జడివానలో జాగ్రత్త!
ఎండాకాలం ఎటో ఎగిరిపోయింది. నాలుగు చినుకులు పడితే చాలు. .కొంత మందిలో దడ మొదలవుతుంది. ఎందుకంటే, ఏ క్షణాన దగ్గు, జలుబు, జ్వరం, తలనొప్పి, ఒంటినొప్పులు చుట్టుముడతాయోనన్న దిగులు.. భయం వాళ్లను వెంటాడుతూ ఉంటాయి. అలా అని ఈ వాతావరణ మార్పులు అందరినీ అలా ఏమీ వేధించవు. చాలామంది, మిగతా రుతువుల్లోలాగే హాయిగానే ఉండిపోతారు. కొందరు మాత్రం ముక్కుతూ మూల్గుతూ ఉంటారు. ఎందుకిలా అంటే ఈ అనారోగ్యాలన్నింటికీ అసలు మూలం వ్యాధినిరోధక శక్తి లోపాలే అంటున్నారు వైద్యనిపుణులు ఆ వివరాల్లోకి వెళితే..వర్షాకాలంలో జలుబు, దగ్గు, జ్వరం, ఒంటినొప్పులు, గొంతునొప్పి ఇలా ఒకదానికి ఒకటి తోడై ఒక్కోసారి కదలకుండా చేస్తాయి. నిలువెల్లా నీరసం, నిస్పత్తువ ఆవరించడంతో వృత్తిపరమైన ఉద్యోగ వ్యాపారాలకు ఎగనామం పెట్టడం తప్ప మార్గం కనిపించదు. అప్పటిదాకా అణగిమణగి పడి ఉన్న వైరస్, బ్యాక్టీరియాలు ఈ రుతువులో జూలు దులపడమే ఇందుకు కారణం. చాలా మందిలో పరిసరాల పరిశుభ్రత పట్ల ఉండే అత్యంత సహజమైన నిర్లక్ష్యం దీనికి తోడవుతుంది. వర్షం కురిసి కాసేట్లో వెలిసిపోవచ్చు. కానీ, పరిసరాలన్నీ నీరు నిలిచిపోతుంది. అలా నిలిచిపోయిన నీళ్లల్లో ఎక్కడెక్కడినుంచో కొట్టుకు వచ్చిన మలినాలన్నీ ఉంటాయి. మలేరియా, కలరా కార కమయ్యే దోమలె న్నో పుట్టడానికి ఒక అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఇదే సమయంలో అనేకమైన వైరస్, బ్యాక్టీరియాలు పుంజుకుంటాయి. ఏమైనా కలరా, మలేరియా, డెంగ్యూ, స్వైన్‌ఫ్లూ వంటి సమస్యలు ఈ రుతువులో ఊపందుకుంటాయి. మొత్తంగా చూస్తే, బ్యాక్టీరియా, వైరస్ ఇన్‌ఫెక్షన్ల బారిన పడే వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది.
కలుషితమైన నీటిలో...
గమనించకపోవడం వల్ల గానీ, అవసరమైన జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల గానీ, ఈ రోజుల్లో కలుషితమైన ఆహార పానీయాలు అతిగా మన శరీరంలోకి చేరిపోతాయి. ఇవి పలురకాల జబ్బులకు కారణమవుతూ ఉంటాయి, ప్రత్యేకించి కలుషిత ఆహార పానీయాలతో జీర్ణవ్యవస్థ పనితనం తగ్గిపోతుంది. తిన్నదేదీ ఒంటికి పట్టదు. ఫలితంగా శరీరం రోజురోజూకూ బలహీనపడుతుంది. దీనివ ల్ల శరీరం చాలా సులువుగా బ్యాక్టీరియా, వైరస్ ఇన్‌ఫెక్షన్ల బారిన పడుతుంది. ఇదే సమయంలో పలురకాల శ్వాసకోశ సంబంధ వ్యాధులు మొదలవుతాయి అంతకు ముందే న్యుమోనియా, ఆస్తమా, సీ.ఓ.పీ.డి (క్రానిక్ ఆబ్‌స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్) వంటి సమస్యలు ఉన్నవారు, పొగతాగే అలవాటు ఉన్నవారు, లేదా ఎక్కువగా పొగలో పనిచేసేవారు, పరిశ్రమల్లో పనిచేసేవారిలో శ్వాసకోశాల పనితనం తగ్గిపోతుంది. ఈ కాలంలో కొత్తగా న్యుమోనియా బారిన పడే వారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. శరీరంలో వైరస్ లోడ్ బాగా పెరిగిపోవడం వల్ల జలుబు, దగ్గు, గొంతు సమస్యలతో పాటు, సైనసైటిస్ బాధలు కూడా ఎక్కువవుతాయి.
