నిద్ర ‘పోతోందా’
Sleep
నిద్ర ‘పోతోందా’?
చక్కటి నిద్ర జ్ఞాపకశక్తిని పెంపొదిస్తుంది. ఏదైనా కొత్త విషయాన్ని నేర్చుకున్న తర్వాత నిద్రపోతే అది బాగా గుర్తుంటుందని ప్రయోగాల్లో రుజువైంది. రాత్రంతా నిద్ర మేల్కొని చదివే విద్యార్ధులు పరీక్షల్లో బాగా రాయలేకపోతుండటానికి ఇదీ కారణమే.
*శరీరం తిరిగి పునరుత్తేజం పొంది, మన అవయవాలు, మెదడు చక్కగా పని చేయటానికి తగినంత నిద్ర కీలకం. నిద్రలోనూ మెదడు పనిచేస్తుంటుంది గానీ దాని చురుకుదనం, పరిసరాలపై చైతన్యం తగ్గుతుంది. అంతర్గతంగా పనులన్నీ జరుగుతూనే ఉన్నా.. అవయవాలు, మెదడు బాహ్య విషయాలను మరచిపోయి విశ్రాంతి తీసుకోవటం నిద్ర ముఖ్య ఉద్దేశం. చిన్నపిల్లల్లో, యుక్తవయస్కుల్లో నిద్రా సమయంలోనే ఎదుగుదలకు అవసరమైన ‘గ్రోత్ హార్మోన్’ స్రవిస్తుంది. కాబట్టి ఎదుగుదలకూ నిద్ర కీలకమే.
కడుపు నిండా తిండి.. కంటి నిండా నిద్ర..! అంతకు మించిన సుఖమయ జీవితమేం ఉంటుంది? కానీ ఈ ఆధునిక కాలంలో నీళ్ల కొరతలా.. తిండి కొరతలా.. ‘నిద్ర కొరత’ కూడా పెరిగి పోతోంది. ఒకప్పుడు మహాత్ముల్లాగా రోజులో ఎంత తక్కువ సమయం నిద్రపోయి.. ఎంత ఎక్కువ సమయం శ్రమిస్తే అంత గొప్ప అనుకునే వాళ్లం. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. నిద్ర పట్టకపోవటం.. తగినంత సమయం నిద్ర లేక పోవటం.. నిద్ర కోసం మాత్రలను ఆశ్రయిస్తుండటం.. ఇలా నేడు ‘నిద్ర’ అతి పెద్ద ఆరోగ్య సమస్యగా తయారవుతోంది. దీన్నుంచి బయటపడేదెలా?
మనిషికి నిద్ర అన్నది అతి ముఖ్యమైన జీవ ప్రక్రియ! దాదాపు మన జీవితంలో మూడింట ఒక వంతు నిద్రలోనే గడిచిపోతుంది. అయితే నిద్రపోయే సమయం అందరిలో ఒకే విధంగా ఉండదు. పసిపిల్లలు రోజుకు 16 గంటలైనా పడుకుంటారు. యుక్తవయస్కులకు సగటున 8-9 గంటల నిద్ర అవసరం. పెద్దలు ఎవరైనా రోజుకి కనీసం 5-9 గంటల సేపు నిద్రపోవటం అవసరం. అయితే కొందరు 5 గంటల సేపు నిద్రపోయినా మర్నాడు చురుకుగా ఉండొచ్చు. మరికొందరు 9 గంటల సేపు నిద్రపోతే గానీ హాయిగా ఉండలేరు. ఇలా నిద్ర అవసరం వ్యక్తికీ, వ్యక్తికీ మారచ్చు. అలాగే ప్రతిరోజూ ఒకే విధంగా నిద్ర పట్టాలనీ లేదు. కొన్ని రోజులు బాగా నిద్ర పట్టొచ్చు. మరికొన్ని రోజులు పరిసరాలు, పరిస్థితులు, ఆలోచనల కారణంగా సరిగా పట్టకపోవచ్చు. అయితే ఒకట్రెండు రోజులు నిద్ర తగ్గినంత మాత్రాన పెద్ద సమస్యగా భావించాల్సిన పనిలేదు. కనీసం వారంలో 4-5 రోజులు సరిగా నిద్ర పట్టకుండా గడుపుతుంటేనే సమస్యగా భావించాలి. 