మెదడు మీద తీవ్రంగా ఉంటుంది. పైకి మామూలుగానే అనిపించినా, తలకు తగిలే దెబ్బలను ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. ‘దెబ్బ చిన్నదే కదా! తగ్గిపోతుందిలే!’ అని వైద్యాన్ని నిర్లక్ష్యం చేస్తే ఆరోగ్యపరంగా శాశ్వతమైన పరిణామాలను ఎదుర్కోవలసివస్తుంది. కాబట్టి రోడ్డు ప్రమాదంలో తలకు దెబ్బ తగలిన వెంటనే వీలైనంత త్వరగా వైద్య సహాయం అందేలా చూడాలి. ఆలస్యం జరిగేకొద్దీ తిరిగి సరిదిద్దలేని నష్టం జరిగిపోతుంది. కాబట్టి ప్రమాదాల్లో తలకు దెబ్బ తగిలిన వ్యక్తుల్లో కొన్ని లక్షణాలు గమనించాలి.
అవేంటంటే..

తల నొప్పి
మాటలు తడబడడం
శరీరం మొద్దుబారడం
వాంతులు
మత్తులోకి జారిపోవడం
కనుపాప మరోదాని కంటే పెద్దదిగా మారిపోవడం
అదుపు చేయలేనంతగా ఎగిరి పడుతూ ఉండడం
శరీరం వేగంగా వణికిపోతూ ఉండడం
పరిసరాలను గుర్తు పట్టలేకపోవడం
స్పృహ తప్పడం
పసికందులు, పిల్లలు గాయపడితే ఎంత ఓదార్చినా ఏడుపు ఆపకపోవడం
తలకు గాయం ప్రమాదకరం! ఎందుకంటే?
మెదడు మిగతా శరీర భాగాల్లా తనను తాను అభివృద్ధి చేసుకోలేదు. కాబట్టి మెదడుకు గాయమైతే అది శాశ్వత నష్టంగానే భావించాలి. కపాలం మెదడుకు తగినంత రక్షణ కల్పించేదే అయినా ప్రమాదం జరిగిన సందర్భాల్లో కపాలమే మెదడుకు తిరిగి సరిదిద్దలేని నష్టం కలిగిస్తుంది. ప్రమాదం ప్రభావం మూలంగా మెదడు వాచినప్పుడు, అంతర్గత రక్తస్రావం జరిగినప్పుడు మెదడు పరిమాణం పెరుగుతుంది. ఆ సమయంలో కపాలంలో చోటు సరిపోకపోవడం మూలంగా మెదడు మీద ఒత్తిడి పెరుగుతుంది. ఫలితంగా ఎన్నో తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుంది. కాబట్టి తలకు దెబ్బ తగిలినప్పుడు బాధితుడి లక్షణాల ఆధారంగా తక్షణ చికిత్స అందించి మరింత ఆరోగ్య నష్టం జరగకుండా నియంత్రించవచ్చు. అవసరమైతే సర్జరీ చేసి ప్రాణాపాయం నుంచి కాపాడవచ్చు.

ప్రమాదం జరిగిన ఎంతసేపటిలోగా?
ఎక్కువ శాతం ట్రమాటిక్‌ బ్రెయిన్‌ ఇంజురీలలో రెండు గంటల్లోపే ప్రాణాలు పోతూ ఉంటాయి. కాబట్టి ప్రమాదం జరిగిన వెంటనే చికిత్స మొదలుపెడితే, ప్రాణాలు నిలవడంతోపాటు మున్ముందు పరిణామాలనూ నియంత్రించవచ్చు. కాబట్టి ‘గోల్డెన్‌ అవర్‌’ను వృథా చేయకూడదు. దెబ్బ తగిలిన వెంటనే మెదడు నాడీ కణజాలానికి జరిగే నష్టం తక్కువే ఉన్నా, నిమిషాలు, గంటలు, రోజులు గడిచేకొద్దీ ఆ గాయం తాలూకు (సెకండరీ ఇంజురీ) తీవ్రత అంతకంతకీ పెరిగిపోయి, తిరిగి సరిచేయలేని పరిస్తితి నెలకొంటుంది. ఇలాంటి సెకండరీ ఇంజురీలే మరణాలకు, వైకల్యాలకు ప్రధాన కారణం అవుతూ ఉంటుంది. కాబట్టి లక్షణాలు, గాయాలు, రక్తస్రావం ఉన్నా, లేకపోయినా రోడ్డు ప్రమాదాల్లో తలకు దెబ్బ తగిలిన వ్యక్తుల్ని సాధ్యమైనంత త్వరగా ఆస్పత్రికి చేర్చాలి.

డాక్టర్‌ జి. వేణుగోపాల్‌,
సీనియర్‌ న్యూరో సర్జన్‌,
యశోద హాస్పిటల్స్‌, హైదరాబాద్‌.

వర్షరుతువు హోమియో | Rainy Homio | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu


వర్షరుతువు హోమియో |  Rainy Homio | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu

వర్షరుతువు హోమియో 
వానా వానాహాయప్పా! 

జలుబు, దగ్గు, ఆస్థమా వంటి సమస్యలు ఒకటే అయినా వాటి లక్షణాలు, తీవ్రత అందరిలో ఒకేలా ఉండవు. అందుకే హోమియో విధానం ఆయా వ్యక్తుల పరిస్థితి, రోగ లక్షణాలను బట్టి రకరకాల మందులను సూచిస్తుంది. రోగ లక్షణాలు తగ్గుముఖం పట్టేలా చేసే మందులతో పాటు అవి మళ్లీ మళ్లీ తిరగబెట్టకుండా, దీర్ఘకాల (క్రానిక్‌) సమస్యలుగా మారకుండా చూడటానికి శరీర తత్వాన్ని బట్టి (కాన్‌స్టిట్యూషనల్‌) వాడుకోవాల్సిన ఔషధాలకూ ప్రాధాన్యం ఇస్తుంది. 

ఎండ వేడి బెడద లేదు. ఉక్కపోత చిక్కులేదు. ఉదయం లేస్తూనే శరీరాన్ని చల్లగా తాకే గాలి. చిటపట చినుకుల సందడి. నింగికీ నేలకూ ఉయ్యాలలేసే వానధార. అవును.. వర్షకాలం వస్తూనే ఆహ్లాదకరమైన వాతావరణాన్ని వెంటబెట్టుకు వస్తుంది. ఎటుచూసినా పచ్చటి ప్రకృతి సోయగంతో పలకరిస్తుంది. అయితే ఇంతటి సంతోషాన్ని పంచే వర్షకాలం కొన్ని ఆరోగ్య సమస్యలనూ మోసుకొస్తుంది. జలుబు, తుమ్ములు, ముక్కు కారటం సరేసరి. ఆహారం, నీరు కలుషితం కావటం వల్ల పట్టుకునే విరేచనాలు, వాంతులు, టైఫాయిడ్‌ జ్వరం.. దోమకాటుతో విరుచుకుపడే మలేరియా.. ఇలా ఎన్నెన్నో జబ్బులు చుట్టుముడుతుంటాయి. మరి వీటి నుంచి కాపాడుకోవటమెలా? ఇందుకు హోమియో చక్కటి పరిష్కారం చూపిస్తుంది. సహజ వైద్య విధానంతో సరళ పరిష్కారాలను అందిస్తుంది. 

మన ఆరోగ్యాన్ని చాలా అంశాలు ప్రభావితం చేస్తాయి. వీటిల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది రుతువుల గురించి. ఆయా కాలాల్లో తలెత్తే వాతావరణ మార్పులు.. ఎండ, చలి, వానల వంటివి మన శరీరంపై గణనీయమైన ప్రభావాన్నే చూపిస్తాయి. కొందరిలో ఇవి సమస్యాత్మకంగానూ పరిణమిస్తాయి. ఈ వర్షకాలంలో వానలో తడవటం, తేమ గాలి ప్రభావం వల్ల కొందరికి కొన్ని సమస్యలు ఆరంభం కావొచ్చు. కొందరికి అప్పటికే ఉన్న బాధలు ఎక్కువ కావొచ్చు కూడా. వానకాలంలో చాలామంది తరచుగా జలుబు బారినపడుతుండటం తెలిసిందే. దీంతో తుమ్ములు, దగ్గు, ముక్కు కారటం వంటివి తెగ వేధిస్తుంటాయి. అందుకేనేమో పడిశం పది రోగాల పెట్టు అంటుంటారు. ఇక కీళ్ల సమస్యలతో బాధపడేవారికైతే వానకాలంలో వాపులు, నొప్పులు మరింత ఎక్కువవుతుంటాయి కూడా. ఇలా కాలనుగుణంగా ఎదురయ్యే సమస్యలకు మూల హేతువు మన వ్యాధి నిరోధక వ్యవస్థ గాడి తప్పటం. ఇందుకు ఆయా కాలాల్లో వచ్చే మార్పులు దోహదం చేస్తుండటం.

