బ్యాక్టీరియా.. వైరస్.. ఫంగస్..వీటిపై పోరాడే అమోఘమైన శక్తి భద్రం
Bacteria, virus, fungus
++++బ్యాక్టీరియా.. వైరస్.. ఫంగస్..వీటిపై పోరాడే
అమోఘమైన శక్తి భద్రం!+++++++++
అమోఘమైన శక్తి భద్రం!+++++++++
చుట్టూ పొంచి ఉన్న పెను ముప్పులతో పోరాటం అనివార్యం!!
సందు దొరికితే కబళించేందుకు మన చుట్టూ ఎన్నో శత్రుమూకలు మోహరించుకుని ఉన్నాయి. బ్యాక్టీరియా.. వైరస్.. ఫంగస్.. ఇంకా కంటికి కనిపించని ఎన్నెన్నో సూక్ష్మ జీవులు మనపై దాడికి క్షణక్షణం ఉరకలెత్తుతుంటాయి.
కానీ వీటిపై పోరాడే అమోఘమైన శక్తి మనలో ఉంది.
మన తరఫున రక్షణగా నిలబడి.. సకల శస్త్రాలతో రేయింబవళ్లు యుద్ధం చేసి.. శత్రు సంతపై విజయం సాధించే అద్భుత శక్తి మనలో ఉంది.
ఈ శక్తే మన మనుగడకు మూలం. ఈ శక్తే చక్కటి ఆరోగ్యానికి కీలకం.అందుకే దీన్ని మనం ‘రోగ నిరోధక శక్తి’ అంటాం.
ఈ శక్తి సన్నగిల్లిన రోజున మనం జబ్బు పడతాం. ఈ శక్తి ఓడిన రోజున మనం మొత్తానికే మూలన పడతాం. ఆ పరిస్థితి రాకూడదంటే.. ఈ రోగనిరోధక శక్తి బలహీనపడకుండా చూసుకోవటం చాలా అవసరం. హాయిగా, ఆరోగ్యంగా జీవించేందుకు ఇది ఎంతో కీలకం. అందుకే దీనికి సంబంధించిన వివరాలను స్థూలంగా ఈ వారం మీ ముందుకు తెస్తోంది ఈ వారం సుఖీభవ.
రోగ నిరోధక శక్తి.. మనం వ్యాధుల బారినపడకుండా కాపాడే అద్భుత శక్తి! దీనికోసం మన శరీరంలో పెద్ద వ్యవస్థ, ఓ భారీ యంత్రాంగమే ఉందిగానీ.. ఇది మిగతా అవయవాల్లాగా కచ్చితంగా ఏదో ఒకచోట కనిపించేది కాదు. మన శరీరంలో ఎన్నో కణాలు, కణజాలాలు, అవయవాలు కలిసికట్టుగా నిరంతరం పని చేస్తూ ఈ శక్తిని సుసాధ్యం చేస్తుంటాయి. చుట్టూ ఉండే కోట్లాది వైరస్, బ్యాక్టీరియా వంటి సూక్ష్మక్రిముల్లో ఏదైనా ఒకటి ఒంట్లో ప్రవేశించిందంటే చాలు.. దాని మీద ఉద్ధృతంగా విరుచుకుపడి.. ముప్పేటలా దాడి చేసి.. దాన్ని మట్టికరిపించే ఈ యంత్రాంగం చాలా సంక్లిష్టంగా ఉంటుంది. ఒళ్లంతా ప్రవహిస్తుండే రక్తకణాలు, ఛాతీలో ఉండే థైమస్ గ్రంథి, పొత్తికడుపులో ఉండే ప్లీహం, ఒళ్లంతా విస్తరించి ఉండే లింఫు వ్యవస్థ, ఎముకల మధ్య భాగంలో ఉండే మజ్జ.. ఇలాంటివెన్నో రోగనిరోధక వ్యవస్థలో కీలకంగా పని చేస్తుంటాయి. వ్యాధికారక క్రిములపై దాడి చేసి, వాటిని మట్టుబెట్టటంలో రక్తకణాల్లోని లూకోసైట్స్., లింఫోసైట్స్ కీలక పాత్ర పోషిస్తుంటాయి. అంతేకాదు, ఆ సూక్ష్మక్రిములకు సంబంధించిన గుట్టుమట్లు, సమాచారాన్నంతా గుర్తుపెట్టుకుని మళ్లీ అలాంటి క్రిములు ఎప్పుడైనా మనవైపు వస్తే వెంటనే ముప్పేట దాడి చేసి, చంపేస్తాయి కూడా. కొన్నికొన్ని వ్యాధులను ఎదుర్కొనే శక్తి మన రోగనిరోధక వ్యవస్థకు సహజంగానే వస్తుంది. మరికొన్ని వ్యాధుల విషయంలో- సూక్ష్మ క్రిములను ఎదిరించే క్రమంలో రోగనిరోధక వ్యవస్థే కొత్త శక్తులు సమకూర్చుకుంటుంది. టీకాలు తీసుకున్నప్పుడు కూడా జరిగేది ఇదే. టీకా రూపంలో చాలా సూక్ష్మమోతాదులో, నిర్వీర్యం చేసిన క్రిములను శరీరంలో ప్రవేశపెడతారు. వీటిని చూసి, రోగ నిరోధక వ్యవస్థ పూర్తిగా దాడికి సన్నద్ధమైపోతుంది. దీంతో నిజంగానే ఆ వ్యాధికారక క్రిములు మన మీద దాడికి వచ్చినా కూడా మనం ఎలాంటి వ్యాధుల బెడదా లేకుండానే బయటపడతాం. ఈ వ్యవస్థంతా సజావుగా పనిచేయటానికి మనం తినే ఆహారం, జీవనశైలి కూడా దోహదం చేస్తాయి.
రక్షణకు టీకాల తోడు!
ఇతరత్రా అవయవాల్లాగే.. రోగనిరోధక వ్యవస్థ కూడా పిల్లల్లో అంత పరిపక్వంగా ఉండదు. యుక్తవయసులో సమర్థంగా పని చేస్తుంది. మళ్లీ వృద్ధాప్యానికి వచ్చేసరికి కొద్దిగా బలహీనపడుతుంది. దీన్నే ‘ఇన్వల్యూషన్’ అంటారు. దీనివల్ల ఫ్లూ, న్యుమోనియా, వూపిరితిత్తుల ఇన్ఫెక్షన్ల వంటివి వృద్ధులను చాలా ఎక్కువగా వేధిస్తుంటాయి. ఇలా ఎందుకు జరుగుతోందన్నది కచ్చితంగా తెలియకపోయినా వయసుతో పాటు టి-కణాలు తగ్గటమే దీనికి మూలకారణం కావచ్చు. రెండోది- వృద్ధులు తినే ఆహారమే తక్కువ, అందులోనూ అన్ని పదార్ధాలూ తిని జీర్ణం చేసుకోలేరు. దీనివల్ల పోషకాహార లోపం, ముఖ్యంగా సూక్ష్మపోషకాల లోపం తలెత్తి, అది రోగనిరోధక వ్యవస్థ బలహీనపడటానికి కారణమవుతోందని కూడా గుర్తించారు. ఈ నేపథ్యంలో వృద్ధులందరూ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధతో పాటు ఫ్లూ, న్యుమోనియా వంటి వ్యాధులు దరిజేరకుండా ఏటా టీకాలు వేయించుకోవటం కూడా అవసరమని వైద్యరంగం బలంగా సిఫార్సు చేస్తోంది.
సూర్యకాంతితో మేలు
ఉదయం, సాయంత్రం వేళల్లో కనీసం కొద్దిసేపైనా సూర్యరశ్మిలో గడిపితే మన మెదడు, హార్మోన్ వ్యవస్థలు ఉత్తేజితమవుతాయి. రోగనిరోధక శక్తి బలోపేతం కావటానికి ఇదెంతగానో దోహదం చేస్తోందని అధ్యయనాల్లో గుర్తించారు.
కాపాడుకునేదెలా?
ఏదో ఒక మాత్రతోనో, మందుతోనో రోగ నిరోధక శక్తి పెంపొందుతుందని అనుకోవటం పొరపాటే!
