అన్నప్రాశన
Anna Prasana
అన్నప్రాశన
అన్నప్రాశన ఆరో నెల ఆరవ రోజున చేయటం ఆచారం. ఆ రోజు చేసేప్పుడు ముహూర్తం అన్వేషణతో పని లేదు అని ఒక పెద్ద వాదన సంఘంలో ఉంది. అది చాలా తప్పు. ఆరవ నెల ఆరవ రోజు, అమావాస్య కానీ, మంగళవారం కానీ గ్రహణం కానీ వస్తే అన్నప్రాశన చేస్తామా? కేవలం మూఢమి పట్టింపు లేదు అన్నారు కానీ ముహూర్త పట్టింపు లేదు అనే వాదన చాలా దోష వాదన.
అన్నప్రాశన ముహూర్త ప్రభావం పిల్లవాడి జీవిత ఆరోగ్య విషయాల మీద ఆధారపడి ఉంటుంది. అందువలన తప్పకుండా మంచి ముహూర్తానికే అన్నప్రాశన చేయాలి.
మగ పిల్లలకు ఆరు లేక ఎనిమిది లేక పది నెలలు నిండిన తర్వాత గానీ, సంవత్సరం నిండిన తర్వాత గానీ శుక్లపక్షమునందు శుక్రుడు ఆకాశమందు పరిశుద్ధుడై ప్రకాశించుచున్నపుడు అన్నప్రాసనము చేయవలెనని ఋషులచే చెప్పబడినది.(ముహూర్త దర్పణం).
‘షష్ఠేష్టమేవా దశమే చ మాసి సంవత్సరేవా దివసే ప్రవృద్దే’ శిశువు జననం మొదలుగా ఆరు, ఎనిమిది, పది, పన్నెండు మాసాలలో మంచి రోజులు అన్నప్రాశన చేయమని చెప్పారు.
ఆడ పిల్లకు "స్త్రీణాంతు పంచమాది విషమే మాసే పంచమ సప్తమ నవమైకాదశేషు విషమేషు శుభదం” అని కాలామృతం నందు వున్నది. స్త్రీలకు బేసి మాసములో అనగా ఐదు,ఏడు,తొమ్మిది మాసములలో అన్నప్రాసన చేయవలెను.
వృషభ,కర్కాటక,మిధున,కన్య,దనస్సు,మీనములనెడి,శుభలగ్నమందు,పాడ్యమి,చవితి,షష్థి,అష్టమి,నవమి,ఏకాదశి,ద్వాదశి,అమావాస్య,పున్నమి ఈ దినములు నిషేదించి మిగిలిన తిధులయందు అన్నప్రాశన మంచిది.పునర్వసు, మృగశిర, ధనిష్ఠ, పుష్యమి, హస్త, స్వాతి, అశ్వినీ, అనురాధ, శ్రవణం, శతభిషం, ఉత్తర, ఉత్తరాషాఢ, ఉత్తరాభాద్ర, చిత్త నక్షత్రములు వున్న సమయంలో ‘వారాశ్శుభాశ్చ గురు చంద్ర సితేందు జానాం’ శుభ గ్రహ వారములయిన సోమ, బుధ, గురు, శుక్ర వారములు, తప్పనిసరి అయితే శని ఆదివారములలో చెయ్యవచ్చు.
‘దశమే శుద్ధి సంయుక్తే శుభ లగ్నే శుభాంశనే’ లగ్నాత్ దశమ స్థానం శుద్ధి, అష్టమ స్థానం శుద్ధి చూడాలి .శుద్ది అంటే దశమంలో,అష్టమంలో గ్రహాలు లేకుండుట.కొంతమంది దశమం,అష్టమంలో పాపగ్రహలు ఉండరాదు.శుభగ్రహాలు ఉండచ్చు అని అంటారు. . లగ్నాత్ నవమంలో బుధుడు, అష్టమంలో కుజుడు సప్తమంలో శుక్రుడు లేకుండా ముహూర్తం చూడమన్నారు .
అన్నప్రాశ లగ్నంలో రవి ఉన్న యెడల కుష్ఠు రోగి గాను,క్షీణ చంద్రుడు ఉన్న దరిద్రుడి గాను,పూర్ణ చంద్రుడు ఉన్న అన్నదాత గాను,కుజుడున్న పైత్యా రోగి గాను,బుద్ధుడున్న విశేష జ్ఞాన వంతుడిగాను,గురువున్న భోగ మంతుడుగాను,శుక్రుడున్న దీర్ఘాయువు గలవాడు గాను,శని ఉన్న వాత రోగము కల వాడు గాను,రాహు కేతువులు ఉన్న దరిద్రుడు అగును అని కాలామృత గ్రంధం నందు వివరించబడినది.
ముహూర్త సమయానికి వున్న లగ్నానికి పాపగ్రహ సంబంధం లేకుండా చూసి ముహూర్తం చేయమని, అన్నప్రాశన చేయమని జ్యోతిశ్శాస్తవ్రేత్తలు అందరూ చెబుతారు.
------------------------------------
------------------------------------
అన్నప్రాసన పుట్టిన బిడ్డకు తొలిసారిగా అన్నం తినిపించే ఒక కార్యక్రమం. ఇది తెలుగువారి లోగిళ్ళలో కనిపించే ఒక కార్యక్రమం. ఈ సంస్కారం వలన శిశువుకు ఆయువు, ఆరోగ్యం, తేజస్సు వృద్ధి చెందుతాయని ప్రజలు విశ్వసిస్తారు.
