MohanPublications Print Books Online store clik Here Devullu.com

మంత్రపుష్పం Mantrapushpam

మంత్రపుష్పం
Mantrapushpam

మంత్రపుష్పం
మంత్రం అంటే పాముకాటు లేదా తేలుకాటు నివారణకు ఉచ్చరించే పదాలు కావు. క్షుద్రశక్తులు ఉన్నాయని, వాటి నివారణకూ కొన్ని మంత్రాలున్నాయని కొందరు నమ్ముతారు. మరికొందరు నమ్మబలుకుతారు. నిజానికి మంత్రం అనేది పవిత్రమైన ఉచ్చారణ. అది భావగర్భితమైన అక్షరమని శ్రీరామానుజులు వెల్లడించారు.
మంత్రాక్షరాల ఉచ్చారణ వల్ల, పరిసరాల్లో నిర్వచనానికి అందనంతగా ప్రకంపనలు కలుగుతాయని అధర్వ వేదం చెబుతోంది. ‘మన్‌’ అంటే మానసికం, ‘త్ర’ అంటే సాధనం అని వేదవిజ్ఞానం వివరిస్తోంది. విస్తృత అర్థంలో, మంత్రం అనేది మానసిక సాధనం. మంత్రాలన్నీ వేదాల్లోని భాగాలు. యజుర్వేదంలోని వేలాది మంత్రాల సమాహారమే మంత్రపుష్పం!
యజుర్వేదానికి చెందిన తైత్తరీయ ఆరణ్యకంలో మంత్రపుష్పం వివరాలున్నాయి. సర్వసామాన్యంగా యజ్ఞయాగాల సమయంలో మంత్రపుష్పాన్ని చదువుతారు. జీవజాలానికి జలం ఎంత అవసరమో, అది ఎంత పవిత్రమైందో మంత్రం విశదీకరిస్తుంది. నీరు సర్వవ్యాపకమైన మూలకమని మంత్రంలో ఉంది. జలం భగవంతుడితో సమానం. అది జీవరాశులన్నింటినీ పునీతం చేస్తుందంటోంది మంత్రపుష్పం!
నీరు ఇహానికి, పరానికి సంబంధించింది. నదులన్నీ సముద్రంలో కలిసినట్లు, భూమిపై జలాలన్నీ పారమార్థిక జలాల్లో విలీనమవుతాయి. వాటి పరిపూర్ణ జ్ఞానం వల్ల ముక్తి లభిస్తుందన్నది మంత్రపుష్ప సారాంశం.
పరమ పురుషుడే మంత్రపుష్పాన్ని తొలుత ఉచ్చరించాడంటారు. అలా వ్యక్తమైన మంత్రాన్ని సమస్త ప్రాణికోటికి అందించేందుకు ఇంద్రుడు అన్ని వైపులా వ్యాపింపజేశాడట. మోక్షమార్గానికి మంత్రపుష్పాన్ని మించింది లేదని యజుర్వేదం వెల్లడిస్తోంది. అన్ని శుభాల్నీ కలగజేసే శ్రీమన్నారాయణుడికి నమస్కారం అనే శ్లోకపాదం మంత్రపుష్పంలో కనిపిస్తుంది. నారాయణుడే విశ్వానికి జీవనాధారమని, ఆయన మంగళకరుడు, నాశరహితుడని మంత్రపుష్పంలోని మూడో శ్లోకం చెబుతుంది. చీకటివెలుగులు సూర్యుడి వల్ల సంభవిస్తాయి. ఆ సూర్యుణ్ని సృష్టించింది శ్రీమన్నారాయణుడే! అందుకే ‘దైవం పరంజ్యోతి’ అంటారు. ఆయనే పరబ్రహ్మ. ధ్యానం, అది చేసేవాడు- రెండూ నారాయణుడే అని మంత్రపుష్ప సారాంశం.
సూర్య కుటుంబం వంటి సౌర వ్యవస్థలు కోటానుకోట్లు ఉన్నాయని, వాటన్నింటి సమ్మేళనమే బ్రహ్మాండమని, అందులో మన జగత్తు చాలా స్వల్పమైనదని మంత్రపుష్పం తెలియజేస్తుంది. మనిషి తానే శక్తిమంతుడినని భావిస్తాడు. అతడి కంటే భూమి గొప్పది. భూమి కంటే సూర్యకుటుంబం మరెంతో పెద్దది. అలాంటి కుటుంబాలే కోట్లలో ఉన్నాయంటే... బ్రహ్మాండంలో మనిషి స్థానమెంత? పరమాత్మ ముందు మన స్థాయి ఏపాటిదో మంత్రపుష్పం స్పష్టం చేస్తుంది. ఇది తెలుసుకొంటే, మనిషిలోని అహంభావం అంతరిస్తుంది. అహం తొలగిన అందరికీ శ్రీమన్నారాయణుడు భవబంధాల నుంచి విముక్తి కలిగిస్తాడని భక్తులు విశ్వసిస్తారు.
