MohanPublications Print Books Online store clik Here Devullu.com

సబ్జా గింజలతో బోలెడు లాభాలు, Benifits of Sabja Seeds

సబ్జా గింజలతో బోలెడు లాభాలు
Benifits of Sabja Seeds
సబ్జా గింజలతో బోలెడు లాభాలు...
మహిళలూ బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే సబ్జాను నానబెట్టిన నీటిని తాగండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. సబ్జా గింజలతో నానబెట్టిన గ్లాసుడు నీటిని నిద్రపోయే ముందు తాగితే చక్కటి ఫలితాలుంటాయి. ఈ నీరు యాంటీ బయాటిక్‌లాగా పనిచేస్తుంది.
బ్యాక్టీరియా సంబంధిత సమస్యలను నివారిస్తుంది. ఈ నీటిని రాత్రిపూట తాగడం వల్ల మరునాటికి శరీరంలో పేరుకున్న వ్యర్ధాలు తొలగిపోతాయి. ఈ నీరు టైప్‌ 2 మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది. అంతేకాదు... ఈ నీరు దాహార్తిని తీర్చి డీహైడ్రేషన్‌ రాకుండా చూడడంతోబాటు బరువు తగ్గడానికి కూడా సహకరిస్తుంది.
శరీరంలోని కేలరీలను కరిగించడంలో సబ్జాగింజలు పెట్టింది పేరు. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు సబ్జా వాటర్‌ను సేవించవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
ఇంకా సబ్జా ఈ గింజలను నీటిలో నానబెట్టి తాగడం వల్ల శరీర జీవక్రియల పనితీరు మెరుగుపడుతుంది. సబ్జా గింజలు నీటిలో వేయగానే కొంతసేపటికి ఉబ్బి జెల్‌ మాదిరిగా తయారవుతాయి. శరీర పనితీరుకు ఉపకరించే ఫ్యాటీ ఆమ్లాలతోబాటు అధికంగా పీచుని ఇవి కలిగివుంటాయి.
ఇందులో మహిళలకు అవసరమైన ఫొలేట్‌, నియాసిన్‌, ఇంకా చర్మాన్ని అందంగా ఉంచే విటమిన్‌ 'ఇ' లభించడంతోబాటు, శరీరంలో పేరుకున్న వ్యర్థాలను తొలగించడానికి కూడా ఇవి తోడ్పడతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
సబ్జాలని టక్‌ మారియాలని పిలుస్తారు. ఇవి మనదగ్గర బాగానే పెరుగుతాయి. అచ్చం తులసిలానే వీటి ఆకులు కూడా ముదురు ఆకుపచ్చలో ఉండి కొమ్మల చివర్ల వచ్చే పూరేమ్మల్లో వీటి విత్తనాలు ఉంటాయి. చాల చిన్న సైజులో ఉండే వీటిని నీటిలో వేయగానే ఉబ్బిపోతాయి. బయటి పొర పారదర్శకంగా ఉబ్బి లోపల ఉన్న నల్లని గింజ చుక్కలా కనిపిస్తుంది. వీటికి నీళ్ళు, పంచదార లేదా తేనె , కొన్ని సందర్బాల్లో కొబ్బరి పాలు కలిపి తాగుతుంటారు. అమెరికా వంటి దేశాల్లో సబ్జా పానీయాన్ని తిన్నుల్లోను అమ్ముతారు.
మంచి ఔషధం సబ్జా గింజలు
ఈ గింజల్ని నూరి ఏదయినా నూనెతో కలిపి గాయాలు, పుండ్లకీ వాడితే ఫలితం ఉంటుంది. ఇతర్రతా చర్మవ్యాదులనీ తగ్గిస్తాయి.ఈ గింజల నుంచి తీసిన నూనెలోని యాంటీ ఆక్సిడెంట్‌ కి క్యాన్సర్లని వైరస్‌ లని ఇతర సూక్ష్మజీవుల్ని నివారించే శక్తి ఉందని ఇటీవల పరిశోధనలు తెలియజేస్తున్నాయి. అంతే కాదు తులసి గింజలకి ధాంబోసిస్‌ని తగ్గించే లక్షణాలు కూడా ఉన్నాయట.
కలుషిత నీటిలో ఉన్న లోహాన్ని రేడియోధార్మిక పదార్ధాలని తొలగించేందుకు కూడా ఈ గింజలు ఉపయోగపడతాయని కొత్త పరిశోధనల్లో వెల్లడయింది. ఈ గింజలనుండి తీసిన నునే ని షాంపూలు, పెర్‌ఫ్యుమ్స్‌ తయారిలోను వాడతారు.
జిగురుతో కూడిన సబ్జాల్లో పీచు శాతం ఎక్కువ. అందుకే ఔషధపరంగాను ఇవి ఎంతో మంచివి.
శరీర ఉష్ణోగ్రతను తగ్గించాడంతోబాటు మల, ముత్ర సమస్యల్ని నివారిస్తాయి . మలబద్ధకాన్ని డయేరియాని తగ్గిస్తాయి.వాంతుల్ని తగ్గించి అజీర్తిని తొలగిస్తాయి. హానికరమిన టాక్సిన్లు పొట్టలోకి చేరకుండా చేస్తాయి.గొంతు మంట, దగ్గు, ఆస్తమ, తలనొప్పి, జ్వరం ఉన్నప్పుడు సబ్జా గింజల్ని నీళ్ళలో నానబెట్టి తిన్నా, తాగినా ఫలితం ఉంటుంది.గోరువెచ్చని నీళ్ళల్లో నానబెట్టిన సబ్జాలకు అల్లం రసం, తేనె కలిపి తాగితే, శ్వాసకోస వ్యాధులు తగ్గుముఖం పడతాయి.
బరువు తగ్గలనుకునేవాళ్ళు కాసిని సబ్జాలని బోజనానికి ముందు చప్పరిస్తే ఆకలి తగ్గి తక్కువ తింటారట. ఎందుకంటే ఇవి ఎక్కువసేపు ఉదరకోశ గోడలకు అతుక్కుని ఉండి జీవక్రియని ప్రేరేపిస్తాయి. ఫలితంగా శరీరం లోని క్యాలరీలు ఖర్చేయ్యేల చేస్తాయి. అదేసమయంలో జీర్ణక్రియ నెమ్మదిగా జరిగేల చేస్తాయి. దాంతో తీసుకున్న ఆహరంలో కొవ్వులు, చక్కేర్లని ఎక్కువగా రక్తంలోకి ఇంకనివ్వవు.
అందుకే వీటిని టీ, పండ్లరసాల్లో కలిపి లేదా డెజార్ట్‌, సలాడ్లమిద చల్లుకుని తాగినా తిన్నా ఉపయోగం ఉంటుంది. అయితే చాలామంది సబ్జాల్నినానబెట్టుకోడానికి బద్దకిస్తుంటారు. అలాంటివాళ్ళు మరిగించిన నీళ్ళలో వీటిని ఐదు నిమిషాలు ఉంచి తీయాలి. తరవాత ఉబ్బిన వీటిని నమిలి తినడం కన్నా మింగటం మంచిది. కాబట్టి సబ్జాల్ని చప్పరిస్తే వచ్చే మజానీ అందులోనీ ఔషద గుణాల్ని మిస్‌ కాకండి.

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list