60-65 ఏళ్లు దాటిన వృద్ధుల్లో నిద్ర సమస్యలు ఎక్కువగా కనబడుతుంటాయి. దీనికి కొంత వయసుతో పాటు వచ్చే మార్పులు కారణమైతే కొంత ఇతరత్రా వేధించే ఆరోగ్య సమస్యలు కూడా కారణమవుతుంటాయి. మన దేశంలో చాలామంది నిద్ర సరిగా పట్టకపోవటం, పొద్దున లేచాక కూడా నిద్ర పోవాలని అనిపిస్తుండటం వంటి సమస్యలతో బాధపడుతున్నా.. వీరిలో కేవలం 6-7 శాతం మందికి మాత్రమే చికిత్స అవసరమవుతుంది. చాలామందిలో జీవన సరళిలో మార్పులతోనే సమస్య సర్దుకుంటుంది. ఉదాహరణకు రోజుకి 6 గంటలు నిద్రపోయే వ్యక్తి హఠాత్తుగా 3-4 గంటలు మాత్రమే నిద్రపోతుండటం, దీంతో మర్నాడు తన పనులు తాను తేలికగా చేసుకోలేకపోవటం, చిరాకు, బద్ధకం, ఏకాగ్రత కుదరకపోవటం, ఉదయం నిద్ర ముంచుకొస్తుండటం.. ఇలాంటి లక్షణాలు కనిపిస్తుంటే తేడా వచ్చిందని, ఇలాంటి లక్షణాలు వారంలో కనీసం 4-5 రోజులు కొనసాగితే అది సమస్యగా పరిణమించిందని గ్రహించాలి.
కలత నిద్ర
నిద్ర గురించి మనలో ఎన్నో అపోహలున్నాయి. వీటిని తొలగించుకోవాలంటే కొంత శాస్త్రీయ దృక్పథం పెంచుకోవటం అవసరం. నిద్రలో ప్రధానంగా రెమ్ (ర్యాపిడ్ ఐ మూవ్‌మెంట్-ఆర్‌ఈఎం), నాన్ రెమ్ (నాన్ ర్యాపిడ్ ఐ మూవ్‌మెంట్) నిద్ర అని రెండు దశలుంటాయి. మనం పడుకున్నప్పుడు ముందు నాన్ రెమ్ నిద్రలోకి వెళతాం. మళ్లీ ఇందులో నాలుగు దశలుంటాయి. 1, 2 నిదానంగా నిద్ర పడుతున్న దశలు. 3, 4 దశల్లో గాఢనిద్రలోకి వెళతాం. ఇక ‘రెమ్’ నిద్ర అంత గాఢంగా ఉండదు. ఈ సమయంలో మన కనుగుడ్లు వేగంగా కదులుతుంటాయి. సాధారణంగా- నాన్ రెమ్‌లోని నాలుగు దశలు + రెమ్ దశ కలిసి.. ఒక చక్రంలా ఒకదాని తర్వాత ఒకటి వచ్చిపోతుంటాయి. సాధారణంగా 90-110 నిమిషాల సమయంలో ఒక వలయం పూర్తి అవుతుంటుంది. రాత్రి పడుకోగానే ముందు ‘నాన్ రెమ్’ నిద్రలోకి వెళ్లే మనం.. తెల్లవారుజాముకు దగ్గరవుతున్న కొద్దీ ‘రెమ్’ నిద్రలోకి మళ్లుతుంటాం.
నిద్ర కొరవడితే..?
ముందుగా ఏకాగ్రత దెబ్బతింటుంది. జ్ఞాపక శక్తి ప్రభావితమవుతుంది. శారీరకంగా కూడా పని సామర్థ్యం తగ్గిపోతుంది. పగటి నిద్ర, ఆందోళన, చికాకు.. భావోద్వేగాలు మారిపోతాయి. మూడ్ మారిపోతుంటుంది. డ్రైవింగ్ వంటి ఏకాగ్రతతో, వివిధ అవయవాల సమన్వయంతో చురుకుగా చెయ్యాల్సిన పనులన్నీ ప్రభావితమవుతాయని అధ్యయనాల్లో స్పష్టంగా వెల్లడైంది. క్రమేపీ నిద్ర సరిపోక శారీరకంగానూ, మానసికంగా ఒత్తిడి పెరుగుతుంది. ఫలితంగా గుండె జబ్బులు, అధిక రక్తపోటు, మధుమేహం, వూబకాయం వంటి రుగ్మతలూ వెన్నాడతాయి. అసలే నిద్రలేకపోతే మానసిక సమస్యలూ తలెత్తొచ్చు కానీ ఇది అరుదు.
