వర్షాకాలం ..రోగ్యానికి గొడుగు పడదాం
+++++++++వర్షాకాలం ....
ఆరోగ్యానికి గొడుగు పడదాం++++++++++
ఆరోగ్యానికి గొడుగు పడదాం++++++++++
వర్షాకాలం వచ్చిందంటే చాలు.. ఏ మూలనో పడేసిన గొడుగును దుమ్ముదులిపి పట్టుకెళతాం. వానచినుకుల్లో రక్షణకు అదొక్కటే సరిపోదు. బ్యాక్టీరియా, వైర్‌సలు విజృంభించే ఈ తడి కాలంలో ఆరోగ్యానికీ ఛత్రిక పట్టాలి. లేకపోతే అనారోగ్యం ముసురుకుంటుంది. ముందు జాగ్రత్తలతో మేలుకొంటే వానాకాలం జబ్బుల నుండి బయటపడొచ్చు. అదెలాగంటే..
ఈ కాలంలోనే వ్యాధులెక్కువ..
ఈ కాలంలో వాతావరణం తేమగా, తడిగా తయారవటం, ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గటంతో అన్నిరకాల సూక్ష్మక్రిములు బలం పుంజుకుని వృద్ధి చెందుతాయి. దీనికితోడు వర్షాకాలంలో మన రోగనిరోధక వ్యవస్థ బలహీనపడుతుంది. ఈ కారణంగా వర్షాకాలంలో తేలికగా వ్యాధులబారిన పడుతుంటాం.

ఆ రెండు జ్వరాలతో జాగ్రత్త
నిల్వ నీటితో దోమలు, ఈగలు ఈ కాలంలో విపరీతంగా పెరిగిపోతాయనే విషయం అందరికీ తెలిసిందే! ఇంటి పరిసరాలను ఎంత పరిశుభ్రంగా ఉంచుకున్నా ఈ కాలంలో దోమల బెడదను ఎదుర్కోక తప్పదు. దోమల వల్ల ప్రధానంగా బాధించే జ్వరాలు.. డెంగ్యు, టైఫాయిడ్.

డెంగ్యు
వానాకాలం విజృంభించే డెంగ్యు వ్యాధికారక వైరస్ ‘టైగర్ మస్క్యుటో’ల వల్ల మనుషులకు సోకుతాయి. ఒళ్లు నొప్పులు, కీళ్ల నొప్పులు, చర్మం మీద దద్దుర్లు, కనుగుడ్డు వెనక ప్రదేశంలో నొప్పి, జ్వరం... ఈ వ్యాధి లక్షణాలు. కొన్ని సందర్భాల్లో లక్షణాల తీవ్రతను బట్టి ఈ వ్యాధిని ఫ్లూ జ్వరం లేదా ఇతరత్రా వైరల్ ఇన్‌ఫెక్షన్‌గా పొరబడే ప్రమాదం ఉంది. ఇందుకు కారణం పసిపిల్లలు, మొదటిసారి డెంగ్యుకు గురైన వారిలో జ్వర తీవ్రత తక్కువగా ఉండటమే కారణం. అయితే వానాకాలంలో డెంగ్యు వచ్చే అవకాశాలు ఎక్కువ కాబట్టి ఎంత చిన్న జ్వరాన్నైనా తీవ్రంగానే పరిగణించి చికిత్స తీసుకోవాలి. లేదంటే మెదడులో రక్తస్రావం, లింఫ్ గ్రంథులు, రక్తనాళాలు దెబ్బతినటం, కాలేయం పెద్దదవటం, షాక్‌కు గురవటంలాంటి ప్రాణాంతక పరిస్థితులు తలెత్తవచ్చు.

