పదవీ విరమణ తర్వాత వచ్చే ఆదాయంతో మలి జీవితం.. వెలగాలి
+++++++పదవీ విరమణ తర్వాత
వచ్చే ఆదాయంతో
మలి జీవితం.. వెలగాలి!++++++++
.
పదవీ విరమణ..ఉరుకులు.. పరుగుల జీవితానికి కాస్త విశ్రాంతి దొరికే దశ. కొంతమందికి బాధ్యతల బరువులు దిగిపోతాయి. మరికొందరికి ఇంకా పూర్తికాకపోవచ్చు. విరమణ తర్వాత నెలనెలా వచ్చే క్రమం తప్పని ఆదాయం కాస్త తగ్గుతుంది. పదవీ విరమణ సమయంలో పీఎఫ్, గ్రాట్యుటీ, ఇతర ప్రయోజనాల రూపంలో వచ్చే మొత్తాలను సరైన విధంగా మదుపు చేసుకోవాలి. అప్పుడే.. నెలనెలా వచ్చే ఆదాయం మీ జీవన శైలిపై పెద్దగా ప్రభావం చూపదు. మరి అందుకోసం ఏం చేయాలి?ఇప్పటివరకూ ఖర్చులు ఎలా పెరిగాయో మీకు ప్రత్యక్షంగా అనుభవమే. ఆర్జిస్తున్నప్పుడు పెరిగే ఖర్చులను తట్టుకునేందుకు తగిన ఏర్పాటు చేసుకునే వీలుంది. కానీ, పదవీ విరమణ తర్వాత వచ్చే ఆదాయంతోనే ఖర్చులు పెట్టాలి. ఇప్పుడు అంత ఖర్చులేముంటాయి అని భావించొద్దు. ధరలు, ఆరోగ్య అవసరాలు పెరగడం, పిల్లలకు, ఇతర కుటుంబ సభ్యులకు బహుమతులు ఇవ్వడం, ప్రయాణాలు మీ వ్యయాన్ని పెంచుతాయి. అందుకే, మీ పెట్టుబడులు ద్రవ్యోల్బణాన్ని మించిన రాబడి ఇచ్చేలా చూసుకోవాలి.
ద్రవ్యోల్బణం 8శాతం ఉందని అనుకుంటే.. మీ పెట్టుబడులు అంతకు మించి రాబడి ఇచ్చేలా చూసుకోవాలి. ఆదాయపు పన్నునూ గమనించాలి. ఉదాహరణకు మీరు రూ.1,00,000 పెట్టుబడిని 10శాతం రాబడి వచ్చేలా మదుపు చేశారనుకుందాం. ద్రవ్యోల్బణం 8శాతం అనుకుందాం. మీకు గరిష్ఠ పన్ను శ్లాబు 30శాతం వర్తిస్తుందనుకుందాం. (సర్‌ఛార్జీలు కలపడం లేదు) అప్పుడు మీకు వచ్చే ఆదాయం రూ.10వేల నుంచి పన్ను పోను మిగిలేది రూ.7వేలు. ద్రవ్యోల్బణతో పోలిస్తే.. రూ.1,000 తరుగే. అంటే, వాస్తవ ఖర్చులను తట్టుకునేలా మీ ఆదాయం రావడం లేదనే అర్థం.
ఇవి చేయండి!
* ఉమ్మడి ఖాతా: పదవీ విరమణ తర్వాత పెట్టుబడులన్నీ మీ జీవిత భాగస్వామితో కలిసి ఉమ్మడిగా ఉండేలా చూసుకోవాలి. ఇద్దరిలో ఎవరైనా సరే.. ఆ ఖాతాలను నిర్వహించేలా ఏర్పాటు చేయాలి. దీనివల్ల ఇద్దరిలో ఎవరో ఒకరు సంతకం చేసే స్థితిలో లేకున్నా.. మరొకరు ఆ ఖాతాల్లోని పెట్టుబడులను వెనక్కి తీసుకునే వీలుంటుంది. ఇప్పటికే ఉన్న బ్యాంకు ఖాతాలు, పెట్టుబడులను కూడా ఉమ్మడిగా మార్చేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించండి.
