వారం రోజుల్లో… బరువు తగ్గించుకోవడం ఎలా
Weight loss in a Week
వారం రోజుల్లో…
బరువు
తగ్గించుకోవడం ఎలా? (Tips)
బరువు
తగ్గించుకోవడం ఎలా? (Tips)
మొదటిరోజు: మొదటిరోజున అరటిపండు తప్ప అన్నిరకాల తాజా పళ్ళు మీ ఆహారం గా తీసుకోఅవాలి. మీకు నచ్చిన అన్నిరకాల పండ్లను తినొచ్చు. ప్రత్యేకించి పుచ్చకాయలు, కిరిణికాయలు (కడప దోసకాయలు) ఎక్కువ తింటే మంచిది. పరిమితి ఏమీ లేదు. మీకు ఎంత తినాలనిపిస్తే అంత తినొచ్చు. పళ్ళను ఆహారంగా తీసుకోవటంవల్ల రాబోయే ఆరు రోజులకు మీ శరీరాన్ని, జీర్ణవ్యవస్థను సిద్ధ పరుస్తున్నట్టు అర్థం.
రెండవరోజు: రెండవరోజున ఆహారం కేవలం కూరగాయలు మాత్రమే తినాలిసి ఉంటుంది. బ్రేక్‌ఫాస్ట్‌గా ఒక పెద్ద బంగాళదుంపను ఉడికించి తినటం ద్వారా ఈ రోజును మొదలుపెట్టంది. తరువాత బంగాళా దుంప తినొద్దు. మిగతా కూరగాయలు పచ్చివి కాని, ఉడికించినవి కాని తినొచ్చు. ఉప్పు, కారం మీ ఇష్టం. నూనె మాత్రం వాడకూడదు. మీకు నచ్చినంత తినవచ్చు.
మూడవ రోజు: మూడవ రోజున అరటిపండు, బంగాళాదుపం తప్ప మిగిలిన పళ్లు, కూరగాయలు కలిపి తీసుకోవచ్చు. మీకు కావలసినంత తినవచ్చు ఇప్పటి నుండి మీ శరీరంలో అదనపు కొవ్వు విలువలు కరగటం ప్రారంభం అవుతుంది.
నాల్గవ రోజు: నాల్గవ రోజున 8 అరటిపళ్ళు, మూడు గ్లాసుల పాలు తీసుకోవాలి. నాల్గవ రోజు దాదాపు ఆకలి ఉండకపోగా రోజంతా హాయిగా గడిచిపోవడం గమనిస్తారు. 8 అరటిపళ్ళు తినాల్సిన అవసరం దాదాపు రాదనే చెప్పాలి. తగ్గించగలిగితే మరింత మంచిది. మీకు ఏదైనా ఇంకా త్రాగాలనిపిస్తే 100 మి.లీ. వెజిటబుల్ సూప్ తాగవచ్చు. (తాజా కూరగాయలతో మీ అభిరుచికి తగ్గట్లు మీ ఇంట్లో తయారుచేసింది మాత్రమే తాగండి).
ఐదవ రోజు: ఐదవ రోజున ఒక కప్పు అన్నం, 6 టమోటాలు తీసుకోవాలి. ఇక మధ్యాహ్నం ఒక కప్పు అన్నం, దానిలోకి కూరగాయలు లేదా ఆకుకూరతో నూనె లేకుండా వండిన కూరతో తీసుకొన్డి. ఉదయం టిఫిన్‌గా రెండు టమోటాలు తీసుకోండి. కప్పు అన్నం మాత్రమే తినంది.
ఆరవ రోజు: ఆరవ రోజున ఒక కప్పు అన్నం, కూరగాయలు, పళ్ళరసం తీసుకోవాలి. రెండవరోజు తిన్నట్లు పచ్చివి లేదా వండిన కూరగాయలు (బంగాలా దుంప మినహా) తీసుకోవాలి. అన్నంలోకి కూర 5వ రోజు చెప్పినట్లే, కూరగాయలకు లిమిట్ లేదు. అయినప్పటికీ ఆకలి లేకపోవడం వల్ల రెండవరోజు తిన్నంత అవసరం లేదు.