నిద్ర ఎందుకు పట్టదు?
నిద్రకు తగినంత సమయం లేకపోవటం కొందరి సమస్య అయితే నిద్ర పట్టకపోవటం మరికొందరి సమస్య. మెదడులో నిద్రకు సంబంధించిన ప్రాంతంలోనే ప్రవర్తన, భావోద్వేగ కేంద్రాలు కూడా ఉంటాయి. కాబట్టి భావోద్వేగపరంగా గానీ, ప్రవర్తనపరంగా గానీ ఏదైనా తేడా వస్తే ముందు కనిపించే లక్షణం నిద్ర పట్టకపోవటం, నిద్ర తగ్గిపోవటం. ఒత్తిడి, భావోద్వేగాల పరంగా విషాదానికి లోనవటం, కొన్ని మానసిక వ్యాధుల్లో ప్రవర్తనలో మార్పుల వల్ల నిద్ర తగ్గుతుంది. నిద్ర తగ్గిపోవటానికి భావోద్వేగాలు, ఆలోచనలు, ప్రవర్తనకు చాలా సంబంధం ఉంది. శరీరంలో ఎక్కడైనా నొప్పి ఉన్నా నిద్రపై ప్రభావం చూపుతుంది. పంటినొప్పి, కీళ్లనొప్పి వంటివి నిద్రకు దూరం చేస్తాయి. అధిక బరువు, స్థూలకాయుల్లో నిద్రా సమయంలో అంగిలి కిందికి జారి శ్వాసనాళానికి అడ్డు పడటం వల్ల గురక, కొద్దిసేపు శ్వాస నిలిచిపోయి తరచూ నిద్రాభంగం కావటం.. ఇవన్నీ నిద్ర సమస్యలకు దారి తీస్తాయి.
రాత్రే నిద్ర పోవాలా?
నిద్రకూ, చీకటి-వెలుతురుకూ చాలా సన్నిహిత సంబంధం ఉంది. చీకటి పడుతున్న కొద్దీ మన శరీరంలో నిద్రను ప్రేరేపించే ‘మెలటోనిన్’ హార్మోన్ స్రావం ఎక్కువవుతుంది. దీన్ని ‘పీనైల్ గ్రంథి’ ఉత్పత్తి చేస్తుంది. ఇక నిద్ర నుంచి మేల్కొనే సమయానికి ఈ మెలటోనిన్ ఉత్పత్తితగ్గిపోతుంటుంది. కాబట్టి రాత్రి నిద్ర, పగలు మెలకువ అన్న ‘సిర్కాడియన్ రిథమ్’కు మనందరం అలవాటుపడిపోతాం. కానీ నేటి ఉరుకుల పరుగుల ఆధునిక జీవితంలో ఈ క్రమం దెబ్బతింటోంది. నిద్రపోవాల్సిన సమయంలో మెలకువగా ఉండటం, మెలకువగా ఉండాల్సిన సమయంలో నిద్ర పోతుండటం జరుగుతోంది. నిద్రను తట్టుకొని రాత్రిపూట పని చేయటం సాధ్యమే గానీ రోజంతా నిద్రపోవటం అనేది కష్టం. ఎందుకంటే శరీరంలో హార్మోన్ ఉత్పత్తి ఉండదు కాబట్టి. దీంతో నిద్రపోయే సమయం తగ్గటంతో పాటు సరిగా నిద్రపట్టక పోవటమూ జరుగుతుంది. దీన్నే ‘సిర్కాడియన్ రిథమ్ డిస్టర్బెన్స్’ నిద్ర అంటారు. దీనికి రాత్రి ఉద్యోగాలు, మారుతున్న జీవనశైలే ప్రధాన కారణం. ఈ నిద్రలేమి వల్ల ఒత్తిడి పెరగటం, అది తిరిగి నిద్రపైనే ప్రభావం చూపుతుండటంతో- ఇదో విషవలయంగా తయారవుతుంది. కాబట్టి రాత్రి నిద్రకు ప్రాధాన్యం ఇవ్వటం మంచిది. తప్పనిసరి పరిస్థితుల్లో రాత్రి పని చేయాల్సి వస్తుంటే.. దాన్ని పగటిపూట తగినంత విశ్రాంతి తీసుకోవటం ద్వారా భర్తీ చేసుకోవటం అత్యవసరం. అయితే ఇలాంటి అస్తవ్యస్త పని వేళల వల్ల నిద్రలేమి అన్నది కేవలం ఓ 6 శాతం మందిలోనే. మిగతావారిలో నిద్రలేమికి చాలావరకూ మానసిక సమస్యలు, పరిసరాల పరిస్థితులు, జీవనశైలి మార్పులే కారణమవుతున్నాయి.