* నిపుణుల సలహా: సంపాదించేప్పుడు ఆర్థిక విషయాల్లో కొన్ని చిన్న పొరపాట్లు చేసినా సర్దుకునే వీలుంటుంది. కానీ, కేవలం ఖర్చులే ఉండే ఈ దశలో ఆర్థికంగా ఏ చిన్న పొరపాటైనా ఖరీదైనదే. కాబట్టి, ఇలాంటివి జరక్కుండా చూసుకునేందుకు వ్యక్తిగత ఆర్థిక నిపుణుల సలహా తీసుకోండి. డబ్బు గురించి గతంలో పట్టించుకోకపోయినా..ఇప్పుడు కాస్త దృష్టి పెట్టండి. మీ ప్రాంతాల్లో ఆర్థిక నిపుణులు నిర్వహించే సదస్సులకు హాజరయ్యేందుకు ప్రయత్నించండి.
* అద్దె తక్కువగా ఉండేలా: సొంతిల్లు లేనప్పుడు అద్దె ఇంట్లో ఉండక తప్పదు. ఉద్యోగం చేస్తున్నప్పుడు కార్యాలయానికి దగ్గరగా ఉండేందుకు చూస్తాం. కాస్త అద్దె అధికంగా ఉన్నా పట్టించుకోం. ఇప్పుడు ఉద్యోగానికి వెళ్లరు కాబట్టి, కాస్త అద్దె తక్కువగా ఉన్న ప్రాంతాల్లోకి మారేందుకు ప్రయత్నించొచ్చు. మీకు రెండుమూడు సొంతిల్లు ఉంటే.. వీలైతే అద్దె తక్కువగా వచ్చే ఇంటికి మీరు మారే విషయాన్ని ఆలోచించొచ్చు.
మొదటి ఐదేళ్లు..
పదవీ విరమణ చేసిన తర్వాత ఆర్థికంగా మొదటి ఐదేళ్లు చాలా కీలకం. ముందునుంచే మలి జీవితం కోసం తగిన విధంగా పెట్టుబడులు పెట్టి, ఈ రోజు నాటికి పెద్ద మొత్తంలో నిధిని సమకూర్చుకున్నారనుకోండి.. విశ్రాంత జీవితాన్ని మీరు ఆశించిన రీతిలో జీవించేందుకు అవకాశం ఉంటుంది. ఒకవేళ మీకు ఏ పెట్టుబడులూ లేవనుకోండి. అప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాల్సి వస్తుంది. మొదటి ఐదేళ్లపాటు వీలైనంత వరకూ ఖర్చులను పూర్తిగా పరిమితం చేసుకోవాలి. ఇలా ఆదా చేసుకున్న మొత్తం మీకు మున్ముందు ఉపయోగపడుతుంది.
పెట్టుబడులు ఎలా?
వచ్చిన ప్రయోజనాలతో పెట్టుబడులు ప్రారంభించే ముందు గమనించాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. పదవీ విరమణ తర్వాత ఎలాంటి ఇబ్బందీ లేకుండా జీవనం సాగాలంటే ఎంత మొత్తం కావాలి? ప్రస్తుతం మన దగ్గర ఎంత ఉంది? ఎప్పుడెప్పుడు సొమ్ము కావాలి అనేది అంచనా వేసుకోవాలి. ఐదేళ్లలోపు అవసరాలకోసం స్థిరాదాయం ఇచ్చే పథకాలను ఎంచుకోవాలి. అంటే పెద్దల పొదుపు పథకం, నెలసరి ఆదాయ పథకాలు, డెట్ మ్యూచువల్ ఫండ్లను పరిశీలించాలి. ఆ తర్వాత 3 నుంచి 4ఏళ్ల కోసం.. బ్యాలెన్స్‌డ్ మ్యూచువల్ ఫండ్లలో రెండేళ్ల కాలం వరకూ క్రమానుగత బదిలీ విధానం (ఎస్‌టీపీ) ద్వారా పెట్టుబడులు పెట్టాలి. ఐదేళ్ల తర్వాత నుంచి వీటి నుంచి క్రమానుగతంగా వెనక్కి తీసుకోవచ్చు. పెట్టుబడులు ఎప్పుడూ కూడా ద్రవ్యోల్బణానికి కనీసం 2 శాతం అధికంగా ఉండేలా చూసుకోవాలి. మన పెట్టుబడులను ఎప్పటికప్పుడు అందుకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేసుకోవాలి.
