అష్ఠకవర్గు ద్వారా అనారోగ్యాలు, కష్టాలు, బాధలు విచారణ,
Astakavargu dwara, anarogyam, kastallu, bhadhallu vicharana
అష్ఠకవర్గు ద్వారా
అనారోగ్యాలు, కష్టాలు, బాధలు విచారణ
అనారోగ్యాలు, కష్టాలు, బాధలు విచారణ
జాతకచక్రంలో లగ్నం నుండి శని ఉన్న రాశి వరకు సర్వాష్టకవర్గు బిందువులను కలుపగా వచ్చిన సంఖ్యను 7 చేత గుణించి 27 చేత భాగించాలి. భాగించగా వచ్చిన భాగపల సంఖ్య సూచిక వయస్సులో వ్యాధి లేక కష్టాలు లేక దుఃఖాలు ఉంటాయి. ఈ సంఖ్య సూచించు వయస్సులో చాలా ట్రబుల్ గా ఉంటుంది. ఇదే విధంగా కుజ, రాహు, కేతువులకు ఈ విధంగా లెక్కకట్టి చూడాలి. శని వరకు ఎందుకు చూడాలంటే శని ఆయుర్ధాయ కారకుడు కాబట్టి. అదే విధంగా శేషంగా వచ్చిన సంఖ్యను అశ్వని నక్షత్రం నుండి లెక్కవేయగా ఏ నక్షత్రం వస్తుందో ఆ నక్షత్రంలో పాపగ్రహాలు సంచరిస్తున్నప్పుడు ప్రతికూల ఫలితాలు వస్తాయి.
బి.వి. రామన్ గారు రచించిన అష్టకవర్గు గ్రంధంను ఈ క్రింది లింక్ ద్వారా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
ఉదా:- జాతకచక్రంలో లగ్నం నుండి శని వరకు గల అష్టకవర్గు బిందువుల మొత్తం వరుసగా 26+20+30+27+27+31+21+28+30+36+35+26=337. ఈ మొత్తాన్ని 7 చేత గుణించగా వచ్చిన మొత్తం 2359 . ఈ సంఖ్యను 27 చేత భాగించగా వచ్చిన భాగఫలం 87. శేషం 20 వస్తుంది. దీని ప్రకారం 87 వసంవత్సరంలో కష్టాలు, బాధలు, దుఃఖాలు ఉంటాయి. శేషంగా వచ్చిన 20 సంఖ్యను అశ్వని నుండి లెక్కకట్టగా 20 వ నక్షత్రం పూర్వాషాడ నక్షత్రం అవుతుంది. పూర్వాషాడ నక్షత్రం ధనస్సు రాశిలో ఉండి కాబట్టి ఈ రాశిలో ఈ నక్షత్రంలో పాపగ్రహాలైన శని, కుజ, రాహు, కేతు పాప గ్రహాలు సంచరిస్తున్నప్పుడు ప్రతికూల ఫలితాలు సంభవిస్తాయి.
LIKE
US TO FOLLOW:---
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565