ఎక్కడుంది పరిష్కారం?
నిద్ర సరిపోవటం లేదంటే దానికి కారణాన్ని అన్వేషించటం చాలా అవసరం. ఒకవేళ మానసిక ఒత్తిడి కారణమవుతుంటే జీవనశైలిలో మార్పులతోనే దాన్ని సరిచేసుకోవటం ఉత్తమం. చక్కటి నిద్రా పద్ధతులు (స్లీప్ హైజీన్) పాటించి, అవి ఫలితం ఇవ్వకపోతేనే చికిత్స, మాత్రల వైపు వెళ్లాల్సి ఉంటుంది. ఒక రోజు నిద్ర పట్టకపోతే మర్నాడు నిద్రపట్టే అవకాశాలు ఎక్కువ. కానీ చాలామంది మర్నాడు కూడా పట్టదేమోనని భయపడుతూ ముందు నుంచే ఆందోళన పెంచుకుంటుంటారు. ఇది సరికాదు.
నిద్రలేమి నిజమేనా?
నిద్ర లేచిన తర్వాత ప్రశాంతంగా లేకపోయినా కూడా చాలామంది దాన్ని నిద్రలేమిగా, నిద్ర సమస్యగా భావిస్తుంటారు. వారానికోసారి సరిగా నిద్రపట్టకపోయినా కొందరు దాన్ని నిద్ర సమస్యగా చూస్తుంటారు. ఇలా నిద్ర సరిపోవటం లేదని ఒత్తిడి పెంచుకుంటూ సమస్యను పెద్దది చేసుకునే కంటే వైద్యులను సంప్రదించి అది సమస్యా? కాదా? అన్నది నిర్ధారణ చేయించుకోవటం మంచిది.
కలల బెడద
* కొందరు పడుకుంటే చాలు కలలు వస్తున్నాయి, వాటివల్ల నిద్ర చెడి, నిద్రలేమి బాధిస్తోందంటుంటారు. కానీ కలలు రావటమన్నది సర్వసాధారణ విషయం. సాధారణంగా తెల్లవారుజాముకు ‘రెమ్’ నిద్రలోకి వెళతాం. ఈ దశలో రోజంతా చేసిన పనులు కలల రూపంలో గుర్తుకొస్తుంటాయి. అయినా దీన్ని నిద్రలేమిగా అనుకోవాల్సిన పని లేదు, ఇదేమీ సమస్య కాదు. సృజనాత్మక ఎక్కువ ఉన్న వారికి కలలు కూడా ఎక్కువ వస్తుంటాయి. భయం గొల్పే కలలు వచ్చినప్పుడు మాత్రం గుండె, వూపిరి తదితరాల వేగం పెరిగి.. తరచూ నిద్రాభంగం కావచ్చు. వీరికి ధైర్యాన్నిచ్చే కౌన్సెలింగ్ వంటివి అవసరమవుతాయి.
* చాలామంది తెల్లవారుజామున వచ్చిన కలలు నిజమవుతాయని భావిస్తుంటారు. ఇది నిజం కాదుగానీ.. ఇందుకు కారణం తెల్లవారు జామున ‘రెమ్’ నిద్ర ఎక్కువ, ఈ నిద్రలో కలలు రావటం ఎక్కువ, ఆ వచ్చినవి గుర్తుంటమూ ఎక్కువ. అవి యాదృచ్ఛికంగా ఎప్పుడైనా నిజమైతే ఆ కలలే నిజమయ్యాయని భావిస్తుంటారు. అంతేగానీ తెల్లవారుజామున వచ్చే కలలకు పెద్ద ప్రత్యేకత ఏమీ లేదు. నిద్రలో కలలు ఎప్పుడైనా రావచ్చుగానీ ‘నాన్ రెమ్’ దశలో వచ్చేవి పెద్దగా గుర్తుండవు.