కుటుంబ పత్రం తయారు..
మీ పెట్టుబడులు, ఆస్తులకు సంబంధించిన అన్ని వివరాలనూ ఒక చోట నమోదు చేయండి. బ్యాంకు ఖాతాలు, మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు, జీవిత బీమా పాలసీలు, షేర్లు, ఎక్కడెక్కడ ఏయే ఆస్తులున్నాయి.. మీరు అప్పులు తీసుకుంటే వాటి వివరాలు, లేదా ఎవరికైనా మీరు అప్పు ఇస్తే వారి వివరాలు.. ఇవన్నీ ఒక చోట రాయండి. మీ ఆర్థిక, బీమా, మ్యూచువల్ ఫండ్ సలహాదార్లు, స్టాక్ బ్రోకర్ వివరాలు, మీ లాయర్‌కు సంబంధించి సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లు, చిరునామాలు రాసి పెట్టండి.
* పెట్టుబడులు, ఆస్తులకు సంబంధించిన అన్ని పత్రాలూ ఒక క్రమ పద్ధతిలో ఉండేలా చూడండి. ఒకవేళ జరగరానిది జరిగినప్పుడు ఆ పెట్టుబడులను ఎలా వెనక్కి తీసుకోవాలి.. వేటికి ఎవరు నామినీగా ఉన్నారు.. అనేవీ పేర్కొనాలి. మీరు ఈ పత్రాలను ఎక్కడ పెట్టారనేది మీ జీవిత భాగస్వామికీ, మీ తర్వాత మీ కుటుంబ బాధ్యతలు నిర్వహించే సంతానానికీ తెలిసి ఉండేలా చూసుకోండి.
వీలునామా మర్చిపోకండి!
ఆస్తులను సంపాదించడమే కాదు.. వాటిని తర్వాత తరం వారికి జాగ్రత్తగా అప్పగించడమూ ఒక బాధ్యతే. మీ తదనంతరం కుటుంబ సభ్యులకు ఎవరికి ఏది ఇవ్వాలనుకుంటున్నారో స్పష్టంగా తెలియజేస్తూ వీలునామా రాసి పెట్టడం ఎప్పుడూ మంచిదే. పదవీ విరమణ ప్రణాళికలో ఇదీ కీలకమే. దీన్ని మీరు తెల్లకాగితం మీద కూడా రాయవచ్చు. లేదా న్యాయవాది సలహా తీసుకోవచ్చు. అవసరం అయితే మార్పులు చేర్పులు ఎప్పుడూ చేసుకోవచ్చు. ఇద్దరి సాక్షి సంతకాలు చేయిస్తే మంచిది. మీకు నమ్మకమైన వ్యక్తులకు అందించి, మీ తదనంతరం అమలు చేయాల్సిందిగా కోరవచ్చు. కుటుంబ సభ్యుల మధ్య అనవసరమైన వివాదాలు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకోవడం మర్చిపోవద్దు. మీరు స్వార్జితంగా సంపాదించిన దాన్ని ఎలాగైనా పంచి పెట్టే హక్కు మీకు ఉంది.
* నామినీ పేర్లు: మీ పెట్టుబడులు, బ్యాంకు ఖాతా, బీమా పాలసీలు, లాకర్ల ఖాతాలపైన నామినీ పేర్లు సరిగా ఉన్నాయా లేదా చూసుకోండి. పేర్లలో ఏమైనా పొరపాట్లు దొర్లితే వెంటనే వాటిని సరిచేయించండి.
వీటికి దూరం..
* అధిక వడ్డీల ఆశతో: పదవీ విరమణ చేసిన తర్వాత వచ్చే మొత్తాన్ని చాలామంది బంధువులకు, తెలిసిన వారికి అధిక వడ్డీల ఆశతో అప్పులు ఇస్తుంటారు. వచ్చిన వడ్డీ మొత్తంతో రోజులు వెళ్లదీయవచ్చనే ఆశ. ఇది అన్ని వేళలా మంచిది కాకపోవచ్చు. అప్పులు తీసుకున్న బంధువులు కొన్నాళ్లపాటు వడ్డీ ఇచ్చి, తర్వాత మిమ్మల్ని ఇబ్బందులు పెట్టొచ్చు.