ఒంట్లో కీలక ‘కేబినెట్‌’! 
మన శరీరంలో, మనసులో తలెత్తే అస్తవ్యస్తాలే అన్ని వ్యాధులకు మూలం. దీనికి కారణం అంతర్గత, బాహ్య అంశాల ప్రేరేపణే. ఈ అంశాల కారణంగా వ్యక్తిలో తలెత్తే స్పందనలే రోగ లక్షణాల రూపంలో బయటపడుతుంటాయి. అందుకే హోమియో వైద్య విధానం బహిర్‌, అంతర కారణాలు రెంటినీ పరిగణనలోకి తీసుకుంటుంది. గాలి, నీరు, తేమ, సూక్ష్మక్రిముల వంటి పరిసరాల ప్రభావాలన్నీ బాహ్య కారణాలు. శరీర తత్వం, మనస్తత్వం, వయసు వంటివన్నీ ఆంతరంగిక కారణాలు. మనలో మానసిక (సైకో), నాడీ (న్యూరో), గ్రంథి (ఎండోక్రైన్‌), వ్యాధి నిరోధక (ఇమ్యూనిటీ) వ్యవస్థలు చాలా ముఖ్యమైనవి. మన దేహాన్ని ఒక దేశమని అనుకున్నట్టయితే దాన్ని పరిపాలించే కీలకమైన ‘కేబినెట్‌’ సభ్యులు ఇవేనన్నమాట! ఈ అంతర్గత వ్యవస్థలు ప్రతి వ్యక్తిలో వేర్వేరుగా ఉంటాయి. మనిషి వ్యక్తిత్వానికి ఇవే ఆధారం. వీటిల్లో వ్యాధి నిరోధక వ్యవస్థ ఇంకా ముఖ్యం. దీన్నే ప్రాణమనీ చెప్పుకోవచ్చు. ఆయా కాలాల్లో వచ్చే సమస్యల విషయంలో కచ్చితమైన సూత్రమంటూ ఏదీ లేదు. ఉదాహరణకు- వానలో అందరూ తడవొచ్చు గానీ కొందరికే జలుబు, తుమ్ముల వంటివి పట్టుకుంటుంటాయి. దీనికి కారణం వ్యాధి నిరోధక వ్యవస్థ పనితీరే మూలం. ఇది దెబ్బతింటే రకరకాల జబ్బులు తేలికగా దాడిచేస్తాయి. అదేపనిగా బాహ్య కారణాలు దాడిచేస్తుంటే అంతర్గత కీలక వ్యవస్థలు బలహీనపడి రకరకాల సమస్యలకు దారితీస్తుంది. ఈ వ్యవస్థలను తిరిగి బలోపేతం చేస్తే వ్యాధులు, బాధలన్నీ కుదరుకుంటాయి.

వ్యాధిని నిరోధించటానికి గానీ నివారించటానికి గానీ జీవశక్తిని ఉత్తేజపరచటం చాలా అవసరం. హోమియో వైద్య విధానం చేసే పని ఇదే. లక్షణాల కంటే కూడా శరీర తత్వం, వ్యక్తిత్వానికి ప్రాధాన్యమిస్తూ.. వ్యాధి సమూలంగా నయమయ్యేలా చేస్తుంది. 

నిజానికి బయటకు కనిపించే రోగ లక్షణాలన్నీ కూడా పరిసరాల ప్రభావం ఒత్తిడిని తట్టుకునేందుకు మన ఆంతరంగిక వ్యవస్థ చేసుకునే ఏర్పాట్లే అనుకోవచ్చు. శరీరం వ్యక్తం చేసే ఈ లక్షణాలను బట్టి మనం రకరకాల వ్యాధుల పేర్లతో పిలుచుకుంటున్నాం. ఇవి అందరిలో ఒకేలా ఉండాలనేమీ లేదు. ఒకే రకం బాహ్య పరిస్థితుల్లో ఉండేవారిలో కూడా.. ఆంతరంగిక పరిస్థితులు వేర్వేరుగా ఉంటాయి. కాబట్టి స్పందనలు కూడా వేరుగా ఉంటాయి. వర్షం, తేమ, తేమతో కూడిన గాలి అన్నవి బాహ్య పరిస్థితులు. దీనికి వ్యక్తి స్పందనల తీరును బట్టి మందులను ఎంపిక చేసి శరీర రక్షణ వ్యవస్థను బలోపేతం చేయాల్సి ఉంటుంది. హోమియో చికిత్సలో ఇది చాలా కీలకమైన అంశం. మందుల ఎంపికలో వ్యాధి లక్షణాలు మాత్రమే కాకుండా వ్యక్తి స్వభావం, తత్వం తెలిసి ఉండటం కూడా చాలా అవసరం. అప్పుడే దానికి తగ్గ సమర్థవంతమైన మందును ఎంపిక చేసుకోవటానికి వీలవుతుంది. కాల ప్రభావం ఒక్కొక్కరిలో ఒకోలా ఉంటుంది. ఉదాహరణకు ఉబ్బసం ఒకటే అయినా కొందరికి అర్ధరాత్రి సమయంలో ఉద్ధృతంగా ఉంటుంటే.. మరికొందరికి తెల్లవారుజామున ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఒక్క బాధను బట్టే మందు ఇవ్వటం హోమియో పద్ధతి కాదు. రోగ లక్షణాలు, రోగి శరీర తత్వాన్ని బట్టి మందును ఎంచుకోవాల్సి ఉంటుంది. 

మనిషి వ్యక్తిత్వానికి అంతర్గత వ్యవస్థలే ఆధారం. వీటిల్లో వ్యాధి నిరోధక వ్యవస్థ ఇంకా ముఖ్యం. దీన్నే ప్రాణమనీ చెప్పుకోవచ్చు.

రస్టాక్స్‌: వర్షకాలంలో ప్రధానంగా చెప్పుకోదగిన ఔషధమిది. వానలు కురిసే ముందు ముఖ్యంగా.. తుపాన్లు వచ్చే ముందు తలెత్తే బాధలకిది మంచి మందు. జలుబు, కీళ్లవాతం, కాళ్లు చేతులు బిగుసుకుపోవటం, జ్వరం.. ముఖ్యంగా టైఫాయిడ్‌ జ్వరం వంటి సమస్యలతో బాధపడేవారికి బాగా ఉపయోగపడుతుంది. సాధారణంగా విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు సుఖంగా, హాయిగా ఉండాలి. కానీ కొందరికి విశ్రాంతిగా ఉన్నప్పుడు నొప్పులు, బాధలు పెరుగుతుంటాయి. వీరికి అటూ ఇటూ కదులుతూ మెదులుతూ ఉంటేనే ఉపశమనంగా అనిపిస్తుంటుంది. నిద్రలేవటంతోనే కండరాలు, కీళ్లు బిగపట్టుకొని పోయి ఉంటాయి. ఇలాంటివారికి రస్టాక్స్‌ మేలు చేస్తుంది. పగటి పూట కన్నా రాత్రి పూట బాధలు ఎక్కువుతుంటే దీన్ని వాడుకోవచ్చు. అర్ధరాత్రి దాటాక పొట్టలో నొప్పి, నీళ్ల విరేచనాలతో బాధపడే పిల్లలకు, అస్థిమితంగా ఉండేవారికిది మంచి ఉపశమనం కలగజేస్తుంది. వానలో తల తడిచిన తర్వాత పట్టుకునే జలుబు, దగ్గు, తుమ్ముల వంటి బాధలకు బాగా ఉపయోగపడుతుంది. ఏవైనా బరువు పనులు, శారీరక శ్రమ చేయటం వల్ల బాధలు ఎక్కువవుతుంటే దీన్ని తప్పకుండా గుర్తుంచుకోవాలి. 

డల్కమారా: ఒకరకంగా దీన్ని వర్షకాల టీకా అనుకోవచ్చు. ఎందుకంటే ఇది ఈ కాలంలో తలెత్తే శ్వాసకోశ సమస్యలను తగ్గించుకోవటానికే కాదు.. అవి రాకుండా చూసుకోవటానికీ ఉపయోగపడుతుంది. తేమ, చెమ్మతో కూడిన వాతావరణంలో.. సముద్రతీర ప్రాంతాల్లో నివసించేవారిలో శ్వాసకోశ సమస్యలు ఎక్కువగా కనబడుతుంటాయి. వర్షకాలంలో ఇలాంటి సమస్యలకు గురయ్యేవారికి డల్కమారా మంచి ఔషధం. ఎండ కాస్తూ.. కాస్తూ.. ఉన్నట్టుండి వాతావరణం చల్లబడిపోవటం మూలంగా తలెత్తే సమస్యలకిది బాగా ఉపయోగపడుతుంది. జలుబు, దగ్గు, కఫం పడటం వంటి సమస్యలు తగ్గుముఖం పట్టటానికి తోడ్పడుతుంది. కఫంలో రక్తం పడుతున్నా దీన్ని గుర్తుంచుకోవాలి. ముక్కులు బిగుసుకుపోవటం, గొంతునొప్పి తగ్గటానికి బాగా ఉపయోగపడుతుంది. చర్మవ్యాధులతో బాధపడేవారు ఈ కాలంలో ఆ సమస్య తగ్గిపోయి.. కొత్తగా శ్వాసకోశ వ్యాధుల బారినపడుతున్నట్టు గమనిస్తే దీన్ని వాడుకోవటం ఉత్తమం. జలుబు చేసినపుడు దగ్గు, తుమ్ములతో పాటు చర్మం మీద దద్దు (అర్టికేరియా) కూడా ఉన్నట్టు గమనిస్తే డల్కమారా తీసుకోవచ్చు. వేసవికాలం పోయిన తర్వాత తొలకరిలో పట్టుకునే నీళ్ల విరేచనాలకూ ఇది ముఖ్యమైన ఔషధమే. మలం ఆకుపచ్చగా ఉంటున్నా, పల్చగా నీళ్లలాగా విరేచనం అవుతున్నా దీన్ని వాడుకోవటం మంచిది. 