ఇమ్యూనిటీని పెంచుకోవడం ఎలా?
బాహ్య కారణాలతో పాటు శరీర కణజాలంలో వ్యర్థ, విషపదార్థాలు పేరుకుపోవడం వ్యాధినిరోధక శక్తిని తగ్గించే ఒక పెద్ద కారణం. మనం తీసుకునే ఆహార పానీయాల్లోని వ్యర్థపదార్థాలు పూర్తి స్థాయిలో విసర్జింపబడనప్పుడు కూడా కణజాలంలో వ్యర్థపదార్థాలు పేరుకుపోతాయి. దీనివల్ల శరీర ధాతువ్యవస్థ సక్రమంగా పనిచేయదు. ఎంత మంచి ఆహారం తీసుకున్నా ఒంటికి పట్టదు. దీనివ ల్ల కణజాలం క్రమక్రమంగా క్షీణించడం మొదలవుతుంది. దీనికి తోడు అప్పటిదాకా ఉన్న ఎండల వల్ల శరీరంలోని బలం, జీవరసాలన్నీ ఆవిరైపోయి ఉంటాయి. ఫలితంగా శరీరం బలహీనపడి ఉంటుంది. దీనికి తోడు హఠాత్తుగా మారిన వాతావరణానికి తట్టుకోలేక శరీరం తట్టుకోలేకపోతుంది. ఆ తట్టుకునేందుకు జరిగే అంతర్ఘత ఘర్షణ వల్ల కూడా వ్యాధినిరోధక శక్తి తగ్గిపోతుంది. దీనికి తోడు జీర్ణశక్తి తగ్గిపోతుంది. వ్యర్థపదార్థాలను శరీరంలోంచి తొలగించడానికి పంచకర్మ చికిత్సలు అవసరమవుతాయి. జీర్ణశక్తిని పెంచుకోవడం కోసమైతే...
శొంఠి, మిర్యాలు, పిప్పళ్ల మిశ్రమమైన త్రికటు చూర్ణం అరచెంచా మోతాదులో రోజుకు ఒక పూట వేసుకోవాలి. ఇది మామూలుగానే అనిపించినా జీర్ణశక్తిని పెంచడంలో బాగా ఉపకరిస్తుంది. దీనికి తోడు అగ్నితుండి వటి మాత్రలను రోజుకొకటి చొప్పున 15 రోజల పాటు భోజనం తర్వాత వేసుకోవాలి. అలాగే చిత్రకాదివటి మాత్రలను ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి చొప్పున వేసుకోవాలి. లేదా నాలుగు వంతుల కరక్కాయ పొడిలో రెండు వంతుల సైంధవ లవణం కలిపి అరచెంచా ఉదయం, అరచెంచా సాయంత్రం భోజనం తర్వాత తీసుకోవాలి. లేదా పంచకోలాసవం ద్రావణాన్ని ఉదయం రెండు చెంచాలు, సాయంత్రం రెండు చెంచాలు తీసుకోవాలి. ఇది కూడా జీర్ణశక్తిని బాగా పెంచుతుంది.