* మోసపూరిత పథకాల్లో: కొందరు వ్యక్తులు అసాధారణ పథకాలతో మిమ్మల్ని సంప్రదిస్తుంటారు. రూ.1,000 పెట్టుబడి పెడితే.. ఆరు నెలల్లో రూ.10వేలు అవుతాయంటారు. గొలుసుకట్టు పథకాల్లో చేరండి.. చేర్పించండి. వేలకు వేలు సంపాదించండి.. అంటూ వస్తుంటారు. ఇవన్నీ సాధ్యం అయ్యే పనులు కావు. కాబట్టి, ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.
పెట్టుబడుల కోసం...
పెద్ద మొత్తంలో వచ్చిన డబ్బును నెలనెలా ఆదాయం వచ్చేలా మదుపు చేయడం ఎంతో అవసరం. ఇందులో కొన్నింటిని పరిశీలిస్తే..
* సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీం: వ్యక్తిగతంగానూ, జీవిత భాగస్వామితో కలిసి ఉమ్మడిగానూ ఈ పథకంలో చేరవచ్చు. కనీస పెట్టుబడి రూ.1,000. గరిష్ఠంగా రూ.15లక్షల వరకూ మదుపు చేయవచ్చు. వ్యవధి 5ఏళ్లు. అవసరమైతే మరో 3ఏళ్లు పొడిగించుకోవచ్చు. వార్షిక వడ్డీ 8.6శాతం. ప్రతి మూడు నెలలకోసారి వడ్డీ నేరుగా మీ బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. పదవీ విరమణ చేసిన వారెవరైనా ఈ పథకంలో చేరవచ్చు. 55ఏళ్ల తర్వాత వీఆర్‌ఎస్ తీసుకున్నా అర్హులే.
* పోస్టాఫీసు నెలసరి ఆదాయ పథకం: ఇందులో గరిష్ఠంగా రూ.4,50,000 వరకూ జమ చేయవచ్చు. ఉమ్మడిగా ఖతా తీసుకుంటే రూ.9లక్షలు. వార్షిక వడ్డీ 7.8శాతం లభిస్తుంది.
* డెట్ మ్యూచువల్ ఫండ్లు: అధిక మొత్తంలో నెలసరి పింఛను వచ్చేవారూ, 20-30 పన్ను శ్లాబులో ఉన్నవారూ డెట్ మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేయవచ్చు. కనీసం 2-3ఏళ్ల సమయం ఉన్నప్పుడే వీటిలో మదుపు చేయాలి.
* యాన్యుటీ పథకాలు: బీమా సంస్థలు అందించే ఇమ్మీడియట్ యాన్యుటీ పథకాల్లో పెట్టుబడి పెట్టుకోవచ్చు. వీటిలో పెట్టిన పెట్టుబడికి నిబంధనల మేరకు పింఛను లభిస్తుంది. మధ్యలో వెనక్కి తీసుకోవడం సాధ్యం కాదు. వచ్చిన పింఛనుకు ఆదాయపు పన్ను వర్తిస్తుంది. జీవితాంతం వరకూ పింఛను వచ్చి, తర్వాత పెట్టుబడిని వెనక్కి ఇచ్చే పథకాన్ని ఎంచుకోవడం ఉత్తమం.
ఆరోగ్యాన్ని కాపాడుకోండి!
వయసు పెరుగుతున్న కొద్దీ ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. వైద్య ఖర్చులు ఏటా 15 నుంచి 20శాతం వరకూ పెరుగుతున్నాయని ఒక అంచనా. కాబట్టి, ఆరోగ్యంగా ఉంటేనే ఆర్థికంగా కూడా బాగుంటామని మర్చిపోకూడదు.
* వైద్య చికిత్సా ఖర్చులకు సంబంధించి మీకు ప్రభుత్వ ఆరోగ్య భద్రత పాలసీలు ఉన్నవారైనా.. ఇవేవీ లేనివారైనా.. కచ్చితంగా రూ.2లక్షలకైనా వ్యక్తిగత ఆరోగ్య పాలసీ తీసుకోవడం తప్పనిసరి.
* ఆరోగ్య అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు ఇబ్బంది పడకుండా చూసుకునేందుకు కొంత మొత్తం ఆరోగ్య అత్యవసర నిధి కింద బ్యాంకులో అందుబాటులో ఉండేలా చూసుకోవాలి.