రోగ నిరోధక వ్యవస్థ మనకు ప్రకృతి ప్రసాదించిన అద్భుత వరం. నిజానికి దీన్ని కాపాడుకోవటం కోసమంటూ ప్రత్యేకించి మనమేం చెయ్యక్కర్లేదు. ఎందుకంటే మన శరీరం ఆరోగ్యంగా ఉంటే రోగనిరోధక వ్యవస్థ కూడా దృఢంగా ఉంటుంది. అలాగే రోగనిరోధక వ్యవస్థ బాగుంటే.. శరీరమూ వ్యాధుల బెడద లేకుండా సమర్థంగా ఉంటుంది. వీటి మధ్య ఉన్న అవినాభావ సంబంధాన్ని మనం అర్థం చేసుకోవటం అవసరం. సహజంగానే మన శరీరానికి తనని తాను రక్షించుకునే శక్తి ఉంది, దాన్ని మనం బలహీనపరచకుండా ఉంటే అంతే చాలు. అందుకోసం మనం ఆరోగ్యకరమైన అలవాట్లు, చక్కటి జీవనశైలిని పాటించటం ఒక్కటే ఉత్తమ మార్గం.
ఒకింత వ్యాయామం
అదే పనిగా కూచుంటే ఒంట్లో సత్తువ తగ్గినట్టు అనిపిస్తుంది. ఉత్సాహం సన్నగిల్లుతుంది. అంతేకాదు.. రోగ నిరోధకశక్తి కూడా మందగిస్తుంది. కాబట్టి రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే శారీరక దారుఢ్యంతో పాటు రోగ నిరోధక శక్తి సైతం పుంజుకుంటుంది. అలాగని జిమ్ములకు వెళ్లి, కిలోల కొద్దీ బరువులు ఎత్తాల్సిన పనేం లేదు. తేలికపాటి వ్యాయామాలతోనూ మంచి ఫలితం కనబడుతుంది. ప్రతి రోజూ.. లేదూ కనీసం వారానికి నాలుగు సార్లైనా.. ఆరుబయట 20 నిమిషాల చొప్పున కాస్త వేగంగా నడవాలి. గుండె వేగం పెరిగేలా చేసే నడక, పరుగు వంటి వ్యాయామాలు.. రోగ నిరోధక శక్తి పెరగటానికీ ఎంతగానో తోడ్పడతాయి. నిత్యం వ్యాయామం చేసేవారిలో.. రోగనిరోధక శక్తికి అత్యంత కీలకమైన ‘తెల్ల రక్తకణాలు’ మరింత చురుకుగా పనిచేస్తున్నట్టు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. వ్యాయామంతో ఎండార్ఫిన్లనే సహజ హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి. మనసుకు ఉత్సాహం కలిగించే ఈ హార్మోన్లు పరోక్షంగా రోగనిరోధక శక్తి బలపడేందుకు కూడా దోహదంచేస్తాయి.
ఆహారంపై శ్రద్ధ
రోగ నిరోధక శక్తి సమర్థంగా ఉండాలంటే మనం చెయ్యాల్సిన అత్యంత కీలకమైన పని.. పోషకాహారం తీసుకోవటం! సరైన పోషకాలేవీ లేని పదార్థాలు బరువు పెరిగేలా చేయటమే కాదు.. త్వరగా ఇన్‌ఫెక్షన్ల బారిన పడేలానూ చేస్తాయి. మరోవైపు అధిక బరువు మూలంగా తలెత్తే సమస్యలూ రోగ నిరోధక శక్తి క్షీణించేలా చేస్తాయి. కాబట్టి చక్కటి ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలతో కూడిన పోషకాహారం తీసుకోవటం చాలా అవసరం.