మంత్రపుష్పం ప్రకారం- జఠరాగ్ని మధ్య సూక్ష్మమైన అగ్నిశిఖ పైకి ఎగసి ఉంటుంది. దాని నీలి జ్వాల మధ్య, ఉరుములోని వెలుగురేఖలా అణువుతో సమానంగా మెరుపు ఉంటుంది. అగ్నికి నీరు, నీటికి అగ్ని పరస్పర ఆశ్రయాలు. ఉదజని, ప్రాణవాయువుల కలయికే జలమని విజ్ఞానశాస్త్రమూ వెల్లడిస్తోంది. మానవాళికి సంతోషాన్ని కలగజేసే చంద్రుడే జలస్థానానికి అధిపతి. ఆయన సముద్ర మథనం సందర్భంలో ఉద్భవించాడు. అందుకే జలం చంద్రుడి స్థానం. జలం పుట్టడానికి మేఘమే కారణం. ఆ మేఘాలు నదికి స్థానాలని మంత్రాలు వివరిస్తున్నాయి.
పడవకు నీటికి ఉన్నట్లే, దైవానికి-మనిషికి మధ్య అన్యోన్యత ఉండాలి. సర్వ విద్యలకు, అన్ని జ్ఞానాలకు దేవదేవుడే అధిపతి. ఆకాశం నుంచి పడిన నీరు సముద్రానికి చేరుతుంది. అదేవిధంగా, భక్తులు ఏ దైవానికి నమస్కరించినా, అది కేశవుడికే చెందుతుందని మంత్రం చెబుతోంది. పరబ్రహ్మమే గొప్పవాడని, జగదానంద కారకుడైన ఆ దైవాన్ని స్మరిస్తే అన్ని బంధాల నుంచీ విముక్తి లభిస్తుందని వివరిస్తుంది మంత్రపుష్పం!
- అప్పరుసు రమాకాంతరావు
_____________________________
మంత్రపుష్పం
Page issues
మంత్ర పుష్పం వేదాంతర్గతమైనది. తైత్తిరీయోపనిషత్తు లో మంత్ర పుష్పం, తైత్తిరీయారణ్యకంలో మహా మంత్రపుష్పం ఉన్నాయి. సహస్రశీర్షం దేవం' ఇత్యాది మంత్రాలు మంత్రపుష్పంగానూ, 'యోపాం పుష్పం వేద' ఇత్యాది మంత్రాలు మహా మంత్రపుష్పంగానూ ప్రసిద్ధిచెందాయి.
మననం చేసేవాణ్ణి రక్షించేది మంత్రం. మామూలుగా అయితే పుష్పాలతో దేవున్ని పూజిస్తాము. మంత్రం పఠిస్తూ పుష్పాన్ని సమర్పించడమనీ లేక మంత్రమనే పుష్పాన్ని సమర్పించడమనీ రెండు విధాల అర్ధాన్ని మంత్రపుష్పం అనే మాటకు చెప్పవచ్చును.
ధ్యానం, ఆవాహనం, మొదలైన షోడశోపచారాల పూజలో మంత్రపుష్పం కూడా ఒక అంగము. భగవత్పూజావసానం వంటి మంగళకర సందర్భాలలో మంత్రపుష్పం పఠించాలి.
