ఆషాఢ మాసం
Ashada Masam
+++++++++++ఆషాఢ మాసం++++++++++
''ఆషాఢ మాసం కాదిది, నవవధూవరుల సరస శృంగారాల, సురభిళ సింగారాల, ప్రవిమల ప్రణయాల, వియోగాల విరహాల, అరూడ మాసం'' అన్నడో కవిమిత్రుడు.
ఆషాడం లో అత్తా అల్లుళ్ళు ఎదురుపడోద్దు అని ఒక ఆచారం ఉంది. దీని వెనక ఒక అర్థం చెబుతారు.
పూర్వం వ్యవసాయమే జీవనాధారం .సంపాదన ఎలా ఉన్నా, తినడానికి కొన్ని గింజలు ఉండాలని, క్రొత్త వలపు మోజులో తినడానికి ఆధారమైన వ్యవసాయాన్ని ఎక్కడ నిర్లక్ష్యం చేస్తారో అనీ ఈ నిబంధన పెట్టారు.
మరో అర్థం ఏమిటంటే - ఈ మాసంలోని వాతావరణం చాలా మార్పులు ఉంటాయి. ఇప్పుడు కొన్ని అంటువ్యాధులు బాగా ప్రబలుతాయి. పుట్టబోయే బిడ్డ మీద వాటి ప్రభావం ఉండొద్దని కూడా అంటారు. ( పిండానికి తొలి మూడు నెలలు చాలా ముఖ్యమైనదని - ఆ సమయములోనే అవయవాలు ఏర్పడుతాయనే ఈ మధ్యనే సైంటిస్టులు తెలియచేశారు.) పుట్టింటికి పోయిన వధువు ఇంట్లోనే ఉంటుంది. ఆమెకి తోడుగా ఆమె అమ్మ కూడా ఉంటుంది.
ఇంకో కారణం ఆషాడం తరవాత శ్రావణం లో అన్నీ పూజలూ, పునస్కారాలు జరుగుతూ ఉంటాయి. అందులో దాదాపుగా అన్నీ మంచి రోజులూ ఉంటాయి. ఆ శుభరోజులలో గర్భధారణ జరిగితే - మంచిది అని ఆలోచన. పైన చెప్పానుగా జన్మించిన సమయం కన్నా, గర్భధారణ సమయం ముఖ్యమని పూర్వకాలములో అనుకున్నారు. ఇప్పుడు అలా అయితే చాలా బాగుంటుంది అని వారి ఆలోచన. ఇప్పుడు గర్భము ధరిస్తే తొమ్మిది నెలలకి అంటే (శ్రావణం, భాద్రపదం.. అలా చూస్తే చైత్రం వస్తుంది. అంటే ఉగాది పండగ దగ్గరలో..) నిండు వేసవిలో - ప్రసవం జరుగుతుంది. పుట్టిన పిల్లలకి కాస్త తల్లిపాల వల్ల వ్యాధి నిరోధక శక్తి వస్తుంది. తద్వారా పిల్లలు వానాకాలములో వచ్చే వ్యాధులని తట్టుకుంటారు అని కూడా కావచ్చును.వేసవి కాలంలో ప్రసవం అటు తల్లికీ ... ఇటు బిడ్డకి కూడా అంత మంచిదికాదు కాబట్టి పెద్దలు ఈ ఆచారాన్ని వెలుగులోకి తెచ్చారని చెప్పుకోవచ్చు.
ఇంకోకారణం ఒక నెల వియోగం తరవాత కలుసుకున్నాక వారు ఎంతో అన్యోన్య దాంపత్యాన్ని పొందుతారని అని అంటారు కూడా.
LIKE US TO FOLLOW: ---
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565