MohanPublications Print Books Online store clik Here Devullu.com

కుటుంబ క్షేమానికి మంగళచండీ వ్రతం, Mangalachandhi Vratam

కుటుంబ క్షేమానికి మంగళచండీ వ్రతం
Mangalachandhi Vratam
కుటుంబ క్షేమానికి మంగళచండీ వ్రతం
త్రిపురాసుర సంహారానికి ముందు తొలుత మంగళచండీని పూజించినవాడు శివుడు. ఆపై అంగారక గ్రహం, ముచ్చటైన మూడవ మంగళ పూజను మహేంద్రుడూ, నాలుగో పూజను దేవతలూ చేశారు. ఈ పూజ చేసిన వారికి శత్రుభీతిపోవటంతోపాటు కుటుంబమంతా మంగళకరంగా ఉంటుంది. బ్రహ్మదేవుడు స్వయంగా శివునికి ఉపదేశించిన పూజ విధానం శ్రీ దేవి భాగవతంలో ఉంది.
మంగళ చండి స్తోత్రంను మంగళవారం పఠిస్తే కుజగ్రహ దోషాలు తొలగిపోయి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. మంగళవారం కుజహోరలో దేవికి నేతితో దీపమెలిగించి ఈ మంత్రాన్ని పఠిస్తే వ్యాపారాభివృద్ధి, ఆర్థిక వృద్ధి చేకూరుతాయని పండితులు అంటున్నారు.
శత్రు పీడలు,ఋణభాదలు, వాహన ప్రమాదాల నుండి రక్షణ,కోర్టు సమస్యలు,సంసారంలో గొడవలు,అనారోగ్య సమస్యలు,కోపం,అగ్ని ప్రమాదాల బారి నుండి రక్షణ మొదలగు కుజ గ్రహ దోషాలకు మంగళ చండీ స్తోత్ర పారాయణం ప్రతి మంగళవారం పఠించటం మంచిది.
++++++మంగళ చండీ స్తోత్రం+++++
ద్యానమ్:---
దేవి శోడష వర్మియామ్ సుస్త్ర యవ్వనామ్
బింబోక భీమ్ సుదతీమ్ సుద్దామ్ శరత్ పద్మ నిభాననామ్.
శ్వేత సంపక వర్ణామ్ సునీ లోత్భల లోసనామ్
జగతాత్రీమ్ సదాత్రీమ్ చ సర్వేభ్యః సర్వ సంపదామ్.
సంసార సాగరే కావే జ్యోతి రూపాం సదాభజే
దేవాస్య చ ద్యాన మిత్యవమ్ స్థవానమ్ సృయతామునే.
శ్రీ మహాదేవ ఉవాచ:----
రక్ష రక్ష జగన్మాత దేవి మంగళ చండికే
హారిక విపతాం రాసేః హర్ష మంగళ కారికే.
హర్ష మంగళ దాక్షిణ్య హర్ష మంగళ దాయికే
శుభమంగళై దాక్షిణ్య శుభమంగళ చండికే.
మంగళం మంగళార్ హోచ సర్వ మంగళ మంగళే
సతాం మంగళతె దేవీం సర్వేషామ్ మంగళాలయే
పూజ్య మంగళవారే మంగళాభీష్టదేవతే
పూజ్యే మంగళ వషస్స మనోవంశస్య సంతతామ్
మంగళాతిష్ఠాత్రు దేవీ మంగళానామ్ చ మంగళే
సంసార మంగళాధారే మోక్ష మంగళ దాయిని
సారేచ మంగళా తారే పారేచ సర్వ కర్మనామ్
ప్రతి మంగళవారేచ పుణ్యే మంగళ సుఖప్రాప్తే.
మంగళ చండి పారాయణం ఎవరు చేయాలి?:-----
దుర్గ కి పార్వతి కి మరో పేరు మంగళ చండిక. చండిక రూపం లో త్రిపురాసుర సంహారం చేసింది. మనువంసపు రాజు అమ్మవారిని పూజ చేసాడు. కుజ దోష పోవాలని అమ్మవారిని పూజ చేస్తాం. కుజుడు సాక్షాతూ అమ్మవారిని పూహ చెస్తడు. అమ్మవారిని పూజ చేయడం వలన కుజ దోష నివారణ జరుగుతుంది.
శత్రువులు పీడ పోవడానికి, ప్రతి ఆడ పిల్ల సుమంగళి గా , కుజుడి వాళ్ళ రోగాలతో బాద పడేవారు, కుజ దోషం ఉన్న వాలు మంగళ చందికి పూజ చేయాలి. కుజ దోషం పోవడానికి , ప్రతి మంగళవారం , మంగళ చండి పారాయణం , మంగళ చండీ స్తోత్రం చదువుకోవాలి. ముత్తయిదువు కి తాంబూలం ఇవ్వాలి. ఉపవాసం చేసి , సాయంత్రం శివాలయానికి వెళ్లి దీపం పెట్టి , 11 ప్రదక్షిణాలు చేసి , నవగ్రహలకి 7 ప్రదక్షిణాలు చేసి ఎవరికైనా పువ్వు , ఫల్లం దానం చేసి , ఇంటికి వచ్చి అప్పుడు భోజనం చేయాలి. ఇలా చేయటం వలన వారికీ సర్వ మంగలాలు జరుగుతాయి.
LIKE US TO FOLLOW:---


No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list