ఏడవ రోజు: ఏడవ రోజున ఒక కప్పు అన్నం, కూరగాయలు, పళ్ళరసం తీసుకోవాలి. ఆరవరోజులాగే తింటూ, ఆనందంగా కూరగాయలను కాస్త తగ్గించి పళ్ళరసం (చక్కెర లేకుండా) తీసుకోవాలి. మధ్యాహ్నం యథావిథిగా ఒకప్పు లేదా అంతకంటే తక్కువ అన్నం తినటానికి ప్రయత్నించండి.
+++++++++++++++++++++
======= లావు తగ్గాలంటే =======
త్వరగా బరువు తగ్గితే బాగుండు అనుకుంటున్నారా. అయితే వేగంగా బరువు తగ్గించే ఓ పది సూత్రాల్ని వెంటనే ఫాలో అవ్వాలి.
ఉదయం ప్రొటీన్లు ఎక్కువగా ఉన్న బ్రేక్‌ఫాస్ట్ తినాలి. అలా తినడం వల్ల మిగతా రోజంతా ఆకలి అంతగా ఉండదు. అదనంగా తినడం తగ్గుతుంది.
తియ్యటి పానీయాలు, పళ్ల రసాలు దరిచేరనీయొద్దు. ఇవి శరీరంలోకి కొవ్వును చేరుస్తాయి. అందుకని వీటికి దూరంగా ఉంటే బరువు తగ్గడం తేలికవుతుంది.
భోజనానికి అరగంట ముందు నీళ్లు తాగాలి. మూడునెలల పాటు ఇలా చేస్తే బరువు తగ్గే వేగం 44 శాతం పెరుగుతుందని ఒక స్టడీ వెల్లడి చేసింది.
సాల్యుబుల్ ఫైబర్ కొవ్వును తగ్గిస్తుంది. అదికూడా పొట్ట ప్రాంతంలో. అందుకని సాల్యుబుల్ ఫైబర్ కలిగి ఉన్న ఓట్ బ్రాన్, బార్లీ, నట్స్, సీడ్స్, బీన్స్, లెంటిల్స్, బఠాణీలు, కొన్ని పళ్లు, కూరగాయల వంటివి తినాలి.
కాఫీ, టీలు సేవించే అలవాటు ఉందా. అయితే ఎంచక్కా వాటిని తాగొచ్చు. వీటిలో ఉండే కెఫైన్ జీవక్రియల్ని 3-11 శాతం పెంచుతుంది.
ప్రాసెస్ చేయని ఆహారాన్నే తినాలి. ఈ ఆహారం మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా పొట్టని నిండుగా ఉంచి మితంగా తినేలా చేస్తాయి.
గబగబా తినే అలవాటు ఉంటే దాన్ని వెంటనే మానాలి. ఎందుకంటే ఇలా తినేవాళ్లు కొంతకాలంలోనే ఎక్కువ బరువు పెరుగుతారు. నెమ్మదిగా తినేవాళ్లకి పొట్ట నిండుగా ఉంటుంది. బరువును తగ్గించే హార్మోన్ల పనితీరు మెరుగుపడుతుంది.
చిన్న పళ్లాల్లో తింటే మీకు తెలియకుండానే తక్కువ తింటారని పరిశోఽధల్లో వెల్లడైంది. సో... ఇక నుంచి చిన్న పళ్లాల్లోనే తినడం మొదలుపెట్టండి.
ప్రతిరోజూ రాత్రి హాయిగా నిద్రపోండి. సరిగా నిద్రపోలేదో బరువు పెరిగిపోతారు. అందుకని నిద్ర పట్ల దృష్టి పెట్టండి.
మీలో మార్పు మీరే కాకుండా పక్కవాళ్ళు సైతం కనిపెట్టగలరు. తర్వాత మీకు మీరే అవాక్కవుతారు.

No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565