నీరసం తగ్గించే నేరేడు పండ్లు
Apricot
+++++++నీరసం తగ్గించే నేరేడు పండ్లు++++++++
నేరేడుపండ్లు ప్రస్తుతం మార్కెట్‌లో విరివిగా దొరుకుతున్నాయి. నిగనిగలాడుతూ..నోరూరించే వీటిని ప్రతిరోజూ తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. వాటివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసా...
1. నేరేడు పండ్లు నుంచి క్యాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్, సోడియం, విటమిన్ సి, థయామిన్, ఫోలిక్ యాసిడ్, పీచు, ప్రొటీన్లు, కెరొటిన్లు లభిస్తాయి.
2. మధుమేహం ఉన్నవారికి నేరేడు పండ్లు ఎంతో మేలు చేస్తాయి. వీటిని తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయులు అదుపులోకి వస్తాయి. ఇందులోని పోషకాలు గ్లైసమిక్ ఇండెక్స్ శాతాన్ని సమతుల్యం చేస్తాయి. వీటిలోని సుగుణాలు.. జీర్ణవ్యవస్థకు ఎంతో మేలు చేకూరుస్తాయి. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపుతాయి. రక్తశుద్ధీ జరుగుతుంది.
3. రక్తహీనత సమస్య ఎదుర్కొంటున్న వారు ఈ పండును ఎంతŒ తింటే అంత మంచిది. నెలసరి సమయంలో బాగా నీరసపడిపోయే అమ్మాయిలు వీటిని తీసుకోవడం వల్ల తక్షణ శక్తి అందుతుంది. శరీరానికి సరిపడా ఇనుము అందుతుంది.
4. వందగ్రాముల నేరేడు పండ్లలో యాభై ఐదు శాతం పొటాషియం ఉంటుంది. గుండె, మధుమేహం, రక్తపోటు ఉన్నవారు ఒక పండు తింటే సరిపోతుంది. అరుగుదల సరిగా లేనప్పుడు కప్పు పెరుగులో నాలుగు చెంచాల నేరేడు పండు రసం కలిపి తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది.
5. చిగుళ్ల నుంచి రక్తం కారడం, దంతాలు పుచ్చిపోవడం.. దుర్వాసన రావడం వంటి సమస్యలకు నేరేడు పండ్లు చక్కటి పరిష్కారం. వీటిని నమిలినప్పుడు పులుపూ, తీపి, వగరు కలబోతగా ఉండే రసం బ్యాక్టీరియాలను దూరం చేస్తుంది. నోటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
6. ఈ కాలంలో రోగనిరోధక శక్తి చాలా అవసరం ఈ పండు తీసుకోవడం వల్ల విటమిన్ సి అంది.. రోగనిరోధకశక్తి పెరుగుతుంది.
7. నేరేడు పండ్లను ఎట్టి పరిస్థితుల్లో పరగడుపున తీసుకోకూడదు. తప్పనిసరిగా ఏదన్నా తిన్నాకే స్వీకరించాలి. ఇక శస్త్రచికిత్సలు చేయించుకున్నవారు వైద్యుల సలహాలతో వీటిని తినవచ్చు.

LIKE US TO FOLLOW: ---
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565