ఆర్సెనికం ఆల్బ్‌: వర్షకాలంలో జలుబు, దగ్గులకు గురయ్యేవారికిది దివ్యమైన ఔషధం. ఆహారం కలుషితం (ఫుడ్‌ పాయిజనింగ్‌) కావటం వల్ల పట్టుకునే విరేచనాలు, వాంతులను తగ్గించటానికీ బాగా ఉపయోగపడుతుంది. వాంతులు, విరేచనాలు ఒకే సమయంలో అవుతున్నవారికి, కలరా బాధితులకు ఆర్సెనికం ఆల్బ్‌ ప్రత్యేకమైన ఔషధం. ఇది నిస్త్రాణ తగ్గటానికీ తోడ్పడుతుంది. వర్షకాలంలో తరచుగా కనబడే జలుబు, దగ్గు, న్యుమోనియా వంటి శ్వాసకోశ వ్యాధులను సమర్థంగా తగ్గిస్తుంది. ఆస్థమా బాధితులకు.. ముఖ్యంగా అర్ధరాత్రి పన్నెండు నుంచి ఒంటి గంట సమయంలో ఆయాసానికి గురయ్యేవారికి మంచి ఉపశమనం కలిగిస్తుంది. 

నేట్రం సల్ఫ్‌: తేమ, చల్లటి వాతావరణంలో పట్టుకునే ఉబ్బసం, నీళ్ల విరేచనాలు తగ్గటానికిది బాగా ఉపయోగపడుతుంది. ప్రత్యేకించి తెల్లవారుజామున 4-5 గంటల సమయంలో ఆయాసం ఎక్కువయ్యేవారికి దీంతో మంచి ఉపశమనం లభిస్తుంది. పిల్లల్లో ఆస్థమాకు నేట్రం సల్ఫ్‌ దివ్యంగా పనిచేస్తుంది. పిల్లికూతలు, శ్లేష్మం ఎక్కువగా ఉండేవాళ్లు దీన్ని వాడుకోవచ్చు. ఛాతీలో నొప్పి.. ముఖ్యంగా ఎడమవైపున నొప్పి వచ్చేవారికి ఉపయోగపడుతుంది. 

నేట్రంమూర్‌: మలేరియా జ్వరానికి విశిష్టమైన ఔషధమిది. మలేరియా జ్వరంతో శుష్కించి, పాలిపోయి నీరసంగా ఉన్న రోగులు దీన్ని వాడితే త్వరగా కోలుకుంటారు. జ్వరం పది, పదకొండు గంటలకు మొదలయ్యేవారు దీన్ని వాడుకోవచ్చు. బద్ధలవుతున్నట్టుగా తలనొప్పి, చలి, జ్వరం గలవారికి ఇదెంతో మేలు చేస్తుంది. కొందరికి మలేరియా చలితో మొదలై వాంతులకు దారితీస్తుంటుంది. ఇలాంటివారికిది బాగా ఉపయోగపడుతుంది. 

వానకాల సమస్యల బాధలను తగ్గించే ఔషధాలివి. వీటిని ఆయా లక్షణాలను బట్టి ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మందులను 30 పొటెన్సీలో ప్రతి నాలుగు గంటలకు ఒకసారి లక్షణాలు తగ్గేంతవరకు వేసుకోవచ్చు.


లేకిసిస్‌: శరీరంలో ఎడమవైపు సమస్యలతో బాధపడుతున్నట్టయితే దీని గురించి ఆలోచించాలి. వీరిలో సమస్యలు ఎడమవైపు మొదలై.. కుడివైపునకు వ్యాపిస్తుంటాయి. వీరికి నిద్ర పెద్ద శత్రువు. నిద్ర పట్టిన తర్వాత సమస్యలు ఉద్ధృతమవుతాయి. ఆయా బాధలతో నిద్రలోంచి లేస్తుంటారు కూడా. కొందరు శ్వాస ఆగిపోయి, ఉలిక్కి పడి లేస్తుంటారు (స్లీప్‌ అప్నియా). వీరికి అసూయ ఎక్కువ. అనుమాన రోగులు. నిష్కారణంగా అనుమానిస్తుంటారు. వాగుడు కాయలు కూడా. అతిగా మాట్లాడుతుంటారు. మాటిమాటికీ తలనొప్పి, గొంతు సమస్యలతో బాధపడుతుంటారు. రక్తస్రావమైతే కండలు కండలుగా అవుతుంటుంది. మహిళల్లో నెలసరి దగ్గరపడుతున్నకొద్దీ సమస్యలు ఎక్కువవుతుంటాయి. రుతుస్రావం మొదలవ్వగానే తగ్గిపోతుంటాయి. 

సల్ఫర్‌: రుతువులు మారినప్పుడల్లా బాధలకు గురయ్యేవారికిది ముఖ్యమైన ఔషధం. ఉదయం 11 గంటల సమయంలో సమస్యలు ఎక్కువయ్యేవారికిది ఎంతో మేలు చేస్తుంది. ఈ సమయంలో జలుబు, దగ్గు వంటివి ఎక్కువవుతుంటే దీన్ని తీసుకోవచ్చు. ఉదయం పూట విరేచనాలు అవుతూ.. మధ్యాహ్నమయ్యాక తగ్గిపోతుండేవారికీ బాగా ఉపయోగపడుతుంది. పరిశుభ్రతను అంతగా పట్టించుకోనివారు, తేమ వాతావరణంలో బాధలు ఎక్కువయ్యేవారు దీన్ని తీసుకోవటం మంచిది. మలబద్ధకం, ఆసనంలో మంట, మొలల వంటి సమస్యలు గలవారికి.. తీపి, మద్యం బాగా ఇష్టపడేవారికి.. తెలివితేటలు కలిగి ఎక్కువగా గర్వపడేవారికి ఇది ఆలోచించదగిన మందు. 
సైలీషియా: ఇది సిగ్గు, బిడియం, పిరికితనం, మొండితనం ఎక్కువగా ఉండే స్వభావం గలవారికి ఉపయోగపడే ఔషధం. అరిచేతులకు, అరికాళ్లకు చెమటలు ఎక్కువగా పోసేవారు.. మేజోళ్లు చెమటలో నాని దుర్వాసన వస్తుండేవారు దీని గురించి ఆలోచించాలి. పని అవుతుందో కాదో, రైలు అందుతుందో లేదో అని ప్రతిదానికీ ఆదుర్దా పడే స్వభావం గలవారికి సైలీషియా బాగా ఉపయోగపడుతుంది. పరీక్షలంటే భయపడిపోయే పిల్లలకు, కుడివైపున పార్శ్వనొప్పితో బాధపడేవారికిది మంచి ఔషధం. విసర్జన సమయంలో మలం ఆసనం దాకా వచ్చి వెనక్కి మళ్లుతున్నా.. శరీరం మీద సూదులు గుచ్చుకున్నట్టుగా బాధలు వేధిస్తున్నా దీని గురించి ఆలోచించాలి. టీకాలు ఇచ్చిన తర్వాత వచ్చే బాధలన్నింటికీ సైలీషియా బాగా పనిచేస్తుంది. దుమ్ము ధూళిలో పనిచేయటం వల్ల వచ్చే శ్వాసకోశ సమస్యలు తగ్గటానికీ ఉపయోగపడుతుంది. తలలో చెమటలు పట్టేవారికిది గుర్తుంచుకోదగిన ఔషధం. కాళ్లు చేతులు సన్నగా ఉండి.. పొట్ట ముందుకు పొడుచుకు వచ్చే రికెట్స్‌తో బాధపడేవారికీ మేలు చేస్తుంది. 

శరీర తత్వాన్ని (కాన్‌స్టిట్యూషనల్‌) బట్టి తీసుకోవాల్సిన ఔషధాలు ఇవి. వాతావరణం మారినప్పుడల్లా తలెత్తే సమస్యలు మళ్లీ మళ్లీ తిరగబెట్టకుండా ఉండటానికివి తోడ్పడతాయి. వీటిని వ్యాధి లక్షణాలు తగ్గాక- 30 పొటెన్సీలో వారానికి ఒకసారి చొప్పున 4-6 వారాలు వాడుకోవాలి.


వర్షరుతువు |  Rainy| GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu




ఆటలమ్మ | Chicken pox | Mohanpublications | Granthanidhi | Bhaktipustakalu





ఆటలమ్మ | Chicken pox | Mohanpublications | Granthanidhi | Bhaktipustakalu chicken pox ammavaru aatalamma Varicella zoster varicella Publications in Rajahmundry, Books Publisher in Rajahmundry, Popular Publisher in Rajahmundry, BhaktiPustakalu, Makarandam, Bhakthi Pustakalu, JYOTHISA,VASTU,MANTRA, TANTRA,YANTRA,RASIPALITALU, BHAKTI,LEELA,BHAKTHI SONGS, BHAKTHI,LAGNA,PURANA,NOMULU, VRATHAMULU,POOJALU,  KALABHAIRAVAGURU, SAHASRANAMAMULU,KAVACHAMULU, ASHTORAPUJA,KALASAPUJALU, KUJA DOSHA,DASAMAHAVIDYA, SADHANALU,MOHAN PUBLICATIONS, RAJAHMUNDRY BOOK STORE, BOOKS,DEVOTIONAL BOOKS, KALABHAIRAVA GURU,KALABHAIRAVA, RAJAMAHENDRAVARAM,GODAVARI,GOWTHAMI, FORTGATE,KOTAGUMMAM,GODAVARI RAILWAY STATION, PRINT BOOKS,E BOOKS,PDF BOOKS, FREE PDF BOOKS,BHAKTHI MANDARAM,GRANTHANIDHI, GRANDANIDI,GRANDHANIDHI, BHAKTHI PUSTHAKALU, BHAKTI PUSTHAKALU, BHAKTHI


ఆటలమ్మ

ఆటలమ్మ (Chicken pox) లేదా అమ్మవారు అని సాధారణంగా పిలవబడే ఈ వైరల్ వ్యాధిని వైద్య పరిభాషలో వారిసెల్లా జోస్టర్ (Varicella zoster) అని వ్యవహరిస్తారు. ఈ వ్యాధి చిన్నతనంలో ప్రతి పిల్లవాడికి సోకి నయమవడం సర్వసాధారణం. ఆటలమ్మ వారిసెల్లా జోస్టర్ వైరస్ ద్వారా సంక్రమిస్తుంది, ఈ వైరస్‌ను హ్యూమన్ హెర్పిస్ వైరస్ 3 అని కూడా వ్యవహరిస్తారు.

