MohanPublications Print Books Online store clik Here Devullu.com

మొటిమల భాధ తగ్గించేదిలా, How to remove pimples

మొటిమల భాధ తగ్గించేదిలా
How to remove pimples 

+++++++మొటిమల భాధ తగ్గించేదిలా++++++++
మొటిమలు యువతీయువకులను బాధపెడుతుంటాయి ముఖ్యంగా పెళ్లి చేసుకోబోతున్న వారి లో మరి ఎక్కువ భాధ ఉంటింది . అలాంటి మొటిమలను దూరం చేసుకోవాలంటే పాటించాల్సిన కొన్ని జాగ్రత్తలు .
1) కొద్దిగా గంధపు పొడిలో చిటికెడు పసుపు, పాలు కలిపి ముఖానికి రాస్తే క్రమేణా మొటిమలు తగ్గుతాయి. దాల్చిన చెక్కను పేస్ట్‌లా చేసి మొటిమలపై రాసి కాసేపాగి కడగాలి.
2) ఉసిరి విత్తనాలను నాలుగైదు గంటలపాటు నీటిలో నానపెట్టాలి. తర్వాత వాటిని రుబ్బి ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించినా కూడా మొటిమలను దూరం చేయవచ్చు.
3) ముఖంపై నూనె లేదా జిడ్డుగా ఉండే ఎలాంటి పదార్థాలనూ రాయకూడదు. ఇలాంటివి చర్మంలోని తైల గ్రంథులు మూసుకునేలా చేసి మొటిమలను మరింత తీవ్రం చేస్తాయి. తలకు నూనె, క్రీముల వంటివి వాడితే.. అవి ముఖమంతా విస్తరించి, మొటిమలు ఉధృతం కావటానికి దోహదం చేస్తాయి.
4)రాత్రి పడుకోబోయే ముందు గోరువెచ్చని నీటితో ముఖం శుభ్రంగా కడుక్కుని, మెంతి ఆకులతో చేసిన పేస్ట్‌ని ముఖానికి మాస్క్‌లా వేయాలి. ఆరిన తర్వాత కడిగితే మొటిమలు దరిచేరవు.
5)కొత్తిమీర రసంలో చిటికెడు ఉప్పు కలిపి, ముఖానికి రాసి అరగంట తర్వాత చన్నీటితో కడిగితే మొటిమలు పోతాయి.
6)ఉల్లి రసం రాస్తే మొటిమలు, కాలిన గాయాల మచ్చలు తగ్గుతాయి.
7)కమలా పళ్ళ తొక్కలను ఎండ బెట్టి చూర్ణం చేసి మొహానికి రాసుకుంటే మొటిమలు, వాటి మచ్చలు కూడా పోతాయి.
8)ముఖాన మొటిమలు, మచ్చలు, పొడలు లాంటివి ఉంటే… కొద్దిగా పుదీనా ఆకులు మెత్తగా నూరి రాత్రి పడుకునే ముందు ముఖానికి రాసి, ఉదయాన్నే శుభ్రంగా కడగాలి. ఇలా వారం రోజులు చేస్తే మచ్చలు లేకుండాపోతాయి.
9)మొటిమలతో బాధపడేవారు బూరుగు చెట్టుకుండే ముల్లును బాగా అరగదీసి ఆ చూర్ణాన్ని మొటిమలకు పెడితే మంచి ఫలితం ఉంటుంది
++++++++++++++++++++++++++
మొటిమలు తగ్గాలంటే.. :-----
మొటిమలు తగ్గాలంటే.. బొప్పాయి గుజ్జులో, చెంచా పాలు, చెంచా తేనె, తగినంత తులసిపొడి వేసి మెత్తగా కలుపుకోవాలి. దాన్ని ముఖానికి రోజూ ఉదయాన్నే ప్యాక్‌లా వేసుకోవాలి. ఇలా రోజూ చేస్తే మొటిమల సమస్య అదుపులో ఉంటుంది.
గంధాన్ని అరగదీసి దానికి చెంచా గులాబీ రేకుల పొడి, చెంచా పచ్చిపాలు, తేనె కలిపి ముఖానికి రాసుకోవాలి. ఆరాక చల్లటి నీటితో కడిగేసుకోవాలి. ఇలాచేస్తే మొటిమలు తగ్గడంతో పాటు చర్మం రంగూ మెరుగపడుతుంది.