*కలలు ఎక్కువగా వేధిస్తున్నప్పుడు పగటిపూట సంతోషకరమైన అంశాలపై దృష్టి పెట్టటం, ఆలోచనా విధానాన్ని మార్చుకుంటే సరిపోతుంది. ముఖ్యంగా- కలలకు ప్రాముఖ్యం ఇవ్వటాన్ని తగ్గించుకోవాలి.
నిద్ర కలవరం పెరుగుతోంది! మన పట్టణ ప్రజానీకంలో దాదాపు 93% మంది నిద్ర సమస్యలతో బాధపడుతున్నారని ఇటీవలే ‘ఫిలిప్స్-ఏసీ నీల్సన్’ సర్వే వెల్లడించింది. నిద్రలేమి కారణంగా ఇతరత్రా తీవ్ర సమస్యలు తలెత్తే వరకూ కూడా దీన్ని పట్టించుకోవటం లేదు. మనిషికి సుఖాన్ని, ఆరోగ్యాన్ని ఇవ్వాల్సిన నిద్ర.. నానాటికీ ఇలా ఓ ‘కఠిన పరీక్ష’లా, పెను సమస్యగా తయారవుతున్న నేపథ్యంలో.. ‘సుఖీభవ’ అందిస్తున్న పరిష్కార కథనం ఇది!
‘నిద్రలేమి’ నిర్ధారణ ఎలా?
నిద్రలేమిని గుర్తించటానికి ఒక డైరీని రాసుకోవటం మంచిది. ఎన్ని గంటలకు పడుకుంటున్నారు? ఎప్పుడు లేస్తున్నారు? లేచాక చికాకుగా, నిద్ర సరిపోనట్టుగా ఉంటోందా? తదితర వివరాలను నమోదు చేసుకోవాలి. వారంలో 4-5 రోజులు ఇలాంటి లక్షణాలు కనిపించటం, అవి నెలలో మూడు వారాల పాటు కొనసాగితేనే దాన్ని వైద్యపరంగా ‘నిద్రలేమి’గా నిర్ధారిస్తారు.
నిద్ర పద్ధతులు (స్లీప్ హైజీన్)
* పగటిపూట కనీసం ఓ గంట పాటు వ్యాయామం, శారీరక శ్రమ చెయ్యటం మంచిది.
* వీలైనంత వరకు సాయంత్రం 5 దాటిన తర్వాత టీ, కాఫీలు తాగరాదు.కాఫీ, టీ, కోక్‌లు ఉత్తేజం కలిగిస్తాయి. కాబట్టి వీటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
* నిత్యం నిద్ర విషయంలో కచ్చితమైన సమయం పాటించాలి. ఆ నిద్రా సమయానికి కనీసం గంట ముందు వరకు ఎలాంటి ఉద్రేకాలకు గురికాకుండా చూసుకోవాలి. అంటే ఉత్తేజాన్ని కలిగించే పదార్థాలు తీసుకోకపోవటం, ఉద్రేకం కలిగించే టీవీ కార్యక్రమాలు, సినిమాలు చూడకపోవటం మేలు.
* రోజూ ఒకేచోట నిద్రపోవటం మంచిది. ఒకరోజు ఒకచోట, మర్నాడు ఇంకోచోట పడుకోకుండా చూసుకోవాలి.
* గదిలో తక్కువ కాంతి ఉండేలా, అవసరమైతే లైటు లేకుండా చూసుకోవాలి.
* పడుకున్నాక అరగంట దాటినా నిద్ర పట్టకపోతే మంచంపైనే అటూఇటూ దొర్లటం కాకుండా, గదిలోంచి బయటకు వచ్చి పత్రికలో పుస్తకాలో చదవటం మొదలెట్టాలి. తిరిగి కళ్లు మూతలు పడుతున్న సమయంలో మంచం పైకి చేరుకోవాలి.
* నిద్రకు ఉపక్రమించటానికి ముందు గోరువెచ్చటి నీటితో స్నానం చేయటం, వేడి పాలు తాగటం మంచిది. నూనె, మసాలా పదార్థాలు తీసుకోరాదు.
* యోగా, బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్, ‘జాకబ్‌సన్స్ మజిల్ రిలాక్సేషన్’ వంటి పద్ధతులు కూడా నిద్ర పట్టటానికి ఉపయోగపడతాయి.
