తేనె ఎంత మధురం, Honey Is So Sweet
తేనె ఎంత మధురం..!
~~~~~~~~~~~~
~~~~~~~~~~~~
చక్కెర తియ్యగా ఉంటుంది. కానీ ఆరోగ్యానికి హానికరం. తేనె కూడా తియ్యగానే ఉంటుంది. కానీ ఔషధభరితం. ఎందుకంటే పూలల్లోని మకరందం, పుప్పొడి పరిమళం కలగలిసిన అద్భుతమైన రుచి దీని సొంతం. అందుకే తేనె మధురాతి మధురం... అమృతాన్ని మరిపించే దివ్యౌషధం!
అలుపన్నదే లేకుండా వేలమైళ్ల దూరం ప్రయాణిస్తూ పువ్వుపువ్వునీ పలకరిస్తూ మకరందాన్ని సేకరించింది మధుపం. రాబోయే కాలం కోసం ఆకుచాటు కొమ్మకి కట్టిన అద్దాల భవంతిలో దాచిపెట్టింది. కానీ డేగ కళ్ల మనిషి దాన్ని చూడనే చూశాడు. భవంతి కూలింది. చేతికందిన మధువులోని తియ్యదనాన్ని తొలిసారిగా రుచి చూశాడు. ఆ తరవాత అందులోని పోషకాలనీ ఆరోగ్య, సౌందర్య గుణాలనీ గుర్తించాడు. ఇంకేముంది... చిటారుకొమ్మన ఉన్న ఆ మిఠాయిపొట్లాలను వేటాడే పనిలేకుండా ఏకంగా తేనెటీగల్ని పెంచి తేనె పిండటమూ తెలుసుకున్నాడు. ఫలితమే రంగురంగుల రకరకాల తేనెలు. పసుపు, బూడిద, ముదురుకాఫీ, నలుపు... ఇలా భిన్న రంగులతోబాటు వర్ణరహిత మైన తేనెలూ ఉన్నాయి. ఒక్కో తేనె ఒక్కో రకమైన రుచినీ సుగంధాన్నీ వెదజల్లుతుంది. యూకలిప్టస్, నిమ్మ జాతి పూల తేనె ఘాటైన రుచినీ వాసననీ కలిగి ఉంటుంది. అందుకే బేకింగ్ ఉత్పత్తుల్లో చక్కెరకు బదులు తేనె వాడటంవల్ల అవి మరింత రుచిగానూ సువాసనభరితంగానూ ఉంటాయి.
శుద్ధి చేయని ముడి/జుంటి తేనెలో విటమిన్లూ ఎంజైములూ యాంటీఆక్సిడెంట్లూ మరింత పుష్కలం. అందుకే శక్తికోసం తేనెను నేరుగానూ తినొచ్చు. గోరువెచ్చని నీళ్లలో కలిపితే మందులానూ పనిచేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా వాడుకలో ఉన్న ఆహారపదార్థం ఏదయినా ఉందీ అంటే అది తేనె మాత్రమే. ఆయుర్వేదం, అల్లోపతీ అన్న తేడా లేకుండా అన్ని రకాల వైద్యులూ నిర్భయంగా వాడమని చెప్పేది కూడా అదే. గ్రీకులూ రోమన్లూ చైనీయులూ ఈజిప్షియన్లూ అస్సీరియన్లూ భారతీయులూ ప్రాచీనకాలం నుంచీ వైద్యంలో వాడుతూనే ఉన్నారు. ఆయుర్వేదానికి తేనె ప్రాణంలాంటిది. శుశ్రుతసంహిత తేనెను తాగేమందుగా వర్ణించింది. శ్వాసకోశవ్యాధులకు మధువును మించిన ఔషధం లేదనీ, గాయాల నివారణతోబాటు పొట్టకు సంబంధించిన అనేక వ్యాధుల్నీ తగ్గిస్తుందనీ పేర్కొంది. అందుకే ఆధునిక పరిశోధకులు సైతం తేనెలోని ఔషధగుణాలమీద ప్రత్యేకంగా దృష్టిసారిస్తున్నారు.
**ఔషధభరితం!
పంచదారకన్నా ఎంతో తియ్యగా ఉండే తేనెను రోజూ ఆహారంలో భాగంగా తీసుకోవడంవల్ల హృద్రోగాల సంఖ్య బాగా తగ్గినట్లు తేలింది. తేనెలో అధికంగా ఉండే విటమిన్-సి, మోనోఫినాలిక్‌లూ ఫ్లేవనాయిడ్లూ పాలీఫినాలిక్‌లూ యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేయడమే ఇందుకు కారణం.