అలాగే టేబుల్ స్పూన్ పాలు, చెంచా పసుపు, చెంచా సెనగపిండి కలుపుకుని మెత్తని పేస్ట్‌లా చేసుకుని ఉదయాన్నే రాసుకోవాలి. లేదంటే బంగాళాదుంపను పేస్ట్ చేసుకోవాలి. దానికి చెంచా పాలు జత వేసుకుని ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోవాలి. ఇది కళ్లకింద ఉండే నల్లటి వలయాల్ని ముఖంపై మొటిమల్ని వాటి తాలుకూ మచ్చల్ని తగ్గిస్తుంది.
బియ్యం కడిగిన నీటిని మొటిమలపైన మృదువుగా రుద్దితే తగ్గిపోతాయి. మొటిమలు తగ్గాలంటే.. కస్తూరి పసుపును నిమ్మరసంతో కలిపి ఆ మిశ్రమాన్ని రాస్తే మొటిమలు తగ్గుతాయి. చిటికెడు పసుపు ముఖానికి రాసి, కొద్దిసేపటి తర్వాత ముఖం కడుక్కోవడం ద్వారా మొటిమలను తగ్గించుకోవచ్చు. బయటకు వెళ్ళి వచ్చినప్పుడు, దుమ్ము చేరకుండా తప్పకుండా చల్లటి నీళ్ళతో ముఖం కడుక్కోవాలి.
మొటిమలు తగ్గిపోవాలంటే.. వేప ఆకులను నీళ్ళలో ఉడికించి, ఆ నీటిని బకెట్ నీళ్ళలో కలుపుకుని స్నానం చేస్తే ఎంతో మంచిది. ఇలా చేయడంవల్ల మొటిమలే కాదు అనేక రకాల చర్మ వ్యాధులు కూడా తగ్గుతాయని బ్యూటీషన్లు అంటున్నారు.
+++++++++++++++++++++++
టీనేజర్స్ లో ముఖంలో మొటిమలు, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్, ఇతర సాదారణ చర్మ సమస్య ఇలా చాలానే ఉన్నాయి. అందుకు కారణం మొటిమలు పోగొట్టుకొనుటకు, ముఖం కాంతివంతంగా ఉండేందుకు వివిధ రకాల ఫేస్ ప్యాక్, ఫేస్ మాస్క్, వివిధ రకాల క్రీములు వాడటం. అయితే వారి సమస్య నివారించబడక మరింత ఎక్కువగా కనబడుతుంది. అయితే అందుకు ముఖ్య కారణం ఏమిటని మాత్రం తెలుసుకోలేకపోతున్నారు. క్రీములు, ఫేస్ ప్యాక్ లు, ఫేస్ మాస్క్ లతో నయమవ్వని కొన్ని చర్మ సమస్యలు, మొటిమలు మనం తీసుకొనే ఆహారంతో తొలగిపోతాయి. కాబట్టి చర్మ సంబంధ సమస్యలు, మొటిమలు తగ్గించడానికి కొన్ని చిట్కాలను మీకోసం... ప్రతిరోజూ మీరు తీసుకొనే ఆహారంలో కొంత మార్పులు చేసి చూడండి. ఆ ఫలితం మీకే తెలుస్తుంది. అందుకు 1. ప్రతి రోజూ డైట్ ఫుడ్ తీసుకోవాలి. ముఖ్యంగా ఉడికించిన పదార్థాలను ఆహారంగా తీసుకోవాలి. ఫ్యాట్, మరియు నూనె పదార్థాలు, మసాలాలను లేకుండా కనీసి వారంలో రెండు రోజుల పాటు డైట్ ను నిర్వహించండి. 2. ముఖ్యంగా బయట తిరిగే వాళ్ళు, ఆఫీస్సుల్లో పనిచేసేవాళ్ళకి జంక్ ఫుడ్ పై మక్కువ ఎక్కువ కాబట్టి జంక్ ఫుడ్ కు పూర్తిగా గుడ్ బై చెప్పండి. 3. మీడైట్ లో తప్పకుండా మసాలాలు, కొవ్వు పదార్థాలు, వేపుల్లు లేకుండా చేసుకుంటే తప్పకుండా మీరు అతి తక్కువ బరువు కలిగి ఉంటారు. 4. ముఖ్యంగా ఎక్కువ గ్రీన్ వెజిటేబుల్స్, ఆకు కూరలు, సలాడ్స్ , ఫ్రెష్ ఫ్రూట్స్ వంటివి ప్రతి రోజూ మీ డైట్ లో ఉండేటట్లు చూసుకోవాలి. 5. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఎంత ఎక్కువగా నీరు తాగితే అంతమంచిది. నీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో ఉన్న టాక్సీన్స్ చెడు చెమట, మూత్రం ద్వారా బయటకు విసర్జింపబడి శరీరం తేలికగా, సున్నితంగా తయారవుతుంది. 6. చర్మ సమస్యలను, శరీరాన్ని ఆరోగ్యంగా ఉండి, అన్ని జీవక్రియలు సక్రమంగా జరగాలంటే ప్రతి రోజూ కొద్ది సమయాన్ని వ్యాయామానికి కేటాయించాలి. 7. ప్రతి రోజూ మీ చర్మాన్ని శుభ్రం చేసుకోవాలి. కనీసం రోజుకు రెండు సార్లైనా ముఖం కడుక్కోవాలి. 8. ఇంట్లో తరుచూ దొరికే పండ్లుతోటి, వెజిటేబుల్స్ తోటి చర్మానికి స్ర్కబ్బింగ్ చేసుకోవాలి. 9. మార్కెట్లో కొత్తగా ఏవైన వచ్చిన బ్యూటీ ప్రొడక్ట్స్ సౌందర్య నిపుణల సలహాలపైన ఉపయోగించాలి. 10. ఎప్పుడూ మీ చర్మానికి ఉపయోగించే మాస్క్ లు, ఫేషియల్స్ , స్ర్కబ్బింగ్లు, సౌందర్య సాధనాలు మీ చర్మ తత్వానికి సరిపోయే విధంగా ఉన్నాయో లేదో తెలుసుకొని మరీ వాడడం అన్నింటికంటే ఉత్తమమైన పద్దతి.
++++++++++++++++++++++++
ఒక్క రోజులో మొటిమలు తగ్గాలంటే..
December 7, 2015 ఆరోగ్యం, ప్రోగ్రామ్స్
చాలా మంది మొటిమల సమస్యతో బాధపడుతుంటారు. మొటిమలను నివారించుకోవడానికి వేసుకొనే కొన్ని ఫేస్ మాస్కులు ముఖాన్ని రెడ్ గా, భయంకరంగా మార్చేస్తాయి. ఆయిల్ ముఖం ఉన్న వారు మొటిమలు, మచ్చలకు ఎక్కువగా గురి అవుతుంటారు. ముఖంలో ఎక్కువ ఆయిల్స్ ఉన్నట్లైతే ఇది ఎక్కువ ఇన్ఫెక్షన్స్ కు , మచ్చలకు దారితీస్తుంది. మరియు చర్మ రంద్రాలను కూడా బ్లాక్ చేస్తుంది. చర్మ రంద్రాల్లోప నిల్వ ఉండే ఆయిల్స్ వల్ల స్కిన్ ఇన్ఫెక్షన్స్ మరియు మొటిమలకు దారితీస్తుంది. మొటిమలను నివారించుకోవడానికి మెడికేటెడ్ క్రీములను ఉపయోగించడం అంత మందిచి కాదు. క్రీములు లేదా ఆయిట్ మెంట్స్ కొన్ని వారాల పాటు ఉపయోగిస్తారు. దీర్ఘకాలంలో సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మొటిమలను నివారించుకోవడానికి నేచురల్ మార్గాలు అనేకం ఉన్నాయి. మొటిమలు మరియు మచ్చలతో బాధపడే వారు వంటగదిలోనే వస్తువులతోనే చాలా త్వరగా వేగంగా మొటిమను తగ్గించుకోవచ్చు. మరి ఆ హోం రెమెడీస్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం…
1. ఆవాలు , తేనె:
ఆవాలలో సాలిసిలిక్ యాసిడ్స్ అనే నేచురల్ కాంపోనెంట్ ఎక్కువగా ఉండటం వల్ల ఇది స్కిన్ ఇన్ఫెక్షన్స్ మరియు మొటిమలను నివారించడానికి ఇది ఒక బెస్ట్ హోం రెమెడీ. 1/4మస్టర్డ్ పౌడర్ లో ఒక చెంచా తేనె మిక్స్ చేసి ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి. 15 నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి.
2. గ్రీన్ టీ ఐస్ క్యూబ్స్:
కొన్ని గ్రీన్ టీ ఆకులను నీటిలో వేసి బాగా మరిగించాలి. ఈ గ్రీన్ టీ వాటర్ చల్లారిన తర్వాత ఐస్ ట్రేలో పోసి ఫ్రీజర్ లో పెట్టాలి. గ్రీన్ టీ ఐస్ క్యూబ్స్ తయారవుతాయి. ఈ గ్రీన్ టీ ఐస్ క్యూబ్ తీసుకొని మొటిమలు మచ్చలున్న ప్రదేశంలో మర్ధన చేయాలి. మొటిమలు మాయం అవ్వడంతో పాటు, స్కిన్ ఇన్ఫ్లమేషన్ మరియు పఫీ ఐస్ ను నివారిస్తుంది.
3. టమోటో స్లైస్:
టమోటోల్లో యాంటీఆక్సిడెంట్స్ ఉండటం వల్ల చర్మం మీద ఆస్ట్రిజెంట్ ప్రభావం కలిగి ఉంటుంది . ఇది అన్ని రకాల చర్మ సంబంధిత ఇన్ఫెక్షన్స్ నివారించడంలో ఇది ఒక బెస్ట్ హోం రెమెడీ. కొద్దిగా టమోటో రసంను ముఖానికి అప్లై చేసి మర్ధన చేయడం లేదా టమోటో స్లైస్ తో మొటిమల మీద మర్దన చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది
4. వెల్లుల్లి జ్యూస్:
వెల్లుల్లిలో నయం చేసే గుణాలు మెండుగా ఉన్నాయి. మొటిమలు ఎక్కువగా బాధిస్తున్నా.. లేదా మొటిమలు పెద్దగా కనబడుతున్నా. వాటి మీద వెల్లుల్లి రెబ్బల రసాన్ని అప్లై చేయాలి. ఒక వెల్లుల్లి పాయ తీసుకొని స్టోన్ మీద అరగదీసి, చిటికెడు రాసన్ని అప్లై చేయాలి. ఎక్కువగా అప్లై చేయకూడదు. ఒక గంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇది చాలా ఎఫెక్టివ్ హోం రెమెడీ.
5. ఎగ్ వైట్ మాస్క్:
ఎగ్ వైట్ ను సపరేట్ గా తీసుకొని మొటిమల మీద అప్లై చేయాలి. 20 నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. అలాగే ఎగ్ వైట్ అప్లై చేయడానికి ముందు నిమ్మరసం అప్లై చేయడం వల్ల నయం చేసే గుణాలు మరింత ఎఫెక్టివ్ గా పెరుగుతాయి.
6. ఆపిల్ సైడర్ వెనిగర్ :
కాటన్ బాల్ ను ఆపిల్ సైడర్ వెనిగర్ లో డిప్ చేసి మొటిమల మీద ప్లేస్ చేయాలి. 5నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. మొటిమలున్న ప్రదేశంలో మాత్రమే అప్లై చేయాలి. ఈ చిట్కాను రోజులో మూడు నాలుగు సార్లు చేయొచ్చు.
7. క్లే అండ్ ఆయిల్స్:
ఒక చెంచా ఫుల్లర్స్ ఎర్త్ లో కొన్ని చుక్కల ల్యావెండర్ నూనె వేసి పేస్ట్ లా చేసి ముఖానికి పట్టించాలి. 10 నిముషాల తర్వాత మొటిమలు మాయం అవుతాయి.
8. నిమ్మరసం:
నిమ్మరసంలో కొన్ని కాటన్ బాల్స్ డిప్ చేసి ముఖం మీద అప్లై చేయాలి. రాత్రంతా అలాగే ఉంచి మరుసటి రోజు ఉదయం శుభ్రం చేసుకోవాలి. రాత్రిలోనే బాగా డ్రై అయై రాలిపోతాయి.


No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list