వ్యాధి లక్షణాలు

ఆటలమ్మలో రెండు రకాలున్నాయి. ఒకటి ఆటలమ్మ, రెండోది ముత్యాలమ్మ. ఆటలమ్మ మశూచికం వ్యాధిలా తీవ్రమైన జబ్బుకాదు. అయినా కొన్నిసార్లు ప్రమాదకరంగా మారనూవచ్చు. ఆటలమ్మ ప్రపంచంలో ఇంకా పూర్తిగా నిర్మూలించబడలేదు. దీన్ని చాల మంది అమ్మ వారు అని తేలికగా తీస్కుంటారు, అంతే కాక మంచిది అనేలా బావిస్తారు. నిజానికి యిది ఒక వైరస్, మన పూర్వికులు దైవంగా బావించే ఈ వ్యాధి 'ఆటలమ్మ' క్రిములు శరీరంలో ప్రవేశించిన 4,5, రోజుల తర్వాత వ్యాధి లక్షణాలు పైకి కనబడతాయి. వైద్య నిపున్ని సంప్రదించడం చాల మంచిది, మూడ నమ్మకాలతో నిర్లక్చ్యం చేయరాదు. ఆటలమ్మ విషయంలో మశూచికం వ్యాధిలోలాగా కాకుండా ఆరాంభంలోనే పొక్కులు కనిపిస్తాయి. కొద్దిగా జ్వరం కూడా వస్తుంది. రోగం సోకిన కొన్ని గంటలలో వంటిమీద పొక్కులు కనిపిస్తాయి. మరికొన్ని గంటలలో ఆ పొక్కులలో నీరు చేరుతుంది. ఒకటి రెండు రోజుల తర్వాత వాటిలో చీము చేరుతుంది.
ఆటలమ్మ మొదట నోటిలోపల, శరీరం పైభాగాన ఆరంభం అవుతుంది. తర్వాత ముఖం, రొమ్ము, చేతులు, కాళ్ళు, ఇలా వివిధ భాగాలకు వ్యాపిస్తుంది. ముఖంమీద, కాళ్ళు, చేతులలో కణువుల వద్ద, కొద్దిపాటి పొక్కులే ఉంటాయి. చంకలు, భుజం, తొడల ప్రాంతంలో ఎక్కువ పొక్కులు కనిపిస్తాయి. పొక్కులు సంపులు సంపులుగా ఉంటాయి.నీళ్ళతో నిండిన పొక్కులు సులభంగా చిట్లిపోతాయి. పొక్కులలో చీము చేరేటప్పుడు జ్వరం రాదు. పొక్కులు రాలి నప్పుడు ఎర్రపుండు ఏర్పడవచ్చు. కాని మశూచికంలోలాగ గుంటలు పడవు, మచ్చలూ ఏర్పడవు.

నిరోధక విధానం

ఆటలమ్మ సోకిన బిడ్డను, తక్కిన పిల్లలతో కలసి ఆడుకోనివ్వరాదు. తక్కిన పిల్లలకు దూరంగా ఉంచాలి. మశూచికం వచ్చినప్పుడు తీసుకునే జాగ్రత్తలన్నీ ఆతలమ్మ సోకినప్పుడూ తీసుకోవాలి. నీటి బొబ్బలు శరీరం మెడ ఏర్పడుతుంది. అలా మొదలయిన నీటి బొబ్బలను గోర్లతో గీకరాదు, గోర్లతో గీకడం వల్ల మరింత ఎక్కువ అయ్యే ప్రమాదం ఉంది. రోగిని చల్లటి ప్రదేశంలో ఉంచాలి, పలుచన అయిన దుస్తులు ధరించాలి. చేతి గోర్లను కతిరించడం చాలా ముఖ్యం. వైద్య నిపుణులు యిచ్చిన మందులను వాడటం చాలా ముఖ్యం.

అమ్మవారు

ఇదికూడా ఆటలమ్మ రోగ క్రిమివల్ల సంక్రమించే వ్యాధే అని చెప్పలి. రోగనిరోధక శక్తి తక్కువగా వున్న వాళ్ళ శరీరమంతటా, రోగనిరోధక శక్తి ఎక్కువగావున్న వాళ్ళకు శరీరంలో ఏదో ఒక భాగాన ఈ వ్యాధి సోకుతుంది. ఈ వ్యాధి సోకినప్పుడు జ్వరం బాగా వస్తుంది. వెన్నెముక చుట్టూవున్న జీవకణాల్ని ఈ వ్యాధి బాధిస్తుంది. దేహంలో ఉద్రేకం ఏ భాగంలో కలుగుతుందో ఆ భాగంలో ఈ వ్యాధి సోకుతుంది. మొట్టమొదట పొక్కులు కనిపిస్తాయి. పొక్కులలో నీళ్ళు చేరి తర్వాత చీము పడతాయి. అలా మొదలయిన నీటి బొబ్బలని గోర్లతో గీకరాదు. గోర్లతో గీకడం వల్ల మరింత ఎక్కువ అయ్యే ప్రమాదం ఉంది. రోగిని చల్లటి ప్రదేశంలో ఉంచాలి, పలుచన అయిన దుస్తులు ధరించాలి. చేతి గొర్లను కత్తిరించడం చాల ముఖ్యం. వైద్య నిపుణులు యిచ్చిన మందులను వాడటం చాల ముఖ్యం.



ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం | World_No_Tobacco_Day | Mohanpublications | Granthanidhi | Bhaktipustakalu

ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం | World_No_Tobacco_Day | Mohanpublications | Granthanidhi | Bhaktipustakalu World No Tobaccoday Tobbaccoday Cigarette smoking tobacco lungs cigarette smoking Publications in Rajahmundry, Books Publisher in Rajahmundry, Popular Publisher in Rajahmundry, BhaktiPustakalu, Makarandam, Bhakthi Pustakalu, JYOTHISA,VASTU,MANTRA, TANTRA,YANTRA,RASIPALITALU, BHAKTI,LEELA,BHAKTHI SONGS, BHAKTHI,LAGNA,PURANA,NOMULU, VRATHAMULU,POOJALU,  KALABHAIRAVAGURU, SAHASRANAMAMULU,KAVACHAMULU, ASHTORAPUJA,KALASAPUJALU, KUJA DOSHA,DASAMAHAVIDYA, SADHANALU,MOHAN PUBLICATIONS, RAJAHMUNDRY BOOK STORE, BOOKS,DEVOTIONAL BOOKS, KALABHAIRAVA GURU,KALABHAIRAVA, RAJAMAHENDRAVARAM,GODAVARI,GOWTHAMI, FORTGATE,KOTAGUMMAM,GODAVARI RAILWAY STATION, PRINT BOOKS,E BOOKS,PDF BOOKS, FREE PDF BOOKS,BHAKTHI MANDARAM,GRANTHANIDHI, GRANDANIDI,GRANDHANIDHI, BHAKTHI PUSTHAKALU, BHAKTI PUSTHAKALU, BHAKTHI



పొగ చిచ్చు!
మే 31 ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం

గుప్పు గుప్పుమని పొగ వదులుతూ.. ఆనందాన్ని పొందుతున్నామని చాలామంది భావిస్తుంటారు గానీ ఇది కళ్ల నుంచి కాళ్ల వరకూ ‘పొగ’ పెడుతుంది. సిగరెట్లు, చుట్టలు, బీడీలు.. ఇలా ఏ రూపంలో అయినా పొగ తీవ్ర అనర్థాలను తెచ్చిపెడుతుంది. క్రమంగా ఊపిరితిత్తులు, గుండె, రక్తనాళాలను దెబ్బతీస్తూ.. గుండెజబ్బులు, పక్షవాతం వంటి ముప్పులను పెంచుతుంది. అంతేకాదు.. రకరకాల క్యాన్సర్లనూ వెంటబెట్టుకు వస్తుంది. పొగకు తోడు గుట్కాలు, జర్దాలు, ఖైనీల వంటివీ పెద్ద సమస్యగా మారిపోయాయి. కాబట్టి ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం నేపథ్యంలో దీని అనర్థాల గురించి తెలుసుకొని ఉండటం ఎంతో అవసరం.