* వూబకాయంతో బాధపడేవాళ్లకు క్రమం తప్పకుండా 30 రోజులపాటు రోజూ 70 గ్రా. తేనెను ఇచ్చి చూడగా వాళ్ల బరువులో 1.3 శాతం తేడా ఉండగా కొలెస్ట్రాల్ మాత్రం మూడు శాతం వరకూ తగ్గిందట. తేనెలో నిమ్మరసం, దాల్చినచెక్క పొడి కలిపి తీసుకున్నా బరువు తగ్గుతారు. అంతేకాదు, తేనెని గోరువెచ్చని నీళ్లలో కలిపి తీసుకోవడంవల్ల శరీరంలో నిల్వ ఉన్న కొవ్వులు త్వరగా జీర్ణమవుతాయి.
* ముడి తేనె బీపీని తగ్గిస్తుందన్నది మరో పరిశోధన. అంతేకాదు, శరీరంలో ఇన్సులిన్ శాతాన్నీ క్రమబద్ధీకరిస్తుంది. రక్తంలో చక్కెరనిల్వలు తగ్గకుండా చూస్తుంది. వ్యాయామం తరవాత దీన్ని తీసుకోవడంవల్ల అలసట ఉండదు.
* యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు అధికంగా ఉండే తేనె మంచి యాంటీసెప్టిక్ కూడా.
* తేనెలోని న్యూట్రాసూటికల్స్ యాంటీఆక్సిడెంట్లుగా పనిచేస్తూ శరీరంలో హానికరమైన ఫ్రీ-రాడికల్స్‌ను తొలగిస్తాయి. దాంతో క్యాన్సర్, హృద్రోగాలను తట్టుకునే శక్తి పెరుగుతుంది.
* తేనె పుండ్లనీ గాయాలనీ త్వరగా తగ్గిస్తుంది. ఇందులోని యాంటీ మైక్రోబియల్ లక్షణాలవల్ల ఇది ఆటోలిటిక్ డెబ్రిడిమెంట్‌గా పనిచేస్తుంది. పుండ్ల నుంచి వచ్చే చెడువాసనని తొలగిస్తుంది. పచ్చిగాయాలమీద ప్రభావవంతంగా పనిచేస్తుంది. అందుకే మాంఛెస్టర్ విశ్వవిద్యాలయ పరిశోధకులు క్యాన్సర్ రోగులకు శస్త్రచికిత్స అనంతరం తేనెను వాడే ఆలోచనలో ఉన్నారు.
* మచ్చల్ని మాయం చేయడంలో తేనెని మించింది లేదు.
* స్థానికంగా దొరికే తేనెను తాగడంవల్ల అలర్జీలు త్వరగా రావట. తేనెటీగలు చుట్టుపక్కల మొక్కల నుంచే తేనెను సేకరించడంవల్ల ఆ పరాగరేణువులు శరీరంలో చేరి రోగనిరోధకశక్తి పెరుగుతుంది.
**ఏ తేనె మంచిది?
తేనె ఉత్పత్తిలో వాడే పూలమీద ఆధారపడి తేనె నాణ్యత, ఔషధగుణాలూ ఆధారపడి ఉంటాయి. కేవలం ఒకే రకం పూలకన్నా రకరకాల పూల నుంచి సేకరించిన తేనెలో ఔషధగుణాలు మరీ ఎక్కువ.
* తేనె ఎప్పటికీ పాడవదు. అది నిజమే అయినప్పటికీ మార్కెట్లో లభించే తేనెలన్నీ కూడా కొంతకాలానికి ముదురురంగులోకి మారుతుంటాయి. అంటే వాటిల్లో సహజంగా ఉండే కొన్ని గుణాలు దెబ్బతిన్నాయన్నమాట. అందుకే మరీ నిల్వ ఉన్నది వాడకూడదు.
