పెళ్లి కాబోతున్న ప్రతి తనయునికి తల్లి చెప్పించవలసినది
Marriage Tips For boy
పెళ్లి కాబోతున్న ప్రతి తనయునికి తల్లి చెప్పించవలసినది....
చాలకాలముగా మనం అమ్మాయికి మట్టుకే బుద్ది చెప్పి పంపుతాము కదా అయితే అబ్బాయిలు ఎలా ఉంటున్నారని మనం యోచించడం లేదు. తల్లి కొడుకుకు చెప్పవలసిన ముఖ్యమైన ఐదు విషయములు......
౧. ఏ సమయములోను తల్లితో భార్యను పోల్చకూడదు. తల్లి వేరే భార్య వేరే నీ తల్లికి ఇరవై యేండ్ల అనుభవం వుంది కాని నీ భార్య నేను నిన్ను పెంచిన విధముగానే తనను అల్లారుముద్దుగా అరచేతిలోపెట్టుకొని పెంచివుండును తనకు కొంచం అవకాశం ఇవ్వడం నీ కర్తవ్యం తర్వాత ఒక గొప్ప శ్రేష్టమైన ప్రేమమూర్తి ఐన తల్లిగా నీ బిడ్డకు వుంటుంది.
౨. భార్య నీకు తల్లి కాదు ఒక సఖి స్నేహితురాలు తాను అందరిని వదలుకొని నీతో జీవితం పంచుకోవడానికి వచ్చింది. నీ తల్లికి నిన్ను పోషించడం మాట్టుకే ముఖ్యం కాని నీకు నీ భార్య ఆలనా పాలనా ముఖ్యం మీ ఇద్దరు అన్యోన్యముగా వుండడం చాల ముఖ్యం
౩ గౌరవార్హురాలు నీ భార్య నీ జేవితంలో ఒడుదుడుకులు తారతమ్యములు అన్నిటిలోనూ పాలుపంచుకొనే వ్యక్తీ. నీ ప్రతి అడుగులోనూ తన సహాయ సహకారములు ప్రేమానురాగాములు పంచె వ్యక్తీ తనతో ఏది దాచకూడదు. దాంపత్యములో దాచుకోవడం స్వార్థం చాల తప్పు. తనతో కలిసి తన అభిప్రాయములు తెలుసుకొని ఏకీభవించి పయనిమ్చడమే సుఖ సంతోషమైన దాంపత్యము
౪. మెట్టినింటికి వచ్చిన భార్యకు సహజముగా ఉండడానికి నువ్వు సహకరించవలెను. పుట్టినింటిని తోబుట్టువులను తల్లి తండ్రులను గోత్రమును పారంపర్యమును వదలుకొని నిన్ను మట్టుకే నమ్ముకొని వచ్చినది. చిన్న చిన్న వ్యవహారములకు తనకు సంకటమునకు గురిచేయవచ్చు నువ్వు మట్టుకే తనను గమనించి తాను పుట్టినింట వుండిన సుఖ సంతోషములను పొందేటట్టు చేయవలయును
౫. భార్యను ఎప్పుడు ప్రేమించావలయును ప్రేమించడానికి వయస్సుకు ఒక పరిమితిలేదు పత్నిని సంతోషముగా వుంచుకోవలెను . మీ ఇద్దరినీ ప్రేమానురాగములతో వర్ధ్దిలేటట్టు చేసును.
అతి ముఖ్యమైనది గుర్తుంచుకో మీ నాన్న నన్ను ఎలా గౌరవ మర్యాదలతో ప్రేమానురాగాలతో సుఖ సంతోషములతో నడిపించుతున్నారో నువ్వుకూడా నీ భార్యను గౌరవ మర్యాదలతో ప్రేమానురాగాలతో సుఖసంతోషములతో అరమరికలులేని జీవితం గడిపి మన వంశం వృద్ధిలోకి తెచ్చి గొప్పగా వుండాలి.
LIKE US TO FOLLOW: ---
Location: Mohan Publications Door No 29-6-1A, opp:ajana hotel, Kotagummam Rajahmundry, 533101, Cell: 9032462565, Andhra Pradesh,
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565