MohanPublications Print Books Online store clik Here Devullu.com

తులసి మాల విశిష్టత, Tulasi Mala Vishista

తులసి మాల విశిష్టత
Tulasi Mala Vishista

******** తులసి మాల విశిష్టత ********
తులసి రెండు రకాల వర్ణాలు కలగి ఉంటుంది. తెల్లగా ఉండే తులసిని ‘రామ తులసి’ అని అంటారు. నలుపు వర్ణం కలిగిన తులసిని ‘కృష్ణ తులసి’ అని అంటారు. జాతక చక్రంలో శుక్రగ్రహ దోషాల ద్వారా వచ్చే వివాహా, వైవాహిక సమస్యలను రామ తులసి ధరించటం వలన దోషాలు తొలగించుకో వచ్చును.
శనిగ్రహ దోషాలైన ఆయుర్దాయ సమస్యలు, అనారోగ్యాలు, ఎల్నాటి శని బాధలు కృష్ణతులసి ధరించటం వలన తొలగించుకోవచ్చును. తులసి మాలలో అత్యంత శ్రేష్టమైనవి వ్రిందావన్ (బృందావన్) తులసి. ఈ తులసి శ్రీ కృష్ణునిజన్మస్థానమైన మధుర పట్టణంలోని నిదివన్ మరియు సేవాకుంజ్ అను రెండు వనములందు లభించును. బృందావనంలో ఆవిర్భవించిన కారణమున బృందావని అని కూడా సౌబాగ్యవతి యగు తులసిని కీర్తించెదరు.
తులసి సాక్షాత్ మహాలక్ష్మీయే. సూర్యోదయ కాలమందు తులసి మాలను ధరించిన పూజించిన విష్ణువును దర్శించినంత పుణ్య ఫలములు లభించును. మృత్యువాసన్నమైనప్పుడు తులసిమాలను ధరించిన సర్వ పాపములు నశించి వైకుంఠం నందు కల విష్ణు సన్నిధానమును పొందుదురు.
“తులసీ స్మరణేరైవ సర్వపాపం వినశ్యతి
తులసీ స్పర్శనేరైవ సశ్యంతి వ్యాదయో నృణామ్”
తులసీ స్మరణ మాత్రము చేతనే సర్వపాపములు నశించును. తులసిమాలని స్పర్శించినంత మాత్రము చేతనే సర్వవ్యాధులు నశించును.
తులసిమాల శ్రీమన్నారయణునకు సమర్పించుకుని, పూజదికాలు చేయించుకుని లేదా ఇంట్లోనే చేసుకుని ఆ మాలను “ప్రసీద దేవదేవేశి ప్రసీద హరివల్లభే / క్షీరోదమాధనోద్భూతే తులసి త్వాం నమామ్యహమ్” అను మంత్రో చ్ఛారణతో ధరించేవారు పరమభాగవోత్తములు అవుతారట. ఈ మాల ధరించిన వారికి దుశ్శకునములు, దుస్వప్నాల దుష్ఫలితాలు దరికి చేరవు. ఇంకా ఈ జన్మలో చేసిన పాపాలే గాక గత జన్మలో చేసిన పాపాలు కూడా పూర్తిగా నశిస్తాయి. శ్రీమహావిష్ణువు, మహాలక్ష్మీ అను గ్రహంతో విష్ణుసాయుజ్యం కలుగుతుంది.


మోహన్ పబ్లికేషన్స్ లో లభ్యమగు గ్రంథముల క్యాటలాగ్ (Price List)
క్రింది లింక్ క్లిక్ చేసి  PDF ఫైల్  పొందవచ్చును

---LIKE US TO FOLLOW: ---






No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list