వివాహం ఆలస్యం
Marriage Is Going Late
వివాహం ఆలస్యం.....
వివాహం: వివాహం ఆలస్యం, ప్రయత్నాలలో చికాకులు
విషయంగా రవితో సంబంధం అయిన సందర్భంలో శివ కల్యాణం చేయించడం, నిత్యం శివాలయంలో శివారాధన చేయడం.
విషయంగా రవితో సంబంధం అయిన సందర్భంలో శివ కల్యాణం చేయించడం, నిత్యం శివాలయంలో శివారాధన చేయడం.
చంద్రుడితో దోషం వున్నప్పుడు గిరిజా కళ్యాణం చేయించడం .
కుజుడు దోషం ఉన్నప్పుడుసుబ్రహ్మణ్య పూజలు చేయడం.
బుధ గ్రహంతో దోషం వున్నప్పుడు రుక్మిణీ కళ్యాణం ఘట్టం రోజూ పారాయణ చేయడం అలాగే కుదిరినప్పుడు శ్రీనివాస కళ్యాణం చేయించడం.
గురువుతో వివాహ విషయమై దోషం వున్నప్పుడు శివ కల్యాణం చేయించి పంచాక్షరీ మంత్రానుష్ఠానం చేయించడం.
శుక్ర సంబంధమయిన దోషంతో వివాహ ప్రతిబంధకాలు వున్నవారు రుక్మిణీ కళ్యాణం పారాయణ చేయడం లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం పారాయణ చేయడం అవసరం.
శని దోషంగా ఉండి వివాహ విషయంగా ప్రతిబంధకాలు ఉన్నప్పుడు శివ కళ్యాణం చేయించి నిత్యం రామనామం చెబుతూ ఆంజనేయ స్వామికి 108 ప్రదక్షిణలు చేయడం.
రాహువుతో వివాహ విషయంగా ప్రతిబంధకాలు వున్నప్పుడు పార్వతీ కళ్యాణం చేయించి రోజూ దుర్గా సప్తశ్లోకా పారాయణ మరియు లలితా సహస్ర పారాయణ చేయడం.
కేతువుతో దోషం చెప్పబడినప్పుడు విఘ్నేశ్వరుడికి చతురావృత్తి తర్పణాలు చేయించి నిత్యం లక్ష్మీ నృసింహ స్తోత్ర పారాయణ చేయడం శ్రేయస్కరం. అయితే ఏ గ్రహ సంబంధమయిన దోషం వున్నా ‘కన్యాపాశుపతం’ చేయిస్తారు.
వైదికమగు మూలమంత్రములు, బీజాక్షరములలో నమక, చమకములను సంయోగపరచి పశుపతికి అభిషేక, హొమాదులు చేయుటయే పాశుపత మనబడును. ఈ విధముగా చేసిన వారికి అనంత ఫలమును పొందవచ్చును. మహర్షులు వచించిన పాశుపత విధానములను ఈ క్రింద విశదపరచడమైనది. ఇవి 350 విధానములు కలవు. చాలా కాలము వివాహము కాక కన్యకై ఎదురు చూచుచున్న పురుషునకు శీఘ్రమే వివాహము అగుయోగ్యత కలుగుట తధ్యము. ఈ విధానము నందు మూల మంత్రమును నమ్మకముతో సంపుటి చేసి రుద్రాభిషేకము చేసిన ఆ స్వామి కటాక్షము వలన అనతి కాలంలో వివాహయోగ్యత కలుగుట తధ్యము.
LIKE US TO FOLLOW: ---
GIRIJA KALYANAM
ReplyDelete