=========================
ఇలా వేద్దాం.. ప్రణాళిక!
పదవీ విరమణ తర్వాత ఆర్థిక జీవితం కచ్చితమైన ప్రణాళికతో సాగాలి. వచ్చిన ప్రయోజనాలను భవిష్యత్తు అవసరాల కోసం చాలా జాగ్రత్తగా మదుపు చేసుకోవాలి. నెలనెలా వచ్చే పింఛను లేదా ఇతర ఆదాయాలను ఖర్చులతో సమన్వయం చేసుకోవాలి. అప్పుడే మలి జీవితంలో ఎలాంటి ఇబ్బందులూ లేకుండా సాగుతుంది.

గణేశ్ రెవిన్యూ శాఖలో పనిచేస్తున్నారు. జులై 31న ఆయన పదవీ విరమణ చేయబోతున్నారు. ప్రస్తుతం ఆయన సొంత ఇంట్లో నివసిస్తున్నారు. ఆయన భార్య గృహిణి. ఇద్దరు పిల్లలూ ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. పదవీ విరమణ అనంతరం ఆర్థికంగా ఏ ఇబ్బందులూ ఎదురవ్వకుండా జీవితాన్ని ప్రశాంతంగా గడపాలన్నది ఆయన కోరిక. ప్రస్తుత జీవన శైలిలోనే జీవించాలనీ, భారత దేశం మొత్తం పర్యటించాలనీ ఆయన ప్రధాన లక్ష్యాలు.
గణేశ్ ఆర్థిక పరిస్థితిని గమనిస్తే...
* పదవీ విరమణ ప్రయోజనాల కింద దాదాపు రూ.30లక్షలు అందుకోనున్నారు. * ఆ తర్వాత నెలకు దాదాపు రూ.22వేల వరకూ పింఛను వచ్చే వీలుంది. * దంపతులిద్దరికీ రూ.2లక్షల వరకూ ఆరోగ్య బీమా సౌకర్యం లభిస్తుంది.
ప్రస్తుతం వారికి ఉన్న ఇతర ఆస్తులేమిటంటే..
నగరంలో రూ.25 లక్షల విలువైన ప్లాటు ఉంది. దానిని తన తదనంతరం పిల్లలకు ఇవ్వాలని అనుకుంటున్నారు.
పొదుపు ఖాతాలో రూ.25,000.
జాతీయ పొదుపు పత్రాలు రూ.5లక్షలు.
ఎండోమెంట్ పాలసీ రూ.10లక్షలు.
బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్లు రూ.5లక్షలు.
బంగారం రూ.4.5లక్షలు.
లక్ష్యాలేమిటి?
* ప్రస్తుత జీవన ప్రమాణాలను అందుకునే విధంగా నెలవారీ ఆదాయాన్ని ఆర్జించడం.
* కారు కొనడం
* భారత దేశంలోని ప్రముఖ ప్రదేశాలను సందర్శించడం.
* మనవడు/మనవరాళ్ల భవిష్యత్తు కోసం కొంత పెట్టుబడి.
లెక్కలు వేస్తే..
ద్రవ్యోల్బణం 7శాతం, గణేశ్ పదవీ విరమణ తర్వాత కనీసం 15 ఏళ్ల జీవిత కాల అంచనాతో అతని ఆర్థిక ప్రణాళికలను ఎలా రూపొందించుకోవాలో చూద్దాం!
* గణేశ్ పింఛను అందుకుంటారు. ఆయన తదనంతరం కూడా జీవిత భాగస్వామికి కుటుంబ పింఛను అందుకుంటారు. కాబట్టి, సాధారణ జీవనానికి ఎలాంటి ఇబ్బందీ ఎదురవ్వదనే చెప్పుకోవాలి. సొంతిల్లు ఉండటం వల్ల అద్దె చెల్లించే ఇబ్బంది లేదు. పిల్లలు కూడా స్థిరపడి తల్లిదండ్రుల నుంచి ఎలాంటి ఆర్థిక తోడ్పాటునూ ఆశించడం లేదు. కాబట్టి, ఈ దంపతులు జీవించినంత వరకూ మంచి జీవితాన్ని గడిపి వారి తదనంతరం తర్వాత తరాలకు కొంచెం సంపదను అందించేందుకు ప్రయత్నించవచ్చు.