______________________
మంత్రపుష్పం
యో’‌உపాం పుష్పం వేద’ పుష్ప’వాన్ ప్రజావా”న్ పశుమాన్ భ’వతి | చంద్రమా వా అపాం పుష్పమ్” | పుష్ప’వాన్ ప్రజావా”న్ పశుమాన్ భ’వతి | య ఏవం వేద’ | యో‌உపామాయత’నం వేద’ | ఆయతన’వాన్ భవతి |
అగ్నిర్వా అపామాయత’నమ్ | ఆయత’నవాన్ భవతి | యో”గ్నేరాయత’నం వేద’ | ఆయత’నవాన్ భవతి | ఆపోవా అగ్నేరాయత’నమ్ | ఆయత’నవాన్ భవతి | య ఏవం వేద’ | యో’‌உపామాయత’నం వేద’ | ఆయత’నవాన్ భవతి |
వాయుర్వా అపామాయత’నమ్ | ఆయత’నవాన్ భవతి | యో వాయోరాయత’నం వేద’ | ఆయత’నవాన్ భవతి | ఆపో వై వాయోరాయత’నమ్ | ఆయత’నవాన్ భవతి | య ఏవం వేద’ | యో’‌உపామాయత’నం వేద’ | ఆయత’నవాన్ భవతి |
అసౌ వై తప’న్నపామాయత’నమ్ ఆయత’నవాన్ భవతి | యో’‌உముష్యతప’త ఆయత’నం వేద’ | ఆయత’నవాన్ భవతి | ఆపో’ వా అముష్యతప’త ఆయత’నమ్ |ఆయత’నవాన్ భవతి | య ఏవం వేద’ | యో’‌உపామాయత’నం వేద’ | ఆయత’నవాన్ భవతి |
చంద్రమా వా అపామాయత’నమ్ | ఆయత’నవాన్ భవతి | యః చంద్రమ’స ఆయత’నం వేద’ | ఆయత’నవాన్ భవతి | ఆపో వై చంద్రమ’స ఆయత’నమ్ | ఆయత’నవాన్ భవతి | య ఏవం వేద’ | యో’‌உపామాయత’నం వేద’ | ఆయత’నవాన్ భవతి |
నక్ష్త్ర’త్రాణి వా అపామాయత’నమ్ | ఆయత’నవాన్ భవతి | యో నక్ష్త్ర’త్రాణామాయత’నం వేద’ | ఆయత’నవాన్ భవతి | ఆపో వై నక్ష’త్రాణామాయత’నమ్ | ఆయత’నవాన్ భవతి | య ఏవం వేద’ | యో’‌உపామాయత’నం వేద’ | ఆయత’నవాన్ భవతి |
పర్జన్యో వా అపామాయత’నమ్ | ఆయత’నవాన్ భవతి | యః పర్జన్య’స్యాయత’నం వేద’ | ఆయత’నవాన్ భవతి | ఆపో వై పర్జన్యస్యాయత’నమ్ | ఆయత’నవాన్ భవతి | య ఏవం వేద’ | యో’‌உపామాయత’నం వేద’ | ఆయత’నవాన్ భవతి |
సంవత్సరో వా అపామాయత’నమ్ | ఆయత’నవాన్ భవతి | యః సం’వత్సరస్యాయత’నం వేద’ | ఆయత’నవాన్ భవతి | ఆపో వై సం’వత్సరస్యాయత’నం వేద’ | ఆయత’నవాన్ భవతి | య ఏవం వేద’ | యో”‌உప్సు నావం ప్రతి’ష్ఠితాం వేద’ | ప్రత్యేవ తి’ష్ఠతి |
ఓం రాజాధిరాజాయ’ ప్రసహ్య సాహినే” | నమో’ వయం వై”శ్రవణాయ’ కుర్మహే | స మే కామాన్ కామ కామా’య మహ్యమ్” | కామేశ్వరో వై”శ్రవణో ద’దాతు | కుబేరాయ’ వైశ్రవణాయ’ | మహారాజాయ నమః’ |
ఓం” తద్బ్రహ్మ | ఓం” తద్వాయుః | ఓం” తదాత్మా |
ఓం” తద్సత్యమ్ | ఓం” తత్సర్వమ్” | ఓం” తత్-పురోర్నమః ||
అంతశ్చరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు
త్వం యఙ్ఞస్త్వం వషట్కారస్త్వ-మింద్రస్త్వగ్‍మ్
రుద్రస్త్వం విష్ణుస్త్వం బ్రహ్మత్వం’ ప్రజాపతిః |
త్వం తదాప ఆపో జ్యోతీరసో‌உమృతం బ్రహ్మ భూర్భువస్సువరోమ్ |
ఈశానస్సర్వ విద్యానామీశ్వర స్సర్వభూతానాం
బ్రహ్మాధిపతిర్-బ్రహ్మణో‌உధిపతిర్-బ్రహ్మా శివో మే అస్తు సదా శివోమ్ |
తద్విష్నోః పరమం పదగ్‍మ్ సదా పశ్యంతి
సూరయః దివీవచక్షు రాతతం తద్వి ప్రాసో
విపస్యవో జాగృహాన్ సత్సమింధతే
తద్విష్నోర్య-త్పరమం పదమ్ |
ఋతగ్‍మ్ సత్యం ప’రం బ్రహ్మ పురుషం’ కృష్ణపింగ’లమ్ |
ఊర్ధ్వరే’తం వి’రూపా’క్షం విశ్వరూ’పాయ వై నమో నమః’ ||
ఓం నారాయణాయ’ విద్మహే’ వాసుదేవాయ’ ధీమహి |
తన్నో’ విష్ణుః ప్రచోదయా”త్ ||
ఓం శాంతిః శాంతిః శాంతిః’ |


No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list