సిగరెట్‌ కాల్చటం వల్ల కాసేపు ఉత్సాహం వచ్చినట్టు అనిపిస్తొండొచ్చు. కొద్దిసేపు తృప్తి, ఆనందం వంటివి కలగొచ్చు. కానీ దీనిలోని పొగాకులోని నికొటిన్‌ క్రమక్రమంగా మనిషిని లోబరచుకుంటుంది. పొగ రూపంలో అయినా.. జర్దా, ఖైనీ, గుట్కాల వంటి రూపాల్లో అయినా నికొటిన్‌ తీవ్ర అనర్థాలు తెచ్చిపెడుతుంది. పొగాకులో ఒక్క నికొటిన్‌ మాత్రమే కాదు.. సుమారు 7వేల రకాల విషతుల్యాలుంటాయి. పొగ పీల్చిన వెంటనే ఇవన్నీ మూకుమ్మడిగా రక్తంలో కలిసి ఒళ్లంతా విస్తరిస్తాయి. ఈ విషతుల్యాల్లో సుమారు 400 రకాల రసాయనాలు క్యాన్సర్లకు కారణమవుతున్నాయని అధ్యయనాలు గుర్తించాయి. ముఖ్యంగా ఆర్సెనిక్‌, బెంజీన్‌, బెరీలియం, కాడ్మియం, క్రోమియం, ఇథిలీన్‌ ఆక్సైడ్‌ వంటి రసాయనాలు కచ్చితంగా క్యాన్సర్లను తెచ్చిపెడుతున్నట్టు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. సిగరెట్లు, చుట్టల పొగలోని ఈ రసాయనాలు నోటి నుంచే శరీరంలోకి వెళ్లటం ప్రారంభిస్తాయి. ముందుగా ఇవి నోట్లోని సున్నితమైన జిగురు పొరల ద్వారా కొంత లోపలికి వెళ్లిపోతాయి. పొగ ఊపిరితిత్తుల్లోకి చేరుకున్నప్పుడు అక్కడ్నుంచి ఇవి రక్తంలో కలుస్తాయి. అనంతరం శరీర స్రావాలన్నింటిలోకి చేరి, స్థిరపడిపోతాయి. అందువల్ల ఇవి ఒక్క ఊపిరితిత్తుల్లోనే కాదు. శరీరంలో ఎక్కడైనా క్యాన్సర్లను తెచ్చిపెట్టే ప్రమాదం పొంచి ఉంటుంది.
అన్నీ ముప్పులే..పొగాకు శరీరంలోని అన్ని అవయాల మీదా ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా ఊపిరితిత్తులను దెబ్బతీసి సీవోపీడీ (క్రానిక్‌ అబ్‌స్ట్రక్టివ్‌ పల్మనరీ డిసీజ్‌) న్యుమోనియా, ఆస్థమా వంటి జబ్బులకు దారితీస్తుంది. పొగాకు మూలంగా రక్తంలో చెడ్డ కొలెస్ట్రాల్‌ స్థాయులు పెరుగుతాయి. దీంతో రక్తనాళాల్లో పూడికలు ఏర్పడి గుండె జబ్బులు, గుండె వైఫల్యం వంటి ముప్పులు పెరుగుతాయి. అధిక రక్తపోటు, పక్షవాతం వంటివి సరేసరి. రక్తనాళాలు సంకోచించటం వల్ల దీర్ఘకాలంగా పుండ్లు మానకుండా ఉండిపోవచ్చు. కొన్నిసార్లు గ్యాంగ్రీన్‌కూ దారితీయొచ్చు. పొగాకు నేరుగా కిడ్నీల పైనా ప్రభావం చూపుతుంది. మగవారిలో స్తంభన లోపం మరో సమస్య. స్తంభనలోపంతో బాధపడుతున్నవారిలో సుమారు 85% మంది పొగరాయుళ్లే కావటం గమనార్హం. ఆడవారిలోనైతే పొగ తాగే అలవాటు మూలంగా గర్భం నిలవకపోవటం, నెలలు నిండకముందే కాన్పు కావటం, తక్కువ బరువుతో పిల్లలు పుట్టటం వంటి దుష్ప్రభావాలు కనబడతాయి.
* పొగ అలవాటు జీవన కాలాన్నీ తగ్గిస్తుంది. పొగ తాగటం వల్ల 12.2 నుంచి 14.5 ఏళ్ల ఆయుర్దాయం తగ్గుతున్నట్టు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. కాల్చే ప్రతి సిగరెట్టుతో 11 నిమిషాలు ఆయుష్షు తగ్గుతోంది!
కణకణాన్ని దెబ్బతీస్తుందిమన శరీరంలోని కణాలన్నీ కూడా ఒక క్రమ పద్ధతిలో విభజన చెందుతుంటాయి. ఒక క్రమ పద్ధతిలో వృద్ధి చెందుతుంటాయి. ఈ ప్రక్రియలను జన్యువులు నియంత్రిస్తుంటాయి. దీని మూలంగానే మన శరీర ఎదుగుదల క్రమ పద్ధతిలో సాగుతూ వస్తుంటుంది. పొగలోని విషతుల్యాలు సరిగ్గా ఈ ప్రక్రియనే దెబ్బతీయటం ఆరంభిస్తాయి. ఇవి యాంటీఆక్సిడెంట్ల మోతాదులు తగ్గేలా చేస్తాయి. కణితులు ఏర్పడటాన్ని అడ్డుకునే జన్యువుల పనితీరును మార్చేస్తాయి. దీంతో కణాల విభజన, పెరుగుదల మీద నియంత్రణ, పట్టు తప్పిపోతాయి. ఇవి ఇష్టం వచ్చినట్టుగా, అడ్డూ అదుపూ లేకుండా పెరిగిపోయి.. క్యాన్సర్‌ కణితులుగా మారిపోయి.. ప్రాణాంతకంగా పరిణమిస్తాయి.
* పొగ ఎన్నేళ్లు తాగితే అంత ముప్పు ఎక్కువవుతుంది. దీన్నే ప్యాక్‌ ఇయర్స్‌ పేరుతో లెక్కిస్తారు. అలాగే పొగ తాగే తీరు కూడా క్యాన్సర్‌ ముప్పు ఆధారపడొచ్చు. పొగను గట్టిగా లోపలికి పీల్చుకోవటం, బలంగా దమ్ము లాగుతూ.. పొగను పూర్తిగా పీల్చుకోవటం వల్ల కూడా క్యాన్సర్‌ ముప్పు పెరిగే అవకాశముంది. పొగ అలవాటు మానేసిన తర్వాత.. దాదాపు పదేళ్ల వరకూ క్యాన్సర్‌ ముప్పు పొంచే ఉంటుంది. కాబట్టి అసలు పొగ తాగే అలవాటు చేసుకోకపోవటమే అన్నింటికన్నా ఉత్తమం. అప్పటికే అలవాటుంటే తక్షణమే మానెయ్యటం మంచిది.
పొగ తాగటమే కాదు, ఇతరులు వదిలిన పొగను పీల్చినా ప్రమాదమే. ఇది కూడా క్యాన్సర్లను తెచ్చిపెడుతున్నట్టు అధ్యయనాలు స్పష్టంగా పేర్కొంటున్నాయి. ఇది రెండు రకాలుగా జరగొచ్చు. ఒకటి- ఇతరులు సిగరెట్ల వంటివి కాలుస్తున్నప్పుడు వాటి నుంచి వెలువడే పొగను నేరుగా పీల్చటం. రెండోది- పొగరాయుళ్లు వదిలిపెట్టిన పొగను పీల్చటం. ఇది పక్కవారికీ ప్రమాదకరంగా పరిణమిస్తుండటం గమనార్హం. దీని మూలంగా ఇంట్లోని స్త్రీలు, పిల్లలు కూడా క్యాన్సర్ల బారినపడే ప్రమాదముందని గుర్తించటం అవసరం.


దిగ్భ్రాంతికర వాస్తవాలు

పొగాకు వాడకంపై మనదేశంలో ఇటీవల చేపట్టిన సర్వేలో దిగ్భ్రాంతికర విషయాలు వెల్లడయ్యాయి. దాదాపు 27 కోట్ల మంది పొగాకు వాడుతుండగా.. వీరిలో 6.84 కోట్ల మంది పొగ తాగేవారు కాగా 16.3 కోట్ల మంది ఇతరత్రా రూపాల్లో పొగాకును వినియోగిస్తున్నారు. ఇక 4.23 కోట్ల మంది ఇటు పొగ రూపంలోనూ అటు ఇతరత్రా రూపాల్లోనూ పొగాకును వాడుతున్నారు. పురుషుల్లో 48% మంది, మహిళల్లో 20% మంది పొగాకును వాడుతున్నారు.
* మహిళల్లో పొగ తాగే అలవాటు మనదగ్గరా ఎక్కువగానే కనబడుతోంది. సుమారు 1.21 కోట్ల మంది మహిళలు పొగ తాగుతున్నట్టు అంచనా. ఈ విషయంలో అమెరికా తర్వాత స్థానం మనదే కావటం గమనార్హం. పొగ తాగటాన్ని అరికట్టటానికి చేపట్టిన ప్రచారాల మూలంగా పురుషుల్లో ఈ అలవాటు కాస్త తగ్గుముఖం పడుతున్నా మహిళల్లో మాత్రం అలాగే ఉంటోంది. పట్ణణాల్లో ఈ ధోరణి హోదాకు చిహ్నంగా భావిస్తుండగా.. గ్రామీణ ప్రాంతాల్లో చాలావరకు ఆకలి, నొప్పి తగ్గించుకోవటానికి మహిళలు పొగ తాగుతున్నారు.
* పొగాకు వాడకంతో తలెత్తుతున్న జబ్బులు ఆర్థిక వ్యవస్థకూ భారంగా పరిణమిస్తున్నాయి. 35-69 ఏళ్ల వారిలో కనబడుతున్న పొగాకు సంబంధ జబ్బులతో 1.05 లక్షల కోట్లు ఖర్చుపెట్టాల్సి వస్తున్నట్టు (జీడీపీలో 1.1%) అంచనా.
ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం | World_No_Tobacco_Day | Mohanpublications | Granthanidhi | Bhaktipustakalu World No Tobaccoday Tobbaccoday Cigarette smoking tobacco lungs cigarette smoking Publications in Rajahmundry, Books Publisher in Rajahmundry, Popular Publisher in Rajahmundry, BhaktiPustakalu, Makarandam, Bhakthi Pustakalu, JYOTHISA,VASTU,MANTRA, TANTRA,YANTRA,RASIPALITALU, BHAKTI,LEELA,BHAKTHI SONGS, BHAKTHI,LAGNA,PURANA,NOMULU, VRATHAMULU,POOJALU,  KALABHAIRAVAGURU, SAHASRANAMAMULU,KAVACHAMULU, ASHTORAPUJA,KALASAPUJALU, KUJA DOSHA,DASAMAHAVIDYA, SADHANALU,MOHAN PUBLICATIONS, RAJAHMUNDRY BOOK STORE, BOOKS,DEVOTIONAL BOOKS, KALABHAIRAVA GURU,KALABHAIRAVA, RAJAMAHENDRAVARAM,GODAVARI,GOWTHAMI, FORTGATE,KOTAGUMMAM,GODAVARI RAILWAY STATION, PRINT BOOKS,E BOOKS,PDF BOOKS, FREE PDF BOOKS,BHAKTHI MANDARAM,GRANTHANIDHI, GRANDANIDI,GRANDHANIDHI, BHAKTHI PUSTHAKALU, BHAKTI PUSTHAKALU, BHAKTHI