జాగ్రత్తలు:
డెంగ్యు జ్వరానికి వ్యాక్సిన్ లేదు. కాబట్టి ఈ జ్వరం రాకుండా ఉండాలంటే దోమకాటుకు గురవకుండా ఉండటమొక్కటే మార్గం. ఈ జాగ్రత్తలు కూడా పాటించాలి.
ఇంటి పరిసరాల్లో దోమలు పెరిగే అవకాశం లేకుండా చూసుకోవాలి.
ఒంటిని పూర్తిగా కప్పి ఉంచే దుస్తులు వేసుకోవాలి.
దోమలను చంపే మందులు వాడాలి.
కిటికీలు, తలుపులకు మెష్‌లు ఉపయోగించాలి.
రాత్రిపూట ఓపిక చేసుకుని దోమతెరలు తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలి.
టైఫాయిడ్
వానాకాలం కనిపించే మరో జ్వరం టైఫాయిడ్. ‘సాల్మనొల్లా టైఫై’ అనే బ్యాక్టీరియాతో విజృంభించే ఈ వ్యాధి అపరిశుభ్ర ఆహారం, నీటి ద్వారా రోగుల నుంచి వ్యాపిస్తుంది. ఈ బ్యాక్టీరియా సోకిన 3 వారాల తర్వాతే లక్షణాలు కనిపిస్తాయి కాబట్టి ముందుగానే ఈ వ్యాధిని నియంత్రించటం కొంత కష్టం. విపరీతమైన జ్వరం, తలనొప్పి, కడుపు నొప్పి, కండరాల నొప్పులు ఈ వ్యాధి ప్రధాన లక్షణాలు. వ్యాధిని సకాలంలో గుర్తించి చికిత్స తీసుకోకపోతే పేగుల్లో రకస్రావం, మూత్రపిండాల ఇన్‌ఫెక్షన్‌లాంటి తీవ్రమైన రుగ్మతలకు దారితీయొచ్చు.

జాగ్రత్తలు :
టైఫాయిడ్‌కు వ్యాక్సిన్లు ఉన్నా అవి నూటికి నూరుశాతం వ్యాధి నుంచి రక్షణ కల్పించలేవు. కాబట్టి ఈ బ్యాక్టీరియా బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటంటే...
చేతులను తరచుగా శుభ్రం చేసుకుంటూ ఉండాలి. ఆహారం తినేముందు, మలమూత్ర విసర్జన తర్వాత తప్పనిసరిగా సబ్బునీటితో చేతులు శుభ్రం చేసుకోవాలి. వీలైతే హ్యాండ్ శానిటైజర్ దగ్గర ఉంచుకోవాలి.
వేడిచేసి చల్లార్చిన నీరు తాగాలి.
స్నానం చేసేటప్పుడు, పళ్లు తోమేటప్పుడు పొరపాటున కూడా నీటిని మింగేయకూడదు.
కూరగాయలు గోరువెచ్చని నీటిలో కడిగి వాడాలి.
ఈ కాలంలో ఆకుకూరలు వాడకం మానేస్తే మంచిది.
అప్పటికప్పుడు వండుకున్న వేడి పదార్థాలే తినాలి.
బయటి ఆహారం పూర్తిగా మానేయటం సురక్షితం.
కలరా
కలుషిత ఆహారం, కలుషిత నీటి వల్ల వ్యాపించే మరో వ్యాధి కలరా. కలరా సర్వసాధారణంగా కనిపించే వానాకాలం వ్యాధి మాత్రమే కాదు. విపరీతంగా బాధించి, వేధించి, ఆరోగ్యాన్ని పీల్చి పిప్పి చేసే తీవ్రమైన వ్యాధి కూడా! శుభ్రమైన నీరు, ఆహారం తీసుకోవటంతోపాటు, అపరిశుభ్ర అలవాట్లన్నిటినీ ఈ కాలంలో వదిలించుకోవాలి. ‘విబ్రియో కలరే’ అనే బ్యాక్టీరియాతో వ్యాపించే ఈ వ్యాధి లక్షణాలు... తెలుపు రంగు విరేచనాలు, వాంతులు, ఒంటినొప్పులు, లో బిపి, చర్మం ముడతలు, నోరు ఎండిపోవటం, డీహైడ్రేషన్. యాంటిబయాటిక్స్‌తోపాటు, ఫ్లూయిడ్, ఎలకొ్ట్రలైట్ రిప్లే్‌సమెంట్ ఈ వ్యాధికి సమర్ధమైన చికిత్స. వైద్యం ఆలస్యమైతే అరుదుగా డీహైడ్రేషన్ కారణంగా షాక్‌కు గురై ప్రాణాలే పోయే ప్రమాదం ఉంది.