వ్యాధి నిరోధక శక్తి పెరగడానికి, ఉసిరికాయ రసం గానీ, పొడిగానీ, బాగా తోడ్పడతాయి. రోజూ ఉదయాన్నే గోరు వెచ్చని నీళ్లల్లో ఒక చెంచా తేనె కలిపి తాగితే ఎంతో మేలు కలుగుతుంది. వీటికి తోడు
గుడూచి (తిప్పతీగె) మాత్రలు రోజు ఒకటి చొప్పున వేసుకోవాలి.
రోజూ నాలుగు తులసి ఆకులు నమిలి తినేస్తే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.
- డాక్టర్ డి. ప్రశాంత్ కుమార్, శక్తి ఆయుర్వేదిక్ క్లినిక్, హైదరాబాద్
వివిధ వ్యాధులు
కలుషిత వాతావరణం ఉన్న చోట, సహజంగానే ఎలుకల సంచారం కూడా ఎక్కువగా ఉంటుంది. ఎలుకల మూత్రం కలిసిన నీరు శరీరంలోకి వెళ్లడం వల్ల లెప్టోస్పైరోసిస్ అనే వ్యాధి రావచ్చు. ఈ మూత్రంలోని వైరస్ వల్ల జ్వరం రావడంతో పాటు, శరీరమంతా వణికిపోవడం, తలనొప్పి, కండరాల నొప్పి వంటివి వస్తాయి. ఈ వైరస్ కాలేయాన్ని దెబ్బ తీయడంతో పాటు జాండిస్ రావడానికి కూడా కారణం కావచ్చు. దీనికి తోడు కిడ్నీలు దెబ్బతినవచ్చు. మరికొందరిలో ప్లేట్‌లెట్‌లు పడిపోయే ప్రమాదం కూడా ఏర్పడుతుంది.
డెంగ్యూ ఫీవర్‌లో తీవ్రమైన జ్వరం, రక్తపోటు పడిపోవడం, ప్లేట్‌లెట్లు తగ్గిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఆ లక్షణాలు కనిపించిన మరుక్షణమే ఆ వ్యక్తిని ఆసుపత్రికి తరలించాలి.
కలరా సోకితే బియ్యం కడిగిన నీళ్లలా రోజుకు 20 దాకా విరేచనాలు అవుతూనే ఉంటాయి. కడుపు నొప్పి కూడా ఉంటుంది. దీనికి తోడు సోడియం, లవ ణాలు త గ్గిపోతాయి. రక్తపోటు పడిపోతుంది.

ఆహారం
పరిశుభ్రమైన ఆహారంతో పాటు, కాచి చల్లార్చి వడబోసిన నీళ్లను మాత్రమే తాగాలి. కూరగాయలకు అధిక ప్రాధాన్యమివ్వాలి. చ పాతీ, బ్రెడ ్లకన్నా, సులభంగా జీర్ణమయ్యే వేడి అన్నమే ఎంతో మేలు. తరచూ ఫ్రూట్స్ తీసుకోవాలి. డయేరియా ఉంటే పెరుగు అన్నం, మజ్జిగ, ఓ.ఆర్.ఎస్ ఇలా ఏవైనా ద్రవపదార్థాలే ఇవ్వాలి.
హెపటైటిస్ ఏ, ఇ. లివర్ దుష్ప్రబావానికి గురైనప్పుడు తలెత్తే సమస్యలే హెపటైటిస్ ఏ.ఇ. వీటికి కూడా కలుషితమైన ఆహార పానీయాలే కారణం. ఈ వైరస్ సోకిన వారిలో డయేరియాయే ప్రధాన లక్షణంగా కనిపిస్తుంది. ఈ సమస్యను నిర్లక్ష్యం చేసినా కాలేయం దెబ్బ తినే ప్రమాదం ఉంది. హెపటైటిస్ బి, సి ల మూలాలు వేరు. ఇవి రక్తం ఎక్కించడం ద్వారా గానీ, ఇంజెక్లన్ల ద్వారా గానీ, లైంగిక సంబంధాల వల్ల వచ్చే అవకాశం ఉంది. అయితే హెపటైటిస్- బి కి మాత్రమే టీకాలు ఉన్నాయి. హెపటైటిస్ ఏ, ఇ లకు తప్ప, హెపటైటిస్ బి, సి లకు వాతావరణాలకూ సంబంధం లేదు. చాలా సార్లు ఇవన్నీ వర్షాకాలంలో వచ్చే మామూలు సమస్యలే అనుకుంటూ కొందరు నిర్లక్ష్యంగా ఉండిపోతారు. ఆ ధోరణి విడనాడితేనే ఈ సమస్యల్ని అధిగమించడం సాధ్యమవుతుంది!