విధానం
పిల్లలకు ఆరు లేక ఎనిమిది లేక పది నెలలు నిండిన తర్వాత గానీ, సంవత్సరం నిండిన తర్వాత గానీ శుక్లపక్షమునందు శుక్రుడు ఆకాశమందు పరిశుద్ధుడై ప్రకాశించుచున్నపుడు అన్నప్రాసనము చేయవలెనని ఋషులచే చెప్పబడినది(ముహూర్త దర్పణం). అన్నప్రాసన మగపిల్లలకు సరినెలలలోను, ఆడపిల్లలకు బేసి నెలలలోను చేయుట లోకాచారముగానున్నది. అన్నప్రాసన పూర్వాహ్ణమందు మాత్రమే చేయవలెను. బిడ్డ తల్లిదండ్రులు తూర్పుముఖంగా చాప మీద కూర్చుని బిడ్డను తల్లి ఒడిలో కూర్చోబెట్టుకోవాలి. ముందు విఘ్నేశ్వర పూజ చేయాలి. బంగారు గిన్నెలోగానీ, వెండి గిన్నె లేదా కంచంలోగానీ పాయసం, తేనె, పెరుగుల మిశ్రమాన్ని కలిపి, తండ్రి బంగారు ఉంగరాన్ని పాయసంలో ముంచి దాన్ని బిడ్డకు తినిపించాలి. ఉంగరంతో మూడుసార్లు తినిపించాక చేత్తో పెట్టాలి. ఈ విధంగా అన్నప్రాసన కార్యక్రమం జరపాలి.
జీవికా పరీక్ష
అన్నప్రాశన సమయంలో దైవ సన్నిధిలో నగలు, డబ్బు, పుస్తకము, కలము, ఆయుధము, పూలు మొదలైన వస్తువులు ఉంచి శిశువును వాటి దగ్గర వదులుతారు. శిశువు మొదటిసారిగా ఏ వస్తువు తాకునో ఆ వస్తువుతో సంబంధమైన జీవనోపాధి ఆ శిశువుకు ఉంటుందని భావన. అన్నప్రాశన దైవ సన్నిధిలో చేయాలి. ముందుగా సత్యనారాయణ స్వామి వ్రతం జరిపి ఆ స్వామి సన్నిధిలో అన్నప్రాశన చేయాలి. భార్యా భార్తలు తూర్పు ముఖంగా కూర్చుని, బిడ్డను తల్లి ఒడిలో కూర్చుండబెట్టాలి. వెండితో కానీ, కంచుతో కానీ చేసిన పాత్రలో పాయసముంచి, అందులో కొద్దిగా నెయ్యి, తేనె వేసి ముందుగా తండ్రి మూడు సార్లు బంగారపు ఉంగరంతో పాయసం తీసి శిశువుకు పెట్టాలి. తరువాత తల్లి కూడా అదేవిధంగా పెట్టాలి. తరువాత మేనమామ తదితరులు పెట్టాలి.
శుభ ఘడియలు
ఈ కార్యక్రమం జరపడానికి సాధారణంగా క్రింది పేర్కొన్న నియమాలు పాటిస్తారు. తిధులు: విదియ, తదియ, పంచమి, సప్తమి, దశమి, త్రయోదశి మరియు చతుర్దశి. వారములు: సోమ, బుధ, గురు మరియు శుక్ర నక్షత్రములు: ఆస్వని, రోహిణి, మృగశిర, పునర్వసు, పుష్యమి, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, అనూరాధ, ఉత్తరాషాడ, శ్రవణం, ధనిష్టం, శతభిషం, ఉత్తరాబాధ్ర మరియు రేవతి. లగ్నములు: వృషభ, మిథున, కర్కాటక, కన్య, తుల, ధనుస్సు మరియు మీన లగ్నాలు. దశమ స్థానంలో ఏ గ్రహాలూ ఉండకూడదు. ముహూర్త సమయాన బుధ, కుజ, శుక్ర గ్రహాలు ఒక వరసలో ఉండకూడదు. గ్రహదోషములు: లగ్నంలో రవి ఉండకూడదు. అలా ఉంటే ఆ బిడ్డకు కుష్టు రోగము వచ్చే అవకాశం కలదు. క్షీణ చంద్రుడుంటే దరిద్రుడు అవుతాడు. కుజుడుంటే పైత్య రోగి, శని ఉన్నచో వాత రోగి, రాహుకేతువులున్నచో మిక్కిలి దరిద్రుడు అవుతాడు. శుభ గ్రహములు: లగ్నంలో పూర్ణ చంద్రుడుంటే అన్నదాత అవుతాడు. బుధుడుంటే విశేష జ్ఞానాంతుడు, గురుడుంటే భోగి, శుక్రుడుంటే దీర్ఘాయువు కలవాడు అవుతాడు. అన్నప్రాశన కాలం: 6 నుంచి 12 నెలలలోపు ఎప్పుడైననూ చేయవచ్చు. అయితే శుక్లపక్షంలో శుక్రుడు ఆకాశంలో పరిశుద్ధుడై ప్రకాశిస్తున్నప్పుడు అన్నప్రాశన చేయాలి. మగ పిల్లలకు సరి నెలలలోనూ, ఆడ పిల్లలకు బేసి నెలలలోనూ చేయాలి. దీనిని పూర్ణాహ్వమందు మాత్రమే చేయాలి.
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565