MohanPublications Print Books Online store clik Here Devullu.com

దానిమ్మతో ఎవర్‌గ్రీన్‌, Promogranite is ever Green

దానిమ్మతో ఎవర్‌గ్రీన్‌(Promogranite is ever Green)


+++++++దానిమ్మతో ఎవర్‌గ్రీన్‌++++++++
ఫలరాజు కాకపోయినా దానిమ్మపండును చూడగానే నోరూరుతుంది. కెంపుల్లా మెరిసిపోయే దానిమ్మ గింజల్లో పోషకాలు కోకొల్లలు. ఈ పండు వృద్ధాప్యాన్ని దరి చేరనీయదని ఓ పరిశోధనలో తేలింది.
కండరాల్లోని కణాలు బలహీనం కావడమే వయసు పైబడేలా చేస్తుంది. దానిమ్మ గింజల్లోని అణువులు ఈ కణాలను శక్తివంతంగా చేస్తాయి. దీంతో శరీరంలో సత్తువ పెరిగి వార్ధక్యం ఆలస్యంగా పలకరిస్తుంది.
శరీరంలోని కణాలు శక్తిని పుంజుకోవడానికి ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తుంటాయి. ఈ ప్రక్రియలో కణాల్లో మైటోకాండ్రియా పేరుకుపోతుంది. ఫలితంగా వయసు పైబడుతుంటుంది.
శరీరానికి ఉపయోగపడని మైటోకాండ్రియా ఊరికే ఉండకుండా.. దుష్ప్రభావాలకు కారణం అవుతుంటుంది. వయసును వేగంగా పెంచడంతో పాటు పార్కిన్‌సన్‌ వంటి వ్యాధులకు దారితీస్తుంది.
ఈ కణాలు హీన దశకు వచ్చేసరికి కళ్ల కింద ముడతలు రావడం, బుగ్గలు జారిపోవడం, కండరాల్లో పటుత్వం తగ్గడం.. ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి. నలభైలోనే అరవై ఛాయలు కనిపిస్తాయి.
దానిమ్మను తీసుకోవడం వల్ల ఈ మైటోకాండ్రియా తగ్గుతుంది. తద్వారా కణాలు ఉత్తేజితం అవుతాయి. వయసు వేగం మందగిస్తుంది. ఈ విషయాన్ని ఎలుకలపై ప్రయోగించి శాస్త్రవేత్తలు నిర్ధారించారు.
దాదాపు రెండేళ్ల వయసున్న ఎలుకకు దానిమ్మ గింజలు తినిపించారు. కొన్నాళ్లకు ఆ ఎలుక గతంలో కంటే ఉత్సాహంగా కనిపించిందట. అదే వయసున్న మిగతా ఎలుకల పరుగుతో పోలిస్తే ఈ ఎలుక 42 శాతం వేగంగా పరిగెత్తడాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు.
దానిమ్మ గింజల్లో శరీరాన్ని ఉత్తేజపరిచే మాయా కణాలంటూ ఏమీ ఉండవు. పేగుల్లోని సూక్ష్మజీవులు దానిమ్మలోని పోషకాలను యూరోలిథిన్‌-ఏగా మారుస్తాయి. ఫలితంగా వయసు పునరుత్తేజితం అవుతుంది.
ఎలుకలపై పరిశోధనలు జరిపిన శాస్త్రవేత్తలు మనుషులపై ఈ ప్రయోగానికి సన్నద్ధం అవుతున్నారు.
వంద గ్రాముల గింజల్లో
కెలోరీలు 83
కొవ్వు - 1 శాతం, సోడియం - 3 మి.గ్రా
పొటాషియం - 236 మి.గ్రా
కార్బోహైడ్రేట్స్‌ - 19 గ్రా, ఫైబర్‌ - 4గ్రా
షుగర్‌ - 14 గ్రా, ప్రొటీన్‌ - 1.7 గ్రా
విటమిన్‌ సి - 17 శాతం
విటమిన్‌ బి-6 - 5 శాతం
మెగ్నీషియం - 3 శాతం
సాగు భళా
భారతదేశంలో ఏటా సుమారు 740 వేల టన్నుల దానిమ్మ ఉత్పత్తి అవుతోంది. దానిమ్మ తోటలు మహారాష్ట్రలో విస్తృతంగా ఉన్నాయి. కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, గుజరాత, తమిళనాడు రాషా్ట్రల్లోనూ దానిమ్మ సాగు ఆశాజనకంగా ఉంది. అంతర్జాతీయంగా స్పెయిన్‌, ఆఫ్రికా దేశాలు, తూర్పు ఆసియా దేశాలు, యూఎ్‌సఏలో దానిమ్మ ఎక్కువగా ఉత్పత్తి అవుతోంది.
అదనపు లాభాలు
దానిమ్మలోని విటమిన్‌ సి, పొటాషియం అలసటను తగ్గిస్తాయి.
ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.
దంత సమస్యలను కూడా దానిమ్మ దూరం చేస్తుంది.
దానిమ్మ రసం తీసుకోవడం వల్ల గుండె పనితీరు మెరుగవుతుంది. కేన్సర్‌ రిస్క్‌ను తగ్గిస్తుంది.
దానిమ్మ జ్యూస్‌తో కాలేయంలోని మలినాలు పోతాయి.
సౌందర్య సాధనాల్లోనూ దానిమ్మను విస్తృతంగా వాడుతుంటారు.


--------------------------LIKE US TO FOLLOW:---------------------

www.mohanpublications.com


No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list