నిర్లక్ష్యం చేస్తే...
కలరా, మలేరియా, డెంగ్యూ, స్వైన్‌ఫ్లూ, వంటి ఏ వ్యాధి సోకినా వెంటనే వైద్య చికిత్సలు ప్రారంభించాలి. నిర్లక్ష్యంగా ఉండిపోతే లివర్ గానీ, కి డ్నీలు గానీ దె బ్బతినవచ్చు. జీవక్రియలన్నీ స్తబ్ధంగా ఉండిపోయి ఒక్కోసారి ప్రాణాపాయం కూడా ఏర్పడవచ్చు. గుండె మీద ఒత్తిడి పెరిగి గుండెపోటుకు కారణమై అది కూడా ప్రాణాపాయానికి దారి తీయవచ్చు.
నివారణ మార్గాలు
కొన్ని జాగ్రత్తల ద్వారా మలేరియా, డెంగ్యూ ఈ రెండు వ్యాధుల నుంచి సులువుగానే తమను తాము కాపాడుకోవచ్చు. ఆ విధానం మరేదో కాదు పరిసరాలను పరిశభ్రంగా ఉంచుకోవడమే! కలుషిత వాతావరణం, కలుషిత ఆహార పానీయాల ప్రభావం ఉండనే ఉంటుంది. అయితే బాలబాలికలు, వృద్ధులు, దీర్ఘకాలంగా మధుమేహం ఉన్నవాళ్లు, అవయవ మార్పిడి చేయించుకున్నవాళ్లు, ఈ పరిస్థితుల్లో మరింత తొందరగా వ్యాధిగ్రస్థమయ్యే అవకాశం ఉంది. వీరితో పాటు ఆస్తమా గానీ, సీ.ఓ.పీ.డీ గానీ, ఇతర ఊపిరి తిత్తుల వ్యాధులు ఉన్నవాళ్లు, కిడ్నీ సమస్యలు ఉన్నవాళ్లు కూడా తొందరగా వైరస్, బ్యాక్టీరియాల బారిన పడే ప్రమాదం ఉంది.

ఇలాంటి వాళ్లు, నిమోకోకల్, ఇన్‌ఫ్లూయెంజా, స్వైన్‌ఫ్లూ టీకాలు వేయించుకోవడం ఎంతో శ్రేయస్కరం, ఈ టీకాలు తీసుకున్నా ఆహార పానీయాల, పరిసరాల పరిశుభ్రత విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిందే! ఒకవేళ ఏదైనా వ్యాధి సోకిన అనుమానం కలిగితే ఏ మాత్రం జాప్యం చేయకుండా, రక్తపరీక్షలు చేయించుకుని నిజంగానే వ్యాధి ఉన్నట్లు తేలితే వెంటనే చికిత్సలు తీసుకోవాలి. వర్షాకాలంలో వచ్చే ఈ వ్యాధుల్లో ఏది సోకినా ఎంత తొందరగా వైద్య చికిత్సలు చేపడితే అంత మేలు కలుగుతుంది.
- డాక్టర్ ఏ. వి. రావు
ఫిజిషియన్ (ఇంటర్నల్ మెడిసిన్)
నోవా క్లినిక్, దిల్‌షుక్‌నగర్, హైదరాబాద్
- డాక్టర్ ఏ. వి. రావు
ఫిజిషియన్ (ఇంటర్నల్ మెడిసిన్)
నోవా క్లినిక్, దిల్‌షుక్‌నగర్, హైదరాబాద్
Hey there,
ReplyDeleteNice blog
check out our blogs
YouTube promotion Service