జయజయ శంకర.. హరహర శంకర..
JayaJaya Shankara.. HaraHara Shankara
జయజయ శంకర.. హరహర శంకర..
ధర్మదండం ధరించి వాదన పటిమతో గెలిచి భరతఖండం నలుమూలల తిరిగి సనాతన ధర్మాన్ని పునరుద్ధరించారు శ్రీ శంకర భగవత్పాదులు. 32 ఏళ్లే జీవించినా ఆసేతు హిమాచలాన్ని కాలినడకపైన చుట్టివచ్చిన మహానుభావుడు ఆదిశంకరుడు. కేరళలోని కాలడిలో జన్మించిన శంకరులు ఐదేళ్ల వయస్సులోనే దారిద్య్రంతో కటకటలాడుతున్న వృద్ధ బ్రాహ్మణికి కనకధారస్తోత్రం ద్వారా మహాలక్ష్మీ అనుగ్రహాన్ని ఇప్పించిన వితరణశీలి . తల్లి నీటి కోసం కష్టపడుతుంటే పూర్ణనదిని తన శక్తితో దారి మళ్లించి తల్లి కష్టం తీర్చారు. ఎనిమిదేళ్ల వయస్సులో సన్యాసం స్వీకరించి భారతదేశ యాత్రకు బయలుదేరారు. ఆ సమయంలో దాదాపు 72 శాఖలుగా హైందవ మతం వుండేది. శాక్తేయులు, కాపాలికులు, సూర్యున్ని ఆరాధించేవారు, గణపతిని ఆరాధించేవారు... ఇలా తమ శాఖే గొప్పదని వాదించేవారు. అయితే శంకరులు వారితో సముచితమైన వాదన చేసి మెప్పించి అందరిని సనాతన ధర్మం వైపు మళ్లించారు. కశ్మీరంలో సర్వజ్ఞ పీఠాన్ని అధిరోహించారు. ఎన్నెన్నో దేవాలయాలకు కట్టుబాట్లు ఏర్పరచారు. బ్రహ్మసూత్రం, వేదాలు, ఉపనిషత్తులకు భాష్యం రాశారు. భజగోవిందంలో మానవజీవిత పరమార్థాన్ని వివరించారు. హైందవమత పరిరక్షణకు బదరినాథ్, పూరి, ద్వారకా, శృంగేరి పీఠాలను నెలకొల్పారు. ఇప్పటికీ ఈ పీఠాలు సనాతనధర్మ పరిరక్షణకు కృషిచేస్తున్నాయి
మోహన్ పబ్లికేషన్స్ లో లభ్యమగు గ్రంథముల క్యాటలాగ్ (Price List)
ఈ క్రింది లింక్ క్లిక్ చేసి PDF ఫైల్ పొందవచ్చును
---LIKE US TO FOLLOW:
---
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565