రహస్య కెమెరాలు ఉంటాయి తస్మాత్ జాగ్రత్త
Please BeCareful CC Cameras are there
రహస్య కెమెరాలు ఉంటాయి తస్మాత్ జాగ్రత్త
షాపింగ్ మాల్స్,వస్త్రాల షోరూముల్లో మీరు షాపింగ్ చేసే ఉంటారు. అక్కడ ఉన్న ట్రయల్ రూముల్లో బట్టలు మార్చుకునే ముందు ఒక సారి ఆలోచించండి. ఒక చేంజింగ్ రూం లోకి వెళ్ల గానే అక్కడ ఎలక్ట్రిక్ బల్బు తాలూకు ఖాళీ హోల్డర్ కనిపించినా,పై కప్పు మూలల్లో అనుమానిత కారణాలు అంటే రంద్రాలు ఉండటం గానీ,అక్కడ చిన్న బాక్స్ లాంటిది ఉండటం గానీ ఉంటే మీరక్కడ దుస్తులు మార్చుకోవద్దు.అంతే కాదు అక్కడ ఉన్న అద్దం మీద మీ వేళినుంచండి అది మామూలు అద్దం అయితే మీ రిఫ్లెక్షన్ కీ మీ వేళికీ మధ్య కొంత గ్యాప్ ఉంటుంది అదే టూఊవే మిర్రర్ అయితే ఆ గ్యాప్ కనిపించదు.
షాపింగ్ చేసే మహిళల సౌకర్యం కోసం, కొనుగోలు చేసిన వస్త్రాలను ట్రై చేసి చూసేందుకు షాపింగ్‌మాల్స్‌లలో డ్రెస్సింగ్ రూములు ఏర్పాటు చేస్తున్నారు. సౌకర్యం వరకు బాగానే వున్నా డ్రెస్సింగ్‌రూంలు అంత శ్రేయస్కరం కాదంటున్నారు పోలీసులు. అ గదులలో దుకాణాదారులు అత్యంత రహస్యంగా కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు పోలీసు గతంలో ఎన్నో సార్లు హెచ్చరికలు కూడా చేశారు.దేశ రాజధాని ఢిల్లీలో ఇటీవల ఇటువంటి సంఘటనలు చాలా ఎక్కువగా చోటు చేసుకున్నట్లు వారు చెబుతున్నారు. మహిళలు దుస్తులు మార్చుకునే సమయంలో రహస్య కెమెరాలతో తిలకించడంతో పాటు రికార్డు కూడా చేస్తున్నారని చెబుతున్నారు. ఇటువంటి చోట్ల కాస్త జాగరూకులై వుండాలని వారు హెచ్చరిస్తున్నారు.
మీరు షాపింగ్ చేసే సమయంలో షాపింగ్‌మాల్స్, షోరూంలు, వ స్త్ర దుకాణాల్లో దుస్తులు మార్చుకునే సౌకర్యం ఉండే గదుల్లో అద్దాల వెనక రహస్య కెమెరాలను ఏర్పాటు చేశారేమోనని ఓసారి పరికించి చూడాలంటున్నారు.రెస్టారెంట్ లేదా హోటల్‌లో చేతులు కడుక్కునే వాష్‌బేసిన్‌వద్ద, మహిళల మరుగుదొడ్లలో కంటి కి కనపడకుండా ఉండేలా రహస్య కెమెరాలుండవచ్చు.ప్రత్యేకంగా మహిళల కోస మే గదులు కేటాయించిన సమయంలో అక్కడ ఇలాంటి రహస్య కెమెరాలుండే అవకాశా లుండవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
కనుక తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.మహిళలు షాపింగ్ చేసే సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలుమీరు షాపింగ్ చేసే సందర్భంలో దుస్తులు మార్చుకునే గదికి వెళి తే దుస్తులు మార్చుకునే ముందు అక్కడి తలుపులు, గోడలు, అద్దం తదితర ప్రాంతాల్లో ఎక్కడైనా రహస్య కెమెరాలు న్నాయోమో చూసుకోండి. మీకు సంబంధించని వస్తువు ఏదైనా ఉంటే జాగ్రత్తగా వ్యవహరించండి.దుస్తులు మార్చుకునే గది చిన్నదిగా ఉంటే మీరు గదిలోకి వెళ్ల గానే లైట్లను ఆర్పేయండి.దుస్తులు మార్చుకున్న తర్వాత మళ్లీ లై ట్లు వేసుకోవచ్చు. కాని చీకట్లోను రికార్డు చేసే కెమెరాలున్నాయి. అందుకే జాగ్రత్తగా ఉండేందుకు ప్రయత్నించాలి. డ్రెసింగ్ రూం లేదా రెస్ట్ రూంలో గోడలు, అద్దం వద్ద ఏదైనా నల్లటి చుక్క లేదా చిన్న లైటుంటే మీరు జాగ్త్రత్తగా ఉండేందుకు వీలై నంత వరకు చూడాలి.