* తేనెలో నీటిశాతం 19% కన్నా ఎక్కువగా ఉంటే త్వరగా పులుస్తుంది. రిఫ్రాక్టోమీటర్ ద్వారా తేనెలోని నీటిశాతాన్ని లెక్కించవచ్చు. లేదంటే తేనెని స్పూనుతో పైకి తీస్తే వేగంగా కిందకి కారుతున్నా జారుతున్నా అందులో నీటి శాతం ఎక్కువ అని గుర్తించాలి. లేదా ప్రాసెసింగ్‌లో భాగంగా ఎక్కువగా వేడిచేయడంవల్ల గడ్డ కట్టే గు

ణం తగ్గిపోయిందని గుర్తించాలి. అధిక ప్రాసెసింగ్‌వల్ల సహజంగా ఉండే బ్యాక్టీరియా విటమిన్లూ ఎంజైములూ హరించుకుపోతాయి. కాబట్టి ముడి తేనె వాడటమే మేలు.
* తేనె నాణ్యత కాలంమీద కూడా ఆధారపడి ఉంటుంది. పూలు ఎక్కువగా పూచే వేసవిలో తయారయ్యే తేనె మంచి వాసనతో చిక్కగా ఉంటుంది.
* వడబోసిన తేనె కూడా మంచిది కాదు. తేనెలో ఉన్న పుప్పొడి వల్లే దానికి ఔషధగుణాలు ఉంటాయి. ఆ పుప్పొడి లేని తేనె పంచదారపాకంలాంటిదే. అప్పుడు చక్కెరలానే తేనె కూడా ఆరోగ్యానికి హానికరమే.
***పోషకభరితం!
చక్కెర పదార్థాల సమ్మిశ్రమమే తేనె. ఇందులో ఫ్రక్టోజ్ 38%, గ్లూకోజ్ 31%, సుక్రోజ్ 1%, నీరు 17%, ఇతరత్రా చక్కెరలు 9% ఉంటాయి. కేవలం చక్కెరలకే అంత చిక్కదనం ఎలా అని ఆరాతీస్తే- కూలీ ఈగలు మకరందాన్ని తీసుకువచ్చేటప్పుడు వాటిల్లోని కొన్ని ఎంజైములు అందులో కలుస్తాయి. ఆ తరవాత ఈగలన్నీ తేనెపట్టులోకి చేరి, అక్కడ రెక్కలల్లారుస్తూ ఎగరడం వల్ల మకరందంలోని నీరు ఆవిరై గాఢత పెరిగి తేనెలా మారుతుంది. అందుకే పంచదారతో పోలిస్తే తేనెలో క్యాలరీలు ఎక్కువ.
* అమెరికన్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ లెక్క ప్రకారం ఒక్క టేబుల్‌స్పూను పంచదారలో 15 క్యాలరీలు ఉంటే, తేనెలో 64 క్యాలరీలు ఉంటాయి. పంచదారతో పోలిస్తే చాలా ఎక్కువ. కానీ తేనెలోని పిండిపదార్థాలు సులభంగా గ్లూకోజ్‌గా మారిపోవడంతో తేలిగ్గా జీర్ణమవుతాయి. అందుకే అథ్లెట్లకు తేనె తక్షణ శక్తిగా పనిచేస్తుంది.
* తేనెలో విటమిన్-సి, కాల్షియం, ఐరన్, మాంగనీస్, ఫాస్ఫరస్, జింక్, సోడియం... వంటి ఖనిజాలతోబాటు విటమిన్లూ ప్రొటీన్లూ అమైనోఆమ్లాలూ ఉంటాయి. పోషకలేమితో బాధపడేవాళ్లకి తేనె మంచి పోషకాహారం.
సౌందర్యలేపనం!
చర్మ సౌందర్యానికి తేనెకు సాటిలేదు. మొహానికి ప్యాక్‌లా వేయడం వల్ల చర్మం పునరుజ్జీవితమవుతుంది. ఇది సహజ మాయిశ్చరైజర్‌లా పనిచేస్తుంది. ఎండిపోయినట్లున్న చర్మం చక్కని నిగారింపుని సంతరించుకుంటుంది. పెదాలను సైతం పగలనివ్వదు. తేనెవల్ల పొడిబారిన జుట్టు కూడా మృదువుగా మారుతుంది.ఇన్ని సుగుణాలున్నాయి కాబట్టే కవి హృదయం మంచిమనసుల్ని తేనెమనసులనీ మంచిమాటల్ని తేనెపలుకులనీ అధరసౌందర్యాన్ని తేనెలూరే పెదాలనీ వర్ణిస్తూ తేనెని మంచికి పర్యాయపదంగా మార్చేసింది.

LIKE US TO FOLLOW: ---
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565