Nipha | నిపా | Mohanpublications | Granthanidhi | bhakthibooks

Nipha | నిపా | Mohanpublications | Granthanidhi | bhaktibooks
మనిషిపై గబ్బిలాల ప్రతీకారం

అడవుల నరికివేత పాపమే.. ‘నిపా’ శాపం
ఆకలి, ఒత్తిడితో గబ్బిలాల శరీరంలో వైరస్‌
‘నిపా’ వ్యాప్తికి కారణాలపై రాని సమాధానం
గబ్బిలాల రక్తం, సీరం నమూనాలకు మరిన్ని పరీక్షలు
‘నిపా’ వైరస్‌ హడలెత్తిస్తోంది. కేరళలోని కోజికోడ్‌, మలప్పురం జిల్లాలను కాటేసిన ఈ ఇన్‌ఫెక్షన్‌ దేశాన్ని వణికిస్తోంది. కేరళలో ఇంతవరకూ 14 మంది ఈ వైర్‌సతో చనిపోయారు. మరో 2 నిపా కేసులు నిర్ధారణ అయ్యాయి. 1998లో మలేషియాలోని కంపంగ్‌ సంగై నిపా అనే గ్రామంలో మొదటిసారి ఈ వైరస్‌ బయటపడటంతో..ఈ మహమ్మారికి ‘నిపా’ అన్న పేరు వాడుకలోకి వచ్చింది. ఈ వైరస్‌కు పందులు కారణమని మొదట్లో భావించారు. అయితే పండ్లు తినే గబ్బిలాల నుంచి పందులు, పిల్లులు..వాటి ద్వారా మనుషులకు నిపా వ్యాపించిందని నిర్ధారణ అయింది. అయితే తాజాగా కేరళలో ‘నిపా’ వ్యాప్తికి పండ్లు తినే గబ్బిలాలే కారణమనడానికి ఇంకా ఆధారాలు లభించకపోవడంతో మరింత గందరగోళం ఏర్పడింది.

గబ్బిలాల సాంపిల్స్‌కు మరిన్ని పరీక్షలు
కేరళలోని కోజికోడ్‌, మలప్పురం జిల్లాల్లో గబ్బిలాల రక్తం, సీరం నమూనాలకు నిర్వహించిన పరీక్షల్లో వైరస్‌ నెగెటివ్‌ వచ్చింది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్యశాఖకు పంపిన నివేదికలో వైద్య బృందాలు వెల్లడించాయి. ఏడు జాతుల గబ్బిలాలు రెండు జాతుల పందులు, గొర్రెలుసహా 21 సాంపిల్స్‌ను భోపాల్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హై సెక్యూరిటీ యానిమల్‌ డిసీజెస్‌, పూణెలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీలకు పంపారు. ప్రాథమిక నివేదికలో ఖచ్చితంగా తెలియకపోయినా..కేరళలో నిపా వైరస్‌ వ్యాప్తికి కారణాలను అన్వేషించడానికి మరిన్ని పరీక్షలు నిర్వహిస్తామంటున్నాయి వైద్య బృందాలు!

వినాశనానికి దారితీస్తున్న అభివృద్ధి
‘నిపా’ వంటి వైరస్ ల వ్యాప్తికి జంతువులను నిందించి ఉపయోగం లేదు. అభివృద్ధి పేరుతో మనిషి సాగించిన విధ్వంసమే ‘నిపా’ వైరస్‌ రూపంలో ఎదురు తిరుగుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. నిపా వైరస్‌ ప్రపంచంలో మొట్టమొదట మలేషియాలో బయటపడింది. ఈ వైరస్‌ ఇన్‌ఫెక్షన్లకు కారణమైన గబ్బిలాలు మలేషియా అడవుల్లో శతాబ్దాలపాటు ఉండేవి. సాధారణంగా గబ్బిలాలు జనావాసాల్లోకి రావు. వాటికి ఆహారం లభించినంత కాలం అడవుల్లోనే ఉంటాయి. ఎప్పుడైతే అడవుల నరికివేత మొదలైందో పరిస్థితి మారిపోయింది. మనిషి తన వినాశనాన్ని తానే కొని తెచ్చుకున్నట్లయింది. ‘గబ్బిలాలకు సంబంధించిన వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌ వ్యాపించడానికి మనిషి సృష్టించిన ప్రకృతి విధ్వంసమే కారణం. అడవుల్లో సహజసిద్ధమైన తమ ఆవాసాలను గబ్బిలాలు ఎప్పుడైతే కోల్పోయాయో.. అవి ఒత్తిడికి లోనయ్యాయి. ఆకలితో అలమటించాయి. వాటి వ్యాధి నిరోఽధక వ్యవస్థ బలహీనమయింది. వాటి శరీరంలో వైర్‌సలు అభివృద్ధి చెంది మూత్రం, లాలాజలం రూపంలో వ్యాపించాయి’ అని డబ్ల్యుహెచ్‌ఓ నివేదిక వెల్లడించింది. గత 200 సంవత్సరాల్లో అభివృద్ధి పేరుతో కొనసాగిన అడవుల నరికవేత ‘నిపా’ వంటి ప్రాణాంతక వైర్‌సలకు కారణమని గుర్తుచేసింది.


నిపా వైరస్‌ లక్షణాలు

అధిక జ్వరం, తలనొప్పి, మగతగా ఉండటం, స్థిరంగా ఉండలేకపోవడం, మానసికంగా గందరగోళం
10-12 రోజులకు ఈ లక్షణాలు కనిపిస్తాయి. తర్వాత రోగి స్పృహ కల్పోయి కోమాలోకి వెళ్లిపోయే ప్రమాదం
చివరకు మెదడు వాపుతో రోగి చనిపోతాడు
నిపా వైర్‌సకు ఎలాంటి వ్యాక్సిన్లు లేవు. ఈ వైరస్‌ సోకినవారిలో 74.5శాతం మంది ప్రాణాలు కోల్పోయారు.
2001లో పశ్చిమ బెంగాల్లోని సిలిగురిలో తొలిసారి ‘నిపా’ వైరస్‌ బీభత్సం సృష్టించింది. 65మందికి ఈ ఇన్‌ఫెక్షన్‌ సోకితే 45మంది ప్రాణాలు కోల్పోయారు.
2011లో బంగ్లాదేశ్‌లో 56మందికి నిపా వైరస్‌ సోకితే.. 50 మంది చనిపోయారు.
గబ్బిలాలు వైరస్‌లను ఎలా తట్టుకోగలవు?
గబ్బిలాల సీరమ్‌ నుంచి ‘నిపా’ వైరస్‌ వ్యాపిస్తుంది. కానీ తన శరీరంలో ఎన్నో వ్యాధికారక వైర్‌స్ లు ఉండి కూడా గబ్బిలాలు ఎలా ఆరోగ్యంగా ఉంటాయి? అన్న అనుమానం రాకమానదు. పండ్లుతినే గబ్బిలాల్లోని ఒక జాతి అయిన ఫ్లైయింగ్‌ ఫాక్స్‌లో..50 రకాల వైర్‌సలు ఉంటాయి. పరిశోధకుల అభిప్రాయం ప్రకారం..ఎక్కువ సేపు ఎగరడం వల్ల గబ్బిలాల శరీరంలో ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఫలితంగా వాటిలో వ్యాధి నిరోధకత మెరుగుపడుతుంది. అలా ఒంట్లో వ్యాధికారక సూక్ష్మజీవులు ఉన్నా గబ్బిలాలు ఆరోగ్యంగా ఉండగలుగుతాయి.