* విటమిన్-సి: రోగ నిరోధక వ్యవస్థలో భాగమైన తెల్ల రక్తకణాలు, యాంటీబోడీల ఉత్పత్తిలో విటమిన్-సి కీలకపాత్ర పోషిస్తుంది. ఇది శక్తిమంతమైన ‘యాంటీఆక్సిడెంట్’ కావటం వల్ల విశృంఖల కణాల మూలంగా తలెత్తే అనర్థాల నుంచీ కాపాడుతుంది. ఒక నారింజ పండు తింటే రోజుకు సరిపడినంత విటమిన్-సి లభిస్తుంది. నిమ్మ, మామిడి, బొప్పాయి, స్ట్రాబెర్రీ వంటి వాటిలోనూ విటమిన్-సి సమృద్ధిగా ఉంటుంది.
* విటమిన్-ఎ: నోరు, జీర్ణాశయం, పేగుల్లోని కణజాలం, చర్మం ఆరోగ్యకరంగా ఉండేలా చూసే ఈ విటమిన్.. రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చెయ్యటంలోనూ కీలక పాత్ర పోషిస్తుంది. చిలగడ దుంపలు, క్యారెట్లు, పాలకూర, గుడ్లు వంటి వాటితో విటమిన్-ఎ దండిగా లభిస్తుంది. క్యారట్ల వంటి వాటిల్లో ఉండే బీటా కెరటిన్ అనే వర్ణ పదార్థం విటమిన్-ఎ ప్రేరేపితం కావటానికీ దోహదం చేస్తుంది.
* విటమిన్-ఇ: ఇది మంచి యాంటీ ఆక్సిడెంట్. విశృంఖల కణాల మూలంగా కణాలు దెబ్బతినకుండా కాపాడుతుంది. రోగనిరోధకశక్తి పెంపొందటంలో తోడ్పడుతుంది. పొద్దు తిరుగురుడు, బాదం, పాలకూర వంటివి తరచుగా తీసుకోవటం ద్వారా విటమిన్-ఇ తగినంత లభించేలా చూసుకోవచ్చు. పసుపు, వెల్లుల్లి కూడా యాంటీఆక్సిడెంట్ గుణాలతో నిండినవే.
* జింక్: కొన్ని రకాల తెల్ల రక్తకణాల ఉత్పత్తికి, అవి చురుకుగా పనిచేయటానికి జింక్ చాలా అవసరం. ఇది రోగ నిరోధకవ్యవస్థను గాడిలో పెడుతుంది. పుండ్లు త్వరగా మానేలా చూస్తుంది. మాంసం, చికెన్, చేపలు, రొయ్యలు, పాలు, పొట్టు తీయని ధాన్యాలు, చికుళ్లతో పాటు జీడిపప్పు, బాదం, వేరుశనగ వంటి గింజపప్పుల్లో జింక్ సమృద్ధిగా ఉంటుంది.
* ఇతర పోషకాలు: విటమిన్ బి6, ఫోలేట్, సెలీనియం, ఇనుము.. అలాగే పాలు, పెరుగు వంటి పోబయాటిక్స్ కూడా రోగనిరోధక శక్తి స్పందనలు సరిగా ఉండేలా చూస్తూ ఎంతగానో మేలు చేస్తాయి.ఒత్తిడిలో చిక్కుకోవద్దు
ఒత్తిడి లేని జీవితాలను ఇప్పుడు వూహించలేం. అప్పుడప్పుడు ఎదురయ్యే ఒత్తిడితో పెద్ద ముప్పేమీ ఉండదు. కానీ విడవకుండా ఒత్తిడిని అనుభవిస్తుంటే మాత్రం.. ఒంట్లో ఒత్తిడి హార్మోన్లయిన కార్టిజోల్, అడ్రినలిన్ వంటివి పెరిగిపోతాయి. వీటి ప్రభావం తీవ్రంగా ఉంటుంది. దీంతో రోగ నిరోధక శక్తీ క్షీణిస్తుంది. దీర్ఘకాలిక ఒత్తిడితో తెల్ల రక్తకణాల పనితీరు గణనీయంగా దెబ్బతింటున్నట్టు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ఈ తెల్లరక్తకణాలే రోగనిరోధక శక్తికి ఆయువుపట్టు అని మనం మర్చిపోకూడద. కాబట్టి ఒత్తిడి తగ్గించుకుని మానసిక ప్రశాంతత సాధించటం అవసరం. ఇందుకోసం సంగీతం వినటం, పుస్తకాలు చదువుకోవటం వంటి ఆహ్లాదకర వినోద వ్యాపకాలు పెట్టుకోవచ్చు. యోగా, ధ్యానం వంటివీ సాధన చెయ్యొచ్చు. వీటితో మానసిక ప్రశాంతత చేకూరటంతో పాటు ఒత్తిడీ దూరమవుతుంది. ఫలితంగా రోగ నిరోధక శక్తి గణనీయంగా మెరుగుపడుతుంది.
