MohanPublications Print Books Online store clik Here Devullu.com

ఆలయములో చేయకూడని, Don't Do Like this in Temples

 ఆలయములో చేయకూడని
Don't Do Like this in Temples

వరాహ పురాణములో ఆలయములో చేయకూడని ముప్పైరెండు కార్యములు తెలుపబడి ఉన్నవి :
🌷 1. యానైర్వా పాదుకైర్వాపి గమనం భగవద్గృహం ।
🍀....దేవోత్సవాత్ అసేవా చ అప్రణామ స్తదగ్రతః 
🌷 2. ఏక హస్త ప్రణామశ్చ పురస్స్వాత్మ ప్రదక్షిణమ్ ।
🍀.... ఉచ్ఛిష్టే చైవ చాశౌచే భగవద్ వన్దనాదికమ్ ॥
🌷 3. పాద ప్రసరణం చాగ్రే తథా పర్యంక బన్ధనమ్ ।
🍀. శయనమ్ భోజనం చైవ మిథ్యో భాషణ మేవచ ॥
🌷 4. ఉచ్ఛైర్ భాషా వృధా జల్పో రోదనం చైవ విగ్రహః ।
🍀.. నిగ్రహానుగ్రహౌ చైవ స్త్రీషు సాకూతభాషణమ్ ॥
🌷 5. అశ్లీల కథనమ్ చైవ అప్యథో వాయువిసర్జనమ్ ।
🍀. కమ్బలావరణమ్ చైవ పరనిన్దా పరస్తుతి: ॥
🌷 6. శక్తౌ గౌణోపచారశ్చ అప్యనివేదిత భక్షణమ్ ।
🍀... తత్తత్కాలోద్భవానామ్ చ ఫలాదీనామ్ అనర్పణమ్ ॥
🌷 7. వినియుక్తావశిష్టస్య ప్రదానం వ్యంజనాదిషు ।
🍀... పృష్టీకృత్యాసనం చైవ పరేషామభివాదనమ్ ॥
🌷 8. గురౌ మౌనం నిజస్తొత్రమ్ దేవతా నిన్దనమ్ తథా ।
🍀.. అపచారాస్తథా విష్ణో: ద్వాత్రింశత్ త్పరికీర్తితాః ॥
🔥 అనువాదము: 🔥
👉 1. ఏదైనా వాహనమునెక్కి , పాదుకలను ధరించి ఆలయమునకు వెళ్ళుట .
👉 2. ఉత్సవము జరుగుచున్నచో సేవించక తిరిగి వచ్చుట.
👉 3. భగవంతునికి నమస్కరించకుండుట.
👉 4. ఒక చేతితో నమస్కరించుట.
👉 5. భగవంతుని ఎదుట ఆత్మ ప్రదక్షిణము చేయుట.
👉 6. ఎంగిలి చేతితో ఆశౌచముతో నమస్కరించుట.
👉 7. భగవంతుడికెదురుగా వీపుకు, మోకాళ్ళకు బట్ట చుట్టుకుని ఊగుచూ కూర్చుండుట.
👉 8. ఆలయములో భగవంతుని ఎదురుగా పడుకొనుట.
👉 9. భగవంతుని ఎదురు మండపములో విస్తరి పరుచుకుని భుజించుట.
👉 10. ఆలయమున లౌకిక విషయముల గురించి ఒకరితోనొకరు మాట్లాడుకొనుట.
👉 11. గట్టిగా అనవసర మాటలు మాట్లాడుట.
👉 12. లౌకిక విషయములపై ప్రసంగములు చేయుట.
👉 13. గట్టిగా ఏడ్చుట .
👉 14. ఒకరితోనొకరు పోట్లాడుట.
👉 15. నిగ్రహము కోల్పోయి పక్కవారిని బెదిరించటం వంటి దాష్టిక చేష్టలు చేయుట.
👉 16. ఒకరికి "నీకు ఈ ఉపకారము చేస్తాను", అని ప్రతిజ్ఞ చేయుట.
👉 17. స్త్రీలతో భావగర్భితముగా పరిహాసము ఆడుట.
👉18. ఆడరాని మాటలాడుట.
👉 19. అపాన వాయువు విడుచుట. (ఆ అవసరము వస్తే ముందుగానే బయటికి వెళ్ళాలి.)
👉 20. కంబళి - శాలువ మొదలగు వానితో శరీరమంతయు కప్పుకొనుట. (చలి అధికముగా ఉన్నచో పై వస్త్రమును యజ్ఞోపవీతము వలే కప్పుకుని కుడిచేయి బయటకు ఉంచవలెను. )
👉 21. దైవ సన్నిధిలో ఇతరులను నిందించుట.
👉 22. ఇతరులను పొగుడుట.
👉 23. శక్తి ఉన్నా భగవంతునికి అల్పముగా సమర్పించుట.
👉 24. భగవంతునికి నైవేద్యం సమర్పించకుండా ఆ పదార్థములు సన్నిధిలో కుర్చుని భుజించుట.
👉 25. ఆయా సమయాలలో తన ఇంటిలో గానీ తోటలో గానీ పండిన పండ్లను, కూరలను, పూచిన పూలను భగవంతునికి సమర్పించకుండా తాను ఉపయోగించుకొనుట.
👉 26. తాను ఉపయోగించగా మిగిలిన పుష్పాలను, ఫలాలను పెరుమాళ్ళకు వినియోగించుట.
👉 27. భగవంతుడి వైపు వీపు పెట్టి కూర్చొనుట.
👉 28. దైవ సన్నిధిలో ఎదుట ఇతరులకు నమస్కరించుట.
👉 29. తన ఆచార్యుల ప్రసంగము వచ్చినపుడు వారిని ప్రశంసిన్చకుండుట.
👉 30. ఎట్టి సందర్భములలో అయినను తనను తాను పొగడుకొనుట.
👉 31. భగవంతుని నిందించుట.
👉 32. కాళ్ళు చాపుకుని కూర్చొనుట.
🍀 ఈ తప్పులను దేవాలయములో చేసినచో సంపాదించుకున్నపుణ్యము హరించుకుపోతుందని వరాహ పురాణములో చెప్పబడియున్నది.



LIKE US TO FOLLOW: ---



No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list