బామ్మ కాదు..‘బ్యాట్‌ ఉమన్‌’
ప్రాణాంతకమైన ‘నిపా’ వైరస్‌ గబ్బిలాల ద్వారా వ్యాప్తి చెందుతుందన్న హెచ్చరికలతో దేశమంతా భయపడుతోంది. కానీ గుజరాత్‌లో ఓ బామ్మ మాత్రం గబ్బిలాలతోనే జీవిస్తోంది. అహ్మదాబాద్‌కు సమీపంలోని రాజ్‌పూర్‌ గ్రామానికి చెందిన శాంతాబెన్‌ (75) ఇంట్లో దాదాపు 400 గబ్బిలాలు ఉన్నాయి. రెండు గదుల తన చిన్న ఇంట్లో పదేళ్లుగా గబ్బిలాలతో కలిసి ఉంటోంది. స్థానికంగా ప్రజలందరూ ఆ బామ్మను ‘బ్యాట్‌ ఉమన్‌’ అని పిలుస్తారు. నిపా వైరస్‌ గురించి ఆమె దగ్గర ప్రస్తావించగా..‘దాని గురించి నేనూ విన్నాను. కానీ నాకేం భయం లేదు. పదేళ్లుగా గబ్బిలాలతోనే జీవిస్తున్నాను. అవే నా కుటుంబం’ అని శాంతాబెన్‌ చెబుతున్నారు.

పాము కాటు: ఏ పాములు ప్రమాదకరం? కాటేసినపుడు ఏం చేయాలి? | Snake bite: Which snakes are dangerous | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu

పాము కాటు:  ఏ పాములు ప్రమాదకరం?  కాటేసినపుడు ఏం చేయాలి?  |  Snake bite: Which snakes are dangerous | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu

పాము కాటు: 
ఏ పాములు ప్రమాదకరం? 
కాటేసినపుడు ఏం చేయాలి?

ఒక మహిళ పాము కాటుకు గురవడం.. ఆమెతో పాటు ఆమె పాలు తాగిన మూడేళ్ల కూతురు కూడా చనిపోయిన విషాద ఘటన దేశ ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ముజఫర్‌నగర్‌లోని మండ్లా గ్రామంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.


నిద్రపోతున్నప్పుడు తల్లిని పాము కాటు వేసింది. ఆ విషయం తెలియని తల్లి.. తన పాపకు చనుబాలు ఇచ్చింది. కొద్దిసేపటికే ఇద్దరూ నోటివెంట నురగలు కక్కారు. ఆస్పత్రికి తీసుకువెళ్లేలోపే తల్లీకూతుళ్లిద్దరూ చనిపోయారు.


పాము కాట్లు ‘‘అంతర్జాతీయ ఆరోగ్య ప్రాధాన్యం’’గా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ప్రకటించిన రోజే ఈ విషాద వార్త వెలుగుచూసింది.


ప్రపంచ వ్యాప్తంగా ఏటా 81,000 మంది నుంచి 1,38,000 మంది పాము కాట్లకు బలవుతున్నారు. ఈ మరణాల్లో దాదాపు సగం భారతదేశంలోనే సంభవిస్తున్నాయి.
సమస్య ఎంత పెద్దది?


డబ్ల్యూహెచ్ఓ అంచనా ప్రకారం.. ప్రతి ఏటా సుమారు 50 లక్షల మంది పాము కాట్లకు గురవుతున్నారు. అయితే వారిలో కేవలం సగం మందికే పాము విషం ఎక్కుతోంది.


పాము కాట్ల కారణంగా గుడ్డితనం మొదలుకుని అవయవాలు తొలగించటం వరకూ.. వేలాది మంది శాశ్వత వైకల్యానికి లోనవుతున్నారు.


ఉష్ణమండల వ్యాధుల్లో పలు వ్యాదుల్లాగానే ఈ కేసులు కూడా తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నాయని డబ్ల్యూహెచ్‌ఓ చెప్తుంది.


సహారా ఎడారికి దక్షిణాన ఉన్న ఆఫ్రికా దేశాలు, దక్షిణాసియా, ఆగ్నేయాసియాల్లో.. మనుషులు - పాములు తరచూ తారసపడే జనసమ్మర్థం అధికంగా గల ప్రాంతాల్లో ఈ పాము కాట్లు అధికంగా చోటు చేసుకుంటున్నాయి.


ప్రత్యేకించి పేద, గ్రామీణ జనాభాకు పాము కాట్ల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. పాము కాటు విరుగుడు (యాంటీడోట్) వారికి అందుబాటులో లేకపోవటం, ఆధునిక వైద్య సదుపాయాలు లేకపోవటం వల్ల సంప్రదాయ చికిత్సల మీద ఆధారపడుతుండటం దీనికి కారణం.


పాము విషాల వల్ల జరిగే నష్టాన్ని నివారించటానికి, నిలువరించటానికి యాంటీవీనమ్ వేగంగా ఎక్కించాలి. కానీ.. పాము కాట్లు అధికంగా ఉండే చాలా దేశాల్లో సొంతంగా యాంటీవీనమ్ ఉత్పత్తి చేసే సదుపాయాలే లేవు.


పాము కాట్ల నివారణ, చికిత్స, నిర్వహణల విషయంలో ఆయా దేశాలన్నీ ఒక ఉమ్మడి వ్యూహం అనుసరించేందుకు.. ప్రపంచ ఆరోగ్య సభ కొత్త తీర్మానం దోహదపడుతుంది.
విషపూరిత పాము కరిచినపుడు ఏం జరుగుతుంది?


విషపూరిత పాములను సాధారణంగా రెండు రకాలుగా వర్గీకరించారు.


ఒక రకం పాముల్లో కోరలు పటిష్టంగా ఉంటాయి. అవి నాడీ మండలం, శ్వాస వ్యవస్థలపై దుష్ప్రభావం చూపే న్యూరోటాక్సిక్ వీనమ్ (విషం) ఉపయోగిస్తాయి. ఇంకో జాతి పాముల్లో ముడుచుకునే కోరలు ఉంటాయి. ఈ పాములు తమ కోరలను తాము వేటాడేటపుడు, దాడి చేసేటపుడు ఉపయోగిస్తాయి. ఈ తరహా పాముల విషం.. మామూలుగా చర్మ కణజాలాన్ని ధ్వంసం చేసి, అంతర్గత రక్తస్రావం కలిగిస్తుంది.
అత్యంత ప్రమాదకర విషమున్న పాములు ఏవి?


అత్యంత ప్రమాదకర విషమున్న పాములు ఏమిటి? మనుషులకు అతి పెద్ద ముప్పుగా ఉన్న పాములు ఏమిటి అనే తేడాలు గుర్తించటం ముఖ్యం.


భూమి మీద సంచరించే పాములన్నిటిలోకీ.. ఆస్ట్రేలియాలో కనిపించే ఇన్‌లాండ్ తాయ్‌పాన్ పాము అత్యంత విషపూరితమైనది.


ఒక్క కాటుతో వంది మందిని చంపగలిగేంత విషపూరితమైనది ఈ పాము అని చెప్తారు. అయితే.. ఈ జాతి పాము కాట్ల వల్ల మనుషులు చనిపోయిన దాఖలాలు ఇంతవరకూ లేవు. చాలా బిడియమైన ఈ పాములు మారుమూల ప్రాంతాల్లో ఏకాంతంలో జీవిస్తుండటంతో పాటు.. ఆస్ట్రేలియాలో యాంటీవీనమ్ విస్తృతంగా అందుబాటులో ఉండటం దీనికి కారణం.


సముద్ర పాములు కూడా చాలా విషపూరితమైనవి. కానీ అవి మనుషులకు తారసపడటం చాలా అరుదు కాబట్టి.. మనుషులు ఈ పాము కాట్లకు గురవటం కూడా అత్యంత అరుదుగా ఉంటుంది.


తక్కువ విషపూరితమైనవే అయినా.. బ్లాక్ మాంబా, కోస్టల్ తైపాన్‌ (ఆస్ట్రేలియా) పాముల నుంచి మనుషులకు ఎక్కువ ప్రమాదం ఉంది.


ఈ రెండు పాములదీ ఒకే జాతి కుటుంబం. వీటి విషం.. ఇతర పాముల విషాలకన్నా వేగంగా ప్రభావం చూపుతుంది. అంటే.. ఈ పాములు కాటువేసినపుడు తక్షణమే చికిత్స అందించకపోతే అర గంటలోనే మరణం సంభవిస్తుంది.


బ్లాక్ మాంబా అని పిలిచే పాము నిజానికి గోధుమ రంగు లేదా ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటుంది. అయితే ఆ పాము నోరు లోపలి రంగు నల్లగా ఉండటం వల్ల దానికి ఆ పేరు వచ్చింది.


సహారాకు దక్షిణంగా ఉండే ఆఫ్రికా దేశాల్లో చాలా చోట్ల ఇది కనిపిస్తుంది. మూడు మీటర్ల పొడవు వరకూ పెరుగుతుంది.


ఇక ఇన్‌లాండ్ తాయ్‌పాన్‌తో పోలిస్తే కోస్టల్ తాయ్‌పాన్ చాలా దుందుడుకు స్వభావం గలది.
ఏ పాముల వల్ల మరణాలు ఎక్కువ?


పాము కాటు కేసులు, మరణాల సంఖ్యల విషయంలో.. చిన్నదిగా కనిపించే పింజేరి (సా-స్కేల్డ్ వైపర్) అత్యంత ప్రాణాంతకమైన వాటిలో ఒకటి. పశ్చిమ ఆఫ్రికా మొదలుకుని భారత ఉపఖండం వరకూ చాలా ప్రాంతాల్లో ఇది కనిపిస్తుంది. చీకట్లో ఎక్కువగా కాటు వేస్తుంటుంది.


