MohanPublications Print Books Online store clik Here Devullu.com

జ్యోతిష్యుడికి ( దైవజ్ఞునికి) ఉండవలసిన లక్షణాలు, Astrologer Having these Qualities

జ్యోతిష్యుడికి ( దైవజ్ఞునికి) ఉండవలసిన లక్షణాలు
Astrologer Having these Qualities
జ్యోతిష్యుడికి ( దైవజ్ఞునికి) ఉండవలసిన లక్షణాలు
శాస్త్రములలో పాండిత్యము సంపాయించిన అనంతరము కొంత మంది దైవజ్ఞ బిరుదును అంలంకరించడము జరుగుతుంది. కాని మన శాస్త్రములు దైవజ్ఞునికి ఉండాల్సిన, దైవజ్ఞుడు పాటించాల్సిన నియమముల విషయములో నిర్లక్ష్యము పాటిస్తున్నారు. అందుచేత దైవజ్ఞలక్షణములు ఈ క్రింది విధంగా ఉండవలెనని శాస్త్ర వచనం.
అద్వేషి సిత్యసంతోషీ గణితాగమ పారగః
ముహూర్త గుణదోషజ్ఞో వాగ్మీ కుశల బుద్ధిమాన్
త్రిస్కంధజ్ఞో దర్శనీయః శ్రౌత స్మార్త క్రియాపరః
నిర్ధాంభికః సత్యవాదీ దైజ్ఞో దైవవిత్ స్థిరః
ద్వేషము లేనివాడును, ఎల్లప్పుడు సంతోషము కలిగి ఉండే వాడు, గణిత స్కందం బాగా అధ్యయనం చేసినవాడు, ముహూర్తములలోని గుణదోషాలు తెలిసినవాడు, వాక్ సుద్ధి కలవాడు, కుశాగ్ర బుద్ధి కలవాడు దైవజ్ఞుడనబడును. సిద్ధాంత హోర సంహిత అనే ఈ మూడు స్కందముల పరిజ్ఞానం కలిగి ఉన్నవాడు, శ్రౌత కర్మలు, స్మార్త కర్మలు తెలిసినవాడు, డంబం లేనివాడు, ఎల్లప్పుడు సత్యాన్ని పలికే వాడు దైవజ్ఞుడు అవుతాడు.
గణితేషు ప్రవీణోయః శబ్ద శాస్త్రే కృత శ్రమః
న్యాయవిద్ బుద్ధిమాన్ దేశ దిక్కాలజ్ఞో జితేంద్రయః
సంపత్యా యోజితాదేశ స్తద్విచ్ఛిన్నకథా ప్రియః
మత్తః శాస్త్రైక దేశేన త్యాజ్యస్తా దృజ్మహ్మీ క్షితాః
దైవజ్ఞులు గణిత శాస్త్రములో ప్రావీణ్యులు అయి, శబ్ద శాస్త్రములో శ్రమించి అధిపత్యం సాధించినవాడు, న్యాయ విదుడు, బుధ్ధిమంతుడు, దిక్కు, దేశము, కాల జ్ఞానము కలిగి ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడు అయి ఉండవలెను. సంపదను ఆర్జించాలని లోభంతోను, ఇతరుల కలహ గాధలను వినే ప్రతితోను ఉన్న జ్యోతిష్కుని, మరియు శాస్తంలో కొంత భాగం నేర్చుకొని దాని తోనే గర్వించిన జ్యోతిష్కుని వదిలి పెట్టావలెను.
దైవజ్ఞ కర్తవ్యాలు:
ఉథ్థాయోషసి దేవతాం హృది నిజాం ధ్యాత్వా వపుశ్శోధన్ం
కృత్వాస్నాన పురస్సరం సలిల నిక్షేపాది కర్మాఖిలం
కృత్వా మంత్ర జపాదికం చ విధివత్ పంచాంగ వీక్షాం తథా
ఖేటానం గణనంచ దైవవిదథ స్వస్థాంతరాత్మా భవేత్
బ్రహ్మీ ముహూర్తములోనే నిద్రలేచి ఇష్ట దైవాన్ని ధ్యానించి శరీర శౌచ క్రియలు నిర్వహించి దంత ధావన స్నాన ఆచమన ఆర్ఘ్య దానాదులు మంత్ర జపాది కర్మలు మొదలగు నిత్య కృత్యాలను నిర్వహించి పంచగము చూసి గ్రహగణనము ప్రశాంతమయిన మనస్సుతో దైవజ్ఞులు చేయవలెను.


LIKE US TO FOLLOW: ---



No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list