ప్రపంచంలో మరే ఇతర గ్రంధాలలోన లేనంత విజ్ఞాన
భండారంమన వేదాలలో మాత్రమే.
ప్రపంచంలో
మరే ఇతర గ్రంధాలలోన లేనంత
విజ్ఞాన భండారం
మన వేదాలలో మాత్రమే........
మరే ఇతర గ్రంధాలలోన లేనంత
విజ్ఞాన భండారం
మన వేదాలలో మాత్రమే........
యజుర్వేదానికి ఉపవేదం ధనుర్వేదం అని మన శాస్త్రాలలో కనబడుతుంది. దానిలో యుద్ధవిద్యలెన్నో ఉపదేశించబడ్డాయి.శత్రువుల నెదుర్కోవటానికి కావలసిన వివిధ వ్యూహ పద్ధతులె కాక అనేక శస్త్రాల నిర్మాణం కూడ చెప్పబడింది. అది మనకిపడు లభించదు. విదేశీయుల ద్వేషాగ్నికి ఆహుతి అయ్యింది. ఆ విద్య నెరిగిన ఒక పండితుడు మిగిలి ఉండగా జర్మనీ నియంత హిట్లర్ వారికి గూఢచారుల ద్వారా తమ దేశానికి తీసుకువెళ్ళిపోయాడు. అక్కడ వారికి గె•రవంప్రదమైన ఉద్యోగాన్నిచ్చి వారినుండి శస్త్రాస్త్ర విజ్ఞానమే కా క వేదాలలో అనేక విజ్ఞాన విద్యలను జర్మనులకు నేర్పించాడు. జర్మనీ వారు వారికి బ్రతికి ఉన్నంతవరుకు గౌరవించటమే కాక మరణానంతరం కూడ వారి చిత్రపటాన్ని ఒక కార్యాలయంలో గోడకు వ్రేలాడ కట్టుకొని గౌరవిస్తున్నారు. మనదేశంలో ఉన్న అతని భార్యకు చాలాకాలం వరకు ఆర్థిక సహాయం అందించారు. అతడెవరో కాదు, మన ఆంధ్రుడే. పేరు దండిభట్ల విశ్వనాథశాస్త్రి, రాజమహేంద్రవర నివాసి. శ్రీమతి ఇందిగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు భారతదేశాన్నుండి పశ్చిమ జర్మనీకి వెళ్ళిన మన రాయబారి వల్ల ఈ వెల్లడయ్యింది. ఆ రాయబారికి అక్కడివారు వారి కార్యలయాలు చూపిస్తూ వీరి చిత్రపటాన్ని చూపి వారి నుండి తాము ఎంతో విజ్ఞానాన్ని పొందామని చెప్పి తమ కృతజ్ఞతలను ప్రకటించుకున్నారట. అది విని ఆ రాయబారి ఆశ్చర్యపోయాట. కనుక ’వేదం విజ్ఞాన భండారం ’ అనుటలో అతిశయోక్తి ఏమున్నది?
LIKE
US TO FOLLOW:---
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565