ప్రపంచంలో దాదాపు సగం పాము కాట్లు సంభవిస్తున్నట్లుగా భావించే భారతదేశంలో.. మనుషుల మరణాలకు అత్యధికంగా కారణమయ్యే నాలుగు రకాల పాముల్లో పింజేరి ఒకటి.


ప్రమాదకరమైన నాలుగు పాముల్లో మిగతా మూడు ఇవీ...


కట్ల పాము (ఇండియన్ క్రెయిట్): పగటిపూట మొహమాటంగా కనిపించే ఈ పాము.. రాత్రిపూట చాలా దూకుడుగా దాడి చేస్తుంది. ఇది 1.75 మీటర్ల (5 అడుగుల 9 అంగుళాల) వరకూ పొడవు ఉంటుంది.


రక్త పింజేరి (రసెల్స్ వైపర్): ఇది మామూలుగా దూకుడు స్వభావమున్న పాము. ఇండియా, దక్షిణాసియా అంతటా విస్తరించి ఉంది. ఎలుకలను ఆహారంగా తీసుకుంటుంది. అందువల్ల గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మానవ ఆవాసాల వద్ద తరచుగా కనిపిస్తుంటుంది.


నాగు పాము / తాచు పాము (ఇండియన్ కోబ్రా): నాగు పాము భారత ఉపఖండమంతటా కనిపిస్తుంది. ఆధునిక వైద్య సదుపాయాలు లేని ప్రాంతాల్లో విస్తరించి ఉంది. చీకట్లో ఇది ఎక్కువగా దాడి చేస్తుంది. అంతర్గత రక్తస్రావం కలిగిస్తుంది.


పాము కాటు వేసినపుడు ఏం చేయాలి?


ఎవరినైనా పాము కాటు వేసినపుడు ఈ చర్యలు చేపట్టాలని బ్రిటన్ నేషనల్ హెల్త్ సర్వీస్ సూచిస్తోంది: 
శాంతంగా ఉండి తక్షణమే వైద్య చికిత్స పొందాలి. 
శరీరంలో కాటు ప్రభావిత ప్రాంతాన్ని సాధ్యమైనంత మేరకు కదిలించకుండా ఉంచాలి. నగలు, వాచీల వంటి వాటిని తొలగించాలి. 
దుస్తులను వదులు చేయాలి.. కానీ విప్పేయవద్దు. 


ఈ కింది పనులేవీ చేయకూడదు: 
పాము కాటు ప్రాంతం నుంచి విషయాన్ని నోటితో లాగివేయటం 
పాము కాటు ప్రాంతాన్ని కోసివేసి విషాన్ని తొలగించటం లేదా రక్తస్రావం జరిగేలా చేయటం 
పాము కాటు గాయానికి ఐస్, వేడి లేదా రసాయనాల వంటి పూతలు పూయటం 
పాము కాటు వ్యక్తిని వదిలి వెళ్లటం 
కాటు వేసిన ప్రాంతం నుంచి రక్తప్రసరణను నిలిపివేస్తూ కట్టుకట్టటం వంటివి చేయరాదు. అలా చేయటం వల్ల విషం వ్యాపించకుండా ఆగదు. పైగా వాపు మరింత విషమించటానికి, ఆ అవయవం తొలగించాల్సిన పరిస్థితికి దారితీయవచ్చు. 


విషపూరితమైన పామును పట్టుకోవటానికి ప్రయత్నించకుండా ఉండటం కూడా ముఖ్యం. చనిపోయిన పాములతో కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. పామును చంపేసిన కొంతసేపటి వరకూ దాని నాడీ మండలం క్రియాశీలంగానే ఉండొచ్చు.. దానివల్ల విషపూరిత కాటు వేయవచ్చు.


Courtesy:BBC

నిపా వైరస్‌ | Nipah virus | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu


నిపా వైరస్‌ | Nipah virus | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu

నిపా కలవరం.. 
గబ్బిలాలు, పందులే మూలం 
కేరళలో మొదలైన ‘నిపా’ కలవరం చూసి దేశమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. నిపా వైరస్‌ కొత్తదేం కాదు. కానీ ఒకరి నుంచి మరొకరికి ఇది చాలా వేగంగా విస్తరిస్తుంది, పైగా సోకితే మరణావకాశాలు చాలా ఎక్కువ. కేరళలో కూడా ఉన్నట్టుండి ముగ్గురు దీని కారణంగా మృత్యువాత పడటం, వీరిలో ఒక నర్సు కూడా ఉండటంతో ప్రజల్లో భయాందోళనలు రేగుతున్నాయి. నిపా వైరస్‌ కొంత అరుదైనదేగానీ మరీ అంత కొత్తదేం కాదు. ఇది జంతువుల నుంచి మనుషులకు సంక్రమిస్తుంది. జంతువులకూ, మనుషులకు కూడా జబ్బు తెచ్చిపెడుతుంది. మనుషుల్లోనైతే ప్రాణాంతకమనే చెప్పుకోవాలి. అందుకే కేరళ ప్రభుత్వం కూడా వేగంగా స్పందించి, దీనిపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు కృషి చేస్తోంది.
ఏమిటీ నిపా వైరస్‌? 

మరీ ఎక్కువగా కాకపోయినా.. గత రెండు దశాబ్దాలుగా అప్పుడప్పుడు విజృంభించి, కలవరం సృష్టిస్తున్న వైరస్‌ ఇది. దీన్ని తొలిగా 1998లో మలేషియా, సింగపూర్‌లలో గుర్తించారు. అప్పట్లో ఇది పందుల ద్వారానే వ్యాపిస్తోందని భావించారుగానీ తర్వాత దీనిపై అవగాహన మరింతగా పెరిగింది. 2004లో పశ్చిమ బెంగాల్లో ఈత, ఖర్జూర కల్లు తాగిన వారిలో ఈ వ్యాధి కనిపించింది. లోతుగా పరిశోధిస్తే  ఆ కల్లు గబ్బిలాలకు సంబంధించిన స్రావాలతో కలుషితమైందనీ, దాని ద్వారానే వ్యాధి మనుషులకు సంక్రమించిందని గుర్తించారు.   ఈ వైరస్‌ మనుషుల్లో చేరితే ఒకరి నుంచి మరొకరికి కూడా వేగంగా వ్యాపిస్తోంది.

పెద్ద సమస్య మొదడువాపు! 

నిపా వైరస్‌ బారినపడితే- జ్వరం, వాంతులు వికారం, తలనొప్పి వంటి సాధారణ వైరల్‌ జ్వర లక్షణాలే మొదలవుతాయిగానీ.. దీనితో వచ్చే పెద్ద సమస్య మెదడువాపు. జ్వరంతో పాటే వీళ్లలో తలనొప్పి, గందరగోళం, విపరీతమైన మగత, సోయి సరిగా లేకపోవటం వంటి లక్షణాలు బయల్దేరతాయి. కొందరిలో శ్వాస కష్టమవుతుంది. ఈ దశలో సరైన వైద్యం అందకపోతే కోమాలోకి వెళ్లిపోయి, వేగంగా మృత్యువాతపడతారు. ఈ జ్వరం బారినపడిన వారిలో సగటున నూటికి 70 మంది మృత్యువాతపడుతున్నారంటే దీని తీవ్రత అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ముందే అనుమానించటం ముఖ్యం. కేవలం లక్షణాల ఆధారంగానే దీన్ని నిర్ధారించటం కూడా కష్టం. అనుమానం బలంగా ఉంటే రక్తం సేకరించి పుణెలోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ వంటి సంస్థలకు పంపిస్తే వాళ్లు పరీక్షించి నిపా వైరస్‌ ఉందేమో నిర్ధారిస్తారు.

పండ్లు కడుక్కోవాలి! 

గబ్బిలాల కొరికిన పండ్లు తినటం ఈ వైరస్‌ వ్యాప్తికి దోహదం చేసే అవకాశం లేకపోలేదు. కాబట్టి ఎలాంటి గాట్లు లేని పండ్లు ఎంచుకోవటం, వాటిని పూర్తి శుభ్రంగా కడుక్కుని తినటం ముఖ్యం. రెండోది- పందుల వంటి జంతువులకు దూరంగా ఉండటం మంచిది. ప్రస్తుతానికి ఈ సమస్య కేరళలోని కొన్ని ప్రాంతాల్లో కనబడుతోంది.  మన ప్రాంతంలో దీని ఆనవాళ్లేం లేవు. కాబట్టి ఆందోళన అవసరం లేదుగానీ అప్రమత్తంగా ఉండటం మాత్రం చాలా అవసరం.

కల్లుపై ఆంక్షలు 

ఇప్పటికే ఈ వైరస్‌ ప్రభావం ఎక్కువగా ఉన్న కొజికోడ్‌ తదితర ప్రాంతాల్లో ఈత, తాటి కల్లు తియ్యద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఎందుకంటే ఈ గబ్బిలాలు  తాడి, ఈత చెట్ల మీద కూడా ఎక్కువగానే తిరుగుతుంటాయి, ఆ కల్లులో వీటి లాలాజలం గానీ, మూత్రంగానీ కలిస్తే దాని ద్వారా వైరస్‌ వ్యాపించే అవకాశం ఉంటుంది. అందుకే వైద్యులు ఆయా ప్రాంతాల్లో కల్లు తీయొద్దని ఆదేశించారు.

నిపా వైరస్‌ | Nipah virus | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu

mohan publications price list