- ఈ జాగ్రత్తలు పాటించినా నిద్ర పట్టకపోతే మాత్రల గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది.
మాత్రలు మంచివేనా?
నిద్రలేమి అనేది కొందరిలో రెండు మూడు వారాల తర్వాత దానంతట అదే సద్దుకుంటుంది. కాబట్టి వెంటనే మందులు వాడకపోవటం మంచిది. మనసుని ఇతర కార్యక్రమాలపై మళ్లించటం, నడక, వ్యాయామం వంటి వాటి వల్ల తిరిగి మామూలు స్థితికి వచ్చే అవకాశం ఉంటుంది.
* మానసిక ఒత్తిడి, ఆందోళన, జీవితంలో సమస్యలు.. ఇలా ఏదో కారణంతో నిద్రలేమి వస్తుంటుంది. అన్నీ బాగుండి నిద్ర తగ్గటం (ప్రైమరీ ఇన్‌సోమ్నియా) అరుదు.
* నిద్రపట్టేందుకు ఇచ్చే మందుల్లో ‘బెంజోడైజపీన్’, ‘నాన్ బెంజోడైజపీన్’ అని రెండు రకాల మందులు బాగా ఉపయోగపడతాయి. కేవలం చివరి మార్గంగానే వీటిని వాడాలి. ముందు 2-6 వారాల పాటు ఇచ్చి పరిశీలిస్తారు. నిద్ర సరిగా పడుతున్నట్టయితే క్రమంగా మందుల మోతాదును తగ్గించుకుంటూ వస్తారు. సాధారణంగా నిద్ర మాత్రలకు శరీరం త్వరగా అలవాటు పడుతుంది. ఈ మందులను ఏ మోతాదులోనైనా మూణ్నెల్ల పాటు వరుసగా వాడుతుంటే శరీరం వాటిమీద ఆధారపడటానికి అలవాటుపడిపోతుంది. దీంతో మందుల మోతాదు పెంచాల్సి వస్తుంటుంది. వాటి మోతాదు పెంచితే ఇతరత్రాదుష్ప్రభావాలు చాలా ఎక్కువ. అందువల్ల 2, 3 వారాలు వాడాక వాటి మోతాదు తగ్గిస్తూ క్రమంగా ఆపేస్తారు.
* ఈ మందుల వల్ల ‘రెమ్’ నిద్ర అనేది ఉండదు. దానివల్ల మందులు ఆపేసినప్పుడు మెదడు కుదురుకోవటానికి రెండు మూడు రోజులు పడుతుంది. ఆ సమయంలో చికాకుగా అనిపించటంతో చాలామంది మందులు వేసుకుంటేనే హాయిగా ఉంటుందని అనుకుంటారు. ఈ ఒకటిరెండు రోజుల ఇబ్బందికి భయపడిపోయి మందులను మానకుండా వాడుతూనే ఉంటారు. ఇది సరికాదు.
* చాలామంది నిద్రమాత్రలకు అలవాటు పడ్డాక.. ‘ఇక వాటిని వేసుకోకపోతే నిద్ర పట్టదేమో’ అన్న భయంతో కొనసాగిస్తుంటారు. నిద్ర మాత్రలకు దీర్ఘకాలం అలవాటు పడితే కండరాల బలహీనం, పటుత్వం తగ్గటం వంటివి కనబడతాయి. ఏకాగ్రత, జ్ఞాపకశక్తి లోపిస్తాయి. విషయగ్రహణ శక్తి తగ్గుతుంది. మరీ ఎక్కువ మోతాదులో తీసుకుంటే కాలేయంపైనా ప్రభావం పడుతుంది. వీటిని దీర్ఘకాలం వాడకూడదు.
* ‘సిర్కాడియన్ రిథమ్’ దెబ్బతిని నిద్రపట్టనప్పుడు చికిత్సలో ‘మెలటోనిన్’ బాగా ఉపయోగపడుతుంది. ఇది నిద్ర రావటానికి దోహదం చేస్తుంది. దీంతో పెద్దగా దుష్ప్రభావాలు ఉండవు.

మోహన్ పబ్లికేషన్స్ లో లభ్యమగు గ్రంథముల క్యాటలాగ్ (Price List)
ఈ క్రింది లింక్ క్లిక్ చేసి PDF ఫైల్ పొందవచ్చును
---LIKE US TO FOLLOW:
---
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565