తగినంత నిద్ర
రోజంతా మనం ఏదో పని చేస్తుంటాం. ఈ క్రమంలో- ఎప్పుడూ పనిచేసే యంత్రాలు అరిగిపోయినట్లే మన శరీరం కూడా కొంత నలుగుతుంది. కానీ మనం ఎప్పుడైతే నిద్రకు ఉపక్రమిస్తామో.. వెంటనే మన శరీరం వీటన్నింటినీ ‘మరమ్మతు’ చేసుకోవటం మొదలుపెట్టేస్తుంది. అందుకే మనందరికీ నిద్ర చాలా కీలకం. తగినంత నిద్ర లేకపోతే ఈ మరమ్మతు ప్రక్రియ దెబ్బతిని, ఒంట్లో చికాకు, నిస్సత్తువ మొదలవుతాయి. రోగ నిరోధక శక్తి కూడా బలహీనపడుతుంది. ఎప్పుడైనా కొన్నిరోజుల పాటు సరిగా నిద్ర లేకపోతే వెంటనే జలుబులాంటి సమస్యలు బయల్దేరటానికి కారణం ఇదే. కాబట్టి ప్రతిరోజూ రాత్రిపూట కనీసం 7 గంటల పాటు నిద్రపోవటం తప్పనిసరి.
మద్యం పరిమితంగానే..
మద్యం అలవాటు గలవారు విధిగా పరిమితిని పాటించటం మంచిది. ఎందుకంటే మితిమీరిన మద్యంతో శరీరంలో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటాయి. వీటివల్ల ఇన్‌ఫెక్షన్లను నిరోధించే సామర్థ్యం తగ్గుతుంది. గంజాయి వంటి మాదకద్రవ్యాలు కూడా రోగ నిరోధక శక్తిని దెబ్బతీస్తాయి.
అనుబంధాలూ ముఖ్యమే
రోగ నిరోధక వ్యవస్థపై సామాజిక సంబంధాలు కూడా బలమైన ప్రభావం చూపుతాయి. కుటుంబ సభ్యులతో, బంధువులతో, స్నేహితులతో మంచి సంబంధాలను నెరపేవారు మరింత ఆరోగ్యంగా ఉంటున్నట్టు పరిశోధకులు గుర్తించారు. అందువల్ల మానవీయ సంబంధాలను పెంపొందించుకోవటం మీద దృష్టి సారించటం మంచిది. కుటుంబ సభ్యులతో ప్రేమాస్పదంగా ఉంటూ సానుకూల ధోరణి అలవరచుకోవటం, ఇరుగుపొరుగు వారితో సఖ్యంగా ఉండటం, కొత్త స్నేహాలను పెంపొందించుకోవటం.. చక్కటి ఆరోగ్యానికి ఇవీ కీలకమేనని గ్రహించాలి.
శృంగారం కూడా..
రోగ నిరోధక శక్తిని కాపాడుకునే విషయంలో ఆరోగ్యకరమైన లైంగిక సంబంధాల ప్రభావమూ తక్కువేం కాదు. వారానికి ఒకట్రెండు సార్లు శృంగారంలో పాల్గొనే వారిలో ఇమ్యునోగ్లోబ్యులిన్-ఎ అనే రోగ నిరోధక ప్రోటీను స్థాయులు ఎక్కువగా ఉంటున్నట్టు పరిశోధకులు గుర్తించారు. సెక్స్ మూలంగా ఒత్తిడి తగ్గుతుంది, నిద్ర బాగా పడుతుంది. ఇవి కూడా రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసేవే కావటం గమనార్హం.

LIKE US TO FOLLOW:---
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565