కలరాకు వ్యాక్సిన్ ఉన్నా అది కొందరికే, కొన్ని నెలల మేరకే పనిచేస్తుంది. కాబట్టి వ్యాధికి గురవకుండా ఉండాలంటే కొన్ని మెలకువలు పాటించటం తప్పనిసరి. అవేంటంటే...
పచ్చి కూరగాయలతో చేసే సలాడ్స్ తినకూడదు.
కాచి చల్లార్చిన నీటినే తాగాలి.
బయటి పదార్థాలు, చిరుతిళ్లను మానేయాలి.
పళ్లు, కూరగాయలు శుభ్రంగా కడిగిన తర్వాతే వాడాలి.
చేతులు శుభ్రంగా ఉంచుకోవాలి.
పాల ఉత్పత్తులు తగ్గించాలి.
శ్వాసకోశ సమస్యలు
వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గుతుంది. దాంతో వైర్‌సలు, బ్యాక్టీరియాలు మరింత తేలికగా దాడిచేస్తాయి. దాంతో జలుబు రోజుల తరబడి వేధించవచ్చు. జలుబుకు దగ్గు తోడవవచ్చు. అయితే ఈ రుగ్మతలన్నిటికీ ఒకే రకం వైరస్ కూడా కారణం కాకపోవచ్చు. ముక్కు నుంచి నీరు కారటం, దగ్గు, జ్వరం, ముక్కు దిబ్బడ లాంటి లక్షణాలన్నీ ఒకే రకంగా ఉన్నా వీటికి వేర్వేరు వైర్‌సలు కారణమై ఉండొచ్చు. కాబట్టి లక్షణాలతోపాటు, సమస్య కాలపరిమితినిబట్టి చికిత్స తీసుకోవాలి. అలాగే రోగనిరోధక వ్యవస్థ బలవర్ధకంగా ఉండే జీవనశైలిని అనుసరించాలి. ఇందుకోసం ఈ జాగ్రత్తలు పాటించాలి.
విటమిన్ సి పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి.
అతి చల్లని నీరు, పదార్థాలకు దూరంగా ఉండాలి.
తగినంత నిద్ర అవసరం.
పోషకాహారం తీసుకోవాలి.
వీలైనంత ఎక్కువ ద్రవాహారం తీసుకోవాలి.
చల్లని గాలి, నీరు ముక్కులోకి వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలి.
వేడి ద్రవాహారం, సూప్‌లు తీసుకోవాలి.
కళ్ల ఇన్‌ఫెక్షన్లు
ఎండాకాలంలో వాడే సన్‌గ్లాసెస్ ఎండతోపాటు ఇన్‌ఫెక్షన్ల నుంచి కూడా కళ్లకు రక్షణ కల్పిస్తాయి. అయుతే వానాకాలంలో ఈ కాస్త రక్షణ కొరవడటం, వాతావరణంలో పెరిగే తేమ వల్ల కళ్లకలక, స్టై, కళ్లు పొడిబారటం, కార్నియా అల్సర్లు ఈ కాలంలో బాధిస్తాయి. అందుకని..
మురికి చేతివేళ్లతో కళ్లు తాకకూడదు.
కళ్లకలక లక్షణాలు కనిపించిన వెంటనే కళ్లను శుభ్రమైన నీటితో కడిగి వేడి కాపడం పెట్టాలి. వీలైనంత త్వరగా వైద్యుల్ని కలవాలి.
కళ్లకలక అంటువ్యాధి కాబట్టి వ్యాధిగ్రస్థులకు దూరంగా ఉండాలి. కుటుంబసభ్యులకు ఐడ్రాప్స్ వేసిన వెంటనే చేతులు శుభ్రంగా కడుక్కోవాలి.
కళ్లు ఎర్రబడటం, దురదలు, మంట వానాకాలంలో సహజంగా కనిపించే కంటికి సంబంధించిన సమస్యలు. అయితే ఈ లక్షణాలు కనిపిస్తే సొంత వైద్యం మాని వైద్య చికిత్స తీసుకోవాలి.
వానాకాలం బ్యాక్టీరియా కారణంగా కంటి కింది కనురెప్ప లోపల పుండు ఏర్పడుతుంది. దీన్నే స్టై అంటారు. దీనికి వేడి కాపడం పెట్టటంతోపాటు తక్షణ వైద్య చికిత్స తీసుకోవాలి.
కంటి సమస్య తగ్గేవరకూ గ్లాసెస్ వాడాలి. కాంటాక్ట్ లెన్స్ ఆపేయాలి.
చర్మ సమస్యలు
వానాకాలం ఎక్కువగా నీటిలో నడవటం, తడిలో నానటం, మురికి నీళ్లలో తడిచిన కాళ్లను వెంటనే శుభ్రం చేసుకోకపోవటం వల్ల చర్మ సమస్యలు బాధిస్తాయి. ఈ కాలంలో వేధించే స్కిన్ ఇన్‌ఫెక్షన్లకు పలురకాల బ్యాక్టీరియా, వైరస్, ఫంగ్‌సలే కారణం.