టార్చ్ టెస్ట్ : రెండు వైపులా ఎదురెదురుగా ఉన్న అద్దాలలో మిమ్మల్ని ఎవరైనా గమనిస్తున్నారా? లేక ఆ రూంలొ కెమెరాలు ఏవైనా ఉన్నాయా? అని తెలియాలి అంటే ట్రయల్ రూం ప్రకాశవంతంగాఉండి, పక్కనే ఉన్న మరో ట్రయల్ రూం డార్క్‌గా ఉంటే వెంటనే టార్చ్ లైట్ వేసి ఎదురుగా ఉన్న మిర్రర్‌పై లైట్ వేస్తూ, ఈ మిర్రర్‌పై టార్చ్ లైట్ వేస్తూ, ఆ మిర్రర్ గుండా చూడండి. ఆ ఫ్లాష్ ద్వారా తెలుస్తుంది. అటువైపు ఎవరైనా ఉన్నది, కెమెరాలు ఉన్నాయా? లేదా అన్నది.
డ్రస్సింగ్ రూంలోకి ఫోన్ తీసుకొని వెళ్ళడం ద్వారా కూడా కెమెరాను కనిపెట్టవచ్చు. ఫోన్ చేసినప్పుడు ఆయా ప్రదేశాలలో బజ్... అనే శబ్దం వస్తుంది. ఎందుకంటే ఎలక్ట్రానిక్ పరికరాలలోని అయస్కాంతం ధ్వని తరంగాలను ఆకర్షించుకుంటుంది. కాబట్టి దాన్ని పరీక్షించడం ఉత్తమం. ఇలా అన్నీ ఫోన్‌లు పనిచేస్తాయని కూడా చెప్పలేం.
అద్దం షాపింగ్‌మాల్స్‌లలో ఏర్పాటు చేసే అద్దాలు కూడా మనల్ని మోసం చేసే అవకాశాలున్నాయి. అవి చూడడానికి మాములు అ ద్దాలలాగే ఉన్న వాటివెనుక రహస్యకెమెరా ఉందేమో చూసుకోండి. అద్దం సాధారణంగానే కనపడుతుంది. కాని మరోవైపు మిమ్మల్ని పసి గడుతుంది. దీనికి మీరు చేయా ల్సిందల్లా ఒక్కటే మీ చేతి కొనను అద్దంపై ఉంచండి. మీ వేలు నీడ అద్దంపై పడితే లేదా అద్దంపై ఏ మాత్రం గ్యాప్ ఉన్న అది మంచి అద్దంగానే భావించవచ్చు. దీంతో మీకు ఎలాంటి ఇబ్బందులుండవు. కాని మీవేలికి అద్దానికి మధ్యలో దూరం లేకపోతే జాగ్రత్త వహించండి. ఆ అద్దం వెనక రహస్య కెమెరా ఉండోచ్చు. కనుక మహిళలు షాపింగ్ చేసేటపుడు తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు అలాంటి విషయాలు దృష్టికి వస్తే పోలీ సులకు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరుతున్నారు.
LIKE US TO FOLLOW: ---
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565