అత్యవసర నిధి:ఫిక్స్‌డ్ డిపాజిట్లలో ఉన్న రూ.5లక్షలను అత్యవసర సమయాల్లో వాడుకోవచ్చు. అయితే, మొత్తం ఒకే ఫిక్స్‌డ్ డిపాజిట్‌గా కాకుండా... రూ.50వేలు, రూ.1లక్ష చొప్పున విడివిడిగా వేసుకోవాలి.
ఆరోగ్య బీమా: ప్రభుత్వం కల్పించే ఆరోగ్య బీమా రూ.2లక్షల వరకూ ఉంది. వైద్య ఖర్చులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని, ప్రత్యేకంగా రూ.5లక్షల వరకైనా వ్యక్తిగత ఆరోగ్య బీమా తీసుకోవడం ఉత్తమం.
పెట్టుబడుల్లో మార్పులు...
ప్రస్తుతం పింఛను రూపంలో నెలనెలా రూ.22వేలు అందుకుంటున్నారు. అయితే, వారి ప్రస్తుత జీవనానికి రూ.30వేలు అవసరం అవుతున్నాయి. మున్ముందు పెరిగే ధరలను చూస్తే ఇది ఇంకా ఎక్కువే కావచ్చు.
* రూ.15.82 లక్షలను 8శాతం రాబడి వచ్చేలా మదుపు చేసుకోవాలి. దీంతోపాటు.. అనుకోని అవాంతరాలను ఎదుర్కొనేందుకు రూ.10లక్షలను అదనంగా ఉంచుకుంటే మంచిది. దీనికి మొత్తం రూ.25.82లక్షలు సరిపోతాయి.
* జాతీయ పొదుపు పత్రాల వ్యవధి తీరిన తర్వాత ఆ మొత్తాన్ని ప్రస్తుతం 7.8శాతం వడ్డీ ఇస్తున్న పోస్టాఫీసు నెలసరి ఆదాయ పథకంలో జమ చేసుకోవచ్చు. అప్పుడు నెలకు రూ.3,250 వడ్డీని అందుకునే వీలుంటుంది.
* మదుపు కోసం కేటాయించిన రూ.15.82లక్షల్లో నుంచి రూ.10లక్షలను సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీంలో మదుపు చేయాలి. దీనిలో వార్షిక రాబడి 8.6శాతం అందుతోంది. మూడు నెలలకోసారి రూ.7,167 అందుకోవచ్చు.
* పదవీ విరమణ ప్రయోజనాల్లో మిగిలిన మొత్తాన్ని మ్యూచువల్ ఫండ్లకు మళ్లించవచ్చు. (పట్టిక చూడండి).

ప్రయాణాల కోసం...
సంవత్సరానికి ఒకసారి ఏదైనా విహార యాత్రలకు వెళ్లేందుకు రూ. 30 వేలు ఖర్చవుతుంది అనుకుందాం. ప్రయాణ ఖర్చులకు సంబంధించి ఏటా 5శాతం పెరుగుదల ఉందనుకుంటే రూ. 3.18 లక్షలను 8శాతం రాబడి వచ్చేలా పెట్టుబడి పెట్టాలి. దీనిలో కొంచెం భాగాన్ని ఎండోమెంట్ పాలసీ ద్వారా సర్దుకోవచ్చు. ఈ మొత్తాన్ని మొదటి సంవత్సరం ఖర్చులకు గాను రూ. 1 లక్షను లిక్విడ్ ఫండ్లలో పెట్టుబడి పెట్టొచ్చు. మిగిలిన రూ. 2 లక్షలను డెట్ మ్యూచువల్ ఫండ్లలో పెట్టాలి.
కారు కొనుగోలు కోసం కూడా ఎండోమెంట్ పాలసీ ద్వారా వచ్చిన మొత్తాన్ని వినియోగించుకోవచ్చు.
తమ తదనంతరం వారసులకు తమ ఆస్తులు, ఇతర పెట్టుబడులు చెందేలా వీలునామా రాయడం, నామినేషన్లను మార్పించడం మరిచిపోవద్దు.

LIKE US TO FOLLOW:---
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565