అథ్లెట్స్ ఫుట్
పాదాల మీద, వేళ్ల మధ్య దురదపెట్టే ఎర్రటి ర్యాష్ అథ్లెట్స్ ఫుట్. బ్యాక్టీరియా కారణంగా తలెత్తే ఈ ఇన్‌ఫెక్షన్ మొదట కాలి బొటనవేళ్లతో మొదలై క్రమేపీ పాదం మొత్తం వ్యాపిస్తుంది.
జాగ్రత్తలు: వాన నీటిలో తడిసిన పాదాలను బాగా రుద్ది కడిగి శుభ్రం చేయాలి. ఇలా చేయటం వల్ల వ్యాధికారక బ్యాక్టీరియా వదిలిపోతుంది. తడిచే వీలులేని గమ్‌బూట్స్ ధరించాలి.

ఎగ్జిమా
చర్మం మీద ప్యాచ్‌లుగా దురదతో కూడిన నీరుకారే ఎర్రని బొబ్బలు కనిపిస్తే ఎగ్జిమాగా భావించాలి. ఉష్ణోగ్రతలో మార్పు, తేమకు గురికావటం వల్ల ఈ రుగ్మత తలెత్తుతుంది.
జాగ్రత్తలు: యాంటీ బ్యాక్టీరియల్ సోప్స్, పౌడర్లు వాడుతూ చర్మాన్ని పొడిగా ఉంచుకోవాలి.

రింగ్ వార్మ్
గుండ్రటి ఆకారాల్లో తలెత్తే ఫంగల్ ఇన్‌ఫెక్షన్ ఇది. బాహుమూలలు, అరికాళ్లు, చెవుల వెనక ఎర్రగా, దురదతో కూడిన గుండ్రటి రింగుల్లా ఈ ఇన్‌ఫెక్షన్ మొదలవుతుంది.
జాగ్రత్తలు:వానలో తడిచిన వెంటనే స్నానం చేసి పొడి బట్టల్లోకి మారాలి. తడి బట్టల్లోనే ఉంటే ఫంగస్ చర్మంపై దాడి చేస్తుంది. యాంటి ఫంగల్ పౌడర్ వాడాలి. వైద్య చికిత్స తీసుకోవాలి.

మాన్‌సూన్ సేఫ్టీ
ఆహారంలో అల్లం, నిమ్మ, మిరియాలు, పసుపు వాడకం పెంచాలి.
బయట నుంచి రాగానే పాదాలు, చేతులు వెంటనే శుభ్రం చేసుకోవాలి.
పొడి దుస్తులే ధరించాలి.
వేడి పదార్థాలే తినాలి.
సాధ్యమైనంత వరకూ వాన నీటిలో తడవకూడదు. గొడుగు, రెయిన్ కోట్ వెంట ఉంచుకోవాలి.
టవల్స్, కర్చీఫ్స్ ఇతరులతో షేర్ చేసుకోకూడదు.
ద్రవాహారం ఎక్కువగా తీసుకోవాలి.
వదులుగా, తేలికగా ఆరే దుస్తులు ధరించాలి.
నిల్వ పదార్థాలకు, రోడ్‌సైడ్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి.

LIKE US TO FOLLOW:---
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565