మెరిసే ఆభరణాలు
Colorful Jewellery
++++++++ మెరిసే ఆభరణాలు +++++++
మహిళలు బంగారు నగలు ధరించడం వల్ల కేవలం అందమే కాదు ఆరోగ్యపరంగా ఎంతో పరమార్థమున్నదని ఆరోగ్యనిపుణులు అంటున్నారు. అదేమిటో తెలుసుకుందాం.
వడ్డాణము : గర్భకోశము కదలి లోపలున్న శిశువు వికారంగా పుట్టకుండా చేస్తుంది. బంగారాన్ని ఏ రూపంగా ధరించినా ఎంతో కొంత శక్తి శరీరానికి సంక్రమిస్తుంది.
ముక్కెర : దీన్ని ధరించటం వల్ల మాట్లాడేటప్పుడు పై పెదవికి తగిలి వీలైనంత తక్కువ మాట్లాడమని చెబుతుంది. ముక్కెర ధరించటం వల్ల ముక్కుకొనపై ఏదోవిధంగా దృష్టి ఉంటుంది. అలా దృష్టి ఉండటం ధాన్యంలో ఒక భాగం. చెడు శ్వాస కలిగిన గాలిని బంగారు ముక్కెర పవిత్రం చేస్తుంది.
కాలికి మెట్టెలు : గర్భకోశంలో నున్న నరాలకూ కాలివేళ్లలో ఉన్న నరాలకు సంబంధం ఉంది. దానితో పాటు స్త్రీ కామాన్ని అదుపులో ఉంచుకోవడానికి కాలివేలికి రాపిడి ఉండాలి. నేలను తాకరాదు. కామాన్ని పెంచే నరాలు కుడికాలి వేళ్లలో ఉన్నాయి.
చంద్ర వంక : శిరోమధ్య ప్రదేశంలో ధరిస్తారు. ఆ ప్రాంతం నుంచే మన జీవనాధారమైన ప్రాణవాయువు బ్రహ్మరంధ్రం నుంచి హృదయంలోకి ప్రవేశిస్తాడు. అందుకే ఆ భాగాన్ని కప్పి ఉంచుతారు.
కంఠానికి వేసుకునే హారాలు : హృదయంలో పరమాత్ముడున్నాడు. ఆ విషయాన్ని గుర్తించామని చెబుతూ ధరించటం. తెలిసీ తెలియక చేసిన పాపాలను కూడా బంగారం పోగొడుతుంది. బంగారం ధరించటం ద్వారా చెడు కలలు రాకపోవటమే కాదు. గుండెల మీద బంగారం గుండెకి సంబంధించిన వ్యాధులను కూడా అరికడుతుంది. అలంకారానికి పెట్టుకునే వస్తువులే అవసరానికి ఆదుకుంటాయి.
మోహన్ పబ్లికేషన్స్ లో లభ్యమగు గ్రంథముల క్యాటలాగ్ (Price List)
ఈ క్రింది లింక్ క్లిక్ చేసి PDF ఫైల్ పొందవచ్చును
---LIKE US TO FOLLOW:
---
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565