MohanPublications Print Books Online store clik Here Devullu.com

మహీధర నళినీమోహన్, Mahidara NaliniMohan

మహీధర నళినీమోహన్
Mahidara NaliniMohan


మహీధర నళినీమోహన్:-----
జననం 1933 ముంగండ
మరణం 21 అక్టోబరు 2005
మరణ కారణము ఆల్జీమర్స్ వ్యాధి
తండ్రి మహీధర రామమోహనరావు
మహీధర నళినీ మోహన్ 1933వ సంవత్సరంలో తూర్పు గోదావరి జిల్లా ముంగండ గ్రామంలో జన్మించాడు. ఆయన మాటలలో, "భారత స్వతంత్ర సమరంలో ముగ్గురు కుటుంబ సభ్యులని కారాగారానికి పంపిన దేశభక్తుల ఇంట్లో, మూడు తరాలుగా విప్లవ సాహిత్య చర్చలకు వేదికగా నిలచిన ముంగిట్లో - ఛాందసాన్ని వెలివేసిన పండిత కుటుంబంలో - 1933లో, తూర్పు గోదావరి జిల్లా ముంగండలో జననం." సుప్రసిద్ధ నవలా రచయిత, పాత్రికేయుడు మహీధర రామమోహనరావు ఈయన తండ్రి. బహు గ్రంధకర్తైన మహీధర జగన్మోహనరావు ఈయన పినతండ్రి. నళినీ మోహన్ పాపులర్ సైన్స్ రచనలు రాయడంలో ప్రసిద్ధుడు. తనకు తెలిసిన శాస్త్ర పరిజ్ఞానాన్ని పొందికైన పదాల్లో సామాన్యుల భాషలో రాయడంలో ఈయన చేసిన కృషి చెప్పుకోదగ్గది. తెలుగులో పాపులర్ సైన్స్‌కు ఆయన చేసిన సేవ ఎనలేనిది. పదిహేనవ ఏటనుండి కవిత్వ రచనలో ప్రవేశం ఉన్న నళినీ మోహన్ జనరంజక విజ్ఞానంలో దరిదాపు 30 పుస్తకాలు, పిల్లల కోసం 12 పుస్తకాలు, కవితలూ, వ్యాసాలూ వగైరా 10 పుస్తకాల వరకూ వ్రాశాడు. వివిధ పత్రికలలో ఇతని రచనలు దాదాపు 1,000 పైగానే ప్రచురితం అయి ఉంటాయి. 1968లో దువ్వూరి రామిరెడ్డి విజ్ఞాన బహుమతిని, 1987లో ఇందిరా గాంధీ విజ్ఞాన బహుమతిని అందుకున్నాడు. కొన్నాళ్ళు ఆల్జీమర్స్ వ్యాధితో బాధపడి అక్టోబరు 2005లో మరణించాడు.
జీవితం
1933లో జన్మించిన నళినీమోహన్, 1953లో రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీ నుండి బీయస్సీ పూర్తిచేసాడు. 1955లో ఉస్మానియా విశ్వవిద్యాలయము నుండి భౌతికశాస్త్రంలో ఎమ్మెస్సీ పూర్తిచేసాడు. 1960-63 మధ్య మాస్కో విశ్వవిద్యాలయంలో పరిశోధన చేసి డాక్టరేట్ అందుకున్నాడు. 1969-71 మధ్య కాలంలో స్వీడన్‌లో అయనోస్ఫెరిక్ (అయనావరణ) అబ్జర్వేటరీలోని రాకెట్ పేలోడ్ నిర్మాణ విభాగంలో పరిశోధనలు చేసాడు. 1974-75 మధ్య కాలంలో బల్గేరియన్ అకాడెమీ ఆఫ్ సైన్సెస్‌కు అతిధిగా వెళ్ళాడు. 1981-82లో ఇంగ్లండులోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ వేల్స్‌లో పరిశోధన చేసాడు. తరువాత ఢిల్లీలోని జాతీయ భౌతిక పరిశోధనశాలలో అంతరిక్ష పరిశోధనలు చేసాడు.
1. గణితంతో గమ్మత్తులు:-------
https://ia601507.us.archive.org/…/Facebook-MOHANPUBLI…/g.pdf
2. మెదడుకు పదును:---------
https://ia801502.us.archive.org/…/Facebook-mohanPubli…/m.pdf
4. చొప్పదంటు ప్రశ్నలు:-------
https://ia801502.us.archive.org/…/FacebookmohanPublic…/c.pdf
అందరికీ ఉపయోగపడేవిధంగా
ఈ పోస్ట్ ని
అందరూ షేర్ చేయగలరు




LIKE